24, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3113 (వారిజపత్రమే తగిలి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్"
(లేదా...)
"వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగఁ జీలెఁ జిత్రమే"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

62 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  దారుణ రీతి పోరుచును దంభము మీర యిరాని యెన్నికన్
  కోరిక తీరగా గెలిచి గొల్లున నవ్వగ కొంగు వేడుకన్
  జారగ గాలిలో తగిలి జందెము వ్రీలెను సిగ్గుతో యథా: 👇
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే

  రిప్లయితొలగించు


 2. సోరణి దీపపు వెల్గుల
  నారీమణి హత్తుకొనగ నవ్వుల పువ్వై
  వీరుని గుండెయు జారెన్
  వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భూరి బలాఢ్యుడౌ పవన పుత్రుని శైశవ మందు కుంతియే

   పేరిమి తోడ నెత్తుకొనఁ బిడ్డడు తల్లికరమ్ము నుండి తా

   జారుచు నేలపై బడగ శైలము బీటలు వార గాంచినన్

   వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే.

   తొలగించు
  2. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 3. వారిజ పత్రనయనఁ గని
  పూరుషుడా గాది సుతుడు మోహము తోడన్
  ఘోరతపమ్మును వీడుటె
  వారిజ పత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్.

  రిప్లయితొలగించు
 4. నేరములన్నిజేసితిరి,నేతల చాటున కశ్మిరమ్ములో!
  ఘోరములైన శిక్షలకు గోసలుబెట్టిరి పండితోత్తముల్
  పారగ శాంతివాహినట , పాలనమార్చిరి చట్ట బద్ధతన్
  వారిజపత్రమేతగిలి,వజ్రము రెండుగ జీలె చిత్రమే

  -----------------------------------

  రిప్లయితొలగించు
 5. కోరిరి శాంతిచర్చలని,కొండలగుట్టలనాక్రమించుచున్!
  మీరిరి హద్దులన్నియును,మిన్నకజూడగనెట్లు సాధ్యమౌ?
  వారల దుష్టతంత్రముకు,వాదరజీల్చిరి వీరసైనికుల్!
  వారిజ పత్రమేతగిలి,వజ్రము రెండుగ జీలె చిత్రమే.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తంత్రమునకు' అనడం సాధువు. అక్కడ "దుష్ట తంత్రమును" అనండి.

   తొలగించు


 6. మేరుసమానమాయెను ప్రమీల మహత్తుని నేల గానటన్
  నీరజనేత్రులెల్లరు కనిష్టపు దుస్తుల నీత కొట్టుచున్
  జోరుగ కండబల్మిని ప్రచోదన చేయగ చూడముచ్చటై
  వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగఁ జీలెఁ జిత్రమే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 7. ఆకాశవాణి కి పంపిన ది


  ప్రేరణ యయ్యె ప్రేయసియె రేడను మాలిమి వీడగా మయిన్
  కోరిక లెల్ల జోరుగ ప్రకోపము చెందగ తోడునీడగా
  సోరణి దివ్వె వెల్గుల కుచోన్నత సుందరి ముద్దులాడగా
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే!  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రాణీపేట నుండి పంపిన మీ పూరణను చదివాను.

   తొలగించు
 8. ధారుణి గాధిరాట్సుతుడు దారుణమౌతపమాచరింప జం
  భారి నిమంత్రణన్ తపము భగ్నమొనర్చగనేగుదెంచి రు
  ద్రారి శరంబువోలె తనరారెడు మేనక, తాపసిన్ గనన్
  వారిజ పత్రమేతగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే

  రిప్లయితొలగించు

 9. ఉత్పలమాల

  మారుని బాణ పద్మమది మైమరపించుచుఁ దాకినంతటన్
  సారస నేత్రఁ గృష్ణఁ గని సైచని కీచకు వజ్రకాయమే
  కోరగఁ బొందుకై, వలలు కూర్పున జీల్చెను మల్లయుద్ధమే
  వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగ జీలెఁ! జిత్రమే?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...జోల్చెను యుద్ధమందునన్' అని సవరించి చదివాను.

   తొలగించు
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   ఉత్పలమాల

   మారుని బాణ పద్మమది మైమరపించుచుఁ దాకినంతటన్
   సారస నేత్రఁ గృష్ణఁ గని సైచని కీచకు వజ్రకాయమే
   కోరగఁ బొందుకై, వలలు కూర్పున జీలెను యుద్ధమందునన్
   వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగ జీలెఁ! జిత్రమే?

   చీల్చెను అంటే అన్వయం కుదరదేమో ననే సంశయముతో చీలెను యుద్ధమందునన్ అని సవరించాను. పరిశీలించ ప్రార్థన

   తొలగించు
 10. నీరజపత్రనేత్రి రజనీకరసన్నిభమాననమ్ము ; లో
  కోరికలుప్పతిల్లగను కోలుమసంగిన కాంక్ష కన్నులన్
  జేరగ ప్రాణవల్లభుని జివ్వున జూచె దృగంచలమ్ములన్
  వారిజ పత్రమేతగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇదీ, పైన ఉన్నదీ... రెండూ చదివినట్టు గుర్తు. మీరు వేరు వేరు పేర్లతో పంపారా?

   తొలగించు
  2. శుభోదయం గురువుగారు! రెండవ పద్యం నా అర్ధాంగి పేరుతో పంపాను.

   తొలగించు
 11. మైలవరపు వారి పూరణ

  సారసపత్రసన్నిభవిశాలవిలోలవిలోచనప్రభా...
  సారము తాకినంత ఘనసారమువోలె కరంగడే జనుం..
  డారయ మేనకన్ గన మహర్షిని గాధిసుతున్ నిజంబిదే !
  వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగఁ జీలెఁ జిత్రమే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 12. (మహాభక్తుడు విప్రనారాయణుని కదిలించి కరిగించిన లావణ్యవతి దేవదేవి )
  ఆరయ రంగనాథునకు
  నంకితమై వరివస్య జేయు నా
  ధీరుడు విప్రనారయణు
  దివ్యపు చిత్తము దేవదేవికిన్
  సైరణ వీడి వేగిరమె
  సాంతము లోబడె నేమి చెప్పుదున్ !
  వారిజపత్రమే తగిలి
  వజ్రము రెండుగ జీలె జిత్రమే !!

  రిప్లయితొలగించు
 13. మారుని శరములు విసిరెను
  నీరజముఖికోమలాంగి నేత్రాంచలముల్
  వీరునియెద తాకగనే
  వారిజ పత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్

  రిప్లయితొలగించు
 14. మారుడు బాణముల్ విసర మైకము నందున పొంగి పోవుచున్
  చోరుడు సంతసం బునను సోయగ మేయని సోలిపో యినన్
  మారము జేయకుం డగను మంత్రము జల్లిన చందమా మయే
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే

  రిప్లయితొలగించు
 15. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  నారిని బిగియించు హరిని l
  వారిజ గన్నుల వధూటి వాలుగ జూడన్ l
  జారుచు స్వేదన బిందువు l
  వారిజ పత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్ ll

  రిప్లయితొలగించు
 16. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య.....
  "ప్రకృతి వినాశనంబె కడు పావనకార్యము మానవాళికిన్"
  .... ఇది 30-9-2018 నాడు శంకరాభరణంలో ఇచ్చిందే...
  మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించు
 17. ఉత్పలమాల:
  భారత రాజ్యమందు శిఖ భాగము నుండెడి కాశ్మిరమ్మునన్
  ఘోర కఠోర దుష్ట హిత కుత్సిత చట్టము'మూడు డెబ్బదిన్'
  కోరి సమైక్య భారతము గూల్చె నరేంద్రుడు జాతి మెచ్చగన్
  వారిజ పత్రమే దగిలి వజ్రమె రెండుగ జీలె చిత్రమే!?

  రిప్లయితొలగించు
 18. ఉత్పలమాల:
  భారత రాజ్యమందు శిఖ భాగము నుండెడి కాశ్మిరమ్మునన్
  ఘోర కఠోర దుష్ట హిత కుత్సిత చట్టము'మూడు డెబ్బదిన్'
  కోరి సమైక్య భారతము గూల్చె నరేంద్రుడు జాతి మెచ్చగన్
  వారిజ పత్రమే దగిలి వజ్రమె రెండుగ జీలె చిత్రమే!?

  రిప్లయితొలగించు
 19. కం.
  వారాంగనలన్ గూడుచు l
  పూరకుఁడున్ గాక దిరుగు పూషాత్మునిచే l
  జారిన ఖడ్గపు రవణము l
  వారిజ పత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్ ll

  రిప్లయితొలగించు
 20. శౌరియె మోహిని రూపిగ
  మారగ భస్మాసురుండు మారునిమహిమన్
  తీరుగ హతుడాయెనుగద
  వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్

  రిప్లయితొలగించు
 21. ఆకాశవాణి కి నేను పంపినది
  ధీరవరేణ్యుడా *నలుడు*తేకువతో *దమయంతి *జేరగా
  కోరిన భామ దక్కెనని కూరిమి వేడుక పొంగిపోవగన్
  ఆ రమణీ తనూలతిక నాతని,కర్కశ దేహు, తాకగా
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే!

  రిప్లయితొలగించు
 22. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం
  నారాయణ తృప్తికొరకు l
  భూరిగ ప్రజకెల్ల మృష్ట భోజన మిడగన్ l
  పూరించిన నేత్రజలము l
  వారిజ పత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్ ll

  రిప్లయితొలగించు
 23. ధరలో తీయని పలుకుల|
  భారము తీరును, కఠినపు పలుకుల వినగా |
  హీరపు మదియై నపగులు |
  "వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్"

  రిప్లయితొలగించు

 24. ఆటవిడుపు గంభీర పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోరి హిమాలయమ్మునను కూరిమి నుండగ తా సమాధినిన్
  నీరజ పూజలన్ వెలయు నీలపు కంఠుని మేటి హృత్తునన్
  మారుని పుష్పమే తగిలి మక్కువ మీరగ త్రుంపెనే యథా
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే!

  రిప్లయితొలగించు
 25. వైరుల కరి భీకరుడా
  వీరుడు గూలెను శిఖండి వీక్షణముననే
  ఔరా విధి నేమందును
  వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్

  రిప్లయితొలగించు
 26. పారముబొందుకోరికనుభవ్యునిగూరిచి దండకంబునున్
  వారము వారమున్జదివి వారిజపత్రముతోడశంభుపై
  నీరముజల్లగానపుడు నెమ్మదిసంతసమొందనత్తఱిన్
  వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే

  రిప్లయితొలగించు
 27. కోరికతో ప్రియురాలొక
  చారుగుణాఢ్యుని వలచియు సరసము తోడన్
  చేరియు మురిపించు తఱిని
  వారిజ పత్రమ్ము సోకి వజ్రము చీలెన్

  రిప్లయితొలగించు
 28. మారుడు శరములు వేయగ
  మారణహోమంబుజేయ మాహేశ్వరుడున్
  మారుని జూడగ నత్తఱి
  వారిజపత్రమ్ముసోకి వజ్రముచీలెన్

  రిప్లయితొలగించు
 29. వారిజవైరి వెన్నెలల ప్రాంతర మంతయు వెల్గులీనగన్
  వారిజగర్భు సోదరుని వాలు శరమ్ములు మై చలింపగన్
  వారిజనేత్రి మోహమున వాంఛలు రేగె మహా తపస్వికిన్
  వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగఁ జీలెఁ జిత్రమే

  రిప్లయితొలగించు
 30. వీరులు రణ దుర్జయు లరి
  వీర భయంకరుల పాండు విభ్వంగజ చ
  త్వారము జయద్రథుఁ డణఁచె
  వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్ !


  తోరణముల్ నివేశమునఁ దోరము లుండ కరమ్ము లందు నీ
  వారిజ నేత్రఁ గూడి గురు భక్తియు శ్రద్ధయు మానసమ్మునన్
  వారక వజ్ర ధారిని వినాయకుఁ గొల్వఁగఁ బత్ర పూజలన్
  వారిజ పత్రమే, తగిలి వజ్రము, రెండుగఁ జీలెఁ జిత్రమే ?

  రిప్లయితొలగించు
 31. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వీరుడు పితామహుండట
  పోరున తొరగెను వెఱగున పూనిక లేకన్
  జోరుగ శిఖండి సెలలకు,
  వారిజపత్రమ్ము సోకి వజ్రము చీలెన్.

  రిప్లయితొలగించు
 32. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్

  సందర్భము: మహాభక్తుడైన విప్ర నారాయణుడు దేవదేవి (వేశ్య) అనే నర్తకి సాంగత్యంలో పడి భక్తి వీడి రక్తిలో పడిపోతాడు. ఆతని దుర్భేద్యమైన వజ్రంలాంటి మనస్సు క్రమ క్రమంగా చివరికి పలుచని నీరై పారసాగింది.
  ఆ విప్రోత్తము వజ్రపంజర.. అనే ప్రసిద్ధ పద్యం ఆధారం.
  అది సారంగు తమ్మయ రచించిన వైజయంతీ విలాసం లోనిది. (ముఖ్యమైన పద్యం కాబట్టి పూర్తిగా పేర్కొంటున్నాను.)

  ఆ విప్రోత్తము వజ్ర పంజర నిభం
  బై పొల్చు మేలైన స
  ద్భావం బంగన సాహచర్య గుణ సం
  పర్కంబునన్ లోహమై
  గ్రావంబై దృఢ దారువై తరుణ వృ
  క్షంబై ఫలప్రాయమై
  పూవై త న్మకరందమై కరిగె పో
  పో నీళ్ళకుం బల్చనై

  విప్రనారాయణుని మనస్సు వజ్ర పంజరం లాంటిది. కాని అంగన సాంగత్యంచేత అది లోహంగా మారింది. అంటే దార్ఢ్యం కొంత తగ్గింది. క్రమంగా గ్రావం (బండరాయి) గా మారింది. అంటే దృఢత్వం మరింత తగ్గింది. కొన్నాళ్ళకు దారువు (కఱ్ఱ) గా అయింది.
  క్రమంగా గట్టితనం తగ్గిపోగా తరుణవృక్షం అంటే ఒక లేత చెట్టులాంటి దయింది. ఇంకా కొద్ది రోజులకు పండులాంటి దయింది. క్రమంగా సుకుమారమైన పూ వయింది. చూస్తుండగానే మకరందంగా తయారయింది. ఇంకా ఆ చిక్కదనం కూడా పోయి నీరుగా మారింది. పోనుపోను నీళ్ళకంటె పలుచనై కరిగిపోసాగింది.
  ఎంతో దృఢమైన వజ్రం స్థాయి నుంచి నీళ్ళలాగా అంతకంటే పలుచనిదిగా మారిపోయింది ఆతని మనస్సు.
  స్త్రీ సాంగత్య మిలా నానాటికి దిగజారుస్తుంది సుమా! అని భావం.
  1954 లో అక్కినేని భానుమతి నటించగా విప్రనారాయణ.. అనే సినిమా కూడా వచ్చింది.
  విప్రనారాయణునే తొండిరడిప్పొడి ఆళ్వార్.. అనీ అంటారు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  *ఆరయ విప్రుని శీలము*

  *తీరగు వజ్రమ్ము.. దేవదేవి* *చెలిమితో*

  *నీరయ్యె.. నామె కనుగవ*

  *వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్*

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  24.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 33. తూరుపుఱేడు పంపగనె తోయలి మేనక నాశ్రమమ్మునన్
  చేరుచు గాధిజున్ తపము శీఘ్రమె భంగము జేయ మోహమున్
  మేరు తనూజ సోయగము మెచ్చిన తాపసి గేస్తుడయ్యె, యా
  వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే!!!

  రిప్లయితొలగించు
 34. కారణమెంచిచూడగనుకాశ్మిరరాజ్యముచింత గొల్పసం
  ధ్యారుణకాంతిరేఖమరిదారుణమారణకాండనిల్వరించిసా
  ధారణజీవనంబుననుధర్మమునర్థముపెంపుసేయన
  వ్వారిజపత్రమేతగులవజ్రమురెండుగచీలెచిత్రమై
  కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్,రంగారెడ్డి

  రిప్లయితొలగించు
 35. ఉ. ఆరని హింస నడ్డుకొని హాయిని నింపగ జీవితమ్ములన్
  తీరగు చట్టమున్ సభకు తెచ్చుచు కాశ్మిరు కేంద్ర మందగా
  భారత మాత హర్షమున బల్కె శుభమ్ము సమత్వమున్ గనన్
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ జీలె చిత్రమే!

  రిప్లయితొలగించు
 36. చిత్రం భళారే విచిత్రం:
  భూరిగ రాచకార్యములు ప్రోదిగ నున్నను మానసంబు యే
  మారిన దెట్లొ నేడనగ మాలిని! నీగమనమ్మునందు వ
  య్యారమొ నాట్యమో పలుకులందలి తేనియలో నితాంతశృం
  గారమొ మారలీలలివొ కారణ మేదియొ చర్చలేలలే
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ జీలె చిత్రమే!
  -----------------------------------

  సారమతిన్ వశిష్టముని సత్తమునిన్ గని పట్టుబట్టి కాఁ
  గోరియె తాపసాగ్రణిగ క్షోణివిభుత్వముఁ బోవదోసెనే!
  ఘోరతపంబు మాని సుమకోమలి మేనక వ్రేలుఁబట్టెనే?
  వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ జీలె చిత్రమే!

  రిప్లయితొలగించు
 37. కందం
  కోరుచుఁ గృష్ణన్ గీచకు
  డారితి తో వజ్రకాయుఁ డంతం బయ్యెన్
  మారుని పూ బాణమనెడు
  వారిజ పత్రమ్ము సోకి వజ్రము చీలెన్

  రిప్లయితొలగించు


 38. ౧.పోరియు రణమున నోడిరి
  కోరినవరముల నొసగియు ఘోరమదేమో
  కోరకనోటరు దేవుడు
  వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్!!


  ౨.భూరిగ చేసి బాసలను పోరున గెల్చిరి
  దేశమంతటన్
  పారెను వారిపాచికలు పాలకులైరి
  మరొక్కమారు,యిం
  పారెడు చట్టముల్ ప్రజల బాగును
  గోరుచు జేసిరెన్నియో
  వారిజ పత్రమే తగిలి వజ్రమె రెండుగ చీ
  లె చిత్రమే!! ,

  --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  రిప్లయితొలగించు