5, డిసెంబర్ 2019, గురువారం

సమస్య - 3211 (రామరాజ్యాన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె"
(లేదా...)
"బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్"

105 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సతమత మౌచు దోమలను చంపగ జాలక రాత్రి ప్రొద్దుటన్...
  గతుకుల రోడ్ల మీదనిట కారులు త్రోలుట గండమౌచు నీ
  స్తుతమగు హైద్రబాదునను స్రుక్కుచు సోలెడి జీవితంబహో...
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రామ రాజ్యము = (జైలుకు పోవుట ఇష్టము లేదు నాకు) మీరే కనుక్కొనుడు 😊

  రిప్లయితొలగించండి
 2. ప్రభువు ధర్మపా లనమందు ప్రజల కెపుడు
  శాంతి సౌఖ్యము లన్నవి కాంతు లీను
  భక్తి శ్రద్ధల పూజించి పరవ శించ
  రామ రజ్యాన బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగున్నది. కాని సమస్యా పరిష్కారం స్పష్టంగా లేదు.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అయోధ్యా నగరమున ఒక ముల్లా:

  వెతలను దెచ్చు యోగి భలు పేరులు మార్చగ పట్టణమ్ములన్...
  మితముగ గోవు మాంసమును మ్రింగుట నేడిట కష్టమాయెగా...
  పితరుల బబ్రి మస్జిదును పీకుచు కట్టగ దేవళమ్మయో
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 4. శ్రీ వినాయక
  కీచకుని ఆటకు ఈ రాత్రి సంకెలలు వేస్తాను (చంపుతాను) ఆ వార్త రేపు జగమునకు అంతా తెలుస్తుంది అప్పుడు అతని సోదరులు యుధ్ధము చేస్తారు వారిని కూడ చంపితే వారి శరీరము చర్మ వాయిద్య విశేషముగా మారుతుంది అని భీముని పలుకులు

  కవిక వేతు నేడు రయముగ ఖలునకును,
  కవిగొనును జగతికి చావు కబురు రేపు ,
  కవిదలను జేయు నతని సగర్భులపుడు
  కవిడి గామారు వారల కలిల మంత,

  కవిక సంకెళ్ళు ,
  కవిగొను = వ్యాపించును ,
  కవిదలను చేయు = యుధ్ధము చేయు,
  కవిడి = చర్మ వాద్య విషెశము

  రిప్లయితొలగించండి
 5. గురువు గారు నమస్కారము నిన్నటి పూరణము ఒకసారి చూసి సలహా ఇవ్వండి

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-1)
  :
  __________________________

  అమరావతియె నేడు - నగచాట్ల పాలాయె
  పోలవరపు బావి - పుట్టిమునిగె
  మధురామృతంబైన - మాతృభాషయె జూడ
  పాడె పయిన నేడు - పవ్వళించె
  అభివృద్ధి యను మాట - యంతరిక్షము జేరె
  ఆశ్రితులకె లబ్ధి - యందు చుండె
  హైందవ ధర్మమ్ము - హననమొందుచు నుండె
  హత్యలు హింసలు - నిత్యమాయె

  ఆప శక్యమె యెవరికి ? - యడ్డు లేదు !
  దొంగ చేతికి తాళాలు - దొరికె నేడు !
  గజని మోహించి జనులదె - కరచె మట్టి !
  బుద్ధి లేనట్టి దుష్ట ప్ర - భుత్వమగు, కు
  రామ రాజ్యాన బ్రతుకు దు - ర్భరము గాదె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ వందనములు !
   అందరి పూరణలూ అలరించు చున్నవి !
   అలరించ నున్నవి !

   A-1)
   సవరణతో :
   __________________________

   అమరావతియె నేడు - నగచాట్ల పాలాయె
   పోలవరపు భావి - పుట్టిమునిగె
   మధురామృతంబైన - మాతృభాషయె జూడ
   పాడె పయిన నేడు - పవ్వళించె
   అభివృద్ధి యను మాట - యంతరిక్షము జేరె
   ఆశ్రితులకె లబ్ధి - యందు చుండె
   హైందవ ధర్మమ్ము - హననమొందుచు నుండె
   హత్యలు హింసలు - నిత్యమాయె

   ఆప శక్యమె యెవరికి ? - యడ్డు లేదు !
   దొంగ చేతికి తాళాలు - దొరికె నేడు !
   గజని మోహించి జనులదె - కరచె మట్టి !
   బుద్ధి లేనట్టి దుష్ట ప్ర - భుత్వమగు, కు
   రామ రాజ్యాన బ్రతుకు దు - ర్భరము గాదె !
   __________________________

   వసంత కిశోర్ (కవులూరు రమేష్)

   తొలగించండి
  2. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
   'జనులు' బహువచనం, 'కరచె' ఏకవచనం. అక్కడ "జనతయె కరచె మట్టి" అనండి.

   తొలగించండి


 7. తెలుసు కొనవె జిలేబీ మితియె నెరవుగ
  రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గా దె
  పుడు జనులకు! వారికెపుడు కలిగె మేలు
  సుఖము లెల్ల విరివిగాను శోభలలర!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  జనసంహతి మధ్యన సంహరించుచోన్ :
  __________________________

  స్థితిగన దుర్భరంబు గద - స్త్రీలదె పూజ్యులనెంచు జాతిలో
  వెతలవి పెచ్చు మీరినవి - పెద్దలు, పిల్లల కాడ జాతికిన్
  బ్రతుకిది రామరాజ్యమున - భద్రత కోల్పడె దుర్భరంబుగన్ !
  కుతకుత లాడు చుండె మది - కుత్సిత చేష్టల సల్పు దుష్టులన్
  సతమత మొందకుండ జన - సంహతి మధ్యన సంహరించుచోన్
  కుతిగొను కామకూటులకు - కొంత భయంబదె కల్గు మీదటన్
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి


 9. వెతుకను మచ్చుకైన కనువిందగు వారలు కానరారు! భ
  వ్యత యొక యెండమావి గ సవాలుగ జీవులకెల్ల కాన్బడెన్
  అతుకుల బొంత జీవితమనాదరణల్ నిలువెత్తు! యేమిరా
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 10. యువతులాటవస్తువులయి యూతలేక
  మానభంగములకు గురి! మచ్చుకైన
  న్యాయ మన్నది లేదె! వినాశమేను
  రామ! రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'రామ' శబ్దాన్ని సంబోధనగా చేయడం చాల బాగుంది.

   తొలగించండి
 11. రిప్లయిలు
  1. అతుకుల బొంత జీవితము నాలుగు కంబము లాట గాదటే
   వెతలవి గాలి వాటమున వేయి విధమ్ముల వేట కుక్కలై
   యతులి తమైన బాధలను నర్తకివోలె భరించ నెంచినన్
   బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భ రంబుగన్

   తొలగించండి
  2. అక్కయ్యా,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 12. మైలవరపు వారి పూరణ

  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  హతవిధి! ఆడపిల్లలకు నందమె శాపమ? ఆమె పొందె జీ...
  వితమొకొ ? పాపకృత్యమన భీతియె లేదొ ? విశృంఖలత్వమే
  గతియొకొ ? తల్లి చెల్లి యనగా దగు వారికి రక్ష యేదిరా ?
  బ్రతుకిది రామ ! రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. నిందాస్తుతి..

   శ్రుతిపథమే శరణ్యమట! లోకహితమ్మన కృత్యమంట! సం..
   స్తుతిఁగొను సత్యభాషణమె చూడగ దిక్కట! స్వేచ్ఛలేని జీ...
   వితమిది! చిన్నతప్పునకు వేసెడి శిక్షలు పెక్కులంట! మా
   బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 13. (మహిళాభిమానిని ఐన ప్రమీలారాణి
  రాజ్యంలోని పురుషుల ఆవేదన )
  మతులవి పోవుచుండె గద ;
  మాన్యత యన్నది శూన్యమాయెనే ;
  సతులస లెంతమాత్రమును
  సాటిగ నెంచరు మమ్ము నెన్నడున్ ;
  సతమతమయ్యె జీవితము ;
  చావె శరణ్యము పూరుషాళికిన్ ;
  బ్రతుకిది రామరాజ్యమున
  భద్రత కోల్పడె దుర్భరంబుగన్ .
  (రామరాజ్యమున - స్త్రీరాజ్యంలో )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'అసలు' అన్యదేశ్యం కదా?

   తొలగించండి
  2. "సతులస లెంతమాత్రమును" అంటే అక్షరరమ్యత వస్తుందనిపించిందండీ ! ధన్యవాదాలు .

   తొలగించండి
  3. "సతులెపు డెంతమాత్రమును
   సాటిగ నెంచరు మమ్ము జూడగన్ "
   అని మార్చానండీ !

   తొలగించండి
 14. గతుకులబాటగానయెను గాఢపునిద్రల పాలనమ్ములో
  చితుకులుపేర్చినారుగద,చింతలపాలుగనెట్టి జీవితాల్
  కుతకుత లాడెనింకపలు, కుట్రలకూపములోన ముంచగా
  బ్రతుకిది రామరాజ్యమున, భద్రతకోల్పడె దుర్భరంబుగన్.

  రిప్లయితొలగించండి
 15. దొంగ తనములు దోపిడీ దురితము లను
  నిరత మొనరించు దుర్మార్గ నీచతతి కి
  రామ రాజ్యాన బ్రతుకు దు ర్భ రము గాదె
  సుజన వరులకు దక్కును సుఖము లెపుడు a

  రిప్లయితొలగించండి
 16. బతుకిటు భారమాయెగద,బాధలనోర్వగ, రాష్ట్రమందునన్
  గతుకల బొంతగానయెను గాధలు వేరయి కృంగదీయగా
  మెతుకది కష్టమాయెగద,మేదినిపైనను నేతతీరుతో
  బ్రతుకది రామరాజ్యమున,బాధలకోల్పడె దుర్బలంబుగన్.

  రిప్లయితొలగించండి
 17. పాప భీతిని విడనాడు వ్యర్థులకును
  దైవదూషణఁ జేయుచున్ ధర్మమనిన
  గౌరవమ్మది లేనట్టి ఖలుర కిలను
  రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
 18. గతుకులబాటగానయెను గాఢపునిద్రల పాలనమ్ములో
  చితుకులుపేర్చినారుగద,చింతలపాలుగనెట్టి జీవితాల్
  కుతకుతలాడెనింక పలు, కుట్రలకూపములోన ముంచగా
  బ్రతుకిది రామరాజ్యమున, భద్రతకోల్పడె దుర్భరంబుగన్.

  రిప్లయితొలగించండి
 19. హతవిధి యాడువారిపయి హంతల తాకిడినెక్కువాయెగా!
  కుత కుత లాడె మానసము ,కుంగగదీయగ వార్తలన్నియున్
  మతియిక శాంతిగానవదు,మ్రాన్ పడిపోయెను మారణాలతో
  బ్రతుకిది రామరాజ్యమున,భద్రత కోల్పడె,దుర్భరంబుగన్.

  రిప్లయితొలగించండి
 20. తే.గీ//
  తండ్రియాజ్ఞను పాటించి తరలివెళ్ళ !
  రామచంద్రుడు లేనట్టి రాజ్యమందు !
  కరువురక్కసి భూమిని కంబళించ !
  రామ రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె !!

  రిప్లయితొలగించండి
 21. చామలు కలసి ప్రభుతను సలుప నెంచి
  తెరవగు పరిపా లన జేయ దెలిసి గూడ
  "రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె"
  యనుట ననుచిత వివరణ యగును గాదె

  రామ = స్త్రీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ అన్నది స్త్రీ అన్న అర్థంలో ఐతే రామారాజ్యం అని సమాసం కాని రామరాజ్యం అని కాదు కదా!

   తొలగించండి
  2. ఇలా తప్పులు కనబెట్టడానికి ఠా అంటూ దుమికే దానికి బదులు ప్రతి రోజూ వచ్చి కాస్తో కూస్తో కంది శంకరయ్య గారికి‌ చేదోడు వాదోడు గా పూరణలను విశ్లేషించ రాదూ శ్యామల్రావ్ గారూ ?

   తొలగించండి
 22. లేమలను గౌరవించుచు ప్రీతితోడ
  గ్రామములను పనులఁ జేయఁ గలుగు సుఖము
  సోమరి పోతులు తిరుగాడు చున్నదౌ వి
  రామ రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "సోమరులు హెచ్చి తిరుగాడుచున్నదౌ..." అందామా?

   తొలగించండి
  2. గురువర్యుల సవరణకు ధన్యవాదములు. నమస్సులు. అసనారె

   తొలగించండి
 23. సతమతమాయెగా బ్రతుకు సారమునంతయు పీల్చ పిప్పిగా
  చతికిలగానుకూలబడె , చావగలేకను రోజురోజుకున్
  పితుకుచునుండె ప్రాణముల ,పిచ్చిగజేయుచు పాలనమ్మునే
  బ్రతుకది రామరాజ్యమున,బాధలకోల్పడె దుర్భరంబుగన్

  ***********************
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 24. 05/12/2019
  ఈ రోజూ సమస్యాపూరణము

  *రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె*

  *తే గీ:*

  మిన్నుదన్ను ధరలు నిల మితిము లేక
  నతివలను చెరచు నరుడు నవసరముల
  యట్టి స్థితిన జనులిచట యముని జూడఁ
  రామ, రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె?

  🙏🙏

  రిప్లయితొలగించండి
 25. పెద్ద యెత్తున నేరాలు పెరిగి పోయి
  శాంతి భద్రతలనునవి సమసిపోయి
  భువిని నిశ్చింతయే లేక పోగ "రామ!
  రామ!"రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె!

  రిప్లయితొలగించండి
 26. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
  "రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె
  రాజ్యాన బ్రతుకు లో
  *న* గురువు
  రాజ్యాన మ గణం అవుతుంది అది చంద్ర గణం కాదు కదండీ
  తేటగీతి పద్యము పూరించలేం కదా
  కొంచెం వివరించగలరా
  కంది శంకరయ్య గారికి నమస్సుమాంజలులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నన్ అనే తెలుగు ప్రత్యయం చేరడం వల్ల రాజ్యాన లోని చివరి న గురువు కాదు. 'రాజ ద్రోహము' అన్నపుడు రెండు సంస్కృత పదాలతో ఏర్పడిన సమాసం కనుక 'జ' గురువవుతుంది. 'వాడు ద్రోహి/ రాజు ద్రోహి' అన్నపుడు డు, జు లు గురువులు కావు. లఘువులే.

   తొలగించండి
 27. అతివల జీవితమ్ములకు హానిని గూర్చుచు రేపు మాపులన్.

  జితులను బేర్చ నెంచుచును శీలము దోచుచు స్త్రీ జనమ్ములన్

  సతతము పూనికన్ గొనెడి శ్వానములన్ సరి దిద్ద లేని మా

  బ్రతుకిది, రామ! రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్!

  రిప్లయితొలగించండి
 28. అన్నరామన్నవిపినమందలమటించ
  రాజ్యపాలననాకెట్లు రక్తిగూర్చు
  నంచు భరతుడు తలబోసెనన్నలేని
  రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
 29. చం॥
  భృతిగొనురక్షకుల్ భటులుభీతిలుదీనులవిస్మరింపసం
  స్కృతియిదిపూజచేయదగుఁస్త్రీననిపౌరులువిస్మరింపఁసూ
  నృతమిది విద్యకై విధులనిల్వగవీధులస్త్రీలు రేబగల్
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  గాదిరాజు మధుసూదనరాజు

  రిప్లయితొలగించండి
 30. కాననమున వర ముని నికాయమునకు
  భద్రత నొసంగు రఘు రామభద్రు నునికి
  వర జనస్థానమున దైత్య వరుల కెల్ల
  రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె


  సతతము చోరభీతి మఱి చాగును మోసము చూచుచుండ గ్రూ
  రత దివిఁ దాఁకు నెల్లరకుఁ బ్రాణ భయమ్మును మాననాశమున్
  వెత లవి చెప్ప నేల నట వెంగలు లెల్లరు రాజ్య మేలగన్
  బ్రతుకిది రామ! రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 31. చం.

  కుత కుత లాడు చుండ యమకూపము బోలిక దేశమంతటన్
  వెతపడు చుండజూసి కడు వేదన కోర్చె డి యాడువారలన్
  పితపిత లాడుచుండ మది పీకల మున్గిన వారి దుస్థితిన్
  బ్రతుకిది రామ రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 32. అతులితమైన ప్రేమమున నక్కగ చెల్లిగ తల్లిగా కనన్
  గతమున, నేడు నీతి విడి కామముతోగని యాడువారలన్
  వెతపడ చేయు చుండిరిల వెంగలి విత్తులు, చింత చేయగా
  బ్రతుకిది రామ! రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 33. పతితులమాత్యులౌచు పరిపాలన జేయుచు నున్న ధాత్రిలో
  యతివల కేది రక్షణ? మదాంధుల కోరల చిక్కు చుండగన్
  సతమత మయ్యె ప్రాణులము జగ్ధికి నిత్యము పోరు జేసెడిన్
  బ్రతుకిది రామ, రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 34. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె
  దుర్భరంబుగన్

  సందర్భము:
  రామో రామో రామ ఇతి
  ప్రజానా మభవన్ కథాః
  రామ భూతం జగదభూత్
  రామే రాజ్యం ప్రశాసతి
  "రాముడు రాముడు రాముడు" అని ప్రజలంతా రామ కథలే చెప్పుకునే వారు. రాముడు రాజ్యం చేస్తూ వుండగా జగత్తంతా రామమయ మయింది.
  రాముడు 11000 సంవత్సరాలు రాజ్య మేలినాడు. 100 అశ్వమేధ యాగాలు చేసినాడు. ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లినారు. పూర్ణాయుష్కులై యుండినారు.
  రామ రాజ్యం ప్రజా రాజ్యం.
  (ప్రజారాజ్యం రామరాజ్యం కాదు.)
  ఎప్పుడూ అసత్యం పలికే వానికి, సాధువులకు విషాదం కలిగితే సంతోషించే వానికి,
  విస్తారమైన ధర్మాన్ని బద్దలు కొట్టే వానికి (భంగపరచే వానికి), పదిమందిలో ఉన్నా వివిక్తుడై (ఒంటరివాడై) సమీకృత (పోగువేయబడిన) భక్ష్యాలను (తినదగినవానిని, మధురపదార్థాలను), తినే వానికి,
  ఎప్పుడూ పనీ పాటా లేకుండా (వృథాగా) క్రీడాదులతో వినోదించే వానికి, విశాల గుణ ఇతరమైన (మంచిగుణం కానటువంటి) బుద్ధితో స్వారీ చేసే (కాలక్షేపం చేసే) వానికి జీవితంలో భద్రత లేదు రామరాజ్యంలో...
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  సతత మసత్య వాదికిని,
  సాధు జ నైక విషాద మోదికిన్,
  వితత సుధర్మ భేదికి, వి
  విక్త సమీకృత భక్ష్య ఖాదికిన్,
  సతత వృథా వినోదికి, వి
  శాల గు ణేతర బుద్ధి సాదికిన్
  బ్రతు కిది రామ రాజ్యమున
  భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  5.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 35. కాముకులకు దుర్మద బల గర్వితులకు
  తామసులకు దుష్కర్మ విదాయకులకు
  సోమరులకు టక్కరులకు జూదరులకు
  రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
 36. తేటగీతి
  గౌరవంబొసఁగి నటులఁ గలిపి మాట
  నమ్మఁ బిల్చి చేయుదురమ్మ నాశనమ్ము
  జాగరూకత లేకుండ సాగ, రామ!
  రామ! !రాజ్యాన బ్రతుకు దుర్భరముఁ గాదె?
  చంపకమాల
  పతనముఁ జెంద రావణుడు, భారతమందున కౌరవాదులున్
  యతివ పరాభవమ్మునని యందరు నేర్చియు మారరేలనో
  కుతుకము మీర రాక్షసుల గూల్చఁగ రారని సత్యభామలున్
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 37. సంతసమున జీవించిరి జనము లెల్ల
  రామ రాజ్యాన,బ్రతుకు దుర్భరము గాదె
  యక్రమములతో నిండిన యాధునికపు
  జగతి యందును బ్రతుకంగ చక్కగాను.

  క్రూరకర్మలు చేయుచు కూర్మి వీడి
  బాధలిడుచుండిరనయము పడతులకిటు
  భారమయ్యెను బ్రతుకులు వసుధ యందు
  రామ, రాజ్యాన,బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
 38. గతుకులరాజమార్గముల గాబరపెట్టు ప్రమాదఘంటికల్
  వెతలనుపెంపుజేసిమది భీతినిగూర్చెడు వైద్యశాలలున్
  మతములకుమ్ములాటలునుమారణహోమములెల్లవేళలన్
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 39. అతివలకండగా నిలుతురందరు నచ్చట దోడు నీడగా
  సతతము సత్య ధర్మ వ్రత సాధనలో జనులుందురచ్చటన్
  పతితులు పాప కర్ములును భ్రష్టులు కాలిడ లేరు వారికిన్
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 40. ప్రజలుహాయిగ జీవించెభరణియందు
  రామరాజ్యాన,బ్రతుకుదుర్భరముగాదె
  వలయురూకలులేనిచోబ్రజలకకట
  రామరాజ్యముమనకింకరాదుతలప

  రిప్లయితొలగించండి
 41. తేటగీతి
  మాన ప్రాణ భయముచేత మాడిపోయె
  కానలేక వినెడివారు కాలముచెయ
  మానవత్వమే రాజ్యాన మాసిపోవ
  రామ, రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె

  రిప్లయితొలగించండి
 42. చంపకమాల :
  క్రతువులు సల్పు వంశము త్రికాల హితుండు అయోధ్యవాసియున్
  బ్రతుకున యా మడేలుని యబద్ధపు బల్కుల యగ్నిపూజితన్
  ప్రతినగ భ్రాతతో బలికె ప్రస్తుతి చూలిని వీడ గానలన్
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్"

  2. బ్రతుకును కుక్కలై గరువ బ్రాయపు కోర్కెల గన్నె యందమున్
  బ్రతుకును నిల్పగా జనిన భద్రత లేకను గర్భశోకమున్
  బ్రతుకగ నేమి యాసనిక భారపు జీవన చర్వణమ్మునన్
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్"

  రిప్లయితొలగించండి
 43. అతుకులబొంతయాయెనుగనారమపాలనమానవాళికిన్
  పతియనగౌరవంబుమగవారికిలేకనువింతపద్ధతే
  సతతముసేవజేయుచునుసజ్జనువోలెనునుండగోరినన్
  బ్రతుకీదిరామరాజ్యమునభద్రతకోల్పడెదుర్భరంబుగన్

  రిప్లయితొలగించండి
 44. Is 2-factor authentication error bothering you in your Binance account? Is 2-factor authentication creating fuss in your account and you need right process to execute it properly without any trouble? To deal with all the Binance errors, you are advised to directly reach to the team of executives who are there to support you at any point of time. Just dial Binance toll-free number and get immediate solutions and fix your problem on urgent basis so that you can focus on trading without any disturbances.

  రిప్లయితొలగించండి