కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది ....
"అవధానిని రాజమండ్రి యడలం జేసెన్"
(లేదా)
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది ....
"అవధానిని రాజమండ్రి యడలం జేసెన్"
(లేదా)
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
భవనం బందున నిద్దురోవకనయో బ్రహ్మాండమౌ తీరునన్
పవలున్ రేయిని కుస్తిబట్టుచునహో ప్రాబ్లెమ్లు సృష్టించెడిన్
కవులన్ జూచుచు నవ్వులన్ కురుపుచున్ కాకమ్మ తానిట్లనెన్:
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండి'నిద్దురోవక' వ్యావహారికం. కురుపుచున్...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆర్యులకు నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండిసరదా పూరణ
శివధనసు విరువ నాకున్
యవలీలగ కనబడునుగ యవనిన నిపుడున్
ఎవరు పిలిచినను బోనుగ
*అవధానంబన రాజమండ్రి యడలం జేసెన్"*
కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి..
🙏🌹🙏🌹🙏
ప్రత్యుత్తరంతొలగించు
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండినాకున్+అవలీలగ... అన్నపుడు యడాగమం రాదు మీ పద్యానికి నా సవరణ ..
శివధనువును విరువగ నా
కవలీలగ గనపడుగద యవని నిపడు నే
నెవరు పిలిచినను పోనిక
నవధానము రాజమండ్రి నడలం జేసెన్.
ధన్యోస్మి ఆర్యా🙏🙏
తొలగించండిమా రాజమండ్రి మిమ్మల్ని ఇబ్బంది కలిగించిందనే బాధ ఉన్నా .. నా పూరణ మీరు మొత్తం రాయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండివారికేమి ఇబ్బంది కలిగించిందండి రాజమండ్రి ? బ్రేకింగ్ న్యూస్ యేమైనా వుందా :)
తొలగించండి"తిరుగు ప్రయాణానికి రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకున్నాను. నేను రిజర్వేషన్ చేయించుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ దాదాపు 9 గం. లేటట. అంటే రేపు ఉదయం 9 గం. లకు ఎక్కాలి. అందువల్ల జనరల్ టికెట్ తీసుకుని ఏ రైలు వస్తే అది ఎక్కుదామని ఎదురు చూస్తున్నాను."
కం. శం.
తొలగించండిgps:
"ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ దీదీది కదా...ఆ మాత్రం పెడసరం ఉండదా మరి...ఏ రాస్తా రోకో లోనో ఆపి వేసి ఉంటుంది"
తొలగించండి"కాకినాడ నుండి సికింద్రాబాద్ స్పెషల్ ట్రెయిన్ ఎక్కాను. జనరల్ టికెట్ తీసుకుని.... సీటు దొరికింది."
కం. శం.
తొలగించండి"రాజమండ్రి ఏమాత్రం ఇబ్బంది కలిగించలేదు. ఇబ్బంది కలిగించింది రైల్వే శాఖ.
అవధాన నిర్వాహకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు ఏర్పాట్లు చక్కగా చేసారు. మధ్యాహ్నం భోజనం చాల బాగుంది""
కం. శం.
తొలగించండిమవురిన్ వాయించి నను బి
లువవచ్చిరిగా యనుచు తళుకులీనెడు ప
ట్టువలువల ధరించి వెడల
నవధానిని రాజమండ్రి యడలంజేసెన్!
జిలేబి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
లవలేశమ్మును సిగ్గువీడుచునహో రంగమ్మునన్ దూకుచున్
పవలున్ రేయిని టీవి జూచుచునయో పాకమ్ములన్ మానుచున్
నవలల్ బోలెడు నవ్వుచున్ చదివెడిన్ నానమ్మగారిట్లనెన్:
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికవి! యూతగొమ్మ తెలుగున
కు! విమలపు హృదయులకున్ను ! కొంత గలదు చిం
త విదురుల పురమ్మన! నా
యవధానిని రాజమండ్రి యడలం జేసెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
నూతన యవధానిని :
__________________________
కవికుల శ్రేష్ఠుల పురమున
సవాలు విసురుచు పలువురు - సంభృతశ్రుతులే
వివరణ దెలియని నూతన
యవధానిని రాజమండ్రి - యడలం జేసెన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
కవికుల శ్రేష్ఠుల/కవికుల వృషభుల
తొలగించండి[ల-గురువౌతుందేమోననే అనుమానముతో]
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికవి పుంగవ నిల యంబై
రిప్లయితొలగించండిభువనంబున వెలుగు లీ ను పు రి యందున దా
నవ ధా నము మొద లిడ నా
య వ ధా నిని రాజ మండ్రి యడల o జే సె న్
ప్రశస్తమైన పూరణ అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
గరికిపాటివారి మాట :-పదకొండో కాన్పు కయినా నొప్పులు తప్పనట్లు
నూటపదకొండో యవధానమైనా మొదటి యవధానము వలె కించిత్
భయమూ బెంగా తప్పవు
B-1)
ఒక అవధాని స్వగతం :
__________________________
కవితాస్ఫూర్తియు, నాశుదారయును, యు - క్తాయుక్త ప్రాసంగిక
న్నవధానంబుల నెన్నియో గడపె, నూ - హాతీత ప్రావీణ్యతన్
కవితాశ్రేష్ఠుల కాలవాలమది, శ - క్యంబౌనె నాకిచ్చట
న్నవధానంబఁట రాణ్మహేంద్రవరమం - దయ్యో భయం బయ్యెడిన్ !
__________________________
ప్రాసంగిక = ప్రసంగానుకూలంగా జరిగినది
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
నాశుదారయును/నాశుధారయును
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి( "ఒకరి కంటె ఒకరు ఘనులైన విద్వాంసు లున్న రాజమహేంద్రవరంలోనా ?నా అవ ధానమా !" అనుకొంటున్న నవావధాని )
రిప్లయితొలగించండికవనార్థంబుదయించినట్టి సుకవుల్
గాంభీర్యపాండిత్యులై
జవనాశ్వంబుల భంగి గంతులిడు వా
గ్జాలంబుతో బద్యముల్
వ్యవధానం బదిలేక గూర్చెడి మహా
భాషోగ్రసౌగంధ్యమౌ
యవధానంబట రాణ్మహేంద్రవరమం
దయ్యో ! భయం బయ్యెడిన్ .
(జవనాశ్వంబులు - వేగంతో పరుగెత్తే గుర్రాలు ; వ్యవధానము - ఎడం )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం..
అవధానంబఁట రాణ్మహేంద్రవరమందయ్యో!
భయంబయ్యెడిన్
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమందయ్యో!
భయంబయ్యెడిన్
నవతారుణ్యవయస్కులీ శతవధానంబెట్లు పండింతురో
వివిధాంశమ్ముల" నంచు దేవతలు సంవీక్షింప., నయ్యారె! వీ...
రవలీలన్ విజయమ్ము పొందిరిట దీవ్యజ్జ్ఞానసంపత్తితో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అవధాని యడుగు బ్రశ్నకు
తొలగించండినవధానిద్వయము పద్యమవలీలనిడన్
కవివర! యడుగగ వచ్చిన
అవధానిని రాజమండ్రి యడలన్ జేసెన్!!
(ప్రాశ్నికులలో చాలామంది అవధానిమిత్రులున్నారు.అందరూ మన్నింతురు గాక)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి.
తొలగించండిగురువుగారూ ఒక శంక..
రిప్లయితొలగించండిఅవధానులె పృచ్ఛకులట
యవధానులు నద్భుతముగ నమరిన వారై
యవధానముఁ జేయగ నే
"యవధానిని రాజమండ్రి యడలం జేసెన్!?"
ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఅవధులుదాటినవిజ్ఞత
రిప్లయితొలగించండినవలోకించంగనాటియవధానములో
కవులరుదెంచుటకనుగొన
అవధానిని రాజమండ్రి యడలం జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిస్తవనీయుండను నన్ను గొల్వుడనుచున్ సంధించి యాహార్యమున్
రిప్లయితొలగించండికవినంచున్ జరియించువాని విధమున్ గన్గొన్నవారచ్చటన్
భవదీయప్రభ జూపు మీ సభననన్ వాడాత్మ నిట్లెంచె "నా
కవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినన్ బిల్వ నవధానంబునకు నేనేమి చేతురా లింగా :)
ప్రవరాఖ్యుల్ గలరా పురమ్మున! సభన్ ప్రాంగమ్ము వాయింతురే!
కవులై పండితులై జనాళి యలవోకంగన్ తృటిన్ చేతురే
చవులూరించెడు పద్యముల్! బిలిచిరే చట్టంచు రమ్మంచు! నా
యవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్!
నే రాను గాక రాను :)
జిలేబి
మీ పూరణ మనోరంజకంగా ఉంది అభినందనలు
తొలగించండిఅవధానుల నిలయమ్మిది
రిప్లయితొలగించండిఅవధానిని రాజమంద్రి యడలంజేసెన్
యువకుని భయపెట్టుటయా
నవయువకుల ప్రోత్సహించు నగరమునందున్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిమీ పేరు?
తొలగించండిబుచికి
అవ! వాగ్దేవీ! నేడీ
రిప్లయితొలగించండియవధానిని రాజమండ్రి యడలం జేసెన్!
కవితా మాలలు నీకిడి
స్తవమున్ జేతును చదువుల తల్లిని శాబ్దిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండివ్యవధానంబును లేకయె
రిప్లయితొలగించండినవ మురళిన్ 'మైలవరపు నైపుణ్యముకున్
కువకువ లాడుచు పదపడి
అవధానిని రాజమండ్రి యడలంజేసెన్.
'
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండినైపుణ్యమునకున్.. అనడం సాధువు.
కవివర నిలయము,పావన
రిప్లయితొలగించండిసవనంబుల కాటపట్టు,ఛాందసవిదులే
అవలీలగ ప్రశ్నలడుగ
నవధానిని రాజమండ్రి యడలగజేసెన్
ఛాందసవిదులు = వేదవిదులు. రాజమండ్రి వారికి ప్రసిద్ధికదా!
వారు పృచ్ఛకులౌదురో కాదో నేనెరుగను.అయినచో అవధాని భయమందునని పూరించడమైనది!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిమవురిన్ వాయించి నను బి
లువ వచ్చిరిగా యనుచు తళుకులీనెడు ప
ట్టువలువల ధరించి వెడల
నవధానిని రాజమండ్రి యడలంజేసెన్!
ఆహా! రాజమహేంద్రి :)
జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఅవిరళభాషాసంపద
రిప్లయితొలగించండికవనపురూపంబునిచ్చుగవులుండియునున్
స్తవనీయుండగుమాయీ
యవధానినిరాజమండ్రియడలంజేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅవలీలగ లలితుడచట
నవధానము చేసెనంట ! నాకింక జిలే
బి,విధురమకొ యనుచు వెడల
నవధానిని రాజమండ్రి యడలంజేసెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఈ నాటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండిఅవధానిని , రాజమండ్రి యడలం జేసెన్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో సరదాగా వ్రాసినది సుమీ
కర్నూలు కుంజేర ఘనులైన కవుల సమ్మేళన మునుగాంచ, మేళ తాళ
ముల తోడ యెదురొచ్చి పలుక రించిరి కార్యకర్తలు, చక్కగ కడుపు నిండు
గ ఫలహారములను కమ్మని కాఫీని యిచ్చి,వాసమునకు యేసి రూము
బుక్చేసి నారుగా, పూల బాటను పరచి వేదిక వద్దకు వెంట బెట్టి
కొని వెళ్ళి నారుగా, ఘనముగ వీడ్కొలు బలుకుచు కర్నూలు ప్రజలు చివరి
వరకు వెన్నంటియే తిరుగాడి నారుగా, రాజ భోగము కల్గు రాజ మండ్రి
లోనని తలచుచు తాను వెడల కార్య కర్త లెవ్వరు నట కాన కుండె,
పోనిలే యనుచు తా ఫోన్జేయ పలుకలే దొక్కరన్నను తా, వెదుకుచు వెడల
వేదిక వద్దకు, మోదమగు పలుక రింపులు కరువాయె, చంపు కొనుచు
కోపము నచ్చోట కూర్చుండ భోజన ములకైన నెవ్వరున్ పిలువ కుండె,
తిరుగు ప్రయాణము కొరకు తా స్టేషనుకున్ వెడల నచట కొన్ని గంట
లాలశ్య ముగ వచ్చు రైలీ దినమునని తెలుప ,సంఘటనలు కలవరము ప
రచె (నవధానిని , రాజమండ్రి యడలం జేసెన్) గదా కవి శ్రేష్టి యనుచు
మనసు ఘోషించు చుండగన్ తనను తట్టి
లేపె మిస్సన్న కవి,నిద్ర లెమ్ము శంక
రార్య వచ్చుచున్నది మన రైలు ననగ
కంది వారు లేచెనపుడు కలను వీడి
మీ పూరణ బాగున్నది .అభినందనలు
తొలగించండికాని రాజమండ్రి వారి ఆతిథ్యం బ్రహ్మాండం
భువిపైనతి సుందరులగు
రిప్లయితొలగించండిజవరాండ్రకు రాజమండ్రి జన్మస్థలి యా
జవరాండ్ర చయమ్ములతో
నవధానిని రాజమండ్రి యడలంజేసెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఅవధార్యంబిది జూడ రండికను పద్యాత్మీయ సమ్మేళన
రిప్లయితొలగించండిమ్మవకాశమ్మిది పద్య ప్రేమికుల కాద్యంతమ్ము సంతోషము
న్నవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
వ్యవధే లేదిక జక్కబెట్టవలె కార్యమ్ముల్ ప్రయాణమ్ముకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవతంసకమౌ పండిత
రిప్లయితొలగించండికవిదలమవధానమందు కవనమె శరమై
యవఘళమున రాలుచు నవి
అవధానంబన రాజమండ్రి యడలం జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండివ్యవహారంబును పూర్తిచేయనగు నవ్యాజంపు వర్ఛస్సుతో
కవితా గోష్ఠిన ధారణా పటిమ పక్కాబట్టు వాగ్ధాటిని
న్నవలీలన్ దన ప్రజ్ఞనున్ దెలుప నన్నా నేడు నేమౌ నటో
నవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవివరు నిజ విద్వత్పా
రిప్లయితొలగించండిటవ సంవీక్షణ మతిం గుఠార ప్రహ రా
భ విశిష్ట ప్రాస నొసఁగి
యవధానిని రాజమండ్రి యడలం జేసెన్
కవి శార్దూలము సాన్య ధీ వితతి సత్కారార్థ చింతా మతిన్
ఛవి సంపూరిత పద్య భేషజ రస క్షార ప్ర భోన్మత్తతన్
దివికిం బంపఁగ నెంచఁ బౌర మృగముల్ దీనార్త లై పాఱఁగా
నవధానం బఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిదీనార్తముల్ గా సవరణము.
తొలగించండిఅవధానంబుననారితేరినమహామేధావులచ్చోటనే
రిప్లయితొలగించండినవధానంబులుసేయనేర్వగనుబాహాటమ్ముముందుండగా
నవధానంబటరాణ్మహేంద్రవరమందయ్యోభయంబయ్యెడిన్
గవిశార్దూలురుభీతిలింగరికనెక్కాలంబునైనన్సుమీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
అవరోధమ్ములనెల్ల ద్రుంచుచు నటన్నష్టావ ధానమ్ము లో
రిప్లయితొలగించండిసువిధానుండగు పండితోత్తముడు నాశూరుండ్రెయౌ పృచ్ఛకుం
డ్రవిరామమ్ముగ సల్పు యుద్ధమది యత్యాసక్తిఁ గల్గించెడి య
య్యవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం చివర గణదోషం. సవరించండి.
మువురాంధ్రీకరణంబు జే సిరట సమ్మోదంబుగా భారతం
రిప్లయితొలగించండిచవులూరించు విధంబు న ల్గురును మెచ్చేడట్లు గా వ్రాయగన్
కవులేనాడును సాహసించరు పరీక్షించన్ యెదుర్కోరటన్
అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భారతం.. మెచ్చేడట్లు...ఎదుర్కోరు'అనడం వ్యావహారికం. రెండవ,మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
కవిరాణ్మండలి కాలవాలమది, సాక్షాచ్ఛారదా ధామమున్
రిప్లయితొలగించండిఛవిమద్భారతమాంధ్రమైనభువి సాహిత్యా కృతా గారమున్
అవధానీంద్రులదెంత వారయిన నిట్లాడంగబో నయ్యెడున్
అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండినా మరో పూరణ 🙏🙏
రిప్లయితొలగించండి*"అవధానిని రాజమండ్రి యడలం జేసెన్"*
*కం::*
అవధానము నవలీలగ
కవి వర్యులు జేయగలరు ఘనముగ నెపుడున్
ఎవరనుకొని యిటుల జరిగె,
అవధానిని రాజమండ్రి యడలం జేసెన్!
**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
🙏🌸🙏🌸🙏
అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
తొలగించండినా మరో పూరణ 🌹🌹🌹
*"అవధానిని రాజమండ్రి యడలం జేసెన్"*
*కం::*
అవురా గోదావరియున్
నవనాడులు మీటగ నిట నవధానులునున్
చివరకు యిటులనెను గదా
*అవధానిని రాజమండ్రి యడలం జేసెన్"*
**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
🙏🌸🙏🌸🙏
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి శంకరార్యా 🙏🙏
తొలగించండిఎవరెన్ని చెప్పిన జనులు
రిప్లయితొలగించండిసువిదులె మా రాజమండ్రి జూపరు కెపుడున్
వివరముగ దెలుపు మెందుకు
అవధానిని రాజమండ్రి యడలం జేసెన్ ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవనమొనర్చెనువీరుల
రిప్లయితొలగించండిజవసత్వములుండువరకు చాలనమందన్
యువకవులతోడ నలరెను
అవధానము రాజమండ్రి నడలంజేసెన్!!
*సవరణతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసువిదుడు = సేవకుడు , రాజు
రిప్లయితొలగించండి(దేనికైనా తగుదురు రాజమండ్రి వాసులు. మరి పుట్టి పెరిగిన మమకారం )
కవి సింహంబులు సాహి
రిప్లయితొలగించండిత్య విశేషజ్ఞులునమేయతత్వవిదగ్ధుల్
అవధానము గనరాన్ యువ
అవధానిని రాజమండ్రి యడలం జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'యువ+అవధాని = యువావధాని' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా!
కవి సింహంబులు సాహి
తొలగించండిత్య విశేషజ్ఞులునమేయతత్వవిదగ్ధుల్
అవధానము గనరానా
యవధానిని రాజమండ్రి యడలం జేసెన్
సవరించిన పద్యం చిత్తగించండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో
భయం బయ్యెడిన్"
సందర్భము: కవిత్వాన్ని ఆధ్యాత్మికంకోసం వాడుకునే అతను అంటున్నాడు ఆధ్యాత్మికాన్ని కవిత్వంకోసం వాడుకునే అతనితో..
"భవమే రోగ మని, దాన్ని తొలగించే ఔషధమే పరతత్వ మని తెలుసుకోకుండా ఆ తత్వాన్ని చింతన చేయలేకుండా వున్నారు.
శబ్ద క్రీడలలో మున్గి కాలక్షేపం చేస్తూ భావ గమ్యుడైన రాముని మాత్ర మెరుగలేకున్నారు. అనుచితమైన ఆలస్యం చేస్తున్నారు.
ఈరోజూ ఏదో అవధాన మట!
భీతిని వినాశనం చేసే రాముణ్ణి అభయ ప్రదాతయైన రాముణ్ణి భజించడానికి ప్రీతి బూనడం లేనే లేదు. అవధానం (వేదాధ్యయనం) చేస్తున్నారు గాని వేదవిదుడైన రాముని పట్టించుకోవటం లేదు.
(ఐహిక దృష్టియే ప్రధానమైన కారణాన వేదాధ్యయనమూ ఐహిక ప్రయోజనానికే వినియోగించబడుతున్నది.) ఈరోజుకూడ ఏదో అవధాన (వేదాధ్యయన) మట రాణ్మహేంద్రవరంలో.. "
(భీతి వినాశనం చేసే రాముణ్ణి భజించడం లేదు గనుక వీళ్ళకు భయ మెప్పుడూ వుండనే వుంటుంది.)
అవధానాలూ ఆత్మ స్తుతికే పనికి వస్తున్నాయి. వేదాధ్యయనాలూ పొట్టకూటికే పనికివస్తున్నాయి.
(అంటే అన్ని ప్రతిభలూ అల్పమైన భౌతిక సుఖాలు పొందడానికే పనికివస్తున్నాయి.
ప్రధానమంత్రి వద్దకు వెళ్ళి వేయి రూపాయ లిమ్మని అడిగినట్టు...)
అవధానము = వేదాధ్యయనము,
సాహిత్యంలో అవధానము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
భవ రోగఘ్నము తత్వమున్ మరచి శ
బ్దక్రీడలన్ మున్గి వే
ద విదున్ రాముని భావగమ్యు నెఱుగన్
తాత్సారమున్ జేసి భీ
తి వినాశైక కరున్ భజింపగను బ్రీ
తిన్ బూన రీ నా డెదో
యవధానం బఁట రాణ్మహేంద్రవరమం
దయ్యో భయం బయ్యెడిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
30.12.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్యాపూరణం
రిప్లయితొలగించండిఅవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
రవళింపన్ చెవులందుదుష్టమశకారావంబు లారీలుప
ద్రవమేదోఘటియిల్లునోయనగరౌద్రారావముల్ చేయగా
నవరోధంబులరోడ్డుమధ్యసభధ్వన్యానందసంభూతమై
అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
గాదిరాజుమధుసూదనరాజు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాజమండ్రిలో సదనం కాలేజీలో ప్రశాంతంగా, ధ్వనికాలుష్యం లేకుండానే శతావధానం జరుగుతున్నది.
1973 లో బోదకాలుదోమలు భయపెట్టి ..పండితులను బాధించటం అనుభవైకవేద్యం
తొలగించండిచేతనైనంతవరకు సవరణతో
రిప్లయితొలగించండిమువురాంధ్రీకరణంబు జే యనట సమ్మోదించిరైదవ శృతిన్
చవులూరించు విధంబు న ల్గురును ప్రస్తావించు నట్లుండగన్
కవులేనాడును సాహసించరు పరీక్షన్ జేయ నిచ్చించరే
అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్
శృతి = వేదము
ఐదవ శ్రుతిన్... అన్నచోట గణభంగం.
తొలగించండి🙏🏽 ధన్యవాదములు
రిప్లయితొలగించండికం. కవితలుఎవరివొ తనవని
రిప్లయితొలగించండికవిగోష్ఠులతిరిగివెలిగె కవియని యొకడున్
అవధానిగతనుతగునన
అవధానిని రాజమండ్రి యడలం జేసెన్.
మనవస్తువు కానిది గొన
రిప్లయితొలగించండిమనకందవలసినదెపుడు మహినందదయా
మనకువలసినది దైవము
మనలకు రానీయబోడు మహిలో వినుమా
కందం
రిప్లయితొలగించండిఅవధానులు పృచ్ఛకులు! ని
లువరించెడు కిటుకు లెఱిఁగి ప్రోకులుఁ గట్టన్
ప్రవచించు గుబులు నింపుచు
నవధానిని రాజమండ్రి యడలం జేసెన్
మత్తేభవిక్రీడితము
ప్రవరుల్ నన్నయ లాది పండితులకున్ ప్రాపౌచు నుద్ధండులై
యవధానంబున మేటివౌ కిటుకులాద్యంతమ్ము సారించెడున్
స్తవనీయుల్ కొలువౌచు పృచ్ఛకులు
గన్ సాధింతురన్ భ్రాంతిమై
నవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్