తనకు తానుగ నార్తుల తగిన వేళ నాదు కొనుచును నుతులకు నాశ పడక చిత్త శుద్ధిగ దానము జేయు వాడు దాత యనబడు :: దాత తాన్ దాత కాదు పేరు ప్రఖ్యా తు లనిశ ము గోరు వాడు
సందర్భము: స చ సర్వ గుణోపేతః.. అతడు (రాముడు) సర్వ సద్గుణ సమన్వితుడు. (బా.కాం) ధనముమీద ఆశయే చాలా పెద్దది.. పేరుమీద ఆశ చాలా చాలా పెద్దది.. ఎంతో కష్టపడి త్యాగ గుణా న్నలవరచుకొని ధనముమీద ఆశను విడనాడి దానధర్మాలు చేసే వాడు ధన్యుడు. ఐతే అక్కడితో సరిపోదు. అందుకే ఎంత కోటీశ్వరునికైనా కోట్లు దానం చేసేవానికైనా పేరుమీద ఆశ చావదు. ప్రజ లంతా తనను పొగడాలి.. ఆకాశాని కెత్తాలి.. అనుకుంటాడు. అంత గొప్పవాళ్ళకే అలా వుంటే చిన్నా చితకా వాళ్ల నే మంటాం! (ఫ్యాన్లు దానంచేసి రెక్కలమీద పేర్లు వ్రాయించుకుంటారు. తిరగేటప్పు డా పేర్లు కనిపిస్తాయా! ఆపి వున్నప్పుడే కదా! పేర్లు కనిపించా లని ఎప్పుడూ ఆపి వుంచితే ఉద్దేశ్యం నెరవేరుతుందా! గుడి గేట్ల గ్రిల్స్ పై పేర్లు చెక్కించుకొని దైవదర్శనంకన్న ముందు తన పేరే కంటబడా లనుకునే వారికి భగవదనుగ్రహం కలిగినట్టేనా!) ధనాశను జయించి ఇంకా కొంత ఎదిగాక పేరుమీద కూడ ఏవగింపు కలుగుతుంది. పేరుకూడా వస్తే నేం రాకుంటేనేం! జీవితమే శాశ్వతం కానప్పుడు పేరు వచ్చి మాత్రం గొప్పగా ఉద్ధరించే దే ముందిలే! అనుకునే స్థితి వస్తుంది. ఇక అప్పటినుంచి తన పే రెక్కడా బయటికి పొక్కకుండా గోప్యంగా వుంచి దానం చేస్తుంటాడు. అదే గుప్తదానం. లోకంలో జయించదగిన పెద్ద ఆశ లీ రెండే! ఆపైన ఏదీ అతణ్ణి బంధించజాలదు. ధర్మమూర్తి రామచంద్రుని రాజ్యంలో ఎందరో మహానుభావులు ధనంమీదనే కాదు.. పేరుమీదకూడ వుండే ఆశను జయించి గుప్తదానాలు చేస్తూ ఇలా అంటారు. "దాత అనబడే వాడు దాత కాడు.." (అత డింకా ఎత్తుకు ఎదుగవలసి వుంది.) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ధనముపై నాశను ఘనముగా విడనాడు ధన్యులు సులువుగా ధనము నెపుడు దానమ్ము నొనరింత్రు.. కాని వారికి పేరు పై నాశ చావదు.. ప్రజలచేత గొప్పగా పొగడించుకొనగోరి వ్రాయించు కొనుచుంద్రు తమ పేర్లు కొసరికొసరి.. అట్టి యాశ జయించి యసలు తెల్పరు తమ నామము లెందరో రామ విభుని యొక్క రాజ్యమ్మున ధనాశఁ జక్కగా జ యించి, యామీదఁ బేరుపైఁ బొంచియున్న యాశఁ గూడ జయించి తా మందు రిటుల.. "దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 11.12.19 -----------------------------------------------------------
త్రాతను నేను నా ప్రభుత దానము చేయును వేల రూప్యముల్ ప్రీతిని మీకు నే బనుల వెంటను బోకుడు లేమి యింక నే లా తిని పండు డంచు బ్రజ లందరు కట్టెడి పన్ను బంచుచున్ దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో.
సందర్భము: *స చ సర్వ గుణోపేతః..* అతడు (రాముడు) సర్వ సద్గుణ సమన్వితుడు. (బా.కాం) సుగ్రీవునికి (వాలి భయం తొలగించడమే గాక) వానర రాజ్య మిచ్చినాడు. విభీషణునికి (రావణ భయం తొలగించి) లంకా రాజ్య మిచ్చినాడు. రావణుని మించిన వాలిని వధించినాడు రాముడు. కిష్కింధ స్వాధీన మయింది. ముగ్గురు తమ్ము ళ్ళున్నారు. ఎవరో ఒకరు పాలించుకోవచ్చు ననుకోలేదు రాముడు. ఒట్టి పుణ్యానికి సుగ్రీవునికి కట్టబెట్టినాడు వానర రాజ్యాన్ని. ఎంత పిచ్చి పని? అట్లే స్వర్ణమయమైన లంకా రాజ్యాన్ని కూడ. లక్ష్మణ మూర్ఛ మున్నగు భీకరమైన ఘట్టాల్లో ప్రాణాలను పణంగా పెట్టి రావణుని ఎదిరించి చివరకు సంహరించగలిగాడు. అప్పుడూ అంతే! విభీషణుని కప్పగించి చేతులు దులుపుకున్నాడు. ఇదేమైనా మంచి పద్ధతా! ఈనాటి రాజకీయుల నడుగాలి. స్వీట్ హౌజులోని మధుర పదార్థాలు దాన్ని నడిపే యజమాని తింటూ కూర్చుంటాడా! అవి కొనుక్కునే వాళ్ళ కోసం కదా! రాముని స్వీట్ హౌజులో రాజ్యా లనే మధుర పదార్థాలు లభిస్తాయి. భక్తి విశ్వాసాలను చెల్లించి ఎవరైనా పొందవచ్చు. పరుల రాజ్యాలను కబళించడమే గాని జయించిన రాజ్యాలను సైతం దానం చేసినవాళ్ళు లేరు కదా! కేవలం గొప్ప నేత మాత్రమే కాదు. దాత కూడ రాముడు. ఈ దృష్టితో చూస్తే ఈనాడు దాతగా పిలువబడే వాడు నిజానికి దాత కాడు. తొగసూడు బిడ్డ = సూర్య నందనుడు.. (సుగ్రీవుడు) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఆ తొగసూడు బిడ్డ మురి యన్ గపి రాజ్యము నిచ్చినాడు.. సం ప్రీతిగ న వ్విభీషణుడె మే లని లంక నొసంగినా డహో! నేతయె కాదు, దాత యన నేర్తును రామునిఁ.. గాన నే డిలన్ దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 11.12.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
British "granting" Independence (1947):
ప్రీతిని జేరి దేశమున పేరిమి వర్తక రీతిగానహో
మూతులు నాకి నేతలవి ముప్పులు తిప్పలు పెట్టి యేలుచున్
తాతల సొత్తు దోచుకొని తన్నగ గాంధియె దారబోయుచున్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ధారపోయుచున్" అనండి.
🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపన్నుల నెగవేయగ జూచు పాపి యైన
తొలగించండిధనమిది జనులకొరకని తప్పు జెప్పఁ
ధనమును బినామి పేరున దాచు వాడు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
🙏🙏
మిత్రమా దాత. ధాత. కాదు
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో "చేతికి ననువుగ...వ్రాతల" అనండి. సమస్యలోని దాతను ధాత అన్నారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
Hyderabad Voter (2018):
చేతుల నిండ పైకమును చెన్నుగ గైకొని మూడు పూటలన్
ప్రీతిని బీరు కొట్టుచును పేరిమి బిర్యని కుమ్ముచున్ భళా
కోతలనన్ని నమ్ముచును కూరిమి వోటును దారబోయుచున్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో!
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ధారపోయుచున్" అనండి.
🙏
తొలగించండివేంకటాచలా ధీసుడు వేడు కొనెను
రిప్లయితొలగించండిడబ్బు లిమ్మని ఘనుడైన లిబ్బి దొరను,
స్వామికిన్ కిరి రూపుండు భూమి నిచ్చి
గొప్ప దాతగా భువిలోన మెప్పు బడసె,
తరచి చూడగా నిలలోన ధనపతి ,ఋణ
దాత యనబడు దాత ,తాన్ దాత కాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వేంకటాచలాధీశుడు' టైపాటు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
దానమిచ్చినా, దాత గాని దాత విధాత :
__________________________
నాల్గు ముఖములు గలిగిన- నలువ యతడు !
సృష్టి నంతను సృజియించు - స్రష్ట యతడె !
ధరణి తలచెద రతనిని - ధాత యనుచు !
దానమిచ్చెడు వానిని - దాతయండ్రు
ప్రాణులకు దాన మిచ్చినన్ - బ్రాణములను
దాత యనఁబడు దాత తాన్ - దాత గాఁడు !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
దానమిచ్చినా, దాత గాని దాత విధాత :
__________________________
ఆతడు యంచరౌతు, గన - నంబుజగర్భుడు, నగ్రజన్ముడున్
తాతయు, విశ్వసృక్కుయును, - ధాతయు, హాటకగర్భు, డఘ్న్యుడున్
దాతగ చేతనంబులకు - దానము జేసిన బ్రాణ, చేతనల్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి - దాత నిజంబుగ దాత గాఁడు పో !
__________________________
చేతన = ఙ్ఞానము
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆతడు + అంచరౌతు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "ఆతడె యంచరౌతు" అందాం. అలాగే "చేతనా దాతగ.." అంటే బాగుంటుందేమో?
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిసవరణతో :
B-1)
దానమిచ్చినా, దాత గాని దాత విధాత :
__________________________
ఆతడె యంచరౌతు, గన - నంబుజగర్భుడు, నగ్రజన్ముడున్
తాతయు, విశ్వసృక్కుయును, - ధాతయు, హాటకగర్భు, డఘ్న్యుడున్
దాతగ చేతనంబులకు - దానము జేసిన బ్రాణ, చేతనా
దాతగఁ బిల్వఁగాఁ బడెడి - దాత నిజంబుగ దాత గాఁడు పో !
__________________________
చేతన = ఙ్ఞానము
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
పాప కార్యముల్ సలిపి సంపదను పొంది
రిప్లయితొలగించండిపేద లాకలి తీర్చకన్ బేరు కొరకు
రాతి విగ్రహములకు విరాళమిచ్చు
దాత యనఁబడు దాత, తాన్ దాత గాఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం..
"దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో"
ప్రీతిగ *మారతాత* యన విష్ణువె యౌను, *గుమారతాత* యౌన్
శీతనగాత్మజావరుడు., నిత్యము వీరు శుభప్ర *దాత* లే!
*తాత* యటన్న శబ్దమిల దండ్రిని జెప్పును సంస్కృతమ్మునన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తల్లిపక్షి.... పిల్లలతో ఇలా అంటోంది...
తొలగించండిమేతకు బోవ భద్రము సుమీ! వనసీమను కొన్ని నూకలన్
ప్రీతిగ జల్లువాడనగ పిట్టలబట్టెడివాడు., చూడగా
దాతను బోలియుండు., వల దాల్చి చరించును., వాడు క్రూరుడే.,
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఉర్వి యందున గాంచగా నుత్తమర్ణు
రిప్లయితొలగించండిడవసరార్థము వడ్డికై యప్పు నిచ్చి
యాదుకొననేమి యెప్పుడీ యవనిని ఋణ
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఒక శయము చేయు దానము నొక కరమున
కు తెలియక చేయు మనుజుడె కోమలాంగి
దాత యనఁబడు; దాత తాన్ దాత గాఁడు
దాత ననుచు దంభనముల దాపరింప
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధాతయు త్రాతయున్ భువి ప్రదాతయు నొక్కడె సర్వవేళలన్
తొలగించండిచేతనులన్ సృజించి తగు జీవనమిచ్చి లయింప జేయు తా
నాతతసృష్టి,పాలన,లయంబులఁ జేసెడు శ్రీధరుండె, యా
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో"
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచూతుము గాదె దేశమున శుద్ధమనంబున బేదవారికిన్
రిప్లయితొలగించండిజేతము సంతసిల్లువిధి శ్రీలను బంచెడి వారులే రహో
ఖ్యాతిని గోరుచున్ బహుముఖాభినయంబులు దప్ప నేడిటన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమాతలరాతమార్తురని,మన్నికగా మిము యెన్నుకొంటిమే!
రిప్లయితొలగించండినేతలతీరుజూడగనె,నేరము జేసిన బాధ గల్గులే
తాతలు గూడ తిట్టుటది తధ్యము,ధన్యతలేనిపాలకుల్
దాతలుబిల్వగాబడెడి,దాతనిజంబుగదాతగాడుపో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(అమ్మ వినత దాస్యాన్ని పోగొట్టటానికి అమృతభాండం తీసుకొని వస్తున్న మహావీరుడు గరుత్మంతుడు దేవేంద్రుని వజ్రాయుధానికి గౌరవంగా ఒకయీక నిచ్చాడు )
రిప్లయితొలగించండిఆతతవేగుడై గరుడు
డంత సుధాకలశంబుతో మహా
నేతగ నేగ నింద్రుడిక
నేరిమి వజ్రము వేసినంతనే
యీతడు గౌరవమ్మొసగి
యీకను దానము జేసి యేగెలే !
దాతగ బిల్వగా బడెడి
దాత నిజంబుగ దాత గాడు పో !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఓ పరలోకములో నున్న తండ్రి ఈ పాపుల క్షమింపుము
చేతుల నెత్తి మొక్కుము సచేతను డాతడె యేసునాధుడే
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ; దాత గాఁడు పో
నీ తవిషిన్ మరెవ్వడు! వినేతృని గా మన జీవితమ్మదే
పాతకమార్గమున్విడువ భారపు కొఱ్ఱుని నెక్కి నిల్చెగా
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈమధ్య బాప్తిజం తీసుకున్నారా ఏమిటి?
తొలగించండి:) క్రిస్సు మస్సు వస్తోందిగా :)
విట్టుబాబు గారేమన్నా క్రిస్సు మస్సు సందర్భంగా కైపదమిస్తే కొంత ప్రాక్టీసు వుంటుందని .
:)
జిలేబి
తనకు తానుగ నార్తుల తగిన వేళ
రిప్లయితొలగించండినాదు కొనుచును నుతులకు నాశ పడక
చిత్త శుద్ధిగ దానము జేయు వాడు
దాత యనబడు :: దాత తాన్ దాత కాదు
పేరు ప్రఖ్యా తు లనిశ ము గోరు వాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాతకుఁ పుట్టినారమెనమండుగురమ్ము,కనిష్ఠుడన్,ననున్
రిప్లయితొలగించండి"దాత"ని పిల్చుచుండ్రి,పినతండ్రిని పుట్టుటకంటె మున్నె నేఁ
దాతగ మారితిన్ కడకు తంతున దేదియుఁ గాకఁ,వింతయేఁ
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగఁ దాత గాఁడు పో
తిండికై తిరుగాడు శక్తి కరువైన
తొలగించండిముసలి పులిచేత లేదెట్టి పసిడి మురుగు
ఎండు గడ్డిని చూపుచు నెరను వేయు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిచేతఁ గలుంగగన్ బరులుఁ జెంతకుఁ జేరుచుఁ గోరినంతటన్
బ్రీతి నొసంగు కర్ణుడల వేదనఁ దెల్పఁగఁ బుత్రభిక్షకై
కోత విధించి దానమిడఁ గూరిమిఁ జూపక తల్లి కుంతిపై
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో
తేటగీతి
రిప్లయితొలగించండిరాజకీయంపు రాణింపు మోజు మీర
ఋణము, నీటి సౌకర్యములెంచి కూర్చి
యోటులందుచు పదవుల చాటు దోచు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘాతకుడాప్రసాదుగుడిఁగట్టినదాతగఁబేరుమోసెని
రిప్లయితొలగించండిర్భీతిగవిగ్రహాలుపెకలించెనుగుప్తనిధుల్ హరించె నా
పాతగుడిన్ రహస్యముగపట్టెవిరాళములెన్నొచాటుగన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో
గాదిరాజు మధుసూదనరాజు
కవచ కుండలముల నిచ్హె కర్ణు డనగ
రిప్లయితొలగించండిదాన మనినంత నిస్వార్ధ త్యాగ మంట
ఫలిత మాసించి చేయుట పాడి గాదు
దాత యనఁబడు దాత తాన్ దాత గాడు
ధర్మపరుడౌచు దీనుల దయను జూప
రిప్లయితొలగించండిదాత యనఁబడు; దాత తాన్ దాత గాఁడు
ప్రేమ నటియించి పేరుకై పేద ప్రజల
వంచనల ముంచు పాపిష్ఠి వాడె యైన
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు"
సందర్భము:
స చ సర్వ గుణోపేతః.. అతడు (రాముడు) సర్వ సద్గుణ సమన్వితుడు. (బా.కాం)
ధనముమీద ఆశయే చాలా పెద్దది..
పేరుమీద ఆశ చాలా చాలా పెద్దది..
ఎంతో కష్టపడి త్యాగ గుణా న్నలవరచుకొని ధనముమీద ఆశను విడనాడి దానధర్మాలు చేసే వాడు ధన్యుడు.
ఐతే అక్కడితో సరిపోదు.
అందుకే ఎంత కోటీశ్వరునికైనా కోట్లు దానం చేసేవానికైనా పేరుమీద ఆశ చావదు. ప్రజ లంతా తనను పొగడాలి.. ఆకాశాని కెత్తాలి.. అనుకుంటాడు. అంత గొప్పవాళ్ళకే అలా వుంటే చిన్నా చితకా వాళ్ల నే మంటాం!
(ఫ్యాన్లు దానంచేసి రెక్కలమీద పేర్లు వ్రాయించుకుంటారు. తిరగేటప్పు డా పేర్లు కనిపిస్తాయా! ఆపి వున్నప్పుడే కదా! పేర్లు కనిపించా లని ఎప్పుడూ ఆపి వుంచితే ఉద్దేశ్యం నెరవేరుతుందా! గుడి గేట్ల గ్రిల్స్ పై పేర్లు చెక్కించుకొని దైవదర్శనంకన్న ముందు తన పేరే కంటబడా లనుకునే వారికి భగవదనుగ్రహం కలిగినట్టేనా!)
ధనాశను జయించి ఇంకా కొంత ఎదిగాక పేరుమీద కూడ ఏవగింపు కలుగుతుంది. పేరుకూడా వస్తే నేం రాకుంటేనేం! జీవితమే శాశ్వతం కానప్పుడు పేరు వచ్చి మాత్రం గొప్పగా ఉద్ధరించే దే ముందిలే! అనుకునే స్థితి వస్తుంది.
ఇక అప్పటినుంచి తన పే రెక్కడా బయటికి పొక్కకుండా గోప్యంగా వుంచి దానం చేస్తుంటాడు. అదే గుప్తదానం.
లోకంలో జయించదగిన పెద్ద ఆశ లీ రెండే! ఆపైన ఏదీ అతణ్ణి బంధించజాలదు.
ధర్మమూర్తి రామచంద్రుని రాజ్యంలో ఎందరో మహానుభావులు ధనంమీదనే కాదు.. పేరుమీదకూడ వుండే ఆశను జయించి గుప్తదానాలు చేస్తూ ఇలా అంటారు.
"దాత అనబడే వాడు దాత కాడు.." (అత డింకా ఎత్తుకు ఎదుగవలసి వుంది.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధనముపై నాశను ఘనముగా విడనాడు
ధన్యులు సులువుగా ధనము నెపుడు
దానమ్ము నొనరింత్రు.. కాని వారికి పేరు
పై నాశ చావదు.. ప్రజలచేత
గొప్పగా పొగడించుకొనగోరి వ్రాయించు
కొనుచుంద్రు తమ పేర్లు కొసరికొసరి..
అట్టి యాశ జయించి యసలు తెల్పరు తమ
నామము లెందరో రామ విభుని
యొక్క రాజ్యమ్మున ధనాశఁ జక్కగా జ
యించి, యామీదఁ బేరుపైఁ బొంచియున్న
యాశఁ గూడ జయించి తా మందు రిటుల..
"దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.12.19
-----------------------------------------------------------
పాతకముల్ హరించునను స్వార్థముఁ గోవెలఁ జేరి భూరిగా
రిప్లయితొలగించండిఖ్యాతిగడింపనెంచి పలు కానుక లిత్తురు, పేద యాకటన్
జేతులు జాపఁ గీకటులు చిన్నము రాల్చరు కీర్తికోసమై
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో
ప్రతిఫలమ్ముపై యాశనుబడనినతడు
రిప్లయితొలగించండిదాతయనబడు,దాతతాన్ దాతగాడు
తనర'దాదాత' యందునదాతయుండి
నప్పటికినిదా తయనగనొప్పదిలను
పన్ను చెల్లింపు సౌఖ్యము బడయ గోరి
రిప్లయితొలగించండిదాన, ధర్మము లొనరించు దర్పమలర
సొంత లాభమె దయ గాదు సుంత యైన
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
అన్నమిక లేదటంచును నార్తి తోడ
రిప్లయితొలగించండిపలికి రంతిదేవుండట వద్దనున్న
యంబు వొసగి తా పస్తుండె నట్టి వాడె
దాత యనబడుదాత తాన్ దాతగాడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుప్త దానము ధరలోన గొప్ప సుమ్ము
తొలగించండిదాని నెంచి వాఁ డెంచెను వీని నిజము
నా కెఱుక యా ధనము నిచ్చె నాకుఁ దాను
దాత యనఁబడు దాత తా దాత గాఁడు
[తాను + తాత యనఁబడు = తాను దాత యనఁబడు]
“తాన్ దాత”: తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు కనుక న కారపు పొల్లు విసర్జించి “తా దాత” గా గ్రహించితిని.
ఏ తరి దాత లుందురు గ్రహీతలు లేక గ్రహించ నింపుగన్
దాతయు మాఱఁగా నగును ధాత్రి గ్రహించెడు వానిగాఁ జుమీ
భూతల మందుఁ బుచ్చుకొను పూరుషు లుందురు సంతతమ్ము నా
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో
[ఆదాత = గ్రహీత ]
నేతగ పేరు మోసె నవినీతిపరుండగు నాయకుండెగా
రిప్లయితొలగించండిమేతయె దప్ప పేదలకు మేలొనరించుట మాయ యేనుగా
కోతల రాయుడై యిటుల కోటి వరమ్ముల గుమ్మరించినన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదాతగబిల్వగాబడెడిదాత నిజంబుగదాతగాడుబో
రిప్లయితొలగించండిదాతలుదాముగాననరుదాతలుమేమని నెట్టివేళలన్
జేతులనిండుగాదనరజేసిననైనను నెంతమాత్రమున్
జేతనమందుదామననజేయరుదాతగజింతజేయగా
త్రాతను నేను నా ప్రభుత దానము చేయును వేల రూప్యముల్
రిప్లయితొలగించండిప్రీతిని మీకు నే బనుల వెంటను బోకుడు లేమి యింక నే
లా తిని పండు డంచు బ్రజ లందరు కట్టెడి పన్ను బంచుచున్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ
దాత గాఁడు పో"
సందర్భము:
*స చ సర్వ గుణోపేతః..* అతడు (రాముడు) సర్వ సద్గుణ సమన్వితుడు. (బా.కాం)
సుగ్రీవునికి (వాలి భయం తొలగించడమే గాక) వానర రాజ్య మిచ్చినాడు.
విభీషణునికి (రావణ భయం తొలగించి) లంకా రాజ్య మిచ్చినాడు.
రావణుని మించిన వాలిని వధించినాడు రాముడు. కిష్కింధ స్వాధీన మయింది. ముగ్గురు తమ్ము ళ్ళున్నారు. ఎవరో ఒకరు పాలించుకోవచ్చు ననుకోలేదు రాముడు. ఒట్టి పుణ్యానికి సుగ్రీవునికి కట్టబెట్టినాడు వానర రాజ్యాన్ని. ఎంత పిచ్చి పని?
అట్లే స్వర్ణమయమైన లంకా రాజ్యాన్ని కూడ. లక్ష్మణ మూర్ఛ మున్నగు భీకరమైన ఘట్టాల్లో ప్రాణాలను పణంగా పెట్టి రావణుని ఎదిరించి చివరకు సంహరించగలిగాడు. అప్పుడూ అంతే! విభీషణుని కప్పగించి చేతులు దులుపుకున్నాడు. ఇదేమైనా మంచి పద్ధతా! ఈనాటి రాజకీయుల నడుగాలి.
స్వీట్ హౌజులోని మధుర పదార్థాలు దాన్ని నడిపే యజమాని తింటూ కూర్చుంటాడా! అవి కొనుక్కునే వాళ్ళ కోసం కదా! రాముని స్వీట్ హౌజులో రాజ్యా లనే మధుర పదార్థాలు లభిస్తాయి. భక్తి విశ్వాసాలను చెల్లించి ఎవరైనా పొందవచ్చు.
పరుల రాజ్యాలను కబళించడమే గాని జయించిన రాజ్యాలను సైతం దానం చేసినవాళ్ళు లేరు కదా!
కేవలం గొప్ప నేత మాత్రమే కాదు.
దాత కూడ రాముడు.
ఈ దృష్టితో చూస్తే ఈనాడు దాతగా పిలువబడే వాడు నిజానికి దాత కాడు.
తొగసూడు బిడ్డ = సూర్య నందనుడు..
(సుగ్రీవుడు)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆ తొగసూడు బిడ్డ మురి
యన్ గపి రాజ్యము నిచ్చినాడు.. సం
ప్రీతిగ న వ్విభీషణుడె
మే లని లంక నొసంగినా డహో!
నేతయె కాదు, దాత యన
నేర్తును రామునిఁ.. గాన నే డిలన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి
దాత నిజంబుగ దాత గాఁడు పో!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.12.19
-----------------------------------------------------------
దాతగనేనుగొప్పయని ,ధాత్రినజేసిన వాక్కులన్నియున్
రిప్లయితొలగించండినేతలమేతకే సరిగనేర్పెనువారికి, పాలనమ్ముమాం
ధాతగ మంచి వాడెయని,ధాత్రినిజంబుగరుజ్వుజేయనీ
దాతగబిల్వగాబడెడి ,దాతనిజంబుగ దాతగాదెపో
**********************+*++++
రావెలపురుషోత్తమరావు
చూతముగొప్పపాలనని ,చూరునుబట్టుచునుండిపోవగా
రిప్లయితొలగించండిరాతలు రాతగామిగిలె, రాజ్యమునందున బీదవారికిన్
శ్రోతలుమెచ్చరెన్నటికి ,శోభనుగూర్చని వీరి జూడగా
దాతగబిల్వగాబడెడి ,దాతనిజంబుగ దాతగాదెపో
++++++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
పాతరబెట్టి పాతనిక ,పాలనగొప్పగజేతుమంటిరే
రిప్లయితొలగించండిచేతల శూన్యమాయెగద,చేతనలేదిక నేతలందునన్
రాతలు చెత్తగామిగిలె ,రాష్ట్రమునందునగొప్పజెప్పునీ
దాతగబిల్వగాబడెడి ,దాతనిజంబుగ దాతగాదెపో
______-\\\\\\\\\\\________
రావెలపురుషోత్తమరావు
ఉ:
రిప్లయితొలగించండిచూతము గాగ నాటలన చోద్యము మీరగ గెల్చు వారకున్
చేతుల నంద జేతురట చిత్తము ఝల్లన పారితోషికం
గోతలు కోయు చుందురట కొందరు దాతగ విర్రవీగుచున్
దాతగ బిల్వగా బడెడు దాత నిజంబుగ దాత గాడు పో
వై. చంద్రశేఖర్
నిచ్చు చేయూత భగవత్ ర్పణమని,దాత
రిప్లయితొలగించండిరాత మార్చగ , నిలుచు తెర వెనుక తను,
కూసె కోతలు మ్రోగించి గొప్ప చెప్పి
రాతిపై రాత. రాయించిసొంత పేరు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
సరదాగా 😃😃
రిప్లయితొలగించండిఆకలి యనిన జనులకు నన్న మొసగి
నుల్లి పాయల దానము నొసగు వాడు
ఆశగ నిట ప్రతిఫలము యడుగు వాడు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
🌸🙏🌸🙏🌸🙏