5, అక్టోబర్ 2019, శనివారం

సమస్య - 3153 (మనిషికి మోదమిచ్చును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్"
(లేదా...)
"మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

103 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:


    తినుటకు నిడ్లి దోసెలను తేరకు నిచ్చుచు కమ్మకమ్మగా
    వినగనె పాతజోకులను వేగమె నవ్వుచు ముద్దుముద్దుగా
    కనుటకు రంభ వోలెడిని కాంతయె కాన్పుకు నింటికేగ నే
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?

    రిప్లయితొలగించండి
  2. విరించి

    ధనమది లేకపోయినను ధర్మము వీడక చిత్తశుద్ధితో

    ననవరతమ్మొనర్చు పరమాత్ముని నామజపమ్ముఁ జేసినన్

    మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో

    జనితములైన భీతిలక సాగుచు నుండెడి వాడె ధీరుఁడౌ.

    రిప్లయితొలగించండి

  3. చం॥
    గణితము నభ్యసించునెడ కష్ట సమస్యల సాధనంబునన్

    మననము జేెసి సూత్రముల మానసశుద్ధిని మేధ పెంచుచున్

    ఘనమగు వృత్తి బొంది తన గమ్యము చేరెనొకండు కీర్తితో

    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గణిత సమస్యల పరిష్కారంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. చంపకమాల

    అనయము నీదు ధ్యానమున నంచిత భక్తినిఁ గల్గ జేసెడున్
    బెనఁగులు నీయ మంచిదని వేడెనె కృష్ణునిఁ గుంతి మాతయే
    మనమది వాడికిన్ గుడిగ మార్చిన మార్గము జూప తీరగన్
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తీరిన సమస్యలు మోదమిస్తాయన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు తమరి ఆదేశానుసారం సవరించిన పూరణ :

      చంపకమాల

      అనయము నీదు ధ్యానమున నంచిత భక్తినిఁ గల్గ జేసెడున్
      పెనఁగులు నీయ మంచిదని వేడెనె కృష్ణునిఁ గుంతి మాతయే
      మనమది వానికిన్ గుడిగ మార్చిన మార్గము జూప తీరగన్
      మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

      తొలగించండి


  5. అనఘా! అలాది పూరణ
    గనుడీ కవిరాట్ జిలేబి కందపు గంధం
    బనఘా యిదియే సుమ్మీ
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. రామస్వామి కిడాంబి, ఎర్రమంజిల్ హైదరాబాద్

    దిన దినమూ పరీక్షల మదిం దలచే విజయార్థి గోముగా
    తనకొక కష్ట మైనదగు ప్రశ్నను వేరుగ నీయ గోరుచూ
    కనుమని వేడుచున్, ప్రతిగ మాస్టరు పాదము పట్టగా భళా
    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దినమూ, తలచే, కోరుచూ' అన్నవి వ్యావహారికాలు. "దినమున్, తలచున్, గోరుచున్" అనండి.

      తొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వినయము గారమున్ గొనుచు విద్యల తల్లియె హర్షమొందగన్
    ఘనమగు కైపదమ్ములకు కమ్మని పూరణలల్లి హృద్యమౌ
    సునిశిత పద్యరాజములు శ్రోతల కింపుగ పాడుచుండగా
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    జననము మృత్యువున్ సుతులు సంపదలన్ని సమస్యలంచు జీ...
    వనమున కుందనేల ? ఇది వైష్ణవమాయ యటంచు నమ్మి , నె....
    మ్మనమున విష్ణువున్ గన సమస్యలు నీకు వరమ్ములౌనురా !
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. చం.
    జననము నేకమై బ్రతుకు సాగదు నెమ్మది నెల్ల వేళలన్
    దినదిన మేగుచుండ మది దేలును నాశలు కష్ట సాధ్యముల్
    వినయము నోర్చి సాధనగ విశ్వత నిండిన కార్య సాధనే
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ము లో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  10. తనదగు శక్తి మించని విధాతయె వ్రాసిన గీతలే సుమా
    మనిషికి మోద మిచ్చును, సమస్యలు, నిత్యము జీవితమ్ములో,
    మునకలు వేయ మానవుల ముంగట త్రోయ విరక్తి కల్గున
    మ్మ నెలతుకా! జిలేబి యవి మాన్పుట నెట్లని తోచకన్ సుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాన్పుట యెట్లని తోచకే సుమా' అనండి. (తోచక కళ)

      తొలగించండి


  11. ఆకాశవాణికి పంపినది


    మనుగడ లోన చిక్కులు కమాచివలెన్ తవిలించు, భూరిజ
    మ్మున నవి మీర సాధ్యమకొ? ముమ్ముర మై కొలువంగ దైవమే
    మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
    తన కృపతో సుతారముగ తాము తొలంగు తమంత తాముగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. కనిరా! యంతర్జాలము
    గనిరా! శంకర గురువుల కరములఁ బుట్టున్
    గనుగొనఁ, బూరణ చేసిన
    "మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్"

    రిప్లయితొలగించండి


  13. అనుకూలముగ తిరిగినన్
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్,
    తనకలి చేర్చిన నెపుడున్
    మనుజుడె క్రుంగును సొలపుల మహిని జిలేబీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. వనముల కేగియు నట భా
    మను యందరు పొందిన తరి పాండవులు మరిన్
    తనువున వాడని చేవగు
    మనుజునకు బ్రమోద మిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భామను + అందరు' అన్నపుడు యడాగమం రాదు. 'మరిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'చేవ + అగు' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి


  15. గనుడి సమస్యా పృచ్ఛక
    మనుజేంద్రు డిత డనుదినము మానడు వేయన్
    మునుగడ కైపదమరె! యీ
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  16. అనఘా గనుడీ మోడిన్!
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
    తన తలకెత్తు కొనెనుగా
    మన దేశపు తీరనట్టి మకిలిని ప్రీతిన్!


    జాల్రా
    జిలేబి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సంబోధన తర్వాత సరళాదేశం రాదు. "అనఘా కనుడీ..." అనండి.

      తొలగించండి
  17. కనగా వినగా చదువగ
    మనుటకు తాజేయు ప్రయతమల వలన కదా
    చనియెను గుహ నుంచి శశికి
    మనుజునకు బ్రమోద మిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనగా వినగా చదువగ
      మనుటకు తాజేయు జతనమల వలన కదా
      చనియెను గుహ నుంచి శశికి
      *మనుజునకు బ్రమోద మిడు సమస్యలు సతమున్*

      జతనము .. ప్రయత్నం, శ్రేష్టము, జాగ్రత్త

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జతనము + అల'?

      తొలగించండి


  18. మా అర్ణాబు గోస్వామి అరణా కయరు పట్టుకుని లాగి లాగి కొట్టు నను దినము :)



    తను జంకని గోస్వామి! ప్ర
    తి నిమిషమరచుచు విడువక తిట్టును, దుష్టుల్
    చన గునగున పరుగుల! యీ
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరుగుల నీ మనుజునకు..' అని ఉండాలి.

      తొలగించండి
  19. దనుజునివలె వర్తించుచు
    దను కోరినవెల్ల మానధనుడై దోచన్
    మనగలిగిరె శంకర? యే
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
  20. ఘనుడగు రావణాసురుడు
    కప్పురగంధుల లోలుడై జనెన్
    మనియెనె? యా సుయోధనుడు మానధనుండయి వంశ నాశనం
    బునకును దారిదీయడె? యమోఘ చరిత్రము లెన్నిలేవు, నే
    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?

    రిప్లయితొలగించండి
  21. జననుతి నొందు రీతినిఁ బ్రశంసల పూవులఁ జల్లు నట్లుగన్
    మననరసోద్భవత్కవనమాన్యకవీశ్వరపూరణమ్ములో
    ననితరకష్టసాధ్యవిషయాన్వితకందికవిప్రదత్తముల్
    మనిషికి మోద మిచ్చును సమస్యలు, నిత్యము జీవితమ్ములో‌.

    రిప్లయితొలగించండి
  22. కస్తూరి శివశంకర్శనివారం, అక్టోబర్ 05, 2019 7:08:00 AM

    ధనమది లేకున్నను కడు
    ఘనముగ బ్రతికిన మనుజుడె కారణ జన్ముడు
    అనురక్తిగ తలచిన యా
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర కచ్చితంగా గురువుండాలి. "కారణజన్ముం । డనురక్తిగ తలచిన నా । మనుజునకు..." అనండి.

      తొలగించండి
  23. గురువు గారికి నమస్సులు
    కనుడీ దేవుని లీలలు
    వినలేదా సుకృత ధర్మ విశ్వం బందున్
    తనవే యను తలచు హిత
    మనుజునకు ప్రమోద మిడు సమస్యలు సతమున్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  24. ఘన మగు సంకల్ప ము తో
    వెను కంజ ను వేయ బోక వేయి విధ ము లన్
    మును కొని పరి ష్క రిం చెడు
    మనుజు నకు ప్రమో ద మిడు సమస్య లు స త మున్

    రిప్లయితొలగించండి
  25. వచ్చే వారం ఆకాశవాణి వారి సమస్య

    దుర్గా! నీ వలెనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా

    Padyamairhyd@gmail.com కు పంపవలె

    రిప్లయితొలగించండి
  26. ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారం:
    దినమునకొక్క పద్యమును దీరుగ పూరణచేసిగాని నే
    కునుకునకిచ్చగించ మది కోరదు విశ్రమమేమి చేతు నా
    మనముననున్నమాటయిది మన్ననఁగోరుచు విన్నవించెదన్
    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో.

    రిప్లయితొలగించండి
  27. అనరున నున్నయప్పుడును యక్కఱపాటున సొక్కునప్పుడున్
    కనుగొన భోగభాగ్యములకన్నను సాంత్వననిచ్చు పల్కులే
    మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
    పొనుగువడంగ నుల్లసము పోఁడుము లుల్లమునందు జేకురున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనరున'? 'అప్పుడును + అక్కఱపాటు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. అనరు అన్న మాటకు దౌర్బల్యము, సంకటము మొదలైన అర్థాలు నిఘంటు శోధనలో ఇచ్చారు గురువుగారు. సంకటస్థితిలో వున్నప్పుడు అనే భావనతో వ్రాశాను. సరికాకుంటే తెలుపగోర్తాను.

      తొలగించండి
    3. అనరుల నున్నయప్డు మది యక్కఱపాటున సొక్కునప్పుడున్
      కనుగొన భోగభాగ్యములకన్నను సాంత్వననిచ్చు పల్కులే
      మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
      పొనుగువడంగ నుల్లసము పోఁడుము లుల్లమునందు జేకురున్.

      తొలగించండి
  28. అనుభవశీలతాత్వికుడుఅమ్మనుగొల్చుచుపద్య పాదపూ
    రణములయజేయుచున్ రాగము భావము తాళముల్ మరిన్
    గణములు దప్పకన్ చెలగి కమ్మని పద్యము లందజేయ నా
    మనిషికి మోదమిచ్చును సమస్యలునిత్యము జీవితమ్ములో
    కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాత్వికుడు + అమ్మను' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. రెండవ పాదంలో గణదోషం. 'తప్పక' కళ. ద్రుతాంతం కాదు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. అనుభవశీలుడై వెలిగియమ్మనుగొల్చుచు పద్యపాద పూ
      రణమునుజేయనెంచియిక రాగముభావముతాళమొప్పగా
      గణములుదప్పనట్టివగు కమ్మనిపద్యములందజేయ నా
      మనిషికి మోదమిచ్చునుసమస్యలుజీవితమ్మునన్



      తొలగించండి
    4. గురువు గారికి నమస్కారములు తప్పులు గ్రహీంచాను

      తొలగించండి
  29. తెనుగు పద భాండ మందలి
    యనువైనవి యెంచి గణము లమరిచి కవనం
    బను నాటలాడుచుండెడి
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
  30. కందం
    అనయము సమస్య దొరకక
    పెనగొనఁడనఁ జక్రవర్తి! పృచ్ఛక పదవిన్
    దనరెడు మద్గురుఁ బోలెడు
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
  31. మనసున శాంతమున్ సరళమౌ గతి జీవన మొప్పుచుండుటే
    మనిషికి మోదమిచ్చును; సమస్యలు నిత్యము జీవితమ్ములో
    మనసును క్రుంగదీసినను మానవ యత్నము మానకుండుటే
    మనుజుల కర్మ యోగులుగ మార్చి ప్రశాంతత గూర్చు నెమ్మదిన్
    (ఆకాశవాణికి పంపినది)

    రిప్లయితొలగించండి
  32. నిన్నటి సమస్యా పూరణకు నా ప్రయత్నము పరిశీలింపగలరు:

    పీతాంబరధారుని హరి
    నా తరుణీ జన ప్రియ హితు నంబుజ నేత్రున్
    ప్రీతిం గూర్చెడి కంసా
    రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్

    రిప్లయితొలగించండి
  33. వినుమురచేతినిండుగనువేలకువేలుగసొమ్ములుండుచో
    మనిషికిమోదమిచ్చును,సమస్యలునిత్యముజీవితంబులో
    చెనకుచునుండుగావునసజీవనదృష్టినిబారద్రోలగా
    ననిశముబాటునొందుచునుహర్షముగల్గెడుమార్గమెన్నుమా

    రిప్లయితొలగించండి
  34. విను మిది కష్టమై నపుడె వెల్లడియౌ సుఖమూల్య మేరికిం
    గనులకు జీకటుల్ తెలియ కాంతి విశిష్టత తేటతెల్లమౌ
    ఘనముగ నుష్ణమైన చలి గణ్యత తేలును తీరినంతనే
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో.

    రిప్లయితొలగించండి
  35. ఈరోజు ఆకాశవాణి లో చదువబడిన నా పూరణ

    మనిషికి ఖేదమేర్పడు ప్రమాదము లేపున వచ్చి పైబడన్
    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితంబులో
    తనకొక పూర్ణ రూపమిడి ధైర్యముతో మునుముందుకేగగన్
    వనముల కేగి రాఘవుడు పల్మరు దాటడె కంటకంబులన్

    రిప్లయితొలగించండి
  36. గురువు గారి whats app number ఎవరైనా తెలియజేయగలరు.
    గతంలో వారిచ్చారు కానీ నా ఫోన్ మారటంలో నంబరు పోయింది

    రిప్లయితొలగించండి
  37. వినుటకు సొంపుగ లేదిది
    మనుజునకుబ్రమోదమిడు సమస్యలు సతమున్
    మనుజునకరయసమస్యలె
    యనుదినముందుఃఖమిచ్చునవునా కాదా?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనుదినమున్ దుఃఖ' మన్నపుడు ద్రుతం బిందువుగా మారదు.

      తొలగించండి
  38. ( సమస్యల మధ్యతరగతి మనిషిని శంకరార్యుల "శంకరాభరణం"సమస్యలు సంతోషపరుస్తాయి )
    కనికని సంఘమందలి వి
    కంపితగాత్రుల కష్టదృశ్యముల్ ;
    వినివిని కర్షకావళుల
    విస్మయదాయకశోకగాథలున్ ;
    మనము నదల్ప " శంకరుని "
    మంజులశీర్షిక చూచు మధ్యపుం
    మనిషికి మోదమిచ్చును స
    మస్యలు నిత్యము జీవితమ్ములో .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మధ్యపున్ మనిషి' అన్నపుడు ద్రుతం రూపం దాల్చదు. అయినా 'మధ్యపున్ మనిషి'?

      తొలగించండి
    2. "మధ్యతరగతి మనిషి " అనే అర్థంలో అలా అన్నానండీ ! ధన్యవాదాలు .

      తొలగించండి
    3. మూడవపాదం చివర " మాంద్యుడౌ " మనిషి
      అందామండీ ! " సమస్యలతో మొద్దుబారిన మనిషి "
      అనే భావంతో .

      తొలగించండి
  39. మననమె చిక్కౌ మఱి పసి
    దనమ్మునఁ జదు వగుఁ జిక్కు తారుణ్యమునం
    గనవలె పండిత వర్గము
    మనుజునకుఁ బ్రమోద మిడు సమస్యలు సతమున్


    తనరఁగ నంధకారము సతమ్ము నిశా తతి వచ్చె దీపముల్
    తనరఁగ నడ్డుగాఁ గడలి దాటఁగ నింపుగ వచ్చె నోడలే
    తనర నిరోధమై గిరులు దారికి వచ్చె విమాన రాజముల్
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

    రిప్లయితొలగించండి
  40. దినమొక యాతనై గడుపు దీన దరిద్రు లనేకు లీ భువిన్
    ధనమది లేక బంధు సముదాయము లేని యభాగ్యులెల్ల జీ
    వనమున గ్రుచ్చు మోదు పలు బాధల వేదన నోర్వగా నెటుల్
    మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?

    రిప్లయితొలగించండి
  41. 1) జనకునియాజ్ఞతీసుకొనిజానకిరాముడుకానకేఁగఁ, తా
    వనమునసీతబాయ, పలువానరమూకలకూడగట్టి, తా
    రణమొనరించిదైత్యుల, శరంపరమున్న్దునుమాడి, దుష్టరా
    వణుతెగనాడి,రాముడు సపత్నినిచేరె, జనానుమోదుడై
    మనిషికిమోదమిచ్చును, సమస్యలు,నిత్యముజీవితమ్ములో.

    2) వినదగు, వేయిరీతులు, వివేకులమన్న తలంపుయున్నచో,
    కనదగు, సూక్ష్మతత్వమును కార్యముసిద్దిగ, నెర్పజాలినన్
    కొనుటదిసాధ్యమామనకు, కోరిననేర్పుల, నాకళింపఁగన్
    తనువదిబాగనల్గిన, విధానమదేర్పడు, నేరికైనయున్
    మనిషికిమోదమిచ్చును సమస్యలునిత్యముజీవితమ్ము లో.

    3) చం. మనదగుజీవితంబును,సమంజసమెళ్ళగ,దీయబూనినన్,
    కనపడుదారిలోతగులు,కష్టములెల్లయు నోర్చిదాట,నీ
    వనుకొనియున్న తీరముల, నందుకొనంగగ,నర్హుడౌదువే
    మనిషికిమోదమిచ్చును సమస్యలునిత్యముజీవితమ్ము లో


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      1లో... 'శరంపరమున్'? 'సపత్నిని చేరె'.... సపత్ని అంటే సవతి.
      2లో... 'తలంపు + ఉన్నచో = తలం పున్నచో' అవుతుంది. యడాగమం రాదు. 'ఏరికైనయున్' .. ఇక్కడ యున్ అవసరం లేదు.
      3లో... 'ఎళ్ళగ' ? 'కష్టములెల్లను' అనడం సాధువు.

      తొలగించండి
  42. అనయము బెగ్గలమ్మడర స్వాంతము నందు, సమస్యగా కనున్

    పనులను ధాత్రిపైన పెను బాధగ నెంచుచు తల్లడిల్లుచున్

    వినయము శక్తియుక్తిగల విజ్ఞుడు మంచి వివేకశాలియౌ

    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

    రిప్లయితొలగించండి
  43. కనివిని యెరుగని రీతిన
    మనసుకు బదునిచ్చు యా సమస్యల పూరణ
    లను సాధించ గలుగు నా
    మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్

    రిప్లయితొలగించండి
  44. ధనమది మేలు గొల్పినను దానిని జేకొన కష్టమన్నటుల్
    కనుగొన నీ సమాజమున ఖ్యాతి గడించగ భారమౌను, తా
    ననయము నెత్తు పల్లముల నన్నిటి నొక్క తెఱంగు జూడఁగన్
    మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో!

    రిప్లయితొలగించండి