మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'భాజపానిదౌ'?... "మీరిన యట్టి భాజపా కాంతయె" అంటే బాగుంటుందేమో? 'నేత+అగు' అన్నపుడు సంధి లేదు. "కాంగ్రెసు నేతయె/లీడరు రాహులన్నకున్"అనవచ్చు కదా!
కొంత డిమానిటైజనుచు కొంత తలాకుని తట్టి లేపి,లా వంతయు జూపి రాముని నివాసపు చిక్కుసమస్య తీర్చి పై వంతుగ కాందిశీకులను పౌరులు గా నిల బెట్టిరే!భళా ఇంతకు మించి మంచిని వినిర్భయు లై నిలుపంగ భాజపా వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!
సందర్భము: ఫాల్గుణంలో రావణ వధ జరిగింది. రాము డయోధ్యకు వచ్చినాడు. రాజైనాడు (చైత్ర మాసంలో). అతని ప్రభుత్వం (లేదా) కొత్త సంవత్సరం మాకు నిండుగా (వున్న) వంతలను (ఏరులను) ఇచ్చు (ఏర్పరచు) గాక.. అని రైతులైన ప్రజలు కోరుకుంటున్నారు. అంటే నీటి పారుదల విషయంలో సముచితమైన చర్య లెన్నో తీసుకోవా లని వారి అభిమతం. అసలు రాముని ప్రభుత్వం నిండుగా వున్న నదుల నెలా యిస్తుంది? అవి దేవుడు కురిపించే వర్షం మీద ఆధారపడినవి కదా! అంటే యజ్ఞ యాగాలు జరిపించడంవల్ల దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తా రనేది అనాదిగా వున్న నమ్మకం. నమ్మకం కాదు యథార్థం. దేవతల మీద నమ్మకం లేని ఆధునిక యుగంలో కృత్రిమ వర్షాలు కురిపించే పరిశోధన లెన్ని చేసినా తలకు మించిన ఖర్చుతో కూడుకున్నవై అంతంత మాత్రమే ఫలవంతా లౌతున్నాయి. అశ్వమేధ శతై రిష్ట్వా తథా బహు సువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా.. బా.కాం.2-95 రాముడు వందలకొద్ది అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు భూరి సువర్ణ దక్షిణ లిచ్చి పదివేల కోట్ల ఆవులను దానం చేసినాడు. చేసింది ఏ స్వార్థంకోసమో కాదు. ప్రజా క్షేమంకోసం. అందువల్ల వర్షాలు సకాలంలో కురిసేవి. పంటలు సమృద్ధిగా పండేవి. అదీ రామ రాజ్య రహస్యం. అందుకే.. నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ.. 93 పట్టణా లన్నీ ధన ధాన్య సంపన్నాలై యున్నాయి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రామ రాజ్య రహస్యం*
అంతముఁ జేసి రావణుని హర్షముతోడుత ఫాల్గుణాన మా చెంతకు నీ యయోధ్యకును జేరెను రాముడు.. స్వామి యయ్యె..మా సంతస మే మనం దగును.. స్వామి ప్రభుత్వము మాకు నిండుగా వంతల నిచ్చుఁగాత నవ వత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 1.01.20 -----------------------------------------------------------
సందర్భము: రాముడు వాలిని వధిస్తానని సుగ్రీవునికి మాట యచ్చినాడు. వాలి సుగ్రీవు లిద్దరూ ఘోరంగా పోరాడినారు. వాలి చితుకబాది వెళ్ళిపోగా సుగ్రీవుడు వచ్చి విలపించగా మీ రిద్దరూ ఒకే లాగా వున్నారు. గుర్తించలేకపోయా నని రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. గజపుష్పీ మిమాం ఫుల్లా ముత్పాట్య శుభ లక్షణాం కురు లక్ష్మణ! కంఠేఽస్య సుగ్రీవస్య మహాత్మనః కి.కాం. 12-39 శుభలక్షణా లున్న.. వికసించిన పూవు లున్న గజ పుష్పి అనే ఈ తీగను పెరికి సుగ్రీవుని మెడలో వేయి. లక్ష్మణు డలాగే చేసినాడు. కరమొప్ప నింక నీ గజపుష్పమాల ధరియించి పోయి యుద్ధము సేయుచుండు బెదరక వాలిఁ జంపెద నిశ్చయింపు కదలుము కిష్కింధ కడకు నీ వనుచు.. (రంగనాథ రామాయణము) రాముడు సుగ్రీవునితో మరోసారి వాలితో పోరాడా లంటూ పలికిన సందర్భం మిది. నూత్నవత్=కొత్తదాని (కొత్త ప్రయత్నం) వంటిది. నూత్న వత్ సరము = కొత్త ప్రయత్నంవంటి పూదండ... ధరించుము.. (రెండవసారి వెళ్ళమంటున్నాడు కాబట్టి ఇది కొత్త ప్రయత్నం.) "ఈ పూదండయే వాలికి వంత (బాధ)లను కలిగిస్తుంది గాక!" అన్నాడు రాముడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
సందర్భము: "దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ.." బా.కాం 2-97 11 వేల ఏండ్లు రాముడు రాజ్య మేలినాడు. అదే రామ రాజ్యం.. లోకానికే ఆదర్శమైన రాజ్యం.. అది రామరాజ్య మెందు కయిం దంటే ఒకే మాటలో చెప్పవచ్చు. "ప్రజానాం చ హితే రతః" 1-12 రాముడు ప్రజలకు మేలు చేయడంలో ఆసక్తి గలవాడు. ఈ ఒక్కటీ చాలు ప్రజలు సుఖంగా ఎలా వుండగలిగా రనడానికి. రామరాజ్యం వంటి రాజ్య మిది. శాంతికి భంగకరంగా పరిణమించే అల్లరులు చేస్తూ పరిపాలనకు ఆటంకం కలిగించే దుర్మార్గులకు నూతన సంవత్సరం బాధలు కలిగించును గాక! ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఇదే ఐతే మనది రామరాజ్యమే!!
రంతు = పెద్ద ధ్వని, కలకలం, కలహం అభ్యంతరం = ఆటంకం ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*నూతన వత్సర శుభాకాంక్షలు*
శాంతికి భంగకరమ్ముగ
రంతుల నొనరించి రామ రాజ్యంబున క
భ్యంతరముఁ జేయు ఖలులకు
వంతల నిఁడుఁగాత నూత్న వత్సర మింకన్!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 1.01.20 -----------------------------------------------------------
సందర్భము: వంత లంటే బాధలు.. కష్టాలు.. మనుష్యులకు కాకపోతే మాకుల కొస్తాయా! బాధలు కలుగడం ఒకంత.. వాటిగురించి ఆందోళన చెందడం రెండంతలు. అసలు మనకు కలుగుతున్న వన్నీ కష్టాలే కావని అట్లే సుఖాలే కావని తత్వ వేత్తల తీర్మానం. ఏ కష్టం గాని సుఖం గాని ఎన్నో నా ళ్ళుండనే వుండదు. అసలు దైవానికి దగ్గరగా వుండడమే సుఖం. దూరంగా వుండడమే కష్టం. అందుకే కుంతి కృష్ణుని కష్టాలే కోరుకున్న దట! అటువంటి వేళలలోనే దైవం గుర్తుకు వస్తాడు కదా! దైవానికి దగ్గరగా వున్నట్టౌతుంది కాబట్టి అది సుఖమే అని ఆ సాధ్వి భావన. ఇక మన స్థాన మెక్కడో మనమే చూసుకోవాలి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ వంతల నిష్టపడినచో వంతలు కానేరవు భగవంతుని జేర్చున్.. గుంతి ముకుందునిఁ గోరదె వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 1.01.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
"దీర్ఘ సుమంగళీ భవ!"
పొంతము మీరగా వలచి పోరును బెట్టుచు రాత్రివేళనున్
సుంతయు భర్తనున్ విడని షోకులు మీరిన భాజపానిదౌ
కాంతయె వచ్చుచున్ వడిగ కాంగ్రెసు నేతగు రాహులన్నకున్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భాజపానిదౌ'?... "మీరిన యట్టి భాజపా కాంతయె" అంటే బాగుంటుందేమో? 'నేత+అగు' అన్నపుడు సంధి లేదు. "కాంగ్రెసు నేతయె/లీడరు రాహులన్నకున్"అనవచ్చు కదా!
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిముంతను దాచక చల్లకు
చెంతకు వచ్చుచు విడువక చెందమ్మీ! క
వ్వింతల నీరతగురువే
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
నూతన 2020 తో సై యంటూ
బ్లాగ్ లోకం లో దశాబ్ధిని దాటిన
జిలేబి :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం అర్థం కాలేదు.
చింతలు దూరము చేయగ
రిప్లయితొలగించండివింతలు కలిగించు నంట వేయి విధమ్ముల్
సంతస ముగప్రజ లుండిన
వంతల నిఁడుఁ గాత నూత్న వత్సర మింకన్
అక్కయ్యా,
తొలగించండిప్రజలు సంతోషంగా ఉంటే కొత్త సంవత్సరం వంతలివ్వాలా?
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
"IIT KGP Jindabad!"
వింతగ ఖర్గపూరునను విడ్డుర మౌచును ఛాత్రులెల్లరున్
సంతసమొంద భౌతికపు శాస్త్రము నేర్పుచు విఱ్ఱవీగెడిన్
పంతుల పింఛనున్ పెరిగి భారపు రీతిని నిర్మలమ్మకున్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇంతకూ 'నిర్మలమ్మ' ఎవరు?
తొలగించండిNirmala Sitharaman (Finance Minister of India)
రిప్లయితొలగించండికొంత డిమానిటైజనుచు కొంత తలాకుని తట్టి లేపి,లా
వంతయు జూపి రాముని నివాసపు చిక్కుసమస్య తీర్చి పై
వంతుగ కాందిశీకులను పౌరులు గా నిల బెట్టిరే!భళా
ఇంతకు మించి మంచిని వినిర్భయు లై నిలుపంగ భాజపా
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంటే ఇప్పటిదాకా మంచి చేసిన భాజపా ఈ సంవత్సరం చెడు చేయాలంటున్నారా?
తొలగించండిఆవిడ రా.గా. పార్టీ లెండి...
తొలగించండిమీ సమస్యా పాదానికి తగినట్టు మేము పార్టీ ఫిరాయింపు చేసేస్తామండోయ్ :)
జిలేబి
అంతము లేక భారతము
రిప్లయితొలగించండినందున సందులజేసి దూరుచున్
జెంతనె మారణాస్త్రముల
జీకటిబాంబుల గుప్ప జేయుచున్
వింతమృగంబులై జనుల
వెన్నుల గూల్చెడి దుర్మదాళికిన్
వంతల నిచ్చుగాత నవ
వత్సర మెల్ల బ్రజాళి మెచ్చగన్ .
( భారతము - భారతదేశం ; చీకటిబాంబులు - నల్లనిబాంబులు ; వంతలు-బాధలు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపంతముబట్టిరైతులను, పాపులటంచును వీధికీడ్చునీ
రిప్లయితొలగించండిసుంతయుబుద్ధిలేని ,మన శూన్యపువాక్కుల పాలకాధముల్
ఇంతకునింతగా యిలన ,యీశ్వరదైవముజాలిదల్చకన్
వంతలనిచ్చుగాత ,నవవత్సరమెల్ల ప్రజాళిమెచ్చగన్
++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ఇంతకు నింతగా నిలను నీశ్వరు డింతయు జాలి జూపకే" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅందరికీ ఆంగ్లవత్సరాది శుభాకాంక్షలు 💐🙏
శాంతి లభించుతన్ భరతజాతికి.,వైదిక ధర్మవృత్తి ని...
శ్చింత రహించుతన్., శుభవిశేషములే రవళించుతన్., మత..
ధ్వాంతములారుతన్., ఖలులు వైరులు పెచ్చరిలంగ వారికిన్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చగన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశాంతి లభించుత జాతికి
రిప్లయితొలగించండిచింతలు పోవంగ శుభవిశేషము లందన్
పంతము బట్టెడు దుష్టుల
వంతల నిడుగాత నూత్న వత్సరమింకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ నాటి శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండివంతలు నిడుగాత నూత్నవత్సర మింక న్
ఇచ్చిన పాదము కందము నా పూరన సీసములొ
ఒకడికి అమెరికా లో మంచిచక్కటి ఉద్యొగము వచ్చినది దానికి వెలుతుండగ పతిని విడువలేక భార్య బాధ పడుతూ ఉంటుంది, ఆ సందర్భములొ ఆ పతి పలికిన పలుకులు
మెచ్చిరి ప్రతిభను, వచ్చెను ఘనమగు
నుద్యోగము నచట, నోముల ఫల
మిది లలనా, కడు ముదముగ నీవొన
రించిన పూజలు మంచి జేసె,
వెడలు చుంటిని నేడు వేగిరముగ. నొక
వత్సరము పిదప వచ్చు వాడ,
బాధను వీడుము,పదిలముగా మన
సంతును సాకుము, సరసమైన
కడు వల (వంతలు నిడుగాత నూత్నవ
త్సర మింక ని)ద్దరికి రమణీ ,య
ధరము పై నిడు ముద్దులు మరుపు నీయ
క తలచు కొనుము, ఘనమగు కౌగిలింత
యిది, గురుతు చేయు సతతము ముదము తోడ
ననుచు బంధించె నొకడు తన నాతి నపుడు
వలవంతలు = విరహ వేదనలు
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచింతలఁ దునుమాడుచు నవ
రిప్లయితొలగించండికాంతుల వెదజల్ల దలచి కదలియె వచ్చెన్
జెంతకు, జనులకు తా ని
ర్వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంతము సేయఁగ రాగ దె
రిప్లయితొలగించండివంత ల : నిడు గాక నూత్న వత్సర మందు న్
సంతస సౌభాగ్యంబు లు
పంత తో తొలగ జేసి బాధల నెల్ల న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంతోషము సౌభాగ్యము పంతముతో...' అనండి.
శాంతము సౌఖ్యము చింతా
రిప్లయితొలగించండిధ్వాంతవిదీర్ణము, బహుశుభదముసుజనులకున్
కాంతావిద్రోహకులకు
వంతల, నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
ప్రాంత విభేదము ల్దొలగి భారతభూమి యఖండ భాండమై
రిప్లయితొలగించండిశాంతము సౌఖ్యము ల్గలిగి సజ్జన మండలి సంతసించగా
హంతకులంగనావిభవ హారకు లందరకంతకతకున్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్"
నూతన సంవత్సర శుభాకాంక్షలు
తొలగించండిహారకులందర కంతకంతకున్. ముద్రారాక్షసమునకు క్షంతవ్యుణ్ణి.
తొలగించండివింతగ నడచెడు ప్రభుతన
రిప్లయితొలగించండిపంతము తోడన పనులను బడసితి ననుచున్
యంతయు భవుడే యను భా
వం తలనిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
ప్రాంతము లేమైనప్పటి
రిప్లయితొలగించండికింతైనను చింతలేక నెల్లరు మసలన్
శాంతినిడుచు వంతలకే
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
గురువుగారికి,కవిమిత్రులందరికి నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిఅంతము జేయుచు పంతము,
వంతల,నిడుగాక నూత్నవత్సర మింకన్
జింతిత ఫలముల నదె యే
తెంచగ నూతన దశాబ్ది తెచ్చుచు శోభన్
రిప్లయితొలగించండిగంతకు తగుబొంతగ బ
ల్వింతగ శ్రీ విట్టుబాబు విదురుల దరి క
వ్వింతల నింతియె తను బ్రో
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్!!
బ్రోవన్+తలనిడుగాక :)
జిలేబి
బాగున్నదండీ మీ పూరణము! అభినందనలు!
తొలగించండిబ్రోవన్ + తల = బ్రోవందల...అవుతుందండీ...
మిత్రులందఱకు నమఃపూర్వక నవ్యాంగ్ల వత్సర శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిసంతత సౌఖ్యదాయియయి, సన్నుతి సేయుచు సజ్జనాళికిన్
వంతలఁ ద్రోచుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!
జింతలఁ ద్రోచి, బాధలిడి, శ్రేష్ఠుల దూరెడి దుర్జనాళికిన్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!
చింతల దొలగించుచు మన
రిప్లయితొలగించండిసంతయు హాయిగను మార్చి సంతసమిడుచున్
యింతుల మది గోర్కెల నా
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
రిప్లయితొలగించండిసుంతయు జింత లేని నవ సుందర స్వప్నము గాగ జీవన
రిప్లయితొలగించండిమ్మంతయు హాయి గూర్చునటు మాకిడుమయ్య వరాల జల్లులన్
శాంతము సౌఖ్యముల్ గలిగి చల్లగ నెల్లరు నుండ గర్వమా
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
రిప్లయితొలగించండిసంతోషముగా హాయిగ
నెంతో స్వాస్థ్యమ్ముతోడనీ వత్సరమం
దంతయు బాధలెలేవను
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"
Best wishes for a happy and prosperous NEWYEAR 2020 to all
రిప్లయితొలగించండిసుంతయుదెలివిగ మసలక
రిప్లయితొలగించండినెంతయొమూర్ఖమ్ముతోడనిలచరియించన్
సంతులకోపానలములు
వంతలనిడుగాత!నూత్నవత్సరమింకన్
అంతయు మంచిజరిగి ధృతి
రిప్లయితొలగించండిమంతులయి ధరఁ ప్రజనంత మసలును గాకా!
పంతమువిడి యవినాభా
వం తల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్!
చింతల బాపుచు బ్రజలకు
రిప్లయితొలగించండిశాంతి బ్రసాదించు చుండి సర్వావనికిన్
సంతోష మహా శ్రీల ర
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్.
ఎంతును గావడి కుండలె
రిప్లయితొలగించండియంతటఁ గష్ట సుఖము లని యట్లయినం గొం
డంతలు సుఖములు వెత లా
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
వింతగ నెంత వారికిని భిన్న మొనర్చఁగఁ గాలచక్రమున్
సుంతయు శక్యమే పరమ శూలికి నైనను దమ్మిచూలికిన్
సంతత హర్ష సౌఖ్యము లొసంగి శుభావళి నింకఁ , దేర్చుచున్
వంతల, నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
"వెత లావంతలు" అధ్భుతమైన పూరణార్యా!!అభినందనపూర్వక వందనములు!!
రిప్లయితొలగించండిడా. సీతా దేవి గారు మీకు నా పద ప్రయోగము నచ్చి నందులకు ధన్యవాదము లండి.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిచింతన లేని వాలకము చిత్తము నిండన దుష్ట భావనల్
కాంతల బెంబడించుచును కర్కశ రీతిని గేళి సేయుచున్
గంతులు వేయు వారలను కామ పిశాచుల కెట్టు లైననున్
వంతల నిచ్చుగాత నవ వత్సర మెల్ల బ్రజాళి మెచ్చగన్
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధ్వాంతము దొల్గ జీవతతి దప్పికఁ దీర్చుచు, శ్రీలు పొంగగన్,
రిప్లయితొలగించండివంతలు వీడ రైతులకు, బావులు భూరితటాకముల్ ధరన్
సంతతపూర్ణతం జెలగ, సాగునకై ప్రవహించు వాగులన్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
సుంతయుబుద్ధిలేకయునుసోమరిపోతుగదిర్గుచున్నచో
రిప్లయితొలగించండిసంతులక్రోధవహ్నికికసాహుతులౌచుతదప్పకుండగన్
వంతలనిచ్చుగాత!నవవత్సరమెల్లబ్రజాళిమెచ్చగన్
శాంతినిసౌఖ్యమున్భువికిశంకరుడిచ్చునుగ్రొత్తసాలునన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఎంతగ రోదసీ స్థలిని నేర్పడి యైదు గ్రహాలు కూటమై
చింతలు బెట్టజూచినను సేమముఁ బంచుచు మానవాళికిన్
సంతస మంద జేయఁగను సాగుచు నాగ్రహరాశి కంతకున్
వంతల నిచ్చుఁ గాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభారంభ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికందం
ఎంతగ పంచగ్రహముల్
చింతలు గలిగించఁ జూడ చేరుచు నొకటై
సుంతయు జడయక వాటికి
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
చింతలఁ ద్రుంచగన్ భువికి చేరగ వచ్చెను వత్సరాంబ తా
రిప్లయితొలగించండిసంతస సంచితమ్ములను జంకన బెట్టుకు తెచ్చునంచు నా
కాంతను స్వాగతించి శుభకామన లందగ జేయుచుంద్రు, ని
ర్వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ
బ్రజాళి మెచ్చఁగన్"
సందర్భము: ఫాల్గుణంలో రావణ వధ జరిగింది. రాము డయోధ్యకు వచ్చినాడు. రాజైనాడు (చైత్ర మాసంలో). అతని ప్రభుత్వం (లేదా) కొత్త సంవత్సరం
మాకు నిండుగా (వున్న) వంతలను (ఏరులను) ఇచ్చు (ఏర్పరచు) గాక..
అని రైతులైన ప్రజలు కోరుకుంటున్నారు.
అంటే నీటి పారుదల విషయంలో సముచితమైన చర్య లెన్నో తీసుకోవా లని వారి అభిమతం.
అసలు రాముని ప్రభుత్వం నిండుగా వున్న నదుల నెలా యిస్తుంది? అవి దేవుడు కురిపించే వర్షం మీద ఆధారపడినవి కదా! అంటే యజ్ఞ యాగాలు జరిపించడంవల్ల దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తా రనేది అనాదిగా వున్న నమ్మకం. నమ్మకం కాదు యథార్థం.
దేవతల మీద నమ్మకం లేని ఆధునిక యుగంలో కృత్రిమ వర్షాలు కురిపించే పరిశోధన లెన్ని చేసినా తలకు మించిన ఖర్చుతో కూడుకున్నవై అంతంత మాత్రమే ఫలవంతా లౌతున్నాయి.
అశ్వమేధ శతై రిష్ట్వా
తథా బహు సువర్ణకైః
గవాం కోట్యయుతం దత్వా.. బా.కాం.2-95
రాముడు వందలకొద్ది అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు భూరి సువర్ణ దక్షిణ లిచ్చి పదివేల కోట్ల ఆవులను దానం చేసినాడు.
చేసింది ఏ స్వార్థంకోసమో కాదు. ప్రజా క్షేమంకోసం. అందువల్ల వర్షాలు సకాలంలో కురిసేవి. పంటలు సమృద్ధిగా పండేవి. అదీ రామ రాజ్య రహస్యం. అందుకే..
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ.. 93 పట్టణా లన్నీ ధన ధాన్య సంపన్నాలై యున్నాయి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రామ రాజ్య రహస్యం*
అంతముఁ జేసి రావణుని
హర్షముతోడుత ఫాల్గుణాన మా
చెంతకు నీ యయోధ్యకును
జేరెను రాముడు.. స్వామి యయ్యె..మా
సంతస మే మనం దగును..
స్వామి ప్రభుత్వము మాకు నిండుగా
వంతల నిచ్చుఁగాత నవ
వత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------
చింతలుమీదరిజేర వ
రిప్లయితొలగించండినంతములై సిరులుపొంగునందరియిండ్లన్
చెంతకుజేరిన శత్రుల
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంతయుభ్రాంతియెగాదని
రిప్లయితొలగించండిచింతలతోవేగనీక చిరునగవులతో
శాంతినిగోరనివారికి
వంతలనిడుగాతనూత్న వత్సరమింకన్
+++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
రిప్లయితొలగించండిమోడి పై అప్పోజిషను వారి కిసుకిసు కసికసి
పుంతల దొక్కెడు వేగం
బంతయు తగ్గంగ మోడి, పటిమయు వీగన్
చెంతయు చేరుచు మిక్కిలి
వంతల నిడుగాత నూత్న వత్సరమింకన్!
Not Amen!
జిలేబి
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"
సందర్భము: రాముడు వాలిని వధిస్తానని సుగ్రీవునికి మాట యచ్చినాడు. వాలి సుగ్రీవు లిద్దరూ ఘోరంగా పోరాడినారు. వాలి చితుకబాది వెళ్ళిపోగా సుగ్రీవుడు వచ్చి విలపించగా మీ రిద్దరూ ఒకే లాగా వున్నారు. గుర్తించలేకపోయా నని రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
గజపుష్పీ మిమాం ఫుల్లా
ముత్పాట్య శుభ లక్షణాం
కురు లక్ష్మణ! కంఠేఽస్య
సుగ్రీవస్య మహాత్మనః
కి.కాం. 12-39
శుభలక్షణా లున్న.. వికసించిన పూవు లున్న గజ పుష్పి అనే ఈ తీగను పెరికి సుగ్రీవుని మెడలో వేయి.
లక్ష్మణు డలాగే చేసినాడు.
కరమొప్ప నింక నీ గజపుష్పమాల
ధరియించి పోయి యుద్ధము సేయుచుండు
బెదరక వాలిఁ జంపెద నిశ్చయింపు
కదలుము కిష్కింధ కడకు నీ వనుచు..
(రంగనాథ రామాయణము)
రాముడు సుగ్రీవునితో మరోసారి వాలితో పోరాడా లంటూ పలికిన సందర్భం మిది.
నూత్నవత్=కొత్తదాని (కొత్త ప్రయత్నం) వంటిది. నూత్న వత్ సరము = కొత్త ప్రయత్నంవంటి పూదండ... ధరించుము..
(రెండవసారి వెళ్ళమంటున్నాడు కాబట్టి ఇది కొత్త ప్రయత్నం.)
"ఈ పూదండయే వాలికి వంత (బాధ)లను కలిగిస్తుంది గాక!" అన్నాడు రాముడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విజయ మాల*
అంతముఁ జేయుదు వాలిని..
పంతము వీడను.. ధరించు ప్రసవ సరము.. ని
శ్చింతగఁ బోరుము.. వాలికి
వంతల నిఁడుఁగాత నూత్నవ త్సర మింకన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"
సందర్భము: "దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ.." బా.కాం 2-97
11 వేల ఏండ్లు రాముడు రాజ్య మేలినాడు. అదే రామ రాజ్యం.. లోకానికే ఆదర్శమైన రాజ్యం.. అది రామరాజ్య మెందు కయిం దంటే ఒకే మాటలో చెప్పవచ్చు.
"ప్రజానాం చ హితే రతః" 1-12
రాముడు ప్రజలకు మేలు చేయడంలో ఆసక్తి గలవాడు.
ఈ ఒక్కటీ చాలు ప్రజలు సుఖంగా ఎలా వుండగలిగా రనడానికి.
రామరాజ్యం వంటి రాజ్య మిది. శాంతికి భంగకరంగా పరిణమించే అల్లరులు చేస్తూ పరిపాలనకు ఆటంకం కలిగించే దుర్మార్గులకు నూతన సంవత్సరం బాధలు కలిగించును గాక!
ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఇదే ఐతే మనది రామరాజ్యమే!!
రంతు = పెద్ద ధ్వని, కలకలం, కలహం
అభ్యంతరం = ఆటంకం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*నూతన వత్సర శుభాకాంక్షలు*
శాంతికి భంగకరమ్ముగ
రంతుల నొనరించి రామ రాజ్యంబున క
భ్యంతరముఁ జేయు ఖలులకు
వంతల నిఁడుఁగాత నూత్న వత్సర మింకన్!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"
సందర్భము: వంత లంటే బాధలు.. కష్టాలు.. మనుష్యులకు కాకపోతే మాకుల కొస్తాయా! బాధలు కలుగడం ఒకంత.. వాటిగురించి ఆందోళన చెందడం రెండంతలు.
అసలు మనకు కలుగుతున్న వన్నీ కష్టాలే కావని అట్లే సుఖాలే కావని తత్వ వేత్తల తీర్మానం.
ఏ కష్టం గాని సుఖం గాని ఎన్నో నా ళ్ళుండనే వుండదు.
అసలు దైవానికి దగ్గరగా వుండడమే సుఖం. దూరంగా వుండడమే కష్టం. అందుకే కుంతి కృష్ణుని కష్టాలే కోరుకున్న దట! అటువంటి వేళలలోనే దైవం గుర్తుకు వస్తాడు కదా! దైవానికి దగ్గరగా వున్నట్టౌతుంది కాబట్టి అది సుఖమే అని ఆ సాధ్వి భావన.
ఇక మన స్థాన మెక్కడో మనమే చూసుకోవాలి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
వంతల నిష్టపడినచో
వంతలు కానేరవు భగవంతుని జేర్చున్..
గుంతి ముకుందునిఁ గోరదె
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------