7, డిసెంబర్ 2019, శనివారం

సమస్య - 3213 (శంకరుఁ డుమ కొఱకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్"
(లేదా...)
"శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారం కానున్న సమస్య) 

74 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  బింకముతో కృష్ణుని వలె
  శంకింపక తేవలెనని శాసనమిడగన్
  వంకలు చెప్పక వడివడి
  శంకరుడుమ కొరకు పారిజాతము దెచ్చెన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  బింకము మీరుచున్ తపము భీకర రీతిని వెండికొండనున్
  జంకక చేయగా సుదతి జంబము వీడుచు కావిబట్టతో
  వంకలు పెట్టకే వడిగ పంకజనాభుని సానుభూతితో
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  అంబ = ఉమా భారతి
  (National Vice-President, BJP)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు బాగున్నది. అభినందనలు.
   అంబ ఉమాభారతి అయితే పంకజనాభుడు, శంకరుడు ఎవరికి సంకేతం?

   తొలగించండి
  2. 🙏

   విష్ణువు, శివుడే మరి..ఉమా భారతికి జంకని దేవుడు లేడుగా 😊

   తొలగించండి
 3. వంకర పనులను జేసెడి
  కింకరుని వలెను కేళి కీలు డనంగా
  శంకించక సయ్యాటకు
  శంకరు డుమకొరకు పారిజాతము దెచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పూరణ బాగున్నది. రెండవ పాదంలో గణదోషం. పూరణలోను స్పష్టత లేదు. అందుకే నిన్న విట్టుబాబు రేడియోలో చదవలేదు.

   తొలగించండి
 4. పొంకపు భక్తి గ నొకరు o
  డంకిత భావమున గొలువ నభవుని గుడి కిన్
  పంకజ హారమును మరియు
  శంకరు డు మ కొఱకు పారిజాత ము దె చ్చ్చె న్ h

  రిప్లయితొలగించండి
 5. శంకింపకర్ధ మిడెనుగ
  శంకరుడుమ కొరకు; పారిజాతము దెచ్చెన్
  పంకజముఖి సత్యార్థము
  సంకటమోచనుడు వృష్ణి సతివేడగనే!

  రిప్లయితొలగించండి
 6. కందం
  వంకలుఁ బెట్టుచు గంగన్
  శంకరునిబ్బంది పెట్ట సమయస్ఫూర్తిన్
  సంకట పూర్వక 'హరికథ'
  శంకరుఁ డుమ కొఱకు 'పారిజాతముఁ' దెచ్చెన్

  హరికథ = కృష్ణుని కథ
  పారిజాతము = పారిజాతాపహరణమను కృతి

  రిప్లయితొలగించండి


 7. వంకాయమ్మను యుమ యని
  నింకను శంకరునిసతియనిపిలుతురయ! ఆ
  వంకాయమ్మమొగుండగు
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. ఆకాశవాణి కి పంపినది :)


  ఖంకరమును సరిజేసెను
  శంకరుడు‌మకొరకు, పారిజాతము తెచ్చెన్
  కంకిణిగా, దేవేంద్రుడు
  రంకెలు వేయంగ నడచి వ్రజవల్లభుడే!
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఖంకరము, కంకిణి' శబ్దార్థాలను ఆంధ్రభారతిలో చూసుకున్న తర్వాతే విట్టుబాబు మీ పూరణ చదివారు.

   తొలగించండి

  2. విట్టు బాబు చదివారు ? ??
   వారేల చదివిరి ? వివరించ గలరు.


   జిలేబి

   తొలగించండి
  3. ఆకాశవాణిలో ఒక సంప్రదాయం ఉంది. ఒకే వ్యక్తితో (అతడు ఆకాశవాణి ఉద్యోగి కానప్పుడు) సుదీర్ఘకాలం కార్యక్రమ సమర్పణ చేయించరు. ఒకనెల కార్యక్రమం సమర్పణ చేసిన తరువాత మూడు నెలల వ్యవధి తప్పక ఉండాలి. మిగిలిన వారికీ అవకాశం ఇవ్వాలి కదా? అందుకే ఈనెల అంతా విట్టుబాబు గారు పూరణలను చదువుతారు. నాకు మళ్ళీ అవకాశం మూడు నెలల తర్వాత అంటే మార్చి 2020 లో వస్తుంది.

   తొలగించండి

  4. వావ్! ఇవ్వాళ చదివింది విట్టుబాబు గారా!

   అదురహో విట్టు ‌బాబుగారు!
   శుభాకాంక్షలు !

   విట్టు బాబు గారికి జై


   జిలేబి

   తొలగించండి


 9. అంకిత మైన భర్త యగు నాతడు పెండ్లము కోర్కె మేర లో
  వంక భుజమ్ము లానతిని వంకలు బెట్టక వేగవేగమై
  డొంకల వాగులన్ వెదికి డుండుభమొక్కటి దారి చూపగా
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. విరించి.

  సంకటములఁ దీర్చెడి యా
  పంకజ నాభుండు సత్య భామయె కోరన్
  శంకింపక నా భక్తవ
  శంకరుడుమ కొరకు పారి జాతముఁ దెచ్చెన్.


  ఉమ= పార్వతి, సత్య, సనాతని.......

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణలు

  పంకజముఖి పార్వతి "నెల...
  వంకను ధరియించితీవు ! వామాంగిని నా...
  కింక నలంకృతి యే" దన
  శంకరుడుమ కొరకు పారిజాతము దెచ్చెన్ !!


  పంకజనాభుడు రమ., కే...
  ణాంకుడు రోహిణికి, రాముడవనిజకును, మీ..
  నాంకుడు రతికయి ప్రేమగ
  శంకరుడుమ కొరకు., పారిజాతము తెచ్చెన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్"

   అంకితచిత్తవృత్తి తన యర్థశరీరమునిచ్చినట్టి యే...
   ణాంకధరుండు రమ్యదరహాసజితేందుసహస్ర కోర., ని
   శ్శంకితుడై రణమ్మొ మరి చౌర్యమొ తానొనరించి యివ్వడే!?
   శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

   తొలగించండి
  2. మైలవరపు వారి మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్
  ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో
  తన ముద్దుల సుతుని తునుమాడె ననుచు నా
  పార్వతి రోదించ పరమ శివుడు
  తా చేసిన పనికి తల్లడిల్లి నసువుల్
  బాసిన శిశువును జూసి రయము
  గ తన కరములతో ఖండిత నుప
  జనమునకు నతికించెను గజాసు
  రుని శిరమును శంకరుఁడుమ కొఱకు, బారి
  జాతముఁ దెచ్చెన్వ్ర జవరుడు సర

  కమునకు వెడలి ఇంద్రుని కలసి రణము
  చేసి నాతని మద మణచి, తన రాణి,
  లలిత లావణ్య భాసిత, చెలియ, ధర్మ
  పత్ని, సాత్రాజితు తనయ, సత్య భామ కొరకు  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసం మూడవ పాదంలో గణదోషం. "రణము చేసి యాతని" అనండి.

   తొలగించండి
 13. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
  (కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్)
  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


  చంద్రుని రాకలో చల్లదనము లేదు,
  వెచ్చటి గాలులు విస్త రించ,
  విద్యుత్తు కోతతో విసుగు పెరుగు చుండె,
  చెమటలతో కల్గె చీదరమ్ము.
  దోమలు దాడితో దూరమాయె నిదుర,
  సుప్తి మెల్లగ కల్గు చుండ కీచు

  రాయి చేయుచునుండె రవము, నిదురకు భం
  గము నిడి నటునిటు కదులు చుండి
  న ఎలకోడిని మ్రింగినది కోడి కోపింప,
  జనులెల్ల మదిలోన సంత సఁబు  బడయుచు కొనియా డెతమ పెంపుడు శిఖండి
  చేతను,ప్రతి దినము తన కూతకు నప
  వాదు వేయు జనులు నేడు మోద మొందె
  గద ననుకొనుచు యింటి పై కప్పు కెగిరె

  రిప్లయితొలగించండి
 14. గురువు గారు నమస్కారము నిన్నటి సమస్య ఒకసారి చూడఁడి

  రిప్లయితొలగించండి
 15. శంక యొకింత లే దతడు సద్యశ మిందని యెంచి పుత్రునిన్
  బంకజనామకున్ జదువ బంపె విదేశము జ్ఞానశూన్యుడై
  జంకక నచ్చటాతడనె సత్యము భారతమందు జూడగన్
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్.

  రిప్లయితొలగించండి
 16. అంకపు వామంబొసగెను
  శంకరు డుమకొరకు, పారిజాతము దెచ్చెన్
  శంకరవినుతుడు భక్తవ
  శంకరుడగు కృష్ణమూర్తి సత్యాసతికిన్!

  రిప్లయితొలగించండి
 17. అంకమున భాగమెవరే
  శంకయు  లేకొసఁగె?శౌరి సత్యాసతికిన్
  కింకనడంచగ నేమిడె?
  శంకరు డుమకొరకు, పారిజాతముఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 18. కం.

  జింకల వనమున దిరుగుచు
  వంకన దన సతి యడుగగ వాటము మీరన్
  జంకుట యేలని పెనిమిటి
  శంకరుడుమ కొరకు పారిజాతము దెచ్చెన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 19. ( భర్త శంకర్రావు భార్య భ్రమరాంబ కోరిక
  తీర్చటానికి పారిజాతపు మొక్క తెచ్చాడు )
  అంకిలి నందుచున్ హృదయ
  మందున జక్కని పూలమొక్కకై
  వంకలులేని శంకరుని
  బల్కుల రంజన జేసి యంబయే
  యంకము జేరి కోరగనె
  యాతడు నంగడులెన్ని యన్నియున్
  శంకరు డంబకై యరిగి
  చప్పున దెచ్చెను పారిజాతమున్ .
  (అంకిలి - కలత ; అంకము జేరి - చెంతకు వచ్చి )

  రిప్లయితొలగించండి
 20. పంకజనాభుడె దెచ్చెను
  పంకజముఖి సత్యగోర పరవశమున,నే
  వంకన బలికితి రిట్టుల
  శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్!!


  రిప్లయితొలగించండి
 21. శంకవిడు విషము మింగెను
  శంకరుఁ డుమ కొఱకుఁ ; బారిజాతముఁ దెచ్చెన్
  పంకజ నాభుడు సత్యకు
  పొంకముగ భువనమునుండి,
  ముచ్చట తీర్చన్

  ఉమ = శాంతి

  రిప్లయితొలగించండి
 22. పొంకము గని విడె కోపము
  శంకరు డుమకొరకుఁ, బారిజాతముఁ దెచ్చెన్
  పంకజ నయన యలుకఁ గని
  బింకముతోనల్లనయ్య పెనగి సురలతో

  రిప్లయితొలగించండి
 23. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్
  ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో
  తన ముద్దుల సుతుని తునుమాడె ననుచు నా
  పార్వతి రోదించ పరమ శివుడు
  తా చేసిన పనికి తల్లడిల్లి నసువుల్
  బాసిన శిశువును జూసి రయము
  గ తన కరములతో ఖండితమగు నుప
  జనమునకు నతికించెను గజాసు
  రుని శిరమును శంకరుఁడుమ కొఱకు, బారి
  జాతముఁ దెచ్చెన్వ్ర జవరుడు సర

  కమునకు వెడలి ఇంద్రుని కలసి రణము
  చేసి యాతని మద మణచి, తన రాణి,
  లలిత లావణ్య భాసిత, చెలియ, ధర్మ
  పత్ని, సాత్రాజితు తనయ, సత్య భామ కొరకు


  రిప్లయితొలగించండి
 24. గురువు గారు నమస్కారము మీ సూచన ప్రకారము మార్చినది.

  రిప్లయితొలగించండి
 25. పొంకముగ తనదు సగమిడె
  శంకరుడుమ కొఱకు! పారిజాతము దెచ్చెన్
  సంకుల మతి సత్య కొఱకు
  సంకటమౌ యనిని సూరి శక్రుని గెల్వన్!

  రిప్లయితొలగించండి
 26. శంకరులిట్లు చిక్కుముడి చందపు పాదము నందజేయగా
  శంకర శాస్త్రి పూరణము జక్కగ జేసితి నాదు శక్తి పై
  శంక యదేల మీకనుచు చప్పున జెప్పెను పద్యమీ గతిన్
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  (సరదా పూరణ :-), నొప్పిస్తే క్షంతవ్యుడను)

  రిప్లయితొలగించండి
 27. బొంకుటమానుమయ్యనిట, బోధలుసేయుటపాడిగాదులే
  కుంకలు జేయునేరముకు, కూడలివెంతనె తీర్పువచ్చెలే
  శంకలుమానుమింకనిక సత్యమె మేలదిజెప్పు యెప్పుడా
  శంకరు డంబకై యరిగి చప్పునదెచ్చెను హస్ పారిజాతమున్
  **********************************
  రావెలపురుషోత్తమరావు


  రిప్లయితొలగించండి
 28. 07/12/2019
  ఈ నాటి సమస్యాపూరణము

  *శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్*

  *కం:1*

  ఇంకేమి జేయు భోళా
  శంకరుఁ డుమ కొఱకుఁ, బారిజాతముఁ దెచ్చెన్
  సంకట హరుడు ముదముతో
  జంకక యిచ్చెను సతికని జగమెఱుగునుగా!

  *కం:2*
  సరదా పూరణము 😃😃

  జంకుచు జేరును గృహమున
  నింకేమి వినవలె నో యని యుమా పతియే
  బింకముతో సతివిన నిది
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్
  🙏🙏😊

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

  రిప్లయితొలగించండి
 29. కందం
  పంకజనాభుని సతివలె
  శాంకరి కోరెగ పశుపతి సరసపు వేళన్
  వంకను చెప్పక వడివడి
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 30. ధన్యవాదాలు, వచ్చేవారపు ఆకాశవాణి సమస్య ను తెలియజేయగలరు

  రిప్లయితొలగించండి
 31. అంకమునే యిచ్చెనుగద
  శంకరుడుమకొఱకు,పారిజాతముదెచ్చెన్
  పంకజనాభుడుసత్యకు
  సుంకముగా నిచ్చుకొఱకుసౌరికపువిరిన్

  రిప్లయితొలగించండి
 32. ఉత్పలమాల
  శంకరుడన్న శ్రీహరిగ సర్వజగమ్ములు నమ్ముచుండగన్
  బంకజ నాభుడున్ సతుల భాగ్యమనంగను గెల్చి యింద్రునిన్
  బొంకముగన్ గడించినిడఁ బోలరు మీరని దెప్పినంతటన్
  శంకరుఁడంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  రిప్లయితొలగించండి
 33. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
  సమస్యాపూరణ కార్యక్రమంలో...
  07/12/2019 శనివారం ప్రసారంకాబోయె

  సమస్య. :
  **** ****

  శంకరు డుమ కొరకు పారిజాతము దెచ్చెన్

  నా పూరణ. కం
  **** *** ***

  పొంకము తప మొనరించెను

  శంకరు డుమ కొరకు; పారిజాతము దెచ్చెన్

  సంకటము లడచు గృష్ణుడు

  పంకజ నయని యగు సత్యభామకు బ్రేమన్

  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి


 34. ఈ వారపు ఆకాశవాణి విశేషములు తెలియ చేయగలరు.పై వారపు కైపదము తెలియచేయగలరు.  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. ఆకాశవాణి లో నేడు ప్రసారమైన నా పూరణం

  శంకరుడను పతి ముదమున
  పంకజముఖి భార్యఁ జూచి పరవశమొందెన్
  పొంకముగా వేగిరమే
  శంకరు డుమ కొరకు పారిజాతముఁదెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 36. అంకము నిచ్చెనేగదిల నాయతప్రేమనుశాశ్వతంబుగన్
  శంకరుడంబకై,యరిగిచప్పునదెచ్చెనుపారిజాతమున్
  బంకజనాభుడయ్యెడనుపావనప్రోలగు దేవభూమికిన్
  శాంకరికోరగాదననుసంతసమొందినమానసంబుతో

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  శంకరు డంబకై యరిగి
  చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  సందర్భము: శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధం 27 వ అధ్యాయంలో రాముని దేవ్యారాధన వున్నది.
  "కోసల దేశంలో ఒక గర్భ దరిద్రుడు ధర్మశీలియైన వైశ్యునికి దేవీ నవరాత్ర వ్రత మాచరింపు మని యొక విప్రుడు "రాముడు కూడా కిష్కింధలో చేశా" డని "రావణుని సంహరించగలిగా" డని చెప్పాడు.
  రాజ్య భ్రష్టేన రామేణ
  సీతా విరహితేన చ
  కిష్కింధాయాం వ్రతం చైతత్
  కృతం దుఃఖాతురేణ వై 49"
  ఆవిధంగా వ్యాసుడు జనమేజయునకు వివరించినాడు.
  30 వ అధ్యాయంలో రామచరితం విస్తృతం. నారదుడు రామునికి వ్రతవిధానం చెప్పి రావణ వధార్థం ఆచరించు మన్నాడు.
  "విధిం మే బ్రూహి దేవర్షి!" (విధానం చెప్పండి) అన్నాడు రాముడు. నారదుడు చెప్పి "ఆచార్యోఽహం భవిష్యామి" (నేనే ఆచార్యునిగా వుంటాను.) అన్నాడు.
  "ఉపవాసపరో రామః
  కృతవాన్ వ్రత ముత్తమమ్"
  (ఉపవసించి రాముడు వ్రతం చేశాడు.)
  ఒక అష్టమి నాడు దేవి "సింహారూఢా దదౌ తత్ర దర్శనం" (సింహాసనాసీనయై రామునికి దర్శన మిచ్చింది.) ఆశీర్వదించింది. రాముడు రావణునిపై విజయం సాధించాడు.
  (వివరంగా దేవీ భాగవతం ప్రథమభాగం.. చూడండి)
  రావణునిపై విజయం కోరిన రాముడు విజయదశమి నవరాత్రులలో దేవిని శ్రద్ధతో అర్చించడంకోసం ఒక రాంకవం నిండా తెచ్చిన పూలలోనుండి శంకరుడు అంబకై (అంబ కిష్ట మని) ఒక పారిజాత పుష్పాన్ని తెచ్చి (ముం దుంచి)నాడు. (దానితోనే ముందుగా రాముడు పూజించా లని శంకరుని ఉద్దేశ్యమో యేమో!)
  రాంకవం = మృగరోమాలతో (ఉన్నితో) నేయబడిన శాలువా
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  వంకరబుద్ధి రావణు న
  వార్య పరాక్రము గెల్వ నెంచి, యా
  శాంకరి గొల్వ నెంచి, తగు
  శ్రద్ధ వహించి రఘూత్తముండు సద్
  రాంకవ మొండు నిండ నవ
  రాత్రులఁ దెచ్చిన పూలనుండి యా
  శంకరు డంబకై యరిగి
  చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  7.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 38. బింకముతోఁ బర్జన్యుఁడు
  నంకమున నెదిర్చి యోడ యదునందనుఁడే
  శంకలు మానుమ కీర్తిత
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్

  [ఉమ = యశము]


  సంకట సంచ యాపహర సన్నుత నిర్జర సేవితాంఘ్రియుం
  బంకజ లోచనుండు వరపార్థ దృశానుఁడు వాసుదేవుఁడే
  కింకర విప్ర భక్త ముని కీర్తిత హర్షిత నీరదప్రభా
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  [శంకరుఁడు = సుఖముల నొసఁగువాఁడు; అంబ = అమ్మ, సత్యభామ]

  రిప్లయితొలగించండి
 39. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య ..

  *పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్*

  పపించవలసిన చిరునామా..

  Padyamairhyd@gmail.com

  గురువారం సాయంత్రం లోగా చేరేటట్టుగా పంపవలెను

  రిప్లయితొలగించండి
 40. బింకపు తపమును వీడెను
  శంకరుఁ డుమ కొఱకుఁ; బారిజాతముఁ దెచ్చెన్
  పంకజనాభుడు సతికై
  సంకటములు దప్పవు గద సతి మెప్పింపన్

  రిప్లయితొలగించండి
 41. బొంకులమారి యా కలహభోజనుడేగి హిమాద్రి పుత్రికిన్
  బింకముగా రమాధవుడు వేల్పుల గెల్చిన గాధ దెల్పుచున్
  పొంకపు పారిజాతమును పోడిమి సత్యకు నిచ్చెనే యనన్
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్

  రిప్లయితొలగించండి
 42. జంకను మాటలేక నొక జంగపు వాడొకనాడు పల్కెనే
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్
  వంకర మాటలే యవి ప్రపంచము మెచ్చదు, పద్మనాభుడా
  సంకట హారి పారిజము సత్యయె కోరగ తెచ్చెనందురే.

  రిప్లయితొలగించండి

 43. "శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్"


  జింకలపార్కుయందు పనిజేయుచునుండెడుతోటమాలి తా

  నంకితభావమొప్పవినయంబుననాటగమొక్కనొక్కటిన్

  జంకకనట్లునంబ వనశాసన కారిణి కోరినంతనే

  *శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్*

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 44. జంకని బాలుడని శివుడు
  బింకము నోర్వకను చిదిమి,బిడ్డని తెలియన్
  వెంకయ్యను కల్పకమున్
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి