22, డిసెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3228 (బంగ్లాపైఁ గొలనున్నది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్"
(లేదా...)
"బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్" 

49 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    బంగ్లారాష్ట్రపు రాజధాని చనుచున్ బంగారు బాటందునన్;...
    జంగ్లీ పద్ధతి నాశ్రయించకను భల్ శాస్త్రీయమౌ భంగిలో
    నాంగ్లేయుల్ వడి కట్టి వీడినదటన్ హ్లాదంపు చౌరంఘిలో...
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా ఉవాచ:

    బంగ్లారాష్ట్రపు ముఖ్యమంత్రి ఘనమౌ బంధమ్ములన్ త్రెంచుచున్
    జంగ్లీ పద్ధతి నాశ్రయించి బలుపౌ శాపమ్ములన్ మోడినిన్
    బంగ్లాభాషను తిట్టుచుండగనయో వాదమ్ములన్ వీడుచున్
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    A-1)
    యింగ్లీకములను బెంచెను :
    __________________________

    ఇంగ్లాండు దేశమందున
    బంగ్లా వాడొకడు పెద్ద - భవనము పైనన్
    యింగ్లీకములను బెంచెను !
    బంగ్లాపైఁ గలదు కొలను - పట్టుఁడు చేపల్ !
    __________________________
    ఇంగిలీకము = చాలా మెత్తగా వుండి ముందు రెండు ముళ్లవంటి మీసాలుగల చేప

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  4. తెంగ్లీషుమాటలాడెడు
    కంగ్లీ జనులార రండు కబళంబిదిగో!
    ఇంగ్లీషు మేము సాహిబ
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్!

    రిప్లయితొలగించండి


  5. ఇంగ్లీషేల తెలుంగు చాలు వినుడీ యింగ్లాండు లోసైతమున్
    జంగ్లీలెల్లరు మాతృభాషయె ప్రశస్తంబంచు నేర్పింతురే!
    కంగ్లావాళ్లవకండి!రండి! నడుమున్ కట్టండి! ఆంధ్రంబనే
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆంధ్రంబనే బంగ్లా' చక్కని ప్రయోగం.

      తొలగించండి
  6. B-1)
    దొంగలనాయకుడు జట్టుతో :
    __________________________

    ఇంగ్లీకంబులనే విసారము లతిన్ - యింగ్లాండు దేశంబునన్
    బంగ్లా దేశపు వాడు పెద్ద యిలు, డా - బా పైన నాశంసతోన్
    జంగ్లా గట్టుచు బెంచ సాగె ! నిశీదిన్ - సంరావముల్చేయకన్
    బంగ్లాపైఁ గొలను న్న దేగెదమటన్ - బట్టంగ మత్స్యమ్ములన్"
    __________________________
    ఇంగిలీకము = చాలా మెత్తగా వుండి ముందు రెండు ముళ్లవంటి మీసాలుగల చేప
    జంగ్లా = కంచె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అతిన్ + ఇంగ్లాండు' అన్నపుడు యడాగమం రాదు. "విసారము లహో యింగ్లాండు..." అందామా? 'నిశీధిన్' అన్నచోట గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సవరణతో :
      B-1)
      దొంగలనాయకుడు జట్టుతో :
      __________________________

      ఇంగ్లీకంబులనే విసారములహో - యింగ్లాండు దేశంబునన్
      బంగ్లా దేశపు వాడు పెద్ద యిలు, డా - బా పైన నాశంసతోన్
      జంగ్లా గట్టుచు బెంచ సాగె, నసురన్ - సంరావముల్చేయకన్
      బంగ్లాపైఁ గొలను న్న దేగెదమటన్ - బట్టంగ మత్స్యమ్ములన్"
      __________________________

      తొలగించండి
  7. B-2)
    దొంగలనాయకుడి పత్రికలో తప్పుడు రాతలు :
    __________________________

    గుంగ్లీగాడదె పాడ సాగె కవితల్ - గుర్తించి మెచ్చండహో
    కంగ్లాగాడదె పంచసాగె చనుడీ - కార్తస్వరా కాసులన్
    ఉంగ్లీగాడదె మట్టి జేసె గనుడీ - యోధాను యోధుల్నదే
    బంగ్లాపైఁ గొలను న్న దేగెదమటన్ - బట్టంగ మత్స్యమ్ములన్"
    __________________________
    గుంగ్ = మూగతనం
    కంగ్లా = గతిలేనివాడు
    ఉంగ్లీ = అంగుళము, వ్రేలు

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కార్తస్వరా కాసులన్'?

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సవరణతో :
      B-2)
      దొంగలనాయకుడి పత్రికలో తప్పుడు రాతలు :
      __________________________

      గుంగ్లీగాడదె పాడ సాగె కవితల్ - గుర్తించి మెచ్చండహో
      కంగ్లాగాడదె పంచసాగె చనుడీ - కర్బూర భూషాదులే
      ఉంగ్లీగాడదె మట్టి జేసె గనుడీ - యోధాను యోధుల్నదే
      బంగ్లాపైఁ గొలను న్న దేగెదమటన్ - బట్టంగ మత్స్యమ్ములన్"
      __________________________
      కార్తస్వరాకాసులు = బంగారు కాసులు అని సందేహాస్పదముగనే ప్రయోగించాను
      కార్తస్వరము = కర్బూరము = బంగారము

      వసంత కిశోర్ (కవులూరు రమేష్)

      తొలగించండి
    3. కార్తస్వరంపంకముల్ - [కార్తస్వరంపు+అంకముల్] అనవచ్చుగదా
      అంకము =ఆభరణము

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    ఆంగ్లమ్మే హితమయ్యె , నాంధ్రమన నేహ్యంబయ్యె , నాలోచనల్
    కింగ్లానుండ రుచించె., నోట జలమూరెన్ మత్స్యమాంసాదులన్!
    జంగ్లీవాని ప్రవృత్తి తిండిగొననెంచన్ తిండిపోతిట్లనెన్
    బంగ్లాపైఁ గొలనున్న దేగెద!., *మటన్* బట్టంగ *మత్స్యమ్ములన్*"!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. బంగ్లా దేశమ్మందున
    నాంగ్లేయుల కాలమందు నందముగా నో
    బంగ్లా కట్టించిరి యా
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అనరాదు. "..నందముగ నటన్" అనండి.

      తొలగించండి
  10. జంగ్లీ లైఫె బెటర్, వరస్టు ద సిటీ, సమ్ డేస్ లెటజ్ టేకు లీవ్,
    బంగ్లాదేశపు సీమలోఁ గలదదే భాగీరథీ తీరమం
    దాంగ్లేయుల్ నివసించి పోయిన స్థలం బచ్చోట జెండా నిడన్
    బంగ్లాపైఁ; గొలనున్న దేగెద మటన్ బట్టంగ మత్స్యమ్ములన్.

    రిప్లయితొలగించండి
  11. ఇంగ్లాండందున విద్యనేర్చి యిట తానెంతో ముదమ్మందుచున్
    బంగ్లానొక్కటి గట్టెనే గనుమురా పద్మాకరమ్మచ్చటే
    యింగ్లీకమ్ముల కూరగోరితివిగా యింకేలనాలస్యమో
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  12. జంగ్లీ భాషను చేపను
    మంగ్లా ముఖికోరె నంట మచ్చీ యనుచు
    న్నాంగ్లమున ఫిషని పిలువగ
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    రిప్లయితొలగించండి
  13. ఇంగ్లీషు వాడొక డు దా
    బంగ్లా కట్టించి పెంచె బహు మత్స్య ము లన్
    జంగ్లీ వాడొక డ ని యెను
    బంగ్లా పై గలదు కొలను పట్టుడు చేప ల్

    రిప్లయితొలగించండి
  14. ఆంగ్లేయుం డొకడాడె మిత్రునకు దానాస్వప్నవృత్తాంతమున్
    "కాంగ్లీ"!వింటివె యంచు "జూచితినహో క్షారోదధీతీరమం
    దాంగ్లస్థాన మపూర్వవస్తుసహితం బాశ్చర్యదం బందునన్
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్.

    రిప్లయితొలగించండి
  15. మంగ్లీ పాటలు విందుమా? ముదముగా మక్కంకులే తిందుమా?
    ఆంగ్లపున్ సినిమాన?లేక కబడీ యాటన్న నీకిష్టమే?
    మంగ్లీ సోదర!యెక్కఁ గందుము దరిన్... మాయింటిపై నున్న యా
    బంగ్లాపైఁ, గొలనున్న దే(ది;+ఏ)గెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  16. జంగ్లీపై నొక పాట వ్రాసెనతడే, శ్రావ్యమ్ముగా పాడగన్
    మంగ్లీ వచ్చెను గాంచరా, మనము సమ్మానమ్ము నేచేయగా
    నింగ్లీకమ్ములె వండు, మామెనిక ప్రత్యేకమ్ముగా నుంచెదన్
    *"బంగ్లాపైఁ, గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  17. ఇంగ్లీషు భాష నేర్వగ
    బంగ్లా యన గుడిసె యనుచు పట్టని వాడౌ
    జంగ్లీ బాలుడిటులనియె
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    బంగ్లా = పూరియిల్లు (ఆం.భా)

    రిప్లయితొలగించండి
  18. ఆంగ్లపుఁ మోచెయి బెల్లముఁ
    "నాంగ్లుల"వగ నాకు డంత హాయిగ నాంధ్రుల్
    "ఆంగ్లప్రదేశు" యల్లదె
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    రిప్లయితొలగించండి
  19. జంగ్లీలోనుండెడి యా
    యింగ్లీకమ్ముల కొరకని యిపుడే వచ్చెన్
    మంగ్లీ, యివ్వుమొక గదిని
    బంగ్లాపైఁ , గలదు కొలను పట్టుఁడు చేపల్

    రిప్లయితొలగించండి
  20. 22/12/2019
    గురువులందరికీ నమస్సుమాంజలి 🙏🙏🙏

    *సరదాగా నా పూరణ*

    *బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్*

    సింగ్లీ గా నేనుంటిని
    సింగ్లీడ్లి వడలు తినవలె సిద్దము గదరా
    ఎంగ్లీ యనిన తిననులే
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    సింగ్లీ = సింగల్ గ
    ఎంగ్లీ = ఎంగిలి 😊😊😊

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸💐🙏💐🌸🙏

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్
    బట్టంగ మత్స్యమ్ములన్"

    సందర్భము:
    స సాగర మనాధృష్య
    మతిక్రమ్య మహాబలః
    త్రికూట శిఖరే లఙ్కాం
    స్థితాం స్వస్థో దదర్శ హ
    మహాబలశాలియైన హనుమంతుడు ఎదిరింప శక్యం గాని సముద్రాన్ని దాటి (కూడ) ఆయాసం లేకుండ స్వస్థుడై త్రికూట పర్వత శిఖరమునం దున్న లంకను చూసినాడు. సుం.కాం. 2-1
    వారిధిమీద వారధి కట్టినారు.
    వాసి గాంచిన లంకా పట్టణ ప్రాంతంలో కాలు పెట్టినారు.
    వానరుల సమరోత్సాహం మిన్ను ముట్టింది.
    అల్లంత దూరాన నున్న లంకా పట్టణాన్ని ఒళ్ళంతా కండ్లు చేసుకొని చూస్తున్నారు.
    సుగ్రీవుడు రామ కార్యార్థమై ఉద్యమించ బోతున్న వానరులతో ఇలా అన్నాడు దూరంనుంచి లంకా పట్టణాన్ని చూపిస్తూ...
    "బంగ్లానే త్రికూట పర్వతం. దానిపై నిప్పులా కణకణ మండుతున్న లంకాపురియే ఒక సరోవరం. రాక్షసులే ఆ సరోవరంలో చిన్నా పెద్దా చేపలు. మనమంతా జాలరులమై ఇక్కడికి చేరుకున్నాము. ఆ కొఱ్ఱమీనులు కొఱ్ఱమట్టలు మొదలైన వాటిని పట్టుకుందాం."

    ఇంగ్లము = అగ్ని, నిప్పు
    జంగ్లీ = అడవిది, మోటైనది,
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    బంగ్లా యన్నఁ ద్రికూట పర్వతము.. శో
    భన్ జిందు నద్దానిపై
    నింగ్లంబుంబలె వెల్గు లంకయె సర..
    స్సీ పట్ణమున్ జూడుడీ!
    జంగ్లీ పద్ధతు లున్న రాక్షసులె మ
    త్స్యాల్.. మీరలే జాలరుల్..
    బంగ్లాపైఁ గొల నున్న.. దేగెద మటన్
    బట్టంగ మత్స్యమ్ములన్..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    22.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. ఆంగ్లేయుల దేశమునొక
    బంగ్లాపైఁ గలదు కొలను, పట్టుఁడు చేపల్
    బంగ్లా దేశపు రకముల
    నాంగ్లేయులు తిందురచట నానందముగా

    రిప్లయితొలగించండి
  23. పెం గ్లిష్టంబౌ యీ పని
    కిం గ్లిన్నుఁడ నయితి మీర కేళిని నీ తొ
    ట్టిం గ్లిన్నము లయి తిరుగన్
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    [కొలను వంటి తొట్టి]


    నం గ్లేశాత్మునిఁ జేయ నెంచితిరి విన్నాణమ్ము మీఱంగ భ్రాం
    తిం గ్లాంతార్తుఁడ నైతి శబ్ద మిది యే దేశంపు సుద్దౌనొ యా
    యాంగ్లే యాగమ కారణమ్మున నహో యైనట్టి వంగక్షితిన్
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్

    [ బంగ్లా = బంగ్లా దేశము]

    రిప్లయితొలగించండి
  24. కం.

    కంగ్లీ యాయెను భాషా
    యింగ్లీ షన్యపు పలుకులు యిచ్ఛన జేరన్
    జంగ్లీ విధమున యెదుగన
    బంగ్లా పై గలదు కొలను పట్టుడు చేపల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. జంగ్లీజాన్వరులన్నియు
    బంగ్లా టైగరునుజూసి బారెనుభీతిన్
    మంగ్లీ నివసించెడునా
    బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్

    రిప్లయితొలగించండి
  26. బంగ్లావారలుతమతమ
    బంగ్లాపైకట్టుచుండ్రుపద్మినులదగన్
    నింగ్లీకంబులువేయగ
    బంగ్లాపైకలదుకొలనుపట్టుడుచేపల్

    రిప్లయితొలగించండి
  27. బంగ్లా దేశమునందు వింత యట బావా చూడుమీ ముచ్చటన్
    బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్, బట్టంగ మత్స్యమ్ములన్
    బంగ్లా తీరము సుప్రశస్తము గదా ప్రత్యేకమౌ స్వాదముల్,
    బంగ్లా వంటకముల్ ప్రసిద్ధముగ నే భావింతు నెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  28. బంగ్లాపైకొలనున్నదేగెదమటన్ బట్టంగమత్స్యంబులన్
    బంగ్లావారలుగట్టిరచ్చటసుమాపద్శాకరంబొక్కటిన్
    నింగ్లీకంబులతోడజక్కగనటన్ నిబ్బందిలేకుండగా
    బంగ్లాదేశపువాసులందఱుదగన్ భాగ్యమ్ములన్దూగుగా

    రిప్లయితొలగించండి
  29. జంగ్లీలో కట్టిన యా
    బంగ్లాపై కొలను గలదు పట్టుడు చేపల్
    ఆంగ్లము నందున యరచుచు
    నాంగ్లేయులకమ్మ వచ్చు నధిక ధనంబున్

    రిప్లయితొలగించండి