3, డిసెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3210 (సానిన్ ముద్దాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్"
(లేదా...)
"సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్"

63 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కోనల కొండలన్ దవిలి కొండొక రీతిని శాంతిగోరుచున్
  కానగరాక తా నిలిచి కన్నుల నీరిడి కాళ్ళు మ్రొక్కుచున్
  మౌనము మీరగా నతని మానసమున్ భళి నేలుచున్న నా
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్

  సాని = అధిపురాలు (శబ్దరత్నాకరము)

  రిప్లయితొలగించండి
 2. కూనని జెప్పి బుడత దొర
  సానిన్ ముద్దాడె, యోగి సద్గతిఁ బొందన్
  వీనిని జూచిన పిదపనె
  దేనిని కాదని వెడలెను దేశమొదిలికన్
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కానదు సత్యము నెపుడును
   నేననునది కాదు నిజము నెరుగరు జనులున్
   ఏనాడైనను కాదిది
   సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్
   🙏🙏

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  విప్రనారాయణ సినిమా (1954):

  మౌనము దాల్చుచున్ చెలగి మన్నన లొందిన యక్కినేని హా!
  దీనుని వోలె మారుచును దిట్టగ వేషము వేయుచున్ భళా!
  వానల నెండలన్ తడిసి భానుమతమ్మగ వేషధారియౌ
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. "ఆర్యా, మీపూరణ చాలా బాగున్నది. ధన్యవాదములు. జిలేబి గారు ఎవరో తెలిసి కోవలెనని మనసు ఉవ్విల్లూరు చున్నది. తెలుప గలరు.

   పి.మోహన్ రెడ్డి."

   తొలగించండి


  2. వారెవరో యెవిరికెరుక!


   ఎవరోయి జిలేబీ తా
   నెవరోయీ ? మదిని తొలుచు నేస్తంబై ని
   ల్చు విరాట్టెవరోయీ? రె
   డ్డి, వివరములరయగ బాపురే మన తరమా


   జిలేబి

   తొలగించండి


  3. ఎవరోయి జిలేబీ తా
   నెవరోయీ ? మదిని తొలుచు నేస్తంబై ని
   ల్చు విరాట్టెవరోయీ? రె
   డ్డి, వివరములరయగ తెల్పుడీ మన తరమా :)


   జిలేబి

   తొలగించండి
 4. అన్నయ్యను అనుసరిస్తూ

  మానిని దాకని విప్రుడు
  జాణతనంబునకు లొంగి చపలత్వమునన్
  ధ్యానము జేయుచు దేవిని
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిబొందన్
  విప్రుడు = విప్ర నారాయణ
  దేవి = దేవదేవి

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !
  https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF_

  %E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A

  %E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF

  %E0%B1%81%E0%B0%B2%E0%B1%81

  A-1)
  ఆదిశంకరుడు కామరూపమున రాణిని :
  __________________________

  ఆనాడొక స్త్రీని గెలువ
  గా నెంచిన శంకరుండు - ఙ్ఞానము కొరకై
  తానే రాజుగ మారుట;
  సానిన్ ముద్దాడె యోగి - సద్గతిఁ బొందన్ !
  __________________________
  సాని = రాణి
  స్త్రీ = ఉభయభారతి, ఙ్ఞానము = కామఙ్ఞానము

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 6. వేనకు వే లగు దృశ్యము
  లానందము గూర్చు కరణి నాకర్షిం ప న్
  వానికి లొంగని దౌ మన
  సా నిన్ ముద్దా డె యోగి సద్గ తి బొంద న్

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-2)
  కపటయోగి :
  __________________________

  గానము జేయుచు కపటియె
  ఙ్ఞానము భోధించుచుండు - జనులకు నెల్లన్ !
  యా నారంగుడు శమనిని
  సానిన్ ముద్దాడె యోగి - సద్గతిఁ బొందన్ !
  __________________________
  శమని = రాత్రి

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. జ్ఞానము పొందని నెపమున
   కానని దేవుని హేల కలత పడంగా
   మీనాక్షి జేరగ మరిదొర
   సానిన్ ముద్దాడె యోగి సద్గతి బొందన్

   తొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !
  https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE

  %E0%B0%A8
  A-3)
  పూర్వాశ్రమమందు వేమన :
  __________________________

  ఆ నాటి యోగి వేమన
  తానొక రసికుండు గాన - తరుణిమ నందున్
  సానసి నిధినిన్నిడుచున్
  సానిన్ ముద్దాడె యోగి - సద్గతిఁ బొందన్ !
  __________________________
  సానసి = బంగారు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. A-3)
   సవరణతో :
   __________________________

   ఆ నాటి యోగి వేమన
   తానొక రసికుండు గాన - తరుణిమ నందున్
   సానసి నిధినే యిడుచున్
   సానిన్ ముద్దాడె యోగి - సద్గతిఁ బొందన్ !
   __________________________

   తొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-4)
  విప్రనారాయణుడు :
  __________________________

  గానము, నాట్యము, భక్తియె
  తానై మురిపింప వేశ్య; - తన్మయ మందున్
  తానే వ్యసనన్ మునుగుట
  సానిన్ ముద్దాడె యోగి - సద్గతిఁ బొందన్ !
  __________________________
  వ్యసన = విశేషంగా భ్రష్టమగుట

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-5)
  విశ్వామిత్రుడు :
  __________________________

  మౌనికి భంగము జేయగ
  మేనక నాట్యమును సేయ; - మెచ్చుచు రెచ్చెన్
  మానము విడుచుచు, ప్రేమగ
  సానిన్ ముద్దాడె యోగి - సద్గతిఁ బొందన్ !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  విశ్వామిత్రుడు :
  __________________________

  మౌనిని నాట్య గానముల - మచ్చిక జేయగ జేర, మేనకన్
  మానము విస్మరించి ముని - మానెను మొత్తము మంత్రతంత్రముల్ !
  మానిని పొందు గోరి, తన - మానస మందనురక్తి హెచ్చగన్
  సానిని ముద్దుపెట్టుకొనె - సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 13. కానిది కాకమానదని,కాంతల వేటన పండెముగ్ధుడై
  సాననుబెట్టురత్నమవు, సంపదనిచ్చెదరమ్మురమ్మనెన్
  కోనలు కోండలన్ దిరుగు, కోవిదులెవ్వరు యొప్పనట్లుగా
  సానినిముద్దుపెట్టుకొనె,సంయమిసద్గతిబొందగోరుచున్.

  రిప్లయితొలగించండి
 14. పూనకమొచ్చె నాతనికి,పొందునుగోరును కాంత తోడనున్
  సేనగ యాడ శిష్యులను,సేవలపేరిట రమ్ము రమ్మనెన్
  తానొక మన్మధుండనను,త్రాణను గల్గిన కాముకుండునై
  సానినిముద్దుపెట్టుకొనె,సం యమిసద్గతిబొందగోరుచున్.

  రిప్లయితొలగించండి
 15. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-1)
  నిన్నటి పూరణ :
  గండుడి కొండ>(కుక్కపిల్ల) :
  __________________________

  కొండ యనుచు బెంచె - గండుడు తన వేపి
  గండుపిల్లి తరుమ - గుండె జారి
  భషణ మిడుచు నాయి - భళ్ళున పారుచున్
  కుండలోనఁ జొచ్చెఁ - గొండ గనుఁడు !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 16. సమస్య :-
  "సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్"

  *కందం**

  వానలు గురిసెడు సమయము
  చీనాంబర లేమితోడ శ్రీశైల మునన్
  గానముతో శివ యని మన
  సా,నిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్
  ...‌‌..‌.............✍చక్రి

  రిప్లయితొలగించండి
 17. జ్ఞానమ్మును వీడుచు న
  జ్ఞానపు మాటలవి యేల చాలిక నీకున్
  మౌనమ్మే మేలగు, నే
  సానిన్ ముద్దాడె యోగి సద్గతి బొందన్?

  రిప్లయితొలగించండి
 18. మైలవరపు వారి పూరణ

  మానవజన్మమెన్న బహుమానము, దుర్లభమైనదండ్రు ! ప్ర..
  జ్ఞానమెరుంగ దీక్షగొని సాధన జేసెదనంచు గూర్చొనన్
  సాని యొకర్తె నన్ను సరసమ్మున దేల్చక వీడి పోననన్
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరాభరణం.. సమస్యాపూరణం..

   సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్!

   మానవజన్మమెన్న బహుమానము, దుర్లభమైనదండ్రు ! ప్ర..
   జ్ఞానమెరుంగ దీక్షగొని సాధన జేసెదనంచు గూర్చొనన్
   సాని యొకర్తె *నన్ను సరసమ్మున దేల్చక వీడి పో* ననన్
   సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 19. మేని సుఖములకు భోగియె
  సానిన్ ముద్దాడె, యోగి సద్గతిఁ బొందన్
  కాననమున ముద్దాడెను
  ధ్యానమ్మును, మది నడతని దాని ఫలితముల్!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  నిన్నటి పూరణ :
  గండుడి కొండ >(కుక్క) :
  __________________________

  గండుడు ముద్దు బెంచెనదె - గ్రామమృగంబును కొండ పేరిటన్
  కొండయు పెద్దగా పెరిగి - కోళ్ళను కుక్కల పాఱదోలెడిన్ !
  గండపు రూపునొచ్చె నొక - ఘస్రము నందున గండుపిల్లిగన్
  కొండొక దారిలేక పెను - కొందలమందుచు పర్వులెత్తుచున్
  కుండను గొండ సొచ్చె నిది - గో కనులారఁగఁ జూచి నమ్ముమా !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. B-1)
   నిన్నటి పూరణ :
   సవరణతో :
   గండుడి కొండ >(కుక్క) :
   __________________________

   గండుడు ముద్దు బెంచెనదె - గ్రామమృగంబును కొండ పేరిటన్
   కొండయు పెద్దగా పెరిగి - కోళ్ళను కుక్కల పాఱదోలెడిన్ !
   గండము గండుపిల్లి వలె - గర్జన జేయుచు పైకి దూకినన్
   కొండొక దారిలేక పెను - కొందలమందుచు పర్వులెత్తుచున్
   కుండను గొండ సొచ్చె నిది - గో కనులారఁగఁ జూచి నమ్ముమా !
   __________________________

   తొలగించండి


 21. మేని సుఖమ్ములన్ బడయ మేలములాడుచు భోగి నెయ్యమిన్
  సానిని ముద్దుపెట్టుకొనె, సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్
  కాననమందు దీక్షని వికారము లెల్లతొలంగ చిత్తమున్
  ధ్యానము నందు నిల్పె; మది దారిని దాని ఫలమ్ము జీవికిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. తానొక యొజ్జ శిష్యునకు తన్మయు డౌచును విద్యనేర్పి య
  వ్వాని బరీక్షవేళ నొకపద్యము సొంతగ జెప్పుమన్న నా
  కూన తడంబడెన్ వణకి కూర్చెను "సామి"కి మారుగా యిటుల్
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్

  రిప్లయితొలగించండి
 23. (నారీభేదమే యెరుగని ఋశ్యశృంగుని తన రాజ్యానికి రప్పించుకోవాలని రోమపాద మహారాజు వారకాంతలను పంపించాడు .వారితో మన యువముని .)
  కానల కందమూలముల
  గాంచి భుజించెడి ఋశ్యశృంగుడే
  కానని వారకాంతలను
  గారవ మొప్పగ జేరి ముగ్ధుడై
  చానల నందరన్ మధుర
  సన్మునులంచును కౌగిలింతతో -
  సానిని ముద్దుపెట్టుకొనె
  సంయమి సద్గతి బొందగోరుచున్ .

  రిప్లయితొలగించండి


 24. మేనక తిలోత్తములు మన
  సా నిన్ ముద్దాడె! యోగి! సద్గతిఁ బొందన్
  దేనికి లొంగక నీవా
  ధ్యానమున నిమగ్నమై సదా యుంటివిగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 25. చానలతో సరసమె "ని
  త్యానంద" మటంచు రసికతయె మార్గముగా
  పానుపు పైపవళింపుల
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. కం.
  రాణించగ గని మీర్జా
  సానిన్ ముద్దాడె, యోగి సద్గతిఁ బొందన్ !
  భానునివలె తేజోమయ
  కానుక యాదిత్యనాథ్ సకాశము నొసగెన్ !!

  రిప్లయితొలగించండి


 27. గృహస్తాశ్రమ ధర్మము

  మీనా కుమారి సుదతిని
  మేనిని తా నిడుకొని పరిమితపిలఱేడై
  ధ్యాన పథము విడువక దొ
  ర్సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. జరత్కారుడు జరత్కారువును పెండ్లాడుట.

  ఆనాటి తాతలంతయు
  నా నాకము జేరక బహు నాయస బడగా
  తానుఁ జరత్కారువునా
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్

  రిప్లయితొలగించండి

 29. మానవ సందోహము విడి
  కాననములకేగి యజితు గడనను జేయన్
  మానసమొందగ నొప్పని
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్
  సాని = భార్య , ముద్దాడు = బుజ్జగించు

  రిప్లయితొలగించండి
 30. ధ్యానము, వీడక చేయుచు
  పానము , కుడుచుట నెరుగక పావన విధులన్ |

  మౌనిగనయె, మోక్షపు దొర
  "సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్

  రిప్లయితొలగించండి
 31. భానోదయమునకు మునుపె
  మానస మందున గొలుచుచు మధుసూధనునిన్
  మౌనమున ముక్తియను దొర
  సానిన్ ముద్దాడె యోగి సద్గతి బొందన్.

  రిప్లయితొలగించండి
 32. దత్తాత్రేయ స్వరూపం

  పానము జేసెను కల్లును
  సానిన్ ముద్దాడె యోగి, సద్గతిఁ బొందన్
  వాని నిజ రూపము గనుము
  దీన దయాళుడతడేను ధీమతి దెలియున్

  రిప్లయితొలగించండి
 33. పానముజేయుతమద్యము
  మానసమేవికలమగుచుమందుడెయగుచున్
  మేనునుదాకుచు నాదొర
  సానిన్ ముద్దాడెయోగి సద్గతిబొందన్

  రిప్లయితొలగించండి
 34. దానముగొని తిరుపరి దొర
  సానిన్ ముద్దాడె, యోగి సద్గతిఁ బొందన్
  తానొనరించె తపమ్మును
  గానన్ యోగియునునొక్కకార్కటుడిలలో
  (తిరుపరి, కార్కటుడు = యాచకుడు\అర్థి)

  రిప్లయితొలగించండి
 35. కానము మాన విహీనుల
  నీ నగరమ్మున వసించ నివ్విధి మునులన్
  నే నిది నమ్మ నెపుడు నే
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్


  ఆ నలినాక్షు నచ్యుతు ననంతుని భక్త వహించి కొల్చుచుం
  గానల నుండి సంతతము కాయల దుంపల నారగించుచున్
  మే నలయంగఁ జిత్తమున మించి తలంచుచు ముక్తికన్య నా
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్

  [సాని = అధిపురాలు]

  రిప్లయితొలగించండి
 36. దానమొసంగరూకలనుతాలిమితో దొరసాని యర్థియా
  సానిని ముద్దుపెట్టుకొనె, సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్
  తానుచరించె నొంటరిగ తాపసియై గహనాటవీస్థలిన్
  గానఁగఁ నిర్వురున్ తిరిపగాళ్ళెగ జూడగ సూక్ష్మదృష్టితో.

  రిప్లయితొలగించండి
 37. పానముజేయుటన్ సురనుమానసరోగిగమారగాఖురా
  సానినిముద్దుపెట్టుకొనె సంయమిసద్గతిబొందగోరుచున్
  బానముజేయునాతడిలభ్రష్టుడు,మూర్ఖుడు,త్రాగుబోతునై
  గానడుమన్నుమిన్నునికకాంతలజోలికిబోవుచుండునే

  రిప్లయితొలగించండి
 38. నేనే దైవమ్ము ననుచు
  సానిన్ ముద్దాడె యోగి; సద్గతిఁ బొందన్
  సానుల కవకాశమ్మిది
  దానే శరణమ్మటంచు దంభపు బోధన్

  రిప్లయితొలగించండి
 39. కం.

  కానగ దుడుకడు యిందిన
  మౌనిగ గొప్పలు పలుకుచు మధువుల గ్రోలన్
  తానై జేరగ స్వర్గము
  సానిన్ ముద్దాడె యోగి సద్గతి పొందన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్

  సందర్భము: విశ్వామిత్రుడు దశరథుని కడకు వచ్చి మారీచ సుబాహులు యజ్ఞ భంగం చేస్తున్నా రని రాముని పంపించ మన్నాడు యజ్ఞ రక్షణకోసం. దశరథుడు పుత్ర వ్యామోహంతో ఒప్పుకోలేదు.
  "బాలం మే తనయం బ్రహ్మన్
  నైవ దాస్యామి పుత్రకమ్"
  (బాలుడైన నా కుమారుడు రాముణ్ణి నే నీయజాలను.) అన్నాడు. ఐనా కొండలూ చెట్లూ పుట్టలూ అడవులూ ఎక్కడం దిగడం తిరుగడం తాపసులకు ఆటవికులకు చెల్లునేమో గాని సుకుమారులైన రాచబిడ్డల కేం తెలుసు.. అనుకున్నాడు. చివరకు వశిష్ఠుని సలహాతో పంపించాడు.
  మోహం గల వారందరికీ సుపుత్రులు లేరు. అవతార పురుషులే పుత్రులైన వారు అసలే లేరు.
  దశరథుడు పుత్ర సంతానం కోరినాడే గాని నలుగురు పుత్రులను కోరనే లేదు. (అసలే లేనిదానికంటె ఏదో ఒక్కడు చాలు కదా వంశం నిలుపడానికి!) కాని దైవయోగంవల్ల నలుగురు కలిగారు. కేవల సుపుత్రులే కాదు. అవతార పురుషులు.
  అందువల్ల దశరథునిది మోహం కాదు. మోహమే అనుకున్నా అంతకంటె బలవత్తరమైనది అతణ్ణి వరించిన యోగం.
  రాముడు వనవాసంలో అగస్త్య మహర్షిని కలుసుకున్నాడు. తన వృత్తాంతం చెప్పినాడు. అప్పుడు అగస్త్యుడు ప్రస్తుతిస్తూ ఇలా అన్నాడు..
  "సుపుత్రయోగం కలవాడు సుపుత్ర యోగి. దశరథు డట్టి యోగి.. అతనిది మోహం కాదు. యోగం. ఆ యోగి నిన్ను ముద్దాడినాడు. నీవు యతివాసుడవు.. యతుల (యోగుల)లో వసించే వాడవు. యతులే వాసముగా కలవాడవు."
  యోగిసద్గతి= యోగులు పొందే సద్గతి
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  మానిత! నీ పిత "మోహి"యె!

  ఆ నృపుడు "సుపుత్ర యోగి" యనదగు వా డౌ

  గాని, కనుకనే యతి వా

  సా! నిన్ ముద్దాడె యోగిసద్గతిఁ బొందన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  3.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 41. జ్ఞానులు వారు మోక్షమను సంపద గోరెడి వారు ధాత్రిలో
  మానిని పొందు గోరుదురె? మౌనులు త్యాగధనుల్ మహాత్ములున్
  మానుము వట్టిమాటలవమానము జేయగనేలనోయి, యే
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్

  రిప్లయితొలగించండి

 42. కందం
  జ్ఞాన ప్రభంజనమునఁ దాఁ
  బేనుచు శతకమ్ము నాట వెలదీ! నీతుల్
  వీనుల విందొనరఁగ వచ
  సా నిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్

  ఉత్పలమాల
  వేనకు వేల వేశ్యలెటు విశ్వద సాటి యటంచు మోహియై
  జ్ఞాన ప్రభంజనమ్మున వికారము బాయుచు నీతిఁ దోడగన్
  దోనెలనంగ పద్యములతో, వచసా కొని యాటవెల్దియన్
  సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్

  రిప్లయితొలగించండి
 43. మౌనముగ తపము చేయుచు
  కాననమున, నూర్వసిఁ గని కరమౌ యిచ్చన్
  మానసిక వికారముతో
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్

  రిప్లయితొలగించండి
 44. దేనిని కనుగొన ముక్తియె,
  దేనిని బూర్తిగ గ్రహింప తీరును వెతల
  ద్దానివి సఖి! యో మన
  సా!నిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!

  రిప్లయితొలగించండి
 45. నేడు నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము పూర్తి యయినదని తెలుపుటకు సంతోషించు చుంటిని. దీనికి మూలము శ్రీనారాయణ భట్ట తిరి కృత శ్రీమన్నారాయణీయము.

  ఇందు 12 స్కంధ పరిచ్ఛేదములు, 100 దశకములు 1041 పద్యములు కలవు.
  ఇప్పుడింక సునిశిత సమీక్ష చేయ నుద్యమించు వాఁడను.


  100 వ దశకములోని నేటి పద్యములు:

  తను లేప్యమ్ముల సౌరభమ్ము జన చిత్తవ్రాతమున్ లాగగం
  దను మధ్యమ్ము లతా నిభమ్ము త్రిజగద్ధార్యమ్మునై వెల్గఁగన్
  ఘన నీలాశ్మ సువర్ణ పీత వసనాంగత్విట్టు లేపార ని
  స్వన కాంచీ స్థిత కింకిణీ లసిత చిద్బాలున్ నినుం గొల్చెదన్ .... శ్రీమన్నా. 100. 7.


  ఆఖరి పద్యద్వయము:
  యోగి వరేణ్య కాయమున కుత్తమ పాదము లంగకమ్ములన్
  బాగుగ తీపి ముక్తిఁ గను వారల వేశ్మము కల్ప భూజముల్
  వేగమ తీర్చఁ గోరికలు వీటిని నా మది నుంచుమా దయా
  సాగర కృష్ణ హర్ష మిడు శారపురాధిప త్రుంచి తాపముల్ .... శ్రీమన్నా. 100. 10.


  క్షమియింపం దగు విశ్వనాథ నను వక్కాణించ నే నేరకుం
  డ మహత్త్వమ్మును జేయ స్తోత్రమును గాఢమ్మే సహస్రాధికం
  బు మహిం బద్య సుమమ్ము లింపుగను సంపూర్ణంపు టారోగ్యమున్
  గమి సౌఖ్యంబుల నిమ్ము కైకొని నమస్కారమ్ము నారాయణా .... శ్రీమన్నా. 100. 11.

  రిప్లయితొలగించండి
 46. కానలనుండివచ్చితిని కాగలకార్యముబోధసేతు,రా
  మేనునగొప్పయోగమును మేలుగబొందగజేతురమ్మనున్
  వీనులవిందుగాబలికి,వేటునువేసెడు నేరబుద్ధితో
  సానినిముద్దుపెట్టుకొనె,సంయమిసద్గతిబొందగోరుచున్.

  రిప్లయితొలగించండి
 47. సమస్య:
  సానిని ముద్దు పెట్టుకొనె సంయమి సద్గతి బొంద గోరుచున్!

  పూరణ:
  ఉ॥
  ధ్యానఖలీనసాధనవిధానమునన్ బహువేగచారియౌ చల
  న్మా నసదుస్తరంగిణినిమర్మమెఱింగియునిల్వరించెనా
  జ్ఞానియుసంచితంబిగురజన్మమునెత్తతలంచిగర్భవా
  *సానిని ముద్దు పెట్టుకొనె సంయమి సద్గతి బొందగోరుచున్!*

  *గాదిరాజు మధుసూదన రాజు*


  సంచిత కర్మఫలము మిగిలియుండటం వలన మోక్షమందుటకు నొక్క జన్మనెత్తక తప్పదని మాతృగర్భాన్ని ఆశ్రయించి ముద్దాడాడు🕉🕉

  రిప్లయితొలగించండి
 48. మానస మందున గోరెను
  ఆనందమ్ముగ కవితల నాశించంగన్
  నానీలవ్రాయ బూనిన
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!

  రిప్లయితొలగించండి