3, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3240 (విలువలు మృగ్యమౌట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్"
(లేదా...)
"విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

96 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  విలువల నన్నియున్ మరచి వీధుల వెంబడి రాళ్ళురువ్వుచున్
  కలియుచు దీది నాదటను కాంగ్రెసు కేరళ కమ్యునిష్టులున్
  పలువురు ముఖ్యమంత్రులకు భండనమందున రాజనీతినిన్
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-1)
  విజ్ఞులు మెచ్చన్ :
  __________________________

  నిలువున ముంచగ నాంధ్రను
  పలుచన యయ్యెను జూడ - ప్రపంచ మందున్
  ఫలముగ నమరావతిలో
  విలువలు మృగ్యమ్ములయ్యె - విజ్ఞులు మెచ్చన్
  __________________________
  విఙ్ఞులు = ఒకే ఒక్క పార్టీ mla లు mp లు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "పలుచన యయ్యెను గనగ ప్రపంచమునందున్" అందామా?

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కలలను కాన రీతినిట గాభర నిచ్చుచు వంటకాండ్లకున్
  బిలబిల చేరగా ధరలు విన్నుల వీధుల హైద్రబాదునన్
  కలుపుచు నుల్లిపాయలను కమ్మని కూటుకు ఘాటునిచ్చెడిన్
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 4. A-2)
  అమరావతిలో :
  __________________________

  పలువురు రైతుల త్యాగము
  తిలోదకము లాయె నేడు - స్థితమది కరువై
  విలవిల లాడగ జనులే
  విలువలు మృగ్యమ్ములయ్యె - విజ్ఞులు మెచ్చన్
  __________________________
  స్థితము = నిశ్చయింపబడినది, ప్రతిజ్ఞ చేయబడినది.
  విఙ్ఞులు = ఒకే ఒక్క పార్టీ mla లు mp లు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 5. A-3)
  అమరావతి నగరము :
  __________________________

  కళకళ లాడెడు నగరము
  కళావిహీనముగ నేడు - కనుమరుగవగన్
  నలిగెడు కుట్రల నడుమను
  విలువలు మృగ్యమ్ములయ్యె - విజ్ఞులు మెచ్చన్
  __________________________
  విఙ్ఞులు = ఒకే ఒక్క పార్టీ mla లు mp లు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 6. A-4)
  అమరావతి నందు :
  __________________________

  నిలకడ లేకను జనులే
  నలుగుచు నుండ నడియాస ! - నిర్దయ మీర
  న్నులి నిడ పాలక వర్గము
  విలువలు మృగ్యమ్ములయ్యె - విజ్ఞులు మెచ్చన్
  __________________________
  నిలకడ = స్థైర్యము
  నులి = griping pain in the intestines
  విఙ్ఞులు = ఒకే ఒక్క పార్టీ mla లు mp లు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 7. కలువలు వికసిం చగనే
  వెలుగులు విరజిమ్మె నంట వెన్నెల రేడౌ
  జిలుగుల చెలులైన తారల
  విలువలు మృగ్యమ్ము లయ్యె విజ్ఞులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. "చెలులగు తారల" అనండి.

   తొలగించండి
 8. A-5)
  అమరావతి రైతుల :
  __________________________

  చెలరేగగ కుట్ర లకట
  పొలమార్చగ పాలకు లదె - పొలములు బోవన్
  వలవల లాడెడు రైతుల
  విలువలు మృగ్యమ్ములయ్యె - విజ్ఞులు మెచ్చన్
  __________________________
  పొలమార్చు = to cause to be deceived
  విఙ్ఞులు = ఒకే ఒక్క పార్టీ mla లు mp లు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  విజ్ఞులు మెచ్చన్ :
  __________________________

  పలువురు పేద రైతు లదె - ప్రాజ్ఞత నిచ్చిరి పంటభూములన్
  విలువది హెచ్చునంచు ప్రజ - విస్మయ మొందగ రాజధానికిన్ !
  వలవల నేడ్చు చుండె మది - వ్రయ్యలు వారగ స్త్రీలు పిల్లలున్
  పలుచన జేయ జూడ పరి - పాలక వర్గము రైతు త్యాగమున్ !
  గలగల నవ్వుచుండె చిరు - కాశువు లేకను టక్కులాడులే
  విలవిల లాడు రోజు కడు - వేగమె వచ్చును దైవముండినన్ !
  పెళపెళ లాడుచున్ బ్రజలు - పెట్టరె చిచ్చును కుక్షి మండినన్ !
  విలువలు మృగ్యమౌటఁ గని - విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్ !
  __________________________
  ప్రాజ్ఞత = విజ్ఞత, కాశువు = బుద్ధి
  విఙ్ఞులు = ఒకే ఒక్క పార్టీ mla లు mp లు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 10. విలువలుగల్గు దేశమున వీదికినెక్కవు సంస్కృతీప్రభల్
  సులువుగ దేశసంపదను,శూన్యముజేసెడి మూర్ఖనేతతో
  కలలను గన్న భారతము కంటికి నిద్దుర బోవ ,బాహ్యమౌ
  విలువలుమృగ్యమౌటగని,విజ్ఞులుమెచ్చిరి మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 11. తలచిరి హెచ్చునంచునట డబ్బులు వోసిరి కోట్లుకోట్లుగా
  బిలబిల వెఱ్ఱిగొఱ్ఱెలుగ విత్తము మ్రానగు నంచుఁ జూడగా
  కలయగు రాజధానియన కాటును తిన్నటి వారలైరి,భూ
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 12. కలుగునుభావి కాలమున, ,కల్లలుగానటువంటి సంపదల్
  విలువగు భూములిచ్చిరిక,వీధికినెక్కిరివారలిప్పుడే
  తులువలుగాను వాగుచును తూలుచుపేలెడు ముఖ్య నేతలో
  విలువలు మృగ్యమౌటగని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్.

  రిప్లయితొలగించండి
 13. సులువుగ ధనమా ర్జింపగ
  విలువలు మృగ్యమ్ములయ్యె ; విజ్ఞులు మెచ్చన్
  సలుపుము ధనార్జన నెరిని ,
  కలుషపు పద్ధతిని వీడి గౌరవ రీతిన్

  రిప్లయితొలగించండి
 14. నిన్నటి పూరణ

  కలిమి యశాశ్వతమ్ము కృతకర్మఫలానుగసీమితమ్ము, వ్యా
  కులితమనోవిచారకము కుందగ నేలనొ యేతదర్థమై?
  వలదు కుటుంబభారము, తపఃఫలసాధితభవ్యముక్తిలో
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్.

  రిప్లయితొలగించండి
 15. పలువురిలో మానవతా
  విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్
  కలవరపాటునుజెందక
  విలువల రక్షణజరిగెడు విధమునుగనుమా.

  రిప్లయితొలగించండి
 16. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్"
  వాలి రాముని గాంచి, నన్ను చాటుగా దాగి చంపినావు, నీకు ఇధి న్యాయమా? సుక్షత్రియుడవు, ధర్మము తప్పి ప్రవర్తించితివి గదా అని ఆక్షేపణము చేయగా రాముదు పలికిన పలుకులు

  ఇచ్చిన పాదము కందము నాపూరణము సీసములో


  కలదయ్య మాకధి కారము యిలలోన మానవ, పశు,పక్ష్య దానవ గణ
  ములపైన,వారికి ముదము నొసగుటకు,మదము నణుచుటకు,మా భరతుడు
  యీ పుడమీశుడు, యెన్నడు నోర్వగ లేడు నధర్మమున్, వీడి నావు
  నీవు ధర్మంబును, నీచ వృత్తిని పొంది ననుజుని సతిని నీ వనుభ వించి
  నావు, తరచి చూడ న్యాయమా? కామపు కాంక్షతో వాలెను కనులు,విటపి
  మృగవరా! (విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చని)చ్చోట, పలుక వలదు

  ధర్మ పన్నాలు, చాటున దాగి వనమృ
  గముల పైదాడి చేయగ ఖలము కాదు,
  ధర్మ పధమున నడచిన దశరధ సుతు
  డ నని వాలిని గని రాముడనె ముదముగ  విటపి మృగము = కోతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   'అధికారము + ఇలలోన, భరతుడు + ఈ పుడమీశుడు + ఎన్నడు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి


 17. పలువిధముల జీవితమున
  విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్
  పలువిధముల తళుకు బతుకు
  కులె మేలని పలు తలముల కోమలి వినవే


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. కలుములనందు కార్యమున గాంచక తృప్తి యొకింత నిత్యమున్
  దలచినరీతి ధర్మమును దప్పి చరించెడి స్వీయసంతతిన్
  బిలుచుచు జన్మదుల్ భయము పెట్టుచునుండిరి వారియందునన్
  విలువలు మృగ్యమౌటఁ, గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్"

  రిప్లయితొలగించండి
 19. చెలువపు వర్తన చెన్నగు
  విలువలు మృగ్యమ్ములయ్యె : విజ్ఞులు మెచ్చ న్
  నలుగురు పొగ డెడు పనులను
  సలుపగ బూన o గ వలయు సంస్కృతి తరగెన్

  రిప్లయితొలగించండి


 20. వలపుల పేరిటన్ యువత పావనమైన తలమ్ములందు పీ
  కలవరకున్ పరిప్లుతల కాంక్షల తేలుచు మత్తు గానగా
  విలువలు మృగ్యమౌటఁ గని, విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్
  కలవరమేల! యౌవనమె కాలము సూవె వినోదమాడగా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. కులపిచ్చి ముదిరినంతట
  విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్
  బలువురి క్షేమము నెప్పుడు
  తలచుచు జీవించువాడె ధన్యుడు సుమ్మీ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కులపిచ్చి' వైరిసమాసం. "కులముల పిచ్చి ముదరగను" అందామా?

   తొలగించండి
 22. పలువడు దుశ్శాసనుడే
  పలువురు వీక్షించుతుండ పంతము తోడన్
  వలువలు వొలువన్ సభలో
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వీక్షించుచుండ' అనండి. కాని ఆ చర్యను విజ్ఞులు మెచ్చలేదే?

   తొలగించండి
 23. మైలవరపు వారి పూరణ

  వెలుగుచునుండె కాశ్మిరము, వేడుక నాటిన
  శాంతిబీజముల్
  మొలకలనెత్తుచుండె మన మోదికృతంబగు శాసనమ్మునన్!
  తలపడ శత్రుదేశమున ధైర్యము వంటి మహోన్నతమ్ములౌ
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. చెలువము మీరి సంస్కృతియె చిత్రవిచిత్రవిధానగర్హమై
   వలువలు నొంటినంటుకొని వర్తిల చింతిలి రిట్టు లెల్లెడన్
   విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు; మెచ్చిరి మోదమందుచున్
   గులుకుచు నుండి చూడురదిగో యధునాతను లిట్లు గ్రుడ్డితోన్.   తొలగించండి
  2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 25. విలువలు మాసిపోయినవి, వేడుక లాయెను మంచి శీలమున్
  వలువల దీసి చూచుటలు, బాలల పాపల వృద్ధ దీనులన్
  కలతల బెట్టు దుశ్చరిత కాములె విజ్ఞులు నేడు హా! విధీ!
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్.

  రిప్లయితొలగించండి
 26. పులువురు నాయకులాశా
  కలుషిత మతులై యనైతిక పథము జనువే
  ళలనట్టివారి పలుకుల
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్

  రిప్లయితొలగించండి

 27. ( తారాశశాంకం )
  కలువలరాయడైన శశి
  కాంచనదేహను తార జేరినన్
  బలువగు వంతలన్ సుగుణ
  వంతులు మిక్కిలి క్రోధమందిరే
  విలువలు మృగ్యమౌట గని ;
  విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్
  మెలకువతోడ తప్పెరిగి
  మెల్లగ గుర్వుకు నప్పగించినన్ .

  రిప్లయితొలగించండి
 28. 03/01/2020
  అందరికీ నమస్సుమాంజలి🙏🙏
  ఈ రోజు నా పూరణలు 🌹🌹

  *విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్*

  *కం1||* 🌹

  విలువలు లేని మొరకునకు
  పలువురు పట్టము నొసగిరి బలమును పెంచన్
  కలతలు చెందిన జగమున
  *విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్*

  *కం 2||* 🌹🌹

  కలుషిత విద్యా స్పర్ధలు
  నలుగురు మెచ్చవలె ననుచు తప్పులు జేయన్
  బలి యగు పిల్లల భవితకు
  *విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

   నా మూడవ పూరణ 🌹🌹🌹

   *కం ||*

   మలినపు మనసులు దాచుచు
   చెలిమిని చేయగ మనుజులు చేతలు మార్చన్
   పలుకగ నవ్వుల మాటలు
   *విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
  2. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

   నా మరో పూరణ 🌹🌹🌹🌹

   *కం ||*

   నలుగురు నాడయు మగయును
   కలువగ బిగ్ బాసు యనుచు కలహములొందన్
   అలుసై నవ్వుల పాలౌ
   *విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్*

   *(లేదా)*

   కలువగ నాలు మగలవలె
   నలుగురు బిగ్ బాసు యనుచు నవ్వుల పాలౌ
   అలుసై జనులే దూషించ
   *విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
 29. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్"
  వాలి రాముని గాంచి, నన్ను చాటుగా దాగి చంపినావు, నీకు ఇధి న్యాయమా? సుక్షత్రియుడవు, ధర్మము తప్పి ప్రవర్తించితివి గదా అని ఆక్షేపణము చేయగా రాముదు పలికిన పలుకులు

  ఇచ్చిన పాదము కందము నాపూరణము సీసములో
  గురువు గారి సూచన మేరకు మార్చి వ్రాసినది

  కలదయ్య మాకధి కారమీ ధరణిపై
  మానవ, పశు,పక్ష్య దానవ గణ

  ములపైన,వారికి ముదము నొసగుటకు,
  మదమునణుచుటకు, మా భరతుడు
  మన్నియ డిచ్చోట ,నెన్నడు నోర్వంగ
  లేడు నధర్మమున్, వీడి నావు
  నీవు ధర్మంబును, నీచ వృత్తిని పొంది
  ననుజుని సతిని నీ వనుభ వించి

  నావు, తరచి చూడ న్యాయమా? కామపు
  కాంక్షతో వాలెను కనులు,విటపి
  మృగవరా! (విలువలు మృగ్యమ్ములయ్యె వి
  జ్ఞులు మెచ్చని)చ్చోట, పలుక వలదు

  ధర్మ పన్నాలు, చాటున దాగి వనమృ
  గముల పైదాడి చేయగ ఖలము కాదు,
  ధర్మ పధమున నడచిన దశరధ సుతు
  డనని వాలిని గని రాము డనె ముదముగ  విటపి మృగము = కోతి

  రిప్లయితొలగించండి
 30. కలిమికి రేడగు కృష్ణుడు
  బలిమిని జూపుచు నధర్మవర్తను లానన్
  సులువగు నుపాయముల గొన
  విలువలు మృగ్యమ్ములయ్యె విఙ్ఞులుమెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జలదపు మేనివాడయిన జక్రియె యండగ పాండుపుత్రులే
   బలిమికి దోడుగా దగిన వైనములొప్పగ కౌరవాఖ్యులౌ
   తులవల పక్షమందుగల ద్రోణుని భీష్ముని సంహరింపగా
   విలువలు మృగ్యమౌటగని విఙ్ఞులుమెచ్చిరి మోదమందుచున్

   తొలగించండి
 31. తులువ తనంబులు నబలల
  వలువలు తొలగుటలు నొరుల వగపుల కులుకుల్
  సలుపుటలు నాయె విజ్ఞత
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 32. వలువలు పడతుల కయ్యెను
  పలుచన, విద్యార్థులకును ప్రాణము గైడుల్ ,
  వెలవెల బోయిన బ్రతుకులు!
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్.  రిప్లయితొలగించండి
 33. తులువల రాజ్యమ్మందున
  విలువలు మృగ్యమ్ములయ్యె; విజ్ఞులు మెచ్చన్
  తెలుగున బోధన బెంచగ
  పలువురు సూచనలిడినను ఫలమే లేకన్

  రిప్లయితొలగించండి
 34. నలుగురు నవ్వుచుండిరిటు నాశమొనర్చుచు మాతృభాషనే
  సులువుగ రాష్ట్రమంతటను శూన్యమొనర్చెడి పాలనమ్మునన్
  విలువలు మృగ్యమౌటఁ గని; విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్
  తెలివగు నాయకత్వమటు దేశమునందభివృద్ధి జూపుటన్

  రిప్లయితొలగించండి
 35. తలచి దిశను తాననుకొనె
  విలువలు మృగ్యమ్ములయ్యె; విజ్ఞులు మెచ్చన్
  విలువలతో కూడిన చదు
  వులు బోధింపగ ప్రభువులు ముదలించెనదే

  మందలించి. . ఆజ్ఞాపించు?

  రిప్లయితొలగించండి
 36. కస్తూరి శివశంకర్శుక్రవారం, జనవరి 03, 2020 9:43:00 AM

  కం:
  కలిమి చెలిమి లేమిలతో
  విలువలు మృగ్యమ్ములయ్యె; విఙ్ఞులుమెచ్చన్
  బలిమిని కాంక్షించుమయా
  చెలిమిని జేయమని పలుకు జీవన గతిలో

  రిప్లయితొలగించండి
 37. ఇలను కొలపుపిచ్చి ముదిరి
  విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్
  బలువురి క్షేమము నెప్పుడు
  తలచుచు జీవించువాడె ధన్యుడు సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 38. చంపకమాల
  పలువురు దిగ్గజమ్ములకు బాధలు, రంభకు మానభంగమున్,
  విలవిల లాడఁ జేసి కుజ వేదన బెంచుచు లంకఁ జేర్చగన్
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్
  జెలఁగుచు రావణాసురుని శ్రీరఘురాముడు గూల్చు నమ్మికన్

  రిప్లయితొలగించండి


 39. వలువలు చింపిధరించగ
  *విలువలు మృగ్యమ్ములయ్యె,విజ్ఞులు మెచ్చన్*
  నిలలో దాల్చుడు విధిగా
  పలువురు మెచ్చెడి విధముగ బట్టల నెపుడున్.

  రిప్లయితొలగించండి
 40. కలవరపాటునొందెమది కన్నులముందర సంఘమందునన్
  విలువలు మృగ్యమౌటఁ గని, విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్
  తెలివిగ పూర్వవైభవము దెచ్చు ప్రయత్నము సాగుచుండగా
  కలనిజమౌను తథ్యమిక కష్టములుండవు మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 41. కలవర మేల హృదయముల
  లలితంపు జనుల మతమ్మె రంజిలు నిచటం
  గలుషాంతరంగపు జనుల
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్


  పలల మనోహ రాశన సుపర్వ రిపూత్కర ధర్మ సమ్మత
  మ్ములు పరదార నిగ్రహ విమోచన కర్మము లంచు నెంచుచున్
  నలినజ వంశ సంభవ ఘనప్రవ రాధిప సంస దాధిలో
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్

  [ఆధి = చోటు, (వ్యసనము నిందార్థము)

  రిప్లయితొలగించండి
 42. చం:

  కలగన మూల్య పట్టిక టకాలున దగ్గన విస్మయంబునన్
  మెలకువ రాగ నేమిటిదొ మెప్పు ! నెఱుంగగ నిశ్చయంబునన్
  చిలుకను జేర జోస్యమున చిక్కన తథ్యము కాచుకొమ్మనన్
  విలువలు మృగ్య మౌట గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 43. మిత్రులందఱకు నమస్సులు!

  కలువలె యందఁగించుచును, కాంక్షలఁ బెంచి, ప్రియుం గనంగ, నా
  చెలువ విశాల నేత్రములు చిచ్చఱ చూపులతోడ మండె! వే
  ల్పులవలిపమ్మొసంగఁ, జెలి పొంగి, ప్రియుం గని నవ్వె! మండెడిన్

  విలువలు మృగ్యమౌటఁ గని, విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్!

  రిప్లయితొలగించండి
 44. మరొక పూరణ

  కులపిచ్చి ముదర కొందరి
  *విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్*
  చెలిమిని చేయుగ వలయును
  కులమత భేదములు వీడి కువలయ మందున్

  రిప్లయితొలగించండి
 45. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి
  మోదమందుచున్"

  సందర్భము: వాల్మీకి రామాయణంలో భద్రు డనేవాడు చెప్పినట్టు, అధ్యాత్మ రామాయణంలో విజయు డనే వాడు రామునికి చెప్పినట్టు వున్నది.
  దుర్ముఖు డనే ఆంతరంగిక పరిచారకుడు పౌరుల మాటలు రామునికి చెప్పినట్టు భవభూతి ఉత్తర రామ చరితంలో వుంది. అప్పుడు...
  హా హా ధిక్ పర వాస దూషణం యత్
  వైదేహ్యాః ప్రశమిత మద్భుతై రుపాయైః
  ఏతత్ తత్ పునరపి దైవ దుర్విపాకా
  దాలర్కం విషమివ సర్వతః ప్రసృప్తమ్ 40
  సీత పర గృహంలో వున్న నింద అగ్ని పరీక్షతో సమసిపోయింది. మళ్ళీ దురదృష్టవశాత్తు పిచ్చికుక్క కరిస్తే ఎక్కే విషంలాగా అనంతర కాలంలో యిప్పు డది అంతటా వ్యాపించింది... అంటాడు రాముడు.
  తన కోర్కి చెల్లంగ ధరణీ తనూజ
  సను గాక కొనిపోయి సౌమిత్రి నీవు
  నక్కడ వాల్మీకి యాశ్రమ భూమి
  చక్కి నొక్కెడ డించి చయ్యన రమ్ము
  అని రాము డాదేశిస్తే సాధ్వియైన సీతమ్మను లక్ష్మణుడు అడవిలో వదలి వస్తాడు.(రంగనాథ రామాయణం)
  ఏదేమైనా ఎంతటి అవతార పురుషుణ్ణైనా అపనిందల పాలు చేయడంలో మాత్రం మనుష్యులకు తెలివితేటలు చాలానే వుంటాయి.
  మానవులలో విలువలు లేకుండా పోయాయి. రాముడు చేసిన పనికి విజ్ఞులు మెచ్చారు.. అని పద్య భావం.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  లలిత గు ణాభిరాము డగు
  రాముని యంతటి వాడు జానకీ
  లలనను వీడగా వలసె
  రమ్య గుణేడ్య నరణ్య సీమ.. నిం
  గలమునఁ జొచ్చి వచ్చినను
  గాని గణింపరు మానవాళిలో
  విలువలు మృగ్యమౌటఁ... గని
  విజ్ఞులు మెచ్చిరి మోద మందుచున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  3.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 46. వలువల విడనాడిన పలు
  విలువలు మృగ్యమ్ములయ్యె! విజ్ఞులు మెచ్చన్
  చెలువము లందిన పలుకులు
  చిలికించెను నీతి సుధలు శ్రీకారముతో!

  రిప్లయితొలగించండి
 47. ఇలభారముతగ్గుటకై
  పలువల దునుమాడి జంపఁ పలుపలు రీతిన్
  విలపింపగ కురుసంఘము
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 48. కలిమిని పొందనెంచి ఖలు కర్మల జేయు జనాల గాంచుచున్
  గలతను పొంది పల్కెదరు కర్మయుగమ్మని క్లేశమందిరే
  విలువలు మృగ్యమౌటగని విజ్ఞులు, మెచ్చిరి మోదమందుచున్
  బలువురు, నీతివీడి సము పార్జన సేసెడి దుర్మదాంధులన్.

  రిప్లయితొలగించండి
 49. కులములచిచ్చులురగులగ
  విలువలుమృగ్యమ్ములయ్యె,విఙ్ఞులుమెచ్చన్
  కలతలనొందెడువారిని
  కలియుచుమేల్సేయదగునుకసుబుసులేమిన్

  రిప్లయితొలగించండి
 50. వలువలు విడచుచు నాడగ
  విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్!
  మెలకువలెన్నియొ నేర్చియు
  నెలతలు ముందుండి నడువ నెరుగమె విజయమ్!!

  రిప్లయితొలగించండి
 51. కందం
  మెలకువఁ బాండు సుతులు, హరి
  తెలిపిన మర్మమ్ములెల్ల దిద్దుచు నడువన్
  గెలువ నధర్మము రణమున
  విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 52. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి
  మోదమందుచున్"

  సందర్భము:
  తతో యమం చ వరుణం
  నిర్జిత్య సమరేఽసురః..
  అధ్యాత్మ రామాయణం ఉ.కాం. 2-49
  రావణుడు బలగర్వంతో వరుణుని మీదకు యుద్ధానికి వెళితే వరుణ పుత్రులు పౌత్రులు ఎదుర్కొ న్నారు. ఎందుకంటే వరుణు డప్పుడు బ్రహ్మ లోకానికి వెళ్ళా డట! మంత్రి ఆ విషయమే చెప్పాడు. రావణుడు తానే విజేత నని ప్రకటించుకొని లంకకు బయలుదేరాడు.
  దారిలో ఎందరో దేవతల గంధర్వుల రాజుల ఋషుల కన్యకల కిన్నర, నాగ, యక్ష కన్యకల నపహరించి పుష్పకంలో తీసుకుపోతుంటే వారంతా పెద్దగా ఏడుస్తూ "నీకు స్త్రీ మూలంగానే మరణం ప్రాప్తిస్తుంది గాక" అని శాపం పెట్టారు.
  పాప చిత్తంబునఁ బర కాంత లనక
  నేపునఁ జెరపట్టె నీ దురాత్మకుడు..
  దురములోపలఁ దన దుర్మదం బణపఁ
  బరకాంత నెపమునఁ బడిపోవు గాక!
  (రంగనాథ రామాయణం)
  అది చూసి విజ్ఞులైన దేవతలు ఋషులు సంతోషించారు. దేవ దుందుభులు మ్రోగాయి. పుష్ప వర్షం కురిసింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *కన్యల శాపము*

  అల వరుణున్ జయించుకొర
  కై చని, లంకకు వచ్చుచున్ నిలిం
  పుల, ముని రాజ కన్యకల
  పుష్పకమం దిడి రావణుండు దొం
  గిలి చన శాప మిచ్చి రిటు..
  "గిట్టెద వింతియె కారణ మ్మగున్
  విలువలు మృగ్యమౌటఁ..." గని
  విజ్ఞులు మెచ్చిరి మోద మందుచున్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  3.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 53. పలువిధముల బోధింపగ
  పలువురిలో మార్పు వచ్చి పఠితులు పెరుగన్
  పొలసియు కవితలు,కాసుల
  *"విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్"*

  రిప్లయితొలగించండి
 54. పలుమరు బోధ జేయుదురె ప్రాజ్ఞులె ధర్మము నాచరింపగన్
  బలపడకున్నచో నది భావితరాలకు ముప్పు తప్పునే?
  యలవడగా వలెన్ విలువలందఱికిన్ ; మఱి యీవిధి పల్క బోకుమీ !
  "విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్"

  రిప్లయితొలగించండి