29, డిసెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3235 (పడఁతులు పాశురమ్ముల....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"
(లేదా)
"పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో) 

32 కామెంట్‌లు:

 1. కడుముదమందు భూతలిని కామనలున్ ఫలియించు నంతటన్
  వడిగొని చేరు సౌఖ్యములు వాస్తవమియ్యది విష్ణుభక్తులై
  తడబడకుండ గొల్వగల ధన్యుల కన్నది స్పష్ట మెట్టు లే
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్?

  రిప్లయితొలగించండి

 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తడబడకుండ తప్పులను ధైర్యము మించగ పూటపూటనున్
  మిడిమిడి జ్ఞానమందునను మిక్కిలి ప్రీతిని నొక్కివాగుచున్
  విడువక దోసెలన్ తినుచు వీనుల విందుగ గొంతులెత్తుచున్
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్

  రిప్లయితొలగించండి


 3. చేత వెన్నముద్ద గొనుచు చేరు కన్న
  డేను భక్తితో మొక్కుచు రేయిబవలు
  పాశురమ్ములఁ జదివినఁ, బాపమబ్బు
  టనుట తప్పగునయ్య నట్ల యన రాదు!


  జిలేబి

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  విడువక మేనమామలను వీధుల వెంబడి గేలిజేయుచున్
  చెడుగుడునాడి భర్తలను చెప్పుల తోడను గారవించుచున్
  నడవడి మాన్ప కుండగయె నందన మొందుచు రోజురోజునన్
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్

  రిప్లయితొలగించండి

 5. నారదా! రావయ్యా!


  వడివడి రండి చక్కడుచ వారిజలోచను లార చూడుడీ
  కొడవలి పెట్టుమాటలివి కోమలు లార వినండి‌ విట్టుబా
  బు,డవిణ నొత్తి పల్కె నిట పూరణ చేయుడి యంచు "నారదా
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్"  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  మడి దడి లేనివారు.,ప్రతిమాటకు భర్తను నత్తమామలన్
  విడువక తిట్టువారు., తమ బిడ్డల గొట్టెడి వారు., ప్రక్కవా...
  రడిగిన పప్పునుప్పుల నహంకృతి లేదని పల్కువారలౌ
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 7. నాస్తికుండిటు పల్కె ఘనమ్ము పొసగ
  "పాశురమ్ములు జదివిన పాపమబ్బు
  దేవుడెక్కడ? లెమ్ము సందేహపడక
  సంఘ సస్కరణమ్మును సలుప రమ్ము"

  రిప్లయితొలగించండి
 8. పాప భీతియె లేనట్టి పరమ పాపి
  తల్లిదండ్రుల హింసించి ధనము పొంది
  పావనమగు కోవెలఁ గట్టి పరులకొరకు
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు

  రిప్లయితొలగించండి
 9. బ్రహ్మ ఘడియల గాయిత్రి పాపమెట్లు
  శివుని పంచాక్షరి యెటుల చేటు దెచ్చు
  ఎటుల గోదా మహాదేవి కిష్టమైన
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"

  రిప్లయితొలగించండి
 10. తత్వ మెరుగని నాస్తిక తతులు గూడి
  పల్కు చుందురు లోకాన పలు విధాల
  పాశురమ్ము లు జదివిన పాప మబ్బు
  ననుట నమ్ముట జరుగ దీ యవని యందు

  రిప్లయితొలగించండి
 11. దాన ధర్మము ల్జేసిన తగునుకాని
  పాడు పనులతొ సంపద కూడబెట్టి
  తాను భక్తుడనని వీర పూనకమున
  పాశురమ్ముల చదువను బాపమబ్బు సగ

  రిప్లయితొలగించండి
 12. సుడిగొని ముక్తిసంపదయె
  సుందరు నచ్యుతు గుండెనిల్పుచున్
  బడతులు పాశురమ్ములను
  భక్తి బఠించిన గల్గు ; పాపముల్
  గడగడలాడుచున్ జెదరి
  గమ్య మెరుంగక పారిపోవులే ;
  యెడతెగి దేహబంధనము
  లీశ్వరునందున నాత్మ చేరులే .
  (సుడిగొని - చుట్టుకొని ; ఎడతెగి - విడిపోయి )

  రిప్లయితొలగించండి
 13. చెన్నుగ మదిని లగ్నము చేయ కుండ
  దిప్పలు పడుచు దప్పుల దెలుసుగొనక
  బాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు
  దీద్దు కొని చదువ, దొరకు దివ్య పదము

  రిప్లయితొలగించండి
 14. భావమెఱుగుచు జదివెడి పాశు రములు
  భక్తి నొసఁగును మనలోన శక్తి నొసగు
  భావ మెఱుఁగక మనసున భక్తి లేక
  బాశు రమ్ములఁ జదివినఁ బాప మబ్బు
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి


 15. మడిని గట్టికొనుచు ధనుర్మాసమందు
  మత్సరములు మాని మగువ మగని తోడ
  దేవ దేవుని గొనియాడ దేని వలన
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు?

  రిప్లయితొలగించండి
 16. పాశురమ్ములజదివినపాపమబ్బు
  నేమి గురువర!భావ్యమె యిట్లుపలుక
  పాశురమ్ములజదివిన బడయగలము
  పుణ్యలోకాలుదప్పకపుడమివీడ

  రిప్లయితొలగించండి
 17. కాసులున్నట్టి వారినే గౌరవించి
  మోసముల్జేయు వారినే ముందు నిల్పి
  లేశమైనను మనసున లేక భక్తి
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు

  రిప్లయితొలగించండి

 18. ... శంకరాభరణం... 29/12/2019 ...ఆదివారం

  సమస్య.
  *** *** **
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"

  నా పూరణ.
  ** *** ***


  పశుపతిని మీఱు వేరు దైవమికలేడు

  భక్తకోటికి కైవల్య ప్రాప్తి నొసగ

  ననుచు పలుకు పాశుపతుడు ననెను నిటుల

  "పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 19. గుడికడ భక్తి భావమున గూడిన వారికి జెప్పుచుండె తా
  బడబడ మాటలాడుచు సభాసదులందరి తో బుధానుడున్
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్
  తడఁబడె నాదు నాలుకయె దాపసులార బఠింప మున్గు మీ
  కొడిమెలు పాశురమ్ములవి గోరిన కోర్కెలు దీర్చు వింటిరే
  గడగడలాడ గీఃపతి పకాలున నవ్వెను బాలబాలికల్

  రిప్లయితొలగించండి
 20. పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్
  పడతులెగాకపూరుషులుభక్తిపఠించినగల్గుబుణ్యముల్
  విడువకనిష్ఠతోడగడుపేర్మినిజేయగబూజలాదులన్
  వడిగనెనిచ్చుమోక్షమునవారితభక్తికిమెచ్చికృష్ణుడున్

  రిప్లయితొలగించండి
 21. నడుపును ధర్మ మార్గమున నందనమౌ బ్రతుకంత భాగ్యమౌ
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ; గల్గుఁ బాపముల్
  విడుచుచు నీమ నిష్ఠలను వేడుకకై నొనరించు బూజలన్
  తడబడి తప్పులన్ జదువ దైవము మెచ్చడదంత వ్యర్థమౌ

  రిప్లయితొలగించండి
 22. క్రూర వృత్తిని విత్తము కూడఁబెట్టి
  ద్రోహ చింతల జనులను దోఁచుచుండి
  దాన మొనరించ నరకమ్ము దాఁట లేడు
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు


  పడయఁగఁ బుణ్య లోకములు భార్యలు కారణ మౌదు రేరికిన్
  నడపుచు ధర్మ మార్గమున నందన కారక పుణ్య శీలలై
  కడు వెడ మాటలాడుచును గాఁక నొసంగఁగ నేడ్చుచుండఁగాఁ
  బడఁతులు, పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్

  రిప్లయితొలగించండి
 23. చం:

  విడువక చూడ టీవి మురిపెమ్మున నెన్నియొ చిత్ర భాగముల్
  వడివడి సేయ పూజలను వాటము కొద్దిగ సర్దు బాటునన్
  కడకును దైవమన్న వెటకారము, లోకుల మెప్పు కోసమై
  పడతులు పాశురమ్ములను భక్తి పఠించిన గల్గు బాపముల్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 24. చంపకమాల
  మెడనిడి భూరి హారముల మేనుకు జుట్టుచు పట్టుచీరలన్
  జడనిడి పైడి వంకలను జాజుల మాలల, కృత్తిమమ్మువౌ
  పొడుచుకు వచ్చు బిల్లలను మోమున బొట్టుగఁ జూచువారికై
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్

  రిప్లయితొలగించండి
 25. తేటగీతి
  మదిని రంగని గుడిజేసి మహిమలెరిగి
  మోదమలరంగ గూర్చఁగ గోద భక్తి
  నాదమందించు మోక్షమ్ము! నటనయనఁగ
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు

  రిప్లయితొలగించండి
 26. మనమునందున నిండిన మసరుతోడ
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు
  నన్నిపాపంబులుదొలగునార్తితోడ
  పాశురమ్ములఁ జదివిన పడతులెల్ల

  రిప్లయితొలగించండి
 27. పూజనాడంబరమ్ముగ మొదలుపెట్టి
  యెల్లరకది తెలియజేయ సెల్లునందు
  మనము లగ్నము జేసి మైమరచి యుండి
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు

  రిప్లయితొలగించండి
 28. అఁడకువతోడమానసమునందుననార్తిగగొల్చు భక్తులన్
  విడువక కృష్ణు సన్నిధికి వేడుక జేర్చుట తథ్యమీభువిన్
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ, గల్గుఁ బాపముల్
  విడిచిన భక్తిమార్గమును, వేదననొందుటగూడ తథ్యమే.

  రిప్లయితొలగించండి
 29. పుడమిని బ్రోచు వాడనుచు మోక్షము నిచ్చునటంచు నమ్ముచున్
  విడువక వేంకటేశ్వరుని వేడిన చాలు లభించు సద్గతుల్
  పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ, గల్గుఁ బాపముల్
  విడుచుచు ధర్మమార్గమును విత్తము గోరిచరించుచుండినన్.

  రిప్లయితొలగించండి

 30. రంగనాథుని కొల్చిన రాగమయియె
  వర్ణణాత్మక సాహిత్య భాషణముల
  భక్తి పూరిత మైనట్టి భాష్యమేల
  పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు!!

  రిప్లయితొలగించండి
 31. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"

  సందర్భము:
  గోదాదేవి తమిళంలో కృష్ణ భక్తి నిండారే పాశురాలను *తిరుప్పావై* అనే పేరుతో రచించింది. ఆలపించింది. ధనుర్మాసంలో రోజు కొక పాశురం పఠిస్తారు.
  ఈనాటి 14 వ పాశురం (ఉఙ్గళ్ పుళై క్కడై)లో ఒక గోపికను మేల్కొలుపడం వుంది.
  "నేనే ముందుగా మేల్కొని అందరినీ మేల్కొల్పుతా నన్నావుగా! ఏదీ!" అనే మాట వుంది. నిజానికి తాను తరించిన వాడే పరులను తరింపజేయగలడు. (స్వయముత్తీర్ణాన్ పరాన్ స్తారయతి)
  ఐతే ఈనాడు తాను తరించకుండానే పరులను తరింపజేస్తా మనే వాళ్ళపట్ల జాగ్రత్తగా వుండడం ఇంకా అలవరచుకోవలసి వుంది.
  ఇక్ష్వాకు వంశస్థుల ఇలువేలుపై రాముని తరంవరకు ఆరాధించబడిన శ్రీరంగనాథుని కంకితంగా గోదాదేవి కృతులు రచించింది.
  (నేటికీ శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారి లాంటి వా రెందరో తిరుప్పావైని ఆంధ్రీకరిస్తున్నారు.)
  ఒక గుడిలో పాశురములను మధురంగా ఆలపించిన ఒక పాపను అభినందిస్తూ ఒకతను ఆ పాప మబ్బు అని (మేఘ మని), ఆ మబ్బునుండి మధుర భక్తి రస మనే సుధలు నేడు కురిసిన వని చెబుతున్నాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  రామ వంశ్యు లర్చించిన రంగనాథు
  మీద గోదమ్మ మోదమ్ము మీరఁ బాడెఁ..
  గురిసినవి నేడు మధుర భక్తి రస సుధలు..
  పాశురమ్ములఁ జదివినఁ బాప మబ్బు

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  29.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి