17, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3106 (కాంతను వలచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతను వలచి యోగిగా గణుతికెక్కె"
(లేదా...)
"కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

36 కామెంట్‌లు:

 1. పరమ పదమొసంగెడు భవ్య పథమటంచు
  భార్య పుత్రులనెడు భవ బంధములను
  వీడి సాధనమ్మును జేయ వాడు, మోక్ష
  కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె

  రిప్లయితొలగించు
 2. బుద్ధి వక్రించి వేమన హద్దు మీరి
  నిల్లు వాకిలి విడనాడి నింతి వలను
  చిక్కి బికారి గామారి సొక్కి తుదకు
  కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె
  రాజేశ్వరి. నేదునూరి .

  రిప్లయితొలగించు
 3. కాంతను వలచి యోగిగా గణుతి‌ కెక్కె,

  యెటుల సాధ్యమౌ భువిలోన, యిటుల లేని

  పోని వన్ని మాకు నిడుచు హాని చేయ

  సంతసం బెటుల దొరకు శంకరార్య

  రిప్లయితొలగించు
 4. భోగభాగ్యాల తోడనే భువిన వెలిగె
  మున్ను సౌఖ్యాలనన్నింటి మురిపెమలర
  కోటి కోర్కెల విడనాడె కూర్మితోడ
  కాంతను వలచి, యోగిగా గణుతికెక్కె!

  రిప్లయితొలగించు
 5. సంగములు వీడి సద్భక్తజనుల గూడి
  నియమముల నెంచి నిష్ఠలో దృఢత గాంచి
  యొకడు చిత్తంబు శివునిపై నునిచి, ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె.

  సంతోషమ్మున ధర్మపాలుడచటన్ సమ్యగ్విధానంబునన్
  గాంతుల్ నిండిన మంటపంబు పయినన్ గాంక్షించి పెండ్లాడి యా
  చెంతం జేరిన ధర్మపత్ని కనియెన్ శ్రీమంతుడౌ మిత్రు డో
  కాంతా! "లోలుఁడు" యోగిగా గణుతికెక్కెన్ సాత్త్వికుల్ మెచ్చఁగన్

  రిప్లయితొలగించు
 6. ప్రాతః కాలపు సరదా పూరణ:

  శాంతంబొప్పగ రాజధాని సరణిన్ జంబమ్ముతో యోగముల్
  వంతల్ దీర్చునటంచు చూపి నగుచున్ బ్రహ్మాండమౌ తీరునన్
  చింతల్ దీర్చుచు కాశ్మిరమ్మున మహా శృంగారియౌచున్ యశః
  కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కెన్ సాత్త్వికుల్ మెచ్చఁగన్

  రిప్లయితొలగించు
 7. నశ్వరముదేహమాత్మ యనశ్వరమ్ము
  విశ్వమున సకలమ్ము లశాశ్వతమ్ము
  లనుచునెరుకనుబొందగఁ నతఁడు మోక్ష
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె

  రిప్లయితొలగించు
 8. కాంత పరిరమ్భ సౌఖ్యమ్ము కన్న వేరు
  నాక మెయ్యెడ లేదని నమ్మి తుదకు
  తత్త్వ మవగత మైన వేదాంతి ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె

  రిప్లయితొలగించు
 9. తేటగీతి
  భుక్తిఁ గలిగిన 'వేమన' రక్తి కెగిరి
  నిజముఁ దెలిసిన వాడౌచు నేలజారి
  తేటతెల్లపు నీతుల నాటవెలఁది
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె

  శార్దూలవిక్రీడితము
  సంతోషమ్మన మోవిజుర్రుకొనుటల్ సంయోగమేనంచు నే
  కాంతమ్మైంచుచు విశ్వదన్ మరిగి విజ్ఞానమ్ము మేల్గాంచు వృ
  త్తాంతంబందున రోత యయ్యదని పద్యమ్మెంచి వేమాఖ్యుడన్
  గాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే!

  రిప్లయితొలగించు


 10. చెంతన్ చేరుచు గుబ్బలాడులను ముంచెత్తించి మోహమ్ముతో
  భ్రాంతిన్ తేలుచు తూలి తూలి బతుకున్ బాజారు పాల్జేసి తా
  చింతాక్రాంతుని గా విరక్తిని విభున్ సేవించి చేపట్టుతో
  కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్, సాత్త్వికుల్ మెచ్చిరే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 11. భార్యను విడిచి చల్లగుబ్బలిని చేరి
  ధ్యానమున మునిగె నతడు ధ్యాస బ్రహ్మ
  కమలమును దాటె! వేలుపు కరుణ ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె!


  జిలేబి

  రిప్లయితొలగించు

 12. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కాంతల్ పెక్కురు తోడ నాడుచునునే కంగారు లేకుండ తా
  చెంతన్ జేర్చుచు వేల వేల సతులన్ శ్రీకృష్ణుడే ప్రీతినిన్
  సంతోషంబిడు బోలెడిన్ నుడువుచున్ శ్రావ్యంబులౌ యోగముల్
  కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చఁగన్


  బోలెడిన్ శ్రావ్యంబులౌ యోగముల్ = 18

  రిప్లయితొలగించు


 13. ఆకాశవాణికి పంపినది


  ఎంత యో చదివెను భళి యెంతయో తి
  రిగెను దేశములెల్లెడ, రివ్వున చని,
  తిరముగ హిమాలయమున విదేహ ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె!


  జిలేబి

  రిప్లయితొలగించు
 14. పరము నాశించి జీవుడు పరగువేళ
  ఇహము నందలి కోరిక లెల్ల విడిచి
  తపము సేయంగబూను నత్తఱిని ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె

  రిప్లయితొలగించు
 15. బంధనమ్ముల బడకుండ భక్తుడొకడు
  చింతలనువీడి సతతము చిత్తమందు
  ముంజకేశుని దలచుచు భువిని ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె !!!

  రిప్లయితొలగించు
 16. * స్వామి నిత్యానంద.
  తే.గీ//
  రాసలీలలోన ఘనుడు రాజభోగి l
  భాగ్యశాలి, యద్వైత యోగి భాగవతుఁడు l
  పరమహంస నిత్యానంద పరమగురువు l
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె ll

  రిప్లయితొలగించు
 17. తే.గీ//
  వినుతికెక్కెను పద్యాలు విశ్వమునకు l
  బోధ జేసెను నీతిని సాధకుడిగ l
  యోగి వేమన భువిపైన భోగిగాను l
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె ll

  రిప్లయితొలగించు
 18. కామి గాక కోరడు గ మోక్షమను రీతి|
  వేమన రచించె పద్యంబు విముఖి యవగ|
  భోగి యవక కాలేడుగ యోగి యనుచు |
  "కాంతను వలచి యోగిగా గణుతికెక్కె"

  రిప్లయితొలగించు
 19. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నిశ్చయమ్ముగ కాయమ్ము నిలువకుండు
  సంపదలు భోగములు సతి సంతు లెల్ల
  మిథ్య యనుచు నతడచరమైన ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె.

  రిప్లయితొలగించు
 20. మైలవరపు వారి పూరణ

  ఇంతుల్ గూర్చు సుఖమ్మె స్వర్గమని తానెంతేన్ భ్రమింపన్., మన..
  శ్శాంతిన్ కోల్పడి., భక్తుడొక్కరుడు శ్రీ చాగంటి కోటేశ్వరో...
  పాంతప్రాంతము జేరి., బోధ వినుచున్ వైరాగ్యభావమ్మునన్
  కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే.!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 21. తే.గీ//
  రాజ,కర్మ,భక్తియు,జ్ఞాన భోజకుడుగ l
  విశ్వశాంతికై పోరాడి వినుతికెక్కి l
  సాధు శ్రీ వివేకానంద సాత్వికమగు l
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె ll

  రిప్లయితొలగించు
 22. స్వంత మౌను నాకు సకల సంపదలను
  భ్రాంతి విడనాడి మదిలోన భక్తి నిలిపి
  శాంత చిత్తుండగుచు కోరి శమము ముక్తి
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కాంతా మోహితుడై సదా సరస సౌఖ్యాసక్తుడై మెల్గినన్
   భ్రాంతిన్ వీడి విరక్త తప్త మతియై వైరాగ్య భావమ్మునన్
   అంతర్లోచన ప్రేరితంబులగు పద్యంబుల్ ప్రసాదించి యా
   కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే

   తొలగించు
 23. పాపకర్మలుసేయకపరమపదము
  జేరుకొఱకునైనిత్యము శివునిగురిచి
  పూజజేయగ శ్రద్ధను బొసగుముక్తి
  కాంతనువలచియోగిగాగణుతికెక్కె

  రిప్లయితొలగించు
 24. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కాంతాలోలుఁడు యోగిగా గణుతి కె
  క్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే!

  సందర్భము: గోలోక సంప్రదాయం ప్రకారం ధ ర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములకంటే ఉన్నతమైనది దివ్య ప్రేమ. అది ఐదవ పురుషార్థం. దాని ముందు మోక్షం కూడా తక్కువదే! నిర్వ్యాజమైన పరమ ప్రేమ ఒక్కటే తపస్సు. అదే ప్రేమ తపస్సు.
  ఆ తపస్సే గోపికలు చేసింది. అదే ప్రేమ స్వరూపుడైన కృష్ణుని వద్దకు శీఘ్రంగా చేర్చగలిగేది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అంతా ప్రేమమయంబు.. దేహ సుఖ మా
  వంతేనియున్ లేనిదై
  వింతౌ పంచమ పూరుషార్థ మనగా
  వెల్గొందు నా ప్రేమ ముం
  దెంతో చిన్నది ముక్తి యంచుఁ దెలిపెన్
  గృష్ణుం డహో! కాడుగా
  కాంతా లోలుఁడు! యోగిగా గణుతి కె
  క్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే!

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  17.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 25. తే.గీ//
  ధన్యులైరి భరతజాతి ధాత్రిలోన l
  యోగపుంగవు లందున యోగ్యుడైన l
  శ్రీ పతంజలి సహృదయ శీల వైద్య l
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె ll

  రిప్లయితొలగించు
 26. రిప్లయిలు
  1. చిన్మయస్వరూపునిఁ గృష్ణుఁ జిత్త మందు
   నిల్పి పంచేంద్రి యాలోల నిరతి వెల్గి
   సదసదర్థ నిష్ఠా గరిష్ఠతమ యోగ
   కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె

   [పంచేంద్రియ + అలోల నిరతి]


   సంతోషార్త ముఖ ద్వయావళుల నిస్సంగుండు సందిగ్ధ వి
   భ్రాంతిక్షీణ నరుండు సద్గుణ సు సంపన్నుండు నజ్ఞాన హృ
   ద్ధ్వాంతఘ్నుండు సుధీ జనోత్కర సు సంభావ్యుండు నిక్కంబుగాఁ
   గాం తాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే

   [కాంతా +అలోలుఁడు = కాంతాలోలుఁడు ]

   తొలగించు
 27. గాధిజు తప మెందులకు విఘాత మయ్యె,

  జనులెటుల పిల్చు నిచట వేమనను సతము,

  తిరుమలగిరి ప్రపంచాన తిరుగు లేక,

  కాంతను వలచి,యోగిగా,గణుతి కెక్కె

  రిప్లయితొలగించు
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 29. కాంతాలోలుడు యోగిగాగణుతికెక్కన్ సాత్త్వికిల్ మెచ్చిరే
  కాంతాలోలుడుమార సాత్త్వికుడుగాగామారియాశీస్సులే
  సంతుల్మెత్తురుతప్పకుండగ మహాసంతోషమొప్పారగా
  నంతేవాసుల బుద్ధులెప్పుడునునానందేశుపైనుండుగా

  రిప్లయితొలగించు
 30. వింతేమున్నది లోకరక్షకుడు విశ్వేశుండనే కొల్చుచున్
  గాంతల్ శ్రీలు నశాశ్వతమ్మనుచు సత్కార్యమ్ముతో జాతికిన్
  సంతాపమ్మును దీర్చగన్ విడుచుచున్ స్వార్థమ్మునే తాఁ యశః
  కాంతాలోలుడు, యోగిగా గణుతి కెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే.

  రిప్లయితొలగించు


 31. ఆకాశవాణి వచ్చే వారపు సమస్య ఈ వారపు విశేషాలు‌ తెలుపగలరు  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వచ్చే వారపు సమస్య:

   "వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే"

   జిలేబి @ బెంగులూరు, పేరు చదువబడినది.

   ఈ వారం నేను పూరణ పంపలేదు...తేటగీతి సమస్యకు ప్రొటెస్ట్ గా 😊

   తొలగించు
 32. ఆశ్రమములు మూడింటిని యాచరించి
  చేరి వనమును తపమందు చేసి మోక్ష
  కాంతను వలచి యోగిగా గణుతికెక్కె"*
  సాత్త్వికుండొకడు తమితో జగతి యందు.

  రిప్లయితొలగించు