28, డిసెంబర్ 2019, శనివారం

సమస్య - 3234 (దానముఁ జేయఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్"
(లేదా...)
"దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

85 కామెంట్‌లు:

 1. (1)
  దానముఁ బాత్రత నెఱిఁగియుఁ
  బూనికతోఁ జేసినఁ గడుఁ బుణ్యము దక్కున్;
  మానక యపాత్ర జనులకు
  దానముఁ జేసినఁ గలుగును దారుణబాధల్.
  (2)
  దీనులఁ గాంచి లుబ్ధుఁడు మదిన్ దయఁ బూనుచు సుంతయేనియున్
  దానముఁ జేయఁగాఁ గలుఁగు దారుణ వేదన; సజ్జనాళికిన్
  మానని దానశీల మనుమానము లేని సుభూషణం బగున్;
  దానముఁ జేయువారలను దైవసమానులుగాఁ దలంతురే.

  రిప్లయితొలగించండి
 2. పానము జేసి క్షీరమును పాపము పుణ్యములన్ని మాని సం
  తానము గల్గజేయ మమతన్ తన బిడ్డను జూచుచుండగన్
  యానము జేయజేసియు దయార్ద్రత వీడి కసాయికిచ్చి గో
  దానము జేయగన్ గలుగు దారుణవేదన సజ్జనాళికిన్
  Rohit

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కసాయికి గోదానం వేదనాజనకమే. చక్కని పూరణ. అభినందనలు.
   'యానము జేయజేసియు"?

   తొలగించండి
  2. గురువు గారు కసాయికి గోదానమను భావన
   అత్యుత్తమంగా ఉంది 🙏

   తొలగించండి
 3. 28/12/2019
  గురువులకు నమస్సుమాంజలి 🙏🙏

  ఈరోజు సమస్యాపూరణము

  *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

  *కం||*

  నానా విధముల తప్పులు
  ఏ నాడును నాపక నిల యెదిరించుచు తా
  నేనే గొప్పను జనులకు
  *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 28/12/2019
   గురువులందరికీ నమస్సుమాంజలి 🙏🙏
   ఈరోజు సమస్యాపూరణము

   *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

   *రెండవ పూరణము* 🌹🌹

   *కం||*

   కానగ రారట నెపుడును
   ఎన్నికలనినను తలచిరి యెదురుగ చేరన్
   అన్నీ మరచిట యోటును
   *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
  2. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
   ఒక మోసగాడిని ఎంతగానో ప్రేమించిన ఒక ప్రేమికురాలి పరిస్థితి 🙏🙏🙏

   *మూడవ పూరణ* 🌹🌹🌹
   *కం::*

   నేనే వీనికి ప్రాణము
   నేనే వీనిన సగమని నెరుగక నిజముల్
   నే నా మానము ప్రాణము
   *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
  3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో... "తప్పుల నేనాడును నాపక యిల నెదిరించుచు..." అనండి.
   రెండవ పూరణలో... "రారట యెప్పుడు । నెన్నికలని... అన్నియు మరచియు..." అనండి.
   మూడవ పూరణలో... "వీనికి సగమని యెరుగక..." అనండి.

   తొలగించండి
  4. శంకరార్యులకు ధన్యవాదములు 🙏🙏🙏

   తప్పులతో ఇబ్బంది కలిగించి నందులకు నన్ను మన్నించ ప్రార్ధన 🙏🙏

   తొలగించండి 4. మీనపు మేషమ్ముల య
  జ్ఞానపు లెక్కల బతుకున చాలమి తోడై
  దీనము గా లాగుచు నతి
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్!


  జిలేబి

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. ఏదినిజంబటంచెరిగి నెయ్యవి యెల్లర మానసంబులన్
  వేదన శీలనా రహిత వేద్యమొనర్చునొ యట్టి కార్యముల్
  మోదము తోడసేయుటలె ముఖ్యముగానిసదావృధావచో
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్*

  రిప్లయితొలగించండి


 6. జ్ఞానపు దారి వీడుచు విచారణ చేయక మందబుద్ధితో
  మీనపు లగ్నమందరరె మేషపు రాశిని దూరె రాహువం
  చా నసలన్ కుదేలుపడి చాలమి తో స్థితి మించి నట్టియా
  దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. ఆకాశవాణికి పంపినది :)


  వీనుల విందు గానముల వేడుకకత్తెలతో సయాటలన్
  తేనియ లెల్ల గ్రోలెదము తెవ్వనయే మధురంబటంచు నా
  మేనియె సర్వమంచు సరి మేలము లాడి విభావరిన్ సమా
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వీణను గూర్చియిచ్చుచును వీనుల విందుగ శాస్త్రబద్ధమౌ
  గానము నేర్పుచున్ విరివి జ్ఞానము నిచ్చుచు తానమందునన్...
  పూనుచు ముద్దు కన్నియను పూర్తిగ శ్రోత్రము లేనివానికిన్
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి

 9. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోనల కోనలన్ దవిలి కొండొక శ్రేష్ఠుని కానరాకయే
  మీనము మేషమెంచకయె మిక్కిలి ప్రీతిని ముద్దుకన్నియన్
  సోనియ బిడ్డకిచ్చి తన షోకుల జూచుచు రోమునందునున్
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
 10. జానిని వీడుచు భోగము

  చానను కూడంగ,గలుగు సంతు, తలచ నా

  సానికి ముదముగ గర్భా

  దానము చేసిన కలుగును దారుణ బాధల్

  రిప్లయితొలగించండి
 11. ఉ:

  కాననమందు జీవనము గాంచెడి వారగు కొండ జాతులన్
  మానము పెంపుసేయ బహుమానములెన్నియు నివ్వజూపినన్
  కానరు నెంతజెప్పగను కాంచన మైనను కంద మంచనన్
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాలికిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 12. సమస్య :-
  "దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్"

  *కందం**

  1.
  (పుట్టింటిలో ఉన్న స్త్రీ)

  నేనిట యుండిన యత్తయు
  నానామాటలనుచుండు నా పతి దిట్టున్
  నేనింకను వెళ్ళుటకు ని
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్


  *కందం**

  2.
  (అత్తారింటిలో ఉన్న స్త్రీ)


  నేను స్వవశురాలిననుచు
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్
  మేనత్తయు గయ్యాళిది
  దీనజనులకింత పెట్ట తిప్పలు బెట్టున్
  ....................✍చక్రి

  స్వవశ : స్వతంత్రురాలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "నేనిట నుండిన నత్తయు" అనండి.

   తొలగించండి
 13. ఈనాటి శంకరా భరణము సమస్య

  దానము చేసిన కలుగును దారుణ బాధల్

  ఇచ్చిన సమస్య కంద పాదము నా పూరణము సీసములో

  పొరబాటున దానము చేసి వామనునకు బలి చక్రవర్తి ప్రాణములు పోగొట్టుకున్నాడు కర్ణా ఇంద్రుడు కవచ కుండలములు దానము కోరి వస్తున్నాడు నీ ప్రాణ ములు కోల్పోతావు తొందర పడి దానము చేయవద్దు అని సూర్యుడు కర్ణుని హెచ్చరి
  క చేయు సందర్భము


  మాడును చూపెను మూడవ యడుగుకు
  స్ధలము వామనునకు సంతసముగ

  బలి, చేరె నాతండు పాతాళ లోకంబు
  నకు ,వచ్చు చుండెను నాక లోక

  మున కధిపతి కోర నిను కవచ సహిత
  కుండలం బులిపుడు,కూర్మి కలిగి

  శీఘ్ర తన్ దానము చేసిన గలుగును దారుణ బాధలి ధ్ధరణి లోన

  వలదు కర్ణా వినుము మాట, కలను లోన

  బలము‌ తగ్గి, పోవును‌ నీకు ప్రాణములు, నొ

  క పరి యోచన చేయ సుఖములు కలుగు

  ననుచు బలికె కర్ణుని తోడ నమతు డపుడు

  రిప్లయితొలగించండి
 14. *కందం**

  మీనపు కన్నుల ప్రేయసి
  తానింతయు నోరు మెదపదనుచు బలముతో
  మానవతికింక గర్భా
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 15. గానము ప్రాణమేననుచు,గాఢముగా నిటు నమ్ముగాయకుల్
  దానముసేయనొప్పరుగ,ధాటిగ వాగ్ఖరి,నాపగోరుచున్
  వేణువునందు గోపికల, వేదన దీర్చగ,కృష్ణమూర్తియే
  దానముసేయగాగలుగు,దారుణవేదన సజ్జనాళికన్

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  శుక్రాచార్యుడు.. బలిచక్రవర్తితో....

  దానవవంశశేఖర! వదాన్యత భూపతిజాతికందమౌ
  గాని., గ్రహీత గూర్చి యెరుగన్ వలె, పాత్రుడొ లేక ధూర్తుడో!
  నా నుడులాలకింపుము జనార్దనుడే వటువేమొ ? తొందరన్
  దానము చేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 17. ( "పద్మశ్రీ " నాగయ్య సంగీతనటనదాతృ
  త్వాల త్రివేణి . కాని ఆ మహనీయుని అలవిమాలిన
  దానగుణం ఎన్నో ఇబ్బందులపాలు చేసింది )
  కానము నాగయార్యు సరి
  గాయకు ; కన్నుల నిల్పును త్యాగయన్ ;
  జానగు వేమనన్ ; సుధల
  జల్లెడి పోతన రామదాసులన్ :
  వైనము జూపకన్ ధనము
  బాంధవమిత్రుల కిచ్చివైచెనే !
  దానము జేయగా గలుగు
  దారుణవేదన సజ్జనాళికిన్ .
  (జానగు - అందమైనవాడగు ; వైనము - వివేచన )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   "నిల్పు త్యాగయన్" అనండి. లేకుంటే గణభంగం.

   తొలగించండి
 18. . - విరించి.

  దీనుల మేలుగోరి యిక తెల్గును మాన్పుచు జాతి కోసమై

  జ్ఞానులు గాను తీర్చుచును జాగృత పర్చెడి యాంగ్లభాషనే

  కూనల మాధ్యమమ్ముగను కూర్చెద మంచును నేతలెల్ల వా

  గ్దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్.

  రిప్లయితొలగించండి
 19. మానక ధార్మికుం డగును, మానితసత్కృతిలబ్ధసద్గతుల్
  దానముఁ జేయఁగాఁ గలుగు, దారుణవేదన సజ్జనాళికిన్
  మానము హీనమై మృతిసమానమునౌ, బిడియమ్ముఁ దొల్గ నా
  దానముఁ జేయఁ గూడదటు ధారుణపాపహేతువౌ.

  రిప్లయితొలగించండి
 20. ఓ!నా దైత్యకులాగ్రణి
  మాణవకుడు గాడితండు మన వైరిగదా!
  దానము గీనము మానుము
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్


  మేని కశేరికంబిడెను మేఘుని వాహుకు నా దధీచియే
  తానటు మాంసమున్ శిబియు తార్క్ష్యము వేడగ మోదమొందుచున్
  దానము చేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్,
  కానగ నట్టివారలనె స్కంభుడు సత్కృప గాచునెల్లడన్

  కశేరికము-వెన్నెముక
  మేఘవాహనుడు-ఇంద్రుడు
  తార్క్ష్యము- పక్షి
  స్కంభుడు - దేవదేవుడు

  ఆకాశవాణికి పంపినది

  కానగ ధారుణిన్ బలియుఁ, గర్ణుడు నాశిబి యాదధీచియున్
  వైన మదెన్నడున్ విడక బ్రాణుల కెల్లహితంబుగాన్ పరి
  జ్ఞానము నెంచగన్ సతము సత్యము ధర్మ మహింసలే యపా
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్.

  *పరిజ్ఞానము = విశేషమైన జ్ఞానము
  అపాదానము =
  నష్టము (రవ్వా శ్రీహరి నిఘంటువు)

  భవదీయ
  గంగాపురం యజ్ఞభగవాన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. మూడవది సర్వశ్రేష్ఠం. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏🙏🌺🌺🌺🙏🙏
   కేవలం మీరిస్తున్న శిక్షణా ప్రభావం మాత్రమే.
   అందులకే మిమ్ముల నిబ్బంది బెడుతున్నను మధ్యమధ్యలో. క్షంతవ్యుణ్ణి.

   తొలగించండి
 21. దానము పుణ్యమొసంగును
  దానములన్ని మతములును ధర్మంబనియెన్
  కాని దనశక్తికి తగని
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్"

  రిప్లయితొలగించండి
 22. దైన్యుని పండితునింగని 
  దానము చేసిన శుభమగు, దౌష్ట్యము కాదా 
  హీనునిగా నెంచి పిలిచి 
  దానము చేసిన, గలుగును దారుణ బాధల్ 

  రిప్లయితొలగించండి
 23. ఉత్పలమాల
  కూనని మేలుకై కవచకుండలముల్ గొనె వజ్రి దీనుడై
  ప్రాణముఁ దీయఁ గర్ణు నది, వాలుచు సైతము కృష్ణమూర్తికై
  దానమొసంగె స్వచ్ఛముగ  దంత సువర్ణము యుద్ధభూమినన్! 
  దానముఁ జేయఁగా గలుఁగు దారుణ వేదన సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "యుద్ధభూమినిన్/భూమిలో" అనండి.
   కర్ణుడు కృష్ణునకు బంగారు దంతాన్ని దానమివ్వడం వ్యాసభారతంలో లేదు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   ఉత్పలమాల
   కూనని మేలుకై కవచకుండలముల్ గొనె వజ్రి దీనుడై
   ప్రాణముఁ దీయఁ గర్ణు నది, వాలుచు సైతము కృష్ణమూర్తికై
   దానమొసంగె స్వచ్ఛముగ  దంత సువర్ణము యుద్ధభూమినిన్! 
   దానముఁ జేయఁగా గలుఁగు దారుణ వేదన సజ్జనాళికిన్

   తొలగించండి

 24. భానుని దివ్యతేజమున బాలుడు బుట్టెను కుంతిపుత్రుడై
  మేనుకు రక్షణం బొసగు మేలగు సాజపు డాలుయుండగన్
  దానగుణంబుశీలముగ ధర్మము దప్పక నాచరించిత
  ద్దానముజేయగా గలుగు దారుణవేదన సజ్జనాళికిన్
  కొరుప్రోలు రాధాకృష్ణా రావు‌ ,మీర్ పేట్ ,రంగారెడ్డి  రిప్లయితొలగించండి
 25. దానవు డైననేమి బలి దానముగా తన ప్రాణమిచ్చెగా!
  దానగుణాఢ్యుగా శిబిని,దాతగ కర్ణుని మెచ్చరే ప్రజల్!
  దానముజేయ నిల్తురు సదా,ధనమున్ బాకిగాను యా
  దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
 26. మానవులకు బుణ్యo బులు
  దానము జేసిన గలుగును : దారుణ బాధల్
  మాను నుదారపు సాయము
  మానక నొనరించ బూన మహిలో సుజను ల్

  రిప్లయితొలగించండి
 27. దీనుల యాకలి దీర్చగ
  నేనాడును కాసునిడని హీనుడొకడు జాం
  బూనదముఁ బతిమల కొరకై
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్

  రిప్లయితొలగించండి
 28. ధారుణి కార్యముగూర్చగ
  మీరుచు ధర్మము వివేకమెంచక జూకన్
  కారాగారము గొను పరి
  దానము జేసిన గలుగును దారుణబాధల్
  జూక=తొందరపాటు, పరిదానము=లంచము

  రిప్లయితొలగించండి
 29. దానవవైరి కోరఁదన దంశముకుండలయుగ్మమున్నుపా
  దానముగానొసంగెపరిదానముకోరక దానకర్ణుడా
  దానము ప్రాణముంగొనుటతప్పదు తథ్యమటంచెరింగియున్ !
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  [దంశము=కవచము; పరిదానము = మాఱకము ]

  రిప్లయితొలగించండి

 30. క్రమాలంకార పూరణం

  మానిత పుణ్య ధామమును మానవ!పొందుట యెట్టులో కదా?
  దేనిని సూర్య నందనుడు తీక్ష్ణత నిచ్చును పాపులైనచో?
  పూని యశంబు చేరువగు పొల్పుగ నెవ్వరికిన్ శుభంబుగా?
  దానము చేయగా కలుగు- దారుణ వేదన- సజ్జనాళికిన్.

  సూర్య నందనుడు= యముడు

  రిప్లయితొలగించండి

 31. పానము జేయుచున్నడుపు వాహనమెంతయు సేమమెక్కడో
  కానరె కావ్యమాలికల కట్టడిసేయుచు రాజపోషకుల్
  వానలు లేకయున్ కరువు వచ్చినపంటలు పండుటేలనో
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్!!

  రిప్లయితొలగించండి
 32. దీనజనాళికిన్నెపుడు దిక్కుగ నిల్వగ నన్ని వీడుచున్
  కానలకేగి కందముల కాయలనైన భుజింపనోర్తురే
  గాని నపాత్రులన్నెపుడు గావగ నెంచరు యట్టి వారికిన్
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్
  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
 33. దానములెన్నిజేసిననుదప్పుగగానరుకాని,యాతిలా
  దానముజేయగాగలుగుదారుణవేదనసజ్జనాళికిన్
  దానముజేయుచోమనకుధాత్రినిపుణ్యముగల్గిముక్తియున్
  గానగవచ్చునంత్యమునకామితకోర్కెలుదీరునేగదా
  ----

  రిప్లయితొలగించండి
 34. దీనుడుగదా యనుచు వర
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్ ,
  దానవునికి వరమీయగ
  నా నటరాజుకు జరిగిన యవమతి నెరుగన్

  రిప్లయితొలగించండి
 35. దానముజేయుటసరి,యా
  దానముమితిమీరియుండదౌష్ట్యముసుమ్మీ
  పానముకొఱకైపరునకు
  దానముజేసినగలుగునుదారుణబాధల్

  రిప్లయితొలగించండి
 36. దానము జేయగ యన్నము
  దానము జేయగ తొడుకులు, ధనమును మేలున్
  గానఁగ నది వీరుడు బలి
  దానముఁ జేసినఁ గలుగును దారుణబాధల్

  రిప్లయితొలగించండి
 37. కస్తూరి శివశంకర్శనివారం, డిసెంబర్ 28, 2019 10:42:00 AM

  ఉ :
  మానిత మైనదీ తపము మౌక్తిక మంజుల యజ్ఞమేనులే
  జ్ఞానము లేని పాలకులు జాతికి ద్రోహము జేయగానిలన్
  దీనుల బాధలన్ గనక తీయని పల్కుల దుర్జనుల్ సిరుల్
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
 38. బలరామదేవులు శ్రీకృష్ణ పరమాత్మ తో..

  కందం
  కానక సుభద్ర సుగతిన్
  ప్రాణ సఖుడు క్రీడి కొసఁగ భావించితివే?
  తాను బహుభార్య! కన్యా
  దానముఁ జేసినఁ గలుఁగును దారుణ బాధల్

  రిప్లయితొలగించండి
 39. దానగుణంబుగల్గి నిరతంబును సజ్జనగోష్ఠి సల్పుచున్
  దీనజనావనంబనెడు దీక్షమనంబునబూని భక్తితో
  కానన సీమలందుతనకాయము మానసమందునిల్పి సం
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  రిప్లయితొలగించండి
 40. శుక్రాచార్యుని విన్నపము:

  ఈ నాపల్కులు వినుమా
  దానార్థి రమా ధవుండు దనుజా భూమిం
  గానక యున్నది యెల్లయు
  దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్


  ఏనుఁగు నాల కించమె యహీన బలమ్మున విఱ్ఱ వీఁగియుం
  గానన మందుఁ బొందుటను గష్టము లక్కట చిత్తమందుఁ దా
  నూనిన దైవ భక్తిని మహోరగ నక్ర విహార వారిలోఁ
  దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్

  [వారిలోన్ + తానము = వార్ధిలోఁ దానము]

  రిప్లయితొలగించండి


 41. ఆకాశవాణి విశేషములు తెలుపగలరు  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మీ పూరణను మీ మనుమడు చదివారు.

   వచ్చే వారపు సమస్య:

   "నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో"

   తొలగించండి


  2. నెనరుల్స్! మనవణ్ణి సంబోధించి పూరణ పంపివేయడమైనది :)   జిలేబి

   తొలగించండి
 42. హీనునిగా దలంపకుడు హెచ్చగు జీతము సత్ప్రవర్తనుం
  డైన బుధుండు మాకొడుకు హవ్వ! తలంతురె బన్న మిచ్చి యీ
  హీన పు బోడి లక్ష!యని యెక్కువ సొమ్ములు గుంజి కన్య నా
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్.

  రిప్లయితొలగించండి
 43. దీనుల నుద్దరించగల దీక్షనుబూనితి!"మానవత్వమున్
  దానముజేయరండనుచు ధర్మప్రభోదము జేయ?"మోసమౌ
  మానసమందు సాధుగుణ మంత్రపుతంత్రములున్న వానికిన్
  దానముజే యగా?గలుగుదారుణ వేదన సజ్జనాళికిన్!
  శ్రీ. కె.ఈశ్వర ప్ప.ఆలూరు.కర్నూలు. జిల్లా.

  రిప్లయితొలగించండి
 44. నక్షత్రకుడు హరిశ్చంద్రునితో....

  కాననమున పడితివి నీ
  దీన స్థితి జూడలేను, ధీమసమున బొం
  కైనను నిట్లు పలుకవే
  దానముఁ జేసినఁ గలుగును దారుణబాధల్.

  2. నక్షత్రకుడు చంద్రమతితో....

  నా నాధుని మాట నిలుప
  లేనని నీవూ పలుకవు, లేశంబైనన్
  సూనృతము విను, కఠిన వా
  గ్దానముఁ జేసినఁ గలుగును దారుణబాధల్.

  రిప్లయితొలగించండి
 45. జ్ఞానము గలతలిదండ్రులు
  పూనికతో బిడ్డపెళ్లి పూరణజేసే
  దానికి?నప్పున కన్యా
  దానము జేసిన గలుగునుదారుణబాధల్

  రిప్లయితొలగించండి
 46. వచ్చేవారం ఆకాశవాణి వారి సమస్య

  *నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో*

  గురువారం సాయంత్రం లోగా చేరేట్టుగా
  పంపించాల్సిన చిరునామా

  Padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించండి
 47. *మరో సరదా పూరణము (5)*

  *కం::*

  జానెడు పొట్టకు దొరకక
  ఖానాకరువైనపుడు తగదుగ నిలను యా
  ఉన్నది కొంచెము నొదలఁక
  *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

  *మరో పూరణము (6)*

  *కం::*

  చేనున పంటలు పండగ
  యెన్నో యప్పులు వొనరుచు యెరువుల కొరకున్
  మేనుకు మెరుగుల కొరకని
  *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

  **కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
  🙏🌹🙏🌹🙏

  వొనరుచు = చేయు

  *మరో సరదా పూరణము (7)*

  *కం::*

  ఎన్నడు నేడుపు సీనులు
  కన్నులు వాచును మనకిట కమల్చు టీవీ
  దానికి విలువగు సమయము
  *దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్*

  **కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
  🙏🌹🙏🌹🙏

  కమల్చు = చూడు (ఆంధ్రభారతి)

  రిప్లయితొలగించండి
 48. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ
  వేదన సజ్జనాళికిన్"

  సందర్భము: నృగ మహారాజు పుష్కర తీర్థములందు బ్రాహ్మణులకు కోటి ఆవులు దానం చేశాడు. పొరపాటున ఆలమందలో మరొక విప్రుని ఆవు, దూడ ఇదివరకే కలిసిపోయి వున్నవి. వాటినీ తనవే అనుకొని ఒక భూసురునికి దాన మిచ్చాడు. అతడు ఆవులను తీసుకుపోయినాడు.
  ఆవును దూడను కోల్పోయిన బీద విప్రుడు వెదుకుతూ వుండగా హరిద్వారం వద్ద కనఖలం అనే వూరులో ఆలమందలో తన ఆవు దూడ కనిపించినవి. శబలా! రా! అన్నాడు. అవి గుర్తు పట్టి వచ్చి ప్రేమ ఒలుకబోసినవి. ఇద్దరు బ్రాహ్మణులూ అవి నా వంటే నా వని గొడవ పడ్డారు. రాజువద్దనే తేల్చుకుందాం పద అని వెళ్ళారు. ఎంత ఎదురుచూసినా అనుమతియే లభించలేదు. విసిగి వేసారి వందలయేండ్లు అజ్ఞాతంగా ఒక గుంతలో తొండవై పడి వుందువు గాక! అని శపించారు. వాసుదేవు డవతరించినపుడు నీ శాపం తొలగుతుందన్నారు.
  రాము డీ వృత్తాంతం చెప్పి ప్రజలకు సమయ మీయని రా జెంత గొప్పవా డైతేనేం! తన పతనం తానే ఏర్పరుచుకుంటాడు" అన్నాడు.
  లక్ష్మణు డది విని "దానం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చేయాల్సిందే! లేకపోతే దారుణమైన వేదననే కలుగుతుంది నిజంగా" అన్నాడు. (ఇది రామాయణం ఉత్తర కాండంలోని కథ.)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "ఆ నృగు డిచ్చె భూసురుల
  కావులు కోటి.. మరొక్క విప్రు స
  ద్ధేనువు వత్స మట్టి విత
  తిన్ గలిసెన్ మునుముందె.. విప్రు డెం
  తో నెగు లందుచున్ వెదకి
  తోషము గాంచెను వానిఁ జూచుచున్..
  దానముఁ గొన్న భూసురుడు
  తా నధికారి నటంచు, విప్రుడున్
  "నే నధికారి వీనికిని
  నిక్క" మటంచును నొక్క పెట్టునన్
  పూనిక వాదు లాడి, "యిక
  పోదము, రాజె సమస్యఁ దీర్చు" నం
  చా నృపుఁ జేరగాను సమ
  యంబు నొసంగ డతండు.. తొండ రూ
  పూన శపించి రా ద్విజు ల
  యో! ప్రజకున్ సమయంబు నీని రా
  జే నశియించు" నంచు వచి
  యించెను రాముడు.. తమ్ము డి ట్లనెన్
  "దానముఁ జేయఁగాఁ గలుగు
  దారుణ వేదన సజ్జనాళికిన్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  28.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 49. దానము చేసినన్ బ్రతుకు ధన్యత గాంచున టంచుచెప్పగా
  వీనుల విందుగా వినుచు వేడుక తోడనపార ద్రవ్యమున్
  కానుకగానొసంగినను గైకొన నొప్పక దోచుదొంగకున్
  దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్*

  రిప్లయితొలగించండి