18, డిసెంబర్ 2019, బుధవారం

సమస్య - 3224 (దూలము సెలరేఁగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్"
(లేదా...)
"దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై"

51 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    మేలములాడి మోడినహ మెప్పులు పొందెనె రోజురోజునన్...
    చాలును నీదు వేషమిక చల్లగ పొమ్మని వోట్లు కూయగా...
    కాలము మారి రాహులుని కాంగ్రెసు నేతగ తీసివేసిరే:👇
    దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై...

    రిప్లయితొలగించండి
  2. పాలను గురిసెడి మందకు
    పాలకుడే లేనివేళ వాటము నెంచన్
    కాలుని వోలెగదిసి శా
    ర్దూలము సెలరేగి యొక్క దూడను మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !
    A-1)
    లీలగ పవళించగ; శార్దూలము :
    __________________________

    బాలయు నతి పాండిమమౌ,
    చేలను పరకలను మేసి - చెట్టు మొదలునన్
    లీలగ పవళించగ; శా
    ర్దూలము సెలరేఁగి యొక్క - దూడను మ్రింగెన్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మేలగు భాజపాను విడి మెల్లగ జేరుచు శత్రువర్గమున్
    బోలెడు కోర్కెలందునను పొర్లగ నాతడు స్వప్నమందునన్
    కూలగ స్వీయ రాష్ట్రమున గుప్పున చుప్పుగ నోరుమూసెనే...👇
    దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై...

    రిప్లయితొలగించండి
  5. ఆలను మేపుచు నడవిని
    పోలయ గాండ్రింపును విని పొదలో దాగెన్
    జాలి నెరుంగనిదా శా
    ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  6. అయ్యయ్యో!!! నా పూరణ పట్టుకొచ్చేటప్పటికి
    సీతాదేవిగారూ
    వసంతకిశోర్ గారూ
    సూర్యగారూ....
    మీరూ అలాగే పూరించారా!....

    నేను కూడా...మరి...


    ఏలకొ యోచించుట? యే
    మేలము లాడను వినుడిక మెరిసెను మదిలో!
    చాలని క్షుద్బాధకు శా
    *"ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్"*

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    B-1)
    లీలగ పవళించగ; శార్దూలము :
    __________________________

    పాలను బోలు తెల్లనిది - బాలయు, గుల్మిని లోన చిక్కుటన్
    జాలము నుండి వేర్పడి, వి - చారము లేకను చెట్టుపుట్టలన్
    వేలమువెఱ్ఱి చుట్టుచును - పిచ్చిగ తిర్గెడు వేళ యందు; శా
    ర్దూలము పెచ్చురేఁగి యొక - దూడను మ్రింగె దయావిహీనయై !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  8. పాలెము చుట్టుత నడవియె ,
    మేలగు దెస లే కయున్న మ్రింగునుగా శా
    ర్దూ లము దూడను , మరి యే
    దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్?

    దెస = కాపు

    రిప్లయితొలగించండి
  9. (కాలువనీటిని ఎగువన తాగే పెద్దపులి ,
    దిగువన తాగే ఆవుదూడ - సంభాషణ )
    "వాలము నూపుకొంచు నిటు
    వచ్చుటె చాలక నా సమానవై
    కాలువనీరు తాగెదవ ?
    కన్గొన నెంగిలి యయ్యె నంతయున్ ; "
    "మేలములేల ? మీ రెగువ ;
    మే మిట కిం " దని పల్కినంత - శా
    ర్దూలము పెచ్చురేగి యొక
    దూడను మ్రింగె దయావిహీనయై .
    (వాలము - తోక ; మేలము - పరిహాసము )

    రిప్లయితొలగించండి


  10. కాలము గోధూళి సమయ
    మాలయపు వెనుకల పొంచె మరణము వడిగా
    చేలను పడి దూకుచు శా
    ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. బాలపు ప్రాయమాయె! పరి వారము తప్పుచు దారిమారి పో
    గాలము దాపురించగ నెకాయెకి కాననమందు దూరగా
    కాలము పొద్దుగూకె! కెడ కాలయముండట యాననీయ శా
    ర్దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. చేలను మేయుచు నుండగ
    వాలము నాడించి పొంచి వత్సము గాంచె న్
    జాలము సేయక నా శా
    ర్దూల ము సెలరేగి యొక్క దూడ nu

    రిప్లయితొలగించండి
  13. కాలము చేరువగుట నొక 
    బాలుడు దూడల నడవికి పచ్చ్చిక మేయన్ 
    తోలగ నంతలొ నొక శా  
    ర్ధూలము  చెలరేగి యొక్క దూడను మ్రింగెన్ 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు.
      అంతలొ... అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. త్రోలగ నంతను నొక... అనండి

      తొలగించండి
  14. పాలను మరచిన క్రేపులు
    చేలను బడి పచ్చిగడ్డి చిగురులు మేయన్
    బైలగు తరి గాంచిన శా
    ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్.

    రిప్లయితొలగించండి


  15. ఈలల నక్కల వూళల
    గాలి సుడులు తిరుగుచున్ ప్రకంపనములతో
    తేలుచు వచ్చుచు, పడగా
    దూలము, సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. పాలను మర్చినట్టి చిరు ప్రాయపు తర్ణము లాకటన్ బడన్
    జేలను జేరి శాదము భుజించెడు వేళను భేలమొక్కటిన్
    పోలమునందు నక్కి తగు బుక్కము చిక్కిన యంత నట్టి శా
    ర్దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై.

    రిప్లయితొలగించండి
  17. కాలము తీరిది గనుమా
    చేలందుల్లాసమూని చేతంబలరన్
    కాలముగడుపుగ నొక శా
    ర్దూలము సెలరేగి యొక్క దూడను మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  18. కం.

    కూలగ కొట్టము యుదుటన
    ఆలము లన్నియు నుజేర నావలి ప్రక్కన్
    కాలము తీరిన దగుటన
    దూలము సెలరేగి యొక్క దూడను మ్రింగెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. ఉత్పలమాల
    జాలిగ వీడినన్ వెడలి చయ్యన దూడకు పాల నిచ్చి మీ
    మ్రోలను వాలెదంచనుచు బుద్ధిగ వచ్చిన నావుఁ గాచె శా
    ర్దూలము! "పెచ్చు రేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై"
    మేలము లాడు మాటలొకొ? మెచ్చరు లోకులు పృచ్ఛకోత్తమా?

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. కాలాతీతం బాయెనె
      యేలా రాదింకఁ బెయ్య యిట్లేడ్వంగన్
      వాలము నూపుచు వడి శా
      ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్


      ఏలిక లంద ఱాశ్రయము నీయ నరణ్యము లందుఁ జెట్టులం
      గూలఁగఁ జేయఁ గ్రూర మృగ కోటి చరించ విచిత్రమే పురిం
      జాలిఁక వ్యాఘ్ర ఘోరములు చాలిఁకఁ జావులు దాని కే మిఁకం
      దూలము, పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై

      [ఇఁకన్ + తూలము = ఇకందూలము]

      తొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దూలము పెచ్చురేఁగి యొక దూడను మింగె
    దయా విహీనయై

    సందర్భము:
    ముక్తస్తు వజ్ర నిర్ఘోషో ప్రదీప్తాశని సన్నిభః
    రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతితః
    పిడుగు వంటి ధ్వనితో ప్రజ్వలించే మెఱుపులాంటి కాంతితో రామబాణం వాలి రొమ్మున నాటుకొన్నది. (కి.కాం. 16-35)
    రామ బాణానికి నేల కూలిన వాలి ప్రశ్నిస్తున్న సందర్భం..
    ము న్నెచ్చటనైనను నీ కెన్నడు విప్రియ మొనర్చి యెరుగని నన్నుం గ్రన్నన నీ దగు దౌష్ట్యం బెన్నిక కెక్కంగఁ జంపి తేల నృశంసా!
    (గోపీనాథ రామాయణం కి.కాం.435)
    "రామా! నేను నేల కూలినాను. ఇది తగునా! ఏ కీడూ నేను నీకు చేయలేదే! నేనొక అమాయకపు టావు దూడనే! నన్ను చంపినా వేల? అడవిలో మాటువేసి ఒక శార్దూలం (పెద్దపులి) చెలరేగి కనికరం చూపకుండా ఒక దూడను చంపిం దని విన్నవారి కనిపించదా!"
    వాలి ప్రశ్న లన్నిటికీ రాముడు సముచిత సమాధానా లిచ్చినాడు. వాలి కూడా అంగీకరించినాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కూలితి నయ్య! రామ! ఇది
    కూడునె! కీ డొనరింపనే! లస
    న్నీల శరీర కాంతి మయ!
    నే నొక దూడనె! నన్నుఁ జంపినా
    వేలకొ! విన్నవారి కని
    పించదొకో! వని మాటు వేసి, శా
    ర్దూలము పెచ్చురేఁగి యొక
    దూడను మింగె దయా విహీనయై..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    18.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. మాలిమి జూపుచున్ దగినమాటల నాడుచు ప్రక్కయింటిలో
    బాలిక నమ్మునట్టులను వావినిగల్పుచు పెద్దదిక్కుగన్
    కాలము కల్సిరాగ తనకామము దీరగ క్రూరమైన శా
    ర్దూలము పెచ్చురేగి యొకదూడను మ్రింగె దయావిహీనయై

    రిప్లయితొలగించండి
  23. ఉదుటన కు బదులుగా ఉదుటున అని చదువగలరు

    రిప్లయితొలగించండి
  24. బాలుడు గోవులమేపుచు
    లీలగదాదిరుగుచుండ లేకిడితనమున్
    నాలపుమందనుగనిశా
    ర్దూలముసెలరేగీయొక్కదూడనుమ్రింగెన్

    రిప్లయితొలగించండి
  25. లాలనజేయుచున్మిగులలాస్యములొందుచుగోవులొండొరుల్
    మేలములాడుచున్బసిరిమేయుచునుండగనంతలోపుశా
    ర్దూలముపెచ్చురేగియొకదూడనుమ్రింగెదయావిహీనయై
    కాలముదీరెనేయికనుగాలుడుమ్రింగెనువ్యాఘ్రమైధరన్

    రిప్లయితొలగించండి
  26. కాలము మారి విపినమున
    వేళకు నశనము దొరకక వేదనబడుచున్
    సాలను పశువులఁ గని శా
    ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  27. కాలము మారిపోయి భువిఁ గాంచక కానల జంతుజాలమున్
    వేళకు తిండిలేక కడు వేదన చెందుచు వచ్చియొక్క గో
    శాలకు క్షుత్తుతోడ, నట చక్కగ పూరి గ్రహించు చుండ శా
    ర్దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై

    రిప్లయితొలగించండి
  28. ఆలను తోడ్కొని యడవికి
    తాలిమితో నొకడు బోవ తత్తర పడకన్
    వాలము తిప్పుచు నో శా
    ర్దూలము సెలరేగి యొక్క దూడను మ్రింగెన్!!!

    రిప్లయితొలగించండి
  29. కాలమహిమనేమందుము
    వేలయెకరములయడవులువేటునుపొందన్
    చాలకయాహారము శా
    ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్

    రిప్లయితొలగించండి