16, అక్టోబర్ 2019, బుధవారం

సమస్య - 3164 (నిదురించెడువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"
(లేదా...)
"నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

65 కామెంట్‌లు:


  1. సరి క్రొత్త సరదా పూరణల సంచయము:
    (జిలేబి గారికి అంకితం)

    1. "కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః"

    ముద్దుగ గోచి కట్టుచును ముద్దలు మూటికి మీర మ్రింగకే
    కొద్దిగ రామనామమును కూడలి నందున నుచ్చరించుచున్
    చద్దరు నాదటన్ పరచి చావిడి నందున గుఱ్ఱుకొట్టుచున్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    ************************************

    2. "ఏరువాకా సాగారో"

    చద్దిని మూటగట్టుకొని చక్కని యెద్దుల కాడిగట్టుచున్
    ముద్దులగుమ్మనున్ గొనుచు ముచ్చటి పైరును సాగుచేయుచున్
    కొద్దిగ విశ్రమించుటకు గుడ్డను జాపుచు చెట్టునీడనున్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    ***********************************

    3. "భలే ఛాన్సులే!"

    ముద్దుల నిచ్చి గోవులకు మూటను కట్టుచు పేడలన్నిటిన్
    రద్దును జేసి కోపమును రాతిరి ప్రొద్దున నత్తగారివౌ
    గుద్దుల నోర్చి రేపటికి గూటికి గుడ్డకు చింతలేక భల్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్


    ***************************

    4. "శరణం భవ కరుణామయ కరణం"

    ప్రొద్దున రాతిరిన్ విడక పోకిరి రీతుల చుట్టబెట్టుచున్
    రద్దును చేసి సుంకమును రమ్యపు రీతిని దొంగ లెక్కలన్
    పద్దులు వ్రాసి నల్లటిది పైకము దాచుచు దిండుక్రింద భల్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    *****************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

    2. మధుర స్మృతులు: 1956: కీ. శే. ఆకిలి శ్రీరామ శర్మ, తెలుగు పండితులు, ముత్తుకూరు:

      కొద్దిగ పంచతంత్రమును కొద్దిగ నన్నయ భారతమ్మునున్
      కొద్దిగ విశ్వనాథులను కొద్దిగ సాక్షిగ పానుగంటినిన్
      కొద్దిగ నర్ధ బిందువును కొద్దిగ సంధుల సూత్ర శాస్త్రమున్
      ముద్దుగ పల్కుచుండగను బుద్ధిని వీడుచు లాస్టు బెంచిలో
      నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్ :)

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    విద్దెల మర్మమున్ దెలిసి , విష్ణుపదమ్మె పరమ్మటంచు దా...
    నొద్దిక నమ్మి , నెమ్మది దురూహల జేయక , సత్యమార్గమే
    ముద్దని , కొల్చి సాధుమునిపుంగవకోటిని శాశ్వతమ్ముగా
    నిద్దురపోవువాడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్ !!

    మైలవరపు మురళీకృష్ణ
    వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముద్దుల బాలుడై పరమమోహనుడై వరచిద్విలాసుడై
      విద్దెల రూపమై బొటనవ్రేలును నోటధరించి, కాచుచున్
      సద్దయనెల్లజీవులఁ , బ్రశాంతముగా వటపత్రశాయియై
      నిద్దురపోవువాడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్!!

      మైలవరపు మురళీకృష్ణ
      వెంకటగిరి.

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

      తొలగించండి
  3. వదలక నన్యాయమ్ముల
    నెదిరించుచు తాను ధర్మ మిమ్మహి నిలుపన్
    బెదరక దుష్టుల గుండెను
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  4. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    సందర్భము: ఇది భగవద్గీతలోని ద్వితీయాధ్యాయము (సాంఖ్యయోగము) నందలి 69 వ శ్లోకముయొక్క భావము.
    లోకు లందరు నొడలు మరచి నిదురించునపుడు యోగులు మేల్కొని యుందురు. వా రాత్మ చింతనలో ధ్యానములో మునిగితేలుచుందురు. అప్పు డెవరును వారి నిష్ఠను భంగపరుపలేరు కదా!
    అట్లే లోకులు నిత్య కృత్యములలో నిమగ్నులైయున్న పగటిపూట యోగులు నిదురపోవుదురు..
    (అనగా వారికి లోక సంబంధములై చేయదగిన కర్మ లేవియు నుండవు కాబట్టి పట్టించుకొనకుండ నుందు రని.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఎది నిశియో యా నిశిలో
    మెదలుచుఁ గను వాడు యోగి
    మేల్కొను వా.. డె
    య్యది పగలో యా పగటన్
    నిదురించెడు వాఁడె ధారుణిన్ యశమందున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    16.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  5. హద్దులు మీరకుండగనె నందరు మెచ్చగ పొద్దునుం డియున్
    ముద్దగు పల్కులన్ జనుల మోసము చేయుచు , రాత్రులం దునన్
    కొద్దిగ గాళ్ళుచాచుకొని గుండియ పై కయిలుంచి హా యిగన్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    రిప్లయితొలగించండి
  6. బెదరక సమరాంగణమున
    చిదుముచుశాత్రవులనెల్ల చిచ్చరపిడుగై
    యదటునఁనరి గుండెలలో
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అదటున' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.

      తొలగించండి
  7. మృదువగు పలుకుల తోడన్
    పదుగురు మెచ్చెడి విధముగ
    వర్తన జేయన్
    యెదపై కైతో హాయిగ
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...జేయన్ + ఎదపై' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  8. హద్దులెరింగి బాధ్యతల నౌదఁలదాల్చుచు నెల్లవేళలన్
    పెద్దల గౌరవించుచును పేదలనెల్లపుడాదుకొంచు సం
    సిద్ధతసాధుపుంగవుల సేవలుజేయుచు నిర్వికారుఁడై
    "నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"

    రిప్లయితొలగించండి
  9. ఉ:
    ఖుద్దున నేను జూచితిని కూర్చుని నిద్దుర బోవు మిత్రునిన్
    వద్దని యెంత జెప్పినను వాడుక రీతిన నాచరింపగన్
    బద్ధక మేల యంచుగన పాడి పరిశ్రమ నడ్పు చుండ నా
    నిద్దుర పోవు వాడు ధరణిన్ ఘన కీర్తి వహించి మించెడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    ఎదురుగ శత్రువులున్నను
    చెదరని ధైర్యం దెలుపగ చేయుచు పోరున్
    బెదరక మృత్యువు ఒడిలో
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  11. కదలక నిద్ర నటించుచు
    మెదలక జేసెడి బనులను మెచ్చక యుండున్
    ముదమగు మౌనము జూచిన
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"

    రిప్లయితొలగించండి
  12. కం॥
    మదినేకాగ్రత తోడను
    ముదము గడుపు యోగనిద్ర ముక్కంటి యిలన్
    సదయుడు కన్నులు తెరవక
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"



    రిప్లయితొలగించండి
  13. అజగరోపాఖ్యానం గుర్తుకొచ్చింది.🙏

    ఎదిగిన బుద్ధిన్ సతతము
    మది నార్వురు శత్రువులను మద మణచంగన్
    ముదముగ నజగరు నోలెన్
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశ మందున్

    రిప్లయితొలగించండి


  14. అదురక కునుకును వీడక
    బెదురక జగతిని మరచుచు పిరియము తోడై
    కుదురుగ ప్రభువుని తలచుచు
    నిదురించెడువాడె ధారుణిన్ యశమొందున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. మా చిన్ననాటి మిత్రుడిని గుర్తుకు దెప్పించితిరి.🙏

    పెద్దది పుస్తకం బొకటి పిన్నతనంబున తల్గడోలె తాఁ
    నిద్దుర బోవగా పితరు నిష్ఠురమాడ గవేగమే చనెన్
    హద్దుల వెంట,పెద్దడయి హాయిని గూర్పగ, నొప్పెమాకికన్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్.

    రిప్లయితొలగించండి
  16. పెద్దగ లేక యాశ లవి బిడ్డలకున్ తగు విద్య నిచ్చి యే
    కొద్దియొ చేయుచుం బొదుపు కూడని కోర్కెల జేసి కట్టడి
    న్నిద్దరు నేక బాట బయనించుచు చింతలు లేక రాతిరిన్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్.

    రిప్లయితొలగించండి
  17. కుదురుగ శివ నామంబు ను
    వదలక జపియించి యిహపు వాంఛ లు తొలగ న్
    ముదము న త న్మ యతపము న
    నిదురిం చెడు వాడు ధారు ణి న్ యశ మం దున్

    రిప్లయితొలగించండి
  18. (వ్రేపల్లెలో యశోదమ్మ సందిటనిద్రిస్తున్న నందనందనుడు)
    నిద్దపు నీలిముంగురులు
    నిండుగ మోమున నాటలాడగా ;
    ముద్దగు మోవి మీద తెలి
    ముత్తెపు నవ్వులు చిందుచుండగా ;
    హద్దులు లేక అమ్మయెద
    హత్తుకుపోవుచు చిన్నికన్నడై
    నిద్దురపోవువాడు ధర
    ణిన్ ఘనకీర్తి వహించి మించెడున్ .

    రిప్లయితొలగించండి

  19. ... శంకరాభరణం... . 16/10/2019 .....మంగళవారం

    సమస్య
    *** *** **

    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"

    నా పూరణ.
    ***** ***
    ముద్దుగు చిన్నికృష్ణ ముదుముద్దుగ దూరుచు గొల్లలిండ్లలో

    సద్దుయె జేయకన్ మిగుల చక్కగ వెన్నను దొంగలించగన్

    హద్దుల బెట్టు నీ సుతిని నంచును భామలు రాగ యింటికిన్

    నిద్దుర బోయినట్టులను నేర్పుగ నాటకమాడుచుండగన్

    బుద్దిగ సూనుడున్ నిదురపోయెను నిందలు వేయటేలనో

    సుద్దులు జెప్పకంచు యశోదయె గొల్లల మందలించదే?

    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  20. ఈ రోజు శంకరాభరణము సమస్య
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో

    వారణావతమునకు వచ్చి రాబోవు ప్రమాదమును వుహించక లక్క ఇంటిలో మత్తుగా నిద్ర బోవుచున్న భీముని చూచి కృష్ణుడు కోపముగా పలుగు మాటలు (శ్రీకృష్ణ పాండవీయము సినిమాలో మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా నా పాటకు స్పూర్తి )



    పంపిరి మిమ్ములన్జంప దలచి కౌరవులిటకు, కట్టిరి తెలివిగ నొక
    లక్క యింటిని. మెదలక నూరు కుంటివా భీమసేనా? వచ్చు బిందము తల
    చగలేవ? విందు భోజనమును చేయుచు సతతము మత్తుతో వెతపడును గ
    ద(నిదురించెడువాఁడె ధారుణిన్, యశమందు నె)ప్పుడు రాబోవు ముప్పును కను

    గొనుచు ముందుగన్ సరిపడు మొనలు జేయు
    వాడు భువిలోన, మత్తును వీడు మయ్య
    రక్షణ చర్యలు నిడవలె రయముగ నని
    పలికె భీముని తో వృష్ణి పెలుచ కలుగ


    బిందము = ఆపద , మొనలు = వ్యూహములు, పెలుచ = కోపము

    రిప్లయితొలగించండి
  21. ఉత్పలమాల
    బుద్ధిగ నేర్వ జెప్పఁగ సమున్నత భారత, రామగాథలన్,
    దద్దయ, దేశభక్తి, ముదితన్దగు రీతిగ గౌరవించెడున్
    బెద్దరికమ్ము, వీరుడుగఁ బెంచెడు జీజియ బాయిదౌ యెడిన్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    రిప్లయితొలగించండి
  22. కందం
    కదనమున తమ్మి మొగ్గర
    విధమ్ము నెఱుఁగు నభిమన్యు విదురత జననీ
    సదమల గర్భవసమ్మున
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  23. సదయత పరులకు హితమును
    ముదముగ జేయుచు నుండున్ మునివరుని వలెన్|
    చెదరని చిత్తము తోడన్
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"

    రిప్లయితొలగించండి
  24. వదలక లక్ష్యము నెన్నడు
    కుదురుగ పనులను నెరపుచు గురి తప్పక నే
    బెదురు నెరుంగక హాయిగ
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  25. మదమున మెలగుచు జనులను
    వదలక హింసించునతడు బంధువెయైనన్
    చిదుమను నాతని నెదపై
    నిదురించెడువాడెధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. 6/4/2016 నాటి పూరణము:

      వదలక మది భూతముల మ
      హదంచి తానురతి పెద్దలం దుంచక కిం
      చిదగౌరవమ్ము సుఖముగ
      నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.


      27/8/2016 నాటి పూరణములు:

      మొద్దులు చిన్నబుచ్చఁ గడు మూర్ఖపు సుద్దుల సద్దు సేయకన్
      మిద్దెలు లేక యున్న నిట మీరిన విద్దెలఁ బెద్ద నంచుఁ దా
      బద్దును బూని శుద్ధ మతి బద్ధ పదార్పిత వృత్తి గ్రద్దనన్
      నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్


      కదనములఁ గాలు దువ్వక
      పదిమందికి మంచి సేయ పరువున బ్రతుకే
      పదిలముగ నుండ సుఖముగ
      నిదురించినవాఁడు కీర్తినే గడియించున్

      తొలగించండి
    2. చదలునఁ గాపాడి సురలఁ
      గుదురుగ నొక చోట నుండి కొన్ని యుగమ్ముల్
      నిదురించెను ముచుకుందుఁడు
      నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్


      వద్దుర మొద్దు నిద్దుర ప్రభాతపు వేళయు సంధ్య వేళ యం
      దద్దము ముందు నిల్వకుమ యందము చిత్తము నందుఁ జూపుమా
      యెద్దిన మైన సత్కృతము లింపుగఁ జేసి పరాత్ముఁ దల్చుచున్
      నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

      తొలగించండి
  27. దుర్యోథన అర్జునులు సాయము గోర రాగా శ్రీకృష్ణుని కపట నిద్ర.🙏

    వద్దన రెవ్వరున్హరిని వంతుల వారిగ బంచుకోవగన్
    నిద్దరు సోదరుల్ షరణ మీవనటంచును గోకులోత్తమున్
    నద్దర గోర నేగగను నంత నెరింగియు కైతవంబునన్
    నిద్దుర పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    కైతవము-కపటము

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి
    వహించి మించెడున్

    సందర్భము: కలియుగంలో శ్రీ పాద శ్రీ వల్లభస్వామి నరసింహ సరస్వతీ స్వామి మాణిక్యప్రభువుల తర్వాత దత్తాత్రేయావతారంగా ప్రసిద్ధులైనారు శ్రీ స్వామి సమర్థ. వీరినే అక్కల్ కోట స్వామి అనీ అంటారు. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలో వీ రెన్నో మహిమలు చూపారు.
    వీరి చరిత్రలోని ఒక సంఘటన యిది.
    (శ్రీ స్వామి సమర్థ.. రచన.. శ్రీ ఎక్కిరాల భరద్వాజ.. పుస్తకం 29,30 పుటలు)
    బాబాసబ్నీస్ భక్తితో స్వామికి ఒక పట్టు పరుపు బహూకరించినాడు. సబ్నీస్ బావగా రొక పౌరాణికుడు. సన్యాసులకు పరుపు లేమిటి? అని విమర్శించేవాడు.
    స్వామి ఒకరోజు పౌరాణికుని వెంట బెట్టుకొని ఒక కొండపైకి వెళ్లాడు. విపరీతమైన చలి. ఆ రాత్రి స్వామి నిశ్చింతగా ఒక బండమీద నిద్ర పోయాడు. చలికి నానా అవస్థ పడ్డాడు పౌరాణికుడు. పొద్దున్నే స్వామి లేచి "చూశావా! నా పట్టుపరుపు.." అన్నాడు.
    కొండమీద బండా.. పట్టు పరుపూ రెండూ సమానమే స్వామికి..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ముద్దుగఁ బండుఁ బట్టు పరు
    పున్ "సబినీ" సొసగంగఁ.. గొండపై
    వ ద్దనకుండ మెండు చలి
    బండలమీదఁ బరుండుఁ జింత లే
    కద్దిర! యోగిరా జనగ
    "నక్కలకోట" యతండె.. యవ్విధిన్
    నిద్దురపోవు వాఁడు ధర
    ణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    16.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. అద్దనుజాంగనున్ దునిమి యావుల మందల గాచుచున్ జనుల్
    నిద్దురపోవు వేళ నవనీతము మ్రుచ్చిలి కై చరించినట్టి యా
    ముద్దుల నొల్కునట్టి కడు మోహను డా వట పత్ర శాయియై
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    రిప్లయితొలగించండి
  30. మొద్దనిబేరుగాంచునిలబూటయుమొత్తములేవకుండగన్
    నిద్దురపోవువాడు,ధరణిన్ ఘనకీర్తివహించిమించెడున్
    దద్దయుగారవంబడరధార్మికబోధనజేయుచుండుచో
    నద్దివికేగియచ్చటనుహాయినిసౌఖ్యములందవచ్చునూ

    రిప్లయితొలగించండి


  31. ఉత్పలమాల
    చద్దిని మూట కట్టుకొని జల్దిగ చేరుచు పాఠశాల తా
    నొద్దిక గాను విద్యల చెణుక్కుల మేల్మిని నేర్చుకొంచు మేల్
    సుద్దుల జాగురూకతని సూత్రము లన్ గ్రహియించి తృప్తిగా
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. హృదయము సున్నితమౌ పతి
    సదయుడయి సదా ప్రజలను సాకుచు ధృతితో
    కదనము నరి గుండెలలో
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  33. ఎద్దుల దున్నుచున్ పొలము, నింపును బొందుచు పాశుపాల్యమున్
    హద్దులలో వసించుచును, వ్యర్థపు మాటలు పల్కకుండగా
    ముద్దుల భార్య సంగడిని, పొందుచు సొంపు గృహమ్మునందునన్
    దిద్దుచు పిల్లలన్ సతము తీరగు పద్ధతిలోన హాయిగా
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    రిప్లయితొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    విద్దెలఁ జక్క నేర్చి సరవిం దగు రీతిని యుద్ధమందునన్
    మద్దుల పేరి వాని బలమర్దనుసూనుని నర్జునున్ సదా
    బుద్దిఁ దలంచి శాత్రవుల పోటు మగండయి వారి గుండెలన్
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్!

    రిప్లయితొలగించండి



  35. ఒద్దిక తోడతా సతత ముత్తమ బుద్ధిని చూపుచున్ సదా
    పెద్దల మాటలను వినుచు ప్రేమను పంచుచు నెల్లవారికిన్
    సుద్దులు చెప్పుచున్ తిరుగు చున్తన మానస మందునిమ్ముగా
    నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్



    పదిలం బుగ నారాయణు
    నెదలో నిలుపుచు కొలిచిన నెప్పుడు తొలగున్
    మదిలోని బాధ, బాగుగ
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"*


    సదయుండై భువియందున
    ఎదిరించక పెద్దవారి నెల్లప్పుడు తా
    చదువుల మర్మం బెరుగుచు
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"*

    పొదుపును చేయుచు ధనమును
    ముదమున దినములు గడుపుచుబుద్ధిగ బ్రతుకున్
    కుదురుగ నెదపై కరమిడి
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"*

    బెదురే మాత్రము చూపక
    కదనము నందన నిరతము గాభర పడకన్
    యెదనొడ్డి రిపుల మదిలో
    నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"*

    రిప్లయితొలగించండి
  36. ముదమారగ ఇందిరయే
    పదముల తాపట్టినంత పరవశుడగుచున్
    పదిలము జగముల గాచుచు
    నిదురించెడువాడె ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  37. అదరక బెదరక నిరతం
    బెద లోతుల నుండి యెగయు నెలమిని ప్రజకున్
    ముదమున సేవల నొసగుచు
    నిదురించెడి వాడె ధారుణిన్ యశమందున్!

    రిప్లయితొలగించండి
  38. అదరక బెదరక నిరతం
    బెద లోతుల నుండి యెగయు నెలమిని ప్రజకున్
    ముదమున సేవల నొసగుచు
    నిదురించెడి వాడె ధారుణిన్ యశమందున్!

    రిప్లయితొలగించండి
  39. ఉత్పలమాల

    హద్దులు లేని మోదము నయాచితమైన ప్రధాని పీఠమున్
    వద్దన లేక చల్దులుగ వండిన సంగటి పాలకూర ము
    ప్పొద్దుల మెక్కుచున్ సభల ముందుకు వెన్కకుఁ దూఁగి కృష్ణపై
    పెద్ద జలాశయమ్ములను వేడుక నెత్తుల పెంచు ధ్యాసతో
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్

    రిప్లయితొలగించండి