31, డిసెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3237 (కాంతకు వీడుకోలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే"
(లేదా...)
"కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్"

113 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    పొంతము మీరగా నగుచు ప్రొద్దున రాత్రిని రోజురోజునన్
    శాంతము సౌఖ్యమున్ విరివి సంతస మిచ్చెడి వేళనందునన్
    కాంతయె గర్భమున్ కొనగ గంతులు వేయుచు కాన్పు కోసమై
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పొంతము పోవగా నసిగి ప్రొద్దున రాత్రిని రోజురోజునన్
    శాంతము సౌఖ్యమున్ విరిచి సర్దుకు పోవుట చేతగాకయే
    కాంతయె దయ్యమౌచు వడి గంతులు వేయగ నెత్తిమీదనున్
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    విసిగి వేసారిన భర్త తలపోత :
    __________________________

    సుంతయు నోపిక లేకను
    సంతత మత్తను స్వజనుల - సటలంబెట్టున్
    సాంత మశాంతియె గావున
    కాంతకు వీడ్కోలు వలుకఁ - గాఁ దగు నేఁడే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  4. A-2)
    నచ్చిన భార్యను మెచ్చిన భర్త తలపోత :
    __________________________

    శాంతను భార్యగ బొందితి
    సంతస మెంతయొ గలిగెను - స్వాంతము బొందెన్
    శాంతిని; యిక వెలవెలదుల
    కాంతకు వీడ్కోలు వలుకఁ - గాఁ దగు నేఁడే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    బాధతోనైనా...హితమ్ముఁ గోరుచున్ :
    __________________________

    చింతల సూర్యకాంతమును - చిక్కుడు భాస్కరరావు పెండ్లి నాడగా
    సాంతము నొక్క వత్సరము - శాంతిగ సౌఖ్యము నొందె సఖ్యతన్ !
    కాంతయె దాల్చె గర్భమును ! - కానుపు కోసము పుట్టినింటికిన్
    కాంతకు వీడుకోలు వలు - కం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్
    __________________________
    చింతల, చిక్కుడు - యింటి పేర్లు

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "చిక్కుడు భాస్కరు పెండ్లియాడగా" అందామా?

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సవరణతో :
      B-1)
      బాధతోనైనా...హితమ్ముఁ గోరుచున్ :
      __________________________

      చింతల సూర్యకాంతమును - చిక్కుడు భాస్కరు పెండ్లియాడగా
      సాంతము నొక్క వత్సరము - శాంతిగ సౌఖ్యము నొందె సఖ్యతన్ !
      కాంతయె దాల్చె గర్భమును ! - కానుపు కోసము పుట్టినింటికిన్
      కాంతకు వీడుకోలు వలు - కం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్
      __________________________
      చింతల, చిక్కుడు - యింటి పేర్లు

      వసంత కిశోర్ (కవులూరు రమేష్)

      తొలగించండి
  6. B-2)
    నీ సుఖమే నే కోరుతున్నా :
    __________________________

    భ్రాంతిని ప్రక్క వీటి, శివ - భార్గవితో తొలి చూపు నందున
    న్నెంతయొ ప్రేమలో బడితి - నివ్విధి యౌనని నేనెరుంగనే ?!!
    వింతగ పెండ్లి యాయె, తను - వీడెను మా పురి మెట్టినింటికై !
    కాంతకు వీడుకోలు వలు - కం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను'ను 'తను' అనరాదు. "పెండ్లియై చెలియ వీడెను.../పెండ్లియయ్యె సతి వీడెను..." అందామా?

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సవరణతో :
      B-2)
      నీ సుఖమే నే కోరుతున్నా :
      __________________________

      భ్రాంతిని ప్రక్క వీటి, శివ - భార్గవితో తొలి చూపు నందున
      న్నెంతయొ ప్రేమలో బడితి - నివ్విధి యౌనని నేనెరుంగనే ?!!
      వింతగ పెండ్లియై చెలియ - వీడెను మా పురి మెట్టినింటికై !
      కాంతకు వీడుకోలు వలు - కం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్ !
      __________________________

      వసంత కిశోర్ (కవులూరు రమేష్)

      తొలగించండి
  7. B-3)
    https://www.youtube.com/watch?v=i3uJnr1LmxM
    కలయిదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే :
    __________________________

    ఎంతయొ ప్రేమగా మసలి - రింతకు మించిన వారు లేరనన్
    వింతయె గాదె వేలుపదె - వేరగు నట్లుగ జేసె పార్వతిన్
    చింతను దేవదా, విధి వి - చిత్రపు చేష్టకు ఖిన్నుడౌచు, నా
    కాంతకు వీడుకోలు వలు - కం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్ !
    __________________________
    దేవదా - పార్వతి దేవదాసును పిలుచు కొనే ముద్దు పేరు

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  8. అంతంబగుచుండె దశక
    మంతంబగుచుండె కాంతిమతియై జ్యోతి
    స్సంతయు నింపి! రమణి! యీ
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. స్వాంతనమున్ జిలేబివలె చక్కగ చేర్చె జనాళి మేలుకై
    నెంతయొ చేయిదోడయె మనీషిత గాదశకమ్ముగా వెలుం
    గంతయు నిల్పె దీనులకు నాసరగానిలిచెన్! శుభాంగి యీ
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్!

    రాబోవు కొత్త దశకమ్మునకు స్వాగతం
    పలుకుతూ
    ౨౦౧౦ దశకానికి బాయ్ బాయ్ అంటూ

    చీర్సు సహిత
    జిలేబి
    కాలవాహిని
    అలల వాటున సాగి పోవుట సులభతరమే
    అలల నెదరొడ్డి సాగి పోవుట సులభతరమే ?


    రిప్లయితొలగించండి
  10. భృగు మహర్షి విష్ణుమూర్తిని హృదయము పై తన్నగా లక్ష్మి దేవి వైకుంఠము వీడి వెళ్ళి పోవు సందర్భము




    శాంతము కలుగ దిచట, శ్రీ
    కాంతకు వీడ్కోలు వలుకఁ గాఁ దగు నేఁడే
    కాంతాళము చూపక కుల
    కాంతకు బండు నిడెననుచు కాంతుని వీడెన్


    రిప్లయితొలగించండి
  11. ఎంతయు నలసెను మనకై
    నింతటి వరకును శుభములు నిడుమల దెచ్చెన్
    సంతసముగ నీ వత్సర
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  12. ఎంతయు నలసెను మనకై
    నింతటి వరకును శుభములు నిడుమల దెచ్చెన్
    సంతసముగ నీ వత్సర
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  13. చెంతకుజేరె నీవిసుగు,చింతల బాపుదునంచు నప్పుడున్
    శాంతియుసామరస్యమును సంతసమున్,కడుచేదుబాధలున్
    ధ్వాంతమునింపెనీ నడచు వత్సర భామిని పోవనెంచగా
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  14. చెంతకు చేరగ వచ్చెను
    పంతొమ్మిదికి భగిని యిరువది భువి నేలన్
    సంతసముఁ బాత వత్సర
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  15. శాంతము వహియించి యిడుము
    లం తము జేయంగ బూనె నవనిని సతము న్
    సాంత ము శ్రమియించి వెడలె
    కాంతకు వీడ్కోలు పలుక గా దగు నేడే

    రిప్లయితొలగించండి
  16. భృగు మహర్షి విష్ణుమూర్తిని హృదయము పై తన్నగా లక్ష్మి దేవి వైకుంఠము వీడి వెళ్ళి పోవు సందర్భము



    శాంతము తోడనా మునికి స్ధావము జేసెను నాధుడిచ్చటన్
    స్వాంతము వీడినా మగడు సాధ్వికి రక్షణ నీయకున్ననా
    కాంతకు మెట్టినిం టను సు ఖంబులు కల్గుట కల్లయౌనుశ్రీ
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్
    భ్రాంతి తొలంగె నాకనుచు పద్మిని యోచన చేసివీడెగా

    రిప్లయితొలగించండి
  17. సంతసమందుచున్ భువిని సన్నుత సచ్ఛుభ హర్షదీప్తు లా
    శాంతము నింపు నూత్నతమ హాయనమున్ గని స్వాగతించ స్వీ
    యాంతము జూడబోయెడి మహద్ద్యుతి దాయిని
    యైన యీ శర
    త్కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్"

    రిప్లయితొలగించండి
  18. వంతిక తనదని యిరువది
    పంతము బూని భువినేల పరుగున వచ్చెన్
    సంతసముఁ బాత వత్సర
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  19. సంతత శుభాశుభదగ ని
    శాంతాస్తంగత శశాంక సామ్యంబు పురా
    శాంతానుగమన వత్సర
    కాంతకు వీడ్కోలు పలుకఁగాఁ దగు నేఁడే.

    రిప్లయితొలగించండి
  20. సాంతమొకచోట వలదని
    ప్రాంతము నకొకటి గ మూడు పాయలు జేయన్
    శాంతిని మాన్పే యూహా
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాన్పెడి యూహాకాంతకు..' అనండి.

      తొలగించండి
  21. వింతలువేడ్కలున్గరము వేనకువేలను దెచ్చి యిచ్చెదా
    నంతియె గాదు కష్టములు నార్తుల గొన్నిటి బంచి యివ్వగా
    నెంతగ దా శ్రమించెనొకొ, యింక కృతజ్ఞత లిచ్చివర్షమన్
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్"

    రిప్లయితొలగించండి
  22. చెంతకు జేరవచ్చినది చింతలు బాపు నెపమ్ము తోడ వా
    సంతము పిల్వకున్ననను జాతగ జేరెను ధాత్రినేలెడిన్
    బంతము బూనివింశకము, పాతయుగాంశకమైన వృద్ధయౌ
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  23. పొంతనలేని వాక్కులకు, పొర్లగజేసిరమాత్యవర్యులే
    సుంతయు బుద్ధిలేకయిక,స్రుక్కగజేసిరి రైతు యాశలన్
    ప్రాంతియబేధముల్ రగిలి.ప్రాభవమంతయు గాల్చునీ విషో
    కాంతకువీడుకోలు,పలుకందగునేడు హితమ్ముగోరుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కర్షకాశలన్" అనండి. 'ప్రాంతీయ' అనడం సాధువు. 'విషోకాంత'?

      తొలగించండి
  24. వింతగ నూతన వత్సర
    మెంతయు సంతసముతోడ నేతెంచెనిదే
    చెంతకు; జరిగిన కాలపు
    కాంతకు వీడ్కొలుపల్కగా దగు నేడే.

    రిప్లయితొలగించండి
  25. కాంతల వలె వత్సరములు
    కాంతులు చీకటులతోడ కాలము గడచున్
    సంతుల వలె నా పూర్వపు
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  26. చింతలు పెరిగి పెరిగి పది
    యింతలు కానీ,వెఱవకు మెన్నటికైనన్
    సాంతము నిరాశ యనబడు
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే"

    రిప్లయితొలగించండి
  27. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
    *కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే*

    నా పూరణ 🌹

    చెంతను కవులను జేర్చుచు
    చింతలు దీర్చగ నిచటను చిరుకవి జేసెన్
    వింతగ నింతయు జేసిన
    *కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
      నా మరో పూరణ 🌹🌹

      చింతల నన్నియు వీడుచు
      నంతయు మన బాగుకే యననుకొనగా, నే
      శాంతిని కోరుచు బ్రతుకున
      *కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏💐🙏

      తొలగించండి
    2. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
      నా మరో పూరణ 🌹🌹🌹

      వింతయు విడ్డూరము లే
      దంతయు మిధ్యయె నిజమ్ము ధరణిన యెపుడున్
      సొంతము లేదిట బ్రాంతల
      *కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అని+అనుకొనగా' అన్నపుడు సంధి లేదు.
      'ధరణిని' అనాలి.

      తొలగించండి
  28. ఇంతగ ట్త్వంటీ నైంటీన్
    నంతంబగునేడు, వచ్చు నాట్వంటీల్ రెం
    డింతలుగ, మది దలచి నర ,
    కాంతకు, వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే.
    ---గోలి. 😐

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    "సంతత సంతసాంతరిత సన్నుత చిద్ఘనమోక్షరూపి" యన్
    గాంతను స్వాగతింపఁగను, క్రంతల వంతల పొంతఁ జేర్చు, పల్
    చింతల సంతఁ జెంతకును జేర్చుచు రంతులఁ దేల్చు "రక్తి" యన్

    గాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🙏 మధుసూదన్ గారు వృత్యనుప్రాసతో నృత్యం చేయించారు.చదివి సంతసాంతరితుణ్ణయ్యాను.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ! మీ యభినందనమునకుఁ గృతజ్ఞతాబద్ధుఁడను!

      తొలగించండి
    3. కవి పుంగవులు మధుసూదన్ గారు చిరకాల దర్శనము!
      “సంతసాంతరిత” సంధిని పునః పరిశీలనము చేయండి.

      తొలగించండి
    4. మధుసూదన్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      'సంతసము' తెలుగు పదం. దానిని 'అంతరిత'తో కలిపి సవర్ణదీర్ఘసంధి చేయరాదు కదా!

      తొలగించండి
    5. అవునండీ పోచిరాజువారూ! నేను గమనించనేలేదు. తెలిపినందులకు ధన్యవాదములు! సవరించిన పూరణ నీ దిగువనిచ్చుచున్నాను. పరిశీలించగలరు.

      "స్వాంత ప్రశాంత సంతత సుసన్నుత చిద్ఘనమోక్షరూపి" యన్
      గాంతను స్వాగతింపఁగను, క్రంతల వంతల పొంతఁ జేర్చు, పల్
      చింతల సంతఁ జెంతకును జేర్చుచు రంతులఁ దేల్చు "రక్తి" యన్
      గాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్!

      తొలగించండి
    6. పూరణ మమోఘమండి.
      “స్వాంత సశాంత” అన్న నిష్కళంక శశాంక సన్నిభమే.

      తొలగించండి
  30. సాంతముసుఖమయమగుచును
    జింతనలేలేకయుండిసేమమునిడుచున్
    శాంతముగాజనువర్షపు
    కాంతకువీడ్కోలువలుకగాదగునేడే
    (2019 వర్షము)



    రిప్లయితొలగించండి
  31. స్వాంతన పొందుట కొరకా
    సాంతము సీసాడుమందు స్వాహా చేతున్
    వాంతులగు వాసనకు నా
    కాంతకు- వీడుకోలు వలుకందగునేడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వాంతన పొందుట కొరకా
      సాంతము సీసాడుమందు స్వాహా చేతున్
      వాంతులగు వాసనకు నా
      కాంతకు- వీడుకోలు వలుకగాదగునేడే

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీడ్కోలు' టైపాటు. 'వీడుకోలు' అంటే గణభంగం.

      తొలగించండి
  32. భ్రాంతిని వీడి యా పరమ పావన సాధ్విని రాము పత్నినా
    శాంత మనస్కనా విమల సద్గుణ రాశిని జానకిన్నిర
    భ్యంతరమైన మార్గమున పంపుట మేలగు రావణా; నీవా
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివరణ గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సవరించానార్యా 🙏

      భ్రాంతిని వీడి యా పరమ పావన సాధ్విని రాము పత్నినా
      శాంత మనస్కనా విమల సద్గుణ రాశిని జానకిన్నిర
      భ్యంతరమైన మార్గమున పంపుట మేలగు నీకు రావణా,
      కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

      తొలగించండి
  33. మైలవరపు వారి పూరణ

    శ్రీరాముడు.. లక్ష్మణమూర్తితో..

    ఇంతటి నిందనెట్లు భరియింతును నే? రఘువంశకీర్తికే
    యెంతటి మచ్చ వచ్చునొ ? మహీజను కానల దింపి రమ్ము ! నా
    స్వాంతము నాకు దూరమయి బాధను కల్గగ చేయుచుండినన్
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  34. వింతలుజూపవచ్చెనదెవేడుకనూతన వత్సరంబునా
    వంతయు వంతలుండవిక వావిరిగా సుఖ శాంతి సౌఖ్యముల్
    సంతతఁ మందునెల్లరకు సంతసమొందుడు త్రుంగబోవు నీ
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  35. సాంతముమంచిజేసియునుసంతసమొందగనేగుచున్ననా
    కాంతకువీడుకోలువలుకందగునేడుహితమ్ముగోరుచున్
    శాంతముసౌఖ్యమున్నిడుచుసర్వజనంబులమెప్పుపొందుటన్
    శాంతికిపాతవత్సరముస్వాగతమీయగనొప్పుగ్రొత్తకున్

    రిప్లయితొలగించండి
  36. అంతము సేయుమ కోపము
    సాంతము విలయ మగు మానవాళి వసుధలోఁ
    బంతము ప్రత్యపకారపుఁ
    గాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే


    వింతగ నూత్న వత్సరము వేడుక మీఱఁగఁ బ్రీతిఁ జీరుచున్
    శాంతియు సౌఖ్య సంచయము సక్క నొసంగఁగ నెమ్మి వేడుచున్
    స్వంత సహస్ర యుగ్మ పర సప్తదశోత్తర యుగ్మ నామపుం
    గాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్

    [సు + అంత = స్వంత; మంచి యంతము గలది, బాగుగా ముగిసినది]

    రిప్లయితొలగించండి
  37. శాంతము సౌఖ్యమునొసగును
    సంతతమాగామినూత్న సంవత్సరమే
    శాంతిగగడచినవత్సర
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  38. కం.

    ఎంతయొ వేడగ నాలిని
    కంతుల క్రయమును వలదన కానని వేళన్
    చింతలు బాపగ గడుసరి
    కాంతకు వీడ్కోలుపలుకగా దగు నేడే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే"
    "కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు
    హితమ్ముఁ గోరుచున్

    సందర్భము: సీతాం చ రామాయ నివేద్య దేవీం వసేమ రాజ న్నిహ వీత శోకాః
    యు.కాం.15-14
    సీతను రామున కప్పగించి సుఖంగా వుందాం.
    అన్నాడు విభీషణుడు. రావణుని కా మాటలు కర్ణ కఠోరాలైనవి. నానా తిట్లూ తిట్టినాడు. విభీషణుడు నిష్క్రమించాలని నిశ్చయించుకొని నలుగురు రాక్షసులతో నింగి కెగిరి చివరి మాట లిలా అన్నాడు.
    న గృహ్ణం త్యకృతాత్మానః
    కాలస్య వశ మాగతాః 16-19
    మృత్యువుకు వశమైన బుద్ధిహీనులు హితవచనాలు వినరు కదా!
    స్వస్తి తేస్తు గమిష్యామి
    సుఖీభవ మయా వినా 16-25
    నీకు శుభ మగుగాక! నే నింక వెళుతాను. నేను లేకుండా నీవు సుఖంగా వుండు.
    ఈ నేపథ్యంలో వ్రాసిన సరళ పూరణలే ఈ పద్యాలు.
    పంతాన్ని విడిచి పెట్టాలి.
    లంకనూ కాపాడాలి. వంశాన్నీ కాపాడాలి. (రావణుని కామం ఈ రెంటితోనూ ముడివడి వున్నది.) ధర్మరహిత చింతకూ వీడ్కోలు పలుకాలి. జానకీ కాంతకూ వీడ్కోలు పలుకాలి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *విభీషణుని హితబోధ*

    పంతము వీడుము.. రామున
    కింతినిఁ దగ నప్పగింపు.. మిది ధర్మంబౌఁ..
    జింతింపు మన్న! సీతా
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే! 1

    పంతము వీడు మన్న! మన
    బంగరు లంకను గావు మన్న! చె
    ట్టంతటి వంశ మన్న! మన
    దబ్జజ జాతముఁ గావు మన్న! ఆ
    వంతనె తాళి, ధర్మ రహి
    తాత్మక చింతకు.. సాధ్వి జానకీ
    కాంతకు.. వీడుకోలు వలు
    కం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్ 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    31.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  40. వింతలు, గెలుపోటములును,
    చింతలు, కేరింతలు తన చెంతను జేరన్
    కాంతులు చిందిన వత్సర
    కాంతకు వీడ్కోలు పలుకగా దగు నేడే!

    రిప్లయితొలగించండి
  41. చింతల వంతల విడి నా
    వంతైనను దిగులు లేని బంగరు భవితన్
    స్వాంతనమొందగ వత్సర
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే

    రిప్లయితొలగించండి
  42. రిప్లయిలు
    1. వంతలఁ బాడగాఁ దమరి వాక్కులకున్ గురుదేవ! నేను, భల్
      వింతగ జూతురంత! ననుఁ బ్రేలుట మానుమటంచు నందురే!
      యింతియె లేనివాఁడ నికనెట్టులఁ బల్కుట? కేలు మోడ్చి యే
      *"కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్"*

      తొలగించండి


    2. శాంతము వలయు మనుమడా
      గంతకు తగినట్టి బొంత గాన్పడు వడి నీ
      చెంతకు వచ్చును ! నీవా
      కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగ దయ్యా :)


      ఆమెన్!
      మెడకో జిలేబి తగులుకొనుగాక
      వడ్డి, యానముగా బతుకు నీడ్వ :)



      జిలేబి

      తొలగించండి
    3. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      జిలేబి గారూ,
      మెడకు అమ్మాయి తగులుకోవాలి కాని అమ్మమ్మ తగులుకుంటే ఎలా?

      తొలగించండి
  43. రిప్లయిలు
    1. శ్రీరామచంద్రుడు వనవాసమున కేగు సమయంలో అయోధ్యలోని విజ్ఞుల పలుకులు...

      కందం
      కాంతారమునకు పతితో
      సంతోషముగా వెడలెడు జానకిఁ గనుచున్
      పొంతన గల నిర్ణయమన
      కాంతకు వీడ్కోలు పలుకఁగాఁ దగు నేఁడే!

      ఉత్పలమాల
      ప్రాంతరమేగు రాముఁ గని వచ్చెద నే వనవాసమంచుఁ దా
      శాంత ప్రపూర్ణయై బలుక జానకి, చింతిలు వారిఁ జూచుచున్
      వింతయు గాదు వెళ్లుటది విజ్ఞతగా బుధులాడిరిట్టులన్
      కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్





      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  44. సుంతయుసిగ్గులేకయొక , సుందరిజెప్పు మతంపు మార్పులన్
    వింతలుగానె జూడదగు, విజ్ఞులు యట్టివినెప్పుడేనియున్
    పొంతనలేని వాక్కులవి,పోరురగల్చక ముందుముందునా
    కాంతకు వీడుకోలు, పలుకందగునేడు హితమ్ముగోరుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విజ్ఞులు + అట్టివి' అన్నపుడు సంధి నిత్యం. 'అట్టివి + ఎప్పుడు' అన్నపుడు నుగాగమం రాదు.

      తొలగించండి
  45. పొంతనలేని వాక్కులను, పొర్లగజేసిరమాత్యవర్యులే
    సుంతయు బుద్ధిలేకయిక,స్రుక్కగజేసిరి రైతు యాశలన్
    సాంతము వీడిపొమ్మనెడు, సంకరనేతల పాలనౌ దిశా
    కాంతకువీడుకోలు,పలుకందగునేడు హితమ్ముగోరుచున్.
    ---------------------------------------
    రావెల పురుషోత్తమరావు
    [సవరణ పాఠము ధన్యవాదాలతో]

    రిప్లయితొలగించండి
  46. వింతలుజేసిజూపుదును, వీధికి నెక్కగజేతుమిమ్ములన్
    సుంతయుసిగ్గులేనిమరి, సుందరులందరు రేవుపార్టిలో
    అంతయు విప్పదీసియిక ఆరడిబెట్టెడు కోర్కెజెప్పు నా
    కాంతకువీడుకోలుపలుకందగు నేడు హితమ్ముగోరుచున్

    రిప్లయితొలగించండి
  47. చింతల తోబాటు మనకు
    సంతోషమ్మిడుచు సతము సాగచు మనకున్
    వింతలు చూపిన వత్సర
    *కాంతకు వీడ్కోలు పలుకగా దగు నేడే*

    రిప్లయితొలగించండి
  48. సుంతయుసిగ్గులేకయొక , సుందరిజెప్పు మతంపు మార్పులన్
    వింతలుగానె జూడదగు, విజ్ఞులవన్నియు యెప్పుడేనియున్
    పొంతనలేని వాక్కులవి,పోరురగల్చక ముందుముందునా
    కాంతకు వీడుకోలు, పలుకందగునేడు హితమ్ముగోరుచున్.
    ++++++++++++++++++++++++++++++++++++++++++++++++

    [సవరణ పాఠము ధన్యవాదాలతో]

    రిప్లయితొలగించండి
  49. పంతముమామమేలుపరిపాలనపైనిక దృష్టిబెట్టగా!
    వింతగమాటలాడుటది విజ్ఞులతీరది గాదు మీకికన్ !
    కొంతలొకొంత శాంతమును కోరి వరించుటమేలు దుష్కృతౌ
    కాంతకు వీడుకోలు బలుకందగు, నేడు హితమ్ముగోరుచున్

    రిప్లయితొలగించండి