జ్యూరిచ్ నగరంబందున [zurich] కేరింతలతో దిసమొల - కేరుచు, వడిగా పారుచు, తన కృత్రిమమౌ నారీమణి యొకతె చూపె - నాలుగు కుచముల్ ! __________________________ Zurich is the largest city in Switzerland
గ్రీకు దేవత అర్టెమిస్ కు బహు కుచములు కలవు. మనహిందు పురాణములలో మధురై నగరమున మీనాక్షి మాత, మలయ ధ్వజుడు కాంచన మాలలకు మూడు సంవత్స్రముల్ గల బాలికగా మూడుకుచములతో బుట్టి పెరిగి పెద్దది అయినది ఆవిడ పేరు (తాడాతకాయి) శివుని తోయుధ్ధము చేయు సమయమున ఒక కుచము నుప సం హరణము చేసుకొని మీనాక్షి గా మారిఆ శివునే పెండ్లి చేసుకొన్నది. ఈ మధ్య చైనా నగరములో వాంగ్ యను మహిళ సర్జరీ ద్వారా నాలుగు కుచములు పొందినది.ఇవి అన్నియు నిజము ఆనుచు ఒక మహిళ గూగులులొ సెర్చ్ చెసి చూపించగా అందరు విస్మయము పొందినారు అను భావనతో పూరించినది ఈ సమస్య ఇధి భావనయే కాదు నిజము వివరములు కావలె నన్న గూగులు చూడవచ్చు
ఆర్టెమిస్ దేవత కాశ్చర్యముగ కలిగెను బహు కుచములు తనువు పైన,
మధురై నగరమున మలయధ్వజుండను రాజుకు బుట్టెగా రమణి యొకతె
మూడు చన్నులతోడ, మూడు కనులు గల వానిని పెండ్లాడి వాసికెక్కి,
మీనాక్షి మాతగా మెయిపైన పూజలను పుడుకు చుండె,నేను తెలుపునది నిజమని నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్ గల మగువ నొకతె
నీ జగతిలోన, వాంగ్ యను నీర జాక్షి కుండె చైనా నగరమందు కుదురు గాను నాల్గు, గూగులు లోజూచి నమ్మ మనుచు తెలుప చోద్యము గాంచిరి పలుకు లేక
సందర్భము: బాల రాముడు పాల కేడుస్తూ చేరాడు తల్లివద్ద. సరిగ్గా అప్పుడే ఒక ముఖ్యమైన పని వుందని దశరథుడు వచ్చి పిలిచాడు. వెళ్ళి వత్తా మనుకున్న నారీరత్నమైన కౌసల్య.. "నే నొక్కదాన్నే కాదుగా! ఇంకా ఇద్ద రున్నారు నీ కమ్మలు. (వారిదగ్గరా పాలు తాగవచ్చు. పరవాలేదు.)"అని వా రిద్దరి (సుమిత్ర కైకల) వద్దా బిడ్డను చేరుస్తూ వారి పాలిండ్రవైపు చూపింది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ గారాబంబున పాల కేడ్చుచును నా కౌసల్యఁ జేరన్ దమిన్ శ్రీ రాముం.. డొక ముఖ్యమైన పనికై చీరన్ ధరానాథుడున్ "లేరా! తల్లులు నింక నిద్ద" రని వా రిన్ జేర్చుచున్ బిడ్డకున్ నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 20.12.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
పోరాటమ్మున నందగత్తె మకుటం బొందంగ శీతాద్రినిన్
శూరత్వమ్మున వేల వేల మహిళల్ సూపంగ రెండింటినే
గౌరీకుండము నందు గోవులలరన్ గారాబుగా నందికిన్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినందినీ ధేనువునకు నాలుగు పొదుగులుంటాయని ఎక్కడో చదివిన జ్ఞాపకం.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
పారిస్దేశపు బాడీ :
__________________________
పారిస్దేశపు బాడీ
వారిజ నేత్రకు తగినది - వరుడే యిడగా
చీర పయిన పెట్టుకొనుచు
నారీమణి యొకతె చూపె - నాలుగు కుచముల్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
paris
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పారూ! నాకిక నీవి నాల్గు కుచముల్ బ్రహ్మాండమౌ తీరునన్
ధీరత్వమ్మున తీసి చూపమనుచున్ తీండ్రించి వేసారుచున్
పోరున్ బెట్టగ ప్లేటునందు నగుచున్ ప్రొద్దున్న నిడ్లీలనున్
నారీరత్నము సూపె నాల్గు "కుచముల్" నాథుండు మెచ్చన్ మదిన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిA-2)
రిప్లయితొలగించండికారణమేమో జన్యువు :
__________________________
కారణమేమో జన్యువు
కోరక తనకే యిడెనని - కుములుచు, వాసా
గారము, శోభన మందున
నారీమణి యొకతె చూపె - నాలుగు కుచముల్ !
__________________________
జన్యువు = బ్రహ్మ/genes
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
A-3)
రిప్లయితొలగించండికృత్రిమాలంకరణ [Make-up]:
__________________________
జ్యూరిచ్ నగరంబందున [zurich]
కేరింతలతో దిసమొల - కేరుచు, వడిగా
పారుచు, తన కృత్రిమమౌ
నారీమణి యొకతె చూపె - నాలుగు కుచముల్ !
__________________________
Zurich is the largest city in Switzerland
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
Streaking is the act of running naked through a public place
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిక్షీరమును బితుగ నేగిన
రిప్లయితొలగించండినారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
కారుమ హికి , యిది గాంచగ
బీరముపడనేల యనుచు పెనిమిటి గసరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిB-1)
రిప్లయితొలగించండిజన్యులోపము వలన లాభము : :
__________________________
చోరీ చేసితి నంచు చెప్పి వరుడే - శుక్రంబు దెచ్చివ్వగన్
మేరీరత్నము ముద్దు నిచ్చి వలపున్ - మేలంచు పో బోవగన్
జారీ చేసెను చూపమంచు విరళిన్ - స్కంధంబు నగ్నంబుగా
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ - నాథుండు మెచ్చన్ మదిన్
మేరీమాతయె నాకు నిచ్చె ననుచున్ - మిత్రత్వమే హెచ్చగన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
B-2)
రిప్లయితొలగించండిగోశాలలో :
__________________________
క్షీరంబుల్ కడుపార త్రాగెదను సం - క్షేమంబు హెచ్చన్ సదా
ప్రారంభించుము పాలు పిండుటను మా - పైరంబు లిచ్చున్ గదా
రా రమ్మంచును గోల పెట్ట మగడే - రమ్యాతి రమ్యంబుగా
భారీ పాత్రను చేత నుంచుకొని హ - వ్యాపీనమున్ జేరుచున్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ - నాథుండు మెచ్చన్ మదిన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
B-3)
రిప్లయితొలగించండిగురువు శిష్యునితో :
__________________________
"నారీరత్నము సూపె నాల్గు కుచముల్ - నాథుండు మెచ్చన్ మదిన్"
ఓరీ తప్పది, యిట్లు వ్రాయ తగునా - హుందాగ వ్రాయన్ వలెన్
పోరా పొమ్మిక వ్రాసి తీసుకొని రా - పూర్వాపరంబెంచుచున్
"నారీరత్నము సూపె నాల్గు కుడుముల్ - నాథుండు మెచ్చన్ మదిన్" !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిచివరిది ఉత్తమంగా ఉన్నది.
రిప్లయితొలగించండినారదా! నీహారిక వారెక్కడున్నా ఇక్కడికి రమ్మని పిలవండి :)
భారీ వాల్పోస్టరులో
చీరలు స్థానము విడువగ చీర్సను కైపుల్
వారిరుహనేత్రయొకతెయు
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీరిన తమకమ్మునఁ బతి
రిప్లయితొలగించండిచేరఁగఁ దన దరికి నగవుఁ జిందించుచుఁ దాఁ
జేరి ముకురమ్ము చెంగట
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్.
ఓరీ లిఖింపుమంటిని
తొలగించండి"నారీమణి యొకతె చూపె నాలుగు కుడుముల్"
మారిచి యిటుల లిఖింతువ?
"నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్"
(వసంత కిశోర్ గారికి ధన్యవాదాలతో....)
శంకరార్యా ! మీ పూరణలు చక్కగా నున్నవి ! అభినందనలు !
తొలగించండినన్నుటంకించినందులకు ధన్యవాదములు !
ఔరా! తక్షణ మిట్టుల
రిప్లయితొలగించండిక్షీరమ్మేరీతి వచ్చె చెప్పవె యనుచున్
కోరిన వానికి గోవుకు
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రేరణగా సమ్ముఖిలో
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
వారిజలోచన యా నీ
హారిక రతగురువు చెంత హాయిగ చేరెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(గోవధ చేసే దుర్మార్గులకు భారతమహిళ
రిప్లయితొలగించండిగోమాత గొప్పతనాన్ని బోధిస్తున్నది )
"ఓరీ ! ముష్కరులార ! యెందుకుర ? దే
వోత్తంసగోజాతియే !
యే రాద్ధాంతములన్ నెరుంగదటె ! మీ
దే సొమ్ము కాజేయదే !
రారా ! ధర్మము నర్థకామములు మే
లౌ మోక్ష " మంచున్ మహా
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ ;
నాథుండు మెచ్చన్ మదిన్ .
(గోమాత నాల్గు పొదుగులు నరుని నాల్గు పురుషార్థ చిహ్నాలు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికోరిక దీర్చు మటంచును
రిప్లయితొలగించండిచేరిన భర్త కు ముకురము చెంగట జూపె న్
తోరపు పరి హాసంబున
నారీ మణి యొకతె చూపె నాలుగు కుచ ము ల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*గురువులకు నమస్సుమాంజలి*🙏🙏
రిప్లయితొలగించండి20/12/2019
ఈరోజు సమస్యా పూరణం
*నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్*
*కం||*
కోరగ యొక్కడు సతినే
నారీ జూపఁ మనగ నిట నాలుగు కుచముల్
రారా దర్పణమెదుటని
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🌸💐🙏🌸🙏💐
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురువర్యా 🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిదారిని మగనికి కోతుల
నారీమణి యొకతె చూపె నాలుగు; కుచముల్
తీరుగ గోకుకొనుచు వి
స్తారముగా తిరుగ చుండె తరువుల చెంతన్
జిలేబి
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఓరీ చూడుము నాసరి
రిప్లయితొలగించండిలేరీ లోకంబునందు లే లెమ్మనుచున్
కూరిమిని యిన్ద్రజాలిక
*"నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్"*
రామ్ కిడాంబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూరిమిని నింద్రజాలిక.... అనండి.
క్షీరము గావలె నంచును
రిప్లయితొలగించండిగారమున నెద దడుము నయగారపు బతికే
దారిని బోయెడి గోవుకు
*"నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్"*
రామ్ కిడాంబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరేచీకటి భర్త పాలు పిదుకన్ హర్షాతిరేకమ్ముతో
రిప్లయితొలగించండిజేరెన్ గోష్ఠమునందు గోవుకడకున్ శ్రీమంతమై వెల్గు నా
క్షీరస్థానము గానకున్కి నిలువన్ శీఘ్రంబు తానేగి యా
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివారాంగనలను కూడుచు
రిప్లయితొలగించండిసారాయము త్రాగువాడ చాలించుమికన్
ధారుణి లోనీ కెప్పుడు
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారనుకొంటే ఏదన్నా సాధ్యమే !
సారామత్తును మీరెడా చమకులన్ సాధించు క్రొంగొత్తగా
భారీచిత్రము దర్శకేంద్రునిది విస్ఫారించు కన్దోయితో
ప్రేరేపించెడు కైపు చూపులమరన్ రేకెత్తగా కోరికల్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూరెన చెత్వరమిపుడే?
రిప్లయితొలగించండిచేరుము వైద్యాలయమ్ము చేయ చికిత్సన్
తీరుగ కనుగొను మెచటన్
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చత్వార మిపుడె" అనండి.
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిగౌరీ సూనుఁడు సుబ్రమణ్యుఁ డొసగెన్ గాంక్షించ నల్మారులున్
ధారాళమ్ముగ నొక్కకాన్పుననె సంతానమ్ముగా నల్గురిన్
క్షీరమ్మున్ గొన నేడ్వనొక్కపరిగన్ జేదోయి బుడ్డీలతో
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినారాయణ నారాయణ!
రిప్లయితొలగించండినారీమణియొకతెచూపె నాలుగుకుచముల్
యార్యా యేమీవింతలు
పోరాములుగలుగునపుడుపుట్టునునవియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షీరమెటు వచ్చు ననియెడు
రిప్లయితొలగించండిపోరడితో తల్లి పలికె మురిపెము తోడన్
రారా గోవొసగు ననుచు
నారీమణి యొకతె చూపెనాలుగు కుచముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేరెన్ విష్ణువు భక్తురాలిని పరీక్షింపంగ సన్యాసిగా
రిప్లయితొలగించండితారూపమ్మును దాల్చి, యాకలనుచున్ స్తన్యంబునే గోరగా
పైరమ్మొక్కటిఁ జూపెనా పడతి సద్భావమ్ము తో మౌనికిన్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపేరంటమునకు వచ్చిన
రిప్లయితొలగించండినారీమణి యొకతె చూపె నాలుగు, కుచముల్
తీరుగ గప్పెడి వజ్రపు
హారములను, తన విభవము నతిశయమలరన్
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచేరన్ పద్మసరోవరమ్ము తపమున్ చేయన్ కటాక్షమ్ముగా
చేరెన్ లక్ష్మియు నొక్క ఛాతి నలమేల్ చేరంగ వేరొక్కటిన్
తీరైనట్టి ముఖమ్ము స్వామిది సదా తీర్చున్ వెతల్ బ్రోవుమా
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిపేరణము పొంగి యగుపడు
భారీ ధరుణములు రెండు భ్రమ కలిగింపన్
జారిన కొంగును మరచిన
నారీ మణి యొకతె చూపె నాలుగు కుచముల్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ నాటి శంకరా భరణము సమస్య
రిప్లయితొలగించండినారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
ఇచ్చిన పాదము కందములో నా పూరణము సీసములో
గ్రీకు దేవత అర్టెమిస్ కు బహు కుచములు కలవు. మనహిందు పురాణములలో మధురై నగరమున మీనాక్షి మాత, మలయ ధ్వజుడు కాంచన మాలలకు మూడు సంవత్స్రముల్ గల బాలికగా మూడుకుచములతో బుట్టి పెరిగి పెద్దది అయినది ఆవిడ పేరు (తాడాతకాయి) శివుని తోయుధ్ధము చేయు సమయమున ఒక కుచము నుప సం హరణము చేసుకొని మీనాక్షి గా మారిఆ శివునే పెండ్లి చేసుకొన్నది. ఈ మధ్య చైనా నగరములో వాంగ్ యను మహిళ సర్జరీ ద్వారా నాలుగు కుచములు పొందినది.ఇవి అన్నియు నిజము ఆనుచు ఒక మహిళ గూగులులొ సెర్చ్ చెసి చూపించగా అందరు విస్మయము పొందినారు అను భావనతో పూరించినది ఈ సమస్య ఇధి భావనయే కాదు నిజము వివరములు కావలె నన్న గూగులు చూడవచ్చు
ఆర్టెమిస్ దేవత కాశ్చర్యముగ కలిగెను బహు కుచములు తనువు పైన,
మధురై నగరమున మలయధ్వజుండను రాజుకు బుట్టెగా రమణి యొకతె
మూడు చన్నులతోడ, మూడు కనులు గల వానిని పెండ్లాడి వాసికెక్కి,
మీనాక్షి మాతగా మెయిపైన పూజలను పుడుకు చుండె,నేను తెలుపునది
నిజమని నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్ గల మగువ నొకతె
నీ జగతిలోన, వాంగ్ యను నీర జాక్షి
కుండె చైనా నగరమందు కుదురు గాను
నాల్గు, గూగులు లోజూచి నమ్మ మనుచు
తెలుప చోద్యము గాంచిరి పలుకు లేక
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలేరీభువిలోనెవ్వరు
రిప్లయితొలగించండినారీమణులరసిజూడ నాల్గుచనులతో
నౌరాయిటులనఁదగునా
"నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్"?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇంతకు ముందు (ఎక్కడో గుర్తులేదు) ఇటువంటి సమస్యనిచ్చినప్పుడు నేనుచేసిన పూరణ:
రిప్లయితొలగించండిఅనయము సాధువర్తనము ఆర్తజనావనదీక్ష నెల్లెడన్
వినయముఁగల్గియుంటయువివేకముగా చరియించుటన్నయీ
గుణములెభూషణమ్ములుగఁగూడె నెలంతకునివ్విధంపుగో
"స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా"
(గోస్తనము = నలువది పూసల సరము)
20/6/2019 నాటి శంకరాభరణపు సమస్య.
తొలగించండినాటి సమస్యకు మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారూ!
తొలగించండిదారుణమై కన్పడఁ బగ
రిప్లయితొలగించండివారాక్రమణ మొనరించఁ బట్టణ రత్నం
బౌరా నాలుగు వైపుల
నారీమణి యొకతె చూపె నాలుగు కు చముల్
[కు చమువు =చెడ్డ సేన]
పృథు చక్రవర్తి గో రూపిణి యగు భూమి వలన నోషధులఁ బిదుకు సందర్భము:
పారావార పరీత మానవ గణాపారవ్యథా తప్త భూ
చోరస్తోమ కృతాపకార చలితక్షోభార్తి సంతప్త దా
నారాటమ్మును మాని భూసతియె గోవై పృథ్విలాభర్తకున్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్
[పృథు + ఇలాభర్త = పృథ్విలా భర్త: పృథు చక్రవర్తి]
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిపౌరాణిక భామామణి
రిప్లయితొలగించండిధారాస్ఫూర్తిన్ కరముగ ధాటిన్వాణీ
క్షీరోజ సహితయై యా
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితమరి ఆశీర్వాదం🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఓరోరీ యేమంటివి?
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్?
వారెవ్వా బ్రేకింగ్ న్యూ
సా! రవ్వంతయు నరరె విచక్షణ లేదే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నారీరత్నము సూపె నాల్గు కుచముల్
నాథుండు మెచ్చన్ మదిన్
సందర్భము: బాల రాముడు పాల కేడుస్తూ చేరాడు తల్లివద్ద. సరిగ్గా అప్పుడే ఒక ముఖ్యమైన పని వుందని దశరథుడు వచ్చి పిలిచాడు. వెళ్ళి వత్తా మనుకున్న నారీరత్నమైన కౌసల్య..
"నే నొక్కదాన్నే కాదుగా! ఇంకా ఇద్ద రున్నారు నీ కమ్మలు. (వారిదగ్గరా పాలు తాగవచ్చు. పరవాలేదు.)"అని వా రిద్దరి (సుమిత్ర కైకల) వద్దా బిడ్డను చేరుస్తూ వారి పాలిండ్రవైపు చూపింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
గారాబంబున పాల కేడ్చుచును నా
కౌసల్యఁ జేరన్ దమిన్
శ్రీ రాముం.. డొక ముఖ్యమైన పనికై
చీరన్ ధరానాథుడున్
"లేరా! తల్లులు నింక నిద్ద" రని వా
రిన్ జేర్చుచున్ బిడ్డకున్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్
నాథుండు మెచ్చన్ మదిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.12.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్షీరాన్నము గోరుసుతుని
రిప్లయితొలగించండిపేరిమి ముద్దాడి పాలుబిదుకగ పాత్రన్
జేరిచి ధేనువు పొదుగుకు
నారీమణి యొకతెజూపె నాలుగుకుచముల్
ఆరోగ్యంబు చెడిన్ననంగు సతియే యారోగ్యశాలంబడన్
తొలగించండిదూరంబాయెగదా సుతుండు నలిసంతోషంబిడున్ బాలకున్
పోరామిన్ గడుఖేదమందు పతికిన్ పుణ్యంపు గోవున్ దగన్
నారీమణి జూపె నాల్గుకుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'చెడిన్ననంగు'?
చెడన్ అనుంగు అనిభావన గురువుగారూ! టైపు దోషము! మన్నించండి!
తొలగించండికందం
రిప్లయితొలగించండిజారిణిఁ జరవాణి తెరను
జేరుచఁ బతి, సతి యలుగుచుఁ జేతన్ గ్రుద్దన్
చీరిక రెండగు తెరపై
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏరా, ముద్దులకొడుకా
రిప్లయితొలగించండిపోరా!నిటు సిగ్గువచ్చు పోరడజూపన్
నేరుగజూడుము యావుకు
నారీమణి యొకతెజూపె, నాలుగుకుచముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పోరా యిటు... నేరుగ నావుకు జూడుము" అనండి. (చూడుము + అవుకు... అన్నపుడు యడాగమం రాదు).
శారీ ,తొలగగజేయుచు
రిప్లయితొలగించండినారీమణి నవ్వసాగె నాకున్నటుపై
కోరినవివిగో !!ననుచును
నారీమణి యొకతెజూపు నాలుగుకుచముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...యివిగో యనుచును" అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిధీరమ్మైనసమీరమందు యమునాతీరమ్మునన్ నింగి సిం...
గారింపన్ శశి., రాధ కృష్ణుని వియోగప్రేరితస్వాంతయై
ఆ రేయిన్ పులినమ్ముపై దొరల లోతై తోచ వక్షోజముల్
నారీరత్నముజూపెనాల్గుకుచముల్,నాధుండుమెచ్చన్మదిన్!
(చివరిగా గోపాలుడు వచ్చాడు)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నిత్యం అడవిలోని పుట్టలో తపసు చేసుకునే వేంకటేశ్వరునకు గోక్షీరార్పణమస్తు...
రిప్లయితొలగించండికందం
శ్రీరమణునకర్పించుచు
క్షీరమిడని యావు నిత్య కృత్యమనన్ జే
కూరవు పాలని పిండుచు
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్