జడకు యెటుల కల్గు చక్కదనము, సీత కనబడె నని హనుమ కపుల తోడ బలుక ,వాటి చేష్ట వలన కలిగె నేమి పూల వలన, జెడెను పుష్పవనము (రామాయణములో హనుమంతుడు సీతను చూసి వచ్చాను అని చెప్పగా ఆ వార్త చెవిన బడగానె వానర మూక అంతా సంతోషంతో తిరిగి వస్తూ సుగ్రీవుని మేనమామ దధి ముఖుడు కాపలా కాయుచున్న మధు వనము మొత్తము ధ్వంసము చేశారు.)
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
కోవెల ధ్వంసమొందగను కొండొక ధూర్తుడు దండయాత్రనున్
త్రోవను పోవుచున్ చెలగి త్రొక్కుచు త్రోయుచు మట్టుపెట్టగా...
బావిని నీరు లేక కడు బాధల నొందుచు క్రుళ్ళిపోయినన్
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
ఉదయాన్నే ధ్వంస మందిర దర్శనం చేయించారు.
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పూవుల తోటలోన కడు మోదము నొందుచు చేర నేతలే
బావురుమంచు కేకలిడ బంజర హిల్సున మైకులందునన్
పావల కొక్క వందయగు భాజప పార్టివి కాగితమ్మువౌ
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
కాగితపు పూలతో మీ ఆటవిడుపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
యే రీతి ???
__________________________
పూల వలన హెచ్చు - పూదోట యందము
పూల వలన తోట - పొలుపు పెరుగు
పూల బెరుగు పొందు, - పొత్తదె; యే రీతి
పూల వలనఁ జెడెను పుష్పవనము ?
__________________________
పొలుపు = సువాసన, పొందు = ప్రేమ, పొత్తు = స్నేహము
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
యేడ నే విధిన్ :
__________________________
పూవుల తోడ దేవతల - పూజ నొనర్పగ వచ్చు భక్తితో !
పూవుల వల్ల ప్రేమనదె - పొందగ నౌ, ప్రియమార యిచ్చినన్ !
పూవుల వల్ల స్నేహమును - పొందగ వచ్చును ! యేడ నే విధిన్
పూవులవల్ల రూపు సెడె - పుష్పవనాంతర రమ్యదృశ్యముల్ ???
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
అధిక్షేపాత్మకాలైన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'వచ్చును + ఏడ' అన్నపుడు యడాగమం రాదు. "వచ్చును గాదె యెవ్విధిన్" అందామా?
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిసవరణతో
యెవ్విధిన్ :
__________________________
పూవుల తోడ దేవతల - పూజ నొనర్పగ వచ్చు భక్తితో !
పూవుల వల్ల ప్రేమనదె - పొందగ నౌ, ప్రియమార యిచ్చినన్ !
పూవుల వల్ల స్నేహమును - పొందగ వచ్చును గాదె ! యెవ్విధిన్
పూవులవల్ల రూపు సెడె - పుష్పవనాంతర రమ్యదృశ్యముల్ ???
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
రిప్లయితొలగించండివిపరీతపుటాలోచన
ల,పరిస్థితుల పఱిగొని కలకలములను రే
పు,పొలసు పూల వలనఁ జెడె
ను పుష్పవనము భరతమ్మ నుట సత్యమ్మే!
జిలేబి
ఆటవెలది పాదాన్ని కందంలో నిక్షిప్తం చేసి చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భరతమ్మ + అనుట' అన్నపుడు సంధి లేదు. "భరతమ్మ నుడి సత్యమ్మే" అందామా?
B-2)
రిప్లయితొలగించండిఅశోకవనమున :
__________________________
తావియె హెచ్చ నావనము - ధన్య మనస్విత గాగ సీతయే
పూవులవల్ల ! రూపు సెడె - పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
కావలి కాయు రక్కసుల - గావదె చేయుచు నీదపట్టి, యా
తావున నున్న వృక్షముల - ధ్వంసమొనర్పగ విక్రమంబునన్ !
__________________________
గావు = బలి
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎండ కాల మందు నెండకు వడలిన
రిప్లయితొలగించండిపూల వలనఁ జెడెను పుష్పవనము
తీసి పార వేయ తిరిగి వచ్చు పసిమి
యిమ్ము కలుగు వెతల నేరి వేయ
పసిమి = అందము
ఇమ్ము = సుఖము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భరిత పూవనము' అన్నది సాధు సమాసం కాదు. "భరితమౌ వనములై" అందామా?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఎవరివో... నీవెవరివో🌹🌷💐
తీవనుబోలు మేను.. సుదతీకుచయుగ్మము కుట్మలమ్ములౌ
పూవులు విచ్చినట్లు నగవుల్.,నయనమ్ములు పూలరేకులౌ!
పూవులకొట్టు వోలె పువుబోడి చరింపగ నామె సోకులన్
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
తొలగించండిచాలా బాగుందండి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూనిక తోడ నేర్చుకొని పూర్ణతఁ గాంచెనొ? విద్యలందు, నే
రిప్లయితొలగించండిజ్ఞానము నంది సద్గుగురుసన్నిధి వాల్మికసూతి శ్రేష్ఠమౌ
తేనియ జాలు చాడ్పున విశిష్టరఘూద్వహ గాధఁ జేప్పెనో?
వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సద్గురువు సన్నిధి' టైపాటు.
కఃది వారి సూచనతో
తొలగించండినిన్నటి పూరణ.
పూనిక తోడ నేర్చుకొని పూర్ణతఁ గాంచెనొ? విద్యలందు, నే
జ్ఞానము నంది సద్గురువు సన్నిధి వాల్మికసూతి శ్రేష్ఠమౌ
తేనియ జాలు చాడ్పున విశిష్టరఘూద్వహ గాధఁ జేప్పెనో?
వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
జడకు యెటుల కల్గు చక్కదనము, సీత
రిప్లయితొలగించండికనబడె నని హనుమ కపుల తోడ
బలుక ,వాటి చేష్ట వలన కలిగె నేమి
పూల వలన, జెడెను పుష్పవనము
(రామాయణములో హనుమంతుడు సీతను చూసి
వచ్చాను అని చెప్పగా ఆ వార్త చెవిన బడగానె వానర మూక అంతా సంతోషంతో తిరిగి వస్తూ సుగ్రీవుని మేనమామ దధి ముఖుడు కాపలా కాయుచున్న మధు వనము మొత్తము ధ్వంసము చేశారు.)
మధువన విధ్వంసాన్ని ఎవరు ప్రస్తావిస్తారా అని ఎదురుచూస్తున్నాను. ఆ పని మీరు చేసారు. సంతోషం. బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిఆలి యలుక దీర్చ యందాల వనమందు
రిప్లయితొలగించండిపూలు కోసి దెచ్చి పొందు పరచ
ఎండ వేడి కంట మాడిసొ గసులేని
పూల వలనఁ జెడెను పుష్ప వనము
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దీర్చ నందాల...' అనండి.
జీవుల యిష్టముల్ మదుల జేసెడి భావనలున్ విభిన్నముల్
రిప్లయితొలగించండిగావున పారిజాతముల గాంచిన గిట్టని వాడొకండు తా
నీవిధి బల్కె నేలపయి నియ్యవిరాలుచునుండు సత్య మీ
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజడల సౌరు మించు జవరాండ్ర కెట్లన
రిప్లయితొలగించండిపూల వలన :జెడెను పుష్ప వనము
కపులు వినగ హనుమ గాంచుట సీతను
పాడు జేయ దొడగ బహు విధాల
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుష్పవనమునందు పూలన్ని విరబూసె
రిప్లయితొలగించండికోసుకొనగజేరి కుర్రకారు
తోటలోనిచెట్లు తొక్కిపాడుగజేయ
పూల వలనఁ జెడెను పుష్పవనము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినేటి భారతమ్ము
మా వునికిన్ జనాళికి క్రమమ్ముగ చూపగ చేసెదమ్మికన్
తావుల తావు లెల్ల హడతాళుల దేశపు కీర్తి బావుటా
చావను, కాంగి రేసనుచు, చాగఱ ముఖ్యమటంచు త్రుంచెడా
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమా + ఉనికి = మా యునికి అవుతుంది.
కావరమెక్కి వీచి పెనుగాలులు రాత్రిన కొమ్మరెమ్మలన్
రిప్లయితొలగించండిద్రోవలు నిండగాఁ విరిచెఁ,దోట సమస్తము నెందుఁ జూడఁనే
తావును వీడకన్ బడిన తాడనమందిన పత్ర కంటకాల్
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
దేవి రుక్మిణి కిడెఁ దీపినఁ గృష్ణుడే
తొలగించండినారదుండొసగిన నాక వనపుఁ
బూలు,చెరిచెఁ చెట్టుఁ బూవనము నవియె
"పూల వలనఁ జెడెను పుష్పవనము"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపూవువంటి మాత పుడమిపట్టిని గాంచి
రిప్లయితొలగించండిఆంజనేయు డటకు యరుగుదెంచ
మోదమంది కపులు మొహరించి ద్రుంచిన
పూలవలన చెడెను పుష్పవనము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...అటకు నరుగుదెంచ... మోహరించి చెరచ..." అనండి.
తెరపిలేక బట్ట తెల్లవార్లు ముసురు
రిప్లయితొలగించండిచెట్టుపుట్ట గుట్ట చెదరిపోవ
రైతుకంట నీరురాలగ రాలిన
పూలవలన చెడెను పుష్పవనము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబహుసుగంధపుష్ప భరితమౌవనములై
రిప్లయితొలగించండిసుదతులతలలొప్పి సొబగులీనె
మునుపు, యిప్పుడకట ! మోసపూరక షాం
పూలవలనజెడెను పూలవనము
సవరణ చేశాను. గురవు గారికి కృతజ్ఞతలు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి(బోటనీ విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం ,హెర్బేరియం కోసం పూలన్నిటినీ కోసుకొని పోతే పుష్పోద్యానం నిష్పుష్పోద్యానమేగా )
రిప్లయితొలగించండితీవెల యూయలందు కడు
తీయని తేనెల తేటులానగా
తావులు చిమ్ముచుండెడి సు
తారపు మమ్ముల ; వృక్షశాస్త్ర సం
భావిత మానవుల్ చిదిమి
వందల బుట్టల నింప ; శూన్యమౌ
పూవుల వల్ల రూపు సెడె
పుష్పవనాంతర రమ్యదృశ్యముల్ .
(హెర్బేరియం - పూలను కాడలతో వత్తిపెట్టి వైట్ పేపర్ కంటించి మార్కులకై తయారుచేసే ఆల్బం ; తేటులు -తుమ్మెదలు ; సుతారపు - సుకుమారమైన )
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూలుకోయవచ్చిపూలవనమునకు
రిప్లయితొలగించండినిష్టమగువిధమునదుష్టువోలె
గలయబడుచుదిరిగి కసికసిగాకోయ
పూలవలనజెడెను పుష్పవనము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండితావిని వీడి వాడినటు దారుణ రీతిని కాంతి హీనమౌ
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
సేవకులెక్కడంచురిమి సీతను జూడఁగ బోవు రావణున్
బావని చింత హేతువను బల్కులు లీలగఁ దోచె బిక్కునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఊరఁ గుక్క లున్న నొప్పు నుండఁ దగునే
రిప్లయితొలగించండియౌర జంబుకమ్ము ఘోర మయ్య
క్రూర రీతి నక్క కూయఁగ రేపు మా
పూల వలనఁ జెడెను పుష్పవనము
[మాపు + ఊల = మా పూల]
ఆ వనజాక్షు సంతత దయార్ద్ర నిరీక్షణ కారణమ్మునం
బావన పూరుషుం డితని పాప మణంగి తరించు నెన్నఁడో
వావిరి బాధ నొందగను బాపమ యాతని జంట కన్నులం
బూవుల వల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅందరికీ నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండిఈరోజు సమస్యా పూరణం (24/12/2019)
*పూల వలనఁ జెడెను పుష్పవనము*
*ఆ వె:*
చేల వదిలి యెద్దు చేరగ వనమున
కలయ బడు నటులది కదలు వేళ
త్రొక్కుచు నడయాడ దున్నలు, నలిగిన
పూల వలనఁ జెడెను పుష్పవనము
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితీవెల నూగి హాయిగను దీరును గూర్చిన పూలు నేడికన్
రిప్లయితొలగించండిత్రోవల వెంట రాలిపడ దొక్కగ నందరు చిందువందులౌ
నావల పారవోయవలెనా వసి వాడిన గుచ్చువిచ్చులా
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅపవనమ్ము లోన యాడెడు బాలలు
రిప్లయితొలగించండిగుడ్లగూబ యొకతె కూసినంత
భయము తోడ వారు పరుగిడ హరినేత్ర
పూల వలనఁ జెడెను పుష్ప వనము.
హరినేత్రము ఊల .....హరినేత్రపూల .... గుడ్లగూబ అరుపు.
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'లోన నాడెడు...' అనండి.
పూవులుగోయగావెడలిపూవులతోటకుదుష్టభామినుల్
రిప్లయితొలగించండిగావరమొందుచున్మదినికర్కశబుద్ధులుగల్గియున్నదై
యావనమంతటన్దిరిగియందినపూలనుజింపివేయగా
పూవులవల్లరూపుసెడెపుష్పవనాంతరరమ్యదృశ్యముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిత్రావగతేనియల్ భ్రమర తక్కువ జేయగ పూలతా వినిన్
పోవడ జూడ ప్రేమికులు పోరిడ ప్రేమన పార్కు నందునన్
త్రోవలు దారులున్ గనక త్రొక్కుచు దిర్గన చెట్టపట్ట లన్
పూవులవల్ల రూపు సెడె పుష్ప వనాంతర రమ్య దృశ్యముల్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూవులుగల్గుసీమలిక ,పుణ్యముగానగు పూవుబోడికిన్
రిప్లయితొలగించండిరావెలగ్రామమందుగల ,రాజిలుచుండెడి తోపునందునన్
కోవెలదారివెంటనొక ,కోరికదీర్చనిపిచ్చిపూలతో
పూవులవల్లరూపుసెడె,పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
+++++++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
పూవులుయాడువారికిక,పుణ్యప్రసాదినియంచుదల్చగా
రిప్లయితొలగించండికోవెలజేరుపూవులికకోరికదీరెనటంచునెంచగా
గోవులుమేయగాదిరుగు గోడనుదాటినతోటనందునా
పూవులవల్లరూపుసెడెపుష్పవనాంతరరమ్యదృశ్యముల్
+**++++++++++++++++
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'పూవులు + ఆడువారికి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
కావలియుండుతోటలిక,కమ్మనిపూలనుగుమ్మరించులే
రిప్లయితొలగించండిమావలగాదులెమ్మనుచు ,మంచిగనుంచనిపిచ్చితోటలే
సేవలబొందలేకనిక, సేద్యముసేయగనొప్పనట్టియా
పూవులవల్లరూపుసెడె,పుష్పవనాంతరరమ్య దృశ్యముల్
************************************
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావన వనమదిసు వాసనతో నిండె
రిప్లయితొలగించండిపూల వలన;జెడెను పుష్పవనము
తోటమాలి లేక త్రొక్కగా పశువులు
కాఃతిహీనమగుచు కానిపించె.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితీవెలవోలె సాగుచును,తిన్నగ పూచెడు పూవులెన్నియో!
రిప్లయితొలగించండితావుల దమ్ము వీడకను, ధన్యతనొందగజూచియుంటిలే
పావడబట్టి వీడకను,పట్టుగబట్టినముండ్ల తోటలో
పూవులవల్లరూపుసెడె,పుష్పవనాంతర రమ్య దృశ్యముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపూవుల తరువాత అరసున్న ఎందుకు?
చీడ పారద్రోల చెద మందు చల్లగా
రిప్లయితొలగించండిపూలపైన పడెను పలచగాను
వాసనవగ జనులు పాలుపోక యనిరి
పూల వలన చెడెను పుష్పవనము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆవలనున్న యావనము,అందముగానట మెచ్చుకోలుగా
రిప్లయితొలగించండితీవెలనెన్నొ సాగుచును,తిన్నగ పాడును పుష్పరాగముల్
రావెల గ్రామమందునొక,రాళ్ళన నాటిన తోపునందునన్
పూవుల వల్లరూపుసెడె పుష్పవనాంతరరమ్య దృశ్యముల్.
జీ’వన’మందు కాంతులను, చేతన గాంచని కావ్యమందు నే
రిప్లయితొలగించండిపా’వన’మైన కర్మముముల వాసిగ నెంచని వ్యర్థపంక్తులై
తావులఁ బంచలేని కవితా’వన’మందలి వ్రాతలైన యా
"పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్"
రావెలపురుషోత్తమరావు
రిప్లయితొలగించండి*రెండవ పూరణ*
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సుమాంజలి 🙏🙏
ఈరోజు సమస్యా పూరణం (24/12/2019)
*పూల వలనఁ జెడెను పుష్పవనము*
*ఆ వె:*
లలనది యన తగదు పూల వనమదియె
కనులని యన తగదు కలువల సరి
వలదనిన తురిమిన పలురకముల విరి
పూల వలనఁ జెడెను పుష్పవనము
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
భీకరమగు కుంభ వృష్టియె కురవగన్
రిప్లయితొలగించండినీరు నిండి వనపు సౌరు తరగె
పూలు రాలి నీట మునుగగా గ్రుళ్ళిన
పూల వలనఁ జెడెను పుష్ప వనము.
కావలి వాడు లేని తరి కయ్యము లాడుచు జొచ్చెఁ దోటలో
రిప్లయితొలగించండిగోవులు రెండు నాగ్రహముఁ గొమ్ములు రువ్వుచు పోరుసేయగా
పూవులు రాలె ధ్వంసమయె మొక్కలు, రేకులు రాలినట్టి యా
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్
ద్రోవది ముద్దుదీర్ప ఘన దోర్బలుడా పవమాన సూనుడా
రిప్లయితొలగించండిశావహుడై కుబేర విభు సారస జన్యసుగంధికా ప్రసూ
నావళులుద్ధరించి గొనినంత వృకోదర భంజితం బులౌ
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్"
విరుల వనము నందు విరులు పూయుచు నుండ
రిప్లయితొలగించండిమదికి ముదము కూర్చు మానుగాను
వాన కురిసి నంత వనిలోన కుళ్ళిన
పూల వలన జెడెను పుష్పవనము
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పూవులవల్ల రూపు సెడె పుష్పవ నాంతర
రమ్య దృశ్యముల్
సందర్భము:
తతస్తు హనుమాన్ వీరో
బభఞ్జ ప్రమదావనమ్
మత్తద్విజ సమాఘుష్టం
నానా ద్రుమ లతాయుతమ్
సుం.కాం.41-15
మదించిన పక్షులు ధ్వనులు చేసేదీ, అనేక చెట్లతో తీగలతో కూడిందీ ఐన ప్రమదావనాన్ని మారుతి ధ్వంసం చేసినాడు.
దాంతో.. ప్రణష్టరూపం తదభూ న్మహద్వనమ్.. వన సౌందర్యం నశించింది.
ఒనర కేళీగృహంబులు నుగ్గు జేసి
వన మహీరుహములు వడి నేల గలిపి
కొమ్మలు ఖండించి కుసుమముల్ రాల్చి
కమ్మ తేనెలు చల్లి కాలువ ల్చెఱచి
పూవుతీగెలు ద్రెంచి పొదరిండ్లు చదిపి
బావులు గలచి దోర్బల కేళి దేలి
(రంగనాథ రామాయణం)
ఆ వని (అశోక వనం) అందచందాలు అనంతాలు.. ఐతేనేం! సీతా మాతకు శోక హేతువులే యైన వని కినుకతో రామదూత పావని (సీతా దర్శనానంతరం) వన విధ్వంసం చేసినాడు.. చిన్నా పెద్దా చెట్లెన్నో నేల గూల్చినాడు.. (అందమైన) పూ లెన్నో వేలాదిగా రాల్చినాడు. అవన్నీ ధూళిపాలైనవి.
ఆ పుష్ప వనంలోని కనువిందు చేసే దృశ్యా లన్నీ రూపు చెడినవి. 'ఆహాహా!' అనిపించే వన్నీ 'అయ్యయ్యో!' అనిపించసాగినవి.
"పాదప పాళిని గూల్చి" అనడంద్వారా కేవలం రాల్చిన పూవులవల్లనే కాదు.. కూల్చిన చెట్లవల్ల కూడా రమ్య దృశ్యాలు రూపు సెడిన వని...
పూవులు రాల్చడంవల్ల మాత్రమే రమ్యదృశ్యాలు రూపు చెడ వనుకుంటే వృక్షాలు కూల్చడంవల్ల నది సంభవమే! అని..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*అశోకవన విధ్వంసము*
ఆ వని యందచందము ల
నంతములే యగు గాక! సీతయున్
పావన మాతయున్ వెతల
పా లగు హేతువు లాయె నంచుఁ దాఁ
బావని యా వనిన్ జెఱచె,
పాదప పాళిని గూల్చి , రాల్చి.. యా
పూవులవల్ల రూపు సెడె
పుష్పవ నాంతర రమ్య దృశ్యముల్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
24.12.19
-----------------------------------------------------------