23, డిసెంబర్ 2019, సోమవారం

సమస్య - 3229 (వానలు లేకుండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్"
(లేదా...)
"వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే"

72 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    మా బంగారు తెలంగాణ:

    మీనము మేష మెంచకయె మిక్కిలి ధైర్యముతోడ సాగుచున్
    కోనల కోనలన్ దవిలి కొండొక రీతిని చంద్రశేఖరే
    బానల బానలన్ జలము పట్టుకు రాగను హాలికుండ్లకున్
    వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే!

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
    *వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్*

    ఏనాడిలను యెఱుగునా
    కానీ కష్టము పడకనె కడుపులు నిండన్
    కన్నా, భీకర గాలియు
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఏనా డిలలో నెఱుగున" అనండి.

      తొలగించండి
    2. గురువులందరికీ నమస్సుమాంజలి 🙏🙏

      *రెండవ పూరణ*

      *వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్*

      *కం::*

      నేననునదియే నిజముగ
      ఎన్నో రకముల కలుషిత యెరువులు కంటే
      ఎన్నడు యెరుగని కరువున
      *వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🌸🙏🌸🌹🙏

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నేనిట హైద్రబాదునను నిక్కుచు నీల్గుచు వార్ధకమ్మునన్
    కానగ రాని శంకరుని కండ్లకు నద్దుచు వ్రాయ పద్యముల్
    దీనులు వంగ బంధువులు దిక్కులు తోచక పల్కిరిట్టులన్:
    "వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
      కానగరాని శంకరుని మ్రొక్కుకున్నారు. మరి కానవచ్చే శంకరుని 'ఇలాంటి సమస్య నిచ్చాడేమిరా' అని తిట్టుకున్నారా?

      తొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    నాల్గవ బోరు వలన :
    __________________________

    ఓ నాలుగు బోరులనే
    చేనుకు నీశాన్యము నను - చిత్రము వేయన్
    ప్రాణన మందదె పడుటను
    వానలు లేకుండ మెట్ట - వరి ఫలియించెన్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
    2. కవులూరు అంటే పాణ్యం దగ్గరా ? మీకు నాగశేషయ్య కవి
      గారు తెలుసా ?

      తొలగించండి
    3. కాదు మూర్తిగారూ
      అది మా యింటి పేరు
      మా స్వస్థలము రాజమండ్రి

      తొలగించండి
  5. సాననుబట్టువజ్రమని ,సాహితిలోకము ప్రస్తుతించగా
    వేనకువేలు పద్దెముల,వేసవి గాడ్పులవోలెతాకగా
    తానిక శంకరాఖ్యుడయి ,ధన్యత గూర్చగ ,మెచ్చుకోనికన్
    వానలులేక మెట్టవరి,బాగుగ బండెనువైపరీత్యమే

    +*+++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు





    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    కష్టే ఫలిః :
    __________________________

    జానెడు పొట్ట నింపుటకు - చక్కగ త్రవ్విరి మీనగోధికన్
    బానెడు నీరు లేక,మరి - బండయె కన్పడ నప్పు జేసి య
    ద్దానిని కుమ్మ నీర మదె - దక్కె, సుమాళము నాట్లు వేయగన్
    వానలు లేక మెట్టవరి - బాగుగఁ బండెను వైపరీత్యమే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  7. కానగలేముమబ్బులట ,కండ్లకుకాయలుగాసెచూడరా
    వేనకువేలుకర్షకులు, వేదికలెక్కుచు వేడుచుండగా
    జ్ఞానవశిష్టులందరును,జాతివిరాటపు పర్వమై గనన్
    వానలులేకమెట్టవరి,బాగుగబండెనువైపరీత్యమే

    ***********************************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  8. తానొక దైవదూతనని,ధన్యతనొందగజేతురాష్ట్రమున్
    నేనొకసారిగెల్చినను,నెయ్యముజేతును కేంద్రపెద్దతో
    పానుపుపైనబండనిక,ప్రాణమునంతయు మీదుక్షేమమే
    వానలులేకమెట్టవరి,బాగుగబండెనువైపరీత్యమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేంద్ర పెద్ద' దుష్టసమాసం.

      తొలగించండి
    2. తానొక దైవదూతనని,ధన్యతనొందగజేతురాష్ట్రమున్
      నేనొకసారిగెల్చినను,నెయ్యముజేతుప్రధానిమోదితో
      పానుపుపైనబండనిక,ప్రాణమునంతయు మీదుక్షేమమే
      వానలులేకమెట్టవరి,బాగుగబండెనువైపరీత్యమే!
      [సవరణ పాఠము ధన్యవాదాలతో}

      తొలగించండి
  9. కానల యందున కలువలు
    మౌనము గావెలయు నంట మర్కుని కొరకై
    భానుని కినుకను మేఘము
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి


  10. తేనీటిని సేవించక
    నే నా దాహము తొలంగె! నే కతుకకనే
    నానా విధరుచులు తెలిసె!
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. (తెలంగాణ ముఖ్యమంత్రి కే సి యార్ గోదా
    వరీమాతకు గుండ్రని ఎత్తిపోతల హారం అలంకరించాడు . ఇక పంటలే పంటలు .)
    తేనియ బోలు నీరమును
    తెప్పలు కుప్పలుగాగ నీయగా
    జ్ఞానము తోడ గౌతమికి
    జానుగ హారము నెత్తిపోతలన్
    వైనము మీర వేసెగద
    భద్రగుణాఢ్యుడు కేసియార్ ; భళీ !
    వానలు లేక మెట్టవరి
    బాగుగ బండెను వైపరీత్యమే !!
    (జానుగ - చక్కగ ; భద్రగుణాఢ్యుడు - శుభ
    కరగుణములు నిండినవాడు )

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ:

    సైన్స్ ఫెయిర్ లో ఒక అమ్మాయి రెండు రసాయనములను చూపిస్తూ మంత్రిగారికి విశ్లేషించుచున్న సందర్భం....


    దీనికి దీనిఁ జేర్చగ నదీజలశక్తి జనించు., మేటి వి...
    జ్ఞానము., నాల్గు చుక్కలను జల్లిన జాలును మెట్ట పండు., లో...
    కానికి మేలు., చూడు" డనగా విని మంత్రి ప్రశంసనిట్లనెన్
    వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుయోధనుని గూఢచారి పాండవుల వనవాసమును ఇలా వర్ణిస్తున్నాడని భావన...

      దీనత సుంత లేని ముఖదీధితులన్ వెలుగొందువారు., స్వా...
      ధీనత తప్పనట్టి నుతధీబలవంతులు ధర్మజాదులా
      కానల కొండలం బడిసుఖమ్ముగనుండిరి! రాజరాజ! యే
      వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  13. ఎవరాయన ?


    తానొక సిద్ధియోగుడు! సితాగ్రపు తీక్షణ దీక్షతోడుతన్
    వీనులవిందు గాత్రమున ప్రేమయె దేవుని కానవాలటం
    చా నవబిందువృత్తమును క్షామము తీరగ వేసికొల్వగా
    వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. కానలఁ ద్రుంచుట కీడది
    వానలు కురియంగ లేవు పండిత పుత్రా
    జ్ఞానము లేదేమిటిరా!
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్?

    రిప్లయితొలగించండి
  15. మానవు డీధరాస్థలిని మాన్యత నందెను జ్ఞానసంపదన్
    వాని కసాధ్యమెంచగను వాస్తవ మొక్కటి కానరాదు సం
    ధానము చేసె కృత్రిమత దానిట నన్నిట దానిచేతనే
    "వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే"

    రిప్లయితొలగించండి
  16. ప్రాణదయితుండు లేనిది
    చానకు సంతానమెట్లు జగతిన కలుగున్
    మానవ యాలో చింపుము
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని "మానవ! యోచింపు మెటుల..." అనండి.

      తొలగించండి
  17. మానవ కళ్యాణము కై
    జ్ఞానము తో శాస్త్రవేత్త నలుగురు మెచ్చ న్
    తానిల లో సృష్టి o ప గ
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించె న్

    రిప్లయితొలగించండి


  18. చానల్లు త్రిప్పుచునరరె
    నేనా పడకని మయికపు నిదురని తొంగొ
    న్నా నంతలోన స్వప్నము!
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. సేనలు దుముకుచు రాగా
    ధ్యానించెను ' అమ్మ 'జేరి ధన్య శివాజీ!
    సేన పలాయన మయ్యెను
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

    రిప్లయితొలగించండి
  20. వానాకాలమునందున
    నా నీటిని భూమిలోన కంపిన పిదపన్
    పూనుచు తోడగ నిప్పుడు
    "వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్"

    రిప్లయితొలగించండి
  21. మానెడు గింజలు పండవు
    వానలు లేకుండ మెట్ట;వరి ఫలించెన్
    చేనులు నిండగ గురియగ
    వానలు హర్షించి రైతు పాటలుబాడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దానగుణంబు మూర్తిగొన ధర్మజుడావని నాశ్రయాళికిన్
      మానక దీర్చగాబరగె మన్ననసేయుచు నన్నివేళలన్
      భానుడొసంగినట్టి ఘనపాత్రయె తోడుగ క్షుత్పిపాసలన్!
      వానలులేక మెట్టవరి బాగుగబండెను వైపరీత్యమే!

      తొలగించండి
  22. ఏ నాయకవరునాశీ
    ర్దానము లీబ్లాగు కనదు, ధనవృ(పు)ష్టియులే
    దైననుపండెన్కవితలు
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి

  23. దీనముగా రోదించెను
    వానలులేకుండమెట్ట; ,వరి ఫలియించెన్
    వానలు కురియగ రైతుల
    యాననమున వెల్లి విరిసె యానందంబున్.

    రిప్లయితొలగించండి
  24. జానెడు పొట్టఁనింపుటకుఁ జాలదు నేలయటంచు మానవుల్
    వేనకువేల రీతులగు విత్తన సృష్టిని సంకరమ్ముగాఁ
    బూనిరి జేయఁ నిప్పుడది భూమి గుణమ్మును మ్రింగివేయగా
    వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే!*
    *వైపరీత్యము ఋణాత్మక అర్థంలో..

    రిప్లయితొలగించండి
  25. కానగదెలిసెనునిప్పుడు
    వానలులేకుండమెట్టవరిఫలియించెన్
    వానలకుమెట్టవరికిని
    నేనాడునులేదుబంధమించుకయునిలన్

    రిప్లయితొలగించండి
  26. మానవ మేధఁ జెప్ప వశమా చతురాస్యునకైననేమి వి
    జ్ఞానులు శాస్త్ర కోవిదులు జాతికి మేలునొసంగ నెంచుచున్
    క్షోణిని శోధనల్ నెఱపి సోమము నే సృజియింప దానితో
    వానలు లేక మెట్టవరి బాగుగుఁ బండెను వైపరీత్యమే.

    రిప్లయితొలగించండి
  27. ఈ నరులెంతటి ఘటికులు
    వానల నీటిని పొదుపుగ బట్టిరి జూడన్
    ఈనాడిటు చిత్రముగా
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  28. మానసముల నలరించ మ
    హానగరము లందుఁ గాన నట్టి, ప్రకృతికిం
    గాననమున నేరివి లే
    వానలు, లేకుండ మెట్టవరి ఫలియించెన్

    [లేవు +ఆనలు = లేవానలు; మెట్ట వరి = గడ్డి]


    కానక మీన మేషములు కర్జము పై నిడి దృష్టి నంతటిన్
    మే నలయంగ యత్న మది మీఱఁగ బంధు సమిత్ర కోటితో
    మానక పట్టు నింపుగను మళ్ళుగఁ దీరిచి బావి నీటితో,
    వానలు లేక, మెట్ట వరి బాగుగఁ బండెను వైపరీత్యమే

    [మెట్ట(న్) = త్రొక్కఁగా; బావి = చెఱువు]

    రిప్లయితొలగించండి
  29. వానలుకురియకరైతులు
    నానాయాతనలుబడుచునలుగుచునుండన్
    బానల తోయముఁ జల్లగ
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను
    వైపరీత్యమే"

    సందర్భము:
    దూర్వాదళ శ్యామ తనుం మహార్హ
    కిరీట రత్నాభరణాఞ్చితాంగమ్
    ఆరక్తకఞ్జాయత లోచనాంతమ్
    దృష్ట్వా యయుర్మోద మతీవ పుణ్యాః
    (అధ్యాత్మ రామాయణం యు. కాం.15-24)
    దూర్వా దళమువంటి శ్యామల గాత్రుని, కిరీట రత్నాభరణాలచే అలంకరింప బడినవానిని, ఎఱ్ఱని కమల దళాలవంటి కన్నులున్న వానిని చూసి అయోధ్యలోని పుణ్యాత్ములైన ప్రజ లెంతో సంతోషించినారు. (వన వాసం పూర్తి చేసుకొని రాముడు తిరిగివచ్చినప్పుడు..)
    రాముడు వనవాస మేగగా భరతుడు ప్రతినిధిగా రాజ్య మేలినాడు.. అతని రాజ్యంలో లో టేమీ కనిపించలేదు గాని ఏదో అసంతృప్తి.
    (వానలు లేకపోయినా) మెట్ట పొలంలో వరిపంట పండిం దనుకోవచ్చు. అది విపరీతం కాకపోవచ్చు.
    కాని అరణ్యవాసం ముగించి రాముడు రాగానే అయోధ్యానగరాన్ని చూస్తే మెట్ట పొలమే (dry land) వున్నట్టుండి తరి పొలం (wet land) గా.. వింతగా మారిపోయినట్టు అనిపించింది. కొత్త తృప్తి వెల్లివిరిసింది.
    మెట్టలో పంట పండటం విశేష మేమీ కాదు. మెట్టయే తరిపొలంగా మారడం విశేషం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మానుగ మెట్టయే తరిగ
    మారెను వింతగ నన్నయ ట్లయో
    ధ్యా నగరంబు తోచెను ము
    దంబున రాముడు రాగ.. కైకకున్
    సూనుని ప్రాతినిధ్యమున
    చూడము లో.. టనవచ్చులే యిటుల్
    "వానలు లేక మెట్ట వరి
    బాగుగఁ బండెను వైపరీత్యమే"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    23.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  31. వానలులేకమెట్టవరిబాగుగబండెనువైపరీత్యమే
    వానలులేకపోయిననుబాగుగపండెవిమెట్టపంటలే
    మానకరెండుమూడుకొకమారుననీటినిముంపుజేయుచో
    క్షోణినిబుష్కలంబుగనుగోరినపంటలుపండునేగదా

    రిప్లయితొలగించండి
  32. . వానలు లేకను పండక
    కూనలకును తిండిలేక కుములుచు నున్నన్
    పూనిక యేతము నెత్తగ
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  33. ఉ:

    తానుగ కేసియారు తన దక్షత జూపగ నెత్తిపోతలన్
    వైనము మీర గూర్చ నట భవ్యపు సేతువు గౌతమీ తటిన్
    కానగ వచ్చెనే జలము కాలువ లెంబడి సాగుచుండగన్
    వానలు లేక మెట్ట వరి బాగుగ బండెను వైపరీత్యమే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. ఉత్పలమాల
    ప్రాణము నిల్పగా నెగువ రాష్ట్రములందునఁ కంభవృష్టిమై
    వేణియె పొంగి పొర్లినది వేడుకఁ జేయుచు, స్థానికమ్ముగన్
    కానము సాగునీరనుచుఁ గావఁగఁ గూర్చిరి యెత్తిపోతలన్
    వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను! వైపరీత్యమే?

    రిప్లయితొలగించండి
  35. వానలు వంకలన్ దిరుగు వార్నిధులెట్టులమాయమాయెరా?
    కోనలుకొండలన్నియును,కోరికదీరక మాడిపోయెనే
    సాననుకూలమైనవిధి సారెకుసారెకు, దిట్టిపోయనే ,
    వానలులేకమెట్టవరి బాగుగబండెను?? వైపరీత్యమే.

    రిప్లయితొలగించండి
  36. జానుతెనుంగులోరచన,జాహ్నవివోలెను పొంగిపొర్లగా!
    నేనును కావ్యమున్ రచన ,నేర్పుగజేయగ కూరుచుండకన్
    పానుపుపైనజేరగనె,పట్టుగపంటల స్వప్నసీమలో
    వానలులేకమెట్టవరి బాగుగబండెను?? వైపరీత్యమే.

    రిప్లయితొలగించండి
  37. చేనున మొలకలు నాటగ
    కోనన యుండిన చెరువులు కొరవడ కుండన్
    మానక హోరున కురిసెడి
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  38. పైన గురియ బారు నదికి
    బూనుచు గూర్చంగ నెత్తి పోతలు మాకున్
    దీనత స్థానికముగ నే
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  39. చీడ పారద్రోల చెదమ౦దు చల్లగా పూలపైన పడెను పలచగాను వాసనవగ జనులు పాలుపోక యనిరి పూలవలన చెడెను పుష్పవనము



    రిప్లయితొలగించండి
  40. తావులు చిమ్ముచున్ సతము దండిగ పూవులు పూయు తోటలో
    కావలి వారులే నితరి ఘమ్మను పూవులు పూయు తావునన్
    నావులు నెద్దులున్ కలిసి యచ్చట ధ్వంసము చేయుచుం డ నా
    పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్"*

    రిప్లయితొలగించండి