29, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3118 (బారునఁ గూర్చున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్"
(లేదా...)
"బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్"
(డా. వెల్దండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలతో...)

58 కామెంట్‌లు: 1. కోరిక లేవియు లేకన్
  ప్రేరణ హృదయపు కుహురము పేర్మిని గానన్
  తీరని తపనని గుడిలో
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్


  జిలేబి

  రిప్లయితొలగించండి

 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చేరుచు వేంకటాద్రినట చెల్వము మీరగ దారతో భళా
  పోరక తోటి మూకనిక పొందుగ మ్రొక్కుచు కూతుకోసమై
  కోరిక లెన్నియో తెలిపి కొండల రాయుని కోవెలందునన్
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  బారు = వరుస

  రిప్లయితొలగించండి


 3. కోరిక లేవి లేకయు ప్రకోపము లేకయు భక్తి తోడుగా
  ప్రేరణ హృత్తు లో గొనుచు ప్రేమని పంచుచు ధ్యాన మార్గమం
  దారని తీవ్రతన్ తపన దాపుగ తోరణకట్టగా గుడిన్
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రేమను పంచుచు' అనండి.

   తొలగించండి
 4. హోరున తలుపులు మెండుగ
  చేరువుగా చెదలవలెను చెవిలో వదరన్
  తీరుగ కదలక మెదలక
  బారుగ కూర్చున్న వాడె భక్త వరుడగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తలుపులు/తలపులు'?

   తొలగించండి
  2. సవరణకు ధన్యవాదాలు🙏


   హోరున తలపులు మెండుగ/
   చేరువగా చెదలవలెను చెవిలో వదరన్/
   తీరుగ కదలక మెదలక/
   *బారున కూర్చున్న వాడె భక్త వరుడగున్*

   తొలగించండి
 5. ధారణ చేయుచు నామము
  నీరజనాభున్ సతమ్ము నిర్మల మతితో
  కోరి భజించుచు నమర ద
  ర్బారున కూర్చున్న వాడె భక్త వరుడగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "కోరి భజించి యమర ద। ర్బారున...* అనండి.

   తొలగించండి
 6. దారా సుతులను బంధమె
  కారాగృహమని తలచుచు కైవల్యముకై
  యా రాఘవుఁ సద్భక్తుల
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁడగున్.

  రిప్లయితొలగించండి
 7. నీరజపత్రనేత్రుడగు నిత్యసుఖప్రదు నచ్యుతున్ సదా
  కోరికతో భజింతునని కూరిమిమీరగ నిర్మలాత్ముడై
  చేరి తదీయసన్నిధికి శ్రేష్ఠజనంబులు తీర్చియున్నదౌ
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి


 8. నేరుగ తిరుపతి కొండని
  చేరుచు పరిశుభ్రమైన సేల ధరింపన్
  తీరుగ వైకుంఠంబున
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. కోరంగ నిత్య శోభన
  మే రమణి పరిశ్రమించి మేని యహో బే
  జారై పద్మార్పితకై
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్!


  పద్మార్పిత బ్లాగు సరికొత్త టపా ప్రేరణ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి

 10. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోరి చిదంబరుండచట కోటుల రూకల వ్యాజ్యమందునన్
  పోర ప్రభుత్వమున్ రహిని పొందుగ ప్లీడరు దొందుతో వెసన్
  చేరుచు రోజు రోజునట చెన్నుగ మ్రొక్కుచు బైలు కోసమై
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  బైలు = bail
  బారు = courtroom

  రిప్లయితొలగించండి
 11. చేరుచు సమూహమందున
  తీరుగ తాళములఁ బట్టి దేవుని భజనన్
  బోరక హరిహరులనుచును
  "బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్"

  రిప్లయితొలగించండి


 12. ఆ రాతిని చెక్కియు గిరి
  పై రాయునిగా మలచియు పదపడుచు నమ
  స్కారము సల్ప వినయతన్
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. కం.
  కోరిక లసలే కోరక l
  కారణజన్మకు వగచుచు గడియకు, ప్రభువౌ l
  నారాయణ గుడిమెట్లకు l
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్ ll

  రిప్లయితొలగించండి
 14. మారుని దుమారమును సుకు/
  మారముగా పారుచు, పరమాత్ముని పైనే/
  భారము వేయుచు, వేచుచు/
  *బారున కూర్చున్న వాడె భక్త వరుడగున్*//

  రిప్లయితొలగించండి
 15. కూరిమి గూర్చెడి నామపు
  పారాయణజేసి మదినిబాయక పదముల్
  జేరుచు శిరిడీ పతి ద
  ర్బారున గూర్చున్నవాడె భక్తవరుడగున్

  రిప్లయితొలగించండి
 16. బారులు దీరి యందు మధుపానవిమోహవిచక్షణాదిసం
  స్కారవిహీనుడై చెలగి కారులుఁ గూయుచు మధ్య మధ్య నో
  రారగ భక్తికీర్తనల నారసి పాడిన వాని నెట్లుగా
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా, గణియింత్రు సజ్జనుల్?

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
 17. శ్రీరాముని పదసేవకు
  చేరియు భధ్రాచలమును చిన్మయ రూపున్
  నేరుగ దర్శింప దలచి
  బారున గూర్చున్న వాడె భక్త వరుడగున్

  రిప్లయితొలగించండి
 18. కం.
  పోరాడెడి జీవినిగని l
  సారాయిని ద్రాగకుండ స్వామీ యనుచున్ l
  బోరున యేడ్చుచు కాష్టము l
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్ ll

  రిప్లయితొలగించండి
 19. మారెను కాలము జాతులు
  వేరని యెంచక తరతమ భేదము లేకన్
  తీరుగ నందరు గలిసిన
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్

  రిప్లయితొలగించండి
 20. కోరక నయ్యారలఁ, న
  మ్మారము సర్వమును వీడి మదినందంత
  ర్ద్వారమున విష్ణుఁ నేగిలి
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్!

  అయ్యార-మోసగత్తె;
  అమ్మార- దురధికారము చేయు;
  ఏగిలిబారు-అప్పుడప్పుడే తెల్లవారు

  రిప్లయితొలగించండి
 21. శ్రీరామ నవమి దినమున
  నారాముని భజన సలుప నాత్రము తోడన్
  కోరిక మీరగ భక్తుల
  "బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్"
  **)()(**
  (బారు = వరుస ; పంక్తి.)

  రిప్లయితొలగించండి

 22. పిన్నక నాగేశ్వరరావు.

  తీరుగ తలనీలములిడి
  కూరిమి యొదగంగ నేడుకొండల వానిన్
  నేరుగ దర్శించుటకై
  బారున గూర్చున్నవాడె భక్తవరుడగున్.

  రిప్లయితొలగించండి

 23. కందము
  దారాసుత బంధము సం
  సారాసక్తియును వీడి సత్పథమున సం
  చారము జేయుచు భక్తుల
  బారున గూర్చున్నవాడె భక్తవరుడగున్ . టీవీ
  ఆకులు శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి

 24. మన్మథుడు - ౨ :)

  నాగార్షజున షష్టిపూర్తి 29 Aug 2019 శుభ సందర్భముగా శుభాకాంక్షలతో


  ఔరా !నాగార్జునుడా
  నీ రంజిలు షష్టిపూర్తిని స్పెయును లో వి
  స్ఫారముగా‌ జరుపుకొనన్ !
  బారునఁ గూర్చున్నవాఁడె భక్త" వరుఁ" డగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. నేటి శంకరాభరణము వారి సమస్య
  ( బారునఁ గూర్చున్న వాఁడె భ క్తవరుఁ డగున్)
  ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో


  కోరిన కోర్కెలు కోనేటి రాయుడు తీర్చెను, మొక్కును తీర్చెదమని
  తిరుమల వెడలగ, తీర్ధమున జనులు లక్షలు దాటె, నిరీక్షణమ్ము
  ముప్పది గంటలు తప్పక వరుసలో నిల్చుండ, జనులెల్ల నెట్టు చుండె,
  మల మూత్రముల నాప మనసుకు సాధ్యము కాక మరుగు దొడ్లకై వెతుకుచు
  వెడలగా పడితిమి వెనుకన వరుసలో, పాలకు బిడ్డడు గోల చేయ
  నిలబడి పాలనెటుల బిడ్డ కిచ్చెద ననుచు బాధపడెను నాదు పత్ని,
  మరుగును వెదకి నా తరుణిని కూర్చుండ బెట్టి బాబుకు బాలు బట్టి తిరిగి
  రాబోవు సమయాన నా బుడతడు మలము వదలి దాడిచేయ ముందు జనులు
  రుసరుస లాడగ రోషము విడనాడి చూచితి నీటికై, చుక్కలు గన
  బడెమాకు, హతవిధీ బాధలు పడిమేము గుడిలోకి వెడలగ గూడ బట్టి
  నెట్టె వాలంటీర్లు, గట్టిగ క్షణమైన కాంచ కుంటిమి మేము కనుల నిండ
  తిరుమల వాసుని ,మరుగున పడె భక్తి ,యింటిలో ఘనముగా యీరు
  (బారునఁ గూర్చున్న వాఁడె భ క్తవరుఁ డగున్) పల్లె నందున్న గుడికి వెడలి

  భక్తితో శుభ పూజలు పరవశముగ
  చేసిన వలదనుడు స్వామి, మాసినట్టి
  మనసు తోడ గొలువ నేల మనుజు లార
  యని మది పలికె స్వప్నమందచ్చెరువుగ


  ఈరుబారు = యథేచ్ఛ.

  రిప్లయితొలగించండి


 26. ఊరూరా తిరిగిన నా
  భారతిని మరువక తెలుగు భాష మరువకన్
  ప్రేరణ గొని కైపదముల
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁడగున్!


  తెలుగు భాషా దినోత్సవ సందర్భముగా
  శుభాకాంక్షలతో


  జిలేబి

  రిప్లయితొలగించండి


 27. ఫిట్టిండియా యటంచున్
  గట్టిగ పూనిక జిలేబి గనుమా మోడీ
  చట్టను వచ్చెదరదిగో
  దిట్టగ స్టేడియములోన ధిమిధిమి యనుచున్ :)


  దేహలి
  జిలేబి‌ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంది సారు ఉవాచ:

   "నాకొక సమస్య సిద్ధమయింది.....

   *విడిచెడి వాఁడె వీరుఁడగు విద్దెను జూపి విలక్షణమ్ముగా*"

   తొలగించండి

  2. పూరణ వచ్చె జిలేబీయమై :(


   తడబడకన్ విశాలముగ దాతృత చూపుచు రాజధర్మమున్
   వడివడి నేర్చి నెమ్మిగొని వాక్కుని తేనియ లూర జేయుచున్
   మడమయు ద్రిప్పకన్ జనుల మంచిగ నేలుచు పర్వరీణమున్
   విడిచెడి వాఁడె వీరుఁడగు విద్దెను జూపి విలక్షణమ్ముగా!   జిలేబి

   తొలగించండి
 28. కోరికలు వెల్లువిరిసిన
  మీరక తనహద్దునెపుడు మెదలకగుడిలో
  దీరుగనట యాభక్తుల
  బారునగూర్చున్నవాడె భక్తవరుడగున్

  రిప్లయితొలగించండి
 29. సారాసార వివేకుడు
  బీరువడుక సతతము రిపు భీకరుడు హరిన్
  రారమ్ము గావుమని గుడి
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్

  రిప్లయితొలగించండి
 30. కోరికలుతీర గుడిలో
  మూరితి దరికేగి చూడ్కి ముగిసిన తోడన్
  వేరముగ తీర్థమొసగెడు
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్

  రిప్లయితొలగించండి
 31. కోరికలన్నిటిన్దునిమి కోవెలయందున భక్తకోటికి
  న్బారునగూరుచున్న,వరభక్తుడుగా గణియింత్రుసజ్జనుల్
  పారమునందగోరునెడ బావనమైనమనంబు తోడుతన్
  జేరువనుండగావలెను శీతనగేంద్రుని సూతుభర్తకున్

  రిప్లయితొలగించండి
 32. కం.

  మారుతి కొలువన ప్రతిశని
  వారము చేరగ జనములు వందలు వేలున్
  కోరగ నిర్వహణమ్మున
  బారున గూర్చున్నవాడె భక్త వరుడగున్

  వై. చంద్రశేఖర్
  బారు=వరుస

  రిప్లయితొలగించండి
 33. మారక, యేమారక పలు/
  మారులు మరులు గొనుచు పరమాత్ముని నీవే/
  సారము నాకని వేడుచు/
  *బారున కూర్చున్న వాడె భక్తవరుడగున్*//

  రిప్లయితొలగించండి


 34. బారున, బారున, బారున,
  బారున, బారున, జిలేబి బారున బారన్
  బారున బారన్ బారని
  బారున కూర్చున్న వాడె భక్తవరుడగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. ధారుణి మానవ సేవయె
  యా రాముని సేవ యంచు నటఁ బేదలకుం
  దోరమ్ము పంచఁగా నం
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్

  [అంబారునన్ = ధాన్య రాశితో]


  మూరఁగ భక్తి చిత్తమునఁ బూజలు సేయ సదార నింపుగా
  నారిన శ్వేత వస్త్రముల నచ్యుత నామ సహస్ర కీర్తనం
  దీరుగ నొక్కటం బఱచి తెచ్చిన శుద్ధపు శంబరాజినం
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  [శంబరాజినంబు + ఆరున = శంబరాజినం బారున: జింక తోలు; ఆరునన్ = రోమాళిపై]

  రిప్లయితొలగించండి

 36. ... శంకరాభరణం... . 29/08/19 ....బుధవారం...

  సమస్య::

  "బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్"
     నా పూరణ. ఉ.మా.
  ***** **** **

  సారవిహీన వ్యర్థమగు సంసరణంబును వీడనాడుచున్

  కోరికలున్ త్యజించుచును గోరుచు మోక్షము వేంకటేశునిన్

  భారము నీవె నంచు కడు ప్రార్థన జేయగ కోవెలందునన్

  బారున గూరుచున్న వర భక్తుడుగా గణియింత్రు సజ్జనుల్
  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించండి
 37. శ్రీ రఘు రామనామమది క్షేమము గూర్చు పవిత్ర మై మహా
  దారుణ పాతకమ్మునది ధ్వంసము సేసెడి దివ్యమంత్రమై
  ధారుణిఁ నిల్చెనంచు సతతమ్ము భజించెడు భక్తకోటితో
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 38. తీరుగ శుచి శుభగముగా
  కోరిక మీరగ తిరుమల కోవెలకేగన్
  భారీ జనసందోహము!
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్

  రిప్లయితొలగించండి
 39. కోరిన కోర్కె తీరగనె కోవెలకేగితి మొక్కుదీర్చగన్
  బారులుతీరి సందడిగ భక్తులు జేరిరి దర్శనార్థులై
  వేరుతలంపులేక మది వేలుపు నామము సంస్మరించుచున్
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 40. ఉత్పలమాల
  దారికి రాడు వాడు తలిదండ్రుల మామల నాలి నెల్లరన్
  దూరుచు తెల్లవారగనె తోమును పండ్లను మందుతోడనే
  దారుణ మన్న నాకునిదె దైవమటంచును వాన్కి కోవెలౌ
  బారునఁ గూరుచున్న వర 'భక్తుఁ' డుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 41. కందం

  నారద, మార్కండేయుల
  మారుతి, ప్రహ్లాద, ధ్రువుల మార్గము నందున్
  నేరిచి భక్తిన్ వారల
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్

  రిప్లయితొలగించండి
 42. తీరుగ రోజును భక్తిగ|
  హరుని ధ్యానము జరుపుచు హాయిగ నుండే |
  వారల వీడక సతతము |
  "బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్"

  రిప్లయితొలగించండి
 43. సరదాగా...

  శ్రీ రఘు రాముని మ్రొక్కులు
  తీరగ నొక స్వర్ణ మయపు తేరును కొనగా
  జేరి బజారున నా మల
  బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్.

  (మలబారు బంగారు నగల దుకాణం అని భావన)

  రిప్లయితొలగించండి
 44. మైలవరపు వారి పూరణ

  భారతదివ్యభాగవతభాసురరామకథావిశేషసం...
  సారభవాబ్ధితారకరసప్రవచోవిభవాభిరామవి..
  స్తారమహాప్రసంగగుణధర్మసుశీలసమూహమందెదో
  బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్".!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి