10, డిసెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3216 (మేడ నెక్కఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు"
(లేదా...)
"మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్"

88 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    తాడనమొందగా విరివి తప్పులు జేయుచు రాజనీతినిన్
    మేడము కోపగించగను మెల్లగ చల్లగ కాళ్ళుబట్టుచున్
    వీడక నెప్పుడున్, చెలగి విందులు జేయుచు రాకుమారుకున్
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      "వీడక యెప్పుడున్" అనండి. 'రాకుమారునకున్' అనడం సాధువు. "రాకుమారు డా మేడను..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  2. ప్రక్క వారితో మాటాడు పనియె కలిగె
    నాలసింపక కదలితి నమ్మనేను
    గడప దాటితి నిప్పుడీ క్షణము, వారి
    మేడ నెక్కగ దిగవలె మూడు మెట్లు.

    రిప్లయితొలగించండి
  3. జాడ తెలుసుకు మనవలె జంగ మయ్య
    వాడ వాడల తిరుగుచు మేడి వలెను
    పాడి గాదట బ్రతుకంగ పగను బూని
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కీడుల నెంచకే పడగ క్రిందను మీదను రాజధానినిన్
    తాడును పేడునున్ గనక ధైర్యము వీడగ యోగమందునన్
    నాడులు ధిక్కరించగను నక్కుచు మ్రొక్కుచు మోడివర్యుకున్
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
  5. (వేమారెడ్డి తన ప్రియురాలు విశ్వదను దిగంబరగా తిలకించి జుగుప్సతో విరక్తుడై ముక్తికై వేమనయోగిగా మారినాడు )
    వేడుకగా సుఖమ్ములను
    విశ్వద చెంతను బొందు వేమనన్
    " నేడు దిగంబరన్ గనుము
    నేరుగ " నన్వదినమ్మ మాటకున్
    గాటపు గూరిమిన్ జనియె ;
    గాంచి విరక్తిని యోగి యయ్యెలే ;
    మేడను జేర రెండు నొక
    మెట్లు దిగందగు మోక్షగామికిన్ .

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    బంధ భోగ గర్వములు సోపానమనగ
    నున్న నింటనుండిన వార లున్నతముగ
    నెదుట కనిపించు మోక్షపు విధుల నొసగు
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

    రిప్లయితొలగించండి
  7. ఏడ నహంకృతీబహుళ మేర్పడియుండునొ స్వార్థకోపముల్
    చీడకుబోలె గూల్చుటకు జేరునొ నచ్చట హర్షసంపదల్
    గూడవు నాశకారులివి కుత్సిత పీఠము లౌట ముక్తియన్
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్.

    రిప్లయితొలగించండి
  8. అమ్మ వారిని దర్శింతు రాలయమున
    మేడ నెక్కగ : దిగవలె మూడు మెట్లు
    పుష్కరిణి యందుమున్గ గా పుణ్య సతులు
    మార్గ శిర మందు స్మరియించి మాత దుర్గ n

    రిప్లయితొలగించండి


  9. చూడగా తల తిరిగె బుసుబుసటంచు
    మేడ నెక్కఁగ, దిగవలె మూఁడు మెట్లు
    దిగి మరల యెక్కుడీ ముప్పదియని వ్రాసి
    యుండి రచ్చట! యిదియెట్లు యుక్తమౌత!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. చూడగ సూచనొక్కటిని, చొక్కుని తేలెను బూదకాయమే
    మేడనుఁ జేర, "రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్
    పాడుచు నేసునామమును ప్రార్థన చేయుడు మీకు మేలగున్"
    పాడితి వేడుచున్ దిగితి ఫాదరు మెచ్చిరి దక్కె ముత్తియే


    జిలేబీయము :(

    రిప్లయితొలగించండి
  11. మనిషియున్నతియందునపొందునహము
    మోహ ద్వేషాలు వానిలో మోహరించు
    మోక్షపదమునకడ్డమీమూడు మెట్లు
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారికి శుభోదయ ప్రణామములు. మ” కు పూర్ణబిందుపూర్వకమైన య, ర,ల,వ,శ,ష,స,హ లతో యతి కుదురునని చదివాను. ఛందం యాప్ లో కూడా సరిచూశాను.అందుకని ఆ పదం వాడాను.

      తొలగించండి
    3. కాని అక్కడ ఉన్నవి మ - పొం... ఎలా కుదురుతుంది?

      తొలగించండి
    4. క్షమించండి, సరిచేస్తున్నాను.
      పురుషుఁడున్నతియందునపొందునహము
      మోహ వైరముల్ వానిలో మోహరించు
      మోక్షపదమునకడ్డమీమూడు మెట్లు
      మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

      తొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    పాడెకు కట్టినప్పుడును
    పైకపుమైకము వీడిపోదు., యే...
    నాడును నేను నాది యను నైచ్యపు చింతన వీడబోదు., పో
    రాడుచునుండు నిత్యమవురా! త్రయమిద్ది భయంకరమ్మగున్ !
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
      'వీడకుండు నేనాడు..' అని నా సవరణ.

      తొలగించండి
  13. తామసమ్మును విడుదురు తత్వ విదులు
    రాజసమ్మును వీడుచు రాధనమున
    సత్వగుణమును తలపక సత్య లోక
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లోనో, ఫేసుబుక్కులోనో నా వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
  14. పరుగు పందెమునందున పాల్గొనంగ
    నాటగాడు తొల్త వెనుకనడుగు వేయు
    బలమునంది ముందటి కాలు పరుగుదీయ
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు౹౹

    రిప్లయితొలగించండి
  15. విజయ సౌధము జేరగ విధిగ జనులు |
    సుఖము, సౌఖ్యమలసటలు సుంత విడచి |
    అహము లేక నన్యోన్యత నలరవలయు |
    "మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు"

    రిప్లయితొలగించండి
  16. పెళ్ళి వారింట సందడి వెల్లి విరిసె
    వెళ్ళి రావలె గాని యా విడిది జేర
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు
    యెత్తు వాకిలి గద మాదు యిల్లు జూడ

    రిప్లయితొలగించండి
  17. తే.గీ.

    పరమ పదమును జేరగ పటము నందు
    నిచ్చె నెక్కుట పాముల నొచ్చు టగును
    నిత్య మగునది జీవిత సత్య మెపుడు
    మేడ నెక్కగ దిగవలె మూడు మెట్లు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు
    మోక్షగామికిన్

    సందర్భము:
    "స్వర్ణమయమైన లంక న న్నాకర్షించడంలేదు లక్ష్మణా! జనని, జన్మభూమి నాకు స్వర్గం కంటే గొప్పవి. అవి చాలు." అన్నాడు రాముడు.
    ముక్తి నందా లనుకున్న సాధకుడు త్రిగుణాలు అంటే సత్వ రజ స్తమోగుణాలు వదలివేయాలి. "అవే నేను.." అని తాదాత్మ్యం చెందటంకాని "అవి నావి.." అని మమకారం పొందటంకాని కూడని పని. వాటిని వదలివేయగలిగినపుడే త్రిగుణాతీతు డౌతాడు. ముక్తుడౌతాడు.
    సత్వగుణ మంటే దైవం, ధర్మం ప్రధానమైన నడవడి. విభీషణుడు దీనికి ప్రతీక.
    రజోగుణ మంటే నేను,నాది అనే అహంకార మమకారాలు మిక్కుటంగా వుండే వర్తన. దీనికి రావణుడు ప్రతీక.
    తమోగుణ మంటే తినడం తాగడం తిరుగడం తప్ప వే రేదీ లే దనే స్వభావం. దీనికి కుంభకర్ణుడు ప్రతీక.
    త్రిగుణాతీతుడైన రాముడు రజ స్తమో గుణాలకు ప్రతీకలైన రావణ కుంభకర్ణులతోడి సంబంధాన్ని త్రెంచివేసినాడు.
    ఎలా!.. అంటే వారిని వధించడం ద్వారా.
    అందువల్ల రజ స్తమో గుణాలను వదలివేసిన ట్టయింది.
    సత్వగుణానికి ప్రతీకయైన విభీషణుని సంబంధాన్నీ త్రెంచివేసినాడు.
    ఎలా!.. అంటే అతణ్ణి త్యజించడం ద్వారా.
    "లంకారాజ్యం నిష్కంటక మయింది. నీవే ఏలుకో నాయనా! వెళ్ళు." అన్నాడు కదా!
    అందువల్ల సత్వగుణాన్నీ వదలివేసిన ట్టయింది.
    మేడ.....మోక్షం
    మెట్లు....త్రిగుణాలు
    వీడడం..దిగటం
    రావణ కుంభకర్ణులు.. రజస్తమో గుణాలు..
    విభీషణుడు.. సత్వగుణం..
    రావణకుంభకర్ణులను వధించడం ద్వారా విభీషణుని త్యజించడం ద్వారా రాముడు గుణాతీతుడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మేడ యనంగ మోక్ష మగు..
    మె ట్లనగా త్రిగుణాలు.. వానినిన్
    వీడుట యన్నదే దిగుట..
    వేడని రావణ కుంభకర్ణులన్,
    వేడిన యా విభీషణుని
    వీడె వధించి, త్యజించి రాముడున్..
    మేడనుఁ జేర రెండు నొక
    మెట్లు దిగం దగు మోక్ష గామికిన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    10.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సత్వగుణానికి ప్రతీకయైన విభీషణుని సంబంధాన్నీ త్రెంచివేసినాడు.
      ఎలా!.. అంటే అతణ్ణి త్యజించడం ద్వారా

      రాముడు విభీషణుని త్యజించటం ఏమిటి?
      [ ఈ ప్రశ్నను ఇప్పటికే అడిగినట్లు గుర్తు. కాని ఇక్కడ ఎందుకు కనిపించటం లేదో తెలియదు.]

      తొలగించండి
  19. పాదరక్షలు నన్య భావరతి వీడి
    యనవరతము చేరవలె దేవాలయమ్ము
    సిగ్గు మానము దర్పము లొగ్గి సాని
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు


    తోడుగ రావు సంపదలు తూలఁ గళేబర మెట్టి వారికిం
    బాడిగ నీషణత్రయము భావన సేయఁగ మెట్ల గుంపుగన్
    వీడిన కాని చిత్తమున విష్ణు పదాలయ లబ్ధి లబ్ధమే
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న వ్యాకరణ మీమాంస:
      “రెండు నొక మెట్టు” గా నుండవలె నని సందేహమండి. వివరించఁ గోరెదను.
      రెండు నొక మెట్టు సమస్తమే కదా. వ్యస్త మయిన రెండు నొకటి మెట్లు- రెండు నొకటి యన మూడయి మూడు మె ట్లగును.

      తొలగించండి
    2. రెండున్ ఒకటి మీ భావనలో, రెండును ఒకటి శంకరకవిభావన లో అవుతుందేమో? అప్పుడు సాధప్రయోగమౌతుందేమో?

      తొలగించండి
    3. ధన్యవాదము లండి.
      వృత్తి ని “టి” లోపించినందు వలన రెండు నొక మెట్లు - అప్పు డిది సమాస మయినది.
      సమాసము కాని పక్షమున “రెండు నొకటి మెట్లు” - బహువచనము సాధువే.
      సమాసము చేసిన “రెండునొక మెట్టు” – అప్పు డేక వచనము రావలె నని నా భావ మండి.

      తొలగించండి
    4. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      'మూడు మెట్లు' అనే అర్థంలో 'రెండు నొకటి మెట్లు' సాధువనే భావిస్తున్నాను.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  20. కూడునుమోహవైరములుఁగూడునహంకృతి జీవితమ్ములో
    వీడకవెంటసాగునవి వేసటచెందగజేయుచిత్తమున్
    వీడకదైవచింతనము వేడుకనెల్లరు మోక్షమార్గమ
    న్మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
  21. మిద్దెవైపునకేగినమెట్లుగలవు
    మేడనెక్కగ,దిగవలెమూడుమెట్లు
    బండియొద్దకుబోగోరవలయునేని
    లిఫ్టుసదుపాయముగలదులేమ!మనకు

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. ఉత్పలమాల
      వేడుక నెక్క మెట్లనెడు పేరున బంధము, భోగ గర్వముల్
      జూడఁగ లేవు సత్యమును, శుక్తిని జేరిన నీరు ముత్యమౌ
      మాడికి నాత్మనే సులభమైన విధంబుగ దైవధామమన్
      మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

      తొలగించండి
  23. ౙాడ దెలియగ ననుభవ సత్య మిదియె
    ఓడిగెల్వగ వలెనను నూత మందు
    విజయ పథమును జేరగ వీఁక గొనుచు
    మేడ నెక్కగ దిగవలె మూడు మెట్లు!

    రిప్లయితొలగించండి
  24. పదిమెటికలుండు నాయాస పడగ నేల
    మేడ నెక్కఁగ ; దిగవలె మూఁడు మెట్లు
    వాడ నెక్కగ , ననెగుడ్డి వాడొ కండు
    మేనుకుండిన లోపము మేధకగునె

    మెటిక = మెట్టు
    ఎక్కు = ఆరోహించు , అధిష్ఠించు

    రిప్లయితొలగించండి
  25. అస్తమించగ సూరీడు నాకశమున
    జాజిపూలను కోయంగ సత్వరముగ
    మెట్లు నెక్కగా, దిగవలె మూడుమెట్లు
    పూల సజ్జయె జారంగ లీలగాను!!!

    రిప్లయితొలగించండి
  26. లేడను వారి తోడ యొనరింపక నూరక వాగ్వివాదముల్
    వీడక నమ్మకమ్ము గనిపించని దేవుని మానసమ్మునన్
    చూడ దలంచి సాగునెడ సుందరమౌ పరమాత్ముడుండెడిన్
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
  27. పీడితభూరిరోగపటుభీకరతాపవిమోచనార్థమై
    వీడ వలెన్ నిరంతరము వెజ్జులు చెప్పు నిషిద్ధ భుజ్యముల్,
    వేడుక కైననున్ మధువు, విస్త్రతశీలవిశృంఖలత్వముల్
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
  28. చేడియఁ బంధిసేసి కద శ్రీరఘు రాముని గాంచె రావణుం
    డేడి జనార్దనుండనిన హీనుడు గాంచెను దివ్యరూపమున్
    వేడుకతోడ నెప్పుడును పిల్చిన పల్కవు, మోక్షమన్న యా
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి

  29. బాడుగనీయరాదలచభాస్కర!చూడుమురంగురంగులా
    మేడనుజేరరెండునొకమెట్లుదిగందగు,మోక్షగామికిన్
    వేడుటయొక్కటేశరణువేంకటనాధునినెల్లవేళలన్
    వీడకనెప్పుడున్ భజనవీవనపూజలుభక్తితోడుతన్

    రిప్లయితొలగించండి
  30. కాడునఁ గాలు దేహమిది, కాల్చెడు వాంఛల నిప్పులందునన్
    మాడుచు జీవితాంతమిల మ్లానముగాఁ జెడుటెందుకో సఖా!
    వేడుచు ముక్తికై యహము ద్వేషము గర్వము మాని దివ్యమౌ
    మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్

    రిప్లయితొలగించండి
  31. పాడగసాగె గాయనియె ,పాటుగనేర్వనికీర్తనల్ ప్రభూ
    వేడుకయాయె శ్రోతలకు ,వేళముకోలముజేయనాపెనే
    తోడుగరానిరాగములు , తొయ్యలి పాలిట గార్ధభమ్ములై
    మేడనుజేరరెండునొక ,మెట్లుదిగందగుమోక్షగామికిన్
    *********************************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  32. కాడె ! మానవుడు! దయతోగాని కాన
    రాడె తోటివారిని ! నహంవీడి తోడు
    నీడగ ,నలుగురిలొ నొకడిగ నిలవగ
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు


    రిప్లయితొలగించండి
  33. బతుకున యెదుగు బొదుగులు పదిమెటికలు
    మేడనెక్కఁగ , దిగవలె మూడుమెట్లు
    మాదిరిగ నుండుటనెరిగి మసలు కొనుట
    విజ్ఞతను జూపు నని నేర్చు వేగిరముగ

    రిప్లయితొలగించండి


  34. వేగ పనులు జరుగనెంచ బిడియపడక
    మేడ నెక్కగ దిగవలె మూడు మెట్లు
    తలచి చూడంగ జగతిలో తప్పు కాద
    టంచు పెద్దలాడెడి మాట లాలకించు.

    రిప్లయితొలగించండి
  35. *సందర్భము*: మెట్లు ఎక్కునప్పుడు మనకు లిఫ్ట్ కనబడితే మెట్లు దిగి వచ్చేస్తాం కదా.. ఆ ఉద్దేశ్యముతో .😃😊

    *తే గీ:*

    ఆకశభవనమెక్క నలసట లేక
    నెదురుగ కనబడగ నాకు, నేర్పుతోడ
    లిఫ్ట్ ను బట్టి పోవగ నవలీలగనిట
    మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

    కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
    🙏🙏

    రిప్లయితొలగించండి
  36. వమరొక పూరణ

    విడుపు పట్టు లున్న పనులు వేగమగును
    భేషజములకు పోవంగ వెతలె మిగులు
    ననుచు మదినెంచి సతతము హాయిగాను
    మేడ నెక్కగ దిగవలె మూడు మెట్లు.

    రిప్లయితొలగించండి
  37. వీడగలేనికోపమది,వేదికలెక్కును తారనందగా!
    తోడుగరాని శాంతమున,తొయ్యలులందరు,తాపమందగా
    వేడగనేమి యుండదిక,వేదనలన్నియు డిగ్గజేయగా!
    మేడనుజేర రెండునొక, మెట్లు దిగందగు,మోక్షగామికిన్.

    రిప్లయితొలగించండి
  38. చూడగ జూడగారుచుల జాడలు వేరవు కాలవాహినిన్ !
    తోడుగవెంటరావుగద, తొల్తన బుట్టిన కోర్కెలెవ్వియున్
    వీడగమేలు కాంక్షలను ,విస్తృతమైనటువంటిదృష్టితో
    మేడను జేరరెండునొక,మెట్లుదిగందగు మోక్షగామికిన్.

    రిప్లయితొలగించండి
  39. తోడుగరావు బంధములు,దోషముగాదది ధర్మబద్ధమే
    వీడుటమేలుగా మదిన,వేదననింపెడు కోర్కెలన్నియున్
    పాడయిపోక మానసము,పావన ధాత్రినవెల్గులీనగా
    మేడను జేరరెండునొక,మెట్లుదిగందగు మోక్షగామికిన్.

    రిప్లయితొలగించండి