ఉదయము పదకొండు గంటలైనా వీధుల్లో మంచుకురుస్తుండడంతో సూర్యుడు కనిపించక పోవడం వల్ల ఎదుట ఏముందో తెలియనంతటి చలి దేశాల్లో ఉదయానంతరం ఒక శ్రీమతి తన శ్రీవారితో....
తెలతెల వారు చుండ నది తీరము వెంబడి సంచరింపగన్ జలజల పారు నీరు మది చక్కని ఊహల నోల లార్చ నే పలుకులు రాని చందమున ప్రాంతము వీక్షణ గాంచుచుండ గా చలిపులి పల్క రించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మిలమిలలాడు గ్రీష్మమున మీసము త్రిప్పగ చిత్రభానుడే
జలముల మేఘు డత్తరిని చాపము లీనుచు పారిపోవగా
కిలకిల నవ్వుచున్ రతపు క్రీడకు రమ్మని కన్నుగొట్టుచున్
ౘలిపులి పల్కరించగనె ౘయ్యనఁబారె సహస్రరశ్మియున్...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కులుకుచు కాలు దువ్వుచును కూరిమి జూపుచు శీతకమ్మునన్
బలుపగు పంజ చూపుచును బంజర హిల్సున గాండ్రుపెట్టుచున్
వలపులు మీర రమ్మనుచు వంకర టింకర చేష్టలొల్లుచున్
ౘలిపులి పల్కరించగనె ౘయ్యనఁ బారె సహస్రరశ్మియున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలువలు వికసించు ఘడియ
రిప్లయితొలగించండిజలజలమని రాల తుహినజాలము భువిపై
జలజములు తలలువంచగ
చలిపులిగని వేవెలుంగు చయ్యనబారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
ఐదవ ఝాములో :
__________________________
కలుహారము కనువిప్పెను
చలిపులిఁ గని వేవెలుంగు - చయ్యనఁ బాఱెన్ !
కొలనున వెన్నెల మిలమిల
జలజములే వాడి పోయె - సరసిని జూడన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅలుకను మానుమిక సఖీ
చలిపులిఁ గని; వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
నులివెచ్చగ కప్పుకొనెద
నెలతుక రావే సరసకు నెయ్యము బారన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅలిగితి వా సఖీ ప్రియతమా! అలుకన్ సరి మానవే వయా
రి! లలిత మైన రాత్రి యిదె రివ్వున నాదరి రా! జిలేబి! నీ
పలుకుల తీపు గాత్రమగు పారునికై చెలి రావె రావె! ఆ
చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అలిగితివా? సఖీ! ప్రియ! అలుక మానవా?" పాటను గుర్తు చేసారు.
రిప్లయితొలగించండిఆకాశవాణి కి పంపినది :)
విలవిల లాడి చిక్కగను భీకర కోరల ధాటి చీల్చుచున్
దులుపుచు జూలు గుర్రనుచు దూకగ చట్టని పైన, పారెనా
చలి, పులి పల్కరించగనె, చయ్యన పారె సహస్ర రశ్మియున్
జలజల పారగా కనుల చందిరమయ్యరొ వీడె స్వప్నమే
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండినమో నమః :) ఆకాశవాణి విశేషములేమిటి ?
తెలుపగలరు
జిలేబీ, తిరుపతి నుండి.... అని మీ పూరణను విట్టుబాబు చదివారు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
భార్య కోపము సహస్ర సహస్ర రశ్ములకు సమానం : :
__________________________
వలపది నీకు లేదనుచు - భర్తను దూరము నెట్ట వెంటనే
యలుకను దీర్చ నార్యుడదె - హాటక హారము దెచ్చి యిచ్చినన్
పొలుపున ప్రేమ హెచ్చుటను - పొంద సుఖంబును, భర్త కౌగిలిన్ !
చలిపులి పల్కరించగనె - చయ్యన పారె సహస్ర రశ్మియున్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలపుల కౌగిలింతలకు వారిజ నేత్రి శుభోద యమ్మునన్
రిప్లయితొలగించండిపులకిత మైన మేను పరిపోషణ జేయగ కోరినంతనే
ఫలితము చూడ కుండగనె భానుని వేడిమి తాళ లేకనా
చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తాళలేక యా...' అనండి.
తెలవారె నంచు నడుగిడి ,
రిప్లయితొలగించండిచలిపులి గని వేవెలుంగు చయ్యన పారెన్,
వలదొర రగిల్చె గా నిం
గలము ననుచు పతి పిలచెను గాదిలి నపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచలికాలమందున వలయు
రిప్లయితొలగించండివలువలను తొడిగిన గూడ వదలని రీతిన్
నలిపెట్టుచుండి యుండిన
చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
పారు = ప్రసరింౘు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలతలు రేపకు చెలియా
రిప్లయితొలగించండివలపుల వెన్నెల సౌరులు వంచన జేయన్
కలసిన మనసుల ప్రేమను
చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచలిపులియన్నమార్గడియె,సంక్రమణంబగురాశిచక్రముల్,
వలచినరంగనాధునుని పాటన సేయగ మాలలల్లుచున్
పలికెడి పాశురంబులవి భక్తుల పాలిట సంధికాలమై
చలిపులి పల్కరించగనె చయ్యన
బారెసహస్త్రరశ్మియున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅలఘు ముదంబు గూర్చు "హరియాణము" రాష్ట్రములందు మేటియై
రిప్లయితొలగించండినిలిచితి నైదువర్షములు నిష్ఠను బూనుచు నందు వర్షముల్
కలుగుట యబ్బురంబు, బహుకాలము గ్రీష్మమె నిండియుండి యా
చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమలమల మాడ్చఁ భాస్కరుడు మైత్రము నందున గాంచి క్రుద్ధుడై
రిప్లయితొలగించండితొలకరి జువ్వరించగను ద్యుమ్నము తగ్గిన వృద్ధ భానుడే
విలవిల లాడువేళ భువిఁ వేడ్కగఁ జేరిన సీతుకందువౌ
చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్.
. - విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం
చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున
ఇలకు మరింత దగ్గరగ నీవు చరించి దహించునట్టి యెం..
డల సమయమ్ము కాదిదినుడా! వలపుల్ రగిలింతు నే జనా...
వలులకు., మిత్ర! జాలి గనవా! యని చేతులు మోడ్చి మ్రొక్కుచున్
చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉదయము పదకొండు గంటలైనా వీధుల్లో మంచుకురుస్తుండడంతో సూర్యుడు కనిపించక పోవడం వల్ల ఎదుట ఏముందో తెలియనంతటి చలి దేశాల్లో ఉదయానంతరం ఒక శ్రీమతి తన శ్రీవారితో....
రిప్లయితొలగించండిచంపకమాల
జలజల ధారగా హిమము జారుచు నుండెడు కుండపోతతోఁ
జలిపులి పల్కరింపగనె చయ్యనఁ బాఱె సహస్ర రశ్మియున్
విలవిలలాడుచున్ వడకి వేదనఁ జెందితె రాతిరంతయున్
గొలువుకుఁ బోదు రెట్లు? పదకొండయినన్ గనరావు వీధులున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెలరేగి గ్రీష్మమందున
రిప్లయితొలగించండినలసిన రవిపై జలపతి యలకయె బూనన్
బలహీనుండై శీతపు
చలిపులిఁగని వేవెలుంగు చయ్రనఁ బాఱెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమలయ సమీరము వీచెను
రిప్లయితొలగించండికలవర పాటున రవియును కను మరు గ య్యెన్
విలవిల లాడెను జీవులు
చలి పులి గని వే వెలుగులు చయ్యన బాఱెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలపుల వానలోదడిసె ,వారిజనేత్రులు విస్తుబోవగా
రిప్లయితొలగించండికులుకులుకుమ్మరించుచును,కూనలుతోడుగవచ్చిరందరున్
పిలిచినబల్కు రాగములు, పిన్నలుపాడగ సుప్రభాతమున్
చలిపులిపల్కరించగనె ,చయ్యన బారె సహస్రరశ్మియున్
********************************
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగిలగిల కొట్టుకొంచు తెగ
రిప్లయితొలగించండిగింజుకొనంగగ జేయు మారియున్ ;
మెలికల ద్రిప్పుచున్ జనుల
మేనుల స్వారిని సల్పు మాయయున్ ;
బలుపగు నున్నిదుప్పటుల
బారుల నన్నిటినిన్ జయించు - నా
చలిపులి పల్కరించగనె
చయ్యన బారె సహస్రరశ్మియున్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివెలుగులుజిమ్మువేదికలు, వెల్లలువేసినరీతిమారెలే
రిప్లయితొలగించండికలుగులదాగుకోరికలు,కాలపువహ్నినగాలె బూడిదై
ములుకులగుచ్చెయమ్మకిట, ముద్దుగగోరుచు నాంగ్లభాషనే
చలిపులిపల్కరించగనె ,చయ్యనబారె సహస్రరశ్మియున్
+++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...గ్రుచ్చె నమ్మకిట...' అనండి.
తెలతెలవార మంచుతెర దిక్కుల నిండ వడంకుచున్ జనుల్
రిప్లయితొలగించండివెలుపల సంచరింపక తపింపఁ గడున్ నెగడుల్ రచించి వే
వెలుఁగు ప్రభూతుఁడౌ ననుచు వేచిన వేళ హిమాని రూపమౌ
జలిపులి పల్కరించగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
ఛలికి హిమాంశు శేఖరుడు జాతశృతీయుతనేత్రుడై చనెన్
రిప్లయితొలగించండికలితవినీలతన్వియు నఖండ సహస్ర ఫణాభి రక్షతన్
నిలిచె మహోగ్ర శీతల వినీతులు గాక జనంగ శక్యమే
చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్"
సవరించిన పద్యం చిత్తగించండి.
రిప్లయితొలగించండివచ్చేవారం ఆకాశవాణి వారి సమస్య...
రిప్లయితొలగించండి*దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్*
గురువారం సాయంత్రం లోపల చేరేటట్టుగా
Padyamairhyd@gmail.com కు పంపవలెను.
ఈరోజు ఆకాశవాణిలో ప్రసారం:
రిప్లయితొలగించండిచలిమలనుండివీచు చలిగాడ్పు వణంకగజేయనెల్లరున్
చలనములేని చిత్తరువుచందముదుప్పటులందుమున్గి యే
ఫలితముగానరాక నభపాంథుడె దిక్కని చూచునంతలో
చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్
మెలకువ రాదు వేకువను మెల్లగ జారెను నీమ నిష్ఠలున్
రిప్లయితొలగించండితలపులనైన దైవమును ధ్యానము జేయగ దల్పనద్దియున్
చలిపులి పల్కరించగనె చయ్యన పారె; సహస్ర రశ్మియున్
వెలవెలబారె మింట దన వేడిమి దగ్గెను శీతకాలమున్
(ఆకాశవాణికి పంపినది)
ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
రిప్లయితొలగించండిసమస్యాపూరణ కార్యక్రమంలో...
21/12/2019 శనివారమైన నా పూరణ
సమస్య. :
**** ****
ౘలిపులి పల్కరించగనె ౘయ్యనఁ బారె సహస్రరశ్మియున్*
నా పూరణ. చంపకమాల
**** *** ***
చెలయుచు విస్తరిల్లు భువి శీతలమే చలికాలమందునన్!
విలవిలలాడదే తనువు వేదనజెందుచు మిక్కటమ్ముగన్
ౘలిపులి పల్కరించగనె?.... ౘయ్యనఁ బారె సహస్రరశ్మియున్
విలసిత దేహ కాంత నులివెచ్చని కౌగిట జేరినంతటన్!
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
చం:
రిప్లయితొలగించండితెలతెల వారు చుండ నది తీరము వెంబడి సంచరింపగన్
జలజల పారు నీరు మది చక్కని ఊహల నోల లార్చ నే
పలుకులు రాని చందమున ప్రాంతము వీక్షణ గాంచుచుండ గా
చలిపులి పల్క రించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్
వై. చంద్రశేఖర్
21/12/2019
రిప్లయితొలగించండిగురువులందరికీ నమస్సుమాంజలి 🙏🙏
*చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్*
*కం:||*
చలి తనువున పెరుగుట యా
చలిపులిఁ గని, వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
ఇల నీ శృంగార తళుకు
కులుకులు జూచుచు నిలబడి కుదురే లేకన్!
**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏💐🌸🙏💐🌸🙏
అలికులవేణిచింతిలెనవారితశీతమువ్యాప్తిచెందెనే
రిప్లయితొలగించండిచలిపులిపల్కరించగనె,చయ్యనపారెసహస్రరస్మియున్
దెలతెలమబ్బుదొంతరలుదివ్యమునందుననోలలాడుచున్
విలసిలుగాంతిపుంజములువేలకువేలుగనింగిచుట్టలై
రిప్లయితొలగించండిమేమే కుంపటి రాజేస్తామండి మాయింట్లో :)
విలవిల లాడుచు చచ్చితి
చలిపులిఁ గని; వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
మెలకువ పొద్దుపొడిచిన తృ
టి లెస్స గా వచ్చె కుంపటిని రాజేయన్ !
జిలేబి
సలసలకాగుదేహమది ,సన్నిహితత్వముగోరుటేలనో?
రిప్లయితొలగించండివలపులవానలోదడిసి,,వాసిని బొందిన ప్రేమపక్షులే
తెలతెలవారిపోయినను,తేరగముద్దులతేలుచుండ యా
చలిపులిపల్కరించగనె ,చయ్యనబారె సహస్రరశ్మియున్
***********************************
రావెలపురుషోత్తమరావు
కొలఁకులఁ దామర తండ
రిప్లయితొలగించండిమ్ములు వికసించఁ బ్రవిమల నభోమార్గములో
నలయక ధిక్కారమ్మునఁ
జలిపులిఁ గని, వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
నలుదిశ లందుఁ గ్రమ్ముకొన నాకము నంటుచు నంధకారమే
వెలవెల వోవ పద్మములు పిన్నలు పెద్దలు చూచు చుండగం
గలవర మంది యబ్బురముగం బగ లక్కట సైంహికుండు గ్రొం
జలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్
వెలుపలలోకమంతయును,వేదికయాయెనుమంచువానకున్
రిప్లయితొలగించండికులుకులుమానివేయుచును ,కూటమిగట్టితలొంచె పూవులే
సలసలకాగు దేహములు,సంగమతత్వము వీడకుండగా
చలిపులి పల్కరించగనె ,చయ్యనపారె సహస్రరశ్మియున్
++++++++++++++======
రావెలపురుషోత్తమరావు
సమస్య: చలిపులి పల్కరించగనె చయ్యన బారె సహస్రరశ్మియున్ (ఆకాశవాణి)
రిప్లయితొలగించండిచ: పులకలు రేపె మంచుతఱి పుష్కరమున్ రవి నిష్క్రమించ వే
చలిపులి పల్కరించగనె చయ్యన బారె సహస్రరశ్మియున్
వలపుల రాజు వేగముగ బాణములన్ విడువంగ యామినిన్
చెలి దరిచేరె వల్లభుడు సీత భయమ్ముఁ బాప నెంచుచున్
చలిమలకేగివచ్చితిని,చారునగమ్మున భీతిజెందితిన్,
రిప్లయితొలగించండితలపుల తన్నుకొచ్చితివి,తాపసినైతిని వెంటవెంటనే
చిలుమును తుప్పునే వదలజేయుము,చెంతకువచ్చినంతనే
చలిపులిపల్కరించగనె,చయ్యన బారె సహస్రరశ్మియున్
--------------------------------------------
రిప్లయితొలగించండితెలవారి టీ సరసనా
జిలేబి గొని దానితోడు చిన్నగ విజిలే
యు లలన్తికాసమస్యల
చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్!
జిలేబి
అలికులవేణియెభీతిలె
రిప్లయితొలగించండిచలిపులిగనె,వేవెలుంగుచయ్యనబాఱెన్
వెలుగులఱేనింగనుగొని
నిలనరయుముసూర్యచంద్రులిరువురుసఖులే
రిప్లయితొలగించండిపిలువగ నెచ్చెలీ మధుర వీణియ రాగ సరాగ గీతికల్
వలపుల పండుగల్ సలిపె పాయని వేడుక ప్రేమికుండు ఆ
చలిపులి పల్కరించగనె; చయ్యన పారె సహస్రరశ్మియున్
మిలమిల లాడు మేఘముల మేలి ముసుంగు ధరించెనో యనన్.
విలవిలలాడు మేనులకు వేడియొసంగును నూలువస్త్రముల్
రిప్లయితొలగించండిచలిపులి పల్కరించగనె, చయ్యన బారె సహస్ర రశ్మియున్
కలువల ఱేనిరాకగని కమ్మగ చీకటి లోకమందునన్
కులముగ పక్షులన్నియును గూళ్ళకు బోవుచునుండె మిన్నునన్!!!
చం. వెలుగులతో ప్రభాకరుడు వేసవి తాపము చింది నంతటన్
రిప్లయితొలగించండిఫలము లొసంగ రైతునకు, వర్షము గోరుచు నూరడిల్ల నా
కలుముల గూడి వచ్చు హిమ కాంతకు జిక్కె గదయ్య! చూడగా
చలిపులి పల్కరించగనె చయ్యన బారె సహస్ర రశ్మియున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె
సహస్ర రశ్మియున్"
సందర్భము:
"న హ్యహం జీవితుం శక్త
స్తా మృతే జనకాత్మజామ్.."
సీత నెడబాసి నే నెంతమాత్రం జీవించలేను.
(కి.కాం. 1-113)
ధరణీపుత్రి నెదం దలంచుకొని హృత్సంతాప మంతంతకున్ బెరుగన్ బెక్కు తలంపు లూరగ గడున్ భీతిల్లి కామవ్యథాతురతన్ హా తరుణీమణీ యనుచు నెంతో పారవశ్యంబు నొంది రయంబార ముహూర్త మాత్రమునకున్ దె ల్వొంది తా గ్రమ్మఱన్
గోపీనాథ రామాయణం.. కి.కాం.726
సీతా వియోగంతో విలపించే రాముణ్ణి చూసి నింగిలోని దేవత లిలా సంభాషించుకుంటున్నారు.
"ఆడపిల్లలాగా ఏడుస్తున్నా డేమిటి రాముడు?"
అంటే మరొక వేల్పు అంజలి ఘటించి ఇలా అన్నాడు.
"అది స్త్రీసహజం. ఎందుకంటే తాను *లలితా స్వరూపుడు* గదా! ఐనా ఈ దుఃఖం కొద్ది సేపే వుంటుందిలే!
స్త్రీవియోగ మనే చలి రాగానే సహస్రరశ్మి (సూర్యుడు) పారిపోయాడు. (అని అనిపించినా అది కొద్దిసేపే! కొంచెమే.. అని పైన పేర్కొనబడింది. అంటే యథావిధిగా సూర్యుడు ప్రకాశిస్తూనే వుంటాడు శాశ్వతంగా..చింతించే పనిలేదు.)
ఇదంతా లోకాన్ని భ్రమింప జేయటానికే! మంచు తెరలు శాశ్వతంగా వుండవు. కాసేపటికి కదలిపోతాయి సూర్య ప్రకాశం అధికతర మయ్యేకొద్దీ.. అని తాత్పర్యం..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"లలనవలెన్ విలాపమును
రాము డొనర్చు ని దేలొ!".. యన్న నం
జలి ఘటియించి "స్త్రీకి సహ
జం బది తా *లలితా స్వరూపుడౌ*
నిల" ననె వేలు పొక్కరుడు
"నీ వెత కొంచెమె! స్త్రీ వియోగ మన్
జలి పులి పల్కరించఁగనె
చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
21.12.19
-----------------------------------------------------------
కులికెడు భారతమ్మునిట కూల్చగజూచెడు ద్రోహచింతనల్
రిప్లయితొలగించండిపలుకునతేనియల్నొసగు,పావనధాత్రిని బాధపెట్టుచో
మెలకువవచ్చినంతనిక,మేదిన వారికి ,నూకలుండునా?
చలిపులిపల్కరించగనె, చయ్యను బారు సహస్రరశ్మియున్