15, ఆగస్టు 2019, గురువారం

నిషిద్ధాక్షరి - 48

కవిమిత్రులారా,
అంశము - స్వాతంత్ర్య దినోత్సవము
నిషిద్ధాక్షరము - సకారము ('స', దాని గుణితములు, సంయుక్తాక్షరములు)
ఛందము - మీ యిష్టము.

60 కామెంట్‌లు:

 1. ఎగురు చుండెను ఘనముగ గగన మందు

  మూడు రంగులు కూడిన ముచ్చటైన

  భరత దేశ పతాకము ,భరత బిడ్డ

  లార వందనము నిడుచు కోరు
  కొనగ

  వలయు కలుగ చేయమనచు చెలిమి మనకు

  రిప్లయితొలగించు
 2. పరుల యాధీన మునువీడి పరవ శించ
  డెబ్బది రెండు యేండ్లుగ డిచిన కలలు
  కల్ల లాయెను జనులంత కలుష ములను
  మునిగి తేలగ మారని మూర్ఖు లంట

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   బాగుంది. రెండవ పాదం గురించి ఫేసుబుక్కులో సవరణ చూడండి.

   తొలగించు
  2. పరుల యాధీన మునువీడి పరవ శించ
   డెబ్బది యురెండు యేండ్లుగ డిచిన కలలు
   కల్ల లాయెను జనులంత కలుష ములను
   మునిగి తేలగ మారని మూర్ఖు లంట

   తొలగించు
 3. ఎగుర వలయ మువ్వన్నెలు నేలనింగి
  యొక్కటై జగత్యవనిక నక్కజముగ
  భరత మాతకాహ్లాదము పగతురకును
  కంటి మంటయై విడుదల కాన్కనిడగ

  రిప్లయితొలగించు
 4. ప్రాతః కాలపు షరదా పూరణ:

  అరెవో వచ్చెను చూడురా మనదియౌ హాయైన జండా భళా
  కరువుల్ తీరగ కృష్ణవేణి మనకై గంభీరమౌ తీరునన్
  పరువుల్ బెట్టుచు వచ్చెరా కురియగా వర్షాలు కర్ణాటనున్
  దరువుల్ మ్రోగగ దేశభక్తులహహా దండించగా పాకునే
  మురియంగా మన కల్వకుంటలిటనున్ ముద్దైన నాగష్టునన్ 😊

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   త్రాగుబోతులు సకారాన్ని షకారంగా ఉచ్చరిస్తారు. ప్రొద్దున్నే ఏం త్రాగారు? సరదాను షరదా అన్నారు. నిషేధం కేవలం పద్యానికే వ్యాఖ్యలకు వర్తించదు.

   తొలగించు


 5. వందే మాతర మనుచున్
  వందన మిడు భరతభూమి వర్ధిల్లంగన్
  బృందావనమిది పృథ్విని
  పంద్రాగష్టుకు నమామి పరిపూర్ణముగా !


  జిలేబి
  శుభాకాంక్షలతో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
  2. జిలేబి గారు ఏమిత్రాగారో అడగండి:

   "పంద్రాగష్టు"

   తొలగించు

  3. :)

   జిలేబి విత్ హాట్ మిల్క్ అట్ వారణాసి :)


   జిలేబి

   తొలగించు

  4. ఇప్పుడే అందిన సమాచారము మా సేఠు బ్యాంకు వారి కాలం డర్ తో సహా "టెల్గు" కాలండర్లలో ఆగష్టు అని వున్నది(ట) :)
   జిలేబి

   తొలగించు
 6. భారతీయులకడగండ్లుపారెననగ
  తెల్లదొరలకువణకుమాయుల్లములకు
  హర్షమొదవవాల్లభ్యమునగుతభరత
  మాతవర్ధిలుదినదినమర్కుభంగి

  రిప్లయితొలగించు
 7. మైలవరపు వారి పూరణ

  ఆంగ్లదుష్పరిపాలన అంతమైన
  పర్వదినమిది.! ఎందరో ప్రాణ మాన..
  విత్తముల ధారవోయ ప్రాప్తించె మనకు!
  వారికిడరారె శతకోటి వందనములు.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది.

   తొలగించు
  2. *అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు*💐💐🙏🙏

   *శుభాకాంక్ష*

   పంజాను విసురుమా పంచాస్య.! గర్జించి
   పొరుగుదేశంపు ముష్కరులు బెదర !
   కమలమా.! హైందవగంధాల విరజిమ్మ
   వికసించి నవ్వుమా ! సకలజగతి.!
   వనమయూరమ!శాంతిఘనగర్జలనువిని
   నర్తించి యాడుమానందమొదవ.!
   సమరసభావాల సంకేతమీవుగా
   చూపట్టుచుండుమా! చూతఫలమ.!

   మధురజాతీయగీతమా! మమత బెంచు,
   మఖిల జాతిపతాకమా.! ఆర్తి దీర్చు !
   మనుచు కోరెద దేశచిహ్నాలనెల్ల
   భద్రతయు శాంతి దేశాన పరిఢవిల్ల.!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
 8. దొరలము మేమని చెప్పుచు
  హరియింపగ వచ్చినట్టి యాంగ్లేయులనే
  తరిమిన రోజిది కాదే
  భరతావని మోదమందు పండుగ నేడే.

  రిప్లయితొలగించు
 9. గాంధి,నెహ్రూ,పటేలుల కాంక్షఁదీర
  భరతమాతకు బంధము చెరగి,తొలగె
  కోటి కాంతుల తళతళ కూడిరాగ--
  తెల్ల దొరలకు రోజులు తెల్లవార!

  రిప్లయితొలగించు
 10. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  వచ్చిన మ్లేచ్ఛులు నిలవక l
  విచ్చెలవిడిగా ప్రజలను వీడుచు వెడలన్ l
  కచ్చరమే తొలగి నిపుడె l
  విచ్చెను భారతి పతాక వీధుల పైనన్ ll

  రిప్లయితొలగించు
 11. మాతృపూజ
  *********
  గాంధీజి బోధల గరమొప్ప బాటించి
  బాబురాజేంద్రుని భక్తీ దలచి
  బాలగంగాధరు భాషణమ్ముల నెంచి
  అల్లూరి శౌర్యమ్ము నభినుతించి
  నేతాజి జైహిందు నినదమ్మునే పల్కి
  నేహ్రూజి రూపమ్ము నెదను నిల్పి
  వల్లభాయి పటేలు బహుభంగి కీర్తించి
  అంబేద్కరార్యుని నాదరించి
  లక్ష్మిబాయి చూపిన ఘనలక్ష్య మెరిగి
  ఇందిరమ్మకు శాస్త్రికి వందనమిడి
  మహితకాశ్మీరమకుటపు మాన్యచరిత
  భరతమాతను నర్చింప తరలి రండు !!

  రిప్లయితొలగించు


 12. అదిగో యల్లది గో త్రివర్ణముల జెండా! భారతాంబన్ ధ్రువ
  మ్ము దృఢమ్మై తను రక్ష జేయు నమనమ్ముల్ తోడు వందే యనన్
  పదిలమ్మై నిలువంగ జైయనుమికన్ ప్రాబల్యమై భాజపా
  విదురుల్ డెబ్బది యేండ్ల నాటి వెతలన్వీగింప కష్మీరమున్


  జిలేబి

  రిప్లయితొలగించు
 13. ఆంగ్లదేశపు పాలన ఆగి పోయి
  పాలనము మనచేతికి వచ్చినట్టి
  దివసమిది , మాన్యులెందరో తెచ్చిరిగద
  వారి తలపె మనకు తగు పథము జూపు

  రిప్లయితొలగించు
 14. భరత మాతకు ప్రణమిల్లి పరవశించి
  మూడు రంగుల జండాకు మోకరిల్లి
  దేశభక్తుల త్యాగాలు దీక్షలెల్ల
  తలచి యర్పించు జోహారు లలరు నట్లు

  రిప్లయితొలగించు
 15. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మా సద్యోగ పుత్రుడు ఉవాచ:

  బరువుల్ మోయగ రాత్రి ప్రొద్దులనహో పాషాణుడౌ రాట్టుకున్
  పరువుల్ బెట్టుచు వచ్చెరా కడకిటన్ ప్రఖ్యాతమౌ తీరునన్
  వరలంగా మన పంట పండగనహో బంగార మాగష్టునన్
  కరువైనట్టిది జాలిడే మనకికన్ గాఢమ్ముగా నిద్రకున్

  రిప్లయితొలగించు


 16. తొలగెన్ తలాకు కాష్మీ
  రుల వెతలు త్రివర్ణమున కరుగ డెబ్బది యే
  ళ్ళలజడి తొలంగు జయహో
  బలమ్ముతో భరత భూమి ప్రబలమవంగాన్!


  జిలేబి

  రిప్లయితొలగించు


 17. బలముగ నెక్కొని కలుప న
  దులన్ భరతభూమి నేటి దురితములు తొలం
  గు! లపితములాడి రాష్ట్ర
  మ్ములు చేర మన ప్రగతి పథము వెలుగు నొందున్


  జిలేబి

  రిప్లయితొలగించు


 18. ట్రిలియన్నైదను డాల
  ర్లిలలోన యెకానమీగ రివ్వున నెగురన్
  బలమును పుంజుకొనెదమిక
  వలాకముగ భరతభూమి ప్రాపు పెరుగగాన్


  జిలేబి

  రిప్లయితొలగించు
 19. చిఱు సవరణతో
  . *శ్రీ గురుభ్యో నమః*
  శంకరాభరణం - నిషిద్ధాక్షరి
  “స” అనే అక్షరము మరియు గుణితము నిషిద్ధము.
  అంశము :: స్వాతంత్ర్య దినోత్సవము
  స్వేచ్ఛాచ్ఛందము-మత్తకోకిల పద్యము

  తెల్లవారలు పారిపోయిరి దేశభక్తుల దీక్షతో,
  తల్లి భారతి ముక్తి నందుచు ధన్యయయ్యెను ప్రీతితో,
  ఎల్లవారలు పొంగిపోయిరి హెచ్చె మోదము తృప్తితో,
  ఎల్లవాడల మూడురంగులవే విరాజిలె కాంతితో.
  కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు 15.8.2019

  రిప్లయితొలగించు
 20. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మూడు రంగుల జెండాను జూడ వచ్చి
  నాటి ప్రముఖుల త్యాగమ్ము పాటిగ నిట
  తలచి దేశ రక్షణకీవు తమిని గొనుచు
  ప్రతిన బూనుము నీనాడు పంత మొంది.

  రిప్లయితొలగించు


 21. అభియానమ్ముల తోడై
  యభిమానమ్ములను తెలుపు మమ్మ జిలేబీ
  ప్రభవింపన్ మన జెండా
  కభివందనముల తెలుపు ప్రగతి మనుగడగా!


  జిలేబి

  రిప్లయితొలగించు
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 26. నిజపాల నాంచిత నిర్వివాద ప్రజా రంజక శుద్ధ భారతము జగతిఁ
  బృథివీప వర గణ వృత రాజ్య మాకాంక్షణీయము మా కిఁక నెమ్మి నుండ
  వలజామ రాదిగ వర్ణచతుష్టయమ్ము విరాజిల కరము పుడమి లోన
  వరకృషి విజ్ఞాన వర్తక వైద్య విద్యా వైభవమ్ముల నలర భృశము

  కావ్య చిత్కళా నర్తన గాన నాట్య
  విద్య లలరంగ నిరతము హృద్యముగను
  జంద్రయాన భోగ మడరఁ జారుతరము
  దేశ కోటి ఘనము నాదు దేశ మెంచ

  రిప్లయితొలగించు
 27. జయమగు భారతీయులకు జాతి మతమ్ముల భేదమెంచకన్
  నయముగ శాంతి మార్గమును నమ్ముచు నందరు నొక్కటై నికన్
  రయమున వేడ్కగా తరలి రండిదె పండుగ నేడు శ్రద్ధగా
  ప్రియతమ దేశ మాత కిటు ప్రీతిగ వందన మాచరింపగన్

  రిప్లయితొలగించు
 28. చీకటిరేయిగతించెను
  కూకటి వేళ్ళతొ నవనిని గూల్చగ దొరలన్
  నాకము వ్యుత్థానమెగద
  లోకమునందునను ప్రగతి లోలులకెపుడున్

  రిప్లయితొలగించు

 29. జలజీవన్ అభియాన్ !


  భారత భూమి నేడు తన భాగ్యపు రేఖను డెబ్బదేండ్లుపై
  ప్రేరణ గాంచి మార్చుకొను వేళ జనాళికి నీటియెద్దడిన్
  తీరిచి జీవితమ్మున ప్రతీకము గా జల మెల్ల గీములన్
  చేరగ, రండి రాష్ట్రముల జియ్యలు! కట్టుగ మోడితోడుతన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 30. భరత మాతకు బంధముల్దొరగుకతన
  మూడురంగుల జెండాలు ముచ్చటగను
  నెగురు చుండును నీరోజు నెల్లదిశల
  దనివి దీరగ జేతుబ తాకములకు
  వందనమ్ములు భక్తిని వందలాది

  రిప్లయితొలగించు


 31. మరువగ నేతలెల్ల యిది మన్నిక గాంచిన వేద భూమి యం
  చు రవము తోడు మోడి భళి చువ్వన తేజము జేర్చి కాలు మో
  ప రవళి తోడుగా జనుల భాగ్యము మారె విధాత రాతగా
  పరుగిడి రండి జైయనుచు భారత భూమిని ముద్దులాడ గన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 32. If Sadar Patel didn't work on Hyderabad samsthanam, Hyderabad also would have been another Kashmir. Happy Independence Day💐
  మనఁమీమాత్రము ఉన్నా
  మనిఁజెప్పుకొనగలమన్న మనినన్, పట్టే
  లనువాడె గదా రాజ్యం
  బున నీదినమున త్రివర్ణపు పతాకముతోన్

  రిప్లయితొలగించు


 33. వేద భూమికి ప్రగతికి వేడుకలమ
  రంగ పండుగ! జెండా తిరముగ నెగుర
  రంగి రావె రాట్నమ్మును రయ్య నంగ
  త్రిప్పి ఖాదీ మనదను ప్రతీక గాన !


  జిలేబి

  రిప్లయితొలగించు
 34. గురుదేవులకు, పండితోత్తములకు మరియు కవిమిత్రులకందరకూ స్వాతంత్య్ర పర్వదినోత్సవ శుభాకాంక్షలు.

  కందం
  తుంటరులై తెల్లలు మా
  యింటను మము బంట్లవలె భరించక జూడన్
  గెంటుచు నాత్మవశత్వము
  పంటగ పండించుకొన్న పర్వమ్మిదియే

  రిప్లయితొలగించు
 35. కందం
  గుండు కెదురు గుండెలతో
  మండించగ తెల్లవారి మచ్చరమెల్లన్
  మొండితనము వీడి వెడల
  పండుగ వ్యుత్థానమంద భారతమందున్

  రిప్లయితొలగించు
 36. మూడు రంగుల జెండ నింగిని ముద్దుగా నెగిరేనురా
  మూడు లోకములందు భారత మూర్తిమత్వము చాటెరా
  చూడరే మన త్యాగమూర్తుల చూపులందున నార్తినే
  నాడు పొందిన విచ్చలున్ మరి నష్టి చేయక లెండిరా
  వాడవాడలు దద్దరిల్లుచు వ్యాప్తి చెందగ ధారుణిన్
  పాడరే జనరంజకమ్ముగ భవ్య భారత ఖ్యాతినే!!!

  రిప్లయితొలగించు
 37. గురువు గారికి నమస్సులు.కవి మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
  భారత పతాక మెగిరెన్
  వీరులు పంతము విడువక ,విజయం గల్గెన్
  భీరుల పీచమ ణoచగ
  పారిరి హూణులు బిలబిల పడమటి దిశలన్

  రిప్లయితొలగించు
 38. వీరులయ్యిరి వాడవాడన వేనవేలుగ నేతలున్
  పౌరులెల్లరు దేశమంతట పౌరుషమ్ముగ పోరగన్
  దూరమయ్యెను పంద్రగష్టున దుర్బలత్వపు భావనా
  చారమేదొ ప్రజాప్రభుత్వము జాతి పొందెను భారతీ౹౹

  రిప్లయితొలగించు


 39. అదిగొ జొమేటో అమెజా
  నదిగో వాల్మార్టికియ! మనకికన్ షాపిం
  గిదిగిది గో! మువ్వన్నెలు
  పదిలంబుగ "మనిషి మరియు వన్యమ" న నమో !  జిలేబి

  రిప్లయితొలగించు


 40. ఎర్ర కోట పైన నెక్కి త్రివర్ణ ప
  తాక మెగుర భారతాంబ ముద్దు
  బిడ్డ మోడి తాను పేర్మిని చూపెను
  భరత భూమి కీర్తి ప్రాపు జేయ !


  జిలేబి

  రిప్లయితొలగించు


 41. ఇవ్వాళ మోడీ భజన మరిన్ను మువ్వన్నెల జెండా భేషుభేషుల జిలేబీలు మరీ యెక్కువయి పోయె కాబట్టి ఆఖరుగా మత్తకోకిలతో బైబై :)


  పారివారపు గోలలెల్లను భ్రాంతివీడుచు పోవగా
  భారతాంబకు భాజపాయను పార్టినేతగ మోడియే
  ధీరుడైన ప్రధాని గా‌ భళి దిక్కుదిక్కుల చూపగా
  మారె రాత జనాళికెల్లను మంచిరోజులు చేరగా!  జిలేబి

  రిప్లయితొలగించు
 42. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂నిషిద్ధాక్షరి 🤷‍♀..................
  అంశము - స్వాతంత్ర్య దినోత్సవము
  నిషిద్ధాక్షరము - సకారము ('స', దాని
  గుణితములు, సంయుక్తాక్షరములు)
  ఛందము - మీ యిష్టము.

  సందర్భము:
  1.) నిషిద్ధాక్షరి నియమాలు పాటించబడినవి. అంతేగాక ఒక జనరల్ నాలెడ్జ్ విషయం చెప్పబడింది. అదేమంటే..

  2.) ఉమ్మడి పాలమూర్ జిల్లాలో అనగా అవిభాజ్యపు మహబూబ్ నగర్ జిల్లాలో స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకం ఎగురవేసిన మొట్టమొదటి గ్రామం ఏదంటే *గొరిట* లేదా *గొరిటె*. ఇది ఒక కొత్త సమాచారం.

  3.) మరో చిత్ర కవితా విశేషం పొందుపరచ బడింది. అదేమంటే ఏ పాదాన్ని ఎన్నవ పాదంగా మార్చుకొని చదువుకొన్నా భావం మాత్రం ఒకటే!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  చెలగి యుమ్మడి పాలమూర్ జిల్లయందు

  పొలుపు మీరగ *"గొరిటె"* లో మొట్టమొదట

  పరగ మువ్వన్నె జండా రెపరెపలాడె

  తనదు పాలన పండుగ దినము నాడు

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  15.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు

 43. అవ్విను వీధిని గాంచుడు
  రివ్వున పైపై తిరుగుచు రెపరెప లాడన్
  దవ్వుల కాంతులు జిమ్ముచు
  మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్.

  బంధముక్తురాలయ్యెను భరతమాత
  యీశుభదినమందున నాడు యిలను తాను
  వాడు వాడల నెగిరెను వాసిగాను
  త్వరితగతిన నిడగ రండు వందనములు

  పర్వదిన మిదియను భారతీయులకెల్ల
  పారతంత్ర్య మణిగి పరుగులిడగ
  భరతమాత మురిసి పరవశించిన రోజు
  వందనమిడ రండు వడిగ తమరు

  రిప్లయితొలగించు