సందర్భము: ఏత ద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః బలా త్వతిబలా చైవ సర్వ జ్ఞానస్య మాతరౌ బా.కాం.22-16 బల అతిబల అనే ఈ రెండు విద్యలూ లభిస్తే నీ కెవ్వరూ సాటి రారు. ఇవి సకల జ్ఞానానికీ మూలభూతాలు.. అని విశ్వామిత్రుడు రాముని కా విద్య లుపదేశించినాడు. వెంట వెళ్ళినంత మాత్రాన విశ్వామిత్రుడు ఆచార్యుడై ఏ గురుదక్షిణా అడక్కుండానే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అస్త్ర మంత్రాలను రాముని కుదేశించినా డని, రాముడు తాటకిని వధించినా డని, శివధనుర్భంగం గావించినా డని విని అయోధ్యలోని ఒక పౌరుడు మురిసిపోతూ మరొకనితో ఇలా అంటున్నాడు.. అదీ సందర్భం. (మామూలు బడులలో మామూలువే చెబుతారు. మామూలు పనులకే అవి పనికివస్తాయి. లోక కల్యాణం కోసం విద్యలు నేర్పరు. పొట్ట కూటికోసం నేర్పేవి కదా!..)
సందర్భము: "పనిని తప్పించు కోవడానికి బడికి పోతున్నాడు వాడు.. నిజంగా చదువుకోవడానికి కాదు. వాడు పనికి (పొలం పనికి) రాడు. తప్పుడు చదువు చదువుతున్నాడు." అని వ్యవసాయానికే అంకితమైన ఓ పేదరైతు తన కొడుకుగురించి మథనపడుతున్నాడు. నాగరికత నేర్చి నాజూకు పనులకే పనికివస్తా రని అతని ఆవేదన.
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
స్వీయ చరిత్ర:
తడబడకుండ నాంగ్లమున తన్మయుడౌచును వ్రాసి పొత్తముల్
హడలుచు మాతృభాషనగ హంగులు కూర్చియు తల్లడిల్లుచున్
కడకిక వ్యర్థపూరణలు కాసిని జేయుచు; ముత్తుకూరునన్
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్
తొలగించండి* మాతృభాషయన ?
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మాతృభాష యన" అనడమే సాధువు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
SIIBH School, Muttukur (1952-57)
జడియక హెడ్డు మాస్టరుకు జంకును వీడుచు డ్రిల్లునందునన్
పడతుల మీద గౌరవము ప్రాయము నందున లేకపోవగా
తడికల చాటు బాలలకు ధైర్యము జూపుచు కన్నుగొట్టగా
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిSome వాదం ! సమ, వేదం.
పంప వమ్మ పిల్ల వాడిని చాకిరీ
కనగ, "లొల్లి చేయ కయ్య" తల్లి
చెప్పె "చదువు కొనగ చేవయు గూడును,
బడికిఁ బోవు వాఁడు పనికి, రాఁడు"
జిలేబి
రిప్లయితొలగించండితండ్రి తో తల్లి మన బడి ; జై జగన్ :)
అడుగుల కాని యామడువు లా యడి యాళుర మైతి మయ్య ! పో
కడ యిక మార గాను మన కర్మయు మారును! పిల్ల వాడయెన్
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు; జగమ్మున వ్యర్థుఁడై చెడున్
వడివడి నేర్వకున్న ! మన బాళి యికన్ వలదయ్య వానికిన్
జిలేబి
వస్తుందా పదిహేను వేలు జనవరి తొమ్మిదో తారీఖు ? :)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండినీతి దప్పి యెట్టి నియమంబు లనుగూడ
రిప్లయితొలగించండిసరకు గొనక మనసు చంపుకొనుచు
పాపభీతి లేక బరగి యక్రమపు రా
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీసమస్య లోన నేసమస్యయు లేదు
రిప్లయితొలగించండిఉన్న మాట చెప్పి యుండినారు
పనికి జనెడు వాడు బడికి బోనేరడు
బడికిఁ బోవువాఁడు పనికి రాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపనికి పిలువ బోకు పసివాడు కాదుటె
రిప్లయితొలగించండిభావి పౌరు డతడు భవిత కొరకు
చదువు కొనగ దలచె సహకరింపుమికను
బడికిఁ బోవువాడు పనికి రాడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపదవి బొంది తాను పలు కార్యములు జేయ
రిప్లయితొలగించండిలంచ ములకు మరిగి కొంచ మైన
నీతి లేని దుష్ట నీచు డ క్రమ పు రా
బడి కి బోవు వాడు పనికి రాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధనమె ముఖ్య మిపుడు ధరణిలోన యనుచు
రిప్లయితొలగించండివేల కొలది సొమ్ము పెంచు కొనగ
జేయ దగని పనుల జేయగ వచ్చు రా
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ధరణిలోన ననుచు" అనండి.
(1)
రిప్లయితొలగించండిప్రజల బాగు మరచి రాజ్యభోగములందు
సతము మునిఁగి పన్ను లతిగ వేసి
మూర్ఖచిత్తుఁ డగుచు మురియుచు పుడమి యే
ల్బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
(2)
ఎడపక దుష్టకార్యముల నెల్ల నొనర్చుచు, నీచసంగతిన్
బిడియము వీడుచున్ దిరిగి, పేదలనైనను జాలి వీడి యి
బ్బడిగను దోచుకొంచుఁ దన భాగ్యమె చాలని యక్రమంపు రా
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిజడునకు విద్యనేర్పుటయె జన్మకు ధన్యత గూర్చునంచునెం..
చెడు మతిమంతుడే గురువు! శిష్యుల వృద్ధిని గోరునెప్పుడున్!
విడిచియు సిగ్గునెగ్గులను వేతనమే ముదమంచునెంచుచున్
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిగొప్ప పండితుడుగ కొలువ బడెడి వాడె
రిప్లయితొలగించండివడిల లోన తెల్పు,బడికి వెళ్లి
చదువ కున్న నేమి జరుగ గలదు తెల్పు,
బడికి పోవు వాడు,బాగు పడడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ సమూహంలో నా వ్యాఖ్యను గమనించండి.
వడిగొని రమ్మురా! సతము పాఠము లందువు క్రీడలాడినన్
రిప్లయితొలగించండికడుముదమందు, దేహము సుఖత్వముగాంచును, హాయి చేకురున్
బిడియ మదేల?యంచొకడు స్వీయమతంబును నిల్ప నిట్లనెన్
"బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిబడికి జనంగ నిష్టపడు
వాడు జగమ్మున వ్యర్థుడై చెడున్
( డబ్బుకక్కుర్తితో యుక్తాయుక్తవిచక్షణ లేక
చరించేవాడు పతితుడు ; భ్రష్టుడు )
వడివడి డబ్బు నెంతటినొ
వంచన జూపుచు గూడబెట్టగా
పడుచుల దార్చుచున్ మిగుల
వావుల వీడుచు సంఘమందునన్
జిడుము వలెన్ మెలంగుచును
జీదరబుట్టగ జేయ ; నెట్టి రా
బడికి జనంగ నిష్టపడు
వాడు జగమ్మున వ్యర్థుడై చెడున్ .
( పడుచులు - కన్యలు ; చిడుము - తీటకురుపు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు"
*ఆ.వె**
తెలుగు దేశమందు తెలుగున బోధించు
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
తెలుగు మాధ్యమమ్ము తీయుట మేలని
నాంగ్లభాష రుద్దె నాంధ్ర మంత్రి
................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మేలని యాంగ్లభాష.." అనండి.
కన్నవారలన్న కరుణకు చిహ్నాలు
రిప్లయితొలగించండివిలువనీయకుండ విడువరాదు
మతమువేరటంచు మనసునువిరిచెడు
బడికిబోవువాడు పనికి రాడు
****************************
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెడును బోధ చేసి శృంగార లీలల
రిప్లయితొలగించండితడిపి తడిపి చెత్త దారులందు
పడగ జేసి పాప పంకిలమున ద్రోయు
బడికి పోవు వాడు పనికి రాడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిdhanya vaadamulu
తొలగించండిక్షేమమనుచు రాష్ట్ర క్షితి
రిప్లయితొలగించండిదెగనమ్మి రా
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
ప్రభుతనడుప దగిన పదవి జే పట్టగ ,
యనుచు నెరిగి యెంచు మాంధ్ర మనుజ
క్షేమము = సంక్షేమము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జేపట్టగ ననుచు..." అనండి.
కడవలకొద్ది కష్టములు, కండ్లను నీటినిగ్రుక్కువుండగా
రిప్లయితొలగించండివిడివడకున్నబంధములు,వీడవునెప్పటికైననీయిలన్
పడిఫడిలేచు మేఘములు,పండుగజేయకనుండునట్టియా
బడికిజనంగనిష్టపడువాడు,జగమ్మున వ్యర్ధుడై జనున్
++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గ్రుక్కుచుండగా...' టైపాటు.
వడివడివచ్చుమేఘములు ,వానల దండిగనివ్వకున్నచో
రిప్లయితొలగించండిసుడివడిబోవుకర్షకులు ,స్రుక్కుచుసోలుచుదీనవస్థలో
అడుగులుముందుగా,బడక యాశలతీరముదూరమైనయా
బడికిజనంగనిష్టపడువాడు,జగమ్మున వ్యర్ధుడై జనున్
++++++++++++++++++*
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ లో నా వాఖ్యను గమనించండి.
దేశ స్వేచ్ఛ బొంది దశకంబులైనను
రిప్లయితొలగించండిబానిసత్వముంది భాషలోన
జగను ప్రభుత చర్య సారాంశమిది, తెల్గు
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. 'దేశ స్వేచ్ఛ' అన్నపుడు 'శ' గురువై గణభంగం.సవరించండి.
విడక శ్రద్ధ సరిగ విద్య నేర్చెడివాడు
రిప్లయితొలగించండిబడికిఁ బోయివాఁడు బాగుపడును
విడిచి శ్రద్ధ గురుని విశ్వసింపక మొక్కు
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాఠములను చెప్పు ప్రజ్ఞయే లేకుండ
రిప్లయితొలగించండియితరవృత్తులఁ గొని యింటియొద్ద
చూచి పుస్తకముల వాచించి, బడికి రా
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"లేకుండ నితర..." అనండి.
తల్లి బంప బడికి థామసాల్వెడిసన్ను
రిప్లయితొలగించండిచదువు రాదటంచు చవట కనగ
బడులు మానివేసి బల్బునే కనిపెట్ట
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివ్రాయ బడెను చెప్ప బడెనను మాటల
రిప్లయితొలగించండివ్రాసె,చెప్పె ననుచు వ్రాయుమనిరి
వ్రాయ బడు ననిరట వాని బడుద్ధాయి
"బడి"కిఁ బోవువాఁడు పనికిరాఁడు
మూడోపాదం సవరణ:
తొలగించండివాడ "బడు",ననిరట వాని బడుద్ధాయి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎప్పుడో దశాబ్దాల క్రితం 'బడు'మీద జరిగిన వాదోపవాదాలను గుర్తుకు తెచ్చారు.
ఆ.వె.
రిప్లయితొలగించండిరాజకీయ మందు రాశులు గడియింప
వట్టి పూజ లన్న వంద వేలు
చదువు సంధ్య లేల చక్కబెట్ట పనుల
బడికి బోవు వాడు పనికి రాడు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెద్దచదువు చదివి పేరుగాంచవలెన
రిప్లయితొలగించండిటంచుతలచు చుంటి నతివ వినుము
కూలిపనులు చేయు కోరబో కిప్పుడు
బడికి పోవు వాడు పనికి రాడు
బుద్ధిశాలి యగును పుడమిలో సతతము
బడికి పోవు వాడు; పనికిరాడు
వలదు చదువటంచు పలికెడి మూర్ఖుడు
పంప వలెను తల్లి వాని బడికి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"...చేయ కోరబో కిప్పుడు" అనండి.
అయ్య!నాదుకొడుకుహర్షవర్ధనుడిక
రిప్లయితొలగించండిబడికిపోవు,వాడుపనికిరాడు
వేరుకుఱ్ఱవాని పిలుచుకొనుడుమీరు
వేరుదలచవలదువేణుసామి!
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిపడయఁగ రాజసూయమున వాసిగ రాశిగ రాజ్యసంపదల్
జిడుగన ధర్మజున్ శకుని చిత్తుగ నోర్చఁగ జూదమందునన్
సుడిగొని పాండు నందనలుఁ జూడరె కష్టము లెన్నొ? జూదపున్
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిడువడు విష్ణు నామమును విద్యను నేర్వడు బాలుడెట్లు తా
రిప్లయితొలగించండిచెడెను? గురూపదేశమది చేకొనడెంతగ చెప్పినన్ శివా
బుడతడు మారడాయె హరి భూతము బట్టెనహో మరేమి తా
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుడమిని భావిపౌరులకు బుద్ధులు నేర్పుచు దిద్ది తీర్చెడిన్
రిప్లయితొలగించండిబడులవి, జ్ఞానవాటికలు వాణివిలాసపు క్షేత్రముల్ గదా
వడవడ వాగుటేల యిది పద్ధతి కాదనెఱంగు మెవ్విధిన్
బడికిఁ జనంగ నిష్టపడు వాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అని+ఎఱుంగుము' అన్నపుడు సంధి లేదు. "కాదని యెంచు మెవ్విధిన్" అనండి.
నడిపెద రాష్ట్ర మంతటిని నవ్య పథమ్మున జూడుడంచునే
రిప్లయితొలగించండిగడుపుచు కాలమున్ గతపు కార్యములన్నియు రద్దు జేయుటన్
విడుచుచు ధర్మ మార్గమును పెంచుచు ద్వేషములందు ముంచి రా
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబడుగుల జీవనమ్ముల నపారదరిద్రముఁ బాపి, యెవ్వరే
రిప్లయితొలగించండినిడుముల నొందగా సహకరించుచు, ధార్మికవర్తనంబుతోఁ
దడయక మోక్షమార్గముల తత్వముఁ దెల్పెడు రీతి నాచరిం
చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్
నిన్నటి పూరణ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహిరణ్యకశిపుడు రాక్షస గురువుల తో...
రిప్లయితొలగించండిఆటవెలది
రాక్షస గురు లార! ప్రహ్లాద పుత్రుండు
హరి భజనల మునగ నంగలార్చు
శత్రువైన వాని చదివెడు శ్రద్ధతో
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుడమిననున్న పిల్లలకు,పూర్తిగవిద్యలునేర్పకున్నచో
రిప్లయితొలగించండివిడువడకుండు కష్టములు ,వీధికినీడ్చును తప్పకుండగా
సుడివడజేయు కోరికల , శూన్యముజేయకనూరకున్ననీ
బడికిజనంగనిష్టపడువాడు,జగమ్మున వ్యర్ధుడై జనున్
+++++++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పుడమిని నున్న...జేయక యూరకున్న"అనండి.
బాలు నుంచ మింకఁ జాలు నీ ఘోరమ్ము
రిప్లయితొలగించండిమేలుకొంటి మిపుడు కాల మెఱిఁగి
మాఱె రోజు లయ్య మా బిడ్డ చక్కంగ
బడికిఁ బోవువాఁడు పనికి రాఁడు
గడగడ లాడు దేశములు కైతవ మెల్లెడ వ్యాప్తిఁ జెందగం
దడబడు మాటలెల్లయు వృధా యగుఁ గార్యము లెల్ల వారికిన్
విడువక దుష్ట కార్యములు భీతి నొసంగెడు క్రూరు మూర్ఖు నే
ల్బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'ఏల్బడి'ని ప్రయోగించింది మన మిద్దరమే అనుకుంటాను.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅవునండి గమనించాను.
తొలగించండిమనమిరువురమే యేల్బడి
యను పదమును చేర్చి నామయా కవి వర్యా
అనగా గమనించితి మే
మని వారున్ను నుడివిరి సమాధానముగా :)
జిలేబీయము :)
పలుకే మఱి పరిమళంపుఁ బద్యంబయ్యెన్
తొలగించండి
తొలగించండిఅలుకుచు నలుకుచు గురువుల
కొలువును విడువక జిలేబి కుస్తీలన్ చే
య, లలితపు పదములు కుదిరి
పలుకే మఱి పరిమళంపుఁ బద్యంబయ్యెన్!
:)
జిలేబి
*27/12/2019*
రిప్లయితొలగించండిగురువులందరికీ నమస్సుమాంజలి 🙏🙏🙏
ఈరోజు సమస్యాపూరణము
*బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు*
*ఆ వె:* 🌹
పాలన తెలియదిక పనియును రాదుగ
చేయ దలచిన పని చేత కాదు
పంపి జూడఁగ బల వంతము జేతను
*బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు*
**********************
*రెండవ పూరణము* 🌹🌹
*ఆ వె*
భారతావని నిట వరము లివియనుచు
తరచి జూడఁ నిజము తెలిసికొనుడు
మనకు నాయకుడవ మన నేల, చదువగ
*బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు*!
***********************
*మూడవ పూరణము* 🌹🌹🌹
*ఆ వె:*
అమ్మ నాన్నల ధన మధిక మైనదనుచు
చదువు కొనుట కాదు చదువు కొనగ
పగలు రేప తాను పవరు జూపఁగనిట
*బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు!*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురువర్యా ...ధన్యోస్మి 🙏🙏🙏
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచదువు నేర్చుకొన్న చందంబుగనినంత
ఇంటి పనులు జేయ నిష్టపడక
ఆర్థికావసరము ఆవశ్యకముగాగ
బడికిఁ బోవువాఁడు పనికిరాఁడు!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ఆర్థికావసరము లావశ్యకములౌట" అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బడికిఁ బోవు వాఁడు పనికిరాడు"
సందర్భము:
ఏత ద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః
బలా త్వతిబలా చైవ సర్వ జ్ఞానస్య మాతరౌ
బా.కాం.22-16
బల అతిబల అనే ఈ రెండు విద్యలూ లభిస్తే నీ కెవ్వరూ సాటి రారు. ఇవి సకల జ్ఞానానికీ మూలభూతాలు..
అని విశ్వామిత్రుడు రాముని కా విద్య లుపదేశించినాడు.
వెంట వెళ్ళినంత మాత్రాన విశ్వామిత్రుడు ఆచార్యుడై ఏ గురుదక్షిణా అడక్కుండానే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అస్త్ర మంత్రాలను రాముని కుదేశించినా డని,
రాముడు తాటకిని వధించినా డని, శివధనుర్భంగం గావించినా డని విని అయోధ్యలోని ఒక పౌరుడు మురిసిపోతూ మరొకనితో ఇలా అంటున్నాడు.. అదీ సందర్భం.
(మామూలు బడులలో మామూలువే చెబుతారు. మామూలు పనులకే అవి పనికివస్తాయి. లోక కల్యాణం కోసం విద్యలు నేర్పరు. పొట్ట కూటికోసం నేర్పేవి కదా!..)
పనికివచ్చు నతడు=పనికివచ్చును రాముడు
దానికి = లోక కళ్యాణ కార్యానికి
~~~~~~~~~~~~~~~~~~~~~~~
కనుగొనగా ముని గొనిపోయినది యేమొ
ఘనమైన యాగంబుఁ గాచుట కట!..
ఒప్పార నుపదేశ మొనరించినది యేమొ
యనుపమానములైన యస్త్రము లట!..
అనఘ విశ్వామిత్రు నంతటి యాచార్యు
డా రామచంద్రున కమరె నంట!..
ఆ తాటక వధించి, యలికాక్షు విలు వంచి,
యఖిల లోకారాధ్యు డయ్యె నంట!..
పని యనంగ నేమి టన లోక కళ్యాణ
మగును.. పనికివచ్చు నతడు దాని..
కది విశేష.. మంతె!.. అవనిలో మామూలు
బడికిఁ బోవు వాఁడు పనికిరాడు..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.12.19
-----------------------------------------------------------
తొలగించండిఅద్భుతం ! దేనికైనను రామాయణము మీకే చెల్లును వెలుదండ వారు !
వెలుదండ వారి పదపు ర
వళి చదువక బడికిఁ బోవు వాఁడు ప నికిరాఁ
డు! డవిణను భజాయించి వి
నుడనెద తప్పక చదువు పనుపడ జిలేబీ!
జిలేబి
వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జిలేబి గారూ,
ఆటవెలది సమస్యాపాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.
రిప్లయితొలగించండివడివడి పరుగిడకన్ తడ
బడి తడబడి బడికిఁ బోవు వాఁడు ప నికిరాఁ
డు!డబడబ మాట లాడని
బుడతడు కూడనిక పూవుబోడి జిలేబీ :)
జిలేబి
వృత్త్యనుప్రాసతోను, ఛందో వైవిధ్యంతోను మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిడువడుపుస్తకంబులనువీడడుశ్రద్ధనునెట్టివేళలన్
రిప్లయితొలగించండిబడికిజనంగనిష్టపడువాడు,జగమ్మునవ్యర్ధుడైచెడున్
చెడుపనులెన్నియోదఱచుచేయుచుశిష్టులబాధవెట్టుచో
బుడమినినట్టిపూరుషునిబుట్టుకచచ్చినవానితోడిదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...లెన్నియో తఱచు..." అనండి.
పిన్నవయసునందు పెనుభారమెందుకు
రిప్లయితొలగించండిచదువు నేర్వవలయు చక్కగాను
బాలకార్మికునొక పద్ధతిఁ జదివింప
బడికిఁ బోవువాఁడు, పనికిరాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబడియొక దేవళంబచట పాఠముఁజెప్పెడునొజ్జ దైవమే
రిప్లయితొలగించండితడబడు భావిపౌరులకు తల్లడముల్ తొలగించు పొత్తముల్
చిడిముడిపాటులేని సుఖ జీవన ప్రాప్తిని బొందు నిచ్చతో
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బడికిఁ బోవు వాఁడు పనికిరాడు"
సందర్భము: "పనిని తప్పించు కోవడానికి బడికి పోతున్నాడు వాడు.. నిజంగా చదువుకోవడానికి కాదు. వాడు పనికి (పొలం పనికి) రాడు. తప్పుడు చదువు చదువుతున్నాడు." అని వ్యవసాయానికే అంకితమైన ఓ పేదరైతు తన కొడుకుగురించి మథనపడుతున్నాడు.
నాగరికత నేర్చి నాజూకు పనులకే పనికివస్తా రని అతని ఆవేదన.
పోరగాడు = పిల్లవాడు
(మ.నగర్ మాండలికం)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
పొలము పనికిఁ బోర!
పోరగాడా! అంటి..
మోటుపని యటంచు మూతి దిప్పె..
తప్పు చదువుఁ జదువుఁ..
దప్పించుకొనుటకై
బడికిఁ బోవు.. వాఁడు పనికి రాడు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.12.19
-----------------------------------------------------------
ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
రిప్లయితొలగించండిసమస్యాపూరణ కార్యక్రమంలో...
28/12/2019 శనివారం ప్రసారమైన
నా పూరణ. . ఉ.మా.
**** *** ***
ప్రాణము దీయుచున్ మిగుల పాపము జేయుచు మెల్గు వారికిన్
దానవ జాతి వోలె కడు దైన్యుల పీడన జేయు వారికిన్
హీనగుణంబు గల్గి మరి హేయపు కార్యము సల్పు వారికిన్
దానము జేయగా కలుగు దారుణ వేదన సజ్జనాళికిన్
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
ఇన్నినాళ్ళు నేను వేధించిబంపితి
రిప్లయితొలగించండికూలి పనులకొరకు,కూలిపోవు
వాని భవితగాన వరుసరేపటినుండి
బడికిఁ బోవు, వాఁడు పనికిరాఁడు.
----గోలి.