15, డిసెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3221 (పాయస మన్నచో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్"
(లేదా...)
"పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్"

74 కామెంట్‌లు:

 1. పాయసమన నెవ్వఁడిష్టపడు నీజగతిన్
  కం

  తీయని రుచులను తినమని
  కాయా కష్టము పడినను కరుణించకనే
  ఆయస పడు నా పనులకు
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  కళ్యాణ్ చక్రవర్తి
  🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్ని మార్పులతో 🙏🙏

   తీయని రుచులను తినుమని
   కాయము కష్టము పడినను కరుణించకనే
   ఆయాస పడు పనులకును
   పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది అభినందనలు
   కరుణించకయే . . అనండి.

   తొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  కోయిల కూతనున్ వినుచు కొండొక రీతిని చూడగోరుచున్
  నాయిక తోడ పర్వులిడి నాయకు డొక్కడు తృష్ణ దీర్చుటన్
  తోయము గన్గొనంగనట తోరపు కుండల నిండ తుష్టినిన్
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ప్రాయము నందు సుంతయును పాయస మన్నది కానరాకయే
  తోయము తోడ తృప్తిపడి తుమ్ముచు దగ్గుచు వార్థకమ్మునన్
  కాయపు రక్తనాళముల కమ్మగ నిండగ పంచదారయే
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?

  రిప్లయితొలగించండి
 4. నిన్నటి పూరణ:-

  సిగలోఁ వెన్నెల చంద్రరేఖ,మెడలోఁ జిందాడఁ గాకోలమే,
  రగిలే మూడవ కన్ను ఫాలమున,నీలగ్రీవమే భవ్యమై,
  సగమై పార్వతి లోకముల్ పొగడగా,సాంబా!తలన్ గల్గు నా
  పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తీయని మాటలాడుచును తీతురు ప్రాణము లిద్ధరన్ మహా
   మాయలు మంత్రజాలముల మత్తుల జేతురు వారినిన్ సఖా!
   డాయక నుండ సౌఖ్యము సదా!మధు మేహముఁ మించఁ జేయు నా
   పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు

   తొలగించండి
 5. కస్తూరి శివశంకర్ఆదివారం, డిసెంబర్ 15, 2019 2:01:00 AM

  కోయిల కుహూరవములన్
  తోయద సందోహములను దోసెడు విరులన్
  దోయిలి ఘటించు వాడే
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  రిప్లయితొలగించండి
 6. కస్తూరి శివశంకర్ఆదివారం, డిసెంబర్ 15, 2019 2:02:00 AM

  పీయూష పదముతోనే
  తీయని బంధముల విలువ తెలుపు మనుజుడే
  మాయల మోహము విడువఁగ
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  బల్లియె మిక్కిలి భీతి గొల్పగన్ :
  __________________________

  బీయము శ్రేష్ఠమైనవియు - బెల్లము మీఱిన తీపి గల్గినన్
  పేయము లవ్వి చిక్కనివి - భేషుగ వండెను భక్షకారుడున్
  హాయిని గొల్పు వాసనల - నానన మందున నంబువూరినన్
  పాయస పాత్రలో పడిన - బల్లియె మిక్కిలి భీతి గొల్పగన్
  పాయస మన్నచో నెవఁడు - వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్ ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. B-1)
   సవరణతో :
   బల్లియె మిక్కిలి భీతి గొల్పగన్ :
   __________________________

   బీయము శ్రేష్ఠమైనవియు - బెల్లము మీఱిన తీపి గల్గినన్
   పేయము లవ్వి చిక్కనివి - భేషుగ వండెను భక్ష్యకారుడున్
   హాయిని గొల్పు వాసనల - నానన మందున నంబువూరినన్
   పాయస పాత్రలో పడిన - బల్లియె మిక్కిలి భీతి గొల్పగన్
   పాయస మన్నచో నెవఁడు - వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్ ?
   __________________________

   వసంత కిశోర్ (కవులూరు రమేష్)

   తొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-1)
  రెట్టన్ వేసిన పాయసము :
  __________________________

  కా-యని కా-యని కూయుచు
  వాయస మొక్కటియె వ్రాలె - పాయస పాత్రన్
  ఛీ-యన, రెట్టన్ వేసిన
  పాయసమన నెవ్వఁ డిష్ట - పడు నీజగతిన్ ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 9. ఊయల పండుగ దినమున
  చేయగ దానికి సరియగు శీతము లేకన్
  పాయగ పులిసిన బియ్యపు
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  పాయు = పక్వపదార్థము మెత్తఁబడి చెడు.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-2)
  కాయము చెంతనె నిలబడి :
  __________________________

  గాయము పాలై యాపద
  ప్రాయము నందున స్వజనుడు - ప్రమయము నొందన్
  కాయము చెంతనె నిలబడి
  పాయసమన నెవ్వఁ డిష్ట - పడు నీజగతిన్ ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ:

  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్!

  మువ్వురు భార్యలు.. నల్వురు అబ్బాయిలు.
  (మరల నల్గురు కోడళ్లు😄)

  ఆయన గారికే దశరథాఖ్యునకే యిది చెల్లె., గాని ఆ
  తీయని బంధమేది? సుదతీత్రయమున్ భరియింప జాలునే?!
  "పాయక నల్వురైన పసిబాలురు పుట్టెదరయ్య త్రాగుడీ
  పాయస"మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మరో పూరణ

   కాయలు మాత్రమే తినుము, కారము నూనెను తాకబోకు! నీ
   కాయువు తీరిపోవు ! తనువంతయు చక్కెర నిండిపోయె నే..
   తీయని వస్తువున్ బడదు! తెచ్చిన యిచ్చిన ముట్టబోకుమీ
   పాయస"మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్.!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి

   తొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-3)
  మరణపుటంచున్ :
  __________________________

  గాయములై యొడలంతయు
  మాయమవగ నొక్క కాలు - మరణపుటంచున్
  సాయంబది లేనప్పుడు
  పాయసమన నెవ్వఁ డిష్ట - పడు నీజగతిన్ ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 13. సాయము లేనిచో నడక సాధ్యము కాదు, షుగర్ దిసించె, నీ
  కాయము భారమాయెను, వికారము కల్గును భోజనంబుయే,
  న్యాయము కాదురా తినిన, నాశము కల్గును దేహమప్పుడున్,
  ఫాయిజనే గదా షుగరు, ప్రాణము పోయిన యేమి నీ కనన్
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్"


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు
   దిసించె.. ? భోజనంబు+ఏ.. అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 14. *కార్తిక మాసమున ప్రేయసితో వనభోజనాలకై పోయినవేళ నచట*

  పాయసమును వనమందున
  ప్రేయసి తా జేసి మూత పెట్టుట మరువన్
  వాయసము రెట్ట వేసిన
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. వగఁ పోగార్చెడు సృష్టిపాలనలయవ్యాపారునిం దల్చుచున్
   ఖగరాడ్వాహనపావనాంచితమహత్కారుణ్యసంధాయినీ
   నిగమాంతస్స్థితభవ్యపాదవిలసన్నీరేజసంకీరనా
   పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు

   తొలగించండి
 16. ( స్వామికి నైవేద్యం పెట్టిన కమ్మనిపాయ
  సాన్ని కడుపార తాగని వాడుంటాడా ?)
  శ్రీయుతమూర్తియౌ హరికి
  జిత్తము నిల్పుచు జేసినట్టిదౌ
  తీయని చోష్యమున్ గొనక ,
  దిక్కుల జూచుచు , మోము ద్రిప్పునా
  పాయసమన్నచో నెవడు ?
  " వల్లె " యటంచును గ్రోలు నిద్ధరన్
  హాయిగ జీడిపప్పులనె
  " యాహహ " యంచు మరింత కోరుచున్ .
  (చోష్యము - పీల్చి త్రాగేది ; వల్లె యటంచు - సరే అంటూ )

  రిప్లయితొలగించండి
 17. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-4)
  తీపిని తినకన :
  __________________________

  కాయమునను శర్కరయే
  ఱేయునదియె పరిధి దాటి - రివ్వున నెగయు
  న్నాయువు, తీపిని తినకన;
  పాయసమన నెవ్వఁ డిష్ట - పడు నీజగతిన్ ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 18. B-2)
  గురుశిష్య సంవాదము : :
  __________________________

  పాయస మన్నచో నెవఁడు - వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్ ?

  "బీయము శ్రేష్ఠమైనవియు - బెల్లము మిక్కిలి తీపి గల్గినన్
  పేయము, యాలకుల్పొడిని - వేయుచు వండిన పాచలుండహో
  హాయిని గొల్పు వాసనల - నానన మందున నీరు పొంగినన్
  పాయసమన్న నందరును - వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్ "!
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి


 19. మాయామచ్చీంద్రా విను
  మా! యింటింటను విరివిగ మధురిమ లలరన్
  తీయని జిలేబులుండగ
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. చేయక వ్యాయామంబుల
  మాయల మధుమేహ మంత మల్లడిగొనగన్
  కోయగ నొక్కొక్కవయము
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?

  మల్లడిగొను-నిండుకొను

  రిప్లయితొలగించండి
 21. సమస్య :-
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  *కందం**

  రాయలు మెచ్చిన తెలుగిల
  పాయస తీపులను పంచి భావము దెల్పున్
  వాయస పలుకుల యాంగ్లపు
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్
  ...................‌‌...✍చక్రి

  రిప్లయితొలగించండి
 22. పాయని మధు మేహమ్ము న
  రోయుచు వదలంగ వలసి రోగము మాన న్
  తీయని రుచి గలిగి న నా
  పాయస మన నె వ్వ డిష్ట పడు నీ జగతి న్

  రిప్లయితొలగించండి

 23. ... శంకరాభరణం... 15/12/2019 ...శుక్రవారం

  సమస్య.
  *** *** **

  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  నా పూరణ.
  ** *** ***

  శ్రేయమిడ దపరిశుభ్రత

  ఆయువు శుభ్రతయే పెంచు నదిపాటించనిచో

  కాయము నకంటు రోగం

  పాయసమన నెవ్వ డిష్టపడు నీ జగతిన్

  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి


 24. ఓయమ! గేస్తురాల! విను! నోర్మిని నోచుకొనమ్మ గేస్తుడిన్
  సాయము బట్టియాతనికి జాంగ్రి, జిలేబులు బాదుషాల్ వడి‌న్
  ప్రాయపు మాయ చేయు మదిరమ్ముగ నీవిక కొల్లగొట్టగా
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?

  :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. కాయము నొవ్వంగ నుపా
  ధ్యాయుఁ డకట దృష్ట దోషుఁ డౌచలిగి బృహ
  త్కాయుం డే నిత్తును దొడ
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్


  ఆయత విత్త రాశుల మహావిభవమ్ములఁ దేలి యాడుచుం
  దోయపు వారి యిల్లులఁ బ్రతోషముతో భుజియించు వారలం
  బాయస మింపుగా నునిచి పాత్రను దెచ్చుచుఁ బాత్ర పీత రూ
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్

  [పీతరూప +ఆయసము = పీత రూపాయసము; ఆయసము = ఇనుము]

  రిప్లయితొలగించండి
 26. చేయుము పాయసమ్మనగ చేడియ చేసె ధవుండు కోరగన్
  నేయియు జీడిపప్పు లటు నేర్పడ శర్కర నెండు ద్రాక్షలుం
  బాయక వేసె, నయ్యెడ నవాంఛితగోళినిపాతమయ్యె, నా
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్

  రిప్లయితొలగించండి


 27. ఆకాశవాణి వచ్చేవారపు సమస్య తెలియ చేయగలరు

  రిప్లయితొలగించండి
 28. తీయని భక్ష్యముల్ వలదు తీయును ప్రాణమటంచు చెప్పెగా
  శ్రీయుతుడైన జీవదుడు చెక్కర వ్యాధియె యున్న వారికిన్
  శ్రేయము కాదుకాదనుచు చెప్పినచో మధు మేహరోగులీ
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్

  రిప్లయితొలగించండి
 29. తోయజపత్రేక్షణతన
  బాయనిచిరునవ్వుసుధలు పంచగనికనే
  పాయసమెనయగు దానికి?
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  రిప్లయితొలగించండి
 30. చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్రరశ్మియున్
  ఇది వచ్చేవారానికి ఆకాశవాణి వారి సమస్య

  రిప్లయితొలగించండి
 31. కందం
  దాయని వరూధినీ నవ
  సోయగముల వైపు ప్రవర చూడవదేలా?
  తీయగ నందించు నధర
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?

  రిప్లయితొలగించండి
 32. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  పాయస మన నెవ్వ డిష్టపడు నీ జగతిన్

  సందర్భము: కౌసల్య పాయసం తెచ్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పిలిచింది. "ఎవరి కిష్టమో వారు వచ్చి తినం" డన్నది.
  (ఊరికే తినం డంటే గబుక్కున తీసుకొని తినరు. ఎవరి కిష్టమో వారు వచ్చి తినం డంటే.. నాకు..నాకు.. అంటూ పరుగెత్తుకు వస్తారు ఇంకొకరికంటె ముందుగా.. అదీ కౌసల్య ఉద్దేశ్యం.)
  కైక దానికి జవాబుగా కింది విధంగా పలికింది.
  "పాయసంతోనే వాళ్ళు పుట్టారు. కాబట్టి వారి కందరికీ పాయస మంటే యిష్టమే వుంటుంది సహజంగా.. ఎవరి కిష్ట మని ప్రత్యేకంగా అడుగాల్సిన పని లేదు"
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పాయసముననే జరిగెఁ గ
  దా యుదయము దాశరథుల
  దనఁ దగునె యిటుల్!..
  "పాయక యా నలుగురిలోఁ
  బాయస మన నెవ్వ డిష్ట
  పడు నీ జగతిన్?"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  15.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 33. కం.

  తీయని వన్న నిషేధము
  కాయము దాచదు తినినను గ్రక్కున దెలుపున్
  నేయము శర్కర వ్యాధవ
  పాయసమన నెవ్వడిస్టపడు నీజగతిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 34. పాయసమననెవ్వడిష్టపడునీజగమున
  ననుటసరికాదుపాయసమనగనిష్ట
  పడుదురుజనులందఱునిలబాగుగాను
  దీపిగలిగెడుచక్కటిదినుసుకతన
  ప్రత్యుత్తరంతొలగించు

  రిప్లయితొలగించండి
 35. ఉత్పలమాల
  దాయక యూర్వశీ లలన దగ్గర చేరుచు పంచిపెట్టగన్
  సోయగముల్ కిరీటి కని సోకఁగ నెంచవు జాగదేలనో?
  తీయని స్రావముల్ నిమికి త్రేన్చఁగ మెచ్చడె మోవి గిన్నెలో
  పాయస మన్నచో నెవఁడు? వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్!

  రిప్లయితొలగించండి


 36. ఆయాసమనక తాగును
  పాయసమన_, నెవ్వఁ డిష్టపడు నీజగతిన్
  సోయాసాసుల గబ్బుని
  శ్రేయస్సగు తెలుగు వంట చేవయె వేరోయ్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 37. ఆయన పాఠములందరు
  హాయిగ విన్నను పరీక్షలందున సరిగా
  వ్రాయని వారికి మరి తొడ
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  రిప్లయితొలగించండి
 38. పాయసమన్నచోనెవడువల్లెయటంచునుగ్రోలునిద్ధరన్
  బాయసమన్నచోధరనుబండితలోకముగాకపామరు
  ల్లాయతరీతినిన్మిగులనాతృతతోడనునీచ్చగించుట
  ల్తీయగనుండుకారణముదేవర!రామయ!నిక్కమేగదా

  రిప్లయితొలగించండి
 39. కంద పద్యంలో నా పూరణ

  సేయ భజన దాసు డనుచు
  రాయగ కీర్తనలు. త్యాగరాజు వినుతుడై
  తీయని నామము గ్రోలిన
  పాయసమన నెవ్వఁ డిష్టపడు? నీజగతిన్

  రిప్లయితొలగించండి
 40. 15, డిసెంబర్ 2019, ఆదివారం
  సమస్య - 3221 (పాయస మన్నచో...)
  కవిమిత్రులారా,
  ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
  "పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్"
  కం॥
  మాయఁబడి కేకు లననాం
  గ్లేయపుపేర్లున్నవంటలేతిందురొకో
  చేయంగజన్మదినమున
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి


 41. ఓయి అమాయకుడ! తినగ
  నాయాసమ్ము నొనరించు నయ్యా వలద
  య్యా! యీ కాలము లోనన్
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 42. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  పాయస మన నెవ్వ డిష్టపడు నీ జగతిన్

  సందర్భము: కైక వరాలు కోరింది. రాముడు వనగమనం చేశాడు. ఒక పౌరుడు "రామునిపై మీ యమ్మ కెంతో ప్రేమ. ఆమె యిచ్చిన పాయసం చిన్నప్పుడు రాముని కెంతో ప్రీతిపాత్రం." అన్నాడు.
  అప్పుడు తల్లిమీద కోపంతో రగిలిపోతున్న భరతు డిలా అన్నాడు.
  "మా యన్న ధర్మమూర్తి. కల్లకపట మెరుగడు. మాయమ్మ ఇచ్చిన పాయసాన్ని ఆయన తప్ప ఇం కెవ డిష్టపడుతాడు?"
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "మా యన్న ధర్మ మూర్తి గ
  దా! యెరుగడు కల్లకపట మాతని కన్నన్
  మా యమ్మ యొసగినదియౌ
  పాయస మన నెవ్వ డిష్టపడు నీ జగతిన్?"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  15.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి

 43. హాయిని గూర్చును సేమియ
  పాయసమన,నెవ్వడిష్టపడు నీజగతిన్
  కాయమునకుబాధలిడుచు
  నాయాసముగూర్చునట్టి యశనము విడుమా
  [

  రిప్లయితొలగించండి