పరీక్షిత్తు భార్య మాద్రవతి. తన భర్తకు మరణము వారము రోజులలో తధ్యము అని తెలిసి దానిని ఆ శ్రీ కృష్ణుడు ఒక్కడే అపగలడు, అతనినే వేడు కొందును అని తలచు సందర్భము (మాద్రవతికి మామ అభిమన్యుడు అభిమన్యునకు మామ కృష్ణుడు )
వేటకు జని పతి వేసెను ముని మెడపై మరణించిన పన్నగమును. దీటుగ బడసెను తిట్టునొకటి ముని తనయునిచే, కల్గు తన ధవునకు మరణము రయముగ, శరణము కోరెద దేవకీ పుత్రుని దేహి యనుచు, వినుము,,మామకె మామ గనునిల్చు మాన్యుని గొలుతున్, విధుడు పచ్చ విలుతునయ్య , నల్ల దేవర ,కరివేల్పు, నగధరుండు గిరి ధరుడు, కాచును పతిని సరస గతిగ ననుచు మాద్రవతి తెలిపి ఘనత తోడ పూజ జేసె పరీక్షిత్తు పొలిని నిలుప
శ్రీమతి తోయరాట్టునకు చెన్నుకొమార్తె! సముద్రుడైన నా మామకు భార్య గంగను కొమార్తెగ గాంచిన విష్ణుడాతడౌ! మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్ రామను భార్య గానిలిపి రాజిలె పృథ్విని వేంకటేశుడై!
సుయోధన ఉవాచ: మామకపు కులక రణ మా మామకు టపు మామలెల్ల మల్లెగ మోసిన మామకుడగు మాన్య శకుని మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
కులక రణము - మయా జూదములో (కులభుషణాత్వముకై పోరున), మామకపు - నాదైనది, మా - శ్రీ ( విజయ శ్రీ), అట్టి రాజ్యమును సుయోధనుని మనసెరిగి రాజ్య వ్యవహారములు చూచిన శకుని మామకు మామ గాంగేయుడగు భీష్ముడిని కొలిచేదను అను సందర్భములోనిది.
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిగోముగ భారతావనికి గొప్పగు తీరు ప్రధానమంత్రిగా
నీమము లన్నియున్ నిలిపి నిక్కపు రీతిని సేవజేయుచున్
కోమలి సోనియమ్మకట కొండొక తీరున ఖ్యాతినొందినన్
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికందం
రిప్లయితొలగించండికామితములొసఁగు లక్ష్మిని
భామినిగా నంది వాని పాదజ గంగన్
ప్రేమగ సాగరుఁ జేర్చిన
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
పండితోత్తములు శ్రీ వెలుదండ వారి సూచిత సవరణతో...
తొలగించండిప్రేమగ సాగర కన్యను
భామినిగా నంది వాని పాదజ గంగన్
ప్రేమగ సాగరుఁ జేర్చిన
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన మూడవ పాదంతో
తొలగించండికందం
ప్రేమగ సాగర కన్యను
భామినిగా నంది వాని పాదజ గంగన్
భూమిని సాగరుఁ జేర్చిన
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
మామక భీష్టము దీర్చుచు
రిప్లయితొలగించండిభూమిజను వివాహమాడి భూమికి భారం
బా మైథిలి మిష నణచిన
*"మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్"*
సామజ రక్షణార్థమయి చక్రము నంపె విభీషణాదులన్
రిప్లయితొలగించండిస్వామిగ చేరదీసె భువి భారమణంచ దశావతారుడై
నీమము తోడ భక్తులకు నీడగ తోడుగ నిల్చె నెవ్వడా
*మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్"*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికాముని తండ్రి సాగరునికై నతులిచ్చుట యేరికోసమో?
రిప్లయితొలగించండిరాముని చెంగటన్ జనకరాజు మనంబుననేమి కోరెనో?
శ్యామల కోమలాంగుని,రసాత్మకు,వెన్నుని నేమిఁజేతునో?
మామకె-మామగను నిల్చు-మాన్యునిఁగొలుతున్.
క్రమాలంకారంలో పూరణ
ఆర్యా మొదటి మూడు పాదములు వృత్తము చివరి పాదము కందము సరి కాదేమో అని నా అభిప్రాయము సుమా
తొలగించండిప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వృత్తపాదానికి బదులు కందపాదాన్ని పేస్ట్ చేసారు.
ఔను పొరపాటుకు క్షంతవ్యుడను
తొలగించండినీమము వీడక వెలుగును
రిప్లయితొలగించండిభామిను లగుతార లపతి బాసంతు డటన్
క్షేమము గోరుచు దక్షుడు
మామకు మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమామ యటంచు బిల్చెదరు మామిడిపూడి మనోహరున్ జనుల్.!
ప్రేమగ వాని బిల్చి తన పిల్లనొసంగిన మాధవుండు., నెం...
తో ముదమార కాన్కలిడ , తుష్టిని నల్లుడు బల్కె నిట్టులీ...
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిశ్రీమతిగా రమాలలన సింధుజఁ గొన్న మహానుభావుడా
తొలగించండిశ్రీమధుసూదనుండు దలచెన్ తన పాదజ యైన జాహ్నవిన్
ప్రేమగ నబ్ధి జేర్చగ.., విరించి యనెన్ హరి గాంచి నవ్వుచున్
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్.!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండికుమారస్వామి ఆకాశరాజు
నామాలసామికి సతిగ
రామను నాకాశరాజు రాణిగ నిల్పెన్
నే మాతృనందనుడ! నా
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(రామయ్యగారు యువకవి రాఘవశర్మ కావ్యాన్ని అంకితం తీసికొని అల్లుడైనాడు .తన పుత్రిక మాలతిని అతనికిచ్చి
రిప్లయితొలగించండిపెండ్లిచేసి మామకి మామ అయినాడు. రాఘవశర్మ కూడా అల్లునికి అల్లుడైనాడు .చిత్రం!విచిత్రం !!)
కోమలకావ్యకన్యకను
కూరిమి చేకొనె ;స్వీయపుత్రికన్
మామకు సంతసంబుగ స
మర్పణ జేయుచు బెండ్లిచేసె నా
రామయ మాలతిన్ సుకవి
రాఘవశర్మకు నిచ్చి ;చిత్రమే !
మామకె మామగా నిలిచి
మాన్యత గన్న ఘనున్ స్తుతించెదన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికాముని గాల్చిన వాడై
రిప్లయితొలగించండిమామకు బుద్ధిని గఱపిన మహితాత్ముడునై
క్షేమంకరుడౌ ర.ద్రుని
మామకె మామగను నిల్చు మాన్యుని గొలుతున్
నాలుగవ పాదంలో రుద్రుని అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామను లక్ష్మిని జేకొని
రిప్లయితొలగించండిమామగ బొందెను నదీశు మారుగ గంగా
కోమలి పుత్రికగ గొనిన
మామకు మామగనునిల్చు మాన్యుని గొల్తున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
దోమల కాటులన్ మురిసి దొడ్డగు తీరున వంగభూమికిన్
భామను పొందగోరి చని వాగెడి జాబున ఖ్యాతినొందుచున్...
గోముగ కూతుకున్ మగని కోడలికిన్ ఘన పూజితుండునౌ
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్ 😊
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేటి శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండిమామకు మామగను నిల్చు మాన్యుని గొలుతున్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
పరీక్షిత్తు భార్య మాద్రవతి. తన భర్తకు మరణము వారము రోజులలో తధ్యము అని తెలిసి దానిని ఆ శ్రీ కృష్ణుడు ఒక్కడే అపగలడు, అతనినే వేడు కొందును అని తలచు సందర్భము (మాద్రవతికి మామ అభిమన్యుడు అభిమన్యునకు మామ కృష్ణుడు )
వేటకు జని పతి వేసెను ముని మెడపై మరణించిన పన్నగమును.
దీటుగ బడసెను తిట్టునొకటి ముని తనయునిచే, కల్గు తన ధవునకు
మరణము రయముగ, శరణము కోరెద దేవకీ పుత్రుని దేహి యనుచు,
వినుము,,మామకె మామ గనునిల్చు మాన్యుని గొలుతున్, విధుడు పచ్చ విలుతునయ్య ,
నల్ల దేవర ,కరివేల్పు, నగధరుండు
గిరి ధరుడు, కాచును పతిని సరస గతిగ
ననుచు మాద్రవతి తెలిపి ఘనత తోడ
పూజ జేసె పరీక్షిత్తు పొలిని నిలుప
కందపాద సమస్యకు సీసంలో చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపదముల గురువు పాదములకు ముదముగ హృదయ పూర్వక అభివాదనము చేయుచు ధన్యవాదములు తెల్పుచూ
తొలగించండిపూసపాటి
రిప్లయితొలగించండిభెరి భెరి కాంప్లికేటడు రిలేషన్ షిప్పు మామకుమామ శ్రీమన్మహావిష్ణువు
శ్రీమతి తోయరాట్టునకు చెన్నుకొమార్తె! సముద్రుడైన నా
మామకు భార్య గంగను కొమార్తెగ గాంచిన విష్ణుడాతడౌ!
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
రామను భార్య గానిలిపి రాజిలె పృథ్విని వేంకటేశుడై!
జిలేబి
మీ పూరణ మాత్రం కాంప్లికేటెడ్ కాదు. బాగుంది. అభినందనలు.
తొలగించండిఆమాలినికే తండ్రయి
రిప్లయితొలగించండినా మంధిరు పుత్రి లక్ష్మి కార్యుడు దానై
నా మధుసూదను, మాపతి
మామకె మామగను నిల్చు మాన్యుని గొల్తున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో బేసిగణంగా జగణం వచ్చింది. సవరించండి.
రాముని రూపము పురుషుల
తొలగించండిసమ్మోహ పరచు , పుడమిని సాటియె లేకన్|
నా మోహనాంగు, చందురు |
"మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిభామిని గిరిజను గైకొన
రిప్లయితొలగించండిమామగ దాబేరునొందె మాహేశునకున్
మామకుమామగుమేరుని
మామకెమామగనునిల్చుమాన్యునిగొలుతున్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినేమము తోడను పృథివికి
ధామము గూర్చెడి యుడుపుల ధవుడై చనునౌ
గ్రామణి యా ఘన చందురు
మామకె మామగను నిల్చు మాన్యును గొల్తున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితామర నేత్రు ననంతుని
రిప్లయితొలగించండిశ్యామల గాత్రుని వర గుణ సంశోభితునిన్
మామక పుణ్య ప్రదాతను
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
నిన్నటి దత్తపదికి నా పూరణ పరిశీలించ ప్రార్థన
రిప్లయితొలగించండిరామునికా కపీశ్వరుడు లంకను జానకి జాడ దెల్పగన్
ధీమతుడా రఘోత్తముడు దివ్య బలాస్త్ర యుతాతపమ్మునన్
నీమము బూని రావణుని నేలను గూల్చెను పాప కర్మునిన్
మామక పుణ్య మూలముగ మాన్యుని గాధ సుపద్యమందిటన్
🙏
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
తొలగించండిభామిని పార్వతీసతికిభర్తగు ధూర్జటిమామకున్దగన్
రిప్లయితొలగించండిమామగుమేరుపర్వతుడు మాన్యుడునౌటనునెల్లవేళలన్
వేమరుసారులున్మదినివీడక నెప్పుడుసాదరంబుగా
మామకెమామగానిలిచిమాన్యతగన్నఘనున్ స్తుతించెదన్
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధీమంతము పెంపారగ
రిప్లయితొలగించండిధీమతి యనిమిషులగురువు దివ్యజ్ఞానిన్
నీమముతప్పకచందుర
మామకె మామగను నిలుచు మాన్యునిఁ గొలుతున్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండియేమర కీవును మఱి మా
రిప్లయితొలగించండిమామకు మామ యగు వాని మాన్యుఁ గొలువుమా
యో మగువా విను నే మీ
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
భామ జనించి లక్ష్మి సిత వారిధిఁ గూరిమిఁ బెండ్లియాడె నా
కామిత దాయి విస్ణువు సకౌస్తుభ రత్న లసద్రమా పరం
ధామ పదోద్భ వాపగకు ధాత్రి సముద్రుఁడు భర్త యయ్యెనే
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి అభినందనలు
తొలగించండిమొదటి పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅవునండి. మళ్ళీ గమనించ లేదు.
రిప్లయితొలగించండిమామకు మామ !
జామాతయతడు సంద్రుని
కై, మామ సతిని కొమార్తె గా బడసె నహో
నామాల సామిగ వెలసె
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిజామాతై లక్ష్మిని తిమి
రిప్లయితొలగించండిదామపు సుతఁ బెండ్లియాడి, దభ్రమునకుఁ దా
వ్యోమతరంగిణి నిచ్చుచు
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిMalli siripuram
రిప్లయితొలగించండిశ్రీశైలం ప్రాజెక్టు నుండి.
కం.
మామగు దక్షుడు, చంద్రుని l
శామన మూర్తిగ గొలవక శాపము నివ్వన్ l
తామస ధారగు ధూర్జటి l
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్ ll
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి. *శ్రీ గురుభ్యో నమః*
రిప్లయితొలగించండిశంకరాభరణం-సమస్యాపూరణం
సమస్య :: మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్.
వస్త్రేణ వపుషా వాచా
విద్యయా వినయేన చ।
వకారైః పంచభి ర్యుక్తః
నరో భవతి పూజితః॥ అని విరించే ఆర్యోక్తి ననుసరించి
పంచ వకార సంయుతుడై మాన్యత గన్న విష్ణుమూర్తిని స్తుతించే సందర్భం.
పూరణ ::
మామగ మారె సాగరుడు *మా* సుత నిచ్చుచు విష్ణుమూర్తికిన్,
మామగ మారె విష్ణు వసమానుడు గంగ నొసంగి యబ్ధికిన్,
శ్రీమహితున్ జనార్దనుని శ్రీకరు పంచ వకార సంయుతున్
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్.
కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు. [13.8.2019]
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రీ గురుభ్యో నమః
తొలగించండిక్షేమము గూర్చు వాడెకద, శ్రీధరు డయ్యెను వీచిమాలినిన్
రిప్లయితొలగించండిమామగ పొందినట్టి హరి, మాలిక నిచ్చి యుదాకరమ్ముకున్
మామగ మారె కేశవుడు, మాయడు పద్మనాభునిన్
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేమగ జేరదీసె నట పిన్నతనమ్మునె తండ్రి జారగా
రిప్లయితొలగించండినీమముతోడ విద్యలను నేరిపి పెద్దను జేసి కూతు బెం
డ్లాముగ నిచ్చి దిద్దెనట రమ్యముగా తన భావి నట్టి మా
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్.
గోమిని తండ్రిసముద్రుడు
రిప్లయితొలగించండిమామగు నతనిసతి గంగ మతముగ సుతయౌ
తామరకంటికి, గావున
మామకెమామగను నిల్చు మాన్యుని గొలుతున్!!!
రిప్లయితొలగించండిమనువాడెను మనవరాలు మాలక్ష్మినహో!
జిలేబి
తొలగించండిసరికొత్త సమస్య పుట్టెను
తొలగించండిమనువాడెను మనవరాలు మాతను హరియే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండికామము హెచ్చుమీర కుజఁ గన్నులఁ గానక కొన్న వానిపై
భీమరమెంచుచున్ నడవ పేర్చఁగ సాగర సాయమెంచగన్
దా మదమెత్త రౌద్రమున దాల్చఁగ బాణము మ్రోలవాలెడున్
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
సుయోధన ఉవాచ:
రిప్లయితొలగించండిమామకపు కులక రణ మా
మామకు టపు మామలెల్ల మల్లెగ మోసిన
మామకుడగు మాన్య శకుని
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్
కులక రణము - మయా జూదములో (కులభుషణాత్వముకై పోరున), మామకపు - నాదైనది, మా - శ్రీ ( విజయ శ్రీ),
అట్టి రాజ్యమును సుయోధనుని మనసెరిగి రాజ్య వ్యవహారములు చూచిన శకుని మామకు మామ గాంగేయుడగు భీష్ముడిని కొలిచేదను అను సందర్భములోనిది.
పెద్దలు తప్పిదాలను తెలిపి తగు సూచనలీయ విన్నపము.
ప్రేమగ సుతనిడి శరధికి
రిప్లయితొలగించండిమామయు తానయ్యె జగతి మాధవుడెపుడో
కోమలి సింధుజను గొనుచు
మామకె మామగను నిల్చు మాన్యుని గొలుతున్.
మరొక పూరణ
జామాతయ్యెను సంద్రం
బామాధవునకు తనసుత నర్పింపంగన్
జామాతయు నైకడలికి
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్"*
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
మామకె మామగను నిల్చు మాన్యునిఁ
గొలుతున్
సందర్భము: గోము= సుకుమా రము, గౌరవము, గర్వము, ప్రేమ
అబ్ధి కుమారి=సముద్రుని కూతురు,లక్ష్మి
పాదోద్భవ= పాదంనుంచి పుట్టిన
గంగామరనది= గంగ యనెడు అమర నది.
విష్ణుమూర్తి సముద్రుని కుమారి లక్ష్మిని గైకొని సముద్రునికి యల్లుడైనాడు. తన పాద సముద్భవయైన గంగను సముద్రుని కిచ్చి అతనికి మామయైనాడు. మాన్యుడైనాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
గోముగ నబ్ధి కుమారిని
భామినిగా గైకొని నిజ పాదోద్భవ గం
గామర నది నబ్ధికి నిడి
మామకె మామగను నిల్చు
మాన్యునిఁ గొలుతున్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
13.8.19
-----------------------------------------------------------