26, ఆగస్టు 2019, సోమవారం

సమస్య - 3115 (దుర్వినయమ్ముతో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్"
(లేదా...)
"దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా"
('పద్యానంద లహరి' గ్రంథం నుండి)

91 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  పర్వము జేసి ముద్దులిడి ఫక్కున నవ్వుచు నెత్తినెక్కుచున్
  గర్వము లేకయే సుఖము కష్టము తోషములన్ని వేడుకన్
  సర్వము తాతగారికిడి చక్కగ మొట్టుచు గుండుపైన భల్
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా

  రిప్లయితొలగించు
 2. సర్వము నీవే యనుచును
  పర్వము గాపొగి డిపొగిడి బహుమేధ యనన్
  గర్వముతో పొంగి మరిమరి
  దుర్విన యమ్మునను మనసు దోచెదరు హితుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పొగడి పొగడి' అనండి. మూడవ పాదంలో గణదోషం. "గర్వమున బొంగి మరిమరి" అనండి.

   తొలగించు
 3. ఉర్విన నారసి జూడగ
  సర్వుల రీతులవి వేరు సద్భావమునన్
  గుర్వులుగ దలచిసాగిన
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

  రిప్లయితొలగించు
 4. ఊర్వశి నర్జును బొడఁగని
  సర్వము నీదే నటంచు సరసము గోరన్
  యుర్వీ నాథుడు దలచెను
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీదే యటంచు' అనండి. 'కోరన్ + ఉర్వీ..' అన్నపుడు యడాగమం రాదు. "సరస మడుగగా । నుర్వీ..." అందామా?

   తొలగించు
  2. నమోన్నమః

   ఊర్వశి నర్జును బొడఁగని
   సర్వము నీదే యటంచు సరసమడుగగా
   నుర్వీ నాథుడు దలచెను
   దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

   తొలగించు


 5. సర్వారాయుడు :)  సర్వరులై యడుగగనే
  సర్వము మీకే జిలేబి సాదరముగ యం
  చర్వపు తెలివిడి తోడై
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు! హితుల్!


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాదరముగ నం।చర్వపు...' అనండి.

   తొలగించు
 6. మైలవరపు వారి పూరణ

  సుయోధనుని స్వగతమ్..

  గర్వమదాంధతన్ బిలువగా మము జూడగ రాజసూయమున్
  బూర్వవిరోధులే యయిన బోవక తప్పదు., వారి భోగమున్
  సర్వము జూడవచ్చు., నృపసౌఖ్యము, గారవమందగానగున్
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా"!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు

 7. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సర్వము కోలుపోవనిక చాకలి పద్దులు వ్రాయబూనగా
  పుర్వులు పట్టు కాంగ్రెసున ముద్దుగ పల్కుచు మోడివర్యుపై
  గర్వము మీర నిందలిక ఘాటుగ మోపుట మానుమంచు భల్
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా

  (Congress Rebels:
  Jairam Ramesh, Abhishek Manisinghvi, Shashi Tharoor et. al.)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. ఉర్విని కాంగ్రెస్ నేతలు
   దుర్వినయమ్మునను మనసు దోచెదరు! హితుల్
   గర్వము లేక ప్రధానిగ
   సర్వస్వము సేవగ మన సై నిల్తురుగా !


   జిలేబి

   తొలగించు
  2. శాస్త్రి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   *****
   జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 8. దుర్వినియమంటే యిదేనా :)  "దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా?"
  సర్వము పృచ్ఛకేశ్వరుడ ! చక్కగ మీకెరుకైన‌ దేను!మా
  గర్వము వీడ కైపదపు గాఢత నేర్పను మీరు చేర్చిరీ
  పర్వము గాదె సభ్యుల ప్రభాతపు వేళని మేలుకొల్పగా !  జిలేబి

  రిప్లయితొలగించు
 9. ఖర్వులు,జార చోరులును,గర్వ మదాంధులు,నేర పూరితుల్,
  సర్వము నష్టమైన తరి చక్కని నీతులు బోధ సేతురే
  దుర్వినయమ్ముతో;మనసు దోచెడు వారు హితైషులే కదా
  పర్విన కష్టముల్ గడచు బాటను తెల్పు మహోదయోత్తముల్.

  రిప్లయితొలగించు


 10. ఉర్విని కింకరులకటా
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు! హితుల్
  సర్వంబాలోచింపన్
  పర్వంబున కేది సరి సభని పల్కురదే !


  జిలేబి

  రిప్లయితొలగించు
 11. సర్వుల సేమము నరయుచు
  పర్వుచు పరహితము గోరు పావన మతులై
  గర్వ రహితులై వీడియు
  దుర్వినయమ్మును మనసు దోచెదరు హితుల్

  రిప్లయితొలగించు
 12. ఉర్విని నయ వంచకులే
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు; హితుల్
  గర్వము జూపిన నయ్యది
  సర్వజ్ఞత వలనె గాని సాత్విక గుణులే

  రిప్లయితొలగించు
 13. గర్వమొకింతయు లేకను
  సర్వము తెల్యంగ కోప చార్వాకుండే!
  సర్వులకు జేయు వైద్యము
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్!

  రిప్లయితొలగించు
 14. అర్వానులు స్వార్థముతో
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు, హితుల్
  సర్వావస్థల యందున
  నుర్విని మనమేలు గోరెడుపకారులెరా!

  రిప్లయితొలగించు

 15. పిన్నక నాగేశ్వరరావు.

  సర్వోన్నతుడవు నీవే
  నిర్విఘ్నముగా కలుగును నీకు జయంబున్
  పర్వమె ప్రతిరో జనుచును
  దుర్వినయమునను మనసు దోచెదరు
  హితుల్.

  రిప్లయితొలగించు
 16. సర్వము తామే యని ప్రతి
  పర్వముకున్ బిలచి యింట పాయసమిడుచున్
  గర్వముఁ జూపర! నిజమే!!
  "దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పర్వమునకు బిలిచి' అనండి. 'పర్వముకు' అనరాదు.

   తొలగించు


 17. జీపీయెస్ వారూ మీ కో సమస్యా పూరణ :)


  కొట్టిరి కోమలియె శ్రీమకుటమార్జింపన్ !  జిలేబి


  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. కొట్టిరి కోమలియె పసిడి కొట్డుకు రాగన్ :)   జిలేబి

   తొలగించు
  2. క్షమించాలి...వృత్త పాద సమస్యలే సరి...వృద్ధుడిని కదా...77 లో పడ్డాను మొన్ననే

   😊

   తొలగించు


  3. సరే మీకని‌ వృత్తపు పాద సమస్య :)   కొట్టిరి కోమలియె పసిడి కొట్టుకు తిరుగన్


   వృత్తమేమిటో "కనుక్కొని " పూరించుడీ :)


   జిలేబి

   తొలగించు
  4. అది ఏ వృత్తపాదంలోని భాగమో నేనూ తెలిసికోలేకున్నాను. వరుసగా రెండు నగణాలు వచ్చాయి.

   తొలగించు


  5. కామేశ వృత్తము !

   మంగళ మేళమణి వృత్తము


   జిలేబి

   తొలగించు


  6. పట్టుగ గెల్వంగా జై
   కొట్టిరి; కోమలియె పసిడి కొట్టుకు రాగన్
   పట్టిరి బ్రహ్మ రథమ్మును
   పట్టమిదే స్వర్ణ సింధు ! భారత్స్ రత్నా !


   జిలేబి

   తొలగించు

 18. పిన్నక నాగేశ్వరరావు.
  ( రెండవ పూరణము.)

  గర్వముతో స్వార్ధ పరులు
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు;
  హితుల్
  నిర్వర్తింతురు సాయము
  సర్వము తామై నడచుచు సద్విన
  యముతో.

  రిప్లయితొలగించు
 19. సర్వముగోల్పోవుదురుగ
  దుర్వినయమ్మునను,మనసుదోచెదరుహితుల్
  సర్వఙ్ఞుడవీవనుచును
  నుర్వినిదాబొగడుచుండియుత్సుకతలతోన్

  రిప్లయితొలగించు
 20. సర్వము తామె యంచు తమ జాలపు మాటల యుచ్చులల్లుచున్
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు దురాత్ములైన నా
  గర్వితుడా మదోద్ధరుడు కౌరవ రాజుకు నిత్య భృత్యులై
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా

  రిప్లయితొలగించు
 21. కపట నాటక సూత్రధారీ! గోకుల విహారీ! హరీ!...

  ఉత్పలమాల

  సర్వమెరింగి ముందుగనె సన్నిథి జేరిన నస్సుయోధనున్
  గర్వము మిన్నుముట్టెనని కాదని, కవ్వడి వచ్చినంతటన్
  చేర్వగ ముందుఁ జూచితని సేవలు నావల నంచు వైరులన్
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చేర్వగ' ? 'చూచి + అతని' అన్నపుడు సంధి లేదు.

   తొలగించు
  2. గురుదేవులకు ధన్యవాదములు

   చేర్వగ = చేరువగ
   చూచితి + అని = చూచితని

   పరిశీలించ ప్రార్థన.

   తొలగించు
 22. గర్వము సర్వము జెఱచును
  పర్వును మాయంగ జేయు భద్రము సుమ్మీ
  మర్వకు మని, సఖుడు మెలగ
  దుర్వినయమ్మునను, మనసు దోచెదరు హితుల్.

  రిప్లయితొలగించు
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 24. దుర్వినయమ్ముతో మనసుదోచెడువారుహితైషులేకదా
  దుర్వినయమ్ముతోనయిన దోచుటయౌటను గారణంబుగా
  సర్వుల గౌరవించగను జక్కగనొప్పు హితైషులేయనన్
  గర్వవిహీనులై భువినిగాచుచునుందురుమంచివారలే

  రిప్లయితొలగించు
 25. దుర్విధలు మోసగించగ
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు ; హితుల్
  సర్వమున సహకరించుచు
  దుర్వారముగ మనమనము దోచెదరెపుడున్

  దుర్వారము = inevitable

  రిప్లయితొలగించు
 26. అష్టి చందము, నూతన వృత్తముగ, పేరు: గురువు గారిని సూచించఁ గోరేదను.

  పర్వము నందు నిజ జనకు వస్తువు కొఱకై
  ఖర్వము నెంచక నెడఁదను గర్వ మడరఁ దాఁ
  జేర్వకు దూఱుచు వడివడిఁ జేరి పలికినన్
  దుర్వినయమ్మునను మనసు దోఁచెదరు హితుల్

  [పర్వము = పరువము; చేర్వ = చేరువ]


  ప్రాసేతరముగ:
  కుము లన్నేరరు గద కఠి
  నముగాఁ బల్కినను నందన వచనములకుం
  గొమరులు దుర్విన యమ్మున
  ను మనసు దోఁచెదరు హితు లనువుగ నిరతమున్


  పర్వము నంద కాక ఘన బాధలు దుఃఖము లందుఁ దోడుగన్
  సర్వుల వెంట నుండి తగు సాయము చేయుచు నూఱడించి తా
  రుర్వి సుపర్వ పండిత నరోత్తమ మండలి కుండ కెన్నఁడున్
  దుర్వినయమ్ముతో, మనసు దోఁచెడువారు హితైషులే కదా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. మంగళ మేళమణి పలికె మంగళ కరమై

   మంగళ మేళమణి వృత్తమంటే బాగుంటుందాండి పోచిరాజు వారు ?


   జిలేబి

   తొలగించు
  2. *ఈవృత్త వివరములు:
   ఛందము సంఖ్య : 16, అష్టి
   వృత్తము సంఖ్య : 31735

   తొలగించు
  3. మీ మూడు విధాలైన పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి.
   ఏదో పేరు ఎందుకు? దీనికి 'కామేశ వృత్తము' అని పేరు పెడితే సరి!

   తొలగించు
  4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   ధన్యోస్మి. మీ సూచన శిరోధార్యము.


   జిలేబి గారు ధన్యవాదములు. మంగళ మణి లో మణి కి మంగళమునకు మేళ (కూడిక) చేర్చిన మీ నేర్పు ప్రశంసనీయము.

   తొలగించు

  5. మేళమణి అంటే సిరాబుడ్డి అని ఆంధ్రభారతి చెబ్తేను, మంగళమణి వృత్తానికి మీ వృత్తము తొంభై శాతము మేచ్ అయితేను వావ్ ఇది‌ మీ సిరా నుంచి‌ జాలువారినది కాబట్టి మంగళ మేళమణి అని అన్నానండి పోచిరాజు వారు :)


   కందివారు

   కామేశ వృత్తమునకు రేపే శంకరాభరణము లో సమస్యా పాదమును ఇవ్వవలె !

   పీ వీ సింధూ నేపధ్యంలో ( పైన మీరడిగినారు ఇది యేమి ఛందమో అని :))


   కామేశ వృత్తమనబడు మంగళ మేళమణి !


   కొట్టిరి కోమలియె పసిడి కొట్టుకు తిరుగన్   జిలేబి

   తొలగించు
  6. ఓహో అలాగా బాగుంది. కాని మంగళ తో మీరన్న యర్థమున నది సమసింపఁ దగదు.

   తొలగించు
  7. ఈనెలాఖరు వరకు సమస్యలు షెడ్యూల్ చేసి ఉంచాను. తరువాత ఇస్తాను.

   తొలగించు

  8. కొట్టిరి సింధును పసిండి కొట్టుకు రాఁగన్

   తొలగించు

  9. అదురహో సమస్య !

   దిట్టగ గెల్వంగా జై
   కొట్టిరి; సింధును పసిండి కొట్టుకు రాఁగన్
   పట్టుగ నూరేగింపన్
   పట్టము గట్టన్ జనాళి వరుసన్‌ గనిరే!   జిలేబి


   తొలగించు
 27. సర్వము గోల్పోవు జనులు
  దుర్వినయమ్మునను, మనసు దోచెదరు హితుల్
  సర్వజనీనమగు గతిని
  గర్వము లేకుండ తాము గదలుచు భువిలో!!!

  రిప్లయితొలగించు
 28. ఉర్విని నష్టమగు నెపుడు
  దుర్వినయమ్మునను, మనసు దోచెదరు హితుల్
  గర్వమ్మును విడి పాలన
  సర్వజనుల మేలుకొరకు సాగించ ధృతిన్

  రిప్లయితొలగించు
 29. చర్విత చర్వణమ్ముగను చానలు భర్తల తప్పులెన్నుచో
  సర్వము నీవెయంచునిది సత్యము నమ్ముమటంచు సుంతయున్
  గర్వముచేరనీక మది కాంతల శాంతిలజేయ కేళిగా
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా!

  రిప్లయితొలగించు
 30. సర్వము దోచగన్ గఱటి సజ్జనువోలె నటించు వారెరా
  దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు, హితైషులే కదా
  యుర్విని బాగుకోరుచుమహోన్నతమౌ సలహాలనిచ్చుచున్
  జర్విత చర్వణమ్ములుగ సామము లెన్నియొ చెప్పువారలే.

  రిప్లయితొలగించు
 31. గర్వమ్మొకింత లేకయె
  సర్వము పరమాత్మ లీల సారమ్మనియే
  యుర్విని యశమును చేకొం
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

  రిప్లయితొలగించు

 32. గర్వమ్మొకింత లేకయె
  సర్వము పరమాత్మ లీల సారమ్మనియే
  యుర్విని యశమును చేకొం
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్
  **)(**
  (చేకొందుర్ + వినయమ్మునను........)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చేకొందుర్ అని హలంతంగా ప్రయోగించరాదు.

   తొలగించు
 33. చర్విత చర్వణమ్ముగను, చక్కనిపద్దెములల్లు వారలన్
  గర్వముబూనకెప్పుడును,గారవమందగ జేసి సూచనల్
  సర్వమునొక్కడై నిలిచి, సాహితికెంతయొ సేవజేయునా
  దుర్వినయమ్ముతోమనసు, దోచెడు వారుహితైషులేగదా!

  రిప్లయితొలగించు
 34. కందం
  గర్వమ్మైంతున్నను తా
  ముర్విని దంపతులమంచు నోరిమి తోడన్
  బర్వముఁ జేసుకొన బ్రతుకు
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

  రిప్లయితొలగించు
 35. [26/08, 15:59] Chandrashekhar Yelisetty: కం.

  పర్వము నెఱిఁగిన బాలలు
  సర్వము తామే యనుచును సందడి జేయన్
  పర్వాలేదన పెద్దలు
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

  వై. చంద్రశేఖర్
  [26/08, 16:16] Chandrashekhar Yelisetty: కం.

  నిర్వాణము చే గోరగ
  నిర్వేదము విడచి విఠలు నిరతము గొలువన్
  సర్వాంతర్యామియె తా
  దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు