31, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3237 (కాంతకు వీడుకోలు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే"
(లేదా...)
"కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్"
30, డిసెంబర్ 2019, సోమవారం
సమస్య - 3236
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది ....
"అవధానిని రాజమండ్రి యడలం జేసెన్"
(లేదా)
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
29, డిసెంబర్ 2019, ఆదివారం
సమస్య - 3235 (పడఁతులు పాశురమ్ముల....)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"
(లేదా)
"పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో)
28, డిసెంబర్ 2019, శనివారం
సమస్య - 3234 (దానముఁ జేయఁగా...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్"
(లేదా...)
"దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)
27, డిసెంబర్ 2019, శుక్రవారం
సమస్య - 3233 (బడికిఁ బోవువాఁడు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు"
(లేదా...)
"బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్"
26, డిసెంబర్ 2019, గురువారం
సమస్య - 3232 (చెడు మతమున్న...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో"
(లేదా...)
"చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను
సుస్థిరమ్ముగన్"
(జిలేబి గారికి ధన్యవాదాలతో...)
25, డిసెంబర్ 2019, బుధవారం
సమస్య - 3231 (చీకటియే వెలుంగు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే"
(లేదా...)
"చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"
24, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3230 (పూల వలన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూల వలనఁ జెడెను పుష్పవనము"
(లేదా...)
"పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్"
23, డిసెంబర్ 2019, సోమవారం
సమస్య - 3229 (వానలు లేకుండ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్"
(లేదా...)
"వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే"
22, డిసెంబర్ 2019, ఆదివారం
సమస్య - 3228 (బంగ్లాపైఁ గొలనున్నది...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్"
(లేదా...)
"బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్"
21, డిసెంబర్ 2019, శనివారం
సమస్య - 3227 (చలిపులి పల్కరించఁగనె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్"
(లేదా...)
"చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్"
20, డిసెంబర్ 2019, శుక్రవారం
సమస్య - 3226 (నారీరత్నము సూపె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్"
(లేదా...)
"నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్"
19, డిసెంబర్ 2019, గురువారం
సమస్య - 3225 (కలువలు వికసించె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్"
(లేదా...)
"కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్"
18, డిసెంబర్ 2019, బుధవారం
సమస్య - 3224 (దూలము సెలరేఁగి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్"
(లేదా...)
"దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై"
17, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3223 (మితము గాని తిండి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మితము గాని తిండి మేలు సేయు"
(లేదా...)
"మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్"
16, డిసెంబర్ 2019, సోమవారం
సమస్య - 3222 (తలకుఁ జెవులె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు"
(లేదా...)
"తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"
15, డిసెంబర్ 2019, ఆదివారం
సమస్య - 3221 (పాయస మన్నచో...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్"
(లేదా...)
"పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్"
14, డిసెంబర్ 2019, శనివారం
సమస్య - 3220 (పగలో మున్గినవారి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగను మున్గ నడఁగుఁ బాపచయము"
(లేదా...)
"పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాని సమస్య)
13, డిసెంబర్ 2019, శుక్రవారం
సమస్య - 3219 (మానహీనునకు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మానహీనునకు నమస్కరింతు"
(లేదా...)
"మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో"
12, డిసెంబర్ 2019, గురువారం
సమస్య - 3218 (గడ్డిపోచ చాలు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గడ్డిపోచ చాలు కలహమునకు"
(లేదా...)
"కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"
(ఈ సమస్యను పంపిన కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారికి ధన్యవాదాలు)
11, డిసెంబర్ 2019, బుధవారం
సమస్య - 3217 (దాత యనఁబడు దాత...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు"
(లేదా...)
"దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో"
10, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3216 (మేడ నెక్కఁగ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు"
(లేదా...)
"మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్"
9, డిసెంబర్ 2019, సోమవారం
సమస్య - 3215 (కాముఁడు దున్నపోతు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాముండే దున్నపోతు గణపతి కపియౌ"
(లేదా...)
"కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్"
(వృత్తపాదంలో యతిని గమనించండి)
8, డిసెంబర్ 2019, ఆదివారం
సమస్య - 3214 (యమున కగును...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"యమున కగును బూది యగుట యెపుడొ"
(లేదా...)
"యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్"
7, డిసెంబర్ 2019, శనివారం
సమస్య - 3213 (శంకరుఁ డుమ కొఱకు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్"
(లేదా...)
"శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారం కానున్న సమస్య)
6, డిసెంబర్ 2019, శుక్రవారం
సమస్య - 3212 (కోడిని మ్రింగినది...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్"
(లేదా...)
"కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"
5, డిసెంబర్ 2019, గురువారం
సమస్య - 3211 (రామరాజ్యాన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె"
(లేదా...)
"బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్"
4, డిసెంబర్ 2019, బుధవారం
దత్తపది - 164
కవిమిత్రులారా,
'కవి' పదంతో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
3, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3210 (సానిన్ ముద్దాడె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్"
(లేదా...)
"సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్"
2, డిసెంబర్ 2019, సోమవారం
సమస్య - 3209 (కుండలోనఁ జొచ్చె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు"
(లేదా...)
"కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"
1, డిసెంబర్ 2019, ఆదివారం
సమస్య - 3208 (చూడఁ జూడ రుచుల...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చూడఁ జూడ రుచుల జాడ యొకటె"
(లేదా...)
"శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా"
(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)