9, డిసెంబర్ 2019, సోమవారం

సమస్య - 3215 (కాముఁడు దున్నపోతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాముండే దున్నపోతు గణపతి కపియౌ"
(లేదా...)
"కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్"
(వృత్తపాదంలో యతిని గమనించండి)

107 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    ప్రేమను పెంచగా నెవడు వేసెను బాణము నీశ్వరున్ హృదిన్?
    భీముని వోలు కాలునకు భీకర వాహన మెవ్వడోయనన్;
    నీమము తోడ మూషికము నెవ్వడు చెంతను చేర్చునోయనన్,
    రాముని బంటుగా నెవడు రాక్షస మూకను చిత్తుజేసెనన్;
    కాముఁడు, దున్నపోతు, గణనాథుడు, మర్కటమూర్తియౌఁ గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిత్తుజేసె ననన్' అని కదా ఉండాలి? అక్కడ "రాక్షసులన్ బరిమార్చె నన్నచో" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. 🙏

      బ్రహ్మాండంగా ఉంటుంది...సవరించెదను

      తొలగించండి
    3. సారు ఉవాచ:

      *రాక్షసులన్ బరిమార్చె నన్నచోన్* అంటే సరి!

      తొలగించండి

  2. చాముండేశ్వరి యనెడా
    క్షామ నివారణపు నాటకమున జిలేబీ
    మా మిత్రులు నటులు ! భళా
    కాముండే దున్నపోతు గణపతి కపియౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా ఉవాచ:

    నీమము వీడి కాంగ్రెసుడు నేతకు కోటుల రూకలిచ్చుచున్
    మామకు నత్తకున్ కొడుకు మాలిమి కూతుకు సీట్లనిచ్చుచున్
    ప్రేమను జూపి వోటులకు వేషము లెవ్విధి వేయునోయనన్:👇
    కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    A-1)
    పూర్వం పగటివేషాలు :
    [గ్రామపెద్దల ఆమోదం పొంది ఊరి జనాభా ననుసరించి
    7 లేక 10 లేక 15 రోజులు
    రోజుకో వేషం వేసేవారు(ఇప్పుడున్నాయో లేవో మరి)
    సితార-సినిమాలో చూడవచ్చు వీరిని]
    __________________________

    గ్రామములను పూర్వము గన
    నామోదము నొంది, పగటి - యాటల వేషాల్
    రాముడు, శివుడును, కృష్ణుడు,
    కాముండే, దున్నపోతు, - గణపతి, కపియౌ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా అసలు పూరణములు మొత్తం చూడకుండా అలరించు చున్నవి అలరించు‌చున్నవి అని ముందుగానె మాకు‌ బంధము‌ వేయుచున్నారే

      తొలగించండి
    2. మహాశయా !
      ఇంతవరకూ వచ్చినవి, అలరించినవి యనీ
      ముందు ముందు అలరించును గాన అలరించనున్నవనీ
      అనుకొనుచుండుట వలన అనుచున్నాను
      ఇందెవరికీ అభ్యంతరముండదనియే నా అభిప్రాయము

      తొలగించండి
    3. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. నీమము గా జనాంతమున నెమ్మిని బాసట చూప మిత్రులా
    క్షామ నివారణంపు సహకారపు ద్రవ్యము సేకరింప మా
    గ్రామము నందు నాటకము "రాముడు భీముడు" వేయగానట
    న్కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ఈ నాటి శంకరా భరణము

    సమస్య కంద గర్భ పాద తేట గీతి


    శంకరుని దృష్టి సోకంగ చచ్చె‌ నెవరు,

    యముని వాహన మేదియో వ్యక్త పరుచు,

    రంభ తనయుని పేరేమి,రామ భక్తు

    డనగ భాసిల్లు నెవ్వరో ఘనత నొంది,

    ధరణిజ యనగ నెవ్వరు,దాన వారి

    ధోర ణంబేది,(కాముండే దున్న పోతు

    గణపతి ,కపియౌ,)సీతమ్మ గరుడ పక్షి

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    B-1)
    పూర్వం పగటివేషాలు :
    [గ్రామపెద్దల ఆమోదం పొంది ఊరి జనాభా ననుసరించి
    7 లేక 10 లేక 15 రోజులు
    రోజుకో వేషం వేసేవారు(ఇప్పుడున్నాయో లేవో మరి)
    సితార-సినిమాలో చూడవచ్చు వీరిని]
    __________________________

    గ్రామము లందు పూర్వ మతి - కన్నుల పండుగ రోజు వేషమున్
    కామము దీరునట్లు జన - కాండము మెచ్చగ వేసె నివ్విథిన్
    రాముడు, నర్థనారి, ఘన - రక్కసి, కృష్ణుడు, వామనుండుగన్
    కాముఁడు, దున్నపోతు, గణ - నాథుడు, మర్కటమూర్తియౌఁ గనన్
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    B-2)
    వరుసన్ గనగా :
    __________________________

    సోమధరుండు చేసెనుగ - చూర్ణము నెవ్వని? సౌరి వాహనమ్
    బేమి? పరాత్పరుం డయిన - భీషణుపుత్రుల బెద్ద యెవ్వరో ?
    రాముని భక్తిమై రమణి - రామను జూచిన వాడెవండనన్ ?
    కాముఁడు, దున్నపోతు, గణ - నాథుడు, మర్కటమూర్తియౌఁ గనన్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  9. ఏముం దనిజగ మందున
    క్షేమం బులుకరు వాయె క్షీణత్వ మునన్
    క్షామము పెరుగెను మమతల
    కాముండే దున్నపోతు గణపతి కపియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "క్షేమము కరువాయె మిగుల క్షీణత్వమునన్" అందామా?

      తొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ప్రేమగ తండ్రి పుత్రులకు పేళ్లను బెట్టెను పెద్దవాడనన్
    గాముడు, చిన్నవాడు గణనాథుడు., వారలు ధూర్తులైరి, యా
    గ్రామజనాళి యిర్వురకు రమ్యసునామములిచ్చిరివ్విధిన్
    కాముఁడు దున్నపోతు !, గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నీమముతోడ దైవమును నిత్యము దిట్టుచు నాస్తికత్వమున్
      గ్రామములందు బట్టణవరంబులయందును జేరి యెల్లెడన్
      దామసుడై వచించెడి విధానము నేర్చిన మందబుద్ధికి
      న్గాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్"

      తొలగించండి
    3. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. శ్రీలక్ష్మి... సాక్షి రంగారావు...

      సోమనిభాస్య! చూడు! పొగచూరెను దేవునిబొమ్మలన్నియున్!
      ధూమము వేయ వేయనిది తొండమొ తోకయొ పోల్చలేక నే...
      నేమని ప్రస్తుతింతు? వినవే ! కనిపించెనిటుల్ పరాకునన్
      కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్.!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  11. భామ రతి పతి యెవండు? త్రి
    ధాముండేమెక్కు? నేక దంతుడెవడో
    రాముని బంటును తెలుపుము
    కాముండే, దున్నపోతు, గణపతి, కపియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "దంతుం డెవడో/దంతు డెవండో" అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  12. (ప్రిన్సిపల్ రమణ విద్యార్థుల క్విజ్ లో వేసిన ప్రశ్నలు-వారి జవాబులు)
    " హైమవతిన్ శివున్ గలుప
    హ్లాదము మీరగ వచ్చెనెవ్వడో ? "
    " నీమముతోడ దండధరు
    నెప్పుడు మోసెడి జంతువెద్దియో ? "
    " ప్రేమము నిండ భక్తులకు
    ప్రీతిని గూర్చెడి దైవమెవ్వరో ? "
    " రాముని జానకిన్ గలుప
    రాక్షసలంక నెవండు గాల్చెనో ? "
    " కాముడు " " దున్నపోతు " " గణ
    నాథుడు " " మర్కటమూర్తి " యౌ గనన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నాల్గవ పాదంలో యతి? మూడవ పాదం ద్రుతాంతం కావాలి కదా!

      తొలగించండి
    3. " రాముని సేవలో మురిసి
      రంజిలె నెవ్వడు. భక్తిపెంపునన్ " అని సరిచేశానండీ !
      ధన్యవాదాలు .

      తొలగించండి


  13. సోమరి వలె పని లేని స
    కాముండే దున్నపోతు, గణపతి! కపియౌ
    వేమారులటునిటు తిరుగు
    సామర్థ్యమ్ముకలవాడు సాధించుటలో!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. నీమములేని నేతలకు,నిత్యమునీతులు బూతులేగదా!
    సామము దానభేదములు, సర్వమువారికి దండగై చనన్
    కోమలులంతదిట్టుకొన ,కోపముతోనటనూగువారికిన్
    కాముడెదున్నపోతు,గణనాధుడుమర్కటమూర్తియౌగనన్ .

    రిప్లయితొలగించండి
  15. ప్రేమకు సాధురూపమని పెద్దలునమ్ముచుపెండ్లిజేయగా
    కామపువహ్నిలోనలుగు కాంక్షల గుర్రమువాడెయైనికన్
    నీమములన్ని వీడెగద,నిందలుమోయుట నాకు నచ్చడీ
    కాముడెదున్నపోతు,గణనాధుడుమర్కటమూర్తియౌగనన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "వాడెయై యికన్" అనండి.

      తొలగించండి
    2. మూడవ పాదం చివర ద్రుతం ఉండేవిధంగా సవరించండి. లేకుంటే నాల్గవ పాదంలో యతిభంగం.

      తొలగించండి
  16. ఏమంటిరి గురువర్యా
    కాముండే దున్నపోతు, గణపతి కపియౌ?
    కాముఁడురతిపతి గిరిజా
    స్తోముని కొమరుడుగణపతి శోకములుడుపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గిరిజాస్తోముడు'?

      తొలగించండి
    2. నమస్కారం గురువుగారూ! గిరిజాదేవిచే స్తుతింపబడువాడను భావముతో ఆపదప్రయోగం చేశాను.

      తొలగించండి
  17. రామునిరాజ్యమేమయెను?రంజిలుచున్ననయోధ్య రాష్ట్రమే
    కాముకు సంఖ్య హెచ్చగను,కన్నులుమిన్నును గానకున్న యా
    పాములవంటివారలకు, పావనమూర్తులు వారిదృష్టిలో
    కాముడెదున్నపోతు,గణనాధుడుమర్కటమూర్తియౌగనన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..గానకున్న నా..." అనండి.

      తొలగించండి
    2. "దృష్టిలోన్" అనండి. లేకుంటే నాల్గవ పాదంలో యతిభంగమౌతుంది.

      తొలగించండి
  18. రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      తృతీయపాదాంతంలో "...ఇఱ్ఱియౌన్" అనండి. లేకుంటే చతుర్థపాదంలో యతిభంగమౌతుంది.

      తొలగించండి
    2. అవునండి, ధన్యవాదములు

      రాముడు, కాముడున్ శివుడు రంజిలగన్ గణనాథు లర్మిలిన్
      నామము లొక్కరొక్కరకు నల్వురు చేర్చిరి, క్రొత్తవందులన్
      రాముడు నశ్వమౌ శివుడు రాసభమౌ చతురాస్యు డిఱ్ఱియౌ
      న్గాముడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్

      తొలగించండి


  19. భామల మది కెలుకునెవడు?
    స్వామి యముని వాహనమెది ? శంకరి తనయుం
    డో? మదిని రాముని నిలిపె?
    కాముండే; దున్నపోతు; గణపతి; కపియౌ.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. కాముడు గణపతు లిరువురు
    సోమవ్వకు సుతులు వారు సోమరు లనుచున్
    భామకు పతి చెప్పె నిటుల
    కాముండే దున్నపోతు గణపతి కపియౌ

    రిప్లయితొలగించండి
  21. లేమ రతికి పతి యెవడో?
    ఏమెక్కును యముడు ? మసుతు నే మందు రొ కో ?స్వామి హనుమంతు డెవరో?
    కాముందు: దున్నపోతు :: గణపతి ::కపియూ

    రిప్లయితొలగించండి
  22. వ్యామోహమునకు కతమగు
    నేమనబడు మొద్దగు నరు డిక్కుల ద్రోలున్
    నీమము దప్పిన వాడే
    కాముండే; దున్నపోతు; గణపతి; కపియౌ!

    రిప్లయితొలగించండి
  23. ఏమని జెప్పుదు నా మతి
    భూమీ క్షణమే పగిలియు పొడిపొడి కానీ
    నీమము నేదప్పినచో
    కాముండే దున్నపోతు, గణపతి కపియౌ!

    రిప్లయితొలగించండి
  24. ఆమని రాతిరి బారుకు
    రాముడు రాననగ వాని లాగచు బోవన్
    యా మందు మహిమ నచట
    కాముండే దున్నపోతు గణపతి కపియౌ

    రిప్లయితొలగించండి
  25. కామందు రామయ సుతులు
    భూమండలమున్ కనముగ పోకిరు లిటులన్
    ఏమం దిరువురు పశువులు
    "కాముండే దున్నపోతు గణపతి కపియౌ"

    రిప్లయితొలగించండి
  26. కామము పెంచునదెవరో
    వాముని వాహనమదేమి వారసుడెవరో
    రాముని బంటెవరు దలప
    కాముండే దున్నపోతు గణపతి కపియౌ

    రిప్లయితొలగించండి
  27. గురువులకు నమస్సులతో 🙏🙏

    నామది చెప్పగ వినదే
    కాముండే దున్నపోతు, గణపతి కపియౌ
    పొమ్మని చెప్పిన పోదును
    యేమని రాయుదు నిటులన నేనిక నిపుడున్!

    😞😞
    కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోదును + ఏమని' అన్నపుడు యడాగమం రాదు. "పోయెద । నేమందును" అనండి.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురుదేవా .. మార్చుకొందును 🙏🙏

      తొలగించండి
  28. నీమము,సమయములేకను
    గామముతోమెలగుచుండి కలకాలమునున్
    నేమియుపనియునుజేయని
    కాముండేదున్నపోతుగణపతికపియౌ

    రిప్లయితొలగించండి

  29. థామసు గీయు చిత్రముల తప్పుడు పేర్లకు నవ్వకుందుమా?
    సోముడు సూర్యుడై మెరియుఁ జూడగ భీముడు కుంభకర్ణుడౌ
    రాముడు లక్ష్మణుండగును రావణుఁ డత్తరి విష్ణుమూర్తియౌన్
    కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్

    రిప్లయితొలగించండి
  30. నీమములేకయుండగను నెమ్మినిభోగములందుమెల్గగా
    న్గాముడుదున్నపోతుగణనాధుడుమర్కటమూర్తియౌగనన్
    గోమలిమానసంబెఱిగికోరికదీర్చుటయొప్పుగావునన్
    నేమరుపాటులేకనిక,నవ్విధినుండుమశ్రీనివాసుడా!

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కాముడు దున్నపోతు గణ నాథుడు
    మర్కట మూర్తియౌఁ గనన్

    సందర్భము: సీతను చూసివచ్చిన హనుమంతునితోగూడి వానరులు కిష్కింధ వెలుపల సుగ్రీవుని మధువనం చేరుకున్నారు. అతని మేనమామ దధిముఖుడు రక్షిస్తున్నాడు. అంగదుని అనుమతితో వారు తేనెలు పీకలదాక తాగి కేకలు వేశారు.
    గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్
    నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్
    పతంతి కేచిత్ విచరంతి కేచిత్
    ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ 14
    (సుం.కాం. 61 స)
    కొందరు పాడుతున్నారు. కొందరు మొక్కుతున్నారు. కొందరు ఆడుతున్నారు. కొందరు నవ్వుతున్నారు. కొందరు పడిపోతున్నారు. కొందరు పచార్లు చేస్తున్నారు. కొందరు ఎగురుతున్నారు. కొందరేవో ప్రేలుతున్నారు.
    ఒకడు దేవతల పేర్లు మరొకడు జంతువుల పేర్లూ గబగబా చెప్పా లనుకున్నారు బుద్ధికి తోచినట్టు.. అర్థరహితంగా..
    వాళ్ళకు అనటమే గాని అర్థం ప్రధానం కాదు. ఒకడు ఇంద్రుడు చంద్రుడు అంటుంటే మరొకడు పిల్లి కుక్క అంటున్నాడు.
    వాళ్ళు అర్థాన్ని ఉద్దేశించటం లేదు. వాళ్ళు పలుకుతుంటే యాదృచ్చికంగా స్ఫురించటంవల్ల మనం అర్థాన్ని అనుసంధిస్తున్నాం. (అదీ పద్య సందర్భం)
    విధ్వంసిత పత్ర పుష్పా లున్న చెట్లను చూసి దధిముఖుడు దండించబోయి భంగపడి వెళ్ళి సుగ్రీవునితో వాపోయినాడు. సుగ్రీవుడు దండిస్తా నంటే లక్ష్మణుడు వ ద్దన్నాడు.
    వాళ్ళు విచ్చలవిడిగా మధువు తాగుతూ కోలాహలంగా ఆనందిస్తున్నా రంటేనే సీత జాడ కనుక్కొనే వుంటారు. లేకపోతే సుగ్రీవాజ్ఞ పట్ల భయభక్తు లున్న వానరులు సీతమ్మను కనుక్కొనకపోతే కాలాతీతమయిం దని భయంభయంగా వస్తారు గాని నిశ్చింతగా ఆనందంగా అలాంటి పనులు చేయరు కదా!
    సుగ్రీవు డర్థం చేసుకొని సంతోషించి "తిరిగి తిరిగి వచ్చి అలసట తీర్చుకున్నారులే!" అని క్షమించాడు.
    వృక్షవాటి = వనము
    కేరు = విజృంభించు, పరిహసించు
    అభిధ = పేరు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    రాముని దేవిఁ గన్గొనిన
    రాముని దూతను గూడి వానరా
    లా మధు వృక్షవాటి మధు
    వానుచుఁ గేరుచు నిట్లు దేవతా
    నామము లొక్క, డొక్కడు ధ
    నాధన జంత్వభిధల్ వచించెడిన్..
    "గాముడు" "దున్నపోతు" "గణ
    నాథుడు" "మర్కట మూర్తి యౌఁ గనన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    9.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  32. ఓ మిత్రోత్తమ భద్ర
    మ్మేమఱకుండుమ సతమ్ము నీ దుష్టున కీ
    వీ మనుజుం డకటా స
    త్కాముండే దున్నపోతు గణపతి! కపియౌ


    పాము విధమ్ము నుండు జన వారము నిత్యము వెంట నుండగా
    నీ మతి హీనకార్యముల నెంచి మనమ్మున విఱ్ఱ వీగుచున్
    దోమ తెఱంగు బాధ లిడు దుష్ట మనో౽క్రమ విత్తరాశికిన్
    గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తియౌఁ గనన్

    [గణనాథుఁడు = దళపతి]

    రిప్లయితొలగించండి
  33. కామముకండ్లుగప్పుకొన కామనలన్నియు గాల్చెవహ్నులై
    గ్రామమునందు వారినిక గ్రామపుసిం హములంచు బిల్వగా
    నీమముచెడ్డవారలిక,నీవిగమార్చిరియాడకూతురున్
    కాముడుదున్నపోతు గణనాధుడు మర్కటమూర్తియౌగనన్
    ++++++++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  34. కం.

    కాముని పోలిక మఱియును
    ద్వైమాతు నడక దెలుపన త్వరితమె, వినుమా
    యేమనె తుంటరి యల్లన
    కాముండే దున్నపోతు గణపతి కపియౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. గోముగ నధ్యాపకుడనె
    "రామా యీ రూపక మిల రంజిల్లంగా
    గోమాతకు నీవే సరి,
    కాముండే దున్నపోతు, గణపతి కపియౌ!"
    (జంతువుల పాత్రలతో ఒక నాటకమును విద్యార్థులచే ప్రదర్శింప జేయ దలచిన అధ్యాపకుడు బాలురతో ఇట్లనెను.)

    రిప్లయితొలగించండి
  36. కామినులన్గనుంగొనఁగ కామము కన్నులఁగప్పియున్నచో
    గాముఁడు దున్నపోతు, గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్
    నీమముగాచరించుమహనీయుడు, నీతివిహీనుడైనచో
    నమ్ము క్రమంబుగా భువిని, నమ్మిచరింపగ నెమ్మి జీవికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర ద్రుతం ఉంటేనే సమస్యాపాదంలో యతి కుదురుతుంది. కనుక "కన్నులఁ గప్పి యున్నచోన్" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు! సరిచేస్తాను.
      కామినులన్గనుంగొనఁగ కామము కన్నులఁగప్పియున్నచోన్
      గాముఁడు దున్నపోతు, గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్
      నీమముగాచరించుమహనీయుడు, నీతివిహీనుడైనచో
      నమ్ము క్రమంబుగా భువిని, నమ్మిచరింపగ నెమ్మి జీవికిన్

      తొలగించండి
  37. కందం
    మా మనుమడు చెడగొట్టుచుఁ
    బ్రేమ నిడంగ చరవాణి వింతగఁ జూడన్
    దేముళ్లు చిట్లిన తెరన్
    గాముండే దున్నపోతు గణపతి కపియౌ!

    ఉత్పలమాల
    మా మనుమండు నాడుకొని మంచిగఁ జేతనుఁ బెట్టిపోవగా
    నేమిటి వీడు నే నడుగకే యిడె వింతగ! నంచుఁ జూచుచున్
    దేముని చిత్రముల్ తెరను దీయుచు గాంచగ నే పగుళ్లతో
    న్గాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'దేముని' అనడం సాధువు కాదు.
      చివరికి మీ మనుమణ్ణి పద్యంలోకి ఎక్కించేశారు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. మనుమడు చరవాణితో ఆడేంతటి వాడుకాలేదు. అదో కల్పన.

      తొలగించండి
  38. భామిని కేళినీ రమణి భర్తయె వండని యడ్గుచుంటినో
    వామ! లులాపమన్న తెలుపంగవలెన్, గజ కర్ణుడె వ్వడో?
    యేమరుపాటులేక సతి నెవ్వడు కన్గొనె లంక యందు న
    న్కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కట మూర్తియౌఁ గనన్

    రిప్లయితొలగించండి
  39. సేమము గోరివచ్చితిమి, సేవలుజేసెదమంచుజెప్పుచున్
    దోమలు డెంగివాయనగ ,దోచిరి యావిడ మానప్రాణముల్
    కామపువహ్నివారినిల ,గాల్చెనుబూదిగ కాలవాహినిన్
    కాలుడె దున్నపోతు,గణనాధుడెమర్కటమూర్తియౌ గనన్
    +++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  40. ప్రేమకు సాధురూపమని పెద్దలునమ్ముచుపెండ్లిజేయగా
    కామపువహ్నిలోనలుగు కాంక్షల గుర్రమువాడెయైయికన్
    నీమములన్ని వీడుటయు ,నిందలుమోయుట నెందుకోయనన్
    కాముడె,దున్నపోతు,గణనాధుడు,మర్కటమూర్తియౌగనన్ .
    [సవరణ పాఠము ధన్యవాదాలతో]

    రిప్లయితొలగించండి
  41. కాముండును గణపతియును
    వేమయ్యయు పోతరాజు వేంకటపతులే
    'డ్రామా' వేసిరి యందున
    "కాముండే దున్నపోతు గణపతి కపియౌ"

    రిప్లయితొలగించండి