నడిరేయి సరదా పూరణ: కులుకుల్ మీరుచు వోట్లకై జనులపై గుప్పించి ద్రవ్యమ్ములన్వలపుల్ తీరగ మంత్రులై మురియుచున్ వర్ధిల్లి రాజ్యమ్మునన్...పలుకుల్ సుంతయు నెత్తి కెక్కనివియౌ బంగారు మాపల్లె నే తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81_%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95_%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%9A%E0%B1%86%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81A-1) చక్షుశ్శ్రోత్రము :__________________________కాళ్ళు కరములు లేవదె - కళ్ళు గలవుతలయు తోకయు కదలించి - తరల గలగునేల నానించి పొట్టతో - నిగుడు చుండుశివుని మెడలోన నుండును - స్థిరము గానువిష్ణు మూర్తికి శయ్య గా - వెలయు చుండుభూమి భారము నెన్నడున్ - మోయు చుండుపుట్ట పురుగది యెలుకల - బట్టి తినునుతలకుఁ జెవులె యుండవు విచి - త్రంబు గాదు !__________________________వసంత కిశోర్ (కవులూరు రమేష్)
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) విలువౌ డబ్బులు ధారవోయుచును భల్ వేగంబుగా నేర్చుచున్ ఖలులే చెప్పెడు మంత్ర తంత్రములనున్ గర్వంబుగా చాటుచున్ బలుపౌ రీతిని శాస్త్రముల్ చదువగా పండంటి మాయత్తవౌ తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
* మాయత్తదౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అధిక సంఖ్య తోడన పీఠ మందు కొనగకన్ను మిన్నులేమియసలు కానకుండియెందరెన్నిజెప్ప ప్రభుతనేలు వానితలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
ఇది కలియుగ మాయె! యెవరి యిచ్చ వారిదాయె! యేది నిత్యమగు సత్యమని తెలుపుమంచిని వినుటకు జిలేబి మనుజులకదెతలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!జిలేబి
నేటి రాజకీయమరయ నేతలంతతమకు పదవివచ్చు వరకు తాము దేశసేవ జేతుమంద్రు, గెలువ చెప్పనేలతలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు.
చెవిటి వారల కుండును చేట చెవులు వినగ రాదట మూర్ఖుల వింత గోల వంత పాడుచు బ్రతుకగ సంత సమున తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
(సునేత - కునేత )ప్రజల కష్టాలు తనవిగా పరిగణించు నేత నిలువెల్ల చెవులుగా నెగడుచుండు ;దూరి యాస్తుల గబళించు దుష్టనేత తలకు జెవులె యుండవు ; విచిత్రంబు గాదు .
గెలుపుకోసరమేమేమొతలకుమించిచేయువాగ్దానగిరులసచేతనమునగెలిచినేతలుశక్రులైగేలిసేయతలకు జెవులె యుండవు విచిత్రంబు గాదు
తగవులఁ బడుచు పరులతో ధరణిపైనభర్తలన్ లెక్కచేయక బరితెగించిపెత్తనమునుచేయు చపల చిత్తపు వని తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
బాధలను తీర్చు వారంచు వాసిగాను నమ్మి, దర్శింప దలచుచు నిమ్మహికిని రమ్ము రమ్మంచు పిలిచినన్ రారు, దేవతలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
వయసు మీరిన తరువాత వసుధ యందు పనులు జేయక నంగము ల్ బాధ పెట్టు వీనులుండి యుతాత లు వినగలేరు తలకు జెవులె యుండవు విచిత్రం బు గాదు
పిలిచిన విను వారెవ్వరు పెళ్ళి యింటగలగలమని మాటాడుచు కలకలముగచిలవల పలవల కబుర్ల జిక్కిన ముదితలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
నేటి శంకరా భరణము వారి సమస్య తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"ఇచ్చిన సమస్య మత్తేభ పాదము నా పూరణము సీసము లోభారత యుధ్ధము అయిన తర్వాత దృతరాష్ట్రుని చూచి కృష్ణుడు పలుకు తున్నాడు అన్న భావనపరమ పవిత్ర,ద్రౌపదిని బట్టి సభలోన వలువ లూడ్చగ నాడు సాధ్వి రోదనల్ వినబడ లేదుగా? కపట జూదములోన నోడించి తమ్మునిసుతులను భీకర వనములకు పంపు సమయానజనుల దు:ఖంబులు జానుగులనుతాకగ లేదుగా? తనయని హర్షంబు కోరుచు ధృతరాష్ట్ర! కూడ నట్టిపనులకు నెప్పుడు పలుకుచు నూతమ్ము,మరచి పోతివి గద మంచి మాటలు, (తలకుం గర్ణము లుండ వంచన విచిత్రం బెట్టు లౌఁ, జెప్పు మా), బెడిదపుపోరు లోన నీదు సుతులు ఘోర మైనమరణమును పొంద, నాబాధ మదికి తాకినీదు కర్ణముల్ పని జేసె నేడు ముదముగ ననుచు, పరి హాసములాడె కంబుధరుడు జానుగులు = చెవులు
16, డిసెంబర్ 2019, సోమవారంసమస్య - 3222 (తలకుఁ జెవులె...)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"మత్తేభమువెలసెన్ వేదిక చిత్రలేఖకులప్రావీణ్యంబువీక్షింపగాన్ విలసన్నేత్రవశీకరంబగుచుతద్విద్వత్పరీక్షార్థమైతెలుపన్ చిత్రవిలీనభావములగుర్తింపంగనిర్ణేతకున్ *తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా*గాదిరాజు మధుసూదనరాజు
బిజి బిజీ మన్ డే మార్నింగ్ లో హైస్పీడు నగరమ్ములో కవిసమ్మేళనమంటే చెవికోసుకునే వారెక్కడండి :)తెలవారెన్ కవివర్యులింక మహతిన్ తీర్చంగ సమ్మేళనమ్మిల శ్రీ వేంకట నాథుడిన్ పురములో మించారు సందోహమున్ తిలకింపంగను వచ్చువారెవరకో? తిండాడుకాలమ్ములోతలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమాశుభాకాంక్షలతోజిలేబి
నెలకున్ బట్టెడు ధాన్యమున్ సరుకులన్ నిండారుగాఁనింపగన్వలయున్ వానికిఁ బేటికల్ తగునవై, భద్రమ్ముగా నుంచగన్స్థలమున్ గావలెఁ,బట్టిలేపు జెవులున్ డబ్బాలకేనుండు, మూతలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
పాముజాతినిజూడగ బ్రముఖముగనుదలకుచెవులెయుండవువిచిత్రంబుగాదెమాటవినబడితిరుగుచుమనలజూచుబ్రహ్మసృష్టియేచిత్రము,ప్రణతులిడుదు
విరించి..ఇలఁ బాలింపగ మంత్రులై వెలగగన్ హీనాత్ములౌ మానవుల్ పలుమార్గమ్ములు ద్రొక్కి గెల్చినను విశ్వాసమ్ముతో జేరు లో కుల బాధల్ విననొప్పరోయి నిజమే కూళుండ్రెయౌ నేటి నే తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా
తూఱు నక్కట పాములు మీఱి చీమ లల్లఁ బుట్టలు మిట్టల యందుఁ బ్రీతి నిజ గృహములకు నెన్నఁడు నిజము వర ల తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు [లత = చీమ; చెవి = తాళపుఁ జెవి] అల యవ్వేళ వధింపఁగా నరకు విశ్వాత్ముండు కృష్ణుండు నే డలరం బండుగ భూజనప్రతతి యాహ్లాదంబుగాఁ జేయ భూతలమం దెల్లను నిండ శబ్దములు సంత్రాసంపు ఘోరంపు మ్రోతలకుం గర్ణము లుండవం చన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా
మత్తేభవిక్రీడితముబలముల్ చాలవు కావుమంచుఁ గరి తాఁ బ్రార్థించ వేంచేసెనేవలువల్ లాగెడు వేళ కృష్ణ పిలువన్ బాలించె సంరంభియైవిలయమ్ముల్ తలపెట్టు వారి వినతుల్ వీనిచ్చగన్ జక్రికిన్దలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
తేటగీతి దైవ దాక్షిణ్యము కరువై చేవఁ జచ్చిబ్రతుకు పోరాటమందున చితికి యుండితట్టుకొనలేనటంచును తల్లడిల వెతలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!
లైవ్ ఫ్రం మహతి కంది వారు అవధాససభలో వచ్చి ఆశీనులయ్యిరి :)ఫార్ మోర్ లైవ్ కవరేజ్ గెట్ ట్యూన్డ్ ఇన్ టు దిజ్ బ్లాగ్ :)చీర్స్జిలేబి
తాళి కట్టిన భర్తనిఁ తాను బెట్టుయదుపు యాజ్ఞలందుంచుట యవసరమనియడ్డు లేని నోరుగల గయ్యాళి భార్య తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు౹౹
చింతా వారు వేదిక పై యెక్కినారు ;)
అప్రస్తుతము చేస్తారట :)
రాణి శర్నగారు ప్రారంభించారు సంచాలకులుగా
కుదురాట మొదలయ్యె :)ఎనుగురడుగగ కుదురాట :)
వర్ణన తరువాయి మహదేవ మణి గారి నిషిద్ధాక్షరి అనుష్టుప్ లో గణేశ స్తుతి
జనరల్ గా అప్రస్తుతులు ముందు పడుతుంటారు;) ఈ సభలో అవధానులే అప్రస్తుతులని అడిగి అడిగి మరీ వాయిస్తున్నారు ;)
దత్తపది సారి మాది జారి దారి With one set of దత్తపది త్రిగళా వధాన with different subjectsFor Sanskrit Ramayana based Telugu - bhagavata based Andhra - bhaarata based
కంది వారు సభా ప్రాంగమును వీడి బయలు దేరిరి
వేద విజ్ఞానము , అక్షర జ్ఞానము అన్న పుస్తకములను పంచిరి.రాంభట్ల వారి కాలండరు పంచిరి :)
*దత్తపది - సారి మారి జారి దారి
తలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమాతలకుంగర్ణములుండకుండిననుజిత్రంబందజూచున్గదాయిలలోనుండెడుపాములన్నియునుదావీక్షించునేత్రంబులన్ లలనా!శ్రద్ధనుజక్కగావినునునాలాపంబులన్నింటినీ
కలతబెట్టిన మనసులు కలుకుమనునుహింస నెదిరించు కాల్పులు హితము యగునజనుల మనసులుకలచుట జాతి హితమ??తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు++++++++++++++++++++++రావెలపురుషోత్తమరావు
మంచి చెప్పెడి మాటలు మహిని వినకతాను మనమున గట్టిగా తలచినదియెనుత్తమమని సతతమెంచు నుక్కివునకుతలకు చెవులె యుండవు విచిత్రంబు గాదు
చాలా బావుంది
నివురు గప్పిననిప్పులు నేటి యువతహింసనెదిరించు వారలు హితులెసుమ్ముతలలుపంకించి నేతలు తప్పు కొన్నతలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు+++++++=+=====++++రావెలపురుషోత్తమరావు
తే.గీ.చెవులు వుండుడు ధర్మము జీవులెల్లజంతు లక్షణ మదియేమొ చక్రధరమువింత రీతిని జగతిన విదిత మగును తలకు జెవులె యుండవు విచిత్రంబు గాదువై. చంద్రశేఖర్
చెరువు గట్టుపై నున్నట్టి చెట్టు క్రింద పుట్టలోనుండి వెలువడి భోగి యొకటిపడగ విప్పగ గాంచితి పడగ ధారితలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
దీనజనరక్షణయెతమ ధ్యేయమనుచువట్టిమాటలు పల్కుచు పదవినొందినమ్మువారల మొరవిన నాయకులకుతలకుఁ జెవులె యుండవు విచిత్రంబుగాదు
..............🌻శంకరాభరణం🌻.................................🤷🏻♂సమస్య 🤷♀.................... తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు సందర్భము: స్వార్థం విడనాడితేనే ప్రేమతత్వం బలపడుతుంది. ప్రేమతత్వం బలపడితేనే ఐకమత్యంగా పరిణమిస్తుంది. ఐకమత్యమే సమాజానికి బలమౌతుంది. శాంతి భద్రతలు విరాజిల్లుతాయి. లేకుంటే ఈర్ష్యా ద్వేషాలు తాండవిస్తూ సమాజం అశాంతికి ఉగ్రవాదానికి ఆలవాల మౌతుంది. త్యాగధనుడైన రాముని రాజ్యంలో అలాంటివాటికి తావులేదు కదా! యథా రాజా తథా ప్రజా~~~~~~~~~~~~~~~~~~~~~~~ *రామరాజ్యం - ప్రేమరాజ్యం*రాముడు నృపాలుడై యుండ రాజ్యమందుప్రేమ తత్వమే నిండారెలే! అసూయయిం పనుచుఁ జెప్ప వినరు.. తా వీయరు కలతలకుఁ..జెవులె యుండవు.. విచిత్రంబు గాదు ✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 16.12.19-----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
కులుకుల్ మీరుచు వోట్లకై జనులపై గుప్పించి ద్రవ్యమ్ములన్
వలపుల్ తీరగ మంత్రులై మురియుచున్ వర్ధిల్లి రాజ్యమ్మునన్...
పలుకుల్ సుంతయు నెత్తి కెక్కనివియౌ బంగారు మాపల్లె నే
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE
%E0%B1%81_%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95_
%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%9A
%E0%B1%86%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
A-1)
చక్షుశ్శ్రోత్రము :
__________________________
కాళ్ళు కరములు లేవదె - కళ్ళు గలవు
తలయు తోకయు కదలించి - తరల గలగు
నేల నానించి పొట్టతో - నిగుడు చుండు
శివుని మెడలోన నుండును - స్థిరము గాను
విష్ణు మూర్తికి శయ్య గా - వెలయు చుండు
భూమి భారము నెన్నడున్ - మోయు చుండు
పుట్ట పురుగది యెలుకల - బట్టి తినును
తలకుఁ జెవులె యుండవు విచి - త్రంబు గాదు !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
విలువౌ డబ్బులు ధారవోయుచును భల్ వేగంబుగా నేర్చుచున్
ఖలులే చెప్పెడు మంత్ర తంత్రములనున్ గర్వంబుగా చాటుచున్
బలుపౌ రీతిని శాస్త్రముల్ చదువగా పండంటి మాయత్తవౌ
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
తొలగించండి* మాయత్తదౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅధిక సంఖ్య తోడన పీఠ మందు కొనగ
రిప్లయితొలగించండికన్ను మిన్నులేమియసలు కానకుండి
యెందరెన్నిజెప్ప ప్రభుతనేలు వాని
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఇది కలియుగ మాయె! యెవరి యిచ్చ వారి
దాయె! యేది నిత్యమగు సత్యమని తెలుపు
మంచిని వినుటకు జిలేబి మనుజులకదె
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!
జిలేబి
నేటి రాజకీయమరయ నేతలంత
రిప్లయితొలగించండితమకు పదవివచ్చు వరకు తాము దేశ
సేవ జేతుమంద్రు, గెలువ చెప్పనేల
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు.
చెవిటి వారల కుండును చేట చెవులు
రిప్లయితొలగించండివినగ రాదట మూర్ఖుల వింత గోల
వంత పాడుచు బ్రతుకగ సంత సమున
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
(సునేత - కునేత )
రిప్లయితొలగించండిప్రజల కష్టాలు తనవిగా పరిగణించు
నేత నిలువెల్ల చెవులుగా నెగడుచుండు ;
దూరి యాస్తుల గబళించు దుష్టనేత
తలకు జెవులె యుండవు ; విచిత్రంబు గాదు .
గెలుపుకోసరమేమేమొతలకుమించి
రిప్లయితొలగించండిచేయువాగ్దానగిరులసచేతనమున
గెలిచినేతలుశక్రులైగేలిసేయ
తలకు జెవులె యుండవు విచిత్రంబు గాదు
తగవులఁ బడుచు పరులతో ధరణిపైన
రిప్లయితొలగించండిభర్తలన్ లెక్కచేయక బరితెగించి
పెత్తనమునుచేయు చపల చిత్తపు వని
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
బాధలను తీర్చు వారంచు వాసిగాను
రిప్లయితొలగించండినమ్మి, దర్శింప దలచుచు నిమ్మహికిని
రమ్ము రమ్మంచు పిలిచినన్ రారు, దేవ
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
వయసు మీరిన తరువాత వసుధ యందు
రిప్లయితొలగించండిపనులు జేయక నంగము ల్ బాధ పెట్టు
వీనులుండి యుతాత లు వినగలేరు
తలకు జెవులె యుండవు విచిత్రం బు గాదు
పిలిచిన విను వారెవ్వరు పెళ్ళి యింట
రిప్లయితొలగించండిగలగలమని మాటాడుచు కలకలముగ
చిలవల పలవల కబుర్ల జిక్కిన ముది
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
నేటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండితలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"
ఇచ్చిన సమస్య మత్తేభ పాదము నా పూరణము సీసము లో
భారత యుధ్ధము అయిన తర్వాత దృతరాష్ట్రుని చూచి కృష్ణుడు పలుకు తున్నాడు అన్న భావన
పరమ పవిత్ర,ద్రౌపదిని బట్టి సభలోన వలువ లూడ్చగ నాడు సాధ్వి
రోదనల్ వినబడ లేదుగా? కపట జూదములోన నోడించి తమ్మునిసుతు
లను భీకర వనములకు పంపు సమయానజనుల దు:ఖంబులు జానుగులను
తాకగ లేదుగా? తనయని హర్షంబు కోరుచు ధృతరాష్ట్ర! కూడ నట్టి
పనులకు నెప్పుడు పలుకుచు నూతమ్ము,మరచి పోతివి గద మంచి మాట
లు, (తలకుం గర్ణము లుండ వంచన విచిత్రం బెట్టు లౌఁ, జెప్పు మా), బెడిదపు
పోరు లోన నీదు సుతులు ఘోర మైన
మరణమును పొంద, నాబాధ మదికి తాకి
నీదు కర్ణముల్ పని జేసె నేడు ముదము
గ ననుచు, పరి హాసములాడె కంబుధరుడు
జానుగులు = చెవులు
16, డిసెంబర్ 2019, సోమవారం
రిప్లయితొలగించండిసమస్య - 3222 (తలకుఁ జెవులె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"
మత్తేభము
వెలసెన్ వేదిక చిత్రలేఖకులప్రావీణ్యంబువీక్షింపగాన్
విలసన్నేత్రవశీకరంబగుచుతద్విద్వత్పరీక్షార్థమై
తెలుపన్ చిత్రవిలీనభావములగుర్తింపంగనిర్ణేతకున్
*తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా*
గాదిరాజు మధుసూదనరాజు
రిప్లయితొలగించండిబిజి బిజీ మన్ డే మార్నింగ్ లో హైస్పీడు నగరమ్ములో కవిసమ్మేళనమంటే చెవికోసుకునే వారెక్కడండి :)
తెలవారెన్ కవివర్యులింక మహతిన్ తీర్చంగ సమ్మేళన
మ్మిల శ్రీ వేంకట నాథుడిన్ పురములో మించారు సందోహమున్
తిలకింపంగను వచ్చువారెవరకో? తిండాడుకాలమ్ములో
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా
శుభాకాంక్షలతో
జిలేబి
నెలకున్ బట్టెడు ధాన్యమున్ సరుకులన్ నిండారుగాఁనింపగన్
రిప్లయితొలగించండివలయున్ వానికిఁ బేటికల్ తగునవై, భద్రమ్ముగా నుంచగన్
స్థలమున్ గావలెఁ,బట్టిలేపు జెవులున్ డబ్బాలకేనుండు, మూ
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
పాముజాతినిజూడగ బ్రముఖముగను
రిప్లయితొలగించండిదలకుచెవులెయుండవువిచిత్రంబుగాదె
మాటవినబడితిరుగుచుమనలజూచు
బ్రహ్మసృష్టియేచిత్రము,ప్రణతులిడుదు
విరించి..
రిప్లయితొలగించండిఇలఁ బాలింపగ మంత్రులై వెలగగన్ హీనాత్ములౌ మానవుల్
పలుమార్గమ్ములు ద్రొక్కి గెల్చినను విశ్వాసమ్ముతో జేరు లో
కుల బాధల్ విననొప్పరోయి నిజమే కూళుండ్రెయౌ నేటి నే
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా
తూఱు నక్కట పాములు మీఱి చీమ
రిప్లయితొలగించండిలల్లఁ బుట్టలు మిట్టల యందుఁ బ్రీతి
నిజ గృహములకు నెన్నఁడు నిజము వర ల
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
[లత = చీమ; చెవి = తాళపుఁ జెవి]
అల యవ్వేళ వధింపఁగా నరకు విశ్వాత్ముండు కృష్ణుండు నే
డలరం బండుగ భూజనప్రతతి యాహ్లాదంబుగాఁ జేయ భూ
తలమం దెల్లను నిండ శబ్దములు సంత్రాసంపు ఘోరంపు మ్రో
తలకుం గర్ణము లుండవం చన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిబలముల్ చాలవు కావుమంచుఁ గరి తాఁ బ్రార్థించ వేంచేసెనే
వలువల్ లాగెడు వేళ కృష్ణ పిలువన్ బాలించె సంరంభియై
విలయమ్ముల్ తలపెట్టు వారి వినతుల్ వీనిచ్చగన్ జక్రికిన్
దలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
తేటగీతి
రిప్లయితొలగించండిదైవ దాక్షిణ్యము కరువై చేవఁ జచ్చి
బ్రతుకు పోరాటమందున చితికి యుండి
తట్టుకొనలేనటంచును తల్లడిల వె
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!
రిప్లయితొలగించండిలైవ్ ఫ్రం మహతి కంది వారు అవధాససభలో వచ్చి ఆశీనులయ్యిరి :)
ఫార్ మోర్ లైవ్ కవరేజ్ గెట్ ట్యూన్డ్ ఇన్ టు దిజ్ బ్లాగ్ :)
చీర్స్
జిలేబి
తాళి కట్టిన భర్తనిఁ తాను బెట్టు
రిప్లయితొలగించండియదుపు యాజ్ఞలందుంచుట యవసరమని
యడ్డు లేని నోరుగల గయ్యాళి భార్య
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు౹౹
రిప్లయితొలగించండిచింతా వారు వేదిక పై యెక్కినారు ;)
తొలగించండిఅప్రస్తుతము చేస్తారట :)
తొలగించండిరాణి శర్నగారు ప్రారంభించారు సంచాలకులుగా
తొలగించండికుదురాట మొదలయ్యె :)
ఎనుగురడుగగ కుదురాట :)
తొలగించండివర్ణన తరువాయి మహదేవ మణి గారి నిషిద్ధాక్షరి అనుష్టుప్ లో గణేశ స్తుతి
తొలగించండిజనరల్ గా అప్రస్తుతులు ముందు పడుతుంటారు;) ఈ సభలో అవధానులే అప్రస్తుతులని అడిగి అడిగి మరీ వాయిస్తున్నారు ;)
తొలగించండిదత్తపది
సారి మాది జారి దారి
With one set of దత్తపది
త్రిగళా వధాన with different subjects
For Sanskrit Ramayana based
Telugu - bhagavata based
Andhra - bhaarata based
తొలగించండికంది వారు సభా ప్రాంగమును వీడి బయలు దేరిరి
తొలగించండివేద విజ్ఞానము , అక్షర జ్ఞానము అన్న పుస్తకములను పంచిరి.
రాంభట్ల వారి కాలండరు పంచిరి :)
*దత్తపది - సారి మారి జారి దారి
తొలగించండితలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమా
రిప్లయితొలగించండితలకుంగర్ణములుండకుండిననుజిత్రంబందజూచున్గదా
యిలలోనుండెడుపాములన్నియునుదావీక్షించునేత్రంబులన్
లలనా!శ్రద్ధనుజక్కగావినునునాలాపంబులన్నింటినీ
కలతబెట్టిన మనసులు కలుకుమనును
రిప్లయితొలగించండిహింస నెదిరించు కాల్పులు హితము యగున
జనుల మనసులుకలచుట జాతి హితమ??
తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు
++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మంచి చెప్పెడి మాటలు మహిని వినక
రిప్లయితొలగించండితాను మనమున గట్టిగా తలచినదియె
నుత్తమమని సతతమెంచు నుక్కివునకు
తలకు చెవులె యుండవు విచిత్రంబు గాదు
చాలా బావుంది
తొలగించండినివురు గప్పిననిప్పులు నేటి యువత
రిప్లయితొలగించండిహింసనెదిరించు వారలు హితులెసుమ్ము
తలలుపంకించి నేతలు తప్పు కొన్న
తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు
+++++++=+=====++++
రావెలపురుషోత్తమరావు
తే.గీ.
రిప్లయితొలగించండిచెవులు వుండుడు ధర్మము జీవులెల్ల
జంతు లక్షణ మదియేమొ చక్రధరము
వింత రీతిని జగతిన విదిత మగును
తలకు జెవులె యుండవు విచిత్రంబు గాదు
వై. చంద్రశేఖర్
చెరువు గట్టుపై నున్నట్టి చెట్టు క్రింద
రిప్లయితొలగించండిపుట్టలోనుండి వెలువడి భోగి యొకటి
పడగ విప్పగ గాంచితి పడగ ధారి
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
దీనజనరక్షణయెతమ ధ్యేయమనుచు
రిప్లయితొలగించండివట్టిమాటలు పల్కుచు పదవినొంది
నమ్మువారల మొరవిన నాయకులకు
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబుగాదు
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు
సందర్భము: స్వార్థం విడనాడితేనే ప్రేమతత్వం బలపడుతుంది. ప్రేమతత్వం బలపడితేనే ఐకమత్యంగా పరిణమిస్తుంది. ఐకమత్యమే సమాజానికి బలమౌతుంది. శాంతి భద్రతలు విరాజిల్లుతాయి. లేకుంటే ఈర్ష్యా ద్వేషాలు తాండవిస్తూ సమాజం అశాంతికి ఉగ్రవాదానికి ఆలవాల మౌతుంది.
త్యాగధనుడైన రాముని రాజ్యంలో అలాంటివాటికి తావులేదు కదా!
యథా రాజా తథా ప్రజా
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రామరాజ్యం - ప్రేమరాజ్యం*
రాముడు నృపాలుడై యుండ రాజ్యమందు
ప్రేమ తత్వమే నిండారెలే! అసూయ
యిం పనుచుఁ జెప్ప వినరు.. తా వీయరు కల
తలకుఁ..జెవులె యుండవు.. విచిత్రంబు గాదు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
16.12.19
-----------------------------------------------------------