17, డిసెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3223 (మితము గాని తిండి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మితము గాని తిండి మేలు సేయు"
(లేదా...)
"మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్"

56 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    సతులే మెచ్చగ కార్తికమ్మునను భల్ సంతోషమౌ తీరునన్
    కతలన్ జెప్పుచు మంత్ర తంత్రములతో గారాబుగా పల్కుచున్
    వ్రతముల్ కూర్చిన బ్రాహ్మణోత్తములహో వడ్డించు కాజాలనున్
    మితమే లేక భుజించినన్;... జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వ్రతమున్ జేయగ తద్దినమ్మునను భల్ పండంటి తాతయ్యకున్
    మతియున్ బోయెడు మంత్ర తంత్రములతో మధ్యాహ్నమౌ వేళనున్
    కుతుకల్ నిండుగ వాయసమ్ములచటన్ కూడంగ భక్ష్యమ్ములన్
    మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    వైద్యుని ఉవాచ :
    __________________________

    కూరలందు నుప్పు - కారములును లేక
    తీపి వస్తువులను - తీసివేసి
    విడచి నూనె తోడ - వేపినవియును,కా
    మితము గాని తిండి - మేలు సేయు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-2)
    రాజమౌళి రానాతో, బాహుబలి తీయు వేళ :
    __________________________

    కండ లందు శక్తి - కావలె నన్నచో
    కాళ్ళ యందు బలిమి - కలుగ జేయ
    కమ్మదనము గలిగి - కమనీయ మైనట్టి
    మితము గాని తిండి - మేలు సేయు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-3)
    రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి తీయు వేళ :
    __________________________

    బరువు లెత్తు వేళ - బలము కావలెనన్న
    కొండ నెక్కు నపుడు - గుండె బలము
    కలుగ, ఝషము , గుడ్లు, - కవుచును, బిర్యాని,
    మితము గాని తిండి - మేలు సేయు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-4)
    వ్యాయామ శిక్షకుడు :
    __________________________

    సత్తు వలయు ననిన - సత్వపు వేటను
    శక్తి వలయు ననిన - ఙ్ఞాని యొక్క
    కౌజు నూనె వేపు - కమ్మని వంటల
    మితము గాని తిండి - మేలు సేయు !
    __________________________
    వేట = మేక, ఙ్ఞాని = కోడి, కౌజు = మాంసము

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-5)
    మధుమేహగ్రస్థులకు :
    __________________________

    కౌజును తిన రాదు - కారమును వలదు
    వెన్న నూనె వలదు - వేపినవియు
    మధుర మైనవియును - మధువును మరచి, కా
    మితము గాని తిండి - మేలు సేయు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  8. జీవియనగ నుండు జిహ్వచాపల్యము
    ఎదుటనున్న తిండి నెవరికైన
    తినగ తప్పుగాదు , తీపి పదార్ధమ
    మితము గాని తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి
  9. చురుకు ధనము గల్గి పరగ వలె నటన్న
    పోషక ముల తోడ పుష్టి గూర్చు
    ఓ గిరము ల సతము నుచిత మై నట్టి న
    మితము గాని తిండి మేలు జేయు

    రిప్లయితొలగించండి


  10. బిడ్డ! మెక్కమాకు ప్రీతిని! విడువుము
    మితము గాని తిండి! మేలు సేయు
    నెపుడు సంయమనపు నెరియగు బువ్వయె
    విను జిలేబి మాట వెంకటేశ!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. సుతరామున్ సరి కాని మాటయె సుమా సుబ్బన్న! మాంద్యమ్మగున్
    మితమే లేక భుజించినన్ జనులకున్; మేలౌఁ గదా చూడఁగన్
    హితమై యోగ్యపు బువ్వతీసుకొనగా! హేఠమ్ము కల్గించక
    య్య తనాయించెడు రీతి గా కడుపు హయ్యారే విభేదిల్లగాన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. పెండ్లివిందుపేర పిండివంటలుజేయ
    తినెడువారులేక తిప్పలాయె
    నూనె నందు దేవి నుసిగార కుండెడు
    మితముగానితిండిమేలుజేయు.

    రిప్లయితొలగించండి
  13. హితము గూర్చు నెప్పు డతియన్నదే వీడి
    మితము గోరు కొనుటె మేలు మనకు
    హద్దుమీరి తినిన నారోగ్యము చెడు న
    మితము గాని తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి
  14. నేడు, రేపు చెన్నైలో ఉంటాను.
    కవిమిత్రు లెవరైనా కలుస్తారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గత శనివారం జిలేబి గారు మైలాపూరులో నున్నట్లు వినికిడి

      😊

      తొలగించండి
    2. వారు నిన్న త్రిగళావధానంలో మహతి లో కలిసినట్టున్నారు? నిన్న టపాలో లైవ్ కామెంటరీ పెట్టినారు ?

      తొలగించండి
  15. హితమునిచ్చు తిండి హేయముగాబోదు
    పోషకమ్ములున్న పొట్టకు మేలౌను
    మాంసహారమైన మన్నికగల్గి,న
    మితముగానితిండిమేలుజేయు

    రిప్లయితొలగించండి
  16. ( మధుమేహదేహికి మంచి సూచనలు )
    కనగ షుగరురోగి కార్బొహైడ్రేట్లును ,
    నూనె , నెయ్యి , తీపి మానవలయు ;
    కొద్ది కాలరీల కుదురైన మిగుల న
    మితము గాని తిండి మేలుసేయు .

    రిప్లయితొలగించండి
  17. జీర్ణ శక్తి పెంచి చీకాకు వదిలించు
    స్వంత యింటి వంట, జాగులేని
    ఓగిరంబు పొంది ఓపిక పెంచెడు
    మితము గాని తిండి మేలు సేయు.

    రిప్లయితొలగించండి
  18. ఒక్క యక్షరమ్ము నటు నిటు నైనచో
    అర్థమెల్ల మిగుల నరుగు బోవు
    నె, ని యయి మరి కలిగె నెంత యనర్థము
    మితము గా *ని* తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి

  19. నేనన్లే :)


    పిల్ల కాకు లెల్ల విరివిగ పద్యము
    ల చవిగొనుచు కోకిలలయె నిచట
    రండి శంకరాభరణమునకిదె రండి
    మితము గాని తిండి మేలు సేయు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. తిండి లేక యున్న కండ పుట్టదుసుమ్ము
    గుండె లోన శక్తి బెండు వడును
    సతతము మనుజులకు జగతిలోన నపరి
    మితము గాని తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి
  21. జంకు ఫుడ్డు మిగుల చవులూరు చుండును
    పోషకాలు లేక పూర్తి గాను
    తెగువ తోడ నట్టి తిండికే మరి పరి
    మితము గాని తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి

  22. నిన్నటి పూరణ

    ఇలపై రాక్షసవృత్తిలోఁ బశువులై యిక్కట్లు కల్పించుమూ
    ర్ఖులకుం గన్నులు నుండవంచనిన సంకోచమ్మెటుల్ గల్గదో!
    ఖలులై లోకుల బాధపెట్టుచు శిలాఖండంబులౌ ధౌర్త్యదూ
    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నిన్నటి రెండవ పూరణ.

      తలపై వెంట్రుక లింపుఁ గూర్చు జడలై ధమ్మిల్లమై యొప్పి యిం
      తులకుం గన్యలకైన, నేడిలను తూగాడు కుంజమ్ములై
      తలలన్ మూసిన గంపలై యకట! సౌందర్యమ్ము లోపించ నా
      తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా

      తొలగించండి
  23. రిప్లయిలు
    1. సతము ముక్తిమార్గ సాధనజేయుచు
      హితముగోరి నడువ నెల్లవార్కి
      గతముగాగ నీడు కాయమున కపరి
      మితముగాని తిండి మేలుజేయు !

      తొలగించండి
  24. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మితము గాని తిండి మేలు సేయు

    సందర్భము: రావణుడు గాఢ నిద్రలో వున్న కుంభకర్ణుణ్ణి మేల్కొలిపాడు.
    స తత్తదా సూర్య ఇవాభ్రజాలం
    ప్రవిశ్య రక్షోధిపతే ర్నివేశనమ్
    దదర్శ దూరే౽గ్రజ మాసనస్థం
    స్వయంభువం శక్ర ఇ వాసనస్థమ్
    కుంభకర్ణుడు సూర్యుడు మేఘ మండలంలో లాగా రావణుని సౌధంలో ప్రవేశించినాడు. ఇంద్రుని ఆసనంమీద కూర్చున్న బ్రహ్మను చూసినట్టు అన్నను చూసినాడు..
    అన్నాడు వాల్మీకి. చాలా గొప్ప శ్లోకం.
    మబ్బుల్లోకి వెళ్ళగానే సూర్యుని కాంతి క్షీణిస్తుంది. రావణుని సౌధంలో కాలు మోపగానే కుంభకర్ణుని తేజస్సూ క్షీణిస్తుంది.. అనే కదా ఉద్దేశ్యం.
    తమోగుణునికి అమలిన సంకల్ప ముదయించదు.. ఉదయించినా ముదము నీయదు.. కుంభకర్ణుడు రావణునికి చక్కని హితవు చెప్పినాడు. చెప్పినా అతణ్ణి ఒప్పించలేకపోయాడు. ముదము పొందలేకపోయాడు. పోనీ విభీషణు ననుసరించలేదు. దివ్యమైన రామ కృపా పొందలేదు.
    రణమందు కూలడే రావణుండు!.. అనగానే రావణు ననుసరించిన కుంభకర్ణుడు కూడా కూలుతా డని అర్థం.
    (ఇంకా 31.10.19 నాడు నేను వ్రాసిన శంకరాభరణం పూరణం కూడ చూడండి.)

    రహి = ఆనందం, సొంపు, కాంతి, ఆశ, ఆసక్తి, తెలివి, బాగు, విధము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఆ తమోగుణ మది యల రజస్సును వీడి
    సత్వగుణముఁ జేరజాల దెపుడు..
    తగఁ గుంభకర్ణుండుఁ దా రావణుని వీడి
    యా విభీషణు వెంట నరుగ డెపుడు..
    రహి "రజసస్తు ఫలం దుఃఖ" మనలేదె!
    రణమందుఁ గూలడే రావణుండు!
    అల తమోగుణునికి నమలిన సంకల్ప
    ముదయించ దుదయించి ముదము నీయ
    దమితమయిన తిండి, యనవసరపు నిద్ర,
    యావులింత లనున వతి సహజము
    లగుఁ దమోగుణాన నాపదయే!..ఎట్లు
    మితము గాని తిండి మేలు సేయు?

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    17.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  25. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
    మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్"


    ఇచ్చిన సమస్య మత్తేభము నా పూరణము సీసములో


    కుంభకర్ణుడు తానంతట తానుగా నిదుర లేవలేదు. రావణాసురుడు తన రక్షణ కోరి ఇతనిని నిద్ర హటాత్తుగా నిద్రలేపాడు. నిద్రా భంగము అయిన కుంభకర్ణుదు ఆ దినము నే చనిపోవును అని బ్రహ్మ శాపము కలదు. కాబట్టి ఈతనికి ఈ రోజు ఆయువు చెల్లును సమరములో విజృంభణము చేసి వేల సంఖ్యలో వానరులను చంపి అపరిమితము గా భుజించినను మనకు జయము కలుగును అది తధ్యము వానరులను పారి పొవలదని ఇది కదులు యంత్ర రాజమని కపిసేనకు ధైర్యము చెప్పుమని విభీషణుడు అంగదునితో చెప్పు సందర్భము



    జననము తోడనే శౌర్యము కల్గిన ధీరుడితండు, వేది నిడ వరము
    నిదురించు చుండుగా నీతడు సంవత్సరములోన సగము దినములు, మేలు
    కొనినట్టి దినమున కుడుచును దశ శతి గరగల పలలము తిరుగు లేక,
    నిదురించును మరల నీతడు, నిదురకు భంగము కలిగిన పాటు పొందు,
    కదన రంగములోన కాలిడి ,నడరి,వానర వీరులన్బట్టి విరివిగ నడ
    చి (మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్) ,లడాయి

    చేయ గా కల్గు విజయము, చింకలీక
    మోహరమ్ములకున్ ధైర్యము కలిగించ
    వలయు ననుచు నంగదునితో పలికె నా వి
    భీష ణుండు కపివరుల బెదురు చూసి


    చింకలీకము = కోతి ,వేది = బ్రహ్మ , గరగ= కుండ,పాటు = మరణము
    మోహరము = సైన్యము


    రిప్లయితొలగించండి
  26. ఆటపాటలుండి ఆరోగ్యమైన ద
    మితము గాని తిండి మేలు సేయు
    తాగినంత నీరు తగినంత సుఖగోష్టి
    తప్పక తనరించు తంగిరాల౹౹

    రిప్లయితొలగించండి
  27. జీవియన్ననుండు జిహ్వచాపల్యము
    తినగవలయు బ్రతుక తిరముగాను
    తిండిపోతువోలె మితిమీరితినకన
    మితము గాని తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి
  28. కంపెనీ అధినేత పలుకులు :

    ఆటవెలది
    చిగురు మేయు వారు చెలఁగి వేళ్ళను మేయ
    సంస్థ మనుగడ కది చావుదెబ్బ
    చేసినట్టి పనికి జీతమె చాలు, న
    మితము గాని తిండి మేలు సేయు

    రిప్లయితొలగించండి
  29. హద్దుమీరితినిన హానికాహ్వానమె
    పప్పు యుప్పులందు పరుగులొద్దు
    మితముదాటిదినినమిత్తియె;యింకెట్లు
    మితముగానితిండిమేలుసేయు??
    ———————//-/
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  30. యాదృచ్ఛికముగా నీ పద్యము వ్రాసి కాఫీ త్రాగుచున్నఁ జక్కెర తక్కు వైన వేసుకొన నెంచి పద్యము గుర్తుకు వచ్చి విరమించు కున్నాను!

    ఎక్క డైన నేమి నొక్కి వక్కాణింతు
    మెక్కఁ బొక్కు దీవు మిక్కుటముగ
    వెక్కసంబు నైనఁ జక్కెర లేని కా
    మితము గాని తిండి మేలు సేయు


    సతతం బచ్చట క్షాళనమ్ము తనరం జక్కంగ ధూపమ్ము నం
    చిత రీతిం బరగంగఁ జేసిన దినన్ క్షేమంబె సత్యమ్ము భా
    సిత శుద్ధస్థల మున్న నొప్పు గద యాసీనార్థ పీఠమ్ము ని
    ర్మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  31. బ్రతుకుటన్న దిలను గతుకంగ కాదన
    దినగ నేర్వ వలయు మనుట కొఱకె!
    మితిని మించి మెక్క మిగుల కీడగును! య
    మితము గాని తిండి మేలు సేయు!

    రిప్లయితొలగించండి
  32. రోగములుగలుగును రోజులతరబడి
    మితముగానితిండి,మేలుసేయు
    నండ్రుతల్లికంటె నధికముగనునుల్లి
    మితపుతిండిమనకుమేలుసుమ్ము

    రిప్లయితొలగించండి
  33. బ్రతుకే భారమగున్ గదా తనువునన్ వ్యాధుల్ ప్రవేశించుగా
    మితమే లేక భుజించినన్; జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్
    మితమే యన్నిట మేలు జేయును నిజమ్మేనాటికైనన్నదే
    హితమౌనందరకన్ని వేళల వరమ్మెంతేని లోకంబునన్

    రిప్లయితొలగించండి
  34. హితమున్ గోరుచు చెప్పుచుంటి వినరా హృద్రోగివౌ నీవికన్
    జితికిన్ జేరక తప్పదిట్లు క్రమమున్ క్షీణించు నారోగ్యమే
    మితమే లేక భుజించినన్, జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్
    ఘృత తైలమ్ముల నెప్పుడున్ మితముగా గైకొన్న చాలందురే.

    రిప్లయితొలగించండి
  35. వితతవ్యాధుల కారకంబులయి సంవిజ్జాడ్యహేతూక్తులై
    సతతారోగ్యవిరుద్ధతైలలవణాస్వాద్యాతిమాధుర్య
    సం
    గతమై క్షారగుణాధికామ్లమయమై కాఠిన్యభక్ష్యాదికా
    మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  36. జంకు తిండియందు జాగ్రత్త వహియించు
    ఊబకాయమపుడు ఊరుటాగు
    ఇంటివంట మేలు ఇంటికి వంటి,క
    మితముగానితిండిమేలుసేయు

    రిప్లయితొలగించండి
  37. 17, డిసెంబర్ 2019, మంగళవారం
    సమస్య - 3223 (మితము గాని తిండి...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

    మత్తేభము

    కృతకంబౌపథకంబులన్ ప్రజలలక్ష్మిన్ కొల్లగొట్టన్ కళం
    కితమౌనేతయశంబొకో!ప్రజలసంక్షేమంబుకైవచ్చుస్వీ
    కృతభాగ్యమ్మధికారులాత్రమునభక్షింపంగతప్పౌ!భృతిన్

    "మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్"


    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  38. హితమున్ గూర్చెడుఁ భోజనమ్ముఁ గొని హాయిన్ యుండగా సౌఖ్యమౌ
    గతమున్ పెద్దలు తిన్నతిండి యిపుడున్ గానన్ సదా మృగ్యమే
    గతకన్ మిక్కిలి యుప్పుఁ జక్కెరలవే గండమ్మగున్, వాని కా
    మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుట్ట తిండి కొరకు గిట్టును తిండిచే
      తినుము బ్రతుక, కాదు తినగ బ్రతుకు,
      ఆకలేయ మెతుకె యమృత సమమురా!య
      మితము గాని తిండి మేలు సేయు

      తొలగించండి
  39. మితమేలేకభుజించినన్ జనులకున్ మేలౌగదాచూడగన్
    మతమా?మీకుసామియదినమ్మంబుద్ధిగాదాయెనే
    జతనంబంతయుజూడగాదెలిసెనాజన్మాంతమున్ మేలొకో
    మితిమీరంగనుదిన్నచోజనులకున్ మేలెప్పుడున్ గల్గదే

    రిప్లయితొలగించండి
  40. అధికమైన తిండి ఆరోగ్యము చెరచు
    ననెడి మాట సత్య మవని యందు
    మితము గాను తిన్న హితమగు నెప్పు డ
    మితము గాని తిండి మేలు చేయు.

    రిప్లయితొలగించండి