నడిరేయి సరదా పూరణ:మెలకువ వచ్చినంతటనె మేదిని పూలకు కాంతినిచ్చుటన్మిలమిల లాడి కష్టమున మిన్నున దొర్లుచు శీతకమ్మునన్చలికిక తాళ జాలకయె చల్లగ భానుడు క్రుంగుచుండగా కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) పలువురు బ్రహ్మలన్ పిలిచి బంగరు కాసులు దానమిచ్చుచున్కిలకిల నవ్వి యాగముల క్రీడల తేలుచు కార్తికమ్మునన్కలువలకుంట్ల చంద్రుడట కన్నులు మూయుచు మాయజేయగా కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !A-1)వేశ్యాలోలుడు-రవిని గాంచి :__________________________వెలవెలదుల కమరము నిడికళలను కుదుపెడి; మరుగవ - కతిపయ దినముల్ !వెలచెలువల వదన నయనకలువలు వికసించె రవినిఁ - గాంచి ముదమునన్ !__________________________వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు
సిటీ వాసులకేమి తెలుసు ఏదో ఒహటి రాసి పడేస్తారు :)కలుహారములకు మరియు కమలములకున్ తారతమ్య మరయని నగరంపు లలన జిలేబి పలికెన్కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
చెలువము గోరుచు ప్రియముగ కలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్ నెలరాజు సిగ్గిలి మరలుచు నలినము కైవెద కెనంట నలుదెశ లందున్
అక్కయ్యా మీ పూరణ బాగున్నది. అభినందనలు మూడవ పాదంలో గణదోషం నలుదెసలందున్. .. అనండి.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !A-2)కళవళ పడి యిటుల పలికె :__________________________నలములు వికసించు నెటుల ?తులుచన నుడువు మన గురువు - తొడరిన వటువేకళవళ పడి యిటుల పలికె"కలువలు వికసించె రవినిఁ - గాంచి ముదమునన్" !__________________________వసంత కిశోర్ (కవులూరు రమేష్)
శంకరార్యా ! శుభోదయం !భాగ్యనగరం చేరిపోయారా క్షేమముగా
ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. మరో గంటలో సికింద్రాబాద్ చేరుకుంటాను.
అవునా ! చేరిపోయారనుకున్నా ! మీ పర్యటన దిగ్విజయంగా ముగిసినందులకుసంతోషం 1
చలిమిరి చంద్రుని గాంచగకలువలు వికసించె , రవినిఁ గాంచి ముదమునన్అలరా రుచుండు కమలముయిలపైనీపూలు పూయ విరువురు లేకన్
మీ పూరణ బాగున్నది అభినందనలు కమలము+ఇలపై... అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "కమల| మ్మిలపై" అనండి.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !B-1)వేశ్యాలోలుడు-భాస్కరరావును గాంచి :__________________________విలవిల లాడె వేదనను - వేశ్యలు భాస్కరరావు కోసమైజలజల సొమ్ము రాల్చుచును - చక్కిలిగింతల దేల్చు నిత్యమున్నలుకను జెంది మాయమయె - నంచును ! వేచిన వారి లోచనాకలువలు విచ్చె భాస్కరునిఁ - గాంచిన వెంటనె మోదమందుచున్ !__________________________వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది అభినందనలు లోచనా కలువలు ... దుష్ట సమాసం. వారల లోచనమ్ములౌ కలువలు.. అందామా
శంకరార్యా ! ధన్యవాదములు !B-1)సవరణతో :వేశ్యాలోలుడు-భాస్కరరావును గాంచి :__________________________విలవిల లాడె వేదనను - వేశ్యలు భాస్కరరావు కోసమైజలజల సొమ్ము రాల్చుచును - చక్కిలిగింతల దేల్చు నిత్యమున్నలుకను జెంది మాయమయె - నంచును ! వారల లోచనమ్ములౌకలువలు విచ్చె భాస్కరునిఁ - గాంచిన వెంటనె మోదమందుచున్ !__________________________
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !B-2)భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్ :__________________________మిలమిల లాడ వెన్నెలలు - మేదిని పైన తటాక మందునన్ కలువలు విచ్చె ! భాస్కరునిఁ - గాంచిన వెంటనె మోదమందుచున్ నలములు నవ్వి విచ్చుకొనె - నందముగా మది యుల్లసిల్లగన్ !వెలుగులు నిండ , వేడియదె - వెచ్చగ తాకెను జంతుజాలమున్ !__________________________వసంత కిశోర్ (కవులూరు రమేష్)
విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలికోడి కూసి నంతనె చలిదాయయె పొడిచినంత శ్యామిక పారన్ వెలుగును గని చెలి కన్నుల కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
మీ పూరణ బాగున్నది అభినందనలు.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !A-3)మిలమిల లాడగ వెన్నెల :__________________________మిలమిల లాడగ వెన్నెలకలువలు వికసించె ! రవినిఁ - గాంచి ముదమునన్దళములు విప్పార మహోత్పలములు మురిపించె మదిని -ధ్వాంతారాతిన్ !__________________________వసంత కిశోర్ (కవులూరు రమేష్)
చెలువపు కౌముది కాంతికి కలువలు వికసించె : రవిని గాంచి ముదమున న్ కొ ల కుల లో కమలంబు లుబిల బిల మని విరి సెను గద ప్రీతిని గూర్ప న్
విరుపుతో మీ పూరణ బాగున్నది అభినందనలు
(రామాయణరచనలో పుత్రుడు మల్లికార్జునుని , శిష్యుడు రుద్రదేవుని , మిత్రుడు అయ్యలార్యుని భాగస్వాములను కావించుతున్న భాస్కరమహాకవి )" మెలకువతోడ వ్రాయవలె మించిన నైపుణి మీరలందరున్ ;జిలుకుడు బద్యవర్ష " మని చెన్నుగ బల్కగ రుద్రదేవు డ య్యలయయు మల్లికార్జునుడు " న " ట్లని మ్రొక్కగ వారి నేత్రపుం గలువలు విచ్చె భాస్కరుని గాంచిన వెంటనె మోదమందుచున్ .(పద్నాల్గవ శతాబ్దంలో వెలసిన మహాకావ్యం భాస్కరరామాయణం )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
గురువులకు నమస్సుమాంజలి 🙏🙏*కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్**కం||* ఇల చలి చంద్రుని జూడగ కలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్వలచిన నా చెలి బిగి కౌ గిలి పట్టిటతొలి చలి గిలి గింతలు బెట్టెన్!*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**💐🌸💐🌸💐🌸
రెండవ పూరణ 🙏🙏*కం::*కలికాలము లో నిజమిది విల విల లాడగ కలుషిత విపరీతమునన్ కలకాదు జరుగు నమ్ముము కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**🙏🙏💐💐🌸🌸🌹🌹
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యోస్మి గురువర్యా
కలువల రాయని బొడగనిగలువలు వికసించె;రవిని గాంచి ముదమునన్పలువురు దోయిలి యొగ్గిరినలువపినాకి హరుడంచు నర్ఘ్యములిడుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెలతెలవాఱ దిగంతమ్ములు చెలరేఁగి పొడవంగఁ బుణ్యాద్రి వెసం దలుకునఁ దామర, లేడ్వంగలువలు, వికసించె రవినిఁ గాంచి ముదమునన్ [అద్రి = సూర్యుఁడు]కలువల జంట కన్నుగవ గాఁగ శశాంకుని బోలు మోముతో వెలుఁగుచు భక్తి తత్పరత విష్ణు మనోరమ లక్ష్మి నెంచుచుం జెలియలు నోము నోచుకొని చెన్నుగ నక్కకుఁ బ్రేమ తోడ రూకలు వలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్ [వలువు = వస్త్రము; భాస్కరునిఁ గాంచిన వెంటనె : ఉదయము కాఁగానే]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
నెలరాజు నింగికెగయగకలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్తెలతెలవారుచునుండగనలినములన్నియునువిరిసినందముగూర్చెన్
..............🌻శంకరాభరణం🌻.................................🤷🏻♂సమస్య 🤷♀.................... "కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోద మందుచున్" సందర్భము: యస్మిన్ రమంతే మునయో విద్యయా౽జ్ఞాన విప్లవే తం గురుః ప్రాహ రామేతి రమణా ద్రామ ఇత్యపి (అధ్యాత్మ రామాయణం బా.కాం.3-40) జ్ఞానంతో అజ్ఞానం నశించినాక మును లెవనియందు రమిస్తారో యెవడు సౌందర్యంతో నానందింపజేస్తాడో అతనికి రాము డని వశిష్ఠుడు నామకరణం చేశాడు."రము క్రీడ యని ధాతు రమ్యార్థ మమరురమయతి యన నొప్పు రామ నామంబు.." (శ్రీ రంగనాథ రామాయణం బా.కాం.) రామచంద్రు డనీ రామభద్రు డనీ జనులు పిలువసాగిరి. రామచంద్రు డంటే రాము డనే చంద్రుడు. రామచంద్రు డని పిలుస్తున్నప్పుడు రామసూర్యు డని మాత్రం ఎందుకు పిలువకూడదు? రాము డనెడు సూర్యు డని అర్థం. ఇది ఈ పద్యంలో కొత్త ప్రయోగం. రాముడు వానర సేనతో లంకను ముట్టడించగానే ఇదివరకే (ఆంజనేయుని లంకాదహనంలాంటి భీకర కృత్యాల చూచినారు కాబట్టి) కలువ ల్లాంటి అనేక రాక్షసుల ముఖాలు ముడుచుకోసాగినవి ముం దేం జరుగుతుందో అని.. ఎందుకంటే *రామ సూర్యుడు* అని తోచింది వారికి. సూర్యుడు రాగానే కలువలు ముడుచుకుంటాయి కదా! కొద్దిమంది రాక్షసుల ముఖాలు మాత్రం వికసించసాగినవి. ముందు ధర్మమే జయిస్తుందని.. ఎందుకంటే *రామచంద్రుడు* అని తోచింది వారికి. చంద్రుడు రాగానే కలువలు విచ్చుకుంటాయి కదా! వారు విభీషణ మిత్ర బాంధవులు.. వారంతా ధర్మ ప్రియులు. ఈ విషయం గమనించిన దేవతలు "కలువలు విచ్చె భాస్కరుని గాంచిన వెంటనే.." అనుకున్నారు.విభీషణాప్తులు= విభీషణునికి ఆప్తులు.. ధర్మ ప్రియులు~~~~~~~~~~~~~~~~~~~~~~~లలిని సహస్రరశ్మివలె . రాముడు లంకను ముట్టడింప దైత్యులకును *రామసూర్యు* డని తోచె.. ననేక ముఖాలు కల్వలైవెలవెలబోయెఁ.. గల్వ లటు విచ్చెను కొన్ని ముఖాల్ విభీషణాప్తులకును *రామచంద్రు* డని తోచి, సురల్ గనిపెట్టి యి ట్లనన్"కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోద మందుచున్" ✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 19.12.19-----------------------------------------------------------
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కం.కలికాలము పొగచూరగకలుషిత వాతావరణము క్రమ్మగ ధరణిన్తెలియక రాత్రో పగలనకలువలు వికసించె రవిని గాంచి ముదమునన్వై. చంద్రశేఖర్
చలిదాయ పొడిచి నంతనెనులివెచ్చని కాంతిరేఖ నుదుటిని ముద్దా డ లలన విశాలమౌ కను గలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
జలజుని గాంచిన తోడనెకలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్ కొలనున గల తామరలే యలరారెను గాంచుమంటి యద్భుత రీతిన్.
పిలిచెను కుక్కుటమ్మనుచు వేగిరమందున తూర్పుదిక్కులో వెలుగుల ఱేడు వచ్చె నులివెచ్చని కాంతిమయూఖ యుక్తుడై పొలతి కపోలమందవియె ముద్దిడ ముద్దియ లోచనాలనే కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చలిపులి బారినం బడిన శారదరాత్రిని వాంఛ హెచ్చగా నిలునిలు మంచు మోహమున నెచ్చెలి నందుచు నా మగండు తాఁజెలఁగుచుఁ గన్ను’లెర్రబడి’ చెక్కిలి ముద్దిడ, గేస్తురాలి కన్"గలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్"
కళకళలసోముగనుగొనికలువలువికసించె,రవినిగాంచిముదమునన్ నిలమసలుప్రాణులన్నియుకలకాలముబ్రదుకదలచెగలియుగమందున్
వలవెలుగుఁ గాంచి నంతనెయలరారును కలువలన్ని యద్భుత రీతిన్ తెలియక పలుకకు, మెక్కడ కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్?
చలువల బచ్చరాల్చు కడు చల్లని కౌముది సోకినంతనే కలువలు విచ్చె, భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్ కొలనున తామరల్ విరిసె కోమ్మల పైగల పక్షిరాజముల్ పలికెను స్వాగతమ్ములట పాఱగ ధ్వాంతము, వెల్గునిండెనే.
చలువలరాయని వెలుగులకలువలు వికసించె; రవినిఁ గాంచి ముదమునన్జలజములు విరిసె సరసున;వలపున సఖుఁ గని మురియుట పరిపాటి గదా
చంపకమాలవెలుగుచు మంత్రులై పడసి పేర్మిని సంపద లెన్నొ, యెన్నికన్స్ఖలనము నంది నాయకుడుఁ జంద్రుని బోలుచు నస్తమించగన్గల కల సూర్యతేజమున గద్దియ నెక్కిన నేతఁ జేరఁ గన్గలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
కలువలరాయడంబరము కాంతులనింపగ సమ్ముదంబుగాకలువలు విచ్చె, భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్నలినములన్ని మానసము నందమునొందగ విచ్చె నీటిలోసలలిత భావవీచికలు సత్కవి డెందము సందడించగన్.
మూడవ పాదం సవరణనలినములన్ని చూడ్కులకు నందముగూర్చుచు విచ్చె నీటిలో
కలువలువిచ్చెభాస్కరునిగాంచినవెంటనెమోదమందుచున్ కలువలువిచ్చవెన్నటికిఖాంకునిజూడగనెట్టిచోటులన్ గలువలువిచ్చురేవెలుగుగాంచినవెంటనెసంతసంబునన్ నలికులవేణి!నీమదినినాయతరీతినినెంచుమాయిదిన్
కందంఫెళఫెళ శివధనువు విఱచిపొలయఁగ రాముండు వంశ మూలపురుషుఁడైపులకల కుజ మోమునఁ గన్గలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
కలికి మునీశుచే వరము గాంచి యెడంద ముదమ్ము చిప్పిలన్ పలుకగ మంత్రమున్ మదిని భాస్కర దర్శన మయ్యె చెచ్చెరన్ మెలగగ మానసమ్మునను మిక్కిలి యబ్బురపాటు కుంతి క న్గలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మెలకువ వచ్చినంతటనె మేదిని పూలకు కాంతినిచ్చుటన్
మిలమిల లాడి కష్టమున మిన్నున దొర్లుచు శీతకమ్మునన్
చలికిక తాళ జాలకయె చల్లగ భానుడు క్రుంగుచుండగా
కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పలువురు బ్రహ్మలన్ పిలిచి బంగరు కాసులు దానమిచ్చుచున్
కిలకిల నవ్వి యాగముల క్రీడల తేలుచు కార్తికమ్మునన్
కలువలకుంట్ల చంద్రుడట కన్నులు మూయుచు మాయజేయగా
కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
వేశ్యాలోలుడు-రవిని గాంచి :
__________________________
వెలవెలదుల కమరము నిడి
కళలను కుదుపెడి; మరుగవ - కతిపయ దినముల్ !
వెలచెలువల వదన నయన
కలువలు వికసించె రవినిఁ - గాంచి ముదమునన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిసిటీ వాసులకేమి తెలుసు ఏదో ఒహటి రాసి పడేస్తారు :)
కలుహారములకు మరియు క
మలములకున్ తారతమ్య మరయని నగరం
పు లలన జిలేబి పలికెన్
కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిచెలువము గోరుచు ప్రియముగ
రిప్లయితొలగించండికలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్
నెలరాజు సిగ్గిలి మరలుచు
నలినము కైవెద కెనంట నలుదెశ లందున్
అక్కయ్యా
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
మూడవ పాదంలో గణదోషం నలుదెసలందున్. .. అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-2)
కళవళ పడి యిటుల పలికె :
__________________________
నలములు వికసించు నెటుల ?
తులుచన నుడువు మన గురువు - తొడరిన వటువే
కళవళ పడి యిటుల పలికె
"కలువలు వికసించె రవినిఁ - గాంచి ముదమునన్" !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిశంకరార్యా ! శుభోదయం !
రిప్లయితొలగించండిభాగ్యనగరం చేరిపోయారా క్షేమముగా
ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. మరో గంటలో సికింద్రాబాద్ చేరుకుంటాను.
తొలగించండిఅవునా ! చేరిపోయారనుకున్నా !
తొలగించండిమీ పర్యటన దిగ్విజయంగా ముగిసినందులకు
సంతోషం 1
చలిమిరి చంద్రుని గాంచగ
రిప్లయితొలగించండికలువలు వికసించె , రవినిఁ గాంచి ముదమునన్
అలరా రుచుండు కమలము
యిలపైనీపూలు పూయ విరువురు లేకన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికమలము+ఇలపై... అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "కమల| మ్మిలపై" అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
వేశ్యాలోలుడు-భాస్కరరావును గాంచి :
__________________________
విలవిల లాడె వేదనను - వేశ్యలు భాస్కరరావు కోసమై
జలజల సొమ్ము రాల్చుచును - చక్కిలిగింతల దేల్చు నిత్యము
న్నలుకను జెంది మాయమయె - నంచును ! వేచిన వారి లోచనా
కలువలు విచ్చె భాస్కరునిఁ - గాంచిన వెంటనె మోదమందుచున్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిలోచనా కలువలు ... దుష్ట సమాసం. వారల లోచనమ్ములౌ కలువలు.. అందామా
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిB-1)
సవరణతో :
వేశ్యాలోలుడు-భాస్కరరావును గాంచి :
__________________________
విలవిల లాడె వేదనను - వేశ్యలు భాస్కరరావు కోసమై
జలజల సొమ్ము రాల్చుచును - చక్కిలిగింతల దేల్చు నిత్యము
న్నలుకను జెంది మాయమయె - నంచును ! వారల లోచనమ్ములౌ
కలువలు విచ్చె భాస్కరునిఁ - గాంచిన వెంటనె మోదమందుచున్ !
__________________________
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-2)
భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్ :
__________________________
మిలమిల లాడ వెన్నెలలు - మేదిని పైన తటాక మందునన్
కలువలు విచ్చె ! భాస్కరునిఁ - గాంచిన వెంటనె మోదమందుచున్
నలములు నవ్వి విచ్చుకొనె - నందముగా మది యుల్లసిల్లగన్ !
వెలుగులు నిండ , వేడియదె - వెచ్చగ తాకెను జంతుజాలమున్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండితొలికోడి కూసి నంతనె
రిప్లయితొలగించండిచలిదాయయె పొడిచినంత శ్యామిక పారన్
వెలుగును గని చెలి కన్నుల
కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-3)
మిలమిల లాడగ వెన్నెల :
__________________________
మిలమిల లాడగ వెన్నెల
కలువలు వికసించె ! రవినిఁ - గాంచి ముదమునన్
దళములు విప్పార మహో
త్పలములు మురిపించె మదిని -ధ్వాంతారాతిన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిచెలువపు కౌముది కాంతికి
రిప్లయితొలగించండికలువలు వికసించె : రవిని గాంచి ముదమున న్
కొ ల కుల లో కమలంబు లు
బిల బిల మని విరి సెను గద ప్రీతిని గూర్ప న్
విరుపుతో మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి(రామాయణరచనలో పుత్రుడు మల్లికార్జు
రిప్లయితొలగించండినుని , శిష్యుడు రుద్రదేవుని , మిత్రుడు అయ్యలార్యుని భాగస్వాములను కావించుతున్న భాస్కరమహాకవి )
" మెలకువతోడ వ్రాయవలె
మించిన నైపుణి మీరలందరున్ ;
జిలుకుడు బద్యవర్ష " మని
చెన్నుగ బల్కగ రుద్రదేవు డ
య్యలయయు మల్లికార్జునుడు
" న " ట్లని మ్రొక్కగ వారి నేత్రపుం
గలువలు విచ్చె భాస్కరుని
గాంచిన వెంటనె మోదమందుచున్ .
(పద్నాల్గవ శతాబ్దంలో వెలసిన మహాకావ్యం భాస్కరరామాయణం )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండిగురువులకు నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండి*కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్*
*కం||*
ఇల చలి చంద్రుని జూడగ
కలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్
వలచిన నా చెలి బిగి కౌ
గిలి పట్టిటతొలి చలి గిలి గింతలు బెట్టెన్!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
💐🌸💐🌸💐🌸
రెండవ పూరణ 🙏🙏
తొలగించండి*కం::*
కలికాలము లో నిజమిది
విల విల లాడగ కలుషిత విపరీతమునన్
కలకాదు జరుగు నమ్ముము
కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
🙏🙏💐💐🌸🌸🌹🌹
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురువర్యా
తొలగించండికలువల రాయని బొడగని
రిప్లయితొలగించండిగలువలు వికసించె;రవిని గాంచి ముదమునన్
పలువురు దోయిలి యొగ్గిరి
నలువపినాకి హరుడంచు నర్ఘ్యములిడుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెలతెలవాఱ దిగంత
రిప్లయితొలగించండిమ్ములు చెలరేఁగి పొడవంగఁ బుణ్యాద్రి వెసం
దలుకునఁ దామర, లేడ్వం
గలువలు, వికసించె రవినిఁ గాంచి ముదమునన్
[అద్రి = సూర్యుఁడు]
కలువల జంట కన్నుగవ గాఁగ శశాంకుని బోలు మోముతో
వెలుఁగుచు భక్తి తత్పరత విష్ణు మనోరమ లక్ష్మి నెంచుచుం
జెలియలు నోము నోచుకొని చెన్నుగ నక్కకుఁ బ్రేమ తోడ రూ
కలు వలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
[వలువు = వస్త్రము; భాస్కరునిఁ గాంచిన వెంటనె : ఉదయము కాఁగానే]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండినెలరాజు నింగికెగయగ
రిప్లయితొలగించండికలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్
తెలతెలవారుచునుండగ
నలినములన్నియునువిరిసినందముగూర్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె
మోద మందుచున్"
సందర్భము:
యస్మిన్ రమంతే మునయో
విద్యయా౽జ్ఞాన విప్లవే
తం గురుః ప్రాహ రామేతి
రమణా ద్రామ ఇత్యపి
(అధ్యాత్మ రామాయణం బా.కాం.3-40)
జ్ఞానంతో అజ్ఞానం నశించినాక మును లెవనియందు రమిస్తారో యెవడు సౌందర్యంతో నానందింపజేస్తాడో అతనికి రాము డని వశిష్ఠుడు నామకరణం చేశాడు.
"రము క్రీడ యని ధాతు రమ్యార్థ మమరు
రమయతి యన నొప్పు రామ నామంబు.."
(శ్రీ రంగనాథ రామాయణం బా.కాం.)
రామచంద్రు డనీ రామభద్రు డనీ జనులు పిలువసాగిరి. రామచంద్రు డంటే రాము డనే చంద్రుడు. రామచంద్రు డని పిలుస్తున్నప్పుడు రామసూర్యు డని మాత్రం ఎందుకు పిలువకూడదు? రాము డనెడు సూర్యు డని అర్థం. ఇది ఈ పద్యంలో కొత్త ప్రయోగం.
రాముడు వానర సేనతో లంకను ముట్టడించగానే ఇదివరకే (ఆంజనేయుని లంకాదహనంలాంటి భీకర కృత్యాల చూచినారు కాబట్టి) కలువ ల్లాంటి అనేక రాక్షసుల ముఖాలు ముడుచుకోసాగినవి ముం దేం జరుగుతుందో అని.. ఎందుకంటే *రామ సూర్యుడు* అని తోచింది వారికి. సూర్యుడు రాగానే కలువలు ముడుచుకుంటాయి కదా!
కొద్దిమంది రాక్షసుల ముఖాలు మాత్రం వికసించసాగినవి. ముందు ధర్మమే జయిస్తుందని.. ఎందుకంటే *రామచంద్రుడు* అని తోచింది వారికి. చంద్రుడు రాగానే కలువలు విచ్చుకుంటాయి కదా! వారు విభీషణ మిత్ర బాంధవులు.. వారంతా ధర్మ ప్రియులు.
ఈ విషయం గమనించిన దేవతలు "కలువలు విచ్చె భాస్కరుని గాంచిన వెంటనే.." అనుకున్నారు.
విభీషణాప్తులు= విభీషణునికి ఆప్తులు.. ధర్మ ప్రియులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
లలిని సహస్రరశ్మివలె .
రాముడు లంకను ముట్టడింప దై
త్యులకును *రామసూర్యు* డని
తోచె.. ననేక ముఖాలు కల్వలై
వెలవెలబోయెఁ.. గల్వ లటు
విచ్చెను కొన్ని ముఖాల్ విభీషణా
ప్తులకును *రామచంద్రు* డని
తోచి, సురల్ గనిపెట్టి యి ట్లనన్
"కలువలు విచ్చె భాస్కరునిఁ
గాంచిన వెంటనె మోద మందుచున్"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
19.12.19
-----------------------------------------------------------
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండికలికాలము పొగచూరగ
కలుషిత వాతావరణము క్రమ్మగ ధరణిన్
తెలియక రాత్రో పగలన
కలువలు వికసించె రవిని గాంచి ముదమునన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచలిదాయ పొడిచి నంతనె
రిప్లయితొలగించండినులివెచ్చని కాంతిరేఖ నుదుటిని ముద్దా
డ లలన విశాలమౌ కను
గలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
జలజుని గాంచిన తోడనె
రిప్లయితొలగించండికలువలు వికసించె, రవినిఁ గాంచి ముదమునన్
కొలనున గల తామరలే
యలరారెను గాంచుమంటి యద్భుత రీతిన్.
పిలిచెను కుక్కుటమ్మనుచు వేగిరమందున తూర్పుదిక్కులో
రిప్లయితొలగించండివెలుగుల ఱేడు వచ్చె నులివెచ్చని కాంతిమయూఖ యుక్తుడై
పొలతి కపోలమందవియె ముద్దిడ ముద్దియ లోచనాలనే
కలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచలిపులి బారినం బడిన శారదరాత్రిని వాంఛ హెచ్చగా
రిప్లయితొలగించండినిలునిలు మంచు మోహమున నెచ్చెలి నందుచు నా మగండు తాఁ
జెలఁగుచుఁ గన్ను’లెర్రబడి’ చెక్కిలి ముద్దిడ, గేస్తురాలి కన్
"గలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికళకళలసోముగనుగొని
రిప్లయితొలగించండికలువలువికసించె,రవినిగాంచిముదమునన్
నిలమసలుప్రాణులన్నియు
కలకాలముబ్రదుకదలచెగలియుగమందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలవెలుగుఁ గాంచి నంతనె
రిప్లయితొలగించండియలరారును కలువలన్ని యద్భుత రీతిన్
తెలియక పలుకకు, మెక్కడ
కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్?
చలువల బచ్చరాల్చు కడు చల్లని కౌముది సోకినంతనే
రిప్లయితొలగించండికలువలు విచ్చె, భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
కొలనున తామరల్ విరిసె కోమ్మల పైగల పక్షిరాజముల్
పలికెను స్వాగతమ్ములట పాఱగ ధ్వాంతము, వెల్గునిండెనే.
చలువలరాయని వెలుగుల
రిప్లయితొలగించండికలువలు వికసించె; రవినిఁ గాంచి ముదమునన్
జలజములు విరిసె సరసున;
వలపున సఖుఁ గని మురియుట పరిపాటి గదా
చంపకమాల
రిప్లయితొలగించండివెలుగుచు మంత్రులై పడసి పేర్మిని సంపద లెన్నొ, యెన్నికన్
స్ఖలనము నంది నాయకుడుఁ జంద్రుని బోలుచు నస్తమించగన్
గల కల సూర్యతేజమున గద్దియ నెక్కిన నేతఁ జేరఁ గ
న్గలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
కలువలరాయడంబరము కాంతులనింపగ సమ్ముదంబుగా
రిప్లయితొలగించండికలువలు విచ్చె, భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్
నలినములన్ని మానసము నందమునొందగ విచ్చె నీటిలో
సలలిత భావవీచికలు సత్కవి డెందము సందడించగన్.
మూడవ పాదం సవరణ
రిప్లయితొలగించండినలినములన్ని చూడ్కులకు నందముగూర్చుచు విచ్చె నీటిలో
కలువలువిచ్చెభాస్కరునిగాంచినవెంటనెమోదమందుచున్
రిప్లయితొలగించండికలువలువిచ్చవెన్నటికిఖాంకునిజూడగనెట్టిచోటులన్
గలువలువిచ్చురేవెలుగుగాంచినవెంటనెసంతసంబునన్
నలికులవేణి!నీమదినినాయతరీతినినెంచుమాయిదిన్
కందం
రిప్లయితొలగించండిఫెళఫెళ శివధనువు విఱచి
పొలయఁగ రాముండు వంశ మూలపురుషుఁడై
పులకల కుజ మోమునఁ గ
న్గలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
కలికి మునీశుచే వరము గాంచి యెడంద ముదమ్ము చిప్పిలన్
రిప్లయితొలగించండిపలుకగ మంత్రమున్ మదిని భాస్కర దర్శన మయ్యె చెచ్చెరన్
మెలగగ మానసమ్మునను మిక్కిలి యబ్బురపాటు కుంతి క
న్గలువలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్