18, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3166 (పాపమే దక్కు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపమే దక్కు పాదాభివందనమున"
(లేదా...)
"పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్"

83 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    దాపున జేరుచున్ మురిసి దండము పెట్టుచు మాటిమాటికిన్
    చూపుచు వేల కోటులను, చుక్కలు చంద్రుడు పాకెటందునన్
    జాపుచు గార్దభమ్మునకు చక్కని చేతులు టిక్కెటొందగన్
    పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్

    రిప్లయితొలగించండి
  2. తాపసవేషధారియయి తాను మహాత్ముడనంచు జిత్రముల్
    జూపెడివాని నైజమును జూచినవా డిటు లాడుచుండె యీ
    పాపిని జేరబోవలదు వంచకు డీతడు నమ్ము డంతటన్
    బాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్.

    రిప్లయితొలగించండి
  3. ధరను ప్రత్యక్ష దైవమై వరలునట్టి
    గురుని ధిక్కారమొనరింప నరునకిలను
    పాపమేదక్కు, పాదాభి వందనమున
    పొందు తథ్యము మనుజుఁడు పుణ్య ఫలము

    రిప్లయితొలగించండి
  4. జన్మనిచ్చిన వారన్న జాలి లేక
    వదలి వృద్ధాశ్రమాలలో వాసిగాను
    సాదు సంతుల పూజించు జనుల కిలను
    పాపమే దక్కు పాదాభి వందనమున.

    రిప్లయితొలగించండి
  5. ధర్మ దూరులు,మోస విధానపరులు,
    దుర్మదాంధుల గొల్చెడు కర్మ లందు
    పాపమే దక్కు;పాదాభివందనమున
    పుణ్య యోగులు దీవించి మోక్షమొసగు

    రిప్లయితొలగించండి


  6. పెద్దలకు పిన్నలు, జిలేబి, పేర్మి తోడు
    వందనము లాచరింపగ వలయు మీరి
    మిన్నతియు లేక చేయగ మిక్కుటముగ,
    పాపమే దక్కు పాదాభివందనమున!



    జై బోలో గురుమహరాజ్ కీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. హమ్మయ్య!

    దీపము వంటి వారలు ప్రదీప్తులు పెద్దలు వారి సంగడిన్
    కోపము తోడు తిట్టుచు ప్రకోపము తోడుత ఖర్మ కాలెనే
    నీపదముల్ నమస్సులిడ నేటికి యంచు సపర్య చేయగా
    పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఖర్మ' అనే పదం లేదు. "నేటి కటంచు.." అనండి.

      తొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కోపము కామమున్ మరియు కొండొక రీతిని మత్సరమ్మునున్
    తాపము నొందుచున్ విడిచి తన్మయమొందుచు మూఢభక్తినిన్
    దాపున ఫేకు బాబకును దండము పెట్టుచు నాశ్రమమ్మునన్...
    పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్

    రిప్లయితొలగించండి
  9. పల్లెలనుపట్టణంబులపారవేయు
    వ్యర్థములరోగచయమౌటవసుధమీకు
    "పాపమే దక్కు: పాదాభివందనమున
    హరిహరాదులగురువులనభినుతించు

    రిప్లయితొలగించండి
  10. త్రాగి మధువును భార్యతో తగవు పడుచు
    దూరుచు బుధుల నెప్పుడు దుష్టమదిని
    పదుగురెదుట నీతి నుడువు ప్రల్లదునకు
    పాపమే దక్కు పాదాభివందనమున

    రిప్లయితొలగించండి
  11. ధనమె సర్వస్వమనిదల్చి ధరణియందు
    పరుల బలహీనతల మీద బ్రతుక నేర్చి
    నట్టి వారిని గొల్వగ న్యాయ మౌనె
    పాపమే దక్కు పాదాభి వందనమున

    రిప్లయితొలగించండి
  12. పరుల బాగోగు లెంచని భావమున్న
    కరుణలేనట్టి కర్కశాదరణ లందు
    మమత మాధుర్య మెరుగని విమలుడనగ
    పాపమేదక్కు పాదాభివందనమున!

    రిప్లయితొలగించండి
  13. పరుల నిందించి బాధించు వారి కిలను
    పాపమే దక్కు : పాదాభి వంద నమున
    పూజ్య గురువుల దీవెనల్ పుడమి యందు
    లభ్య మగు గాక జనుల కు రమ్య మలర

    రిప్లయితొలగించండి
  14. పాప చింతన గలవారి పాత్ర తెరిగి
    ములుబట్ట దొలగును పాప మనగ
    పుణ్య భావన లేనట్టి మూర్ఖులకిట
    పాప మేదక్కు పాదాభివందనమున
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాదములు బట్ట...' టైపాటు అనుకుంటాను.

      తొలగించండి
  15. తాపసి వోలె రూపమును దాల్చుచు మోసము జేయువానికిన్
    పాపుల రక్షణార్థ మిటువచ్చితి నంచును బల్కువానికిన్
    మాపగునంత మాత్రమున మద్యము మానిని గోరువానికిన్
    పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్

    రిప్లయితొలగించండి
  16. ఎంతచదివిన వాడైననేమిఫలము
    ఎన్ని సూక్తులు వల్లించెనెంత ఘనము
    పాప గుణములు గలిగిన వాని కిలను
    పాపమే దక్కు పాదాభివందనమున!!

    రిప్లయితొలగించండి
  17. చిత్తము శివునిపై భక్తి చెప్పులపయి |
    తీరు, తీరని కొరతలు తీర్చు కొరకు |
    శ్రద్ధ హీనులు పూజలు సలిపి రేని |
    "పాపమే దక్కు పాదాభివందనమున"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రద్ధాహీనులు' అనడం సాధువు. అక్కడ "శ్రద్ధ లేనట్టి పూజలు..." అనండి.

      తొలగించండి
  18. గురువునెగతాళి జేయుచు గులుకునెడల
    పాపమేదక్కు,పాదాభివందనమున
    నాయురారోగ్యసంపద లన్నియిలను
    బొందవచ్చునునింకను బుణ్యతతిని

    రిప్లయితొలగించండి
  19. తే.గీ.

    చిన్న వారికి మర్యాద సేయ నెంచ
    నాదరమ్మున ప్రేమతో నక్కుజేర్చి
    మంచి తలచగ నెప్పుడు నెంచు గాని
    పాపమే దక్కు పాదాభివందనమున

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  20. పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్
    పాపము పుణ్యమున్ గనని పాలకు పాదము బట్టు హీనతన్
    శాపముగా దలంచి మది శాశ్వతుడా హరి పాద ధ్యానమే
    పాపము లంట నీక భవ బంధనముల్ విడు మార్గమౌనుగా

    రిప్లయితొలగించండి
  21. (వరదయ్యపాళెంలో " కల్కి "నని సతీసుతసమేతంగా
    తిష్ఠవేసిన దుష్టునికి పాదవందనాలు చేస్తే పాపమేగా )
    " ఆపదలన్ని పోవునిక ;
    నంజలి సల్పుడు ; కల్కిరూపుడన్ ;
    గోపము లేనివాడ ; మరి
    కొల్లగ మోక్షము మీకు సొంతమౌ ;
    నోపిక మీర సంపదల
    నొంపుడు మా " కను ధూర్తు నమ్మినన్
    బాపమె దక్కు సుమ్ము పద
    వందనముల్ వొనరించువారికిన్ .

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    తాపసులైనవారలు,
    సుధర్మపరాయణులైన వారలున్ ,
    ప్రాపుగనున్నవారలు , విరక్తిగుణాన్వితులైనవారు , చి...
    త్తాపము దీర్చువారలిల దైవసమానులు! మ్రొక్కకున్నచో
    పాపమె దక్కు సుమ్ము !., పద ., వందనముల్ వొనరించు ! వారికిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  23. పెద్దల ముదిమి జూచుచు వెక్కిరించ
    పాపమే దక్కు :
    పాదాభివందనమున
    చిక్కు నాశీర్వచనములు సేమమొంద
    పిన్న లీరీతి తెలుసుకు
    వెలయ వలయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ. అభినందనలు.
      'తెలుసుకు' అన్న ప్రయోగం సాధువు కాదు. "పిన్న లీరీతి నెఱుగుచు..." అనవచ్చు.

      తొలగించండి
  24. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పాపమే దక్కు పాదాభివందనమున

    సందర్భము:
    *నాహం జానామి కేయూరే*
    *నాహం జానామి కుండలే*
    *నూపురే త్వభిజానామి*
    *నిత్యం పాదాభివందనాత్..*
    లక్ష్మణుని సచ్ఛీలాన్ని ఆవిష్కరించటంలో సుప్రసిద్ధమైన దీ శ్లోకం. (రామాయణము.. కిష్కిధా కాండము.. ఆరవ సర్గము 22) ఒక వదినపట్ల మరిది ఎలా ప్రవర్తించా లనేదానికి ఉదాహరణగా లక్ష్మణుని పేర్కొంటూ పై శ్లోకాన్ని చెబుతారు.
    సీతా రామ లక్ష్మణుల వనవాస కాలంలో రావణుడు సీత నపహరించినాడు. రామ లక్ష్మణులు క్రమంగా ఋష్యమూక పర్వతం చేరుకున్నారు. హనుమంతుడు వారితో సుగ్రీవునికి మైత్రి కుదిర్చినాడు.
    రాముడు వాలిని వధిస్తా నని సుగ్రీవునికి వాగ్దానం చేసినాడు. అతడు కూడా రాము నోదార్చి సీతను తెచ్చి నీ కప్పగించే ఏర్పాటు చేస్తా నని మాట యిచ్చినాడు. అంతేగాక ఒక రాక్షసుడాకాశమార్గాన ఒక మహిళ నపహరించుకొనిపోతూవుంటే ఆమె విలపిస్తూ తన సొమ్ములు చీరచెరగులో మూటగట్టి కిందకు వదలివేసిం దని ఆమె సీతయే అయివుంటుం దని ఆ నగలు తాము దాచినా మని పలికి అవి తెప్పించినాడు.
    రాము డవి చూసి కన్నులనిండా నీళ్ళు తెచ్చుకొని లక్ష్మణుని గుర్తించు మన్నాడు.
    పరిశీలించిన లక్ష్మణు డిలా అన్నాడు.
    "నేను ప్రతినిత్యం మా వదినగారికి భక్తితో పాదాభివందనం చేస్తూవుండేవాణ్ణి. కాబట్టి ఆమె కాలి యందెలను మాత్ర మెరుగుదును. ఇవి ఆమెవే! చెవిపోగులు గాని దండకడియములనుగాని నే నెరుగను. ఎందుకంటే నే నెన్నడూ తల ఎత్తి చూసినవాణ్ణి కాదు."
    పై శ్లోకంలోని భావమే ప్రస్తుత పద్యంలో ప్రతిబింబించింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *"నిత్య పాద నమస్కార నిరతి వదిన*

    *యందియలె గాని కర్ణభూ షాదు లెఱుగఁ..*

    *జూడ నెప్పుడుఁ దలయెత్తి.. చూతునేని*

    *పాపమే దక్కు పాదాభివందనమున"*

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    18.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  25. ఆపదనొందువారలనునాదుకొనంగకగీడుసేయుచో
    బాపమెదక్కుసుమ్ము,పదవందనముల్వొనరించువారికిన్
    బాపమెగల్గునెప్పుడునుబాధలనొందుచువేడుకుండినన్
    బ్రాపుగరాకయుండుచును,వారినిబ్రేమగజూడకుండుచో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆదుకొనక' అన్నది "ఆదుకొనంగక" అయింది. 'వేడకుండినన్/వేడుచుండినన్'?

      తొలగించండి
  26. . *శ్రీ గురుభ్యో నమః*
    శంకరాభరణం-సమస్యాపూరణం
    సమస్య :: పాపమే దక్కు పాదాభివందనమున.
    సందర్భం :: గురువులకు పాదాభివందనము అనే వాక్యంలో సమాస పదానికి విగ్రహవాక్యం చెప్పేటప్పుడు పాదములకు అభివందనము అని తత్పురుషలో షష్ఠీ విభక్తికి సంబంధించిన వాక్యం చెప్పదగును. పాదములచేత అభివందనము అని తృతీయావిభక్తితో చెప్పినట్లయితే పాపం దక్కుతుంది కదా అని విశదీకరించే సందర్భం.
    పూరణ ::
    తెలిసి విగ్రహవాక్యమ్ముఁ దెలుపు వేళ
    పలుక దగునయ్య షష్ఠీ విభక్తి నెఱిగి,
    ప్రతిభ మీఱి తృతీయా విభక్తి దెలుప
    *పాపమే దక్కు పాదాభివందనమున.*
    కోట రాజశేఖర్, నెల్లూరు, 18.10.2019.

    రిప్లయితొలగించండి
  27. ఉ:

    రూపము జూసి నమ్మకుము రోజులు మారగ సాధు వేశమున్
    కూపము లోన దించి తమ గోర్కెలు దీరగ పాపకర్మలన్
    దాపున చక్కదిద్దుగొన ద్రాపులు జేరిరి సందు గొందులన్
    పాపమె దక్కు సుమ్ము పద వందనముల్ వొనరించు వారికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. చత్వారమునకుఁ జమత్కారము!

    కంటి చత్వారమే రాఁగఁ గర్కశముగ
    వాడ నిచ్చగించినఁ గళ్ళజోడునకు న
    వని తలమ్మున నందాల బాల కంటి
    పాప మే దక్కు పాదాభివందనమున

    [మే = పార్శ్వము; పాదాభివందనమున వాడ నిచ్చగించిన (అందము సన్నగిల్లు నన్న భయము)]


    తాపసు లన్న నిష్టము త్రిధామున కెన్నఁడు వారి కీయ సం
    తాపము రాక్ష సౌఘమును దార్క్ష్యుఁడు తథ్యము చంపెనే కదా
    శాపము లున్న ముక్తి, వర సంయమి కోటికి భక్తి మ్రొక్కినం
    బాపమె! దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్

    రిప్లయితొలగించండి
  29. మోపిన తప్పులన్ తెలుప ముందుగ హెచ్చగు కోపమొం దగన్
    కోపపు కారణం బెరుగ కుండగ కోవిదు దూరుచుండగన్
    పాపమె దక్కు సుమ్ము ; పదవందనముల్ వొనరించువారికిన్
    మోపుగ విజ్ఞతన్ ఒసగ పూరణ జేయుదు రెంతయో నుతిన్

    రిప్లయితొలగించండి
  30. ఉ. లోపమువారిదౌనుగద లోగడచేసినమేలుమర్చిదా
    నోపక సంచరించిపిదపూరకె యుండుట ఏమిగొప్పరా
    దాపునకొచ్చినప్పుడును దండముపెట్టక నీతిబాహ్యుడౌ
    పాపమె దక్కు సుమ్ము, పద,వందనముల్ వొనరించువారికిన్.

    Note : మేలుచేసినవారి మేలుమరచి తుదకు వారు ఎదురుపడినప్పుడు కూడా చేతులెత్తి దండము పెట్టక
    పదవందనము (కేవలం మాటలలో) వందనము అని చెప్పువాడికి పాపమే దక్కును అన్న అర్ధం లో .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పిదప + ఊరకె' అన్నపుడు సంధి లేదు. పిదప ద్రుతాంతం కనుక "పిదప నూరకె" అనవలసి ఉంటుంది. 'వచ్చినప్పుడు'ను 'ఒచ్చినప్పుడు' అనరాదు.

      తొలగించండి
  31. మిత్రులందఱకు నమస్సులు!

    (ఒక తండ్రి తన కుమారుని తన గురు గురుపత్నుల చెంతకు తీసికొనిపోయి, వారిని గూర్చి తెలిపి, వారిని, వారి ప్రక్కనే యున్న వారి యమ్మాయిని చూపి, వారికి పాదాభివందనము చేయుమని తెలుపు సందర్భము)

    "మా పని మేము సేయుచును మాకును సేవ లొనర్చువారికిన్
    దాపముఁ దీర్చి కష్టములఁ దాల్చెద" మంచును బల్కు వీరలే
    శాపవరప్రసాదులు! నిజమ్ము! జనించిరి యోరుగల్లునన్!
    బాప మెదక్కు సుమ్ము! పదవందనముల్ వొనరించు వారికిన్!
    (మెదక్కు=మెదక్ జిల్లా)

    రిప్లయితొలగించండి
  32. చూపక కన్నవారి యెడ సుంతయు ప్రేమను, మంచి మార్గముం
    జూపిన పెద్దలన్ గురుల జూడక భక్తిని, రాజకీయపుం
    బ్రాపును గోరి ధూర్త తతి పంచల జేరిన శోభ నీదు పో
    పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్.

    రిప్లయితొలగించండి
  33. తేటగీతి
    పాపబుద్ధిని పాపకు పాఠ మంచు
    పాపపు తలపు గురువును పాపి గాదె
    పాపమనక దండించుమ పతితుఁడేగ
    పాపమే దక్కు పాదాభివందనమున

    రిప్లయితొలగించండి
  34. ఆ పరమాత్మ లీలనపహాస్యము జేయుచు బల్కువారికిన్
    కాపులు మాలలంచు కుల కల్కము బెంచెడు వారికీ భువిన్
    పాపమె దక్కుసుమ్ము, పదవందనముల్ వొనర్చు వారికిన్
    పాపములే హరించునని భాగవతోత్తములెల్ల పల్కిరే.

    రిప్లయితొలగించండి
  35. చూపుచు ప్రేమ సంతతము సొమ్ములపైనను, దొడ్డిదారిలో
    ప్రాపును పొంది శీఘ్రముగ రాజ్యము నందున, మ్రొక్కుచున్ సదా
    భూపతికిన్, పొగడ్తలను మోదముఁ గూర్చి నటించు చున్నచో
    పాపమె దక్కు సుమ్ము, పదవందనముల్ వొనరించువారికిన్

    రిప్లయితొలగించండి
  36. తేటగీతి
    ఘన పయోముఖవిషకుంభమనఁగ చెల్లి
    దొరుకఁ దన కవకాశమ్ము దుష్టుడౌచు
    వెన్నుపోటైన పొడవఁగ వేచి మ్రొక్కఁ
    బాపమే దక్కు పాదాభివందనమున

    మాధవుడు లక్ష్మీదేవితో...
    ఉత్పలమాల
    మా పద సేవఁ జేయుచు రమా! సరసంబగు భాషణంబులన్
    జూపగఁ బ్రేమలన్ భృగువుఁ జూడని కారణ మెంచి మమ్ముఁ గా
    ల్జాపుచు రొమ్ముఁ దన్నెనని చండమె? మౌని నగౌరవించినన్
    పాపమె దక్కు సుమ్ము, పదవందనముల్ వొనరించువారికిన్



    రిప్లయితొలగించండి