4, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3095 (కలము విడిచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలము విడిచి మేటి కవిగ వెలిఁగె"
(లేదా...)
"కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై"

58 కామెంట్‌లు:

 1. బలగత శ్లేషతో రచన భావమునందున ఠీవితోడ నే
  మలుపు సమస్యనున్నను మరల్చుచు జెప్పెడు బుద్ధితోడవన్
  అలయక వేలపద్యములనాశువు కొప్రపు వర్యుడయ్యడన్
  కలము త్యజించి మేటికవిగా యశమందెనొకండు ధాత్రిపై
  Rohit 🙏🏻🙏🏻🙏🏻

  కొప్పరపు కవిసోదరులలో ఎవరికైనా వర్తించును.. ఆసువుల కావ్యమల్లిరి వారికి కలమెందులకు.. మహాత్ములు

  రిప్లయితొలగించు
 2. రోహిత్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'బలగత శ్లేష' అన్నపుడు 'త' గురువై గణదోషం.

  రిప్లయితొలగించు
 3. ప్రాతః కాలపు సరదా పూరణ:

  అలరెడి ప్రీతి తోడుతను హాయిగ వ్రాయుచు వ్హాటుసప్పునన్
  పలువురు బంధువుల్ పొగడ వందలు వేలుగ పద్యముల్ మహా
  ఫలమును బొందుచున్ వడిగ ఫక్కున నొక్కుచు స్మార్టుఫోనునన్
  కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై
  ....

  రిప్లయితొలగించు
 4. ఆశు కవిత లంచు నానంద ముగబల్కి
  మధుర గాన మందు సుధలు కురియ
  జనుల మదిని దోచి జగమంత నిండగ
  కలము విడిచి మేటి కవిగ వెలిగె

  రిప్లయితొలగించు
 5. బలగతపద్యధార రచన భావమునందున ఠీవితోడ నే
  మలుపు సమస్యనున్నను మరల్చుచు జెప్పెడు బుద్ధితోడవన్
  అలయక వేలపద్యములనాశువు కొప్రపు వర్యుడయ్యడన్
  కలము త్యజించి మేటికవిగా యశమందెనొకండు ధాత్రిపై
  Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  కొప్పరపు కవిసోదరులలో ఎవరికైనా వర్తించును.. ఆసువుల కావ్యమల్లిరి వారికి కలమెందులకు.. మహాత్ములు

  రిప్లయితొలగించు
 6. చేత కలముఁ బట్టి సృష్టించు కావ్యాలు
  కలము లేని నాడు కవియె లేడు
  కవికి యాయుధమ్ము కలము గాదె యెవండు
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె?

  రిప్లయితొలగించు
 7. కలతజెందె మిగుల కలవర మొందుచు
  రచన సలుప లేక రమ్యముగను
  శంకరార్యుని దయ సాహిత్యమందు వి
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  రిప్లయితొలగించు
 8. బాధకు నిలయమని భవబంధనమ్ములన్
  విడచి యరిగె తానె వేమయోగి
  తెలిపె జగతి కెల్ల తేట తెల్లముగ స
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  రిప్లయితొలగించు
 9. భోగ లాలసుండు రాగబంధాలలో
  చిక్కు కున్ననేమి చివరి కతడు
  భోగ మన్న రోసి యోగిగా మారి స
  కలము విడిచి మేటి కవిక వెలిఁగె

  రిప్లయితొలగించు
 10. రిప్లయిలు
  1. కలము పట్టి ఆశు కవితలు రాయుచు|
   దినము రేయి గడుపు దీక్ష తోడ |
   అన్న పాన యాశ యనునది లేక స |
   "కలము విడిచి మేటి కవిగ వెలిఁగె"

   తొలగించు


 11. నా పూరణ. చంపకమాల
  ***** **** ***

  కలవరపాటు జెందకను కంజుని రాణి సరస్వతీ కృపన్

  పలువురు సన్నుతించగను పద్యములాశువుగాను మిన్నగా

  నలరెడి రీతిగన్ నుడివి ఖ్యాతిని పొందుచు తా కలంబు,కా

  కలము ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించు
 12. పారిపోవు నాదు ఘోరాఘసంఘంబు
  కావ్యసృష్టిచేత ఘనత కలుగ
  గలదటంచు నొకడు తలచి వ్యధలను స
  కలము విడిచి మేటి కవిగ వెలిగె.

  రిప్లయితొలగించు
 13. మైలవరపు వారి పూరణ

  పలుకుల భావపుష్టినిడె భారతి., వ్రాయుట బద్ధకమ్ముగా ,
  దలచెను విష్ణుపత్ని , దయఁ దల్లి మహావిభవమ్మునీయగా
  నలుగురినెంచె వ్రాయుటకు., నైపుణి వ్రాయుచునుండ వారలున్
  కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 14. (మొదట భావకవిగా పద్యాలు వ్రాసిన శ్రీశ్రీ
  అభ్యుదయకవిగా గేయాలతో విరాజిల్లారు)
  గనియు పొలము వనము కార్ఖాన లందలి
  జనుల గాంచి మిగుల చలితుడగుచు
  చేసి గేయరచన శ్రీశ్రీయె పద్యస
  కలము విడిచి మేటికవిగ వెలిగె .

  రిప్లయితొలగించు
 15. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వలపున మేటి కావ్యమును వ్రాయగ నెంచుచు నాతడుండహో
  కలమది తాతగారిదట కమ్మగ ముద్దిడి చేతబూనగా
  బిలబిల యింకు లీకవుచు భీషణ రీతిని కక్కగానికన్
  బలుపగు బాలు పెన్నుకొని పండుగ జేయుచు తాతగారిదౌ
  కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై😊

  రిప్లయితొలగించు
 16. భోగి యైన వేమ యోగిగా మారుచు
  నాటవెలదిలోన నద్భుతముగ
  నిత్యసత్యములను నెరిగించె ధరకు స
  కలము విడిచి మేటి కవిగ వెలిగె !!!


  రిప్లయితొలగించు
 17. సాటిలేని రీతి స్మార్టుఫోనులు నుండ
  యిలను వ్రాయు నెవరు కలము బట్టి
  సంతసముగ నొకడు శతకములు రచించి
  కలము విడిచి మేటి కవిగ వెలిగె !!!

  రిప్లయితొలగించు
 18. ఇలఁ గన కావ్యముల్ జదువ కాలము వ్యర్థమటంచు నెంచుచున్
  బలువురు చెప్పగాను విని పండితు డంత సమాజ శ్రేయమున్
  దలచుచు నాతడాశువుగ దండిగ పద్యములెన్నొ చెప్పగన్
  గలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై.

  రిప్లయితొలగించు
 19. తలపునంటి వచ్చు పలుకులఁ వ్రాయగా
  ఆధునికత తెచ్చె సాధనములు,
  చదువులమ్మమెచ్చు సాంకేతికతశోభ,
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె..

  రిప్లయితొలగించు
 20. సమత మమత బెంచు చక్కని కవితల
  వ్రాయ బూని సుకవి రాణకెక్కి
  సాహసాన తాను జంకక సతము వి
  కలము విడిచి మేటి కవిగ వెలిగె

  రిప్లయితొలగించు
 21. ప్రజల కోసము గద పద్యములన్నియు
  యనెడు చింతఁగలుగు నార్యుడొకడు
  ప్రభువు మెప్పు పొందు పాండిత్యపుం గ(క)ల
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  రిప్లయితొలగించు
 22. శ్రీ గురుభ్యోన్నమః🙏
  పిట్టా వారిని స్మరిస్తూ....

  ఆంగ్లమందు పిట్ట యధిక బండితుడయ్యు
  తెలుగు వెలుగుజూపె తేటముగను
  సద్గతులను బొందె సత్యశోధకుడు పా
  కలము విడిచి మేటి కవిగ వెలిగె.

  పాకలము-ప్రాణము

  రిప్లయితొలగించు
 23. ఆటవెలది
  ఛందమనునదొట్టి చాదస్తమనియెంచి
  వచనకవిత వ్రాసి వాసికెక్కి
  పిదప శంకరార్యు వేదికఁ జేరి మొ
  క్కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  (మొక్కలము మూర్ఖత్వము)

  చంపకమాల
  పలుకఁగ నెంచ నేను హరి భాగవతమ్ము ధరాత్మజా విభుం
  డొలుకఁగ జేసె! బ్రహ్మసతి కొట్టుగఁ గూళల కీయనంటి నే
  కలిమినిఁ గోర నాగళిని కైగొనె దంచు, ధనమ్ము పైని మొ
  క్కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై

  రిప్లయితొలగించు
 24. మా పితృదేవుల స్మరణతో🙏

  విలువ గల్గి నట్టి వేదఁబండితుఁడయ్యు
  ధనము గోర లేదు ధరణి నెపుడు
  ప్రీతి దోడ మమ్ము పెంచిన దండ్రి పా
  కలము విడిచి మేటి కవిగ వెలిగె

  పాకలము-ప్రాణము
  కవి-పండితుడు

  రిప్లయితొలగించు
 25. కాగి తంబు వద్దు కలముల పనిలేదు
  అన్నితానెయయ్యి అవతరించె,
  స్థిరము చరము తాను చరవాణి నెంచగా
  కలము విడిచి మేటి కవిగ వెలి‌గె
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
 26. గరిక పాటి వారిగళము నుండిసుధలు
  జాలువాఱుచుండి జనముమెచ్చ
  కలమువిడిచి మేటికవిగ వెలిగెనార్య!
  గరికపాటివంశ కవితిలకుడు

  రిప్లయితొలగించు
 27. జానపదుల నోట జాను తెన్గు పలుకు
  పల్లె పదములందు పల్లవింప
  తీరు మార్చి తాను తీయగా పాడుచు
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  రిప్లయితొలగించు
 28. రాష్ట్ర విభజనమున లక్షణముగనుండు
  పట్టణమున ప్రాంత వైర మొసగు
  నల్లరులను పెంచునట్టి రచనలు స
  కలము విడిచి , మేటి కవిగ వెలిఁగె

  రిప్లయితొలగించు
 29. గంటములనువిడచె కష్టమనితలచి
  కలము వాడదొడఁగె కవివరుండు
  కలముకన్నమేలు కంప్యూటరనియెంచి
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  రిప్లయితొలగించు
 30. కులము మతము లంచుఁ గొంచె మైనను భేద
  ముంచ కుండ గుణము లెంచి పంచు
  నంచి తంపు నుడులు వంచక జన కల
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె


  పల కలనా సురాది రస పాన విరక్తుఁడు దైవ భక్తుఁడున్
  సలలిత శబ్ద భావ విల సత్కవితా ప్రియ మానసుండు ని
  ర్మల రచనా ధురంధరుఁడు మానవతీ లలి తాంగ వర్ణ పు
  ష్కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై

  రిప్లయితొలగించు
 31. అర్ధము కొరకర్ధమసలు లేనట్టిదై
  చలన చిత్ర రచన సాగు చేసి
  బుద్ధి తెలుసు కొనిన బూతు రచనఁ జేయు
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  డబ్బు కోసం అర్ధం పర్ధం లేని రచనలు సినిమా రంగంలో చేసి, కొన్నాళ్ళకు బుద్ధి తెచ్చుకుని బూతు రచనలు వదిలిపెట్టి మంచి కవిగా పేరు గడించాడు.

  రిప్లయితొలగించు
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 33. కలముద్యజించి మేటికవిగా యశమందెనొకండుధాత్రిపై
  యలరుచు నాశువున్ భువినినందముగల్గుసుపద్యమాలలన్
  బలువిధపోకడల్ సదువ పాఠకలోకముసంతసిల్లగా
  బలిబలియంచునచ్చటిసుపండితులందఱుమెచ్చిరేసుమా

  రిప్లయితొలగించు


 34. అలసె సొలసె విసిగె నావల నీవల
  తిరిగె దేశ మంత తీవ్ర మయ్యె
  తపన; చేసె తపము తట్టని తాను స
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె !


  జిలేబి

  రిప్లయితొలగించు
 35. గణపతిని పిలిచెను గాథను చెప్పెను;
  భారతము పలుకగ పంచ వేద
  మాయె; వ్యాసుడాయె మహిలోన గురువు, తా
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె!

  రిప్లయితొలగించు
 36. శంకరాభరణం వారి సమస్య కు నా ప్రయత్నము:
  🙏🙏🙏🙏🙏🙏🙏
  తలపుఁ బదమ్ము నెంచి తనదైన నిగూఢపు శైలి తోడనా
  లలిత సుభావరీతిఁ సభయందునొసంగిన వెంటనే సమ
  స్యలఁ సరసంపు పూరణల నత్తరిఁ దెల్పగ శుక్లవర్ణ కా
  కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై

  కవులు భావములను కవనము లల్లగ
  జనులు చదివి మదులు సంత సింప
  కలతలున్న గాని, కసటు నొందకను స
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

  ...మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 37. శంకరాభరణం వారి సమస్య కు నా ప్రయత్నము:
  🙏🙏🙏🙏🙏🙏🙏
  తలపుఁ బదమ్ము నెంచి తనదైన నిగూఢపు శైలి తోడనా
  లలిత సుభావరీతిఁ సభయందునొసంగిన వెంటనే సమ
  స్యలఁ సరసంపు పూరణల నత్తరిఁ దెల్పగ శుక్లవర్ణ కా
  కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై


  కవులు భావములను కవనము లల్లగ
  జనులు చదివి మదులు సంత సింప
  కలతలున్న గాని, కసటు నొందకను స
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె
  ....మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 38. ఆశువందుపలికి నానందమందించు
  అవధానమందు కవనమెల్ల
  సృష్టి జేయగలుగు పుష్టి నాగపణియే
  కలమువిడిచి మేటికవిగవెలిగె!

  రిప్లయితొలగించు
 39. కలమును కాకలమ్ములను కైతలకైనుపయుక్తమొందఁ నా
  కులమగు గంటమున్ విడచి కూరిమినుండిరి నాటి సత్కవుల్
  కలవరపాటులేకిపుడు కంప్యుటరమ్మనునమ్మి వేడ్కతో
  కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందెనొకండు ధాత్రిపై

  రిప్లయితొలగించు
 40. ఆ.వె//
  చంద్రశేఖరునకు గండ్రగొడ్డలి లాంటి l
  కవిత బుట్టినంత కవుల బిలచి l
  నోటి మాట జాలు నోట్సు రాయననుచు l
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె ll

  రిప్లయితొలగించు
 41. ఆ.వె//
  ఆంధ్ర కవులలోని అల్లసాని కవిత l
  లల్లికలను జూచి లయముజెంది l
  పట్టు బట్టి రైతు పలుగు, పార నొదలి l
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె ll

  రిప్లయితొలగించు
 42. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  *"కలము విడిచి మేటి కవిగ వెలిఁగె"*

  సందర్భము: కలము కమ్మ (కాగితం) తలపు విడిచిపెట్టి చెప్పు మన్నారు. అంటే కలము కమ్మలయొక్క తలపు అని.
  అతడు కలము కమ్మ తలపు మూడూ విడిచిపెట్ట మంటున్నారేమో అని.. కలము కమ్మలతోబాటు తలపు (భావం) కూడా విడిచిపెట్టి కవిత చెప్పాడు.
  ఇంకేం? అడ్డదిడ్డమైన ఆశువు తయారయింది. ఇక మేటి కవి ఎలా అయినాడు?
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కలము కమ్మ తలపు దొలగఁ బలుకు మన్నఁ

  దలపు గూడఁ దొలగ పలికినాడు..

  అడ్డదిడ్డమైన యాశు వాయె, ని కెట్లు

  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె?"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  4.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 43. చిత్త మందు తలపు చేకూరి నంతనే
  వ్రాయ సాగె కవియు వాసిగా ను
  పుటల మీద గాక ఫోనుల యందున
  కలము లేక మేటి కవిగ వెలిగె

  రిప్లయితొలగించు
 44. వాణి పాద పద్మ భవ్య సమర్చన
  చేయు గొప్పవాడు శ్రీకరుండు
  కలిమి వదలి వసుధ ఘన యశమున కల
  కలము విడిచి మేటి కవిగ వెలిఁగె.

  రిప్లయితొలగించు
 45. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు