22, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3170 (రామ కథామృతంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"...రామ కథామృతంబు చింతలఁ గూర్చున్" (ఛందో గోపనము)
(లేదా...)
"..శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా" (ఛందో గోపనము)

56 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    ఘనమౌ రీతిని పెండ్లియాడుచును భల్ గానమ్ము నాట్యమ్ములన్
    చనుచున్ కానల కాంత తోడుతను తా జన్యమ్ములన్ కూలెనే!
    కనుమా! కష్టము లెన్నియో నితడు వే గండమ్ములన్ సైచెనే!
    విను! శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ:
    (నాకంటే ముందుగా)

    ఒక భర్త... తన భార్యతో.. ఇలా అంటున్నాడు

    ఏ శ్రేయమ్ము లభించె జానకికినత్తింటన్ వివాహమ్మునన్ !
    విశ్రాంతిన్ గొను భాగ్యమేది ? విపినోర్వీకష్ట సంచారమే !
    అశ్రుల్ దక్కెను లంకలో సకలమన్యాయమ్మె ! చింతింప సా...
    ధ్వీ ! శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  3. హేరాళము హృషి గూర్చును
    శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్
    ధారాళముగా జానకి
    భీరుకమున నెదురుకొనిన బెంగల చదువన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కోరిన వరముల నొసగుచు
    ధారుణిలో నిలిచె నదియె తారక మంత్ర
    మ్మై రామనామ, మెట్టుల
    శ్రీ రామ కథామృతంబు చింతలఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ ఆక్షేపణతో ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఆ రామ స్త్రీయని దలప
    ఛీ! రామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    తీరా సీత సమేతుడు
    శ్రీరామ కథామృతంబు చింతలఁ బాపున్

    రిప్లయితొలగించండి


  6. సదనమ్మున్ విడిచెన్ తలమ్మున చనెన్ స్వామిన్ సదా వెంటనం
    టి! దురాచారుని చేత మోసమున నింటిన్ దాటగా లంక చే
    రె! దయాళుత్వము లేని చోట మసలెన్! రీఢమ్ము తోడాయె! కో
    విద! శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సమస్య :-
    "...రామ కథామృతంబు చింతలఁ గూర్చున్" (ఛందో గోపనము)

    *కందం**


    శ్రీరాముని గుడి కట్టగ
    కారాగారమున పడెనొకడు దయ లేకన్
    కోరినను కరుణ జూపని
    శ్రీరామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    ...................✍చక్రి

    రిప్లయితొలగించండి


  8. శార్దూలం వేయకపోతే మనసేదో కుఛ్ కుఛ్ హో జాతీ హై :)

    శ్రీశ్రీ! రాముని గాధ పైనుడువుమా శీఘ్రమ్ముగాయింగమున్!
    మిశ్రాజీ! విను దుఃఖదాయకమయా మించారు నీ యేడ్పుల
    య్యా! శ్రాంతమ్మును పొంద లేవు వినవయ్యా స్వామి నా మాట నీ
    వీ శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. చారులు తెలిపిన రజకుని
    దారుణ యభియోగమువిని దారను విడిచెన్
    కారడవుల నడిబొడ్డున,
    శ్రీరామ కథామృతంబు చింతలఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  10. సమస్య :-
    "...రామ కథామృతంబు చింతలఁ గూర్చున్" (ఛందో గోపనము)

    *కందం**


    కోరిన తాటకిని తునిమె
    శ్రీరాముడు కరుణ లేక సీతను విడిచెన్
    మారముగ వాలిని దునిమె
    ఛీ,రామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    ...................✍చక్రి

    రిప్లయితొలగించండి
  11. రామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    (ఛందో గోపనము)

    భారముతోడ జదువ నా
    శ్రీరాముని చరితము నిట జీవితమున, సీ
    తా రామ కష్టము దెలుపు
    శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్!

    రిప్లయితొలగించండి

  12. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    (idea మైలవరపు మురళీకృష్ణ గారిది)

    మనమున్ దోచెను కృష్ణుడౌచు నితడే మాయా బజార్లోనహా!
    ఘనమౌ రీతిని ముఖ్యమంత్రి యగుచున్ గాంధీల తాడించెనే!
    కనగా నీతని కూల్చివేత నకటా! కన్నీరు మున్నీరగున్!
    విను! శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  13. ( కంకంటి పాపరాజ మహాకవి ఉత్తరరామాయణ రచనకు
    సన్నద్ధుడై వ్రాయసగాడైన శిష్యునితో అంటున్నాడు )
    నను శ్రీరామపదారవిందభజనా
    నందున్ సమూలంబుగా
    ఘనమౌ శోకము నందు ముంచెనుగదా !
    కారుణ్యవాణిన్ - మహా
    జననాథోత్తము రాణి - సీత - నటవీ
    సంవాసగా నెంచి పం
    పిన ; శ్రీరామకథామృతంబు విన ని
    ర్వేదమ్ము హెచ్చున్ గదా !!

    రిప్లయితొలగించండి

  14. కూరును శుభములు వినగా ‌‌‌
    శ్రీ‌ ‌రామ కథామృతంబు., చింతలఁ గూర్చున్
    నోరార నుతింపక నీ
    వారాముని నిందచేయ ననవరతంబున్.

    రిప్లయితొలగించండి
  15. కారణ జన్ముడు రాముడు
    ధారుణి దానవుల జంపి ధర్మా త్ము o డై
    ప్రేరణ గా నిల్చె నెటుల
    శ్రీ రామ కథా మృత మ్ము చింత లు గూర్చు న్

    రిప్లయితొలగించండి
  16. నా పూరణ. మత్తేభ విక్రీడితము
    ***** ***

    ఘనుడౌ రాము డధర్మ పద్ధతిని నుగ్గాడెన్ గదా వాలినే!

    ఇన వంశంపు లతాంగినిన్ ఖలుడు లంకేశుండు గాజేసె!వే

    దనలే యిచ్చుచు బంపె గర్భిణిని కాంతారమ్ముకున్ రాముడే!

    విను! శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  17. రామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    (ఛందో గోపనము)

    ప్రేరణ తోడ చదువ సీ
    తా రామ చరితము, మనకు తారసపడునే
    శ్రీరామ లీలలిక, యే
    శ్రీరామ కథామృతంబు చింతలఁ గూర్చున్?

    రిప్లయితొలగించండి
  18. క్షేమ మొసంగును జనులకు
    శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్
    కామములోన మునిగి పర
    భామలతో కులుకునట్టి పలువలకెపుడున్

    రిప్లయితొలగించండి
  19. పోరామిఁదొలగజేయును
    శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్
    వేరేదైనను, ముక్తికి
    నారాముడె దిక్కు మనకు నారయజగతిన్

    రిప్లయితొలగించండి
  20. కారడవుల కాపురమయె
    దారయు దైత్యుల వశమవ దైన్యత గలిగే |
    దూరము జేసెను చూలిని
    శ్రీ రామ కథామృతంబు చింతలఁ గూర్చున్"

    రిప్లయితొలగించండి
  21. కారడవుల కాపురమయె
    దారయు దైత్యుల వశమవ దైన్యత గలిగే |
    దూరము జేసెను చూలిని
    శ్రీ రామ కథామృతంబు చింతలఁ గూర్చున్"

    రిప్లయితొలగించండి
  22. భారతి దీవెనలందగ
    కోరిన కోరికలు తీర్చ కూరిమి విధమున్
    సారము తెలియక చదివిన
    శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  23. దూరమొనర్చు నఘమ్ముల
    శ్రీరామ కథామృతంబు; చింతలఁ గూర్చున్
    దూరుట; శ్రీరామ కథా
    సారము దాటించును భవ సాగరమదియే

    రిప్లయితొలగించండి


  24. శ్రీ రాముని నమ్ముకొనుచు
    పారాయణ జేయబూన పాపమ్మేలా
    కారణ మేమో తెలియదు
    శ్రీరామ కథామృతంబు చింతలఁ గూర్చున్!

    రిప్లయితొలగించండి
  25. ఆరాటంబులదీర్చును
    శ్రీరామకధామృతంబు,చింతలగూర్చున్
    పోరాములెయిలజనులకు
    నారామునిగొల్వకుండియలుసునిజేయన్

    రిప్లయితొలగించండి
  26. మత్తేభవిక్రీడితము

    తనయుల్ లేరని యాజి నంది సుతు ఖాత్రావాసమున్బంపుటన్!
    గొనిరాన్ బోరియు పత్ని నంది వనిలోఁ గ్రూరంబుగా దింపుటన్!
    దనయుల్ దండ్రులు యశ్వమేధమున నుద్దండమ్మునన్ బోర నో
    ర్మిని శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా!!

    రిప్లయితొలగించండి
  27. కందం
    లేరని పొందుచు సుతునిన్
    కారడవంపుట, నవనిజ కష్టాల్, సుతులే
    పోరున నెదురించ నహో!
    శ్రీరామ కథామృతంబు చింతలఁ గూర్చున్! !

    రిప్లయితొలగించండి
  28. కం.

    శ్రీ రామ కథన కేగన
    పారా లేకను గృహమున భద్రము దలచన్
    చోరీ జరుగుట నకటా
    శ్రీ రామ కథామృతంబు చింతల గూర్చన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  29. ఈ రోజు శంకరా భరణము సమస్య

    శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా" (ఛందో గోపనము)

    ఇది మత్తేభములో గాని శార్డులములో గాని సహజముగా పూరించెదరు కానీ నేను సీసములో పూరించినాను

    సీ:
    జనకుని మాటను సంతసముగ విని కానల కేగిన ఘనుడు , వనము
    ల తిరుగుచు నసురులను జంపి మునులకు మోదము నిచ్చిన మొక్కలీడు,
    పౌరుని మాటకు దారణ నొసగుచు రాణిని విడచిన రాఘవుండు,
    సౌఖ్యమున్ వదలుచు సానువు లందు మగని తో నడచిన మంగల,పర పురు
    షుని పంచన గడుపుచున్పతి స్మరణము సతతము వీడని సతి తరళము
    సీత, సోదరుని తో చెలిమిని వీడని సౌమిత్రి, ముదముగ స్వామి సేవ
    యే ముఖ్యము తనకు నెప్పు డను హనుమ,తరచి చూడ కలుగు పరమగతి, స
    తతము శ్రీరామ కథామృతంబు విన, నిర్వేదమ్ము హెచ్చున్ గదా దురమున

    గిరి ధరుడు నుడివిన గీత, విరివిగ విని
    నంత జనులకు కలుగదు సంత సంబు.,
    మరణము కలిగిన సమయ మందు వినిన
    శాంతి కలుగు నాత్మ కనుచు జనులు పలుకు


    మొక్కలీడు = శూరుడు ,దారణ = విలువ,మంగల = పతివ్రత
    తరళము = రత్నము ,దురము = యుద్ధము

    రిప్లయితొలగించండి
  30. ఘనుడౌ శ్రీరఘురామచంద్రుడిలలోగర్వాంధుడౌ రావణున్
    దునుమాడెన్ సతిజానకీ సుదతికిన్  దుఃఖంబు పోకార్పగన్
    వినుడో భక్తవరేణ్యులార కరుణోపేతంబుగాజాలువా
    రిన శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  31. కారాదు నిరాసక్తులు
    పోరాటము లవి చెలంగు భువి నిత్యముగా
    నారాటముల ననకు మి
    స్సీ రామ కథామృతంబు చింతలఁ గూర్చున్"


    పర దారార్థ కుతూహల మ్మణఁగి సద్బ్రాహ్మ్యైక్య భావంబునం
    గర మాసక్తి చెలంగి చిత్తమున నాకాంక్షా వినాశంబు గా
    నరయన్ దాశరథుండు దైత్య గణ శిక్షార్థంబు సంజాతుఁ డు
    ర్వి ర శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా

    [నిర్వేదము = వైరాగ్యము]

    రిప్లయితొలగించండి
  32. చేరితి హరికథ వేళకు
    చేరువ గూర్చొన హరిహరి! సేవించు చుండెన్
    సారా దాసుండు నపుడున్
    ఛీ! రామ కథామృతంబు చింతలఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  33. *ఒకడు తన భార్యతో పలికిన పలుకులుగా,.........*


    తా రాజై యిలఁ బుట్టి రాఘవుఁడు సీతా మాతతో గూడి ఘో
    రారణ్యమ్మున దారఁ బాసి కడు శోకాంభోధిలో మున్గె, నే
    తీరున్ సౌఖ్యము బొందలేని ఘనుడా తీర్థుండనే గాంచ,సా
    ధ్వీ! శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  34. కనగన్రానిదియైన మోక్షమదిదాగానంగజేయున్సుమా
    వినుశ్రీరామకధామృతంబువిన,నిర్వేదమ్ముహెచ్చున్గదా
    కనగాబాధలనొందువారలను దుంఖంబందుదీనావళిన్
    మనసేబిత్తరవోయెనాక్షణమలేమా!నిర్వేదమేకదా

    రిప్లయితొలగించండి
  35. చేరవు రాముని సన్నిధి
    నోరారగ ' రామ రామ ' నుడువవు పౌల
    స్త్యా రాతిని దలపోయ వి
    సీ రామ కథామృతంబు చింతలఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
  36. నిశ్రేయస్కరపుణ్యదాయిధరణీనిర్ధూతపాపౌఘయై,
    సాశ్రూద్వేగమొనర్చదే? కఠినసీతారణ్యసంవాసముల్
    విశ్రాణమ్మును జేసె పక్షి యసువున్, పెంపెక్కు దుఃఖమ్ము,, కీ
    ర్తిశ్రీరామకథామృతంబు విన, నిర్వేదమ్ము హెచ్చున్ గదా!

    రిప్లయితొలగించండి
  37. ఇనవంశాబ్ధి హిమాంశుడా రఘు వరుం డేగెన్ గటా యౌవన
    మ్మున ఘోరాటవి కాలితో దనుజు డా భూజాతనున్ దస్కరిం
    చెను శోకించుచు గానలన్ దిరిగె దా సీతేశు డీ రీతి జె
    ల్లెను శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా.

    రిప్లయితొలగించండి
  38. దారిని చూపు పరమునకు
    శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్
    దూరుచు బుధుల సతము పర
    వారిజలోచనల కోరు పలువలకెపుడున్

    రిప్లయితొలగించండి
  39. ధరణిన్ జన్మము నొందె మాధవుడె యుద్ధారమ్ముచేయన్ ప్రజన్
    కరమౌ ప్రేమము తోడ తండ్రి పనుపన్ కాంతారమున్ చేరె తా
    ధరణీ పుత్రిక వెంటనంటి, వని సీతమ్మన్ కనుంగొన్న, వా
    విరి, శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా!

    రిప్లయితొలగించండి
  40. నేను ముందుగ వ్రాసిన పద్యమందు నాలుగవ పాదంలో ప్రాసభంగమైనందున మరొకటి.....


    ఘనుడా రాముడు తండ్రి మాటకయి తా కాంతారమున్ జేరె, నా
    దనుజుండా దశకంఠుడా పడతి సీతన్ మ్రుచ్చలింపన్నటన్ !
    యనిలో గెల్చిన రాఘవుండు సతినే యగ్నిన్ బ్రవేశమ్ము గో
    రెనె, శ్రీ రామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా!

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ...రామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    ఛందో గోపనము

    సందర్భము: విభీషణుడు అన్నయైన రావణునకు "సీతను రామున కప్పగించడమే క్షేమ" మని హితవు చెబుతూ ఇలా అన్నాడు.
    "సీత ఒక మహా సర్పం.
    (మన) చింతయే దాని విషం.
    చిరునవ్వే దాని కోరలు.
    పడుకునేటప్పుడు తల కింద పెట్టుకొనే ఐదు వేళ్ళే ఐదు పడగలు.
    అది నిన్ను కాటువేసి తీరుతుంది. నీ వెరుగ వన్నా! అటువంటి ఘోర సర్పాన్ని మనసుపడి తెచ్చి పెట్టుకున్నావు. నీ జ్ఞాన మంతా ఈ రామ (స్త్రీ.. సీత) కథతో చచ్చిపోయింది. ఈమె (మనకు) కూర్చునది చింతయే గాని మరేమీ కాదు."
    (రామాయణము.. యుద్ధ కాండము.. 14 వ సర్గము.. 2 వ శ్లోకము.)
    రామ= స్త్రీ (సీత)
    రామ కథా మృతము= స్త్రీ కథ చేత మృతి చెందినది (నీ జ్ఞానము)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఈ రామ యైదు పడగల

    ఘో రోరగ మింక కాటుఁ గొనగల దన్నా!

    ఓ రావణ! నీ జ్ఞాన మి

    సీ! రామ కథా మృతంబు.. చింతలఁ గూర్చున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    22.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  42. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ...రామ కథామృతంబు చింతలఁ గూర్చున్
    (ఛందో గోపనం)

    సందర్భము:
    త్వయా విజ్ఞాత పూర్వశ్చ
    వాలీ వానర పుంగవః
    రామేణ నిహతః సంఖ్యే
    శరేణైకేన వానరః
    (రామాయణం.. సుందర కాండం.. స51..శ్లో11)
    "వానర పుంగవుడైన వాలి నీకు ముందే తెలుసు. ఆ వాలి రామునిచేత యుద్ధంలో ఒకే బాణంతో వధింపబడినాడు."
    అని హనుమంతుడు రావణ సభలో రాముని పరాక్రమం గురించి చెప్పాడు. అందరూ విన్నారు.
    అప్పటినుంచి రావణునికి మనసు మనసులో లేదు. "సముద్రాన్ని దాటి రాగలినవాడు ఎట్లాగూ దాటి పోగలడు. రామునికి సీత ఇక్క డున్న వర్తమానం అందించగలడు. ఇక యుద్ధం అనివార్యం. ఐతే వాలి తనను మించిన వా డని ఇదివర కెప్పుడో తేలిపోయింది కూడ. అలాంటి వీరాధివీరుణ్ణే రాముడు సంహరించగలిగా డంటే అది మామూలు విషయ మేమీ కాదు. నిర్లక్ష్యం చేయరాదు" అనుకున్నాడు.
    మంత్రులనూ సేనానులనూ సమావేశపరచి ఇలా అంటున్నాడు.
    "ఒకానొక వనచరుడు (కోతి.. హనుమంతుడు) మన సభలో రాముని కథ చెబుతూ పలికిన పలుకులు గుర్తు పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వుండాలి. నన్ను మించిన వనచర ముఖ్యం.. వాలి అనే పేరు గలిగినది.. రామ కథ (ప్రసంగం)లో మృతం.. అంటే రాముడు వాలినే కూల్చివేసినాడట! అది మనసులో మెదలుతూ వున్నది. లేని చింత కూరుస్తూ (తెచ్చిపెడుతూ) వున్నది."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వినిచెను రాముని కథ నొక

    వనచర మది.. నన్ను మించు
    వనచర ముఖ్యం

    బును వాల్యాఖ్యంబు స్ఫురిం

    చెను రామ కథా మృతంబు..
    చింతలఁ గూర్చున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    22.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి