7, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3098 (మూఁడేఁడుల పిల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్"
(లేదా...)
"మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై"

82 కామెంట్‌లు:

  1. మూఁడేఁడు లిరువదొక్కటి
    యీడది పెండ్లాడి సంతునే కనుటకుఁ దా
    వేడుకగాఁ దల్లి యగుచు
    మూఁడేఁడుల పిల్ల, కొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
  2. ఏడేడు జన్మ లెత్తిన
    వేడుకగా తల్లియగుట వెలదుల కెపుడు
    న్నాడుచు బొమ్మల యాటలు
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అస్పష్టత ఉన్నట్టుంది.

      తొలగించండి
  3. మూడారుల పెండ్లిజరిగె
    *మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్*
    ఏడేడులు వార్ధక్యము
    మూడెను పదియేడులకని ముదిత వచించెన్

    రిప్లయితొలగించండి
  4. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పాడంగా తన మిత్రులెల్లరుభళా ప్రక్కింటి వారందరున్
    తోడన్ బుట్టిన వారు మెచ్చగనటన్ తోషమ్ముతో నాడగా
    వాడల్ వాడలు సంతసిల్ల విధిగా బ్రహ్మాండమౌ తీరునన్
    మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై

    3 x 7 = 21

    రిప్లయితొలగించండి
  5. కం.
    ఆడంబరముగ విజ్ఞులు l
    మూఁడేఁడుల ప్రాయమందు ముచ్చట జేతన్ l
    తాడేయగ గజలక్ష్మికి l
    మూడేఁడుఁల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్ ll

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లి సిరిపురం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జేతన్'? పూరణ కొంత అస్పష్టంగా ఉన్నది.

      తొలగించండి
  6. కం.
    ఆడంబరముగ విజ్ఞులు l
    మూడేడుల ప్రాయమందు ముచ్చట జూపన్ l
    తాడేయగ గజలక్ష్మికి l
    మూడేఁడుఁల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్ ll

    రిప్లయితొలగించండి
  7. వేడుకగా సీమంతము
    నాడొనరించితిమి కాదె నలుగుర మొకటై
    తోడెవరు లేని యిరవై
    మూడేడుల పిల్ల కొక్క పుత్రుఁడు గలిగెఁన్

    రిప్లయితొలగించండి
  8. మోఢము దొలగగ జనకుడు
    వేడుకతో కూతురుకును పెండిలి జేయం
    గేడాది గడిచిన పిదప
    మూడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
  9. సమస్య :-
    "మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్"

    *కందం**

    చూడగ వింతయు గలదే
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్?
    వేడుక సహజమ్ము కదా!
    మూడిరవైల వయసునను పుత్రుడు వింతౌ !
    ......‌.‌‌...............✍చక్రి

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    చూడన్ నిన్ననొ మొన్నొ పుట్టినటులే చూపట్టుచుండెన్ గదా!
    యేడాదయ్యె వివాహమై సుమతికింతే.! కాన్పుకై వచ్చెనీ..
    యేడాదే యని తండ్రి బిడ్డ వయసున్. హెచ్చింపగానేడుతో
    మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై".!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుభ్యోన్నమః🙏

    వాడా వీడా యనుకొన
    ఈడూ జోడూ ముడివడి నీడై రాగా
    యేడాది దిరుగు లోపల
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి?

      తొలగించండి
    2. సరి చేసికొందును. క్షంతవ్యుణ్ణి అక్షర దేవతకు.

      వాడా వీడా యనుకొన
      నీడూ జోడై ముడివడి నీడై రాగా
      యేడాది దిరుగు లోపల
      మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

      తొలగించండి
  12. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తాడేపల్లిని నాయుడయ్య ముదమున్ తంటాలు లెక్కింపకే
    గూడెంబందున పెంచి ముద్దుగనహో గుమ్మమ్ము దాటింపగా
    కూడన్ ప్రీతిని లాబ్రడారు వరునిన్ కుప్పించి హర్షమ్ముతో
    మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై😊

    లాబ్రడారు = Labrador "she-dog"

    రిప్లయితొలగించండి
  13. (అత్తింట్లో అందరికీ తలలో నాలుకవంటి
    అమ్మాయి అమ్మ అయింది)
    తోడుగ నీడగ మసలును ;
    నాడుచు పాడుచును పనుల నన్నిటి జేయున్ ;
    జూడగ లలితకు ;నిరువది
    మూడేడుల పిల్ల; కొక్కపుత్రుడు గలిగెన్ .

    రిప్లయితొలగించండి
  14. ఏడుంగొండల వానిని
    కీడుం దొలగించుచు తమకిమ్మనె సుతునా
    రేడు కరుణింప ముప్పది
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్
    రేడు = ప్రభువు(వేంకటేశ్వర స్వామి)

    రిప్లయితొలగించండి
  15. ఏఁడాదులు తరలెను పద
    మూఁడేఁడులు గడచె పెండ్లి ముచ్చట పిదపన్
    గడకా తరుణికి ముప్పది
    *"మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్"*

    రిప్లయితొలగించండి
  16. సవరించిన పూరణ
    ------------------
    ఏడేడు జన్మ లెత్తిన
    వేడుకెగా తల్లియగుట వెలదుల కెపుడున్
    తోడుగ బావను పిలువగ
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
  17. విరుపు / విర్పు ~ యాసతో పూరణ రసజ్ఞులు మన్నించి స్వీకరింపమనవి🙏🏻🙏🏻

    తోడౌ మిత్రుని పెండ్లియాడి సరసన్ దోరంపు గ్రీడాడగన్
    గూడన్ గర్భముగాగనా వనితకున్ గోర్కెన్ నిజంబవ్వగన్
    నేడాబాలకునవ్వగన్ ప్రశవమున్ నీరోడ్చెనీ యిర్వది
    మ్మూడేడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రున్ గనెన్ ప్రీతిమై
    Rohit 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వగన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  18. నాడా మాంత్రికశేఖరుండు సభలో నానాప్రకారంబులై
    యేడం జూపని వింతలన్ దెలిపె తా నింపార నవ్వానిలో
    వాడా చేతను గల్గు దండమును త్రిప్పన్ శీఘ్ర మచ్చోట నా
    మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై.

    వాడొక మాంత్రికు డచ్చట
    చూడుండని వింతలెన్నొ చూపగ నందున్
    చేడియ కాదది సత్యము
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్.

    రిప్లయితొలగించండి
  19. కందము
    వేడుకతో జానకు డొకడు
    మూడారుల ప్రాయమందు పుత్రిక మెడలో
    తాడేయించెను పిమ్మట
    మూడేడుల పిల్లకొక్క పుత్రుడు గలిగెన్
    ఆకులశివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జానకుడు'? "వేడుకతోడన్ జనకుడు" అనండి.

      తొలగించండి
  20. ఆడిరి బొమ్మల కొలువున-
    మూడేడుల పిల్లకొక్క పుత్రుడు గలిగెన్
    వేడుక తీరెను బాలల
    తోడుగ సంతోష గతులు దోహద పడగన్.

    రిప్లయితొలగించండి
  21. (నేటి యువత మనోభీష్టం)
    నేడే పరిణయ మేటికి?
    మూడేడుల పిల్లకొక్క పుత్రుడు గలిగెన్
    పాడాయె భవిత చూడగ
    వేడుక నేర్వగ వయసిది విద్యలనెల్లన్

    రిప్లయితొలగించండి
  22. ఆడుది కిరువదియొక్కటి
    వేడుకతో పెండ్లిజేయ బిడ్డను బడసెన్
    ఈడ నరుదేమి యున్నది
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి


  23. చూడన్ వచ్చె వయస్సు బిడ్డ కనుచున్
    చోద్యంబు తానవ్వుచున్

    వాడల్ వాడలు సంతసిల్ల సలిపెన్ పాణౌకృతిన్ తండ్రియే!

    వేడంగన్ గడు పూజలే సలుపుచున్ వేవేల దుర్గమ్మకున్

    మూడేడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  24. వీడని చింతై మదిలో
    వేడగ సంతానమునకు వేంకట నాధున్
    చూడుమదే నా ముప్పది
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
  25. మూడు పదులు దాటెను నా
    కోడలు గొడ్రాలనుచును కుములగ నేలన్
    నేడాఫ్రికలో ముప్పది
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    రిప్లయితొలగించండి
  26. చేడియ మనసుకు నచ్చిన
    తోడు లభింపగ ముదమున తొయ్యలి యుండన్
    వేడుక గూర్పగ నత్తఱి
    మూడేడుల పిల్లకొక్క పుత్రుడు గలిగెన్

    రిప్లయితొలగించండి


  27. ఏడడుగుల బంధమ్మది
    వేడగ నా తిరుమలేశు వేంకట పతినే
    చూడన్ ముచ్చట, వయసౌ
    మూఁడేఁడుల పిల్ల కొక్క పుత్రుఁడు గలిఁగెన్!

    రిప్లయితొలగించండి
  28. వడిగా నెదుగుదు రనుచున్ |
    మూఢులు బాలిక పరిణయ మొనరించిరిగా |
    పండెను కడుపు నకట ,పద |
    "మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్"

    రిప్లయితొలగించండి
  29. మూడైదుల చదువాపెను
    మూడార్లకు పెండ్లిగాగ ముచ్చట దీరన్
    మూడేండ్లు గడచిపోయెను
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    ---గోలి.

    రిప్లయితొలగించండి
  30. మూడేడులు గుణియించగ
    వాడుకలోనగునదియిరు వదియొక టిగదా
    వేడుకను బెండ్లిజేయగ
    మూడేడుల పిల్లకొక్కపుత్రుడుగలిగెన్

    రిప్లయితొలగించండి
  31. కందం
    వాడొద్దని ల్యాప్టాపులు
    బాడీకినిహత్తు బిగుతు ప్యాంట్లు, భిషజుడున్
    వాడమన మందు, వయసది
    మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

    (వయసు మూడేడులు =వయసు 3x7=21 సం||)

    శార్దూలవిక్రీడితము

    వాడొద్దంచును టైటు ప్యాంట్లు మరి ల్యాప్టాపెప్పుడయ్యా వరా!
    బీడైపోవుద వంచు వైద్యుడనినన్ భీతిళ్లి గాంగేయునిన్
    జూడంగన్ జని మేటివైద్యముగొనన్ జోడీ తగన్, వత్సరాల్
    మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధానులు శ్రీ సూరం శ్రీనవాసుల వారి సూచిత సవరణతో

      కందం
      వాడొద్దని ల్యాప్టాపులు
      బాడీకినిహత్తు బిగుతు ప్యాంట్లు, భిషజుడున్
      వాడమన మందు, ముప్పై
      మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

      శార్దూలవిక్రీడితము

      వాడొద్దంచును టైటు ప్యాంట్లు మరి ల్యాప్టాపెప్పుడయ్యా వరా!
      బీడైపోవుద వంచు వైద్యుడనినన్ భీతిళ్లి గాంగేయునిన్
      జూడంగన్ జని మేటివైద్యముగొనన్ జోడీ తగన్, మూటిపై
      మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై


      తొలగించండి
  32. చూడన్ చక్కని కన్ని యందమలరన్ చూచెన్ సహస్రాంశునిన్
    వేడెన్ చక్కని బాలు నిమ్మనుచు నావేశమ్మునన్ మూఢయై
    తోడై సూర్యుని యంశమే యపుడు సద్యోగమ్ముగా నప్పదిన్
    మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై

    పదిన్+మూడు అనే ప్రయోగం సరైనదో కాదో తెలియదు కానీ యింకేమీ తోచక అలానే పోస్ట్ చేస్తున్నాను. 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పదిను మూడు, పదిన్ మూడు; పదియును మూడు, పదియున్ మూడు: ఇవి యన్ని వ్యాకరణ సమ్మతములే యని నా యభిప్రాయము. ప్రౌఢ. వ్యాక. శబ్ద. 116.

      తొలగించండి
  33. వేడుక గా నింక మనము
    నీడంగఁగ జున్నుపాల నిటు నటుఁ దాఁ దా
    రాడఁగ వేదన ధేనుక
    మూడేఁడుల పిల్ల కొక్క పుత్రుఁడు గలిఁగెన్


    వ్రీడా నమ్ర ముఖారవిందము చలద్విస్ఫార నేత్రమ్ములం
    గ్రీడా సక్త వయః ప్రభా యుత లసద్కీరాభ సల్లాపయై
    యాడం బాడను జూచు చుండగను బ్రాయం బెంచ యుగ్మంపు ము
    మ్మూడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెం బ్రీతిమై


    [ఏఁడు లోని యఱసున్న మూడేఁడుల్ ను యిరువది యొకటి గాఁ గైకొన నాటంక మైనది. మూడు సంఖ్యాపరముగా సార్ధ బిందువుగఁ గవిత్రయము వారి ప్రయోగ మలభ్యము.]

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. మూడేడుల్గుణియించగానగుగదామోదంబుగానిర్వయొ
    క్కండున్లెక్కనగానసంభవమగున్గాంతాలలామిట్లవన్
    మూడేడుల్గలపిల్లగర్భవతియైబుత్రున్గనెన్బ్రీతిమై
    చూడన్న్యాయమెయౌను గానదిరమా!సోత్కర్షమొప్పారగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో

      ప్రోడ వయసిరువదియొకటి
      వేడుకతో పెండ్లిజేయ బిడ్డను బడసెన్
      చూడగ నరుదేమి కలదు
      మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

      తొలగించండి
  36. నాడా యుద్ధము సంభవించుతరి మా నందంతియే జూడగా
    మూడేడుల్ గల పిల్ల, గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై
    నేడాస్పత్రిని, బోయిరావలయు నేనింకన్ పరామర్శకై
    తాడున్ బొంగరమేది లేని కడుపేదన్ కట్నమేమిత్తురా?

    రిప్లయితొలగించండి
  37. సమస్య:3098
    నా ప్రయత్నము:

    ఈడూ జోడగు జంటకు
    వేడుక మీరగ మనువును వెలయింపంగన్
    చూడగ కాలము గడిచిన
    *మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు కలిఁగెన్*

    రిప్లయితొలగించండి
  38. సమస్య:3098
    నా ప్రయత్నము:

    ఈడూ జోడగు జంటకు
    వేడుక మీరగ మనువును వెలయింపంగన్
    చూడగ కాలము గడిచిన
    *మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు కలిఁగెన్*

    రిప్లయితొలగించండి
  39. వాడుచు మందుల నిలలో
    వీడక పది వత్సరములు వేదన తోడన్
    వేడగ దేవుని ముప్పది
    మూడేడుల పిల్లకొక్క పుత్రుడు కలిగెన్.

    రిప్లయితొలగించండి
  40. కోడెవయసు యువకునితో
    వేడుకతో పెండ్లి జేయ వెలదిక ప్రణయం
    బాడగ నపుడా నిరువది
    మూడేడుల పిల్లకొక్క పుత్రుడు గలిగెన్!

    రిప్లయితొలగించండి