18, జనవరి 2020, శనివారం

సమస్య - 3254 (నిదురను మున్గు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్"
(లేదా...)
"నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

84 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  చదువును సంధ్యనున్ విడిచి చక్కగ జేరుచు పార్టిలోన వే
  పదవులు పొంది మంత్రులుగ భాగ్యము పెంచుచు, సౌధమందునన్
  ముదమున మందు గ్రోలుచును ముద్దుగ రాత్రిని గుఱ్ఱుకొట్టుచున్
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును... అటువంటి వాళ్ళకే సంపదలు! ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
   నిజానికి ఇది ఏదో సరదాకి వ్రాసిన పూరణ మాత్రం కాదు.

   తొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చదువును సంధ్య వీడుచును చక్కని పింఛను నారగించుచున్
  ముదమున కంది వారలిడు ముద్దులు మీరెడు కైపదమ్ములన్
  కుదురుగ వ్రాసి, పూరణలు కూరిమి మీరగ జేసి హాయిగా
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్

  సంపదలు = Pay Commision Arrears

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   అయినా పే కమీషన్ అరియర్స్ మాటిమాటికి వచ్చేవి కాదు కదా!?

   తొలగించండి
  2. 🙏

   మాకు ఐదు విడతలుగా వచ్చాయి. ఊపిరి ఉంటే చాలు వస్తూ ఉంటాయి ఎల్ల కాలం...


   😊

   తొలగించండి
 3. కదలక దీక్ష లేటికని కాదని హాయిగ సంత సంబునన్
  వదలక విందు భోజనము వాసిగ మెక్కుచు నూరు వాడలన్
  ముదితల ప్రేమ కోసమని మోదము నొందుచు చింత లేకతా
  నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్

  రిప్లయితొలగించండి

 4. చదువగ 'భక్తియో'గమటు చక్కని దేవుని
  సన్నిధానమై,
  చెదరని చిద్విలాసమును,చిత్తమునిచ్చెడిధ్యానమార్గమై,
  ప్రిదిలిన జీవనంబుననుపేదలపెన్నిధి జీవయోగమౌ
  నిదురనుమున్గువారలకునిశ్చల సంపదలబ్బునెన్నగాన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి  రిప్లయితొలగించండి
 5. అద్రిక యనినంత మోజని
  భద్రముగా చెలిమి చేయ బహు ప్రీతియటన్
  క్షిద్రము జేయుట తగదని
  నిద్రా సక్తులకు దక్కు నిఖిల విభవముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. "అద్రిక యనగా మోజని" అనండి.

   తొలగించండి
  2. అద్రిక యనగా మోజని
   భద్రముగా చెలిమి చేయ బహు ప్రీతియటన్
   క్షిద్రము జేయుట తగదని
   నిద్రా సక్తులకు దక్కు నిఖిల విభవముల్

   తొలగించండి
 6. మూడవ పాదంలో గణము ధ్యాన బదులుగా సాధు ?

  రిప్లయితొలగించండి
 7. (ఐహిక ధనవంతులు - ఆముష్మిక ధనవంతులు )
  కదలెడి యగ్గికంబముల
  కౌగిలి తప్పదు మత్తచిత్తులై
  నిదురను మున్గువారలకు ;
  నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్
  జెదరని భక్తితో హరిని
  చేతల మాటల మానసంబునన్
  వదలని సేవలో మునిగి
  వర్తిలు పావనమానవాళికిన్ .

  రిప్లయితొలగించండి
 8. ఛిద్రములె యెందు జూసిన
  నిద్రాసక్తులకు దక్కు ; నిఖిల విభవముల్
  ముద్రితమగు వాని నొసట
  నద్రి పొడవక మునుపె పను లను గావించన్

  రిప్లయితొలగించండి
 9. చం:

  చెదరగ మానసమ్మనుచు చింతల నెత్తు మనుష్యు లెందరో
  వదలక వేడు కొందురు గభాలున తగ్గన వైద్య సేవకై
  బదులుగ దెల్వ నేర్తురట భావన లొంద ప్రశాంత చిత్తమున్
  నిదురన మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్న గాన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 10. చం||

  పదుగురితోడ సంఘమున పాల్గొని కీర్తి ఘటించు వారి త్రో
  వ దినదినాభివృద్ధియగు వారు సదాచరణంబుకై సదా
  కుదురగు కార్యసాధనముఁ కోరక కర్మలఁ రాత్రివేళయన్
  నిదురను మున్గు! వారలకు నిశ్చలసంపదలబ్బునెన్నగాన్!

  ఆదిపూడి రోహిత్ శర్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సదాచరణాభిలాషులై... రాత్రి వేళలన్..." అనండి.

   తొలగించండి
 11. విరించి  ముదమగు ముక్తిఁ గోరుచు ముముక్షువు జేయుతపమ్ము రీతిగా

  చదురుదనమ్ముతో పనుల సాధన జేయుచు సంప్రతిష్ఠనే

  వదలక నిబ్బరమ్మునిక వాసిగ కార్యము లోన, వీడుచున్

  నిదురను, మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్.

  .

  రిప్లయితొలగించండి
 12. చదువదియబ్బబోదుయిక,చాకిరిజేయుట తధ్యమేగదా!
  ముదురుగమారిపోవకనె ,ముందుప్రణాళికజేయమేలగున్
  కుదురదిలేకపోయినను,కుట్రకుతంత్రములందు మేధలై
  నిదురనుమున్ గువారలకు, నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అబ్బబోదు+ఇక' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "చదువది యబ్బబోదు గద..." అనండి. అలాగే "మారిపోక మునుముందు..." అనండి.
   'మేధలై'?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. చదువదియబ్బబోదుగద ,చాకిరిజేయుట తధ్యమేగదా!

   ముదురుగమారిపోకమునుముందు, ప్రణాళికజేయమేలగున్

   కుదురదిలేకపోయినను,కుట్రకుతంత్రములందు మేధ గా

   నిదురనుమున్ గువారలకు, నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్ !!
   [సవరణ పాఠము ధన్యవాదాలతో]

   తొలగించండి
 13. సదమలభావనాబలము స్వాంతమునందు ననంతదీప్తులన్
  ముదమును గూర్చుచుండ బహుమూల్య సుఖప్రద మోక్షసిద్ధి కా
  స్పదమగు మార్గముంగొని శుభంకరసన్నుత యోగదీక్షతో
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్.

  రిప్లయితొలగించండి
 14. చంపకమాల
  వదలుచుఁ జింతలన్ మదిని శ్వాసయె ధ్యాసగ నాసికాగ్రమున్
  గదలని దృష్టి కేంద్రముగ గాఢ సుషుప్తిని విశ్వశక్తినిన్
  సదమల బ్రహ్మ రంధ్రమున సాంతము నందెడు మేటి ధ్యానమన్
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్

  రిప్లయితొలగించండి
 15. పదునుగజెప్పుసూక్తులను పట్టవుపొమ్మనిజెప్పువారలే
  విదురుని నీతిసూత్రములు,వీనులకెక్కవు పొమ్ముపొమ్మనున్
  బదులుగనేమిజెప్పనగు,బాధ్యతలేనటువంటి నేతలై
  నిదురనుమున్ గువారలకు, నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్ !!

  రిప్లయితొలగించండి

 16. పదుగురి మెప్పుకోసమని పర్వులవేలనొ యార్జనమ్ముకై
  సదమల సద్వివేకమున సాగగ మేలగు నీజగత్తునన్
  మదికిని శాంతి ముఖ్యమని మన్నన బొందుచు నాత్మతృప్తితో
  నిదురను మున్గు వారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్.

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  నిదురను మున్గువారలకు నిశ్చలసంపదలబ్బునెన్నడున్!!

  హృదయమునందు భక్తి రహియింపగ., చేసెడి సర్వకార్యముల్
  హృదయగతేశ్వరుండగు రమేశుని సేవలుగా దలంచుచున్
  ముదమున సర్వజీవులకు మోదము గూర్చుచు., రేయి హాయిగా
  నిదురను మున్గువారలకు నిశ్చలసంపదలబ్బునెన్నడున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. సందేహమ్మిదిసాగగాదగదు,, ఈ సందోహసం రంభమున్
  కిందైయుండెడు,జీవులన్ గలుపగా క్రీడాభిరామమ్మగున్
  వందేమాతరమన్న సైనికులనే ,వాంఛింఛజేజేలనే
  నిందారోపణలే హితమ్ములొసగున్ ,నీరేజపత్రేక్షణా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తగదు+ఈ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "సాగగా దగదు సత్సందోహ..." అనండి.

   తొలగించండి
  2. సందేహమ్మిదిసాగగాదగదు,, సత్సందోహసం రంభమున్
   కిందైయుండెడు,జీవులన్ గలుపగా క్రీడాభిరామమ్మగున్
   వందేమాతరమన్న సైనికులనే ,వాంఛింఛజేజేలనే
   నిందారోపణలే హితమ్ములొసగున్ ,నీరేజపత్రేక్షణా!
   --------------------------------------------
   [సవరణ పాఠము ధన్యవాదాలు గురువర్యా ]

   తొలగించండి
 19. చంపకమాల:
  సదమల వృత్తి చేత తన సత్పతి లక్ష్మణు మాటయొగ్గి యా
  సుదతి సుమిత్రసూను కడు శోభన నిద్రను తాను గైకొనెన్
  మది పదునాలుగేండ్లు కను మాటున యూర్మిళ దాచె భర్తకై!
  నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్!

  రిప్లయితొలగించండి
 20. క్షుద్రంబగు మాటలివియె
  ఛిద్రంబగు జీవితములు, చిత్రమె కదరా
  భద్రా! నీనుడు లేవిధి
  నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్

  రిప్లయితొలగించండి


 21. ఛిద్రమవన్ తలపులు చి
  న్ముద్రని ధ్యానమ్ము చేయ నునుపారంగన్
  రౌద్రము, తురీయ జాగృత
  నిద్రాసక్తులకు, దక్కు నిఖిల విభవముల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 22. ఆకాశవాణికి పంపినది


  అదురక, చేయు కార్యమున నచ్చము గా మది పొందు చేయుచున్,
  కుదురుగ నిత్యముక్తుడిని కోరిక లేవియు లేక మ్రొక్కి, చే
  బదులుగ జీవితమ్మునిక బ్రహ్మణి యిచ్చిన రీతి పోచి,యా
  నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. నిద్రాదేవత ఫలములు
  నిద్రాసక్తులకగు, దక్కు నిఖిల విభవముల్
  నిద్రను వదలుకు సతతము
  భద్రముగా పనులు పూర్తి బాధ్యత జరుపన్

  రిప్లయితొలగించండి
 24. ఆకాశవాణిలో ప్రసారం:

  కుదురుగఁ నాసనంబొకటి కూర్చి తిరంబుగ ధ్యానముద్రలో
  పదపడి మానసంబున జపంబొనరింపగ చిత్తశాంతికై
  చెదరగజేయు యోచనల ఛిద్రముజేయును నిర్వికల్పమౌ
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్.

  రిప్లయితొలగించండి
 25. ఛిద్రo బౌ కాయ మనుచు
  భద్రాచల వాసు మదిని భజియించుచు దా
  నద్రిని వసించి యోగపు
  నిద్రా సక్తు లకు దక్కు నిఖిల విభవ ముల్

  రిప్లయితొలగించండి
 26. నిద్ర యొసగు నుత్సాహము
  నిద్రయె నిత్యౌషధంబు నీకును నాకున్
  నిద్రవరంబగు, సీమిత
  నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్"

  రిప్లయితొలగించండి
 27. మదములుగల్గునెప్పుడునుమాంద్యముగూడనునబ్బునేసుమా
  నిదురనుమున్గువారలకు,నిశ్చలసంపదలబ్బునెన్నగాన్
  సదయనుమెల్గువారలకుశంభునివీక్షణమెల్లవేళలన్
  నిదుగులులేకయేవఱలియేవురుసంతసమొందురీతిగా

  రిప్లయితొలగించండి
 28. కదలక ధ్యానయోగమున,కాదని చిత్తము తెచ్చు భ్రాంతులన్,
  వదలక విష్ణు రూపమును, వాసనలన్ దరిజేరనీయకన్,
  కుదురుగ నుండి, లొంగకను కోర్కెల, కైహిక సౌఖ్య మన్నచో
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్.

  రిప్లయితొలగించండి
 29. ముద్రారాక్షసమనునవి
  నిద్రాసక్తులకుదక్కు,నిఖీలవిభవముల్
  భద్రాచలేశుగొలువగ
  భద్రముగాగలుగుమనకుభవ్యపురీతిన్

  రిప్లయితొలగించండి
 30. రిప్లయిలు
  1. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

   నా పూరణ 🌹

   *కం ||*

   నిద్రా దేవత వలదు, ద
   రిద్రము నాట్యమొనరున్ పరిపరి విధములన్
   భద్రము తప్పది కనుగొన
   *"నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
   🙏🌹👍🌹🙏

   తొలగించండి

 31. కుదురుగ వచ్చు రోగములు కూర్మి హరించెడు ఘోరతాపముల్
  నిదురను మున్గువారలకు, నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్
  సదమలమైనభక్తిరస సారము లూరగ దైవచింతనల్
  మృదువుగ జెప్పి నట్టి మరిమేలగు మాటలె సంత సంబగున్

  రిప్లయితొలగించండి
 32. ఎదుగుట యెట్లు సాధ్యమగు నే పని జేయక మందబుద్ధులై
  నిదురను మున్గు వారలకు; నిశ్చల సంపద లబ్బు నెన్నఁగాన్
  చెదరని దీక్షతో పనులు జేసెడి వారలకట్టి వారికన్
  యెదురిక లేక సాగెదరు యెన్నికగా జనులంత మెచ్చగా

  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
 33. ఉదయము సంధ్యవేళయననుడ్వుయుముప్పది పాశురాలనన్
  వ్రతమును బూనివిష్ణువును భక్తిగపూజలుపుష్య మాసమున్
  హృదయము తోటిదీక్షగను గృధ్యము లేకయుచేయు సేవలో
  నిదురను మున్గువారలకు నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్

  రిప్లయితొలగించండి
 34. వదలకస్వీయకార్యములస్వామియుచేయగకోరుకార్యముల్
  కుదురుగఁజేయనెంచి తొలికోడియుకూతనుపెట్టుముందె తాన్
  నిదురనువీడి పర్వులిడి నీమముతప్పక రాత్రి వేళలన్
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్

  గాదిరాజు మధుసూదనరాజు

  రిప్లయితొలగించండి
 35. చదువున కార్యశాలను, ప్రసంగ సభాస్థలిమధ్య మందునన్
  కదన మహీతలంబు సముఖమ్మున నాత్మవధూస
  మాగమం
  బొదవెడు చోటులన్నిదుర నొల్లకుమెందును దాననాకటన్
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్"

  రిప్లయితొలగించండి


 36. ఆకాశవాణి‌ విశేషములేమిటి ? వచ్చేవారపు‌ సమస్య?

  తెలుపగలరు  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య.....
   *ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్*
   మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
   padyamairhyd@gmail.com

   తొలగించండి


  2. నెనరుల్స్ ! పంపించినాము :)

   ప్రేయస్సును గాన భళి
   శ్రేయస్సునుకై నిడదగు శ్రీకర మైనన్
   సాయమ్మొనర్ప రాన్ సరి
   యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్!


   జిలేబి

   తొలగించండి
 37. కందం
  ఉద్రేకమ్ముల వీడుచు
  భద్రమ్ముగ నాసనముల వైచిన పిదపన్
  ముద్రాయుత యోగ విధిత
  నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్

  రిప్లయితొలగించండి
 38. హృద్రోగార్దిత జనులకు
  నిద్రయె వరమై చెలంగు నీరేజాక్షీ
  భద్రమ్ముగ మితిమీఱని
  నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్


  హృదయము నందు నిల్పి సత మింపుగఁ గొల్చుచు భక్తి శ్రీరమా
  పదయుగ చింతనా రతత బ్రహ్మ ముహూర్తము నందు లేవఁగా
  సదమల రీతిఁ బంచదశ శౌరి కృపా ఘటికా మితంబుగా
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నఁగాన్

  [పంచదశ ఘటికలు = ఆఱు గంటలు]

  రిప్లయితొలగించండి
 39. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్"

  సందర్భము:
  త్వరతే కార్యకాలో మే అహశ్చా ప్యతివర్తతే
  ప్రతిజ్ఞా చ మయాదత్తా నస్థాతవ్య మిహాంతరే
  (కార్యకాలం మించిపోతున్నది. పగలు దాటిపోతున్నది. ప్రతిజ్ఞ చేసినాను. నడుమ నిలువకూడదు.) సుం.కాం. 1-132
  అన్నాడు మారుతి మైనాకునితో తన శిఖరాలమీద విశ్రాంతి తీసుకొని వెళ్ళుమన్నప్పుడు.
  పని ధ్యాస వున్న వానికి నిద్రాహారాలు పట్టవు. హనుమంతు డటువంటివాడు. అతడు నిద్రపోతున్న ట్టెక్కడా చెప్పబడలేదు. రాత్రుళ్ళే నిద్రపోయినట్టు లేదు.(రాత్రి పూటనే లంకలో ప్రవేశించినాడు.)ఇక పగటి నిద్ర ముచ్చ టేది?
  నిజానికి పనియే పరమాత్ముని పూజ. పనిని పూజగానే కాక అదే విశ్రాంతిగాను అదే ఆహారంగాను భావించి చేస్తూపోతూవుండాలి. అటువంటివాడే సర్వోత్తముడు.
  నూరామడల సముద్రాన్ని దాటినా పావని నిట్టూర్పైనా విడువలేదు. అలసటా పొందలేదు. (అనిఃశ్వసన్ కపిస్తత్ర న గ్లాని మధిగచ్ఛతి 2-3) పైగా ఇదొక లెక్కా!.. అన్నాడట!
  సీతాన్వేషణాది సందర్భాల్లో నిద్రను విడిచిపెట్టి రాముని సేవించటంవల్ల జ్ఞానాన్ని పొందగలినాడు ఆంజనేయుడు. (రాముని సేవలో నిద్రాహారాలు మరచిపోవటంద్వారా జ్ఞాన స్వరూపుడు కాగలిగినాడు.)
  రెండు పద్యాలలోను భంగ్యంతరంగా ఒకే భావం వుంది.
  అద్రిచరేశ్వరుడు = హనుమంతుడు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *చిన్ముద్ర*

  అద్రిచరేశ్వరు డలయక
  నిద్రన్ విడి రామభద్రునిన్ గొలుచుటఁ జి
  న్ముద్రను బడసెను..విగళిత
  నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్ 1

  నిద్రన్ బూనక రాముని
  భద్రదునిన్ గొలుచుచుంటవలనఁ గదా చి
  న్ముద్ర వడసె పావని.. ని
  ర్ణిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్ 2

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  18.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 40. అదునును జూసి సేద్యమున హాలికుడై దినంబు శ్రమించుచున్
  బెదరక కష్టనష్టముల ప్రేమనుబెంచుచు గొడ్డుగోదల
  న్నొదుగుచు భూమిపుత్రులుగ నోరిమితోడ జరించి తృప్తితో
  నిదురను మున్గువారికిని నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్

  కుదురుగ శంకరాభరణ కూటమినందున పద్యవిద్యనే
  ముదమున నేర్చి నేర్పుగను పూరణలెన్నొ రచించుకోర్కెతో
  పదునగు బుద్ధినిన్ దగిన పాటవమొప్ప నిశిన్ త్యజించుచున్
  నిదురను,మున్గువానికిని నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్
  జి.పి.శాస్త్రిగారికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉద్రేకమ్మది లేకయె
   భద్రమ్మగు ధర్మబద్ధ వర్తనతోడన్
   భద్రేశుగొల్చు పరిమిత
   నిద్రాసక్తులకుగల్గు నిఖిల విభవముల్

   తొలగించండి
 41. పెదవులపైన నవ్వులు స్రవించ కృపారసమద్ది మోముపై
  ప్రిదిలిన పూర్వజన్మలవి విందులు జేయగ పెక్కుభంగులన్
  ముదముగ నమ్మ పొత్తిళుల ముద్దులు కుల్కుచు శైశవమ్ములో
  *నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 42. అదనపు వేదనాతతుల నందగజేసిరి పాలనమ్ములో
  ఎదురుగనిల్చువారలను యెంపిక జేయుచు నేరమందునన్
  కుదురుగకుళ్ళగాబొడిచి,కూటమిగట్టిరి రౌడిమూకగా
  నిదురనుమున్ గువారలకు,నిశ్చల సంపదలబ్బునెన్నగా!

  రిప్లయితొలగించండి
 43. పదునున దుక్కిదున్ని పలు పైరులు వేయుచు భూములందునన్

  సదమల బుద్ధితోడ వ్యవసాయము చేయుచు వాసరమ్ములన్

  సదనము నందు గొంచు పశు సంపద నాయము, రాత్రివేళలో

  నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్

  రిప్లయితొలగించండి
 44. వదలని బద్ధకంబు నెలవై కొలువుండును తిష్ట వేయుచున్
  నిదురను మున్గువారలకు;నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్
  చెదరని కార్యదీక్ష,కడు చిక్కని చక్కని వర్తనంబుతో
  కుదురగు ధర్మపాలన, అకుంఠిత ధైర్యముఁగల్గు వారికిన్.

  రిప్లయితొలగించండి
 45. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  నిదురను మున్గువారలకు నిశ్చల సంపద
  లబ్బు నెన్నగాన్

  సందర్భము: రాముడు వనవాసానికి వెళుతుంటే లక్ష్మణుడూ బయలుదేరుతాడు. భార్య ఊర్మిళ తానూ వస్తానంటే లక్ష్మణుడు వద్దంటాడు.
  భర్త లేకపోతే ఆమె పెద్దకాలం చింతిస్తూ నిద్రకూడా పోదు. ఆమె వెంట వుంటే లక్ష్మణుడు ఏకాగ్రతతో రాత్రింబవళ్లు అన్న సేవ చేయజాలడు.
  కాబట్టి లక్ష్మణుడు తన నిద్ర నంతా ఆమె కిస్తాడు. ఊర్మిళ తన మెలుకువ నంతా అతని కిస్తుంది.
  ఫలితంగా ఆమె నిశ్చింతగా పదునాలుగేండ్లూ అయోధ్యలోనే నిద్ర పోతుంది నిర్విరామంగా. అతడు అంతకాలమూ కంటిమీద కునుకు లేకుండా అన్నా వదినలకు సేవ చేస్తాడు. జానపద వాఙ్మయంలో ఇదొక రసవత్తరమైన గేయ కథ.
  శ్రీ రామ భూపాలుడూ.. పట్టాభి
  షిక్తుడై కొలువుండగా..
  అని మొదలౌతుంది పాట
  పర్ణశాలకు కాపలా వుండగా నిద్రాదేవి లక్ష్మణునికి ప్రత్యక్ష మౌతుంది. తన మీద ప్రభావం చూపవద్దని, తన నిద్రను ఊర్మిళకు బదిలీ చేయు మని లక్ష్మణుడు నిద్రా దేవిని ప్రార్థిస్తాడు. ఆమె తథాస్తు.. అంటుంది. ఇది మరో కథ.
  ఈ కథ వెలుగు చూడడానికి మొట్ట మొదటి కారకులు శ్రీ మతి కోలవెన్ను మలయవాసిని గారు. వారికి కృతజ్ఞతలు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *ఊర్మిళ నిద్ర*

  మెదలక నిద్రబోవుటయె
  మేలగు సంపద..చింత లేదు.. నే
  ముదమున భర్తతోఁ జనక
  పోతి ననన్.. బదునాలుగేండ్లుగా
  నుదయము లెన్ని యేగినవొ!
  ఊర్మిళ దేవికి గాక యేరికిన్
  నిదురను మున్గు వారలకు
  నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్?

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  18.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 46. కందం
  దుర్మార్గులు ధాటిగ దు
  ష్కర్మల ప్రజల హృదయాల గాయపఱుచగా
  నోర్మి నెదిరించి బ్రతుకు న
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా! ?

  రిప్లయితొలగించండి