26, డిసెంబర్ 2019, గురువారం

సమస్య - 3232 (చెడు మతమున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో"
(లేదా...)
"చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్"
(జిలేబి గారికి ధన్యవాదాలతో...)

97 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. నడిరేయి సరదా పూరణ:

      పడుచును లేచి నవ్వుచును పైకికి నెత్తుచు కాగలించుచున్
      తడబడ కుండ ముస్లిముల తమ్ముల నెంచుచు పాఠశాలనున్
      చెడుగుడు నాడి హిందువులు చెన్నుగ సంతస మందుమమ్ము ముం
      చెడు మతమున్న లోకమున శాంతి చెలంగును సుస్థిరమ్ముగన్

      తొలగించండి
    2. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      (వృత్తసమస్యలోని యతిభంగాన్ని మీరు గమనించినట్టు లేదు)

      తొలగించండి
    3. 🙏

      యతిని చూసేంత మతి లేదు నాకు...రాసుకుంటూ పోవడమే పిచ్చిగా 😊

      తొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    కాచెడు మతమున్నపుడె :
    __________________________

    కడు యాశల తోడ జనులు
    వడి వడి జని చేర నందు - పరమాత్మ కృపన్
    బడయు నటుల జేయుచు, కా
    చెడు మతమున్నపుడె శాంతి - చెలఁగును భువిలో !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కడు నాశలతోడ..." అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కడకును బుర్క విప్పుచును గారబు రీతిని హైద్రబాదునన్
    పడుచును జూసి ప్రేమనిడి పండుగ జేయుచు విట్టుబాబు తా
    పెడసర బుద్ధులన్ విడిచి పెండ్లిని యాడుచు పాయసమ్ము, పం
    చెడు మతమున్న లోకమున శాంతి చెలంగును సుస్థిరమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      "మన విట్టుబాబు పెండ్లికొడుకాయెనే..."
      (వృత్తసమస్యలోని యతిభంగాన్ని మీరు గమనించినట్టు లేదు)

      తొలగించండి
    2. 🤣🤣🤣🙏🏻🙏🏻

      కడు వెతలన్ మునింగి ధృతిఁ గానని గేస్తుల కంటగింపుగాఁ
      బడతుల మాటలాడని యుపాయముచేఁ జను బ్రహ్మచారికిన్
      విడమని బ్రహ్మచర్యమను విట్టుల నాడుచుఁ, బెండ్లిచేసి "ముం
      చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్"

      తొలగించండి

    3. అషోక్ నగర్ టెలిఫోన్ ఎక్చేంజ్ జామ్ అయిపోవాలె :)


      భడవా! అప్పడియా మన
      వడా! విడువకన్ జిలేబి వనితల ఫోన్ కా
      ల్స్కడగట్టును! వటువుల ముం
      చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో


      జిలేబి

      తొలగించండి
    4. @ జిలేబీ మామ్మగారికి

      భలె భలే!!

      అన్నట్టు ఒక విషయము...
      నేను చెన్నై అశోక్‌నగర్‌నుండి హైదరబాదునకు మకాం మార్చితిని
      🙏🏻🙏🏻

      తొలగించండి
  4. A-2)
    అనాధలైన అమరావతి రైతుల బ్రోచెడి మతము :
    __________________________

    పడి పడి యేడ్చుచు నుండగ
    కడు శోకము తోడ నకట - కర్షకు లచటన్
    చిడిముడిపడ వలదని, బ్రో
    చెడు మతమున్నపుడె శాంతి - చెలఁగును భువిలో !
    __________________________
    మతము = అభిప్రాయము

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  5. A-3)
    శాస్త్రవేత్త కృషిని అందరికీ పంచెడు మతము :
    __________________________

    పడి పడి పెను యాతనలను
    కడు పనులనొనర్చు కృతక - కరమును జేయన్
    బడులను గుడులను వడి, పం
    చెడు మతమున్నపుడె శాంతి - చెలఁగును భువిలో !
    __________________________
    మతము = శాస్త్రము

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  6. పిడిగుద్దుల నన్యులు మీ
    దు డిగనురుక చింతయె వలదు సుమీ యనుచున్
    కడిగిన ముత్యము వలె దో
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!


    సహనమ్మే మా మతమ్ము సర్వంసహలోన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు


    తడబడు భువిలో మనుజులు
    కడు నిక్కము ధర్మమే వికసితమ్ముగనే
    నొడువుచు తలంపునే తల
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి


  8. పిడుగులు మీదు పడ్డను పవిత్రపు బుద్ధుల వీడకన్ భళా
    యడుగక ముందుగాను తమ యాస్తుల నిచ్చు విశాల మైన పో
    కడ, వసుధైవ యాజవపు కారుణమెల్లెడ చూపి యాద దో
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్!



    జిలేబి

    జి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యలోని యతిదోషాన్ని సవరించినందుకు శతధా ధన్యవాదాలు.

      తొలగించండి
  9. A-4)
    దుడుకడు, మెడ విడివడ , త్రుంచెడు మతము :
    __________________________

    గుడులను బడులను వడి చొర
    బడి కడు జను లెడల, వాడి - బాంబుల నిడు నా
    దుడుకడు, మెడ విడివడ , త్రుం
    చెడు మతమున్నపుడె శాంతి - చెలఁగును భువిలో !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృత్త్యనుప్రాసాలంకారంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. మూర్తి గారు శుభోదయము మూడవ పాదము గణ భంగము అయినది (అడుగడుగున నిండిన పరమాత్ముని లో జూ) సవసించవలెను

      తొలగించండి
    2. pks Kumar గారూ కృతజ్ఞతలండి.చూసుకోలేదు. రెండు, మూడు దీర్ఘ పాదాలు గా వ్రాశాను.

      తొలగించండి
  11. సమస్య :-
    "చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో"

    *కందం**

    పుడమిని చెడుగుడు యాడెడు
    కడు విధ్వంసకుల మనసు కరుణతొ నింపన్
    విడువక సతము హితము పం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో
    .......‌‌..............✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చెడుగుడు నాడెడు... కరుణను నింపన్" అనండి. (కరుణతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు)

      తొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    దీన గజేంద్రుని మొఱ :
    __________________________

    వడి వడి రావదేల నిక - బాధను నేను భరింపజాల నీ
    చెడు దృఢదంశకంబు నకు - చిక్కితి స్రుక్కితి దిక్కె నీవికన్
    సడలెను నాదు శక్తి యిక - జన్యము నే నొన రింపలేను నీ
    కడిమిని నమ్ముకొంటి కొన - కర్వరి తో నిను వేడుచుంటి; బ్రో
    చెడు మతమున్న లోకమున శాంతి - చెలంగును సుస్థిరమ్ముగన్ !
    __________________________
    కర్వరి = గాలి(ఊపిరి)
    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  13. ప్రహ్లాదుదు హరి నామము యొక్క గొప్పను తోటి విధ్యార్ధులకు తెలుపు సందర్భము

    ఎడదన్ సతతము తలచుచు,
    బెడదలు కలిగిన విడవక, బెదరు బడక నె
    ప్పుడు హరి నామము కీర్తిం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో"

    రిప్లయితొలగించండి
  14. B-2)
    మార్కండేయుడు శివలింగమును పట్టుకొని :
    __________________________

    అడవిని కందమూలముల - నాకలి దప్పుల దీర్చుకొంచు నీ
    గుడి గడి నున్న నన్ను తన - క్రూరపు పాశము వైచి లాగుటన్
    దడదడ లాడు చుండె హృది - ధర్ముని నాపుము వ్యోమకేశ ! కా
    చెడు మతమున్న లోకమున శాంతి - చెలంగును సుస్థిరమ్ముగన్ !
    __________________________
    కర్వరి = గాలి(ఊపిరి)
    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (వృత్తసమస్యలోని యతిభంగాన్ని మీరు గమనించినట్టు లేదు)

      తొలగించండి
  15. కవిమిత్రులారా,
    నమస్కృతులు. 
    నేనిచ్చిన వృత్త సమస్యలో యతి తప్పింది. జిలేబి గారి సవరణను ధన్యవాదాలతో స్వీకరించాను.
    మన్నించండి.

    రిప్లయితొలగించండి
  16. వడియగు విచారణ కొరకు
    విడిగ న్యాయస్థలులను వెల్లిగొలుపుచున్
    చెడు వర్తనులను ఖండిం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    వెల్లిగొలుపు = విస్తరింపజేయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విడిగ న్యాయ..' అన్నపుడు 'గ' గురువు కాదు. లఘువే. అందువల్ల గణభంగం.

      తొలగించండి
  17. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    రావణునకు విభీషణుడు హితబోధ

    ఏ పేరు తలచిన యిలలోని జనులకు సతతమ్ము కల్గును సంత సంబు,
    యే నామము పలుక యిడుములు రయముగ ప్రజలను వీడుచు పారు చుండు,
    యే నామము జపించి మౌని వరులు సద్గతులుపొందె ధరలోన, చెలువు నొప్పు
    నది హరి నామము, ముదముగ ప్రజల మానస వనమున నామ కుసుమములను
    పూ(చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో)న వీడుము పొచ్చములను

    శీఘ్రముగ పురోజన్ముడా, చేటు కలుగు
    నసుర జాతికి, దేశము నాశనంబు
    నగును, కోరుము శరణు శ్రీ నాధునను
    చు పలికె విభీషణుడునమస్సులనొసగుచు

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్"

    నడవడి చక్కదిద్దుచు., వినమ్రత నేర్పి., మతాంధమౌఢ్యధీ
    జడతను రూపుమాపుచు, ప్రసన్నకథాకలితార్థయుక్తులన్
    వడి బడులందునేర్పుచును భారతభారతియందు భక్తి పెం...
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. ఎడపక పుణ్యకార్యములనే యొనరింపఁగఁ బ్రోత్సహించుచున్
    విడిచియు మూఢతన్ బ్రతుకు వెల్గఁగఁ జేసెడి త్రోవఁ జూపుచున్
    పుడమిని లోకులెల్ల హితముం గనఁ మేలగు సూక్తులన్ వచిం
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  20. బిడియ మొకింత లేకయును విస్తృతరీతిని దుర్మదాంధు లీ
    యెడ జనమానసంబులకు నెల్లెడ కష్టము గూర్చుచుండి రీ
    జడులనెదుర్కొనం దలతు మేనియు నమ్ముడు నిక్కువమ్ముగా
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  21. దృఢ చిత్తంబును శౌచము
    గడు నిర్మల వర్తనంబఖండ శుభంబుల్
    విడువక నీశ్వరు లోజూ
    చెడు మత మున్నపుడె శాంతి చెలఁగును భువిలో"

    రిప్లయితొలగించండి
  22. తడబాటు లేని విధమున
    బడుగుల యున్నతిని గోరి పాలకు లెల్లన్
    విడువక పాలన సాగిం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి
  23. చెడుమార్గముల శమముడిగి
    పుడమిని వర్తిలుచు యువత పొలియుచు నుండెన్
    జడత విడనాడి లలిఁ బం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి

  24. (మనిషిలోని మనిషిని సరిదిద్దే మతమే
    మతం )
    అడుగున నున్న మానవుని
    యాశలు పూర్తిగ తీర్పగల్గుచున్ ;
    కడిగిన ముత్యమట్టులను
    కమ్మని వర్తన నేర్పగల్గుచున్ ;
    నడచెడు నేలతల్లి గని
    నర్మిలి మ్రొక్కెడివారి గౌరవిం
    చెడు మతమున్న లోకమున
    శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్ .
    (నర్మిలి - ఇష్టము ;శ్రేయము - మేలు ;
    నెక్కొను - కలుగును )

    రిప్లయితొలగించండి
  25. నడవడి పెంచెడు నీతులు
    తడయక ధర్మానురక్తి తప్పని గతులున్,
    సడలని దీక్షలు కడు పెం
    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో.

    రిప్లయితొలగించండి
  26. నడవడి లో రుజు మార్గము
    కడువడి నార్తులను గాచు కరుణా పరులై
    యెడ పక హృది మంచి ని వల
    చెడు మ త మున్నపు డె శాంతి చెలగును భువి లో

    రిప్లయితొలగించండి
  27. పుడమిని మానవాళి కడు మోదము నందువిధమ్ముగా సదా
    బడుగుల మేలు గూర్చువిధి పాలన సేతునటంచు స్వార్థమున్
    విడి మతసామరస్యతను బెంచెద నంచును చెప్పి యాచరిం
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్

    రిప్లయితొలగించండి


  28. నుడివెడు ద్వేషపు పల్కుల
    వడి ఖండించుచు జనులను వాత్సల్యముతో
    కడతేర్చుచు ప్రేమను పం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. జడములు చేతనమ్ములు సృజించి వహించి లయించు వానినె
    వ్వడనెడు తత్వభావవిభవంబు నెరుంగు వివేచ నాక్రియల్
    వొడుపుగ సేసి సర్వజనులొక్కటెయంచు సహించి గౌరవిం
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వొడుపుగ' అన్న పదం లేదు.

      తొలగించండి
    2. జడములు చేతనమ్ములు సృజించి వహించి లయించు వానినె
      వ్వడనెడు తత్వభావవిభవంబు నెరుంగు వివేచ నాక్రియల్
      ఒడుపుగ సేసి సర్వజనులొక్కటెయంచు సహించి గౌరవిం
      చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్"
      గురువు గారు
      ఒడుపు = పూనిక ( శ. రా.)

      తొలగించండి
  30. 26/12/2019
    అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
    ఈనాటి సమస్యాపూరణం

    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*

    చెడు వలదని తెలుపుచు నిల
    చెడు మంచిది కాదని మన చేతల నాపన్
    చెడు వీడఁని మంచిని పెం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  31. విడుమని విద్వేషములను
    చెడు దారుల పడవలదని జెప్పుచు నెపుడున్
    నడుపుచు ధర్మమునే దల
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి
  32. చంపకమాల
    విడువు మటంచు నీ మతము వేడుక జేరుము మమ్మటంచుఁ దా
    నుడువక ముక్తి మార్గమున నోచుము దేవునటంచుఁ బల్కుచున్
    దడబడ నట్టి జీవన విధానమునన్ గమనమ్ము నుంచఁ జూ
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  33. కందం
    గుడిఁ జేయుచు నీ యెడదను
    పొడఁ జూపఁగ దైవమచట పూనుమటంచున్
    బుడమి పరమత సహనమెం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చెడు మత మున్నపుడె
    శాంతి చెలఁగును భువిలో

    సందర్భము:
    అత్యాచారులు, హత్యలు మొదలైన నేరాలు చేస్తే అనవసరమైన తాత్సారం చేయకుండా ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా తక్షణమే శిక్షించాలి. అప్పుడే నేరాలు క్రమంగా తగ్గుతాయి.
    కశ్చి ద్దండ్యేషు యమవత్
    పూజ్యేషు చ విశాంపతే
    రాజు దోషులను యమునిలాగా కఠినంగా శిక్షించా లని పూజ్యులైన (నిర్దోషులైన) వారిని విశేషంగా గౌరవించా లని భారతం చెబుతోంది.
    పొరపాటుగా నిర్దోషులను శిక్షిస్తే వారి కన్నీళ్ళు ప్రభువుయొక్క సర్వస్వాన్నీ హరించగల వని రామాయణం చెబుతోంది.
    ధార్మికులకు అభయం అధార్మికులకు భయం కలిగించడంలోనే ప్రభుత్వ స్థిరత్వం వుంది. దానితోనే సమాజంలో శాంతి భద్రతలు నెలకొంటాయి. రామరాజ్య మంటే ఇదే కదా! అనుకుంటారు ప్రజలు..
    ధార్మికులను అనుమానిస్తూ అధార్మికును గౌరవిస్తూ స్నేహం చేస్తే ఎంతటి రక్షక భటులైనా ప్రజలచేత అసహ్యించుకోబడుతారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *శిక్ష ~ శాంతి*

    చెడు పనిఁ జేసిన తోడనె

    యడలక శిక్షించి, ధార్మికాళి కభయ మి

    చ్చెడు రామ రాజ్య మనఁ దో

    చెడు మత మున్నపుడె శాంతి
    చెలఁగును భువిలో

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    26.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  35. కడుగుచు చెడుగును మదిలో
    నడచుచు మోహము విరోధ మందరి యందున్
    విడువని సౌహార్ద్రము పెం
    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెడసర పోకడల్ గోనుచు పెద్దలమాటలు గౌరవించకే
      బిడియము గోలుపోవుచును బింకముజూపుచు భావిపౌరులే
      చెడు;మతమున్న లోకమున శ్రేయమునెక్కొను సుస్ధిరంబుగన్
      నడవడి నేర్పగాదగిన నైతికసూత్రము లొప్ప యందునన్

      తొలగించండి
  36. కుడువగనన్నముకరవై
    కడుబీదరికమ్మునందు గ్రాలెడువారిన్
    విడువక కరుణను రక్షిం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి
  37. కం.

    కడు సహనమ్మున నెల్లరు
    బడలిక నెఱుఁగక నెపుడును బంధుత నెరపన్
    కలసిన మనసులు గల, వల
    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  38. విడువక సాధువర్తనము వీడక సత్యమునెల్లవేళలన్
    తడబడకుండ ధర్మమునుదప్పక వర్తిలజేయు సజ్జనుల్
    వెడఁగుల బుద్ధిమార్చుటకు పేదల దీనుల నుద్ధరించిగా
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  39. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    చెడునడతల విడువు మెపుడు |

    నిడుముల యెడ వడలక నడు , మెడయని ధృతితో |

    నడరుచు హితునిగ , రాణిం

    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో ! !


    { అడరుచు = వర్ధిల్లుచు ; హితునిగ = పరోపకారిగ ;

    మతము = అభిప్రాయము ; }

    రిప్లయితొలగించండి
  40. చెడు వదలి పోవ, మంచిని
    వడివడిగ జనమ్ములెదల బాదుగొలుప ప్రే
    ముడి యనెడి కౌముదిని బం
    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో!

    రిప్లయితొలగించండి
  41. ఎడపెడముఖములతోడను
    నడయాడుచునుండకుండనాత్మీయతతో
    నెడదనునితరులనిలగా
    చెడుమతమున్నపుడెశాంతిచెలగునుభువిలో

    రిప్లయితొలగించండి
  42. పుడమిని జీవ హితార్థము
    నడరెడు సన్మతము మానవాళికి వలయుం
    గడు నాంక్షలు వెట్టు మతము
    చెడు, మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో


    ఇడుముల బారిఁ దూలిన నహీన ధృతిన్ ధరియించి చిత్త మం
    దడలును బాసి వాటి నిఁక దాటు విధమ్ముల నెల్ల నేర్పుచుం
    దడయక భవ్య జీవన విధానము సూపుచు మానవాళిఁ గా
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  43. ఎడదనుబ్రేమనొందుచునునేరికినైననుమేలుసేసికా
    చెడుమతమున్నలోకమునశ్రేయమునెక్కొనుసుస్ధిరమ్ముగన్
    విడువకనార్తిజీవులనుబ్రేమనుజూపుచునెల్లవేళలన్
    గడుగొనిసాయమిచ్చుచునుగాంక్షలుదీర్చగనొప్పునేసుమా

    రిప్లయితొలగించండి


  44. బడుగుల బ్రతుకుల నెంచుచు
    అడుగడుగునతీర్చిదిద్దుఅభ్యుదయంబున్,
    వడివడి సద్భావముబెం
    చెడుమత మున్నపుడె శాంతి చెలగును భువిలో
    కొరుప్రోలు రాధాకృష్ణారావు


    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చెడు మత మున్నపుడె
    శాంతి చెలఁగును భువిలో

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *పాఠ్య గ్రంథాలు*

    తడయక రామాయణమును,

    వడిగా భారతము, భాగవతమును, గీతన్

    విడువక నెపుడున్ జదివిం

    చెడు మత మున్నపుడె శాంతి

    చెలఁగును భువిలో

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    26.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  46. 26/12/2019
    అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
    ఈనాటి సమస్యాపూరణం
    🌹🌹
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*

    చెడు వలదని తెలుపుచు నిల
    చెడు మంచిది కాదని మన చేతల నాపన్
    చెడు వీడఁని మంచిని పెం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!*
    **********************
    *రెండవ పూరణ*🌹🌹

    మిడి మిడి జ్ఞానము తో చే
    సెడి భగవన్నామ జపము, సేవల కంటెన్
    వడి వడి గా మంచిని పం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*!
    **********************
    *మూడవ పూరణ*🌹🌹

    ఎడ తెరిపియె లేకుండగ
    గొడవలనెడి యా మనుజుల గొప్పల నాపన్
    గడ గడ లాడించుచు దం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!*
    **********************

    *నాలుగవ పూరణ* 🌹🌹

    బిడియము లెన్నడు లేకను
    వడి వడి గా మతము మార్చ పన్నాగముతో
    గడిపెడు వారల శాసిం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*
    ***********************

    *ఐదవ పూరణము* 🌹🌹

    బుడి బుడి యడుగులు వేయుచు
    తడబడి తప్పుడు పనులకు నడిచెడి జనులన్
    విడువక వారల ప్రేమిం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*

    *********************
    *ఆరవ పూరణము* 🌹🌹

    గడచిన కాలము నందున
    విడువఁగ పాపపు పనులను భీతియు తోడన్
    విడువక వారల ప్రేమిం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*

    ***********************
    *ఏడవ పూరణ* 🌹🌹

    బడిలో మతమని జెప్పుచు
    బుడతల మనసుకు మెదడుకు బుద్దిని మార్చన్
    చెడునిల నేర్పగ ద్వేషిం
    *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సుమాంజలి
      🙏🙏🙏
      *చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో*

      *ఎనిమిదవ పూరణ*

      అడుగరు జనులని యా దే
      వుడితో వ్యాపారమనుచు పూజకు దోచే
      గుడి దొంగల యంతుని దే
      *ల్చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
  47. చెడునడవడికల నెల్లయు
    విడనాడుచునెల్లపుడును పెద్దల పట్లన్
    కడ లేనట్టిమమత పం
    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో

    రిప్లయితొలగించండి
  48. సూర్య గ్రహణము
    బుద్ధిమంతుల కోపమ్ము శుద్ధ హిమము
    చెడ్డ వారి యలుక యుండు చివరి వఱకు
    వేలవేల యుగము లైన వీడ కలుక
    భానుఁ గబలించి పట్టె స్వర్భానుఁ డకట

    ఖతలం బెల్లయు దుఃఖ సాగర చలత్కల్లోల సందోహ మ
    గ్నత నాదిత్య రుచి ప్రభా రహితమై కన్పట్టె భూలోక సం
    తతి నిత్యోచిత కార్య భగ్న భవ సంతప్తాంత రంగంబునన్
    నత శీర్ష స్తితి నిల్చె నింపుగను బ్రాణాయామముం జల్పుచున్

    రిప్లయితొలగించండి
  49. చెడు తిరుగుడుల కలవడన్
    పడి బారున త్రాగి దూలి, పడచుల వెదికే
    భడవల మూర్ఖుల తలవం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి
  50. చెడు విశ్వాసమ్ములఁ బెం
    చెడు మతమ స్థిరమని తలచెడు వారలు మిం
    చెడు స్థితి,యహింస భాసిం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో

    రిప్లయితొలగించండి
  51. అడుగులకు మ్రొక్కి నంతనె
    యిడుచును కరమును శిరమున యిమ్ముగ ప్రజకున్
    తడయక ముదమున దీవిం
    చెడు మతమున్నపుడె శాంతి చెలగును భువిలో

    రిప్లయితొలగించండి
  52. చెడుతలపుల్ మనస్సునను చేరగ రైతుల పంట లన్నియున్
    కడు నవలేపనమ్మునను కాల్చిరి కూల్చిరి కర్కశమ్ముగా
    నడగిన వారి క్షేత్రముల నందిన రేటుకు కొల్లగొట్టుచున్
    వడివడి చేకరించిరట పంటపొలమ్ముల స్వార్థ నేతలే
    యిడుముల పాలు చేయుచును హేయపు బుద్ధిఁ బ్రజాళి నెంతయో
    పుడమిని మంచి నాయకులు పోడిమిఁ బోవుచు నిచ్చ ప్రేమఁ బం
    చెడు మతమున్నలోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్

    అసనారె

    రిప్లయితొలగించండి