కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గడ్డిపోచ చాలు కలహమునకు"
(లేదా...)
"కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"
(ఈ సమస్యను పంపిన కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారికి ధన్యవాదాలు)
(లేదా...)
"కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"
(ఈ సమస్యను పంపిన కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారికి ధన్యవాదాలు)
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
తెలియక మాయ సౌధమున తేకువ మీరగ చక్రవర్తియే
పలువురు జూడ నెత్తగను పంచను మెల్లగ దొర్వుదాటగన్
చెలియల గూడి నవ్వెడిని చేరువ నుండెడి రాణిగారి వోల్...
"కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాణిగారి వోల్...'?
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
Destruction of Troy:
మిలమిలలాడు దేహమున మెచ్చుము నన్నని దేవకన్యయే
హెలెనును లంచమివ్వగను యేపులు పండును గెల్వగోరుచున్
తెలివియె లేక ప్యారిసుడు తెచ్చెను ట్రాయికి ధ్వంసనమ్మునే!
"కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిTroy కథ చదివాను, సినిమా కూడ చూసాను.
🙏
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిచెలువము మీరు పారిజముఁ జేర్చెను రుక్మిణికంచు శౌరిపై
పెలుచన రేగ నారదుడు వేడుక సత్యకు జెప్పి నంతటన్
చిలికిన గాలివానకు శచీపతి యోడెను, మౌని పూనినన్
గలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండివిరిని కయ్యమునకు వేదికఁ జేసినన్
శౌరి యింద్రుల కది జగడమయ్యె
కలహబోజనుండు కదలి వచ్చినయంత
గడ్డిపోచ చాలు కలహమునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవెలది పాద గర్భిత కందము :)
సహనమ్ము లేని మనుజుల
బహణెని చూడగ క్షణమున భగ్గను కణికల్!
అహ! గడ్డిపోచ చాలు క
లహమునకు జిలేబి రేగు లావుగ మంటల్!
జిలేబి
ప్రశంసనీయమైన ప్రయోగం. పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బహణెని'?
తొలగించండిపదములకై ఆంధ్ర భారతి శరణు :)
బహణె-
నెపము; ఉపాయము; Pretence; Excuse; Contrivance; Evasion
జిలేబి
రిప్లయితొలగించండితలపుల తప్పు గాదు! తమ దారిని బోవుచు రాజకీయమున్
విలువయె లేని సంగతుల వేడిగ ఘాటుగ చర్చ చేయగా
పలుకులు తిట్లు గా మరలి బాదరబందిని తిట్టుకొంచు నా
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశరషట్పద
సహనమ్ము లేని
మనుజుల బహణెని
చూడగ క్షణమున భగ్గను కణి
కల్! గడ్డిపోచ
చాలు కలహమున
కు జిలేబి రేగు జ్వలనమహో
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపిశున మొకటి జేరి ప్రియమైన జానకిన్
రిప్లయితొలగించండిదాగడించు వేళ దాశరథియె
పరక విసుర నదియె బ్రహ్మాస్త్ర మయ్యెనే
గడ్డిపోచ చాలు కలహమునకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితలపున బుట్టు కోరికలు,దారిని దప్పెడు రీతినుంచగా!
రిప్లయితొలగించండివిలువలులేని నేతలను ,వీధికి వారినినెట్టగా జనుల్
పలుకులుముల్కులై విసర,పాలనజేసెడు వారు మారగా
కలహమురేపగాదగును,గాలికి లేచెడు గడ్డిపోచయే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిDhanyavaadaalu guruvaryaa
తొలగించండిఇలపయి సాధుభావమున నెల్లవిధంబుల స్నేహపూర్ణులై
రిప్లయితొలగించండిమెలగెడివేళ నొండొరుల మేలెదలంతురు మైత్రి క్షీణమై
తొలగినవేళ వారలతి దుర్మతులై కనిపింతు రచ్చటన్
గలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితెలుగు నాట జనుల తీటయె తీట సు
మ్మీ జిలేబి పాకమేను రగడ!
రాజకీయ మనెడు రచ్చని చర్చింప
గడ్డిపోచ చాలు కలహమునకు!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమెలకువతో మెలంగవలె మిత్రులు, మాటలు మీరుచో మనో...
బలము తొలంగు, దారి యగు వైరము జేరగ, జేరినంత వ్యా...
కులమగు పూర్వబంధమ., నుకూలురిలన్ ప్రతికూలవర్గమౌ !
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిలలనకు నేమి యిచ్చెను విలాసముగానొక పారిజాతమే!
తొలగించండికలహము పెట్టెనద్ది తన కాంతుని బేరము పెట్టి యమ్మగా!
ఇల తనకీయకున్న క్షమియించు., సపత్నికినీయ మెచ్చునే ?
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఎదుటి వారి పైన నేఁహ్య భావము గల్గి
రిప్లయితొలగించండిమనసు ద్వేష మందు మండు చుండ
కారణం బు వెదుక గత్యంత ర ము లేదు
గడ్డి పోచ చాలు కలహ మునకు
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి'ఏహ్య' మన్నపుడు అర్ధానుస్వార మెందుకు?
ఈరోజు కర్నూలుకు బయలుదేరుతున్నాను. 13, 14, 15 తేదీలలో కర్నూలులో మద్దూరి రామమూర్తి గారి శతావధానంలో ఉంటాను. 16 న తిరుపతిలో త్రిగళావధానంలో ఉంటాను. 17, 18 తేదీలలో చెన్నైలో ఉంటాను. నా ప్రయాణంలో ఎవరైన కవిమిత్రులు కలిసే అవకాశం ఉందా?
రిప్లయితొలగించండిఈ ఎనిమిది రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి. మీ పద్యాలపై నా స్పందన లేదని నిరుత్సాహ పడవద్దని విన్నపం.
తొలగించండికర్నూలులోన కాఫియు
వర్నా తిరుపతిని లడ్డు వరుసని సెల్ఫీ
డర్నామత్ సాబ్ చెన్నై
మెర్నా బీచిని కలిసెదమీ సారి సుమీ :)
జిలేబి
ఓర్నాయనో! జిలేబీ
తొలగించండికార్నామాల్ సెప్ప కమలగర్భుని వశమే?
రిప్లయితొలగించండిఉల్లిపాయపైన లొల్లియు హెరిటేజు
నీదనెడు రగడల నెత్తిపొడుపు
రెండు చేతులెత్తి రీతినమస్కృతి
గడ్డిపోచ చాలు కలహమునకు :)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలతలురేపుపాలనము,కానుకగాదుగ నేరికేనియున్
రిప్లయితొలగించండివిలువలు వీగిపోవు గద,వీధికిజేరిన మంత్రితీరులన్
తలపున ధైర్యమివ్వగల,దాంతులుయొప్పరు యెప్పుడేనియున్
కలహమురేపగాదగును,గాలికి లేచెడు గడ్డిపోచయే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దాంతులు + ఒప్పరు + ఎప్పుడు' అన్నపుడు యడాగమం రాదు. "దాంతులు సుంతయు నొప్ప రెప్పుడున్" అందామా?
పెండ్లి జేసికొనిరి ప్రేమ యనుకొని హా
రిప్లయితొలగించండిదేహ వాంఛ యనుచు తెలుసు కోక
తీరగానె తొలుత తిమ్మిరి నరుడికి
*"గడ్డిపోచ చాలు కలహమునకు"*
రామ్ కిడాంబి
వలపులు వాడగా యగును వారిజ పల్కులు వాడి కత్తులే
తలపులు తీక్ష్ణమే యగును దారులు మారగ బేర్మిబోవగా
కులుకులు ముల్కులే యగును కూరిమి బోయిన బెండ్లి యందునే
*"కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే"*
రామ్ కిడాంబి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో 'తెలుసుకొనక' అనండి.
రెండవ పూరణలో 'వాడగా నగును' అనండి.
(కలహంసను కబళించే దేవదత్తుడు - కాపాడిన గౌతముడు)
రిప్లయితొలగించండికలకలలాడు నింగి పయి
గల్వవలెన్ విహరించు హంసమున్
విలవిలలాడునట్లు తన
భీకరబాణము వైచి దత్తుడే
యిలపయి గూల్చి ; ప్రాణముల
నిచ్చిన గౌతము నీసడించెడిన్ ;
గలహము రేపగా దగును
గాలికి లేచెడు గడ్డిపోచయే !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికలహము లేపగా దగున! గాలికి లేచిన గడ్డి పోచ? యెం
రిప్లయితొలగించండిదులకయ గడ్డిపోచ, యటు తూగిన గాలి?, యివేవి లేకనే
కలహము రేగదే?, చెలగ కారణమై భువి మౌన, మెట్లుగా?
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమాలిమి కలుగునెడ మాత్రమె మిత్రత
రిప్లయితొలగించండియిద్దరి నడుమ పగ హద్దుమీర
పెద్దదైన హేతువేదైన వలయునా?
గడ్డిపోచ చాలు కలహమునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలహము రేగ నొక్కెడల కారణమయ్యెను నవ్వు, నొక్కచో
రిప్లయితొలగించండియలరువె కారణమ్ము కద, యక్కట మౌనమె హేతవొక్కటన్,
చెలిమిని గోరువారి యెద చేరి పవిత్రము కానిచో నటుల్
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే.
*గడ్డిపోచ చాలు కలహమునకు*
రిప్లయితొలగించండిభార్య భర్త నడి వివాదము వొచ్చిన
పోరుకు తగుదునని పొగరు జూపఁ
వైరము పెరుగుటకు వేరొకరున్నను
గడ్డిపోచ చాలు కలహమునకు
🙏🙏🙏🙏
రెండవ పూరణ..
తొలగించండి*ఆ వె*
సీరియస్ గ నింట సీరియలుగనుచు
చుర చుర మని కఠిన జూపు బెరిగి
అత్త కోడలు నడు మగ్ని రాజేసిన
గడ్డిపోచ చాలు కలహమునకు
కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
🙏🌸🙏🌸🙏
కలహముగట్టనేలయిటకాంతలు?? గట్టిగ అత్తగార్లపై
రిప్లయితొలగించండిసులువుగ ధారవాహికలు ,సూత్రమునేర్పెన ముష్టిపెట్టెలో
పలుకులు శూలమైన నవి, పావనధాత్రినిపాడుజేయునే
కలహము రేపగాదగును, గాలికిలేచెడు గడ్డిపోచయే
++++++++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
కలియుగమందు మానవులు కల్మష చిత్తులు దుర్మదాంధ దు
రిప్లయితొలగించండిర్మలిన దురాధిపత్య బధిరత్వ విలబ్ధులు జారచోరులే
విలువలు లేనివారె గద వీరలశాంతిని మ్రగ్గుచుండగన్
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
వలపున వానలో తడియు, వారికిపెద్దలు పెండ్లిజేయగా
రిప్లయితొలగించండితలపుల నూరుకోరికలు ,తాహతు మించుచు కొండలెక్కగా
విలువలు మాసిపోవునని ,విజ్ఞత భర్తయె జెప్పజూడగా
కలహము రేపగాదగును ,గాలికి లేచెడు గడ్డిపోచయే
********************************
రావెలపురుషోత్తమరావు
మనసు కష్ట పడిన మమత లుండుటెటుల ?
రిప్లయితొలగించండిస్పర్ధ తోడ బద్ధ శత్రువవుగ
రామ యన్న రామ రావణ యుధ్ధమే
గడ్డిపోచ చాలు కలహమునకు
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
*గడ్డిపోచ చాలు కలహమునకు*
సందర్భము: "రాముడు నాతో సమానుడు కాడు. జీవించియున్నాడో లేదో తెలియదు. నాతో క్రీడించు." అన్నాడు రావణుడు అశోకవనంలోని సీతతో..
చింతయంతీ వరారోహా
పతిమేవ పతివ్రతా
(భర్తనే గూర్చి ఆలోచిస్తున్నదై..)
తృణ మంతరతః కృత్వా
ప్రత్యువాచ శుచిస్మితా..
(నేరుగా మాటాడటానికి ఇష్టంలేక) ఒక గడ్డిపరక నడ్డంగా వుంచి పలికింది సీత. సుం.కాం.21స
అంటే ఒక గడ్డి పోచను త్రుంచి ముందుకు వేసింది. (ముందే కాముకుడైన రావణున కది క్రోధ కారణమయింది.)
సీత రావణునితో మాట్లాడినంతసేపూ వారి నడుమ ఆ గడ్డి పోచ వుంది. అంటే రావణుని గడ్డి పోచకన్న అల్పమైన వానిగా పరిగణించింది.
సాధ్వియైన సీత "పాపి ఉత్తమ సిద్ధి నాశించరాదు. నీవంటివాడు రాజైనందుకు లంక త్వరలోనే నశిస్తుంది. కాంతి సూర్యునినుండి వేరు కానట్టు నేను రామునినుండి వేరుకాను." అన్నది.
"ఒక లంక యేలుచు నుబ్బెద వీవు
సకల లోకములకు స్వామి రాఘవుడు.."
"అఖిల కంటకుడ వీ వన్ని లోకముల
నఖిల లోకారాధ్యు డా రాఘవుండు.."
అన్నది. (రంగనాథ రామాయణం)
పతివ్రతల చెరపట్టేవాడు సర్వనాశనం కాక తప్ప దని రామాయణ సారం. యువత గ్రహించవలసిన ప్రబోధం.
గ్రాస శకలము = గడ్డి పోచ ~~~~~~~~~~~~~~~~~~~~~~~
రామ పత్ని యుంచె రావణుఁ గని, త్రుంచి,
గ్రాస శకల మొకటి.. రావణునికి,
తనకు నడుమ దాన దనుజ కోపము హెచ్చె..
గడ్డిపోచ చాలు కలహమునకు..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
12.12.19
-----------------------------------------------------------
శ్రీ వినాయక
రిప్లయితొలగించండిఈ నాటి శంకరా భరణము సమస్య
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డి పోచయే"
మయసభలొ ద్రౌపది నవ్వు భారత యుధ్ధమునకు దారి తీసెను
మునులను కృష్ణుని తనయడు పరాచకములాడిన కారణమున యదుకుల నాశనము అయినది
సీతకు చిలిపి అనుమానము సౌమిత్రి పై కలిగిన కారణమున రామ రావణ యుధ్ధము కలిగినది అను భావన
కలికి పరాచకంబుయె ప్రఘాతముకున్న పదేశ మాయెగా
చిలిపి పిసాళమే కులపు జీబు వినాశ నిమిత్త మాయెగా
మలికితమే మహీసుత శ్రమంబు నకున్కతనంబు నాయెగా
కలహము రేపఁ గాఁ దగును గాలికి లేచెడు గడ్డి పోచయే"
ఇష్ట మున్న నింద యిచ్చును మందహా
రిప్లయితొలగించండిసమ్ము సుద్దు లన్ని సమ్మతింత్రు
కాని వారి వినరు కమ్మని మాటైన
గడ్డిపోచ చాలు కలహమునకు
ఇల సుఖ దుఃఖ యుగ్మముల నెంచు సమానవిధమ్ము బుద్ధిమం
తులు వర సంయమీంద్రులును దూలరె యింద్రియ వశ్యు లందునే
విలయ విధాయ కాసహన భీషణ దుర్జన గీఃప్రవాహమే
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
[ లేచెడున్ గడ్డిపోచయే= గడ్డి పోచయే లేచును]
చం.
రిప్లయితొలగించండిపలుకును వీడి సోదరులు పక్కగ చూచుచు సాగుచుండిరై
తలుపుల మూసి యేరలును తప్పుల నెంచుచు నీల్గు చుండగా
తెలియగ వచ్చె కారణము తిట్టగ కోడలి నత్త మెత్తనై
కలహము లేపగా దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
వై. చంద్రశేఖర్
అడ్డు లేక జనుల నణగ దొక్కెడి వారు
రిప్లయితొలగించండిగుడ్డి పనుల కొంప గూల్చు వారు
చెడ్డ వారి నడుమ జిన్నదైనను జూడ
గడ్డిపోచ చాలు కలహమునకు
విలువలులేని సంఘమిది వీధికినీడ్చెడు తీరు జూడగా
రిప్లయితొలగించండికలుషపుమానసమ్ములన కాగెడువారలవాక్కువిన్నచో
తులువలువీరులెమ్మనుచు తూలుచుపేలుచునుండువారికిన్
కలహమురేపగాదగును గాలికిలేచెడు గడ్డిపోచయే
+++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
అడ్డదిడ్డముగను నపవాదుపలుకుచు
రిప్లయితొలగించండినొకరికొకరుగోపమొందుచుండి
గడ్డిపోచచూపి కాచుకొనుమయన
గడ్డిపోచచాలుకలహమునకు
వలవల నేడ్చి చెప్పె సతి, వాకిలి నూడ్చగ ఫాంసుజాలమే
రిప్లయితొలగించండిచలమున తేలివచ్చి బలజమ్మున వాలెనటంచు తిట్టెనా
లలనయటంచుఁ బల్క కడు రట్టడితో నట కేగగన్ గనన్
గలహము రేపగా దగును గాలికి లేచెడు గడ్డి ఫోచయే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబిలబిలమాటలాడుచునుబెద్దలుమంత్రులుమంచిచెడ్డలన్
రిప్లయితొలగించండిదలచకనోటిదూలగనుదప్పుడుమాటలుబల్కన్యాయమే
యిలనవిరాష్ట్రగౌరవపుబెంపునుగడ్డిగజేయుటొప్పునే
కలహమురేపగాదగునుగాలికిలేచెడుగడ్డిపోచయే
పొరుగుపచ్చజూసి పొరలియేడ్చెడువాడు
రిప్లయితొలగించండికారణములవెదుకుకలహమునకు
కడకు కారణమ్ము కన్పట్టకున్నచో
గడ్డిపోచ చాలు కలహమునకు
కలియుగమందుదుర్మతులకారణవైరమెనైజమొప్పగా
వలవలనేడ్చువేరొకఁడు వాసిగ రాజిలజీవితమ్ములో
తలఁపరుమంచిచెడ్డలను తల్లడమందగజూచు వానినిన్
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే
రిప్లయితొలగించండిఆస్తి గొడవ వల్ల యన్నదమ్ముల మధ్య
పగయు పెరుగ ప్రేమపాశ ముడిగి
యొకరి నిగని యెక్క రోర్వని స్థితియందు
గడ్డిపోచ చాలు కలహమునకు..
ఆలుమగల నడుము నావిర్భవించెను
పిన్ని విషయమునకు పెద్ద గొడవ
జరుగు మాటపెరిగి సంతాపమేహెచ్చె
గడ్డిపోచ చాలు కలహమునకు
సరసమైన మాటె జగడ కారణమయ్యె
సర్ది చెప్పు టన్న సాధ్యమవని
యట్టి కార్యమవగ నంతరము పెరిగె
గడ్డిపోచ చాలు కలహమునకు
మరో మూడు పూరణలు.
రిప్లయితొలగించండిదూరదర్శనమ్ము దుర్దర్శనమ్మయ్యె
యింటి యందె రభస యెక్కువయ్యె
మంచి మాటలెల్ల మనసుకు చేదయ్యె
గడ్డిపోచ చాలు కలహమునకు.
కలిసినట్టి బ్రతుకు కలతలు మయమయ్యె
మరుగునపడి పోయె మమతలెల్ల
హితవు పల్కు నదియు హేళనగా మారె
గడ్డిపోచ చాలు కలహమునకు.
పాలు నీరు వోలె బ్రతుకు గడుపు చుండ
నోర్వలేని జనము లుర్వి యందు
తంపు లిడుచు నుండ తగవులు హెచ్చయ్యె
గడ్డిపోచ చాలు కలహమునకు
కలహమున్నచాలు కడుపునిండుననుచు
రిప్లయితొలగించండిసంతసించునట్టి చవటకెపుడు
మాటమూటలన్న మంత్రగాడికి నొక్క
గడ్డిపోచచాలు కలహమునకు
కె.ఈశ్వరప్ప.ఆలూరు
రిప్లయితొలగించండిఉల్లి మేలుజేయు ఉన్మాదమెందుకో?
రిప్లయితొలగించండితల్లికన్న మిన్న ఉల్లియాయె
బారులున్నచోట,బాధగనిలుచుండ
గడ్డిపోచజాలు,కలహమునకు.
తలపుల తంపెటన్ కమలి,దంపతులిద్దరు కాపురమ్ములో
రిప్లయితొలగించండివిలువలువీడకుండనట, వీధిన గొప్పగ పేరుబొందగా
కలుషముగల్గు కాంతలిల,కాకులవోలెను యీర్ష్యజెందుచున్
కలహమురేపగాదగును,గాలికిలేచెడు గడ్డిపోచయే.
కలుషమునింపుమానసము కాంతలకేలకొ? ద్రోహచింతనల్
రిప్లయితొలగించండివిలువలు లెక్కజేయకను,వీధికినెట్టెడు తీరు గర్హ్యమౌ
కులుకులు మానమేలుగద కూలగదోసెడ శాంతి పోకడల్
కలహమురేపగాదగును,గాలికిలేచెడు గడ్డిపోచలే!
ఆటవెలది లో నా పూరణ
రిప్లయితొలగించండినందరింట నత్తకోడలిమద్యన
గడ్డిపోచ చాలు కలహమునకు
ననుదినము నరకముననుభవించు పతికి
పండు గ దిన. మయ్యె నిరువురి జత
రిప్లయితొలగించండికలికిరొ దారుణ మ్మెదుట గాంచితివా యెదురింటి గోడపై
మొలిచిన గడ్డి మొక్క మన ముంగిట వాలిన దన్న భర్తతో
పలికెను భార్య ఘోర మిది వారికి బెట్టుడు గడ్డి యన్న దౌ
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే.