11, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3102 (భామ కంటె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భామ కంటెఁ జిన్నదోమ మిన్న"
(లేదా...)
"భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్"

62 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కామమున్ తెగ తీర్చి కుట్టుచు కంది పోయెడి కాటులన్
    గోముగా మనకిచ్చి రోగము గొప్పగా పరుగెట్టగా...
    రామ నామము చేసి రోజును రక్తమున్ భళి పీల్చెడిన్
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

    రిప్లయితొలగించండి


  2. అరరె! చెవిని చేయు నల్లరి గుయ్యు మ
    టంచు విడువ దాయె టక్కరివలె
    చూడ చూడ నొడలు జుయ్యిజుయ్యిమనును
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న!




    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. వలపు వలను విసిరి కలలందు తేలించి
    చిలిపి నవ్వు లెన్నొ చిలక రించి
    మనసు దోచి తుదకు మనువాడు నన్యుని
    భామ కంటెఁ జిన్న దోమ మిన్న

    రిప్లయితొలగించండి
  4. వాడి కంటకములు వగలాడి మాటలు
    మదిని గ్రుచ్చు కొనిన మాన వికను
    మశక మొకటి కుట్ట మందైన దొరుకును
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న

    రిప్లయితొలగించండి


  5. తేమయెక్కువ గాన వచ్చును దిక్కుదిక్కులు గుయ్యనన్!
    భామ కంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్
    దోమజొచ్చుచు కర్ణపేటిక ధూముధామని చేయగా
    రామరామయటంచువేయగ రచ్చచేయుచు చచ్చునే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. తెరను గట్టినంత తీక్షతుండపుబాధ
    తగ్గ వచ్చు నేమొ తరచి చూడ
    నాలి పెట్టు పోరు కంతమ్ము లేదురా
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న

    రిప్లయితొలగించండి
  7. దోమ కుట్టిన బాధ సాంతము దూరమేయగు గోకినన్
    భామ కుట్టిన జన్మలెన్నియొ ప్రాప్తమేయగు సారెకున్
    దోమ నివ్విధి దూరబోకుము దోషమే యగు పృచ్చకా!
    *భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్*

    రిప్లయితొలగించండి
  8. ప్రేమలీ కలికా లమందు నవెఱ్ఱి గంతులు వేయగన్
    కోమలం బగుభావ జాలము కోయి లైరొద బెట్టగా
    నీమముల్ గతిదప్పి మేను లెనెమ్మి శోయగ మొందగా
    భామ కంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడ్ఁగన్

    రిప్లయితొలగించండి
  9. ప్రేమనొలకఁబోసి పేరాశఁ గల్పించి
    కడకు బతుకు ముంచి కడలి యందు
    సిరుల మెరుపు చూసి యొరుని పెండ్లాడిన
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ప్రేమగా గృహకార్యముల్ నడిపించి యెంతొ శ్రమంబుగాన్
    భామ ప్రక్కన జేరి కౌగిట వాలిపోవును నిద్రకై.!
    దోమ యట్టులగాక యెంతగ తోలినన్ విసిగించెడిన్.!
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. నాదీ సరదానే!

    ఏమనంటివి యేమనంటివి యెంతమాటిది పృచ్ఛకా!
    దోమగానము రమ్యమైనది, తోలగానె తొలంగునే!
    భామగానము భారమందురు భర్తలే! యిక నేవిధిన్
    *"భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్"*
    😀

    రిప్లయితొలగించండి
  12. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నీమమున్ విడి లేపి కుట్టుచు నింపి డెంగిని మేనునన్
    గోముగా తన గీతి దోమయె గొంతు చీల్చుచు పాడగా...
    రోమునున్ విడివచ్చి కాంగ్రెసు రోగముల్ వడి తీర్చెడిన్
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

    "Rahul had said ‘no Gandhi’, but Congress goes back to Sonia Gandhi"

    రిప్లయితొలగించండి

  13. ... శంకరాభరణం... . 11/08/19 ....ఆదివారం....

    సమస్య::

    "భామ కంటె జిన్నదోమ మిన్న"

    నా పూరణ. ఆ.వె.
    ***** **** ***
    దోమ కంటె గొల్లభామ పెద్దది గనన్

    కాని చేయ దెపుడు హాని మనకు

    కాటు వేయ దోమ కలుగదే వగ? గొల్ల

    భామ కంటె జిన్నదోమ మిన్న


    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷



    రిప్లయితొలగించండి
  14. ధీమతీ! విను కాంత నెప్పుడు దెప్పుచుండుట యుక్తమా
    సేమముండగ పాదసీమను జేరు, కాదన పృష్ఠమం
    దామిషంబును గుడ్చి కర్ణమునందు దూరును దోమ యీ
    భామకంటెనుచిన్న దోమ ప్రభావ మెక్కువ చూడగన్.

    రిప్లయితొలగించండి
  15. నగలు చీరలనుచు పగలెల్ల వేధించు
    భామకన్న చిన్న దోమ మిన్న
    పొగను బెట్ట దోమ పోవును బెదరుచు
    భామ మౌనముగను బాధ పెట్టు

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మందు పూత లుండు మశకమ్ము కుట్టిన;
    పలుచ జేయు నట్టి పలుకు లల్లి
    మదిని కాటు వేసి మసలెడి గయ్యాళి
    భామ కంటె జిన్న దోమ మేలు.

    రిప్లయితొలగించండి
  17. జామురాతిరి చీకటింగన జాబిలిచ్చటనుండగన్
    ప్రేమతో కుసుమాంగి చెంత వరించ దక్షిణహస్తమున్
    వామహస్తమునాదియంచును పట్టి కుట్టెను దోమ యీ
    భామకంటెను చిన్నదోమ ప్రభావమెక్కువ జూడగన్

    రిప్లయితొలగించండి


  18. వేము మాదిరి మాట ఘాటగు విప్లవాంగి జిలేబి! యా
    భామ కంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్
    జామురాతిరి చెంతచేరుచు చాటుగా మరి మాటుగా
    గోముగా తన వంతుగా మన గూబగుయ్యన మ్రోగునే :)


    జిలేబి
    మా అయ్యరు గారి మాటగా :)

    రిప్లయితొలగించండి
  19. వణుకు పుట్టు నెపుడు వయ్యారి భామల
    వాంఛ లన్ని దీర్చ బ్రహ్మ కైన
    కుట్ట వణుకు జ్వరము పుట్టి తగ్గును గదా!
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న

    రిప్లయితొలగించండి
  20. గంగ వెఱ్ఱు లెత్తు గయ్యాళి సతియైన
    పవలు రాత్రి యనక బాధ పెట్టు
    దోమ బాధ జూడ నామ మాత్రమె గదా !
    "భామ కంటెఁ జిన్నదోమ మిన్న"
    **)(**
    మత్కుణా మశకా రాత్రౌ మక్షికా యాచకా దివా ౹
    పిపీలికా చ భార్యా చ దివారాత్రౌ చ బాధతే ౹౹

    రిప్లయితొలగించండి
  21. ఆటవెలఁది పూరణ:

    భామ ప్రేమఁ బంచు దోమరక్తముఁ బీల్చు
    భామ కాటు ముద్దు, దోమ కాటు
    రోగమిచ్చు మనము రోదింప! నెటులనో
    "భామ కంటెఁ జిన్నదోమ మిన్న"

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ
    సూడఁగన్

    సందర్భము: దోమకాటు కెవరైనా మం దిస్తారు. ప్రేమకాటుకు మాత్రం మందు లేదు. అందుకని ప్రేమలో పడరాదు. పడకుండా వుండటమే ఒక యోగం.
    ఆధ్యాత్మిక మార్గంలో కామినీ కాంచనా లవరోధా లని శ్రీ రామకృష్ణ పరమహంస పదే పదే హెచ్చరించారు.
    అందువల్ల ఏ తీరుగా భామకంటె దోమ ప్రభావం ఎక్కు వవుతుంది? కాజాలదు. (ప్రేమించిన భామ ప్రభావమే అనివార్యంగా అధికమై తీరుతుంది.. అని భావం)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దోమ కాటుకు మందు నిత్తురు
    దోసి లొగ్గిన నెవ్వరేన్
    ప్రేమ కాటుకు మందు లే దని
    పెద్ద లందురు.. భామతో
    ప్రేమలో పడకుంట నేర్చుట
    పెద్ద యోగ..మి.. కే గతిన్
    భామకంటెను జిన్న దోమ ప్ర
    భావ మెక్కువ సూడఁగన్?

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    11.8.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. ముద్దు దీర్చ మనుచు ముదితను బ్రతిమాల
    ఫలము లేక నేను వగచు వేళ
    పేర్మి తోడ దోమ పెదవిని ముద్దాడె
    భామ కంటెఁ జిన్న దోమ మిన్న

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నీమమన్నది కట్టిపెట్టుచు నెమ్మి గూర్చెడి లక్ష్యమున్
    ప్రేమ జూపుచు భర్త చెంతకు పెండ్ల మొచ్చిన వేళలో
    దోమ యొక్కటి గుట్టి నామెను త్రోవ వీడగ జేసెనే
    భామ కంటెను చిన్నదోమ ప్రభావ మెక్కువ జూడగన్.

    రిప్లయితొలగించండి
  25. రమణు లెపుడు పెద్దలనె పీల్చెదరు గాని
    దోమ వదల దయ్య దొడ్డ పిన్న
    వయసు జూచి కుట్టు వయ్యారి యైనట్టి
    భామ కంటె జిన్న దోమ మిన్న!

    రిప్లయితొలగించండి
  26. రాత్రి పూట చంద్ర రగరగ చాపము
    పగటిపూట స్తంభ ప్రకటిత సకి
    పగలు రాత్రి జనుల ప్రతిపాలనల మధ్య
    "భామ కంటెఁ జిన్నదోమ మిన్న!"

    రిప్లయితొలగించండి
  27. బుగ్గ మీద భామ మోదమే గీఱినఁ
    జుఱ్ఱు మనును వాఁడి సూది గ్రుచ్చి
    నట్లు దోమ కుట్ట నందుకే నే నంటి
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న


    ప్రేమ దోమ యనంగఁ బోకుమ వెఱ్ఱివాఁడవు కాకుమా
    భామ దోచును విత్త మించుక వార వారము ప్రేమతో
    దోమ తీయును బ్రాణ వాయువు దుర్భరమ్ముగఁ గుట్టుచున్
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

    [ఇక్కడ భామ యన నాడ నేస్తము)

    రిప్లయితొలగించండి
  28. సరసమాడు టందు మరచినసమయాన
    కోర్కెలన్ని బెట్టి కుట్టుభామ!
    తెలియనీక గరచు తెలివైన దోమయే
    భామకంటె జిన్న దోమమిన్న!

    రిప్లయితొలగించండి
  29. పచ్చనైన చెట్టు పట్టున నుండును
    హానిచేయ బోని దాకుపురుగు
    కీడు చేయు నెడల చూడవోయీ గొల్ల
    భామ కంటె చిన్న దోమ మిన్న!

    రిప్లయితొలగించండి
  30. భామ పెట్టిన పోరు వీనుల బాపవచ్చును డబ్బుతో
    భామ పీల్చు కిసాయి విత్తము, బాగె, కోరదు రక్తమున్
    భామ నిద్దుర వోవు రాతిరి బాధ యుండదు నిద్రలో
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్.

    (కిసాయి = జేబు)

    రిప్లయితొలగించండి
  31. వెట్టకాలమందు వేదనకలిగించు
    భామ కంటెఁ ; జిన్నదోమ మిన్న
    బాధ చొనుపు టందు వర్షఋ తువులోన,
    ననుభ వించ వలయు నణగి యుండి

    వెట్టకాలము=వేసవి
    భామ = సూర్యుడు

    రిప్లయితొలగించండి
  32. మత్తకోకిల
    జాము రాతిరి నిందుమోమున సైగఁ జేయుచు లేపినన్
    భామ కౌగిట గోటి గిచ్చుడు పంటి గాట్లన హాయియే
    ప్రేమగా మన పైన కుట్టిన ప్లేటులెట్సవి తగ్గుచున్
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

    రిప్లయితొలగించండి
  33. భామ సౌఖ్యము గోరుచుండును భర్త కష్టము జేయగా
    దోమ రక్తము బీల్చుచుండును దూర్చి రోగపు జీవులన్
    భామ మోదము నిచ్చు; దోమలు పాడు జేయును స్వాస్థ్యమున్
    "భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్"

    రిప్లయితొలగించండి


  34. విన్నకోట నరసింహారావు గారి పూరణ :(



    దోమ రొదయు భార్య తోముడు రెండునొ
    క్కటె! పడతుక, విన్న కోట రాయ
    పల్కు విను! జిలేబి భామ మించు పతిని
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న!



    జిలేబి సేత

    రిప్లయితొలగించండి
  35. ధీమతంబున లేమలందరు దిట్టలే పరికింపగా
    నెమ్మనంబుననేమియుండునొ నేర్వజాలరుయెవ్వరున్
    దోమకుట్టినరీతిభామలధోరణే యగుపించినన్
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

    రిప్లయితొలగించండి
  36. నే మధూళిని త్రాగినందుకు నిష్ఠురమ్ముల నాడినన్
    భామకోపము లెక్కజేయక పానశాలనె జేరితిన్
    దోమ యొక్కటి కుట్టినంతట ద్రుంచనెంచితి జాతినే
    భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్

    రిప్లయితొలగించండి
  37. Malli siripuram
    శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
    ఆ.వె//
    చుట్టమనుచు వచ్చి మట్టసము గసొమ్ము l
    మింగునట్టి సొగసు మీనజాతి l
    వేల్పుగాదు మనకు వెలకాంత వంటిదౌ l
    భామ కంటెఁ జిన్న దోమ మిన్న ll

    రిప్లయితొలగించండి
  38. ఆటవెలది
    చీరలు నగలంచు చీము నెత్తురనెల్ల
    పీల్చివైచి నోరు పెగలనీదు
    బుజ్జి నోటి తోడ బొట్టు బొట్టుగలాగ
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న

    రిప్లయితొలగించండి
  39. రామ రామ నేటి రమణుల బరికింప
    ప్రేమ కన్న వస్తు ప్రీతి మిన్న
    ప్రేమ యంచు నెపుడు ప్రియుని దిప్పలు బెట్టు
    భామ కంటెఁ జిన్నదోమ మిన్న

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    భామకంటెఁ జిన్న దోమ మిన్న

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *రాత్రి పగ లనక బిరాన రక్తము పిండు*

    *భామకంటెఁ జిన్న దోమ మిన్న;*

    *మహిని రాత్రులందు మాత్రమే రక్తమున్*

    *పిండుకొనును కొన్ని బిందువులను*

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    11.8.19
    -----------------------------------------------------------
    శ్రీ మునిగోటి సుందర రామ శర్మ గారి పద్య ప్రేరణతో..

    రిప్లయితొలగించండి
  41. అహరహమును నగల నాశించుచు సతము
    వాంఛ చేయుచు నుపవాసముండి
    బాధలిడుచు మగని బాధించి పీడించు
    భామ కన్న చిన్న దోమ మిన్న.

    మ,రొక పూరణ

    పొరుగు జనులు చూచి పోల్చుచు రోదించు
    భామ కన్న చిన్న దోమ మిన్న
    దోమతెరను కట్ట దూరమౌ నాదోమ
    కట్టుకొన్న కాంతి కుట్టి చంపు.



    రిప్లయితొలగించండి
  42. రక్తముగొను దోమ రాత్రులందునెపుడు
    పగటి వేళలందు వదలి వేసి
    పగలురాత్రి గూడ వదలక బాధించు
    భామకంటెచిన్న దోమమిన్న

    రిప్లయితొలగించండి