19, అక్టోబర్ 2019, శనివారం

సమస్య - 3167 (అల్లుఁడు రాకయున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్"
(లేదా...)
"అల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్"
(ఈరోజు పూరణలు ప్రసార కానున్న ఆకాశవాణి వారి సమస్య)

97 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

విరించి


పిల్లలు పెద్దలెల్లరులు భీతిలు రీతిన కుంభవృష్టియే

పల్లెలఁ బట్టణమ్ములను వాసిగ ముంచగ మెట్టకై జనుల్

ముల్లెలు మూటగట్టుకొని పోయిన వేళను భార్యతో సహా

యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ప్రాతః కాలపు సరదా పూరణ:

పిల్లలు పెళ్ళమున్ విడిచి పెక్కులు రాత్రులు ల్యాబునందునన్
కొల్లలు గ్రంథముల్ చదివి క్రొత్తవి బల్బులు కన్గొనంగ తా
వెళ్ళగ స్టాకుహోమునకు పెళ్ళము తోడను నోబెలందగా
నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్


క్రొత్తవి బల్బులు = Blue LEDs (Nobel Prize 2014)

A.Satyanarayana Reddy చెప్పారు...

చెల్లి కుమారుడంచు లలి చెన్నగు కూతురు పాణి నివ్వగా

ప్రల్లదుడైన వాడు కడు బాధలు పెట్టుచు నుండ ముల్లెకై

క్రుళ్ళుచు వచ్చె బిడ్డఁ గొని కొంపకు నేడ్చుచు, కూతు వెంట మే

నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్

Yajnesh చెప్పారు...

నల్లని వాడు సీతహృదినందున నిల్పుచు విక్రమంబుతో
నెల్లర గాచువా డడవి కేగి ఖరాదుల గూల్చెనంచు దా
ముల్లము లందు నా రవికులోద్భవుఁ భద్రము, నున్నతిన్ గనన్
అల్లుడు రాకయున్న, ముదమందిరి పండుగ నత్త మామలున్

కంది శంకరయ్య చెప్పారు...

విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెన్నగు బిడ్డను కట్టబెట్టగా' అంటే బాగుంటుందేమో?

కంది శంకరయ్య చెప్పారు...

యజ్ఞేశ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉత్పలమాల

ఉల్లము రంజిలన్ బఠితులొప్పు కవిత్వము వ్రాయువాడనన్
జెల్లుచు నీ యుగాది 'కవిశేఖరు' డన్ బిరుదందఁ బోవగన్
వెళ్లుచు భార్యనున్ సుతుల వెంటనె పంపి క్షమించు మంచుఁ దా
నల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్!

కంజర్ల రామాచార్య. చెప్పారు...

చూపుల నార్ద్రదృక్కలితశుద్ధకృపారసధార లూర, ను
ద్దీపితవాక్కు తోడ వగఁ దీర్చు యతీంద్రుల తూలనాడుచో
పాపమె దక్కు సుమ్ము , పదవందనముల్ వొనరించువారికిన్
బాపమడంగు సుమ్ము , సులువౌ గద మోక్షపథమ్ము లత్తరిన్.

నినినటి పూరణ

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రామాచార్య గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

పాత కాలం బీరకాయ పీచు సంబంధాలు:

చల్లగ మెల్లగా చనుచు శ్రద్ధను గాంచగ చార్మినారునున్
తల్లిని తండ్రినిన్ ముసలి తాతను పిన్నిని నాయనమ్మనున్
పిల్లలు పాపలన్ గొనుచు పేరిమి కూతురి బావగారి మే
నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

పిల్లను మాటిమాటికిని పిల్చును తిట్టగనెంచి , వాడు మే...
నల్లుడె, యైన యేమిటికి ? నాకిదిలేదదిలేదటంచు.,! తా..
మెల్లరు వింతఁజూడ పొరుగింటి జనుల్ పరువేమి దక్కునం...
చల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

విరించి చెప్పారు...

పిల్లలు తాతీల్లనుచును
దల్లులతో గూడి పల్లె తరలియె రాగా
యిల్లే యిరుకైన హరిమ
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్.

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(పండుగలలో అల్లుని ఖర్చులకు అలసిన అత్తమామలకు అనూహ్యంగా దీపావళికి రాడని తెలిస్తే ఎంత ఆనందమో)
చిల్లరకొట్టు ఖాత నిక
జీటికిమాటికి బెంపుసేయుచున్ ;
గిల్లుచు భార్యచేయి పడ
గెత్తెడి కోర్కెల బర్వులెత్తుచున్ ;
జిల్లుగ మామగారి జత
జేబుల శూన్యమొనర్చుచుండు నా
యల్లుడు రాకయున్న ముద
మందిరి పండుగ నత్తమామలున్ .

కంజర్ల రామాచార్య. చెప్పారు...

ఇల్లును గుల్లఁ జేసి, దురపిల్లగఁ జేసి, యెడంద నీటలన్
ముల్లులు గ్రుచ్చి, యాత్మజను మూర్ఖుడునై సతతమ్ము హింసతోఁ
దల్లడమొందఁ జేసి, చెడు దారుల నెత్తరి సంచరించు నా
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్

sailaja చెప్పారు...

కల్లలు బల్కుచున్ సతము కాసుల కోసము గట్టిగా సతిన్
ప్రల్లదమాడుచుండుచును బట్టుకు రమ్మని కట్నమింకనున్
తల్లడపెట్టు విట్పతియె తప్పక రానను వార్తబంపగా
అల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్!!!

KATAKAM చెప్పారు...



ఉత్పలమాల:

అల్లుఁడుఁగూతురున్ మనుమరాండ్రును వచ్చిరి పర్వమే యనన్
నల్లని చీకటుల్నణచ నర్తన మాడె సుదీప కాంతులే
వెల్లువయైన తారలిట వెన్నెల‍ఁగుర్వగ‍ఁబంపి దక్షునిం
టల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!!

(దక్షునింటల్లుడు =దక్షుని సంతానమైన 27 తారలకు భర్త- చంద్రుడు)
(దీపావళి రోజున అమావాస్య కనుక చంద్రుడు రాలేదనే భావంతో.)


మిస్సన్న చెప్పారు...

పిల్లకు పెళ్లి చేసితిరి పిల్లయు నల్లుడు వచ్చినప్పుడే
యుల్లము లుల్లసిల్లు నని యొప్పుగ జెప్పితి రట్టి మాటకా
యల్లుడు సమ్మతించె, నిసుమైనను మోదము కల్గు టెట్లగు
న్నల్లుడు రాకయున్న, ముదమందిరి పండుగ నత్తమామలున్.

Zilebi చెప్పారు...



పిల్లను మనువాడి కువై
టల్లన వెడల, ఖజ రాన్ తటాల్మని, ససియై
యల్లన యున్న వరమదియె
యల్లుఁడు రాకున్న, మురిసి రత్తయు మామల్


జిలేబి

Sitharamayya Solasa చెప్పారు...

ఇల్లు గడవని దినంబుల
పిల్లలు పండుగకు రాగ వెతయగుననుచున్
తల్లడిలుచుండు నప్పుడు
యల్లుడు రాకున్న మురిసి రత్తయు మామల్

Zilebi చెప్పారు...


జిందగీ మే సబ్ కుచ్ హై సచ్


పిల్లల కాచుకొంచు నెలవీడున డబ్బులు కూడబెట్టుచున్
డొల్లయవంగ భర్తయె కడొత్తుగ నిల్చెను నింట భద్రమై
చల్లగ సాగ జీవితము చాకిరి చేయుచు చేతకత్తెగా!
మెల్లగ లేఖ నంపుచు సమిత్తు సకారణమంచు తెల్పగా
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!


జిలేబి

Zilebi చెప్పారు...



ఆకాశవాణికి పంపినది :)



వస్తే ఇల్లు గుల్ల !


ఉల్లము పొంగ దాయె తను వూరికి వచ్చిన నేడ్పు మోముతో
చెల్లనికాని వాడు తమ చెంగట వచ్చిన ఖర్చు లెన్నియో
కొల్లయు గొట్టు నింటిని నిగూఢత యిద్దియె కారణంబిదే
యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్



జిలేబి

Yajnesh చెప్పారు...

అల్లరుముద్దుగ న్పెరిగె నందరు మెచ్చగ తల్లిదండ్రులా
పిల్లకు నీడుజోడుగని పెండ్లి యొనర్చగ జీవనంబుకై
యెల్లలు దాటి వెళ్ళగను యెప్పుడు జూడగ సెల్లులుండగా
నల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్

Surya చెప్పారు...

అల్లుని కోర్కెలన్ జడిసి యందరిలో నగుబాటు లేలనిన్
మెల్లగ నప్పు సొప్పులను మేలగు వస్తువులన్ని గూర్చినన్
చిల్లుల బట్టలే మిగిలె చింతిలుచుండగ నింతలోన నా
యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
(ఆకాశవాణికి పంపినది)

krkr చెప్పారు...

పిల్లల జేరిపెద్ద లటుపెద్దగపండుగ జేయనెంచుచున్
అల్లుని బిల్వబంపిరటుహంగులుహద్దులుదాటునట్లుగన్,
అల్లుని రాకలేదననిరాశగ వారలుఖేదమంద నా
యల్లుని రాక యున్న,ముదమందగ పండుగ నత్తమామలున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...





అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్

ఇల్లుని గుల్లయు జేయుచు
ఇల్లుని తాకట్టు బెట్టిరిట గొప్పకు, యా
ఇల్లరికము వచ్చుననెడి
యల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్

🙏🙏

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

అల్లుడు కాడు పుత్రుడిత డందరి మన్నన పొందినాడు, దుః
ఖిల్లుచు బాధ యెందులకు కృష్ణుడు తమ్ముడు, చెల్లి, బావ, మే
నల్లుడు రాకయున్న, ముదమందిరి పండుగ నత్త మామలున్
అల్లుడు పుత్రి మన్మడికి నాదరమున్ అభిమంత్రణమ్మిడన్ ౹౹

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

సమస్య :-
అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్

*కందం**

ఇల్లును పీకుచు పందిరి
నల్లెడు తంటాలమారి యల్లుని పిలవన్
వెల్లను పరీక్షలనియే
యల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
............✍చక్రి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

పిల్లను *రాజకాంచన* ను బిల్తురు ముద్దుగ *రాక* యంచు., శో...
భిల్లగ రంగవల్లికలు వీథుల , గాదెల పంటలెల్ల , రం...
జిల్లగ పిండివంటలను జేసెడి వేడుక భోగినాటికే
అల్లుడు, *రాక* ., యున్న ముదమందిరి పండుగ నత్తమామలున్.!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

Akula shanthi bhushan చెప్పారు...

ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
సమస్యాపూరణ కార్యక్రమంలో...
19/10/2019 శనివారం ప్రసారమైన నా పూరణ..

అల్లుడు రాకయున్న ముదమందును పండుగ నత్తమామకున్...

నా పూరణ.
**** *** ***
( అల్లుడుని పండుగకు పిల్చినా పని వత్తిడి వల్ల రాలేకపోయాడు...)

ఉత్పలమాల:

అల్లుని దల్చరే శని గ్రహమ్మని మేదిన నత్తమామలున్

కొల్లగ గోరి కోరికలు ఘోరపు వేదన లిచ్చి యిల్లునే

గుల్లగ జేయు నాతడును కూరిన కృత్యము చేత రాననెన్

అల్లుడు రాకయున్న ముదమందును పండుగ నత్తమామకున్...

-- ఆకుల శాంతి భూషణ్

వనపర్తి

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

చిల్లుల జేబుల తోడను
నల్లుని కీయగ మురిపెము నరణము లేకన్ |
పిల్లను నొంటిగ పంపగ
"అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్"

subbarao చెప్పారు...

కల్లలునిత్యమున్బలుకుకాంతునిరోసినగారణంబుగా
నల్లుడురాకయున్నముదమందిరిపండుగనత్తమామలు
న్నల్లునిమాటలన్వినిననాతనిపిల్లలుగూడనేర్చియు
న్గల్లలుమాటలాడుటనుగారణమయ్యదిమోదమౌటకున్

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

చెల్లని కాసని జెప్పిన
జల్లగ బెండ్లాడ దనయ జామాతయ్యెన్
యిల్లరి కమ్మును గాదని
అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కల్లలు పల్కుచు క్రూరత
నిల్లాలిని హింస పెట్టి యేడ్పించు చు తాచెల్లని వాడై మెలిగెడి
యల్లుడు రాకున్న మురిసి రత్త యు మామ ల్

subbarao చెప్పారు...

పల్లెకుబోవలెనటబడి
పిల్లలకున్వేయవలయువేషములచటన్
మరినేరాననిజెప్పగ
నల్లుడురాకున్నమురిసిరత్తయుమామల్

కంది శంకరయ్య చెప్పారు...

ఆటవిడుపుగా చార్మినార్ సందర్శనాకాంక్షతో ముడిపడ్డ మీ పూరణ చాల బాగున్నది. ఆకాశవాణిలో దోరవేటి వారు కూడా మెచ్చుకున్నారు. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.
'ఈటలన్/ఈటెలన్' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మంచి పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చీకటుల నణచ.. అనడం సాధువు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెల్పగా నల్లుడు...' అనండి.

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు
మామల్

సందర్భము: రాముడు లోక కంటకుడైన రావణుణ్ణి వధించగలుగడం జగదానందకారణం. తమకూ ఆనందం.
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చా డంటేనే రేపోమాపో పట్టాభిషేకం జరుగబోతోం దన్నది మరో ఆనంద కారణం.
అందుకని ఇన్నాళ్ళూ అల్లుడూ కూతురూ అనగా రాముడూ సీతా తమవద్దకు రాకపోయినా అత్తా మామలు మురిసిపోయినారు.
(ఇక ముం దెలాగూ రానే వస్తారు.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"ఎల్లరు వొగడగ రావణు

నల్లన వధియించి, రాము డరిగెను పురికిన్

జల్లగ.." ననిరి మిథిల జను...

లల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
19.10.19
-----------------------------------------------------------

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తను, వూరికి' రెండూ సాధువులు కావు. "పొంగదాయె నత డూరికి..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అల్లారు ముద్దుగ' అనడం సాధువు. 'వెళ్ళగను' అనడం వ్యావహారికం. దాని తర్వాత యడాగమం రాదు. "...దాటి తాను చన నెప్పుడు..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "నగుబా టటంచు తా మెల్లగ..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...జేయనెంచి తా మల్లుని... నట్లుగా నల్లుని..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గొప్పక నా యిల్లరికము.." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో రెండు అచ్చులను ప్రయోగించారు విసంధిగా...

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేదిని నత్తమామలున్' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏🙏🙏

అంతా మీ దయ!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

ధన్యవాదములు 🙏🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జామాత + అయెన్' అన్నపుడు సంధి లేదు. 'అయెన్' అన్నది సాధుప్రయోగం కాదు. "జామాతగ తా నిల్లరికమ్మును..." అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

రాణీపేట జిలేబి గారికి మహాభినందనలహో!

👏👏👏

chandrashekhar yelisetty చెప్పారు...

కం.
అల్లరియగు మాటలతో
పిల్లగు చేష్ట లనగూడి బెట్టిడ నొప్పన్
వల్లన వలదని తలుచగ
అల్లుడు రాకున్న మురిసి రత్తయు మామల్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఒకానొక బావమఱిది పల్కులు:
అత్తయు మామల్ : అపార్థ నివార ణార్థమై “మా మలు” గా విఱుపు:

తెల్లంటులు గొని పంపఁగ
వెల్లువగ నుతుల గృహప్రవేశమునకుఁ దా
నుల్ల మలరంగ మామయు,
నల్లుఁడు రాకున్న, మురిసి రత్తయు మా మల్

[తెల్లంటి = బహుమతి; మా మల్ = మా మలు: మా రెండవది]


మల్లన యంబికా వరుఁడు మామకు నప్రియుఁ డైన వాఁడు దా
నొల్లఁడు జన్న మారయ మదోద్ధత దక్షుఁడు పిల్వ కుండినం
గల్లలు పల్క రాదు కద కాంచఁగ మామయె యత్త గాదు లే
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్

Yajnesh చెప్పారు...

Dhanyavaadaalu. Try to rectify my mistakes.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా
కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా

[కమలాప్త: లక్ష్మీ దేవి చేఁ బొందఁ బడిన వాఁడు, విష్ణుమూర్తి.
కమలాప్త : పద్మములకు మిత్రుఁడు, సూర్యుఁడు.
లావణ్యాంగా : అందమైన దేహము కలవాఁడా
లావణ్యాంగా : సముద్ర జలము (లవణముతోఁ గూడినది) తో నిండిన నోరు కలవాఁడా]

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మనోహరంగా ఉంది.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అల్లుడు దుండగీడుకడునారడిపెట్టుచునుండునెల్లరన్
పిల్లనొసంగియాతనికి పెండిలిజేసినయత్తమామలన్
ప్రల్లదనంబుజూపి ప్రతిపంధివలెన్ చరియించు దుష్టుడా
యల్లుడురాకయున్న ముదమందిరి పండుగనత్తమామలున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
విష్ణువు పరముగా కమలాప్తుడు సమాస విగ్రహ వాక్య మామోద యోగ్యమేనా తెలుపఁ గోరెదను. ఆప్తము= పొందఁ బడినది. ఈ అర్థమును గ్రహించి చేసినది.

Zilebi చెప్పారు...



కల్లాకపటంబెరుగడు !
తల్లియు తండ్రి వలె నెపుడు దలచె నతండే!
కల్లయగు సుమీ పల్కగ
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్!


పైవారమునకు ఆకాశవాణి‌సమస్య తెలుపవలె



జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో"

KATAKAM చెప్పారు...

ధన్యవాదములు .... సవరించే ప్రయత్నం చేస్తాను

Sitharamayya Solasa చెప్పారు...

అల్లుని పెద్ద పుత్రునిగ నాదర ముంచెడి దేశమందునన్
"అల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్"
చెల్లునె యిట్లనంగ మరిచీదర నొందుదురెల్లరున్ వినన్

krkr చెప్పారు...

పిల్లల జేరిపెద్ద లటుపెద్దగపండుగ జేయనెంచి తా
మల్లుని బిల్వబంపిరటుహంగులుహద్దులుదాటునట్లుగా
నల్లుని రాకలేదననిరాశగ వారలుఖేదమంద నా
యల్లుని రాక యున్న,ముదమందగ పండుగ నత్తమామలున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి

Zilebi చెప్పారు...



నెనరుల్స్ పంపినాము


జిలేబి

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
త్రుళ్ళుచు నుగాది దినమున
వెల్లఁగ గవియనఁ బ్రభుత్వ బిరుదందుకొనన్
జెల్లెడు వాడై సుతతో
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్

మిస్సన్న చెప్పారు...

ధన్యాదాలండీ.

కంది శంకరయ్య చెప్పారు...

ఆమోద యోగ్యమే. మీకా సందేహం ఎందుకు వచ్చింది?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. కాని నాల్గవ పాదం?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Sitharamayya Solasa చెప్పారు...

అల్లుడు విష్ణువంచునె పదాంబుజ క్షాళన మాచరిం చిరే
అల్లుని పెద్ద పుత్రునిగ నాదర ముంచెడి దేశమందునన్
"అల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్"
చెల్లునె యిట్లనంగ మరిచీదర నొందుదురెల్లరున్ వినన్

Zilebi చెప్పారు...


కల్లయె కల్ల కల్ల యె పుకారుల నమ్మకుడీ కవీశ్వరా!

:)


జిలేబి

Zilebi చెప్పారు...


:) పూరణ యింకా ప్రచురించనే లేదు :)


జిలేబి

BVVHBPrasadarao చెప్పారు...

ఆకాశవాణి కి నేను పంపినది

మెల్లన 'కూతు'తో మనసు మెచ్చగ కాపురమందు సంగతుల్
చల్లగ మాటలాడుటకు చక్కని కాలము చేరువయ్యె; సం
ధిల్లెను సంతసాన్విత సుదీర్ఘ విలాస విలోల హాస మం
చల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ధన్యవాదములండి. నిర్ధారణమునకు నడిగితిని.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
తల్లిరక్తమ్ము క్షీరమ్ము దార వోయు
సాంప్రదాయమ్ము సంస్కృతి సంతతికన
పబ్బు మాదక ద్రవ్యాలు వ్యసనమైన
నమ్మపాలు విషమ్మగు నర్భకులకు