10, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3158 (కోఁతినిఁ బెండ్లాడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?"
(లేదా...)
"కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

101 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కోపము వచ్చిన వారందరికీ క్షమాపణలతో:

    రీతిగ నందమున్ గనక రెడ్డులు కాపులు కమ్మకన్నెలన్
    ప్రీతిని జూచి బ్రాహ్మణుడ! ప్రేమను చాటుచు కౌగలించుచున్
    తాతల మాటలన్ విడిచి దంభము వీడుచు సాఫ్టువేరుదౌ
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో

    రిప్లయితొలగించండి
  2. గీతా వినవే విజ్ఞుం
    డాతడు నీయత్త సూను డందము లోనన్
    జేతో భవుడా యల్లరి
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?

    రిప్లయితొలగించండి
  3. నాతిగుణవంతురాలై

    నీతి నియమములు కలిగిన నెమ్మి బొసగుగా,

    మూతి ముడువ వలదెప్పుడు,

    కోతిని పెండ్లాడు మింక,గూటికి లోటా?

    ఒక తల్లి తన తనయునికి చెప్పు మాట

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ఇందులోని నేను నేను కాను😀🙏

    జాతకమేమొ కాని మనసారగ బెండిలినాడనెంచగా
    నాతి యొకర్తెయైన నను నమ్ముటలేదన ., మాంత్రికుండునా
    చేతిని తేరిపార గని చెప్పెను గండము తీర "ముందుగా
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ..

      జాతికి మచ్చతెచ్చు విషసంస్కృతి హెచ్చెను., సాంప్రదాయసం..
      గీతము వస్త్రధారణము కీర్తిగడించిన పిండివంటలన్
      పాతర వేసినారు, మరి భామల సంగతి యేలరా? యెదో
      కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. *తండ్రి కూతురుకు తన అక్క పుత్రుని పెండ్లాడమని నచ్చజెబుతున్న సందర్భం*



    భీతిల బోకుమమ్మ కడు ప్రీతిగఁ జూచును బావయే గదా
    యాతడు నిన్ను మామసుత వంచు పరాచిక మాడనేమి, నీ
    కాతడె యీడుజోడుగద యల్లరి వాడని చూడకుండ నా
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో

    రిప్లయితొలగించండి


  6. మూతిని బిగించుకొనకోయ్
    తాతకు తగ్గ మనవడ సితార జిలేబిన్
    చేతన కై మందో మా
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?


    హిడింబి
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. కాని కోఁతిలో అరసున్నా ఉన్నది. మందో మాకో తిని... అన్నపుడు అరసున్న లేదు.

      తొలగించండి

  7. సరస సంభాషణలో.. కాబోయె భార్యను "కోతీ!" అని సంబోధించినందుకు ఎత్తుకున్నది కంద పద్యం ..
    కం॥
    కోతీ! యని నను దిట్టకు

    కూతలు కూసితివి యింక కొట్టెద నిన్నే !

    నాతల్లి నేర్పె వంటలు

    కోతిని బెండ్లాడు మింక కూటికి లో టా!

    రిప్లయితొలగించండి
  8. నీతిని జాతినిం దలుప నేరక పెద్దల మాటలెంచకన్
    చేతువె ప్రేమ నీ వకట ఛీ యొక కాముకుని న్వరించి యో
    నాతి! ప్రమాద మోను విను నాయన చూచిన వాని, వీడి యా
    కోఁతినిఁ, బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో.

    రిప్లయితొలగించండి


  9. తియ్యని శాపము :)


    తాతకు తగ్గ దుష్టుడ! సితార జిలేబియె పెండ్ల మౌర! ఆ
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో!
    చేతికి వేసి సంకెలల చెంగట చేరుచు నీదు ధూర్తతన్
    మ్రోతల తోసివేయునిక మ్రోలను మ్రొక్కుచు సాగిపొమ్ము పో!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  10. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జి. ప్రభాకర శాస్త్రికి గంభీర సలహా:

    ప్రీతిగ కమ్యునిష్టులను ప్రేతల కాడికి పారద్రోలుచున్
    తాతల నాటి కాంగ్రెసును త్రవ్వుచు భూమిని పాతిపెట్టుచున్
    నేతయి రాజకీయమున నిండుగ మోడిని తిట్టి మొట్టునా
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో!


    కాడికి : తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
    వద్దకు, దగ్గరకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉంది. ఇంతకూ కమ్యూనిస్టు, కాంగ్రెస్సు, బీజెపిలకు చెందని ఈ కోతి 'తృణమూల్ కాంగ్రెసు'ది కాదు కదా!? 😀

      తొలగించండి


    2. జీపీయెస్ వారి దే పూరణైనా దీది చుట్టు తిరగాల్సిందే :)



      జిలేబి

      తొలగించండి
  11. (కేవలం ధనంకోసం అప్రయోజకుని ప్రేమలో పడి తమ
    మాటలు వినని మొండి కూతురుతో తల్లిదండ్రులు )
    ఆతనికున్న సంపదకు
    నంతగ గ్రుడ్డిగ వాలిపోతివా ?
    చేతము కెక్కు రూపమును
    చెల్వగు శీలము లేనెలేవుగా ?
    కాతర మందుచుండె నెద ;
    కాదని యందువా ? నీదు కర్మ ; మా
    కోతిని బెండ్లియాడు ; మిక
    కూటికి గుడ్డకు లోటు లేదు పో !!

    రిప్లయితొలగించండి
  12. ప్రీతిని సిరిసంపద గల|
    నాతిని చేపట్ట జగతి నరునకు నెంతో |
    ఖ్యాతిగ, ధనముల్ గలిగిన
    "కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?"

    రిప్లయితొలగించండి
  13. ప్రీతిగ జూచెడు మ ర ద లి
    జాతకము సరి య గు చుండ సతి గా నామె న్
    భీతి ని చెంద క నీవా
    కోతి ని బెండ్లాడు మింకఁ గూటికి లోటా

    రిప్లయితొలగించండి
  14. మాతులు డిట్లు నుడివెఁ 'నో
    గీతా పాశ్చాత్యులనిక గెలువగ లేవే!
    వేతన మధికము బావకు
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక తండ్రి ప్రేమమైకంలో యున్న కూతురితో

      ఉత్పలమాల

      కోతల రాయనిన్ వలచి కూరిమి నమ్ముచుఁ బ్రేమ పేరిటన్
      మాతనుఁ దండ్రినిన్ మఱచి మైకము గ్రమ్మఁగ వీడనెంచితే
      వ్రాతను మార్చలేరెవరు రంజిల లేవట, బుద్ధి మాంద్యపున్
      గోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో!

      తొలగించండి
    2. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. 'నుడివె' తరువాత అరసున్న అవసరం లేదు. అక్కడ సరళాదేశం జరుగలేదు కదా!
      ****
      సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
  15. కూతలు చాలును యేదో
    కోతినిబెండ్లాడుమింక, కూటికిలోటా
    సీతయ్యా? బిడ్డను గను!
    తాతల యాస్తిని గను బుడతడు బుట్టు నికన్

    పెండ్లి కన్నా, ఆస్తి పరహస్తగతం కాకూడదు అనే బాధ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. కాని 'చాలును + ఏదో' అన్నపుడు సంధి నిత్యం. "చాలించు మెదో" అందామా?

      తొలగించండి
  16. రాతిరి స్వప్నమందు రఘురాముడు మారుతి జూచి మెచ్చుచున్
    నాతి సువర్చలన్ బిలిచి నమ్మగ బల్కుచు చెప్పెనిట్టు లీ
    భూతలి నీతనిన్ గెలుచు బూరుషు డొక్కడు లేడు సత్య మీ
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి నమస్సులు.
    మాతయు గతించె నొకనికి
    తాతయు యాత్రకు వెడలెను ధర్మ సఖితోన్
    వింతగ బాలుడు ముదమున
    కోతిని బెండ్లాడు మిoక , గూటికి లోటా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది.
      రెండవ పాదం చివర గణదోషం. "వెడలెను తన సతితోడన్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురువు గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      మీ సూచనలు నాకు చాలా విలువైనవి.

      తొలగించండి
  18. నాతికి చందము లేదని
    సాతము కనబర చలేదు సంపద నంతన్
    కూతురికిచ్చు కనుక నా
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా ?

    రిప్లయితొలగించండి

  19. నాతియె కాదది కోతియె
    యాతన్వికి బెండ్లి యగుట యంత సులువు కా
    దే!తగురా! సిరిగలయా
    కోతిని బెండ్లాడు మింకఁ గూటికి లోటా?
    ***)()(****
    (నిరపేదైన ఒకనికి మిత్రుని సూచన)

    రిప్లయితొలగించండి
  20. 🙏శ్రీ గురుభ్యోన్నమః

    భ్రాతలు జూడరైరికను బాగుగ యామికి బెండ్లి చేయగన్,
    ఖాతరు జేయడే ఖలుడు క్షాంతుడు బిడ్డను బాగు గోరడే,
    మాతయె దెల్పెనా తనయ మంచిని యెంచుచు "బావయే గతే
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో!"

    యామి-సోదరి; క్షాంతుడు-తండ్రి:
    క్షాంతుడు విడి పదమౌటచే ఖలుడు లోని'డు' గురువు కాదు.

    రిప్లయితొలగించండి

  21. ... శంకరాభరణం...
    10/10/19 గురువారం

    సమస్య:

    కోతిని బెండ్లియాడు మిక గూటికి గుడ్డకు లోటు లేదు పో

    నా పూరణ
    ***** ****

    కోతలు గోయు నీవు కడు గోరినవాడును;జాబు జేయ డే

    రీతిగ సాకునమ్మ నిను; రిక్తము జేయడె యాశలన్నియున్

    కోతనకమ్మ సుందరత కొంచమె కాని గుణమ్ము గొప్పదౌ

    జీతము బాగవచ్చు సుత!చేకొను దెచ్చిన వాణ్ణి నీవు;నా

    కోతిని బెండ్లియాడు మిక గూటికి గుడ్డకు లోటు లేదు పో

    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷


    రిప్లయితొలగించండి


  22. ఆ తియ్యటిపండ్లను నీ
    వా తీగ లను తునుమాడ, వాగుల వంకన్
    స్నాతము లాడంగను నా
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. భీతినిజెందకవినుమా
    నాతియమారాముపట్టి నర్మచరితయున్
    వీతభయంబునుగలయా
    కోతినిబెండ్లాడుమింక గూటికిలోటా?

    రిప్లయితొలగించండి
  24. కోతిని బెండ్లియాడుమికగూటికిగుడ్డకు లోటులేదుపో
    రోతలుగల్గునట్లుగనురూమరులాడుచునుండభావ్యమే!
    కోతికి గూటికిన్వెరసికూర్చుటబంధము నొప్పునేయిలన్
    గోతులుదేవతాసములుకూర్మినిజూచిన బుణ్యమబ్బుసూ

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. నీ తలరాతను మార్చగ
      నా తరమా మరి నిజముగ నా విధి కైనన్
      యే తీరుగ నచ్చె నకట
      కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?

      తొలగించండి
    2. బాగుంది.
      'ఐనన్ + ఏ' అన్నపుడు యడాగమం రాదు. "నా విధికిన్ నీ। కే తీరుగ..." అనండి.

      తొలగించండి
  26. కం.
    నూతన వంటల నేర్చుచు
    పాతొక రోతగ తగదను భామా మణితో
    కోతల రాయుడు తలచన
    కోతిని పెండ్లాడుమింక గూటికి లోటా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. కందం
    ఆతడు హాస్య నటుండనఁ
    బ్రీతిగఁ బ్రతి చిత్రమందువేడుక జేయున్
    జాతక మతికెను నీవా
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా!

    రిప్లయితొలగించండి
  28. ఆ తోఁక మాత్ర మొక్కటి
    యే తక్కువ కొంటెపిల్లయే మర్కటమే
    నాతిని సంపద లీనెడు
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?


    ఊత పదమ్ము లేరికిని నూరక పోవునె యేఁగ కాటికే
    యీ తఱిఁ గొన్న నొక్కటి గ్రహించ నగున్ మఱి యొక్క టూరకే
    యాతని కబ్బెసంపు నుడి యయ్యది, నాతినిఁ, బొందు మూరకే
    కోఁతినిఁ, బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో

    రిప్లయితొలగించండి
  29. ఈరోజు సమస్యాపూరణం

    *కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా*

    తండ్రి కూతురితో అన్న మాటలు (ఒక సన్నివేశం వలె)

    నీతిని జెప్పిన కూడను
    రాతిగ మనసును మలుచుకు రానంటివిగా
    కోతలు బాగా కోసెడి
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?

    కళ్యాణ్ చక్రవర్తి

    రిప్లయితొలగించండి
  30. నీ తనువూ మనస్సులను నిండుగ యర్పణ చేయబోవఁ నీ
    వాతని రూపమెంచకుము, బంగరు తత్త్వపు యందహీనుడౌ
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో,
    జీతము జీవితమ్ములను చింత యెఱుంగక నిర్వహించుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది.
      "తనువున్... నిండుగ నర్పణ... తత్త్వపు టందహీనుడౌ" అనండి.

      తొలగించండి
  31. Focusing on basics...

    తాతను, మరి నా మాటిను!
    "నాతి చరామి" యను బాస నావల యెడకన్
    ఖాతరు చేసెడి దైతే,
    కోతిని బెండ్లాడు మింక కూటికిలోటా?
    ............
    రామస్వామి కిడాంబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది.
      'విను'ను 'ఇను' అన్నారు. "తాతను నా మాట వినుము.... నావల నిడకే...చేసెడిదైనన్" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారూ...
      సవరణలతో ..
      తాతను, మరి నా మాటిను
      నాతి చరామి యను బాస నావల నిడకే
      ఖాతరు చేసెడి దైనన్
      కోతినిబెండ్లాడుమింక కూటికిలోటా?

      తొలగించండి
  32. మిత్రులందఱకు నమస్సులు!

    [గత కాలమున నా స్నేహితుఁ డొక్కఁడు కులంపుఁ బట్టింపులు లేకుండా, యెందఱో కన్యలను పెండ్లి చూపులు చూచుచు, నెవరు తనకుఁ దగినవారో యెన్నుకొనలేక యవస్థ పడుచుండఁగా, నందము కన్న గుణము మిన్న కావున, నతని కులపుదే యయ్యు, నందము లేకున్నను గుణవతియు, ధనయుక్తయు నైన కన్యను బెండ్లియాడుమని వానికి నేనొసఁగిన సలహా]

    "నాతుల నిందఱం గనఁ బెనంగఁగ నేల? గుణమ్ము లేనిదౌ
    నాతుక రంభకన్న, సుగుణమ్ములదౌ కులమింటి కోఁతి మేల్!
    నాతులఁ జూడ మానియు, ధనంపు గనిం, గులమింటి సద్గుణిం,
    గోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ, గూటికి గుడ్డకు లోటు లేదు పో!"

    రిప్లయితొలగించండి
  33. ఒకే ఇతి వృత్తమును ముందు కం. లో తిరిగి ఉ. లో ప్రయత్నించాను.

    ఉ:
    నాతియొకర్తె తా మనసు నాటిన ప్రేమను దెల్పు చుండనై
    నూతన వంటకమ్ములను నూరొక రీతుల విక్రయించుటన్
    కోతల రాయనిన్ దెలుప కోరిక గల్గెను వాని డెందమున్
    కోతిని బెండ్లి యాడుమిక గూటికి గుడ్డకు లోటు లేదు పో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. వాతలు పెట్టేదా? నీ
    చేతలు చేదాటి పోగ, చెపితే వినవేమ్?
    మూతి బిగించక, చూపిన
    కోతిని బెండ్లాడు మింక గూటికి లోటా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది.
      "వాతలు పెట్టుదునా నీ ... చేదాటి పోయె చెప్పిన వినవే..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారూ..
      సవరణలతో

      వాతలు పెట్టుదునా? నీ
      చేతలు చేదాటి పోయె చెప్పిన వినవే?
      మూతి బిగించక, చూపిన
      కోతిని బెండ్లాడు మింక కూటికిలోటా

      తొలగించండి
  35. చేతలు వానరప్రకటచిత్రవిచిత్రితవిక్రమంబులై
    ‌సాతతచంచలుం డనిరి శైశవమందు, వయోధికండునై
    యాతడె సొమ్ము కూర్చఁ గని యాత్మజతో పిత యిట్లు పల్కె నా
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో".

    రిప్లయితొలగించండి
  36. ఓల్డ్ సిటీ తెలుగు లో..

    సైతాన్ పట్టింద? తమామ్
    ఖాతర్ చేయవ్! మసూదు ఖాన్మియ బల్ఖూబ్!
    బేతాబు గాకు! చెప్పిన
    కోతిని బెండ్లాడు మింక గూటికిలోటా?


    సైతాన్ .. దయ్యం
    తమామ్ .. మొత్తానికి
    ఖాతరు ... Regard
    బేతాబు ... Anxious
    మసూదు ఖాన్ మియ .... పేరు (వరుడు)
    బల్ ఖూబ్ .. చాలా మంచి

    రిప్లయితొలగించండి


  37. నీ తాటవొలిచెదను! రా!
    కోతిని బెండ్లాడు మింక గూటికి! లోటా
    చేతికి నిచ్చెద ట్రింగను
    మ్రోతల నాడించుచున్ ప్రమోదమ్ము గనన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  38. కందము:
    నాతిని బెండ్లాడ నొకడు
    చేతన్ కాసులు కొరవడ చింతిల సాగెన్
    మాతయు, బ్రేమగ బెంచుమ
    "కోఁతినిఁ, బెండ్లాడు మింకఁ గూటికి లోటా?"

    రిప్లయితొలగించండి


  39. ఆ తరుణులకై వెదుకుచు
    నీ తలనీలాలు పోయె నే కొమరా! నీ
    జాతకమున కిదియె తగున్
    కోతిని బెండ్లాడు మింక గూటికి లోటా!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  40. ఆ తరుణులకై వెదుకుచు
    నీ తలనీలాలు పోయె నే కొమరా నీ
    జాతకమునకిక దొరికిన
    కోతిని బెండ్లాడు మింక గూటికి లోటా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు
    లోటు లేదు పో

    సందర్భము: త్రిమూర్తులను కాముకులని హేళన చేసిన నారదునికి అల్లుడు పర్వతుడు. అనుకోకుండా ఇద్దరూ రాక్షస రాజు మకరధ్వజుని కుమార్తె శ్రీ మతిని ప్రేమిస్తారు. ఆమె శాపవశంగా పుట్టిన భూదేవి.
    స్వయంవరంలో నారదుని ముఖం కోతిలాగా అందరికీ కనిపించా లని ప్రార్థిస్తాడు పర్వతుడు. తర్వాత వెళ్ళి పర్వతుని ముఖం గాడిదలా అందరికీ కనిపించా లని ప్రార్థిస్తాడు నారదుడు. ఇద్దరికీ సరే నంటాడు శ్రీ హరి.
    వారిద్దరూ ఒకరి నొకరు అనుకున్న మాటలు పద్యంలో పొందు పరచబడినవి.
    చివరికి నాట్యాచార్యుల రూపంలో వున్న విష్ణువును వరిస్తుంది శ్రీమతి.
    విపులమైన కథకోసం *శ్రీరామ కథ* అనే సినిమా పద్మనాభం దర్శకత్వంలో వచ్చింది చూడవచ్చు (1969)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పాతిని నేనె లె"మ్మనుచుఁ
    బర్వతుఁ జూపుచు నారదుండు "సం
    ప్రీతిని జేరి గాడిదను
    బెండిలి యాడకు శ్రీ మతీ!"యనెన్
    నాతిని శ్రీ మతిన్ వలచి
    నారదుఁ జూపుచుఁ బర్వతుం డనెన్
    "కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ
    గూటికి గుడ్డకు లోటు లేదు పో"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    10.10.19
    -----------------------------------------------------------
    పాతి= భర్త

    రిప్లయితొలగించండి