27, అక్టోబర్ 2019, ఆదివారం

సమస్య - 3174 (శంకరుఁ డుగ్రుఁడై...)

కవిమిత్రులారా,


ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంకరుండు నరకుఁ జంపె నలిగి"
(లేదా...)
"శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై"

91 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పొంకము మీర పండుగను ప్రొద్దున నిద్రను వీడకుండనే
    జంకక నెవ్విధిన్ మిగుల జాప్యము చేయక వేకువందునన్
    శంకరుడుగ్రుడై మనల చంపగ నిచ్చెను కైపదమ్మహో:
    "శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై"

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ అధిక్షేపాత్మకమైన సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
    'జంకక యెవ్విధిన్...' అనండి.

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    పంకిలచిత్తవృత్తి దితివంశజుడౌ నరకాసురుండిలన్
    జంకును గొంకులేక మునిసాధుజనాళిని హింస జేయగా
    పంకజనేత్ర సత్య ప్రతిభన్ గనబర్చగ లీల దుష్టనా..
    శంకరుఁడుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. శుభ దీపావళి నమఃస్సుమాంజలితో 🙏🙏

    కందపద్య పాదము కరువాయెనా ఈరోజు కూడా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వంకాయ కూర బ్రహ్మాండంగా ఉంటుంది. అలా అని రోజూ అదే తినం కదా? మిగిలిన ఛందస్సుల్లో వ్రాయడం అభ్యాసం చేయండి. శంకరాభరణ మంటేనే పద్యరచనాభ్యాస వేదిక.
      "శంకరుఁ డుగ్రతను నరకుఁ జంపె దురమునన్" (మీకోసం ప్రత్యేకం!)

      తొలగించండి
    2. గురువులకు నమస్సులతో, తప్పకుండా అభ్యసిస్తాను. ధన్యవాదములు 🙏🙏

      తొలగించండి
    3. పూజ్యులు కంది శంకరయ్య గారికి నమస్సుమాంజలితో 🙏🙏 తప్పిదములున్న మన్నించ ప్రార్థన..
      *శంకరుఁ డుగ్రతను నరకుఁ జంపె దురమునన్*

      కం||
      ఇంకయు కందము నిచ్చెను
      శంకరుఁ డుగ్రతను, నరకుఁ జంపె దురమునన్
      జంకెను నసురుడు, కృష్ణుని
      వంకనె జూచుచు నతనిని వధియింపగనేన్!

      తొలగించండి
    4. 'ఇంకను... జంకుచు నసురుడు... గనెన్' అనండి. కొంత అన్వయలోప మున్నది.

      తొలగించండి
    5. గురువులు చెప్పిన మార్పుతో 🙏

      శంకరుఁ డుగ్రతను నరకుఁ జంపె దురమునన్*

      ఇంకయు కందము నిచ్చెను
      శంకరుఁ డుగ్రతను, నరకుఁ జంపె దురమునన్
      జంకుచు నసురుడు, కృష్ణుని
      వంకనె జూచుచు నతనిని వధియింపగనెన్!

      తొలగించండి
  5. మాదు శుభము గోరు మాన్యుo డు మా కంది
    శంకరుం డు :నరకు జంపె నలిగి
    సత్య పోరి తనయు సాహసో పే త యై
    జగతి యంత నిండె సంత సంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని నరకుని చంపింది కృష్ణుడే... సత్యభామ కాదు.

      తొలగించండి
    2. రెండవ పాద o లో చక్రి పోరి మిగుల సాహసో పేతుడై అని సవరణ చేయడ మైనది

      తొలగించండి
  6. పావనుండు గోపబాలుడుభక్త వ
    శంకరుండు, నరకుఁ జంపె నలిగి
    సత్యభామగూడి సర్వులరక్షింప
    నందగోపబాల! వందనములు!

    రిప్లయితొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పొంకము మీరగా మిగుల పోడిమి నొల్లెడు సత్యభామనున్
    వంకన జేర్చుచున్ చెలగి వైరిని కూల్చెడు పోరునందునన్
    పంకజ నాభుడే ప్రజకు భవ్యము కూర్చుచు శాంతినిచ్చుటన్
    "శం"కరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై...

    శం = శుభం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలబాగున్నది!ముందు నేనూ యిదే భావనతో వ్రాద్దామనుకున్నాను!అభినందనలు!

      తొలగించండి
  8. (పంచాయుధపాణి పరమదుర్మార్గుని నరకుని వధించాడు)
    అంకమునందు సత్య తన
    యమ్ముల బర్వుచు నిల్చియుండగా ;
    శంకలు లేని వేగమున
    ఝమ్మని యాయుధపంచకమ్ముతో ;
    పంకజనేత్రుడున్ - ప్రభుడు-
    భద్రుని తమ్ముడు - చక్రి - కంసనా
    శంకరు డుగ్రుడై నరకు
    జంపెను లోకహితైకకాంక్షియై .

    రిప్లయితొలగించండి
  9. పంకజనేత్ర సత్యయను భామ సురారిని దుష్టవర్తనున్
    సంకటనాశనా! వినుము చంపెద నేననుచుండ నామెతో
    బంకజనాభు డాతరిని వల్లె యటంచును దైత్యభాగ్యలే
    శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై"

    రిప్లయితొలగించండి
  10. బాధపెట్టు చుండ ప్రజలను నిత్యము
    నరభుజుడు పడసిన వరము లెరిగి
    సమితికి పురిగొల్పి సత్యను, భక్త వ
    శంకరుండు, నరకుఁ జంపె నలిగి

    రిప్లయితొలగించండి

  11. త్రిపుర నాధులయిన త్రిపురాసులను జంపె
    శంకరుండు ; నరకుఁ జంపె నలిగి
    సత్యభామ తోడుసలుప శ్రీకృష్ణుడు ,
    సిలుగు తొలగ సంత సించె జనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సంతసించె...ఏకవచనం, జనులు... బహువచనం. "సంతసించి రెల్ల" అనండి.

      తొలగించండి
  12. సంకటపెట్టుచున్ ప్రజల చంపుచు క్రమ్మఱు చుండ పృథ్విపై
    బింకముతోడ, దేవతలు వేడ కనుంగొని సత్యయండతో
    నంకమునందునన్ బెనగి యంబుజనాభుడు, రక్కసీల నా
    శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాక్షసాళి నాశంకరుడు..." అనండి.

      తొలగించండి
  13. జంకక రాచకన్నెలను సంకటబెట్టుచు బంధనమ్ములన్
    పెంకితనమ్ముతో మునులబెట్టగ బాధల పెక్కురీతులన్
    పంకజనాభుడా హరియె భామనుగూడుచు ఘోరదైత్య నా
    శంకరుడుగ్రుడై నరకుజంపెను లోకహితైక కాంక్షుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పంకిల చిత్తుడు దైత్యుడు
      సంకట బెట్టగ జనులను శ్యామాంగుడు వా
      మాంకమున సత్యతో జన
      శంకరు డుగ్రతను నరకుజంపె దురముగన్

      కందము మాకందము,మకరందము, అరవిందము!!

      తొలగించండి
    2. దుష్టశిక్షకుండు దైత్యాళి దునుమంగ
      కృష్ణరూపుడగుచు కీలెరింగి
      సత్యభామ గూడి సంరంభమున శిష్ట
      శంకరుండు నరకు జంపె నలిగి

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యోస్మి గురుదేవా,నాకివాళ దీపావళి పండుగే!సమస్సులు!!

      తొలగించండి
  14. ఈ నాటి శంకరా భరణము సమస్య (శంకరుండు నరకు జంపె నలిగి)
    ఇచ్చిన సమస్య ఆట వెలది నా పూరణము సీసములో

    శ్యామ సుందరుడు, వ్రజ కిశోరుడు, మురారి,
    నలమేనిదొర,సూరి ,నల్లనయ్య

    దేవకీ తనయుడు, దేవతా శ్రేష్టుడు
    శకటారి,మల్లారి, శైల ధరుడు,

    రాధికా రమణుడు, సాధుహితుడు, వాసు
    దేవుడు, సాత్రాజితీ వలపు వ

    (శంకరుండు నరకు జంపె నలిగి) ఘోర
    సంగర మున సతి సత్య భామ

    తనకు తోడుండగ తన సుదర్శనమ్ము
    విడచి, దనుజుడు దివిజేర పుడమి లోన
    సంబ రములును జనులెల్ల జరుపు కొనగ
    నదియె దీపావళి యనిరి ముదము తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీసంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాత్రాజితీ వలపు' దుష్టసమాసం. "సాత్రాజితీ హృదయ వశంకరుండు..." అనండి.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. పంకజసంభవాదిసురపంక్తివిపత్తినిరాసకుండునై
      శంకితపార్థసంవృతవిచారనిరాకరణోపదేష్టయౌ
      సంకటహారికృష్ణుడు విశంకటదౌష్ట్యనిశాచరాళినా
      శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. కంస ఘస్మరుండు కరుణాంత రంగుడు
    శిష్ట రక్షకుండు శ్రీకరుండు
    రుక్మిణీ మనోహరుడతడు భక్త వ
    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    రిప్లయితొలగించండి
  17. జనుల నేచు వారి జంపి వైచెను గదా !
    శంకరుండు ; నరకుఁ జంపె నలిగి
    సత్య గూడి నాడు సకలజ నావళి
    మెచ్చ సూరి భువికి మేలు కలుగ
    **)(**
    సూరి = శ్రీకృష్ణుడు

    రిప్లయితొలగించండి
  18. ఈ నాటి శంకరాభరణము సమస్య ప్రత్యేకముగా బ్లాగులో నొక మిత్రుని కోరిక మేరకు గురువు గారు ఉంచినది

    శంకరుఁ డుగ్రతను, నరకుఁ జంపె దురమునన్

    యిచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    వలపు బాణమ్మును చిలుకతత్తడి రౌతు
    సంధించ తపమును జరుపు చున్న

    దహనాంబకు మదికి తగిలె, కించిత్తు వి
    కారము కలుగ నా గరళ ధరుడు

    కనులు తెరచి చూడ కనపడె రతిపతి,
    దీప్తి నొప్పెడు కన్ను తెరచి యిష్ము

    డుని జంపె శంకరుఁ డుగ్రతను, నరకుఁ
    జంపె దురమునన్ వ్రజవరుడు సతి


    సత్య భామ తోడుగ నుండ, సాధు జనులు
    సంత సమునొంది కీర్తించె శైల ధరుని,
    జనులు జగతిని జేసిరి సంబరములు,
    నదియె దీపావళి యనుచు ముదము తోడ

    ఇష్ముడు = మన్మధుడు

    రిప్లయితొలగించండి
  19. పంకజ నాభుడీ పుడమి భారము దీర్చగ నెంచి తాను శే
    షాంకము వీడి కృష్ణుడయి జన్మము నెత్తిన వాడు పోరుకై
    పంకజనేత్రిసత్య, తన భామను చేగొని పోయి దుష్ట నా
    శంకరు డుగ్రుడై నరకుఁ జంపెను లోక హితైక కాంక్షియై.

    రిప్లయితొలగించండి
  20. దుష్టులదునుమాడిశిష్టరక్షణజేయ
    భువిని జేరవచ్చె భవితగోరి
    శంకరుండు, నరకుఁ జంపె నలిగి నాడు
    సత్యకృష్ణు గలిసి సంగతమున!!

    రిప్లయితొలగించండి
  21. ఆ.వె.

    శివుడు కేశ వుండు శివమందు నొక్కరే
    దుష్ట సంహరణన దూర మేల
    ప్రజల హితము గోరు పరమాత్ము డాతడే
    శంకరుండు నరకు జంపె నలిగి

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. వనితల మునుల చెర బెట్టిన దుష్టుని
    యాగడముల నణచ నంత రంగ
    మందు దలచి వడిగ నాసత్యభామావ
    శంకరుండు నరకు జంప నరిగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ. అభినందనలు.
      'చెర బట్టిన' టైపాటు. లేకుంటే యతిదోషం.

      తొలగించండి
  23. మీకు మీ కుటుంబ సభ్యులకు "దీపావళి శుభాకాంక్షలు".

    సీసము:
    కామమ్ము జూడగ "కాకరపూవత్తి"
    చేతబట్టుచు గాల్చు చివరి వరకు
    క్రోధమ్ము "బాంబది" కొంత దూరముబెట్టి
    జాగ్రత్తగాబేల్చు సాధనమున
    లోభమ్ము "పాంబిళ్ళ" లోనుండి దీయుచు
    ముట్టించి మసిజేయి పట్టుబట్టి
    మోహమే దలపగా మురియు "తారాజువ్వ"
    పైకివదలు కాల్చి ప్రియముగాను

    ఆటవెలది:
    మదము విసరిగొట్టు మది "నేలటప్పాసు"
    మత్సరమ్ము గాల్చు మరి "మతాబు"
    లోన వెలుగజేయి జ్ఞానంపు "జ్యోతిని"
    మది "దివాలి" యగును మనిషి కెపుడు.

    ---గోలి. 😐

    రిప్లయితొలగించండి
  24. సంకటమై ధరాస్థలికి సర్వులు జింతిలు చుండి చూడ న
    ల్వంకల క్రూరుడౌ నరక రాక్షసు ద్రుంచెడి త్రాత కోస మా
    పంకజ నాభు డుద్ధృతిని బద్దను జేగొని కాంచ ధాతయున్
    శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై.

    రిప్లయితొలగించండి


  25. కంద పద్య మెందు కయ్యరొ లేదన
    ననుదినమ్ము కొంత నచ్చ చెప్పి
    కొంత సేద దీర్చి కోరిక దీర్చుచు
    శంకరుండు, నరకుఁ జంపె నలిగి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. అరయకేశవుండు నభవులొకరగుట
    శంకరుండునరకుజంపెనలిగీ
    ననుటదప్పుకాదుహర్షవర్ధన!నాదు
    భావమదియయనుచువ్రాసియుంటి

    రిప్లయితొలగించండి
  27. హరియె విన్నవింప హరికి నాదిత్యుఁడు
    కరుణ తోడ నరిగి కాంత తోడ
    నంక మందుఁ జెలఁగి యంచి తారాధిత
    శంకరుండు నరకుఁ జంపె నలిగి


    అంక గణాంక శంక రహితాత్మ కళంక నికాయ పంక డో
    లాంక సకంక ణావృత ఖరాయత హస్త విశంక టోగ్రు, స్వీ
    యాంకము నందు సత్య నలి నాంబక భాసిల ఘోష వల్లవీ
    శంకరుఁ డుగ్రుఁడై, నరకుఁ జంపెను లోక హితైక కాంక్షియై
    [అంకము = దోషము, అంకె, గుర్తు, సమీపము; డోలము = అభినయ హస్త విశేషము ; వల్లవీ శంకరుఁడు = గోపికలకు సుఖములు గలుగఁజేయువాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుదీర్ఘసమాసఘటితము పండితైకవేద్యమై శ్లాఘనీయమైనది.
      నిన్న నా పద్యంలో మీకు కలిగిన సందేహానికి నిన్నటి పూరణ ప్రత్యుత్తరాలలో నా అభిప్రాయాన్ని చేర్చాను చూడండి.
      నిన్నటి blogspot చూడగలరు.
      అభివాదములు.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      ఆర్యులు రాఘవాచార్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      నా సందేహము మహదమహద్వాచకముల గురించి కాదండి.

      దీధితులు జ్యోత్స్నాభములు.
      దీధితులు(తత్సమము చేసిన తర్వాత) జ్యోత్స్నాభులు కాకూడదని.
      రామలక్ష్మణులు జ్యోత్స్నాభులు.
      రుక్మిణీ సత్యభామలు జ్యోత్స్నాభలు.
      దీపములు జ్యోత్స్నాభములు.

      ఈ విధముగా నని నా సందేహ మండి.

      తొలగించండి
    4. నమస్కారాలండి.
      దీధితి కాంతివాచకమై స్త్రీలంగము ప్రభ వలె కాదా!, అయినచో ప్రభ ప్రభలు అవుతుందికదా, అలానే స్తీలింగ ఇకారాంతశబ్దాలు బహువనంలో ప్రభలవలెనే అవుతున్నాయికదా,సంస్కృతనియమానుసారం విశేషము ఏ లింగమౌతుందో విశేషణం కూడా అదే లింగము వచనము అవుతుంది దాని ఆధారంతో నేను ప్రయోగించాను.
      ఈ ప్రయోగము సాధువు కాదని సప్రమాణంగా సూచిస్తే సవరించుకుంటానండి.

      తొలగించండి
    5. ప్రమాణములకు చూచెదనండి లభించిన వ్రాయఁ గలవాఁడను. నమస్సులు. నాకును సందేహ నివృత్తి కాఁగలదు.

      తొలగించండి
    6. జ్యోత్స్నాభ లో ఆభ ని సదృశమని వాడారా లేక కాంతి యను నర్థమున వాడారా తెలుపఁ గోరెదను.

      తొలగించండి

  28. శంకలులేక కృష్ణుడిక, శాంతము వీడుచు పోరుబాటలో
    బింకముమానిసత్యముగ ,భీరువుగాదని తేల్చిచెప్పగా
    కుంకగదల్చితానుమరి,కూల్చెనుగానికశిష్టుడైన నా
    శంకరుడుగ్రుడైనరకు,జంపెనులోకహితైకకాంక్షియై
    +++++++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు






    రిప్లయితొలగించండి
  29. ఉ:

    శంకలు గట్టనేల శివ చక్రియు నిద్దరు యొక్కరే గదా
    వంకలు మాని జూడనిల వారల బూనిక మోక్షదాతలై
    బింకము లేల నిశ్చయము పించను దాల్చిన దేవదేవుడే
    శంకరుడుగ్రుడై నరకు జంపెను లోక హితైక కాంక్షియై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..నిద్దరు నొక్కరే కదా... వారల పూనిక ... పింఛము..." అనండి.

      తొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    సందర్భము: శౌరి (విష్ణుమూర్తి) త్రేతాయుగంలో రాముడై రావణు వధించినాడు. ద్వాపరయుగంలో కృష్ణుడై నరకుని జంపినాడు.
    రెండు తావుల ఉద్దేశ్యం ఒక్కటే! అదేమంటే వాళ్ళు (రావణుడు, నరకుడు) ధరణికి (భూదేవికి) భారం కావడం.
    ఎప్పుడైతే నరుడు ధర్మ ప్రీతి వదలి విచ్చలవిడితనమే సర్వశ్రేష్ఠ మని భావించి, నిర్ణయించుకొని అవలంబిస్తాడో అప్పుడే అతడు లోక కంటకు డౌతాడు. ధర్మ ప్రీతికి తిలోదకా లిచ్చినప్పుడే దైవానికి దూరమౌతాడు. భూమికి భారమౌతాడు.
    కలుపు మొక్కల నేరివేసినట్టు అలాంటి వాళ్ళను తొలగించడానికై లోకేశ్వరుడు రామ కృష్ణా ద్యవతార పురుషులుగా ఉద్భవిస్తాడు.. తన పని తాను చేసుకుంటూ పోతాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ధరణికి బరు" వంచు దనుజు రావణు జంపె

    త్రేత శౌరి రాము రీతి.. నటులె

    ద్వాపరాన కృష్ణు వలె వచ్చి సాధు వ

    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    27.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  31. ఉ. శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ, జంపెను లోకహితైకకాంక్షియై
    శంకదిలేదుమాకుసుఖశాంతులనిల్పగ వచ్చుదైవమే
    జంకెదరెందుకింక,మననాధుడె శంకరు,విష్ణువన్న, తా
    వంకకు,చక్రశూలముల నాపును రాక్షసమూకనెల్లెడన్,

    రిప్లయితొలగించండి
  32. శంక లేల వినుము సత్యమ్ము భక్తవ
    శంకరుండు నరకుఁ జంపె; నలిగి
    సంకటముల గుములు జనులను గాచెనా
    పంకజాక్షు డవని భారమణచె

    రిప్లయితొలగించండి
  33. గురువు గారు సూచించిన మార్పులతో..
    ఉ:

    శంకలు గట్టనేల శివ చక్రియు నిద్దరు నొక్కరే కదా
    వంకలు మాని జూడనిల వారల పూనిక మోక్షదాతలై
    బింకము లేల నిశ్చయము పింఛము దాల్చిన దేవదేవుడే
    శంకరుడుగ్రుడై నరకు జంపెను లోక హితైక కాంక్షియై

    వై. చంద్రశేఖర్

    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  34. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

    ఉత్పలమాల
    జంకని లోకకంఠకుడు సారసనేత్రల ఖైదుజేయఁగన్
    గొంకఁగ శాంతి భద్రతలు గోకుల కృష్ణుని వేడ బాధితుల్
    నంకిత సత్యతోఁ జన, లయంబున కాద్యుడు నౌచుఁ బూనగన్
    శంకరుఁడు,గ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ గ్రూపులో సూచించిన సవరణతో పూరణ పరిశీలించ ప్రార్థన:

      ఉత్పలమాల
      జంకని లోకకంఠకుడు సారసనేత్రల ఖైదుజేయఁగన్
      గొంకఁగ శాంతి భద్రతలు గోకుల కృష్ణుని వేడి నంతనే
      యంకిత సత్యతోఁ జన, లయంబున కాద్యుడు నౌచుఁ బూనగన్
      శంకరుఁడు, గ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై

      తొలగించండి
  35. దుష్టుడౌ నసురుని దునిమి లోక హితమున్
    జేయ నెంచె శౌరి చెలియ గూడి
    సజ్జనులకు కీడు సలుపగా భక్తవ
    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    రిప్లయితొలగించండి
  36. శంకరుడుగ్రుడైనరకుజంపెనులోకహితైకకాంక్షియై
    పంకజనాభుడేశివుడుమారునిశత్రువయుమాకాంతుడే
    శంకయలేదుగానికనుసారసలోచనుడేగదా ధరన్
    సంకటబెట్టలోకులనుజంపెనుసత్యయెలోకకంటకున్

    రిప్లయితొలగించండి
  37. కుంకవునీవు మాయెదుట, కూల్చెదమిప్పెడు నొక్కవేటుతో
    బింకముమానకున్ననిక,బీతిలిపోదువు మాదుచేతిలో
    శంకలనన్నిమానియిక శాత్రవుడీవని యెంచి దుష్టనా
    శంకరుడుగ్రుడై నరకుజంపెను లోకహితైక కాంక్షియై

    రిప్లయితొలగించండి
  38. ఆటవెలది
    లోక కంఠకుండు శోకమందున ముంచ
    వనితలాదిగ ప్రజ వినతులిడఁగఁ
    జక్రిఁ గూడ ననికి సత్యాంబ, దైన్య నా
    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    రిప్లయితొలగించండి
  39. మరొక పూరణ
    అసురవరులకైన నభయమిచ్చెడి వాడు
    శంకరుండు , నరకు జంపె నలిగి
    సమర రంగమందు శౌరితా సత్యతో
    నదియె పర్వమయ్యె నవని యందు

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    సందర్భము: మనుష్యుడెప్పుడైతే ధర్మ భ్రష్టుడౌతాడో అప్పుడే దైవానికి దూరమై పోతాడు. ఎందుకంటే దైవమూ ధర్మమూ ఒక్కటే గనుక. ఇక అప్పటినుండి అతడు తాను ఆచరించే విధానమే ధర్మ మని భావించటం మొదలుపెడుతాడు.
    రావణుడు నరకుడు మొదలైన వా ళ్ళెందరో అందుకు ఉదాహరణలుగా నిలిచిపోయారు.
    రాముడు కృష్ణుడు మొదలైన పురాణ పురుషుల చేతిలో అలాంటివాళ్ళు హతు లయ్యారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ధర్మ పతితు డైన దైవ దూరుం డగుఁ..

    దనదె ధర్మ మనును.. దనుజ రావ

    ణుని వధించె రాముడును.. హరి, సాధు వ

    శంకరుండు నరకుఁ జంపె నలిగి

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    27.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి