7, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3155 (భారతమ్మును జదువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భారతమ్మును జదువ వైభవము లడఁగు"
(లేదా...)
"భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే"
('తపస్వి' పంతుల వేంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

47 కామెంట్‌లు:

  1. భాగవతమును చదువగ భక్తి కలుగు

    ముక్తి కలుగునట నెపుడు ముదము తోడ

    భారతమ్మును చదువ, వైభ వము లడుగు

    చదువ చెత్త సాహిత్యము జనుల‌ కెపుడు

    రిప్లయితొలగించండి

  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    Emergency 1975 Epic:

    తీరును తెన్నునున్ విడిచి తియ్యగ బాదుచు నేతలెల్లరిన్
    వారిని వీరినిన్ గనక వైచుచు జైలున వేనవేలుగా
    తీరని దాహమున్ గొనుచు త్రిప్పలు పెట్టిన నిందిరమ్మదౌ
    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే

    రిప్లయితొలగించండి


  3. వేంకటేశ్వర రావయ వేగిర వల
    దయ్య! పలుకవలదయ "సతతము మీరు
    భారతమ్మును జదువ వైభవము లడఁగు"
    నంచు! సరికాదయా! క్షయణమది మనకు!

    సుబ్బారావు గారే ఇవ్వాళ మాకు ఆప్తులు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. నిన్నటి ఫంక్షను లో సారు మా అందరి చేత Attendance Register లో phone number తో సహా సంతకము చేయించు కున్నారు. Adhar Card అడుగ లేదు

      😊

      తొలగించండి


    2. నేనున్ను సంతకము ఫోను నెంబరు పెట్టాగా :)



      జిలేబి

      తొలగించండి
    3. మహాతల్లి! వచ్చినా వచ్చి ఉంటుంది. వచ్చి వెళ్ళాక మిమ్మల్ని కలిసాను కదా... మీతో మాట్లాడాను కదా... మీతో ఫోటో దిగాను కదా... అంటుంది. ఇప్పుడేమో సంతకం పెట్టి ఫోన్ నెం. ఇచ్చానంటున్నది.
      "లెక్కింపగ నా తరమ జిలేబీ లీలల్"

      తొలగించండి
    4. జిలేబి గారూ, జ్వరంతో ఉన్నాను... ఏకవచన ప్రయోగానికి మన్నించాలి.

      తొలగించండి


    5. పూరించేసామండి :)

      ఆరోగ్యము జాగ్రత్త . మీకు విశ్రాంతి అవసరము.
      Take care of health.

      అక్కడ యిక్కడ చూడగ
      నెక్కడ నైన కనిపించు నెవ్వరికిన్ తా
      నెక్కడ కలదో తెలియదు
      లెక్కింపగ నాతరమ జిలేబీ లీలల్!



      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ఉపాధ్యాయుడు.. నేటివిద్యార్థులతో...

    భారతమందు బుట్టితిరి ! భాగ్యము మీది ! అనేకధర్మవి...
    స్తారకథాప్రసంగసముదాయము పంచమవేదమైనదౌ
    భారతమున్ జనించెనిట ! బంధువు మీకిది విస్మరించి శ్రీ...
    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే??!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "భారతగాధనేల చదువన్ వలె ? "నంచు విదేశవాసులన్
      కోరుము., ధర్మశాస్త్రమది , గూర్చు శుభంబని చెప్పుచుందు., రీ
      భారతభూమి పుట్టు మనవారని కోరకుమిట్టి ప్రశ్ననీ...
      భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. (వ్యాసమహర్షి మీద అసూయతో కొందరు గీరతం వ్రాస్తే
    అది చదివినవారికి బుద్ధిసంపదలు నశిస్తాయి )
    భారతదేశమందు గల
    పాత్రల పోకడలన్ని యొక్కచో
    మేరలు లేని కీర్తి గన ;
    మించిన యీర్ష్యను నిందసేయుచున్
    గీరతకర్త్రి రంగమయె
    కేకలువెట్టిన ; నామెదైన యా
    భారతమున్ బఠింప ఘన
    వైభవముల్ నశియించు నందురే !

    రిప్లయితొలగించండి


  6. భారత కావ్యమంతయు ప్రభాతియె! నేర్వగ వచ్చు పోకడల్!
    వారధి సభ్యసంస్కృతిని వర్దిగ కైకొన! వృద్ధి గాంచునా
    భారతమున్ బఠింప ఘనవైభవముల్! నశియించు నందురే
    ప్రేరిత దుష్టబుద్ధులు! నవేతర మెప్పటికిన్ ప్రవాహమై!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. భారత పౌరు డొక్కరుడు పల్కెను శాత్రవకోటి కీవిధిన్
    మీరలు తుచ్ఛమానవులు మ్లేచ్ఛులు దుర్మతు లాకతాయులై
    చేరితి రీధరాస్థలిని శ్రేయములందరు సత్యమిద్ది మా
    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే?

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కల్వరి టెంపుల్ (మియాపూర్) ప్రవక్త మైకులో అరుపు:

    "జారులు చోరులున్ కలిసి జంబము మీరగ నొక్కవైపునన్
    భీరులు టక్కరుల్ కలిసి బింకము మీర మరొక్కవైపునన్
    పోరుచు నుండెడిన్ కథను పొందుగ పాడగ పాపమౌనురో!
    వీరులు క్రైస్తవుల్! మనము వీడుచు బైబులు హిందు జాతిదౌ
    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే!"

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. భారతసంహితాఖ్యఁ గద పంచమవేదమటండ్రు!, భక్తితో
      వారక ధర్మశాస్త్రవరభారతమున్ పఠియింపఁ బుణ్యమౌ,
      సారవిహీనకేవలవిశంకటదైహికసంగమార్తిరం
      భా,రతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే.

      తొలగించండి
  10. తీరు తెన్నులు పలుగల ధీ భరితము
    సారము చదువరిని బట్టి, సకలము యొన
    గూరు సన్మది చదివిన, కుమది తోడ
    భారతమ్మును జదువ వైభవము లడగు

    రిప్లయితొలగించండి
  11. ఇతర దేశాలు మనగొప్ప లెరిగి నడువ,
    నీతు లీనాడు బడులందు నేతిబీర
    భారతమ్మును జదువ వైభవము లడఁగు
    అనుట సహజము చవిచూడఁనధము డింక

    రిప్లయితొలగించండి
  12. మేరు పర్వతము వలెనే, మేలు గోరు
    వారికిన్ మరి కోట్లాది వరము లిచ్చు,
    ఎరుక పంచమ వేదము, చెరుపు చేయ
    భారతమ్మును జదువ వైభవము లడగు

    రిప్లయితొలగించండి


  13. నా పూరణ. ఉ.మా.
    ***** ****
    వీరము దెల్పదే? సకలవిద్యలు ధర్మము నేర్పదే?సదా

    ప్రేరణ నీయదే? మిగుల పేరిమి బంచదే? గల్గ జేయదే

    భారతమున్ బఠింప ఘనవైభవముల్ ?... నశియించు నందురే

    సారవిహీన గ్రంథముల జద్వగ సద్గుణ రాశులన్నియున్?

    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷


    రిప్లయితొలగించండి
  14. భాగ్యములుకల్గు జనులకు భాగవతము
    భారతమ్మును జదువ ,వైభవము లడఁగు
    చెత్త సాహిత్యము చదువ,చెడును మతియు
    జ్ఞాన శూన్యులౌట నిజము జగతి యందు

    రిప్లయితొలగించండి
  15. సారథి కృష్ణుడై నడుపఁ సత్యము ధర్మము గెల్చు నంచు,సం
    సారపయోధి నీదుటకు శాంతియు నోర్మియు ముఖ్యమంచు,నే
    తీరునఁ జూచినన్ బ్రతుకు దిద్దెడు నద్దము నయ్యె, కల్గులే
    భారతమున్ బఠింప ఘనవైభవముల్, నశియించు నందురే?

    రిప్లయితొలగించండి
  16. నేనునూ నా సరదా పూరణ జిలేబి గారికి అంకిత మిచ్చుట ఏలనో.???😊😊😊😢😢😢☺️☺️

    నా పూరణ. ఉ.మా.
    ***** ****
    దారుణ రీతి జూదమున దారను పందెము గాయుటేలనో?

    నేరము జేయుచున్ గురుని నీతిని వీడి వధించుటేలనో

    క్రూరము జుట్టుముట్టుచును కూల్చుచు బాలుని గెల్చుటేలనో?

    కోరుచు నేల సోదరులు ఘోరముగా కలహించుటేలనో?

    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే!



    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వామ్మో ! వనపర్తి వారు కూడా ఇట్లా‌ "జిలేబ్యాంకు టాం" అంటే నాకు భయము వేయుచున్నది :)


      ఆనో భద్రాః ... :)


      ఏలయన పూర్ణమదియే
      బీలేజిగ నిద్రమత్తు విడనిదిగ జిలే
      బీలవలె చుట్టు కొనియు ని
      భాలన చేయు పరమాత్మ వైఖరి గానన్ !


      జిలేబి

      తొలగించండి
  17. ధర్మ సూక్ష్మ ము లు దెలి యు తత్వ ములు ను
    భారత మ్ము ను చదువ :వైభము ల డ గు
    క్షుద్ర సాహిత్య ము వల న క్షోభ గలిగి
    మనసు వికలము లౌ గదా మను జ త తి కి

    రిప్లయితొలగించండి
  18. భారతమ్మును జదువ వైభవము లడగు
    అనుకొను జనులీ జగతిని జాల గలరు,
    ఎరుగు మీ పంచ మానుశ్రవమ్ము సరిగ
    వలిచి పెట్టిన వేదమే భారతమ్ము

    రిప్లయితొలగించండి
  19. భారతమ్మన్న వేదాల సారమేను
    ఐహికాముష్మికములెల్లనమరుగాదె
    భారతమ్మును జదువ, వైభవము లడఁగు
    భారతమ్మును దూషించు వారలకును.

    రిప్లయితొలగించండి
  20. జీవనవిధానమలవడు జీవికిటను
    భారతమ్మునుజదువ,వైభవములడగు
    ననుటసరికాదు పెరుగున యాచితముగ
    నాయురారోగ్యసంపద లన్నిభువిని

    రిప్లయితొలగించండి
  21. భారతమున్బఠింపఘనవైభవముల్నశియించునందురే
    భీరునిమాటలేయవియప్రీతినిగల్గుగధామృతంబునై
    బారమునిచ్చునున్దుదిని,పాఠకలోకముసంతసించుచున్
    భారతమున్బఠింపగనుబాడియుపంటలువృద్ధిపొందిలన్

    రిప్లయితొలగించండి
  22. తే.గీ.

    మంచి చెడులను బోధించు మహిమ గలది
    కౌరవుల వోలె కడతేరు కాంక్ష బడయ
    చేరి ఒనగూడ నేముంది చింత దక్క
    భారతమ్మును జదువ వైభవము లడగు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. ధర్మ సూక్తు లనుచు నమ్మి దైవ నిర్ణ
    యమ్మ చుమ్మని చిత్తమ్ము నందుఁ గర్మ
    రక్తి వీడి భక్షించ నిరంతరమ్ము
    భారతమ్మును జదువ వైభవము లడఁగు

    [భారతము = భారత దేశ చరిత్ర]


    దూరము లయ్యె సంపదలు దుష్ట మనంపుఁ బసిండి తిండికిం
    దోరపు వైభవమ్ము లల దూరము లయ్యెను దీవి ఱేనికే
    యారక పుణ్య భాగవత మందు నిరంతర ముగ్ర నైరృ తా
    భారతముం బఠింప ఘన వైభవముల్ నశియించు నందురే

    [నైరృత+ఆభ+ అరతము = నైరృ తా భారతము; దైత్యులతో సమాన మగు ద్వేషము ]

    రిప్లయితొలగించండి
  24. చక్కని భరతవర్షపు చరిత తెలియ
    పూర్వకాలపు గాధల పుటల దెరచి
    తెల్లవారి పాలనయందు తల్లడిలిన
    భారతమ్మును జదువ వైభవము లడఁగు

    రిప్లయితొలగించండి
  25. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    భారతమ్మును జదువ వైభవము లడఁగు

    సందర్భము:
    యత్ర యోగేశ్వరః కృష్ణో...
    అనే గీతా శ్లోకం (18-78) యొక్క భావం ఉద్ధరించబడింది. ఒక యోగశాస్త్రంగా పరిగణించబడిన గీతలో ఇది చిట్టచివరి శ్లోకం.
    మహాభారతంలో అంతర్భాగంగా వున్నాయి శ్రీ మద్భగవద్గీత, విష్ణు సహస్ర నామాలు.. ఇవి సంప్రదాయజ్ఞుల నిత్య జీవితాలలో భాగస్వాములైన పవిత్ర గ్రంథాలు. ఐతే కేవల పారాయణతోనే సరిపెట్టకుండా వీటిలోని అంతరార్థాన్ని మథించి తెలుసుకొని క్రమంగా ఆచరణలోకి తెచ్చుకోగలిగిన నాడు మాత్రమే జీవితాలు సార్థకము లౌతాయి.
    కృష్ణుడు జ్ఞానా న్నిస్తాడు. అర్జునుడు ఆచరణలో పెడుతాడు. (పారాయణ కాదు.) ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ అర్జునుడు.. అంటే ఎక్కడ జ్ఞానా న్నిచ్చేవాడు.. ఎక్కడ దాన్ని ఆచరణలో పెట్టేవాడు వుంటే అక్కడ విజయం.. అని. స్వార్థం వదిలిపెట్టని పారాయణలలో వ్యక్తిత్వపు టెదుగుదల గోచరించదు.
    మహా భారతంలో స్వార్థం పురుషార్థం పరమార్థం కాలక్రమేణ ఎలా ఎలా పరిణమిస్తాయో మనోహరంగా చిత్రీకరించబడింది.
    మహా భారత్ హిందీ సీరియల్ లోని టైటిల్ సాంగ్ ఒకసారి వినవచ్చు. కథా హై పురుషార్థ్ కీ యే స్వార్థ్ కీ పరమార్థ్ కీ.. అనేది.
    పల్లవి మాత్రమే ఆడియోలో వినవచ్చు. వీడియో స్క్రీన్ షాట్ మాత్రమే వుంచబడింది. (పూర్తి పాట యూట్యూబ్లో..)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "యోగేశ్వరుడు కృష్ణు డొప్పారు నెచ్చోటఁ
    బార్థ ధనుర్ధారి బరగు నెచట
    నచట శ్రీ, విజయంబు, నతులమౌ విభవంబు,
    ధర్మ మభ్యుదయంబు దనరుచుండు"..
    నిది భగవద్గీత నింపారు వచనంబు..
    కృష్ణు డర్జునున కా గీతఁ జెప్పె..
    నీ భగవద్గీతయే భారతాంతర్గ
    తంబై విరాజిల్లె ధరణియందు..
    నట్టిదౌ మహా భారత మతి పవిత్ర..
    మరయ గీత సారము పురుషార్థము, పర
    మార్థము లెరుంగకుండగా స్వార్థ పరత
    భారతమ్మును జదువ వైభవము లడఁగు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    7.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  26. భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే
    దారుణమట్లనన్ కవులు ధర్మపు సూక్ష్మము వారెరుంగరే
    ఘోరపు తప్పిదంబులను గొంకక సల్పెడువారి దుర్గతిన్
    భారతగాథ చెప్పెగద పంచమవేదము భారతమ్మిలన్.

    రిప్లయితొలగించండి
  27. ఉ. దారుణమైననీతి,యొకతన్విని,యైదుగురాలిజేయటన్
    క్రూరము,జూదమందు,యొనగూరెనధర్మము,నాలిరాజ్యముల్
    కారణమేదియైన,కలికాలపు జాడలుమెండుగల్గు, నా
    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే.

    రిప్లయితొలగించండి
  28. వేద వేదాంగ తత్వార్థ వివరములును
    పారమార్ధిక సత్యమ్ము పట్టుబడును
    భారతమ్మును జదువ; వైభవము లడఁగు
    సార హీనంబు యగునట్టి చదువు వలన

    రిప్లయితొలగించండి
  29. కవిమిత్రులకు నమస్సులు. నిన్న మధ్యాహ్నం నుండి నాకు జ్వరం వస్తున్నది. లేని ఓపిక, ఉత్సాహం తెచ్చుకొని నిన్న పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నాను. సభ చాల బాగా జరిగింది. సభకు వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. సభ విజయానికి అన్ని ఏర్పాట్లు చేసిన అన్నపరెడ్డి వారికి, మాచవోలు వారికి కృతజ్ఞుడను. రాత్రి జ్వరం ఎక్కువయింది. ప్రస్తుతం ఒంటినొప్పులు, నిస్సత్తువ. అందువల్ల మీ పూరణలను సమీక్షించే ఓపిక లేకపోయింది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల
    వీరుడు భీష్మయోధుడని వీడగ ప్రాణము నంపశయ్యపై
    శౌరి మనోజ్ఞమూర్తి యొగి చక్కడగన్నొక బోయచేతిలో
    భారత యుద్ధ జేత బరి వాటుకు నొవ్వ విరాగమందునన్
    భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే!

    రిప్లయితొలగించండి
  31. తేటగీతి
    భీష్ముడంపశయ్యనుఁ గూల, వేటగాడు
    శౌరిఁ గూల్చగా నర్జునున్ జోరులడ్డ
    కాల మహిమకున్ వైరాగ్యమాలపించి
    భారతమ్మును జదువ వైభవము లడఁగు!

    రిప్లయితొలగించండి