23, జనవరి 2020, గురువారం

సమస్య - 3259 (సంస్కారము లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్"
(లేదా...)
"సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్"

93 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సంస్కారమ్ముల గొల్చు రాజులకడన్ సమ్మానమున్ పొందుచున్
  సంస్కారమ్ముల గాంచి రోత పడుచున్ శాస్త్రమ్ములే చెప్పెడిన్
  సంస్కారమ్ముల వీడి బుద్ధుడుగనై సంతోషమున్ పొందుచున్
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్

  రిప్లయితొలగించండి
 2. సమస్య :-
  "సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్"

  *కందం**

  సంస్కార హీన చరితుడు
  సంస్కరణము జేతుననుచు చక్కగ మంత్రౌ
  సంస్కరణ మాటున ధరణి
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్
  ....................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మంత్రి+ఔ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "సంస్కరణ మొనర్తు ననుచు సరి మంత్రిగనౌ" అనండి.
   'సంస్కరణ మాటు' అన్నది దుష్టసమాసం. "సంస్కరణపు మాటున భువి" అనండి.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సంస్కారమ్ములు పొంది కాంగ్రెసుననున్ శంఖమ్ము నూదించుచున్
  సంస్కారమ్మును కోలుపోయి జనులే సాధించి బాధించగా
  సంస్కారమ్ముల వీడి పార్టినికనున్ జంపించుచున్ వడిన్
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్

  రిప్లయితొలగించండి
 4. సంస్కృతి తెలిసిన వివేకి
  సంస్కృత మనెడి భాష చాదస్త మటన్
  సంస్క రణముత గదనుచు
  సంస్కారము లేని నరుఁడే సత్పురుషుఁ డగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. కాని మూడు పాదాలలో గణభంగం. నా సవరణ....
   సంస్కృతి దెలియు వివేకియె
   సంస్కృత మను భాష గనగ చాదస్తమనన్
   సంస్కరణము తగదనుచును
   సంస్కారము లేని....

   తొలగించండి


 5. వినుమా జిలేబి పుణ్యము
  సనుకొనుచు గడింప మడియు సంస్కారము లే
  ని నరుఁడె సత్పురుషుఁ డగున్
  పనుపడు సమయమ్ము కుంటు వడనీకింకన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దుష్కరప్రాసకు 'టిట్ ఫర్ టాట్' వంటి పూరణ. బాగున్నది. అభినందనలు.
   'సనుకొనుచు'?

   తొలగించండి

  2. సనుకొను - పూనుకొను

   ఆంధ్రభారతి ఉవాచ :)   జిలేబి

   తొలగించండి
 6. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

  సంస్కారము లేని నరుడె సత్పురుషుడగున్

  ఇచ్చిన పాదము కందము

  నా పూరణము సీసములో

  రాజసూయ యాగములో శ్రీ కృష్ణుని తూల నాడుచు శిశుపాలుని ప్రేలాపన


  పాలీయ వచ్చిన పడతిని చంపిన
  హంతకుండీతడు,నాట పాటల

  లాడు సమయమందు పాడు బుధ్దులతోడ
  నల్లపిల్లి వలెవెన్న,పెరుగులను


  దొంగిలించిన మేటి దుష్టు డితడు, చపలపు
  చక్షువుల కవల క్షణములునుక

  లిగిన సంస్కారము లేనినరుడెసత్పు
  రుషుడగున్ ,పుణ్య పు రుషులు గలరు

  తరచి చూడ నీ సభలోన దర్మ రాజ,

  గోవులను కాచు నల్పుడీ గొల్ల వాని

  కర్హతయె లేదనుచు బల్కె నచ్టటశిశు

  పాలుడు కినుక బడయుచు పదుగు రెదుట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసం మొదటి పాదం ఉత్తరార్ధంలో, మూడవ పాదం పూర్వార్ధంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 7. సంస్కారమేల మాకని
  సంస్కృతమునబలుకుచుండ శాసనసభలో
  సంస్కరణ జేయమేలు,కు
  సంస్కారములేనినరుడె సత్పురుషుడగున్,.

  రిప్లయితొలగించండి
 8. సంస్కృతము దేవభాషని
  సంస్కృతి తల దించకుండ సభలనుగూడన్
  సంస్కృతపు వెలుగులీను ,కు
  సంస్కారములేనినరుడె సత్పురుషుడగున్,.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భాష+అని' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి

  2. సంస్కృతము దేవభాషగ
   సంస్కృతి తల దించకుండ సభలనుగూడన్
   సంస్కృతపు వెలుగులీను ,కు
   సంస్కారములేనినరుడెసత్పురుషుడగున్
   (సవరణ పాఠము ధన్యవాదాలతో)

   తొలగించండి
 9. సంస్కారవంతు డందురు
  సంస్కారము కలిగినపుడె జనులెల్లరునున్
  సంస్కారముకావలె , కు
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్"

  రిప్లయితొలగించండి
 10. పుంస్కోకిల పోతనగళ
  సంస్కన్నము భాగవతము, సజ్జన చేత
  స్సంస్కరణముకాదను విష
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్"

  స్కన్నము : జారినది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంస్కన్నము'?

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారము.
   స్కన్నము : జారినది ( శబ్దం రత్నాకరం)
   సం ఉపసర్గతో కలిసి చక్కగా జారిన అవుతుంది.
   పోతన గారి గళమునుండి చక్కగా జారిన భాగవతము. అని భావన. దుష్కర ప్రాసను దాటడానికి చేసిన ఆలోచన.
   తప్పయితే మన్నించ ప్రార్థన.

   తొలగించండి
 11. సంస్కృతి విలువ నెఱుగని కు
  సంస్కారి యెపదవి బొంది సచివుండైనన్
  సంస్కార హీనులు కొలువ
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ, మూడవ పాదాలలో గణభంగం. 'సమతా సౌమ్యపు..' అనడం సాధు సమాసం. సవరించండి.

   తొలగించండి
 13. సంస్కారంబును లోక రక్షణకునై సర్వత్ర బోధించు నా
  సంస్కారస్థితుడైన బ్రహ్మము భవిష్యద్జ్ఞానమున్ దేల్పె నే
  సంస్కారంబులు లేని వాడె ప్రభుడై శాసించు నీ భూమినిన్
  సంస్కారం బిసుమంతలేని నరుడే సత్పూరుషుండై మనున్.

  రిప్లయితొలగించండి
 14. సంస్కారమెరిగి నడచిన
  సంస్కృతివిలసిల్లుభువిన సంపదగానై
  సంస్కృతిపరిధిననిక విష
  సంస్కారములేనినరుడెసత్పురుషుడగున్
  +++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ

  నేటిరోజుల్లో పేళ్ళు ఇలాగే ఉంటున్నాయి😊

  లింస్కా కన్య వివాహమయ్యెను జనుల్ వీక్షింపగా! నత్తయౌ
  హంస్కన్ జేరెను లింస్క కోడలిగ భాగ్యంబంచు., నారళ్లతో
  లింస్కన్ హింసల బెట్ట హంస్క., గని తల్లిన్ ప్రోత్సహింపంగ సత్
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ప్రశస్తము, అద్భుతములు లేక " బాగున్నది" అనుటయా! మైలవరపు వారూ సవాలు స్వీకరించుడీ వదులకుడీ :)   జిలేబి

   తొలగించండి
  2. ఈ పద్యం తృప్తినిడలేదు. అందుకే మరొకటి🙏🙏

   సంస్కారమ్మన శాంతికాముకమునై సత్యానుసంధానమై
   సంస్కారమ్మన హేతుబద్ధమయి విశ్వశ్రేయమై గేయమై
   సంస్కారంబు రహించు., సర్వజననష్టంబెంచు దుర్మార్గమౌ
   సంస్కారంబిసుమంతలేని నరుడే సత్పూరుషుండై మనున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

  3. ఇది కదా మైలవరపు వారి బ్రాండు !
   అద్భుతః!   జిలేబి

   తొలగించండి
 16. (అడవిబిడ్డడు తిన్నడి అనుపమానశివభక్తి)
  సంస్కారం బదిలేక నోట గొనుచున్
  జల్లెన్ ఝరీనీరమే;
  సంస్కారం బదిలేక దొప్పల నిడెన్
  సన్మాంసఖండంబులన్ ;
  సంస్కారం బదిలేక తిన్నడిడెనే
  చక్షుల్ మహాదేవుకై ;
  సంస్కారం బిసుమంత లేని నరుడే
  సత్పూరుషుండై మనున్ .

  రిప్లయితొలగించండి
 17. సంస్కారము గౌరవమిడు
  సంస్కారము చెరిపువేయు జగతిని భిదలే
  సంస్కారము భూషయగు, కు
  సంస్కారము లేని నరుడె సత్పురుషుడగున్!!!

  రిప్లయితొలగించండి
 18. సంస్కారంబును నేర్చి సు
  సంస్కృతు డగుచును చరించ జవమున జగతిన్
  సంస్కారవంతుడగును కు
  సంస్కారము లేని నరుడు సత్పురుషుడగున్

  రిప్లయితొలగించండి
 19. సంస్కారంబొక మానవీయమహితస్ఫాయద్గుణాలంకృతీ
  సంస్కర్తృత్వయశోవిధాయిధరణీ సంస్తుత్యసంపూజ్యమౌ,
  సంస్కారుండగు దానిఁ గల్గు నతడే, సంభావ్యమెట్లౌనొకో?
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్?

  రిప్లయితొలగించండి
 20. సంస్కృతమును నేర్చి భరత
  సంస్కృతి నేమరక చిత్తసంస్కారముతో
  పుంస్కోకిలవలె నెట్టి కు
  సంస్కారము లేనివాడె సత్పురుషుడగున్
  పుంస్కోకిల = వాల్మీకి

  రిప్లయితొలగించండి
 21. సంస్కార ముతో మెలఁగుచు
  సంస్కార ము సమత మమత సౌజన్యము తో
  సంస్కారి యగు న దెట్టుల
  సంస్కారము లేని నరుడు సత్పురుషు డగున్

  రిప్లయితొలగించండి
 22. సంస్కారవంతులెవ్వరు
  సంస్కృతివిడనాడబోరు సంపదయనుచున్
  సంస్కరణగోరినికవిష
  సంస్కారములేనినరుడు సత్పురుషుడగున్
  ————///////////////////
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 23. సంస్కార హీన జనితుడు
  సంస్కారము లేని వాడు సద్గురు కృపచే
  సంస్కార మంద, నపుడా
  సంస్కారము లేనివాడె సత్పురుషుడగున్.

  రిప్లయితొలగించండి


 24. ఇంతా అంతా కాదు ! మరీ దుంపతెంచే సంస్కారంబగు ప్రాసయేకవివరా చాటేసెదన్ డప్పుతో :)


  సంస్కారంబును నేర్వగా దగును విస్తారమ్ముగా మేల్మిగాన్
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే! సత్పూరుషుండై మనున్
  సంస్కారమ్మును నేర్చి నెయ్యపు మదిన్ సౌశీల్యుడైనెక్కొనన్
  సంస్కారమ్మునకాతడే పుడమిలో స్కంభమ్ముగా నిల్చురా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. 23/01/2020
  అందరికీ నమస్సులు 🙏
  *కం ||*

  సంస్కారము తెలియదనుచు
  సంస్కారము లేని నరుడు సద్గుణములతోన్
  సంస్కారము నేర్పుచు చెడు
  *"సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌷🙏🌷🙏

  రిప్లయితొలగించండి
 26. శార్దూలవిక్రీడితము
  సంస్కారంబున తండ్రిమాటవిని విశ్వామిత్రు సేవించుచున్
  సంస్కారంబున విల్లు ద్రుంచి కుజనే సాధించి వీరుండునై
  సంస్కారంబునఁ గానకేగె పితృవాక్సంధాత రాముండు దు
  స్సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండౌ మనున్

  రిప్లయితొలగించండి
 27. సంస్కర్తల బాట నడచు
  సంస్కారము నలవరచుటె సరియగు పనియౌ
  సంస్కరణలు వలదనెడి కు
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  రిప్లయితొలగించండి
 28. సంస్కరణలనగనెఱుగడు
  సంస్కారములేనినరుడె,సత్పురుషుడగున్
  సంస్కారయుతుడెపుడమిని
  సంస్కారముగలుగునరుడుచరితార్ధుడగున్

  రిప్లయితొలగించండి
 29. పుంస్కాహంకృతి భారత
  సంస్కృతియే కాదు కాంచ శాతోదరి యీ
  సంస్కంధ మెఱుఁగమే యీ
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  [సంస్కంధము = ఒక రోగము)


  సంస్కృత్యం బగు దేశమే మనది సస్యశ్యామలం బెన్నడుం
  బుంస్కర్మాశయ బద్ధ మీ భవము సంపూర్ణమ్ముగా నమ్ముఁడీ
  పుంస్కామా జన సంచయమ్ము తిరుగం బోనాడ లేనట్టి దు
  స్సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్

  [సంస్కృత్యము = సంస్కరింపఁబడినది; పుంస్కర్మాశయము = పురాకృత కర్మ గుణములు (వాసనలు); పుంస్కామ = పురుషులను కోరు స్త్రీ, ఇక్కడ వెలయాలు]

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀.................... సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  సందర్భము: లక్ష్మణుడు అన్నతో వనాల కేగగా ఊర్మిళ పదునాలుగేండ్లూ అయోధ్యలోనే నిర్విరామంగా నిద్రపోయింది. రావణవ ధానంతరం సీతారాములతోబాటు లక్ష్మణు డయోధ్యకు వచ్చి ఊర్మిళ శయన మందిరం చేరినాడు.
  పాన్పుపైనున్న భార్యను చూసినాడు. కోక సరిగ్గా సవరించినాడు. "అమృతధారలు కురియగా పలికి ఆత్మచల్లన చేయు" మని అర్థించినాడు.
  ఆమె ఉలికిపడి ఒకింత మేల్కొని సగం నిదురమబ్బులో వుండి పెద్దకాలం గడచినందుకు భర్తను గుర్తించలేదు.
  అయ్య మీ రెవ్వరయ్యా! మీరింత
  ఆగడమ్ముల కొస్తిరీ...అన్నది.
  హెచ్చయిన వంశానికీ అపకీర్తి
  వచ్చినది.. అన్నది.
  కీర్తి గల యింట బుట్టి అపకీర్తి.. తెచ్చితి నని వాపోయినది.
  మా యక్క బావ విన్న మిమ్మిపుడు
  బ్రతుకనివ్వరు జగతిలో..
  మా యక్క మరిది విన్న మీ
  ప్రాణముకు హాని కలుగు..
  అని సముచితంగా మందలించింది.
  నేనే రాముని తమ్ముణ్ణి, లక్ష్మణుణ్ణని నీ పేరు ఊర్మిళ యని.. నిన్ను బాసినది మొదలు
  నిద్రాహారము లెరుగను.. అని గుర్తించకపోతే కత్తితో కంఠం తెగవేసుకొందు ననీ అన్నాడు లక్ష్మణుడు.
  ఊర్మిళకు నిద్ర మబ్బు ఒక్కదెబ్బతో పూర్తిగా వదలిపోయింది. వచ్చినవాడు తన ప్రాణనాథుడే అని గుర్తించి పశ్చాత్తాపంతో పాదాలపై పడిపోయింది. అతడు లేవనెత్తి కౌగలించుకున్నాడు.
  ఊర్మిళ ఆనందంతో ఇలా అనుకొన్నది.
  " పుంస్కోకిలంలాగా అమృత మధుర మైన మాట పలికినాడు. (నా జీవితంలో యీనాడే వసంతం వచ్చినట్టుంది.) ఎవరో అనుకున్నాను. ఎంతపొరపాటు. (నా మతి మండా) ఇతడు సంస్కారం లేని వాడా! కాడు. సత్పురుషుడు. స్కందజి దనుజుడైన లక్ష్మణుడు."
  స్కందము = అమృతం
  స్కందోపమ వచనము = అమృతంలాంటి
  మాట
  స్కందజిత్తు = విష్ణుమూర్తి
  స్కందజి దనుజుడు = విష్ణువు (రాముని)
  తమ్ముడు..లక్ష్మణుడు
  (మరింత సమాచారానికై 18.1.20 నాటి నా మెదలక..అనే పద్యమూ చూడవచ్చు.)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *వసంతాగమనము*

  పుంస్కోకిల మాహా! ప

  ల్కెం స్కందోపమ వచనము
  లీలన్.. నను మె

  చ్చెం.. స్కందజి దనుజు డితడు..

  సంస్కారము లేని నరుఁడె!
  సత్పురుషుఁ డగున్..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  23.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   రెండవ, మూడవ పాదాలలో ప్రాసస్థానంలోని వ్యాకరణ కార్యం సాధుత్వం విషయంలో సందేహం.

   తొలగించండి
 31. సంస్కారహీనుడెప్పుడు
  సంస్కారినిదుఃఖపెట్టి సంతోషించున్
  సంస్కృతి మరువకఁ నెపుడు కు
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  రిప్లయితొలగించండి
 32. సంస్కారంబునుద్రోసిపుచ్చునుగదాసాకారమున్ జూడకే
  సంస్కారంబిసుమంతలేనినరుడే,సత్పూరుషుండైమనున్
  సంస్కారంబునదామెలంగుచుభువిన్ సామాజీకోల్లాసుడై
  సంస్కారంబునువీడకెన్నడు నికన్ చామర్తివంశోద్భవా!

  రిప్లయితొలగించండి
 33. శా:

  సంస్కారంబన నేమిటంచు నిల ప్రశ్నావాచకం బడ్గుటన్
  సంస్కారంబును దెల్పు చుండునుగదా సందేహమే యెందుకో
  సంస్కారంబొనరింప నెన్నికన కాశాయంబు నంకించుటౌ
  సంస్కారంబిసుమంత లేని నరుడే సత్పూరుషుండై మనున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 34. సంస్కారమ్మన భూషణమ్ము గదరా సత్యమ్మె కాదందువా
  సంస్కారమ్మదె లేనికోవిదుని దోషాటుండనే పిల్వరే
  సంస్కారమ్మును వీడి పల్కదగదో సంగాతి, యేరీతిగా
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండౌ మనున్?

  రిప్లయితొలగించండి
 35. సంస్కర్తల్ మనసంఘమందునెపుడున్ సత్కార్యముల్సల్పుచున్
  సంస్కారంబును ప్రోదిచేయుదురుగా సన్మార్గగాముల్గనన్
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్
  సంస్కారంబలవర్చుకొన్నపుడు నాసంస్కారులే మెచ్చగన్.

  రిప్లయితొలగించండి
 36. సంస్కృతి మార గనిల దు
  స్సంస్కారము గల్గు వారు సంపద గొనిరే!
  సంస్కర్తలు లేని నెలవు
  సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  రిప్లయితొలగించండి
 37. సంస్కర్తల్ గనపూర్వకాలమున శాస్త్రజ్ఞానసంపన్నులై
  సంస్కారంబదిపొంగవాక్కృతులసత్సామర్థ్యముల్ భాసిలన్
  సంస్కారంబొనరింపఁగంటిమిదురాచారంబులన్ !నేడిలన్
  సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 38. కందం
  సంస్కృతిని గౌరవించుచు
  సంస్కారిగ తల్లిదండ్రి సద్గురు నతిథిన్
  సంస్కారిగ సఖుఁ గని, దు
  స్సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  రిప్లయితొలగించండి
 39. మిత్రులందఱకు నమస్సులు!

  సంస్కృత్యాత్మక భాషణమ్ము లిలలో శ్లాఘంబులన్ బొందురా!
  సంస్కారం బెది లేనివాఁడె యిలలో సద్వంద్యుఁ డౌనా? కృతా
  పుంస్కప్రౌఢ వలెం దిరస్కృతులఁ దాఁ బొందున్ గదా ధాత్రి! దు
  స్సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్!

  కృత+అపుంస్కప్రౌఢ=మగడు లేనిదిగా జేయబడిన స్త్రీ (మగడు లేని ఆడుది)

  మధురకవి గుండు మధుసూదన్, శేషాద్ద్రిహిల్స్, ఓరుగల్లు

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀.................... సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్

  సందర్భము: లక్ష్మణుడు అన్నతో వనాల కేగి పదునాలుగేండ్లకు వచ్చాడు. భార్య ఊర్మిళ అయోధ్యలోనే అంతకాలమూ నిద్రపోయింది. లక్ష్మణుడు మేల్కొలిపినాడు.
  ఆమె నిదురమబ్బులో భర్తను గుర్తించక కంగారుగా ఏమేమో మాట్లాడింది.
  నేనే లక్ష్మణుణ్ణని నీ పేరు ఊర్మిళ యని.. నిన్ను బాసినది మొదలు నిద్రాహారము లెరుగను.. అని కత్తితో కంఠం తెగవేసుకొందు ననీ అన్నాడు లక్ష్మణుడు.
  ఊర్మిళకు నిద్ర మబ్బు వదలిపోయింది. ప్రాణనాథుని గుర్తించి పాదాలపై పడిపోగా అతడు లేవనెత్తి కౌగలించుకున్నాడు.
  ఊర్మిళ ఆనందంతో ఇలా అనుకొన్నది.
  " పుంస్కోకిల మొకటి స్వరమునకు సంబంధించిన సంస్కరింపబడిన శబ్దం (సంస్కృత భాషలో శబ్దం) సరసంగా చేసింది. (నా జీవితంలో యీనాడే వసంతం వచ్చినట్టుంది.) పర పురుషు డెవరో అనుకున్నాను. ఈ పుంస్కృత్యం (పురుషుడు చేయదగింది) సౌమిత్రిదే! ఇతడు సంస్కారం లేని నరుడా! కాడు. సత్పురుషుడు."
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  మరొక ప్రయత్నము..

  *వసంతాగమనము*

  పుంస్కోకిల మొక్కటి స్వర

  సంస్కృత రుతమును సలిపెను
  సరసముగా.. నీ

  పుంస్కృత్యము సౌమిత్రిదె!

  సంస్కారము లేని నరుఁడె!
  సత్పురుషుఁ డగున్..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  23.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి