"అయ్యా. ఇవాళ సమస్య మీకు చక్కగా సరిపోతుంది. తెలుగు రాదంటారు, తెలుగులో ఆశువుగా చెప్తారు , మీరు కూడా ఒక మల్లెమాల అనుకోవచ్చా. బాగుంది మీ పూరణ. ఆ శ్రీకృష్ణునికేమి గొల్ల భామలతో తిరిగినా, కోల చేతబట్టి గోవులను మేపిన, గీతోపదేశం చేసినా ఆయనకే చెల్లు."
సందర్భము: భగవాన్ శ్రీ సత్యసాయి జీవితోదంత మిది. అది మార్చి 1940. అప్పుడు స్వామి ఉరవకొండలో అన్న వదినల వద్ద వుండి 8 వ తరగతి చదువుకునే 13 సంవత్సరాల చిన్నవాడు. ఒకనాడు పక్కంటిలో ఒక శాస్త్రి గారు భాగవత ప్రవచనం చేస్తూ అన్నీ తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్దృష్టితో తెలుసుకున్న స్వామి అతణ్ణి పిలుచుకుర మ్మన్నాడు. మొత్తంమీద అతణ్ణి సమాధానపరచి తీసుకురాగా స్వామి అతని తప్పులెత్తి చూపి సహేతుకంగా భాగవత రహస్యార్థాలను వివరించాడు. అతడు స్వామికి పాదాక్రాంతుడై క్షమింపు మని వేడుకున్నాడు. ఏ పొత్తములూ చదువకుండానే అంతటి మేధా సంపత్తి సాయికి ఎలా వచ్చిం దన్నది ఆశ్చర్యమే కదా మరి! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "ప్రక్కన నింటిలో నదిగొ! భాగవతంబును జెప్పు శాస్త్రి తా మిక్కిలిఁ దప్పు టర్థముల మే లను చుండెను.. పిల్వ నంపుడీ! ఇక్కడి".. కన్నఁ బిల్చి రట!.. యింపుగ దిద్దెను సాయి.. వింతయే!.. ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడని వాని కివ్విధిన్?
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 27.8.19 -----------------------------------------------------------
అక్కరకు రాని మాటలు
రిప్లయితొలగించండిపెక్కుగ మాటాడుచుండు విడువక క్షణమున్
లెక్కింపగరాదాతని
కెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(స్వానుభవం)
దిక్కులు తోచనిన్ విధము తిండియు తిప్పలు మాని కొంతయున్
ఫక్కున నవ్వుచున్ సతము ప్రాజ్ఞత సుంతయు లేకపోయినన్
చక్కగ వ్రాయగా జడుడు శంకరు కొల్వున పద్య పూరణల్...
ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅయినా ఐఐటి ప్రొఫెసర్ ఎన్నడూ పుస్తకం మొహం చూడని వాడెలా అవుతాడు?
🙏
తొలగించండితెలుగు పుస్తకాలు...
"దిక్కులు తోచనట్టి గతి... మాని నిచ్చలున్..." అనండి. బాగుంటుంది.
తొలగించండికంది సారు సవరణతో: 👇
తొలగించండి🙏
ప్రాతః కాలపు సరదా పూరణ:
(స్వానుభవం)
దిక్కులు తోచనట్టి గతి తిండియు తిప్పలు మాని నిచ్చలున్
ఫక్కున నవ్వుచున్ సతము ప్రాజ్ఞత సుంతయు లేకపోయినన్
చక్కగ వ్రాయగా జడుడు శంకరు కొల్వున పద్య పూరణల్...
ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్?
తొలగించండి- ఐఐటి ప్రొఫెసర్ ఎన్నడూ పుస్తకం మొహం చూడని వాడెలా అవుతాడు?
జవాబు - మొహంమొత్తి :)
జిలేబి
తొలగించండి"But who wants to read at this age when one can write famously?"
http://gpsastry.blogspot.com/2011/09/1-something-vision.html?m=0
తొలగించండి:)
తక్కువ కాడు,మౌన గుణ ధారుడు,కారణ జన్ముడాతడే!
రిప్లయితొలగించండియెక్కువ తక్కువల్ గనడు,యెప్పుడు యోగ విధాన సాధనల్
మక్కువ బూని చేయు,నణుమాత్రము దైవము విస్మరింపడే
"ఎక్కడి మేధ!పొత్తముల నెన్నడు జూడని వాని కివ్విధిన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...గనడు + ఎప్పుడు' అన్నపుడు సంధి నిత్యం. సవరించండి.
సవరణానంతరం
తొలగించండిఎక్కువ తక్కువల్ గనడదేఘి విచిత్రమొ!యోగ సాధనల్
చక్కని పద్యము సులువుగ |
రిప్లయితొలగించండిచిక్కగ నల్లుచు పదముల జిగిబిగి తోడన్|
టక్కున వ్రాయుగ బాలుడు |
*"ఎక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్"*
నిక్కము శ్రద్ధయున్ననది నేర్పును దెచ్చును నెట్టి వారికిన్
రిప్లయితొలగించండిచుక్కలుజూచి గంటలను, చూపిరి పూర్వమునందుగొప్పగా!
చక్కని పల్లెపట్టులన చాయగ పద్దెము పాడు నెందరో
ఎక్కడి మేధపొత్తముల?నెన్నడు జూడని వానికివ్విధిన్.
టక్కున చెప్పేయునటా
రిప్లయితొలగించండినొక్కనిమేషముగొనడయె నూరుగణాంకాల్
చక్కగ మూడేండ్లబుడత
కెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్"
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమాన్యులు శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారికి అభినందనలు.. నమస్కారములు🙏
వీరు బాలచైతన్యం ద్వారా బాలబాలికలకు తెలుగుపద్యాలు నేర్పిస్తున్నారు. వారిలో చి. నేతి శ్రీకర్ ఒకరు.
మక్కువ ఘట్టివారలసమానపరిశ్రమ సల్పి నేర్పగా ,
చక్కని నేతి శ్రీకరుడు శారదకున్ బ్రతిరూపమౌచునెం..
చక్కగ తెల్గుపద్యముల సౌరభముల్ వెలయింప, గాంచుచో
నెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ప్రక్కన నుండగా భగిని భారత మాతను బోలి నవ్వుచున్
పెక్కులు తిట్టులన్ వదరి ప్రీతిని మొత్తుచు మోడివర్యునిన్
గ్రక్కున వీడుచున్ పదవి కాంగ్రెసు తుక్కుగ నోడిపోవగా
నెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్?
రిప్లయితొలగించండిటక్కుమని వ్రాసె పద్యం
బెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్?
మ్రొక్కగ చదువుల తల్లియె
పక్కన నిలబడి యమర్చె పదముల స్వామీ!
జిలేబి
చిక్కు సమస్యలనైనను
రిప్లయితొలగించండిచక్కగ పూరించును పద సౌందర్యముతో
అక్కజమౌ వీని ప్రతిభ
ఎక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్
అక్కరములె నేర్వనివా
రిప్లయితొలగించండిడక్కరతో చెప్పుచుండె నాశువుగా తా
చక్కని పద్యము లరయ
న్నెక్కడిదీ మేధ సుంత యెరుగడు శాస్త్రాల్
టక్కున జవాబు లొసగుచు
రిప్లయితొలగించండిచక్కని నేర్పరిగ వెలుగు చతురుని గనుచున్
ముక్కున వ్రేలేసు కొనిరి
ఎక్కడిదీ మేథ సుంత యెరుగడు శాస్తాల్
రిప్లయితొలగించండినిక్కము మాయ మంత్రమె! పనేమియు చేయక వాడవాడలా
నిక్కుచు నీల్గుచున్ తిరిగె నేర్పది సుంతయు లేక హీనుడే
యెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్
మ్రొక్కగ పద్మలాంచన సమున్నతమై గడ గట్టి నేర్పెనో?
జిలేబి
ఎక్కడి మేధ పొత్తములనెన్నడుజూడనివానికివ్విధిన్
రిప్లయితొలగించండిదక్కెనటంచునేల పరితాపమునొందుట?వేదభూమియం
దక్కజమేమియున్నయది హస్తియు కాళము లూతలెన్నడో
చిక్కనిభక్తిచే శివుని జేరెడు జ్ఞానము పొందియుండగన్
(సత్యసాయీశుడు ఏ గ్రంథాలూ చదవకుండానే ఆధ్యాత్మిక
రిప్లయితొలగించండిసౌగంధ్యాన్ని అందరికీ అనుగ్రహించిన మహాపురుషుడు )
ఎక్కడి పుట్తపర్తి ! మరి
యెక్కడి దేశవిదేశవాసులున్ !
మ్రొక్కుచు సత్యసాయివిభు
చల్లని వాక్కుల లీనమౌదురే !
చక్కగ వేదశాస్త్రముల
సర్వవిశేషము లెట్టులబ్బెనో ?
ఎక్కడి మేధ పొత్తముల
నెన్నడు జూడనివాని కివ్విధిన్ ?
కందము:
రిప్లయితొలగించండిఎక్కిన కొమ్మను గొట్టెడు
మిక్కిలి మూర్ఖుడు బలికెను మీరిన విద్యన్
చక్కని శ్రీ దయ లేకను
ఎక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్
అక్కట!యేమీ ప్రవచన
రిప్లయితొలగించండిమెక్కడదీమేధ? సుంతయెఱుగడు శాస్త్రాల్
నిక్కముగదైవకృపయే
తక్కువగా జూడరాదు తత్త్వంఙ్ఞుండే
ఠక్కున కన్నుల బెరకుచు
రిప్లయితొలగించండినిక్కముగా నీశ్వరునకు నిండుగ నిడగన్
దక్కెను సుగతులు తిన్నని
కెక్కడిదీమేధ సుంతయెరుగడు శాస్త్రాల్
ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్
రిప్లయితొలగించండిచక్కగ జెప్పుచుండు నిటు శాస్త్రము లందలి నీతులన్నియున్
నిక్క మవన్నియున్ బ్రతుకు నేర్పిన పాఠములంతియేననున్
అక్కజమౌ గదా యితని ఆత్మ బలంబు దలంచినంతనే
చక్కని బాలకుడిచ్చట
రిప్లయితొలగించండినెక్కువ చిక్కగు సవాళ్ళ నెదురుకొనుచునే
ఠక్కున జవాబులీయగ
నెక్కడిదీ మేధ ! సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్
ఎక్కడిమేధ పొత్తములనెన్నడు జూడనివానికివ్విధిన్
రిప్లయితొలగించండినక్కజమాయెనేనదియ?యాపరమేశ్వరు సేవజేయుచో
జక్కటిమేధగల్గునిల,శాస్త్రములేవియుజూడకుండనే
నిక్కముబల్కుచుంటిమరి నేర్పునమీరలుపూజజేయుడీ
రిప్లయితొలగించండిమరో సరదా పూరణ:
(కృష్ణ ప్రసాద్ గారికి)
చిక్కని పాలమీగడలు చిత్తుగ దోచుచు గోకులమ్మునన్
పెక్కురు భామలన్ విరివి ప్రీతిని గూడుచు రాసలీలలన్
స్రుక్కక యుద్ధభూమినట షోకుగ పాడెను గీతనున్ భళా
యెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్ :)
"అయ్యా. ఇవాళ సమస్య మీకు చక్కగా సరిపోతుంది. తెలుగు రాదంటారు, తెలుగులో ఆశువుగా చెప్తారు , మీరు కూడా ఒక మల్లెమాల అనుకోవచ్చా. బాగుంది మీ పూరణ. ఆ శ్రీకృష్ణునికేమి గొల్ల భామలతో తిరిగినా, కోల చేతబట్టి గోవులను మేపిన, గీతోపదేశం చేసినా ఆయనకే చెల్లు."
తొలగించండి..RGV Krishna Prasd
తొలగించండిటక్కుమని వ్రాసె పద్యం
బెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్?
మ్రొక్కన్ శాస్త్రి ప్రభాకరు
పక్కన నిలబడి చదువుల పడతియె వ్రాసెన్ !
జాల్రా
జిలేబి
🙏
తొలగించండిజడభరతుడు....
రిప్లయితొలగించండినిక్కము గడ్డి యున్న గని నిగ్రహ శక్తియు కల్గి తానదే
చక్కగ నగ్ని కార్యమన చప్పున గెంతుచు పోవు లేడి చే
జిక్కదు చిత్రమే వినగ చిత్తము భక్తిని కల్గి యుండుటన్
ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉక్కవు పుణ్యాఘమ్ములు
రిప్లయితొలగించండిదక్కవు భాగ్యనిచయములు దైవ కటాక్షం
బెక్కుడు లే కన నిజమే
యెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్
అక్కజ మాయె నెల్లరకు నల్లుఁడు సన్నుత పండితుండునై
చక్కఁగఁ దిర్గి రాఁ బురికి శైల సుతా కరుణా రసార్ర్ద్ర స
ద్దృక్కులఁ గాళిదాస కవి దేవి యనుగ్రహ పాత్రుఁ డయ్యెనే
యెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడని వాని కివ్విధిన్
మిక్కిలిగా జ్ఞాన మొసగి
రిప్లయితొలగించండిమక్కువ తోడ గనె నంబ మన యంజన్నన్!
చక్కని వధాన మిడ మఱి
యెక్కడిదీ మేధ! సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరేపల్లె లో ప్రజల మానసం...
రిప్లయితొలగించండిఉత్పలమాల
అక్కజమయ్యెఁ జన్గుడుప హంతకి పూతన నెంచి కూల్చగా
నక్కటఁ గాలదన్ని శకటాసురు జంపిన బాలకృష్ణుడున్
నిక్కపు నీలమై నిలువ నేర్వఁగ కాళియు దర్విపై నహో!
యెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్!!
రేపల్లె లో ప్రజల మానసం...
రిప్లయితొలగించండికందం
గ్రుక్కెను రక్కసి ప్రాణము
లక్కట శకటాసురాది యసురుల గూల్చెన్
నిక్కెను కాళియు పడగల
నెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్
చక్కెర బొమ్మకోసమని చంచలుడై చరియింప నేమిరా
రిప్లయితొలగించండిచక్కని పద్యరాజములఁ జాతికి జాగృత మందజేయగన్
బెక్కుగ జెప్పెనే పుడమిఁ వేమన యోగిగ మారినంతనే
యెక్కడి మేధ పొత్తముల నెన్నడుఁ జూడనివాని కివ్విధిన్.
చక్కగ పద్యములల్లుచు
రిప్లయితొలగించండిచిక్కని లెక్కలను జెప్పు చిరుతను గనగా
నక్కజముగ జనులనుకొనె
యెక్కడిదీ మేధ సుంత యెరుగడు శాస్త్రాల్!!!
కం.
రిప్లయితొలగించండితిక్కగ తిరుగెడి రంగని
కెక్కడిదీ మేధ సుంత యెఱుఁగడు శాస్త్రాల్
యక్కున జేరిసి శ్రీముఖి
యక్కరముల వ్రాయ జిహ్వ,హక్కున బొసగన్
వై. చంద్రశేఖర్
టక్కున సమస్యను వినగ
రిప్లయితొలగించండిచక్కగ పూరించుచుండు జవముగ నతడున్
నిక్కంబిదియౌ నాతని
కెక్కడిదీమేధ సుంత యెరుగడు శాస్త్రాల్
కం.
రిప్లయితొలగించండిమిక్కిలి నెమ్మది చంద్రుడు
చక్కగ పద్యములు వ్రాయు చదువరు మెచ్చన్,
చిక్కెను ప్రకాశు గురువుగ,
ఎక్కడిదీ మేధ సుంత యెఱుఁగడు శాస్త్రాల్
వై. చంద్రశేఖర్
చక్కగ నడకే రాకయు
రిప్లయితొలగించండిపక్కన శ్లోకాలు చెప్పు పౌత్రుని మిక్కిలి
మక్కువతో తాత కనియె
ఎక్కడిదీ మేధ సుంత ఎరుగడు శాస్త్రాల్
ఉత్పలమాల
రిప్లయితొలగించండిచక్కగ వింటితో గురువు సందడి జేయఁగ బొమ్మయౌచుఁ దా
మక్కువ మీర నేర్చి నరు మత్సరమున్ గనె నేకలవ్యుడే
పెక్కురు భేషు భేషుయన వేడుక జేసెనె కానలందునే
యెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్?
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడని
వాని కివ్విధిన్
సందర్భము: భగవాన్ శ్రీ సత్యసాయి జీవితోదంత మిది. అది మార్చి 1940. అప్పుడు స్వామి ఉరవకొండలో అన్న వదినల వద్ద వుండి 8 వ తరగతి చదువుకునే 13 సంవత్సరాల చిన్నవాడు.
ఒకనాడు పక్కంటిలో ఒక శాస్త్రి గారు భాగవత ప్రవచనం చేస్తూ అన్నీ తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు.
అంతర్దృష్టితో తెలుసుకున్న స్వామి అతణ్ణి పిలుచుకుర మ్మన్నాడు. మొత్తంమీద అతణ్ణి సమాధానపరచి తీసుకురాగా స్వామి అతని తప్పులెత్తి చూపి సహేతుకంగా భాగవత రహస్యార్థాలను వివరించాడు. అతడు స్వామికి పాదాక్రాంతుడై క్షమింపు మని వేడుకున్నాడు.
ఏ పొత్తములూ చదువకుండానే అంతటి మేధా సంపత్తి సాయికి ఎలా వచ్చిం దన్నది ఆశ్చర్యమే కదా మరి!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"ప్రక్కన నింటిలో నదిగొ!
భాగవతంబును జెప్పు శాస్త్రి తా
మిక్కిలిఁ దప్పు టర్థముల
మే లను చుండెను.. పిల్వ నంపుడీ!
ఇక్కడి".. కన్నఁ బిల్చి రట!..
యింపుగ దిద్దెను సాయి.. వింతయే!..
ఎక్కడి మేధ పొత్తముల
నెన్నఁడుఁ జూడని వాని కివ్విధిన్?
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.8.19
-----------------------------------------------------------
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....
రిప్లయితొలగించండి"ఎక్కడి మేధ పొత్తము నెన్నుడుజూడని వాని కివ్వదిన్"
చిక్కెను జ్ఞాన సంపద విశేషము?నిత్యము గుర్వు బోధనల్
మిక్కిలి శ్రద్ధతోడ విని మీరక గుర్వుల యాజ్ఞ సర్వదా
చక్కగ నాచరించినను సాధ్యము కాగల దీ ధరిత్రిలోన్