14, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3104 (పువ్వులలో జ్వాల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్"
(లేదా...)
"మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో"

109 కామెంట్‌లు:

 1. నవ్వులు రువ్వుచు వనితలు
  సవ్వడి జేయంగ నిలను సరసము లాడ
  న్నివ్వల నవ్వల రసికత
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కొల్లలు కొల్లలౌ జనుల కోరిక తీరగ కాశ్మిరమ్మునన్
  పుల్లలు పెట్టు పాకులవి మూర్ఖపు గుండెలు తల్లడిల్లగా
  జిల్లను మంచుకొండలను చీకటి రాత్రులు పారిపోవగా
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు
 3. వెల్లువలెత్త కోర్కెలవి ప్రేమగ పాలను పంచుకొంచు తా
  మెల్లలు లేని సౌఖ్యముల మేదిని పొందగ ప్రేయసీ ప్రియుల్
  మల్లెల పాన్పుపై చెలగి మన్మథ లీలల తేలియాడగా
  *మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించు
 4. దివ్వెల పండుగ వచ్చెను
  దవ్వున గలపిల్లలొక్క తావుకు జేరన్
  రివ్వున వచ్చిన కాకర
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   కాకరపువ్వులతో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
   'తావునకు' అనడం సాధువు. అక్కడ "తావున జేరన్" అనండి.

   తొలగించు
 5. మైలవరపు వారి పూరణ

  పిల్లలలోన పిల్లడయి పిల్చును చల్దులు మెక్క., పల్లెలో
  నెల్లరకున్ ప్రియుండతడదేమొ రహస్యము.! వాని జూడగా
  నుల్లము పల్లవించును.! వియోగము నే భరియింపజాలనీ
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 6. జవ్వని నీ మాటలు విని
  నవ్వెద రీలోకులు కద నమ్మకు సుమ్మీ
  యెవ్వండు చెప్పె? నెక్కడ
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 7. ఒక ప్రియుని విరహ వేదన

  కవ్వింపులు మానుము నీ
  మవ్వంపు ముఖంబు సఖియ!మనసును దోచెన్
  దవ్వుల నుంటివి రమ్మిక
  పువ్వలలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

  రిప్లయితొలగించు
 8. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  జవ్వని మదిలో వేదన l
  పువ్వుల లోకి దిగజారి పూర్ణపు మనమున్ l
  క్రొవ్వుచు ఱువ్వగ నలిగిన l
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ ll

  రిప్లయితొలగించు
 9. అల్లదె ద్రౌపదిం గొని సభాంతరమందున వల్వలూడ్వ నా
  ప్రల్లదులైన కౌరవులు, భగ్గునఁ గోపదవాగ్ని లేర్చెఁ వా
  రెల్లర బూదిజేయగఁ దదీయసుకోమలచిత్తమందునన్,
  మల్లెల లోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో!

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించు
 10. అవ్వల గాశ్మీరమ్మున
  మువ్వన్నెల జెండ లెగర మోదీ దలపన్
  దవ్వున దేశము లందున
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దవ్వున రిపుదేశమ్మున' అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించు
  2. శ్రీ గురుభ్యోన్నమః🙏
   బాగు బాగు

   తొలగించు
  3. అవ్వల గాశ్మీరమ్మున
   మువ్వన్నెల జెండ లెగర మోదీ దలపన్
   దవ్వున రిపుదేశమ్మున
   పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

   తొలగించు
 11. కందము:
  నవ్వుల చినదాని గనిన
  జివ్వున మది లాగు సొబగు జిత్రము జూడన్
  చివ్వున కోర్కెల మది వని
  "పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్"

  రిప్లయితొలగించు
 12. అవ్వాడలోన నొక్కం
  డవ్వా! వర్తకము చేయు నాకాగితపుం
  బువ్వులతో నొకపరి యా
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.


  అవ్వా! దీపావళికిన్
  జువ్వలు పువ్వొత్తులొకడు సురుచిరముగ తా
  నవ్విధి జేయుచు నుండగ
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 13. చల్లని వెన్నెలే మిగుల సంతస మందున తారచెం తతా
  నుల్లము రంజిలన్ మదిని నెయ్యము గోరుచు చందమా మతో
  నెల్లలు మీరగా వయసు నీడల మైకపు నూయలూ గగా
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు


 14. కెవ్వున జిలేబి కేకల
  త్రవ్వి తరతరాల తప్పిదముల పెనిమిటిన్
  నువ్వా నేనా యనగా
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు


 16. హమ్మయ్య ! కడుపు నిండినది :)


  జల్లన తిట్ల దండకపు చాలిక తోడుత భార్య బాపురే
  కొల్లయు కొట్టి నెట్టి తను కొంపని కూల్చెడు కైపు పెన్మిటిన్
  ఫెళ్లు ఫెడేల్మటంచనుచు బెట్టుగ నాట్యము లాడ కొప్పులో
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో!  జిలేబి

  రిప్లయితొలగించు
 17. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  నవ్వుచు మగనిని జేరిన l
  జవ్వని తొలిరేయినాడు జడుపుగ నుండన్ l
  కవ్వింపుగ జడలాగగ l
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ ll

  రిప్లయితొలగించు
 18. రిప్లయిలు
  1. ఆటవిడుపు సరదా పూరణ:
   (జిలేబి గారికి అంకితం)

   అల్లరి రాహులుండపుడు హైరన నొందుచు పారిపోవగా
   గొల్లున నేడ్చుచున్ సఖులు గొప్పగు రీతిని గ్రుద్దులాడగా
   చిల్లర కాంగ్రెసోత్తముల చిందులు త్రొక్కెడి గుండెలందునన్
   మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

   తొలగించు
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. . *శ్రీ గురుభ్యో నమః*
  శంకరాభరణం-సమస్యాపూరణం
  సమస్య :: మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో!
  సందర్భం :: శ్రీ కృష్ణుడు తమను వదలి వెళ్లిపోయినాడని అనుకొన్న గోపికలు విరహాగ్నితో బాధపడే సందర్భం
  పూరణ ::
  మల్లెల వంటి చిత్తముల, మాధవ పూజల జేయు గోపికల్,
  మెల్లగ తొంగి జూచు ప్రియు మేను గనుంగొనలేక “రాత్రి మ
  మ్మెల్లర వీడి పోయె” నని యెంచ, మదిన్ విరహాగ్ని పుట్టె, నా
  మల్లెలలోన రేగినవి మంటలు, బొబ్బలు పుట్టె నయ్యయో!
  కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు 14.8.2019

  రిప్లయితొలగించు
 20. నవ్వులు రువ్వుచు నందరు
  దివ్వెల వెలుగుల జరిపెడి దీపావళినిన్
  జివ్వున రేగెను కాకర
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 21. మల్లెల నేరి దెచ్చిరవి మత్తగు వాసన లొప్పుచుండె నా
  మల్లెలలోన జల్లిరట మందుల వేవియొ వాడకుండగా
  మల్లెలు జేర్చి యంగనలు మక్కువ మీరగ దండ లల్లగా
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు
 22. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి .
  కం.
  నవ్విన వారే భోగులు l
  నవ్వనిచో రోగులనెడి నానుడి నిజమై l
  నొవ్వుగ, కొప్పున నిముడని l
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ ll

  రిప్లయితొలగించు
 23. జవ్వని గని వేధించగ
  నవ్వుచు తన యుక్తి తోడ నటియించుచు తా
  కవ్వించి మోసగింపగ
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 24. లవ్వను పేరున ఫ్రెండును
  క్రొవ్వున గోరుచు తిరుగగ కోమలులీలా
  ఱవ్వల పాలై జివ్వర
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 25. దవ్వుల కాశ్మీరంబున
  రువ్వగ బాంబులను దుష్టులోడగ రుధిరమ్
  నవ్వెడు సుందర కుంకుమ
  పువ్వులలో జ్వాలలెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రుధిరమ్' అని హలంతంగా ప్రయోగించరాదు. "దుష్టు లోడ రుధిరమే" అనండి.

   తొలగించు
 26. (ప్రణయజీవనులైన మల్లీశ్వరీనాగరాజులను వేరుచేయటానికి రాణివాసపు పల్లకి వచ్చింది)
  మల్లియు నాగరాజు తమ
  మానసవీథుల రాగడోలలో
  నల్లన నూగుచున్ సుమధు
  రామృతవీచుల దేలుచుండగా
  భల్లున రాణిపల్లకియె
  వచ్చెను ; జంటగ పూచినట్టి యా
  మల్లెలలోన రేగినవి
  మంటలు ;బొబ్బలు పుట్టె నయ్యయో !!

  రిప్లయితొలగించు

 27. ఉత్పలమాల
  పల్లవి పాణి పెళ్లి యిదెవారసుడౌ సుతుఁ జక్రవర్తిగన్
  జెల్లఁగఁ జేతునంచు సరసీరుహ బేల శకుంతలన్ వచో
  మొల్లములన్ దపించ మరుఁబోలిన రాజు రమించి వెళ్లగన్
  మల్లెలలోన రేఁగినవిమంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మొదటి పాదము టైపాటు సవరణతో :

   పల్లవ పాణి పెళ్లి యిదె వారసుడౌ సుతుఁ జక్రవర్తిగన్
   జెల్లగ జేతునంచు సరసీరుహ బేల శకుంతలన్ వచో
   మొల్లములన్ దపించ మరుఁబోలిన రాజు స్పృశించి యేగగన్
   మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

   తొలగించు
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సరసీరుహ నేత్ర' అనండి.

   తొలగించు
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   పల్లవ పాణి పెళ్లి యిదె వారసుడౌ సుతుఁ జక్రవర్తిగన్
   జెల్లగ జేతునంచు సరసీరుహ నేత్ర శకుంతలన్ వచో
   మొల్లములన్ దపించ మరుఁబోలిన రాజు స్పృశించి యేగగన్
   మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

   తొలగించు
 28. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  బువ్వపు ధ్యాసన నుంటివ l
  నవ్వుదురిక వెంగమనుచు నలువురి మధ్యన్ l
  ఱువ్వకు వెటకారము చెలి, l
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ ll

  రిప్లయితొలగించు
 29. కందం
  అవ్వల సుతుండు రాజగు
  జవ్వని గాంధర్వమిదని సరసోన్ముఖుడై
  దవ్వులఁ జని రాడె ప్రభువు
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 30. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జవ్వని! నీ విరహముతో
  నువ్విళ్ళూరుచు మనమది యూహలు దొడిగెన్
  రివ్వున వాలుము చెంతకు
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

  రిప్లయితొలగించు
 31. దవ్వున నుండెను పతియే
  యివ్వల సతి మల్లెపందిరెడుటనె, మీదన్
  రివ్వున గాలికి బడగా
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పంది రెదుటనె' టైపాటు.

   తొలగించు
 32. రివ్వున కాశ్మీరములో
  చివ్వకు బాల్పడగ శత్రు సేనలురాగా
  నవ్వులు పండెడు కుంకుమ
  పువ్వులలో జ్వాలలెగసి బొబ్బలు పుట్టెన్.

  రిప్లయితొలగించు
 33. దివ్వెలపండుగ రోజున
  జువ్వలుగాల్చంగనవియ చురచురయెగరన్
  రవ్వలుగలిగిన కాకర
  పువ్వులలోజ్వాలలెగసిబొబ్బలుపుట్టెన్

  రిప్లయితొలగించు
 34. నవ్వులు రువ్వుచు పాపలు
  గువ్వలుగానొదిగియుండ కోమలి యొకతే
  చివ్వునగాల్చగ కాకర
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్!!

  రిప్లయితొలగించు
 35. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వల్లభి! పుట్టినిల్లు విడి వాజముగా కదలాడు మింటికిన్
  యుల్లము నందు పుట్టినది యోర్చగరాని వియోగ మెంతయున్
  వెల్లువలెత్తి పమ్ముకొనె ప్రేమను గోరుచు నిప్పుడీ వడిన్
  మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇంటికిన్ + ఉల్లము' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించు
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 37. గువ్వలు గూటిని జేరెను,
  యవ్వనసతి పతిని జేరు యాలోచనలో
  నవ్విరహోత్కంఠిత జడ
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 38. అల్లరి బావచూపులవి యంగజుఁ బాణము లట్లు గ్రుచ్చగా
  నుల్లము జల్లుమన్నది పయోధరముల్ బిగుసెక్క రైకయే
  సళ్ళుచుఁ బైటజారగను జవ్వని లోనవికారమెచ్చగన్
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు
 39. అల్లదె చక్కగానమరె నల్లికపూవులుగుంఫనంబుగా
  మల్లెలలోన,రేగినవిమంటలుబొబ్బలుపుట్టెనయ్యయో
  కల్లుదుకాణపుందరినికాసులమంజులయింటిదూలము
  న్గాలగనంతముట్టుకొనగందుచునెర్రగ నుండెనక్కటా

  రిప్లయితొలగించు
 40. రివ్వున నచ్చట హాస్యపు
  సవ్వడి నివ్వటిలఁగ విరసంబై త్రుటిలో
  నవ్వ వికటించి నవ్వుల
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్


  ఎల్లలు మీఱి పెద్దలని యించుక నెంచక ప్రేలు చుండగాఁ
  బెల్లున నిప్పు మిన్కులవి వెల్లువలై మది నాట నిత్యముం
  గల్లరి ఘోర కృత్యములు గాంచిన నాదు మనో వనమ్మునన్
  మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 41. నవ్వుచు, దవ్వుల నిలచుచు
  రివ్వున సుమశరము రువ్వి రేతిరివేళన్
  చివ్వున విసిరెడి వాల్జెడ
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 42. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి (సవరణతో)
  కం.
  బువ్వపు ధ్యాసలొ నుంటివ l
  నవ్వుదురిక వెంగమనుచు నలువురి మధ్యన్ l
  ఱువ్వకు వెటకారము చెలి, l
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ ll

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధ్యాసలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ధ్యాసను నుంటివ" అనండి.

   తొలగించు
 43. చువ్వే! కాళీయునిపై
  మువ్వల గోపాలు డాడి మోదుచు నుండన్
  నొవ్వెడి భార్యల కొప్పుల
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 44. అల్లన పారిజాతకుసుమమ్మును రుక్మిణి సోయగంపు ధ
  మ్మిల్లముఁ జేర్చఁ గృష్ణుడు, సమీకృతకోపమబింధనమ్మునై
  వెల్లువలెత్తె సాత్రజితివిశ్రుతకోమలహృద్వనమ్మునన్,
  మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్ట నయ్యయో!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కోపమబింధనమ్మునై' అర్థం కాలేదు.

   తొలగించు
 45. జల్లులు తొల్కరించునెడ సంతస మొందుచు గుంపుకట్ట , నా
  మల్లెలవంటి నిర్మలపు మానస మొందిన చంచలాక్షులన్
  చిల్లరమూక లాదరికి చేరుచు వారిని యేడిపించగన్
  మల్లెలలోన రేఁగినవి మంటలు , బొబ్బలు పుట్టె నయ్యయో

  రిప్లయితొలగించు
 46. జవ్వని నవ్వగమదిలో
  పువ్వులవిరిజల్లుకురిసి పులకలురేపెన్
  జివ్వున విరహాగ్ని రగల
  పువ్వులలో జ్వాలలెగసి బొబ్బలు పుట్టెన్

  రిప్లయితొలగించు
 47. అల్లన పారిజాతకుసుమమ్మును రుక్మిణి సోయగంపు ధ
  మ్మిల్లముఁ జేర్చఁ గృష్ణుడు, సమీకృతకోపమబింధనమ్మునై
  వెల్లువలెత్తె సాత్రజితివిశ్రుతకోమలహృద్వనమ్మునన్,
  మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్ట నయ్యయో!

  అప్+ఇంధనము నీటిలో పుట్టిన అగ్ని.బడబానలము

  రిప్లయితొలగించు
 48. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 49. దివ్వెల పండుగను జనులు
  జువ్వలు గాల్చంగ వాటి శోభను గనుచున్
  దవ్వుల నిలబడ కాకర
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్!!!

  రిప్లయితొలగించు
 50. కం.
  బువ్వపు ధ్యాసను నుంటివ l
  నవ్వుదురిక వెంగమనుచు నలువురి మధ్యన్ l
  ఱువ్వకు వెటకారము చెలి, l
  పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ ll

  రిప్లయితొలగించు
 51. చివ్వుమనెగిరెను తారా
  జువ్వలు గగనమునకేసి చోద్యమ్మదిగో
  జవ్వని కాల్చెడు కాకర
  పువ్వులలో జ్వాలలెగసి బొబ్బలు పుట్టెన్.

  రిప్లయితొలగించు


 52. రవ్వలవియెగసె కాకర
  పువ్వులలో ,జ్వాలలెగసి బొబ్బలు పెట్టెన్
  చివ్వున చేతులు కాలగ
  కెవ్వున కేకల నిడుచును గిర్రున దిరిగెన్.

  రిప్లయితొలగించు
 53. చల్లని పిల్లతెమ్మెరలు చయ్యన వీచగ రాత్రివేళలో
  మెల్లన పుష్పకేతనుడు మీటగ డెందము లందు కోరికల్
  వెల్లువ లెత్త దంపతులు ప్రేరితులై విరహాగ్ని దేలగా
  మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్టెనయ్యయో!

  రిప్లయితొలగించు