మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'పెరుగన్ + అణగిన' అన్నపుడు యడాగమం రాదు. "కుజను లధికమై । యణగిన..." అనండి. రెండవ పూరణలో నిజానికి 'మన+అధినాయక = మనాధినాయక' కావాలి. కాని జాతీయగీతంలో ఉన్నట్లు విసంధిగా 'మన అధినాయక' అని ఉంది కనుక యడాగమం లేకుండ విసంధిగా ప్రయోగించండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి. ప్రాదిప్రాస పేరున న-ణ లకు ప్రాసమైత్రిని లాక్షణికులు చెప్పినారు. ఇటువంటి విశేషప్రాసలను కవులు ప్రయోగించకుంటే మంచిది. ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను. వ్యక్తిగతంగా నేను వ్రాసే పద్యాలలో మాత్రం ఈ ప్రాసను ప్రయోగించను.
చైనా లోని "వూహాను" నగరంలో మూడు రోజులుగా కరోనా వైరస్ వలన ఎందరో మృత్యువాతకి గురవుతున్నారు. మనం సంబరాలు చేసుకుంటున్నా ఎందుకో ఆ అభాగ్యులని చూస్తే బాధగానే ఉంది
కం : అణగారె నేడు చీనా వణికించగనే "వుహాను" వాసులనా మా రణహోమమే "కొరోనా" గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
సందర్భము: కామాన్ని జయిస్తే లోకాన్ని జయించినట్టే! అన్ని విద్యలూ దాని కిందివే! ఇదే రామాయణ సందేశం. రాము డున్నచోట కామ ముండదు. కాబట్టి భారతీయ ప్రతిష్ఠను నిలబెట్టడానికి నవ యువకులు రామునివలె తయారుకావాలి. ఇదే రామాయణ సందేశం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక సభలో మాట్లాడుతూ.. "ఎన్ని విద్య లుంటే యేం! కామాన్ని జయించడమే అసలైన విద్య. ఆ విద్య లేకపోతే ఇక్కడున్న యువకు లందరూ నశించిపోయే రావణాసురునిలాంటి వాళ్ళే! అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను" అన్నా డొక రాజకీయ నాయకుడు వచ్చీ రాని వాక్య విన్యాసంతో.. అరకొర భాషా జ్ఞానంతో.. ఆయన ఉద్దేశ్యం మంచిదే ఐనా అక్కడున్న యువకులకు కోపకారణ మయింది. "మే మంతా రావణాసురులమా!" అంటూ ఆయనను నిలదీశారు. గొడవ చెలరేగింది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*కామ విజయ విద్య*
"బలమగు కాముకత్వమును భంగముఁ జేయుటె విద్య.. లేనిచో
నిల నశియించు రావణులె యీ యువకుల్.. దమ పాఠ్య పుస్తక
మ్ముల నిది చేర్చగావలయు ముం.." దని నేత యొకండు బల్కినన్
[ఈ మధ్య మన పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుండి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులైన మైనారిటీలైన శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తారు. ఆ దేశాలలోని ముస్లిములు మెజర్టీ ప్రజలే కాబట్టి వారికి మన దేశంలో ప్రవేశం ఉండదు. కారణం, వారు శరణార్థులు కారు కాబట్టి. శరణార్థులైన ముస్లిమేతరులకే మన దేశంలో పౌరసత్వం పొందే అర్హత ఉంటుంది. ఒకవేళ పై ఇస్లామిక్ దేశాలలోని మెజార్టీ ముస్లిము పౌరులను, అక్కడ హింసకు గురవుతున్న మైనారిటీ ముస్లిమేతర ప్రజల్లాగా మనం చూడలేము కాబట్టి, "వారు అక్రమంగా మన దేశంలోనికి చొరబడితే, వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపిస్తాము!" అని మన ప్రధాని మోడీ, భారత గణతంత్ర దినోత్సవ సభలో ఒకవేళ ప్రకటిస్తే, దేశంలో ఏం జరుగగలదో తెలుపు సందర్భము]
విలువలు ముఖ్యమం చనుచు వేఱుగఁ గాంచ జనాళి నెన్నడుం దలపడ రాజ కోటి కిల ధర్మము కాదని నొక్కి చెప్పుచుం జెలఁగఁగఁ బౌరసత్వ పరిశీలన శాసన మందు మార్పికన్ గలఁతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
సందర్భము: *గణతంత్ర దినోత్సవం..* అనడానికి బదులు మణికంఠు డనే పిల్లవాడు *గుణయంత్ర ఘనోత్సవం..* అని పలుకుతూ వున్నాడు. మణికంఠుని తాత కది నచ్చక కోప్పడ్డాడు. "ఏం చదువులో! ఏం పిల్లలో!" అన్నాడు. మనుమడికీ కోపం వచ్చింది. "ఏం మాటలో! ఏం తాతలో!" అన్నాడు. "గణతంత్ర దినోత్సవం నాడు ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే గొడవలు రేగుతాయిరా! తప్పు" అన్నాడు తాత. ఇద్దరినడుమా వాగ్వివాదం చెలరేగింది. తండ్రి మటుకు మౌనం వహించాడు. (సగం తాత బుద్ధులూ సగం మనువడి బుద్ధులూ వున్నాయి కదా!ఇద్దరూ అతనికి కావలసినవారే మరి!) ఇట్లాంటి ఉచ్చారణను ఆంగ్లంలో "స్పూనరిజం" అంటారట! మాతృక లాగానే కాని కొంచెం తప్పుగా ఉచ్చరించటం. అప్పుతచ్చులు.. అన్నట్టు. "స్పూనర్" అనే వా డిలా పలికే వా డట! అతని సమాచార మిది. Spoonerisms are named after the Reverend William Archibald Spooner (1844–1930), Warden of New College, Oxford, who was notoriously prone to this mistake.[3][4] The term "Spoonerism" was well established by 1921. కొందరు కావాలని కూడా ఇలా పలుకటం అలవాటు చేసుకుంటారు తమాషాగా వుంటుందని. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*స్పూనరిజం*
"గుణ యంత్ర ఘనోత్సవ" మని
మణికంఠుడు తప్పు వలుక మండిపడుచు నా
తని తాత పలికె నిట్టుల..
"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 21.01.20 -----------------------------------------------------------
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ..🇮🇳🇮🇳🇮🇳
రిప్లయితొలగించండి*కం||*
మణి మాణిక్యముల సరగు
గుణ గణములు గలుగలేని కుజనులు బెరుగన్
యణిగిన మనస్సు లేకయు
*"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
*జై హింద్* 🙇♂
నా మరో పూరణ 🇮🇳🙏
తొలగించండి*కం||*
గణ గణ మని బల్కక జన
గణ మన యధినాయక యని గడ గడ జదువఁన్
వణికెడి జనులుండిన యా
*"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏
నా మరో పూరణ 🇮🇳🙏
తొలగించండి"కం||*
గుణములు లేని యువత తో
యణిగినదను నుగ్రవాద మగ్నిని రేపన్
వణికిరి జనులిక తలచుచు
*"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"*!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో 'పెరుగన్ + అణగిన' అన్నపుడు యడాగమం రాదు. "కుజను లధికమై । యణగిన..." అనండి.
రెండవ పూరణలో నిజానికి 'మన+అధినాయక = మనాధినాయక' కావాలి. కాని జాతీయగీతంలో ఉన్నట్లు విసంధిగా 'మన అధినాయక' అని ఉంది కనుక యడాగమం లేకుండ విసంధిగా ప్రయోగించండి.
శతాధిక ధన్యవాదములు ఆర్యా, ధన్యోస్మి 🙏🙏
తొలగించండివణికించెడు చలిలోనను
రిప్లయితొలగించండికణకణమను నగ్నిరేగ కాశ్మీరమున
న్నణగారిన ప్రజలవలన
గణతంత్ర దినోత్సవమున గలతలు రేగున్
సలుపగ పౌరసత్వపు విచారణ నేకపట్టున భాజపా
తొలగించండిములుకులవోలె తాకగ ప్రభుత్వపుచర్య మహమ్మదీయుల
న్గలతలురేగు నెల్లెడగనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
బలిమిని లొంగదీయగ నపాయమె గల్గును రాజతంత్రమున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణ మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురుదేవా!నేకపథాన భాజపా యందునా?
తొలగించండి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
పలుకుచు మంచి మాటలను భ్రష్టము జేయుచు రాజ్యతంత్రమున్
కులుకుచు మంత్రిమండలిని గోతులు త్రవ్వుచు ముఖ్యమంత్రికిన్
తలలను మార్చి నాయకులు దండిగ రూకలు కూడబెట్టగన్
కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమణులను కురిసిన దేశము
రిప్లయితొలగించండిగణుతింపగ పుణ్య భూమి కలుషిత మవగా
పణముగ ప్రాణము లొడ్డిన
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సలుపుచు నాట్యగానములు సంస్కృతి చూపగ నుత్సవమ్మునన్
వలపులు మీర రాష్ట్రములు పంపగ తేరులు రాజధానికిన్
చులకన జేసి కొందరివి చూపుచు వంకలు రద్దుజేయగన్
కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
వాహ్! వాస్తవరూపాన్ని చిత్రించారు. ఇది ఎంతమాత్రం ఆటవిడుపునకో, సరదాకో వ్రాసిన పూరణ కాదు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఈ రోజు శంకరాభరణం సమస్య
రిప్లయితొలగించండిగణతంత్ర దినోత్సవమున గలతలు రేగున్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
కాశ్మీరు రాష్టము కాంచగ
కుతకుత
నుడుకుచు నుండెను,
గొడవలు జరు
గగలవు మోడిపై కక్ష తో నుత్తర
భారత దేశమున్, భగ్గు మనుచు
నుండెగా రైతుల గుండెలు, మండుచుం
డె నమరావతిలోన జనులకున్ వి
నుముగణ తంత్రది నోత్సవ మున గల
తలు రేగునెల్లడల్ సులువుగ నని
తెలియ జేసె నిఘా వర్గము లిపుడు, నల
సత్వమును చూపగ వలదు సతతము మన
మాతృ భూమిని కాపాడ మనుచు కోరె
రక్షక భటులనెల్లరన్ రాజ్యనేత
మీ సీసపద్య పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినమస్కారము గురుదేవా
తొలగించండిరణ రంగమయ్యె రాష్డ్రము,
రిప్లయితొలగించండికణకణ మని మండుచుండె కర్షక మనము ల్
వణుకుచు పలికిరి నేతలు
గణతంత్ర దినోత్సవమన గలతలు రేగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిగణగణ గంటలు మ్రోగగ
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్,
వణికెడు చలిలో తృటిలో
జనగణ మనయనెడు పాట జగతిని మ్రోగున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికలతలు లేని మానవుల క్షాంతిని చూచుట సాధ్యమౌనకో?
పిలిచిన వేళ తీరునదె వేంకటనాథుని నోరచూపుల
న్కలతలు; రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
తలచిన నాటి నాయకుల త్యాగమునే, కలతల్ జనాళిలో!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... నోరచూపుల । న్గలతలు..." అనండి.
తొలగించండి
రిప్లయితొలగించండిమన నాటి నేతలన్ తల
చిన, త్యాగము వారిది తలచిన మదిని జిలే
బి, నిజము తప్పక మనలో
గణతంత్ర దినోత్సవమునఁ, గలతలు రేఁగున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజనవరి యిరువదియారున
రిప్లయితొలగించండిఘనముగ గూటమును గూర్చి
కవితలనల్లన్
న-ణ ల ప్రాస కు దురు పయి
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
ప్రాదిప్రాస పేరున న-ణ లకు ప్రాసమైత్రిని లాక్షణికులు చెప్పినారు. ఇటువంటి విశేషప్రాసలను కవులు ప్రయోగించకుంటే మంచిది. ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను. వ్యక్తిగతంగా నేను వ్రాసే పద్యాలలో మాత్రం ఈ ప్రాసను ప్రయోగించను.
సవరిస్తాను 🙏🏽
తొలగించండిధన్యవాదములు
( గణుతింపదగిన భారతీయుల మనోరథం చకచక ముందుకు సాగే మహోత్సవదినం )
రిప్లయితొలగించండిచలితమనస్కులన్ బ్రభుత
సాంత్వన సల్పుచు రూపుమాపగా
కలతలు ; రేగు నెల్లెడ గనన్
గణతంత్రదినోత్సవమ్మునన్
మిలమిలలాడు నేత్రముల
మేలిమి సైన్యము " మార్చి " చేయుటల్ ;
కలకలలాడు భారతిని
గాంచుచు పౌరులు మ్రొక్కుచుండుటల్ .
(చలితమనస్కులు - చపలచిత్తులు ;
ప్రభుత - ప్రభుత్వం ; మార్చి - కవాతు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్యాపాదంలోని యతిని మీరు గమనించనట్టున్నారు. మొదటి పాదం చివర "రూపుమాపగన్" అంటే సరి!
గుణహీనులు భారత జన
రిప్లయితొలగించండిగణముల హింసింప దలచు ఖలులే నా ధా
రణి జొచ్చి సల్పు క్రియతో
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ధారుణి జిచ్చి' టైపాటు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపలికెను తీవ్రవాదగణపాలకు డొక్క డదృశ్యరూపియై
రిప్లయితొలగించండియిలపయి శాంతి సౌఖ్యముల నెప్పుడు గాంచగ నెంతురేని నా
వలసిన వస్తుసంచయ మవశ్యము గూర్చుడు కాదటన్నచో
న్గలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివ్రణముల వలె నంతరములు
రిప్లయితొలగించండిగణనీయము పెచ్చరిల్లి కరణ సమయగా
నణగారు నాశలన్నియు
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షణమొక యుగముగ గడిపిరి
రిప్లయితొలగించండిఅణువణువున వెదికినారె అణుబాంబనగన్
క్షణకాలముననె దలచిరి
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"యుగముగను గడిపి । రణువణువున.." అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం.
కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్"
🙏 *జై జవాన్* 🌹💐👏🙏
చలి వణికించుచున్నను విశాల విహాయస వీథి భారతీ...
యుల ఘనకేతనమ్మును మహోజ్జ్వలరీతిని నిల్పు సైనికుల్
బలమగు గోడగా ప్రజకు రక్షణగూర్చుచునుండనెవ్విధిన్
గలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరణమున గెల్వరనెడికా
రిప్లయితొలగించండిరణమున పరదేశముష్కర రచిత దుష్ప్రే
రణమున నుపద్రవమగునని
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"
కం.
రిప్లయితొలగించండిరణభూమగు కటకము గని
ఫణిభూషణు డాజ్ఞపించ, ఫాలుఁడి నొదలన్ !
మణిమయమగు ఫణిని గనగ
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్ !!
ప్రణిపాతము జేయవలయు
రిప్లయితొలగించండిపణముగ ప్రాణమ్ములిడిన ప్రాజ్ఞుల; కంహూ-
రణుల నణచవలె, నథవా
గణతంత్ర దినోత్సవమున గలతలు రేగున్.
ప్రణిపాతము- Salute
అంహూరణ-పాపాత్ముడు.
క్షణమైన రెప్పవేయక
రిప్లయితొలగించండివణికించుచు శత్రుతతుల పరిరక్షింపన్
మన సేనలు దృతి, నెవ్విధి
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్ ?
అణగారిన జన గణముల
రిప్లయితొలగించండివణికించెడు చట్టము లవి వంతలు గూర్ప న్
గణక ణ మండుచు నుండగ
గణ తంత్ర దినోత్సవ మున గలఁత లు రే గె న్
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికం :
రణరంగమయే రాష్ట్రము
గుణసంహితమై శుభమును కోరిన రైతుల్
మణుఁగుచు వేడుక మదిలో
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
రణరంగమాయె రాష్ట్రము అనండి
రిప్లయితొలగించండిసవరణకు ధన్యవాదములు ఆచార్యా ��
తొలగించండిచైనా లోని "వూహాను" నగరంలో మూడు రోజులుగా కరోనా వైరస్ వలన ఎందరో మృత్యువాతకి గురవుతున్నారు. మనం సంబరాలు చేసుకుంటున్నా ఎందుకో ఆ అభాగ్యులని చూస్తే బాధగానే ఉంది
రిప్లయితొలగించండికం :
అణగారె నేడు చీనా
వణికించగనే "వుహాను" వాసులనా మా
రణహోమమే "కొరోనా"
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర
దినోత్సవమ్మునన్"
సందర్భము: కామాన్ని జయిస్తే లోకాన్ని జయించినట్టే! అన్ని విద్యలూ దాని కిందివే! ఇదే రామాయణ సందేశం.
రాము డున్నచోట కామ ముండదు. కాబట్టి భారతీయ ప్రతిష్ఠను నిలబెట్టడానికి నవ యువకులు రామునివలె తయారుకావాలి. ఇదే రామాయణ సందేశం.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక సభలో మాట్లాడుతూ..
"ఎన్ని విద్య లుంటే యేం! కామాన్ని జయించడమే అసలైన విద్య. ఆ విద్య లేకపోతే ఇక్కడున్న యువకు లందరూ నశించిపోయే రావణాసురునిలాంటి వాళ్ళే! అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను" అన్నా డొక రాజకీయ నాయకుడు వచ్చీ రాని వాక్య విన్యాసంతో.. అరకొర భాషా జ్ఞానంతో..
ఆయన ఉద్దేశ్యం మంచిదే ఐనా అక్కడున్న యువకులకు కోపకారణ మయింది. "మే మంతా రావణాసురులమా!" అంటూ ఆయనను నిలదీశారు. గొడవ చెలరేగింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*కామ విజయ విద్య*
"బలమగు కాముకత్వమును
భంగముఁ జేయుటె విద్య.. లేనిచో
నిల నశియించు రావణులె
యీ యువకుల్.. దమ పాఠ్య పుస్తక
మ్ముల నిది చేర్చగావలయు
ముం.." దని నేత యొకండు బల్కినన్
గలతలు రేఁగు నెల్లెడఁ గ
నన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
26.01.20
-----------------------------------------------------------
పలుకులు గొప్పవైనిలువ ,పండుగజేతుము రైతుజీవికల్
రిప్లయితొలగించండికులుకుచువోటువేయుడిక,కూటమిగట్టుచునొక్కతీరుగా!
తలపున దేవుడొచ్చెనని తల్చినవారికి మంటబెట్టగా
కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
గణగణశబ్దముతోడను
రిప్లయితొలగించండిరణభూమినినాక్రమించరధగజబలముల్
రణరంగమస్రమౌటను
గణతంత్రదినోత్సవమునగలతలురేగున్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఈ మధ్య మన పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుండి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులైన మైనారిటీలైన శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తారు. ఆ దేశాలలోని ముస్లిములు మెజర్టీ ప్రజలే కాబట్టి వారికి మన దేశంలో ప్రవేశం ఉండదు. కారణం, వారు శరణార్థులు కారు కాబట్టి. శరణార్థులైన ముస్లిమేతరులకే మన దేశంలో పౌరసత్వం పొందే అర్హత ఉంటుంది. ఒకవేళ పై ఇస్లామిక్ దేశాలలోని మెజార్టీ ముస్లిము పౌరులను, అక్కడ హింసకు గురవుతున్న మైనారిటీ ముస్లిమేతర ప్రజల్లాగా మనం చూడలేము కాబట్టి, "వారు అక్రమంగా మన దేశంలోనికి చొరబడితే, వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపిస్తాము!" అని మన ప్రధాని మోడీ, భారత గణతంత్ర దినోత్సవ సభలో ఒకవేళ ప్రకటిస్తే, దేశంలో ఏం జరుగగలదో తెలుపు సందర్భము]
"వలసలు వచ్చినట్టి పర పౌరులు ముస్లిములయ్యు నున్నచోఁ
జెలఁగ ననర్హులై, కొనరు శ్రేష్ఠపు భారత పౌరసత్వమున్!
వెలికినిఁ బంపివేసెదము వేగమె!" యంచును మోడి యన్నచోన్,
గలఁతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్!
గుణనిధులందరియెదలో
రిప్లయితొలగించండిగణతంత్రదినోత్సవంపు గరిమ మెరియగా
గుణహీనులచేష్టలతో
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
గణియింపరు మంచి చెడుల
రిప్లయితొలగించండినణుమాత్రము జాలి లేని యంధులు వారిన్
రణ కాముల నణచని యెడ
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
తలపక మంచి చెడ్డలను దారుణముల్ దలపెట్టబూనుటన్
తొలగించండికలతలు రేఁగు నెల్లెడఁ గనన్; గణతంత్ర దినోత్సవమ్మునన్
కుల మత ద్వేషముల్ మరచి కోరుట మేలగు నైకమత్యమున్
బలమదె దేశమంతటికి భావి తరమ్ముల నిల్పు దీటుగా
ఋణములు వడిఁ బొందెడు కా
రిప్లయితొలగించండిరణమునఁ బరదేశ మండలమ్మున కకటా
ఫణముగఁ బెట్టిన భద్రత
గణతంత్ర దినోత్సవమునఁ గలఁతలు రేఁగున్
విలువలు ముఖ్యమం చనుచు వేఱుగఁ గాంచ జనాళి నెన్నడుం
దలపడ రాజ కోటి కిల ధర్మము కాదని నొక్కి చెప్పుచుం
జెలఁగఁగఁ బౌరసత్వ పరిశీలన శాసన మందు మార్పికన్
గలఁతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
కలిబులిమాటలాడుచునుగానిదియౌననిజెప్పుచోసభన్
రిప్లయితొలగించండిగలతలురేగునెల్లెడగనన్ గణతంత్రదినోత్సవమ్మునన్
బలుకగనొప్పునెప్పుడునుభవ్యపుమాటలుకచ్చితంబుగా
కలతలుగల్గవప్పుడుసుఖంబుగనుండుదేశమెల్లెడన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"
సందర్భము:
*గణతంత్ర దినోత్సవం..*
అనడానికి బదులు మణికంఠు డనే పిల్లవాడు
*గుణయంత్ర ఘనోత్సవం..*
అని పలుకుతూ వున్నాడు. మణికంఠుని తాత కది నచ్చక కోప్పడ్డాడు. "ఏం చదువులో! ఏం పిల్లలో!" అన్నాడు. మనుమడికీ కోపం వచ్చింది. "ఏం మాటలో! ఏం తాతలో!" అన్నాడు. "గణతంత్ర దినోత్సవం నాడు ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే గొడవలు రేగుతాయిరా! తప్పు" అన్నాడు తాత. ఇద్దరినడుమా వాగ్వివాదం చెలరేగింది.
తండ్రి మటుకు మౌనం వహించాడు. (సగం తాత బుద్ధులూ సగం మనువడి బుద్ధులూ వున్నాయి కదా!ఇద్దరూ అతనికి కావలసినవారే మరి!)
ఇట్లాంటి ఉచ్చారణను ఆంగ్లంలో "స్పూనరిజం" అంటారట! మాతృక లాగానే కాని కొంచెం తప్పుగా ఉచ్చరించటం. అప్పుతచ్చులు.. అన్నట్టు. "స్పూనర్" అనే వా డిలా పలికే వా డట! అతని సమాచార మిది.
Spoonerisms are named after the Reverend William Archibald Spooner (1844–1930), Warden of New College, Oxford, who was notoriously prone to this mistake.[3][4] The term "Spoonerism" was well established by 1921.
కొందరు కావాలని కూడా ఇలా పలుకటం అలవాటు చేసుకుంటారు తమాషాగా వుంటుందని.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*స్పూనరిజం*
"గుణ యంత్ర ఘనోత్సవ" మని
మణికంఠుడు తప్పు వలుక మండిపడుచు నా
తని తాత పలికె నిట్టుల..
"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
21.01.20
-----------------------------------------------------------
కం.
రిప్లయితొలగించండికనివిని యెరుగని రీతిగ
జన విధ్వంసమును జేయ జాగృతి చేతన్ !
తనతంత్రము బారినపుడు
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్ !!
గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికందం
అణుశక్తిఁ గలుగు గర్వము
నణువంతఁగ మానవతల నణచిన ఫలమై
యణగారిన జీవితముల
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
చంపకమాల
చెలఁగుచు లోని శత్రువులు జీల్చఁగ దేశపు టైకమత్యమున్
వలగొను బాహ్య శత్రువుల పాలిటి మేటి వరమ్ము జేయఁగన్
విలువలు మృగ్యమై బ్రతుకు వేదన నింపు నభద్రతాదులన్
గలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
కం.
రిప్లయితొలగించండిజనగణమన బాడునపుడు
మనదేశపు బావుటాను మాయము జేయన్ !
సణుగుడు జనులే జేయగ
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్ !!
కం.
రిప్లయితొలగించండిమన నెవ్వరు రక్షించరు
మన కెవ్వరు లేరు యనుచు మఠమున కెళుచూ !
ముని పడ్లను గొరుకునపుడు
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్ !!
తులువలు కొందరుగ్ర చరితుల్పరదేశ పరాన్న భుక్తులై
రిప్లయితొలగించండిపలువిధ నీచకృత్యముల బాల్పడిదేశ మునందునెల్లెడన్
విలయము గల్గసేతురను వేగులవార్త లకున్భయంబుతో
కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్"
కం.
రిప్లయితొలగించండిగొణుగుచు పనులను జే సెడు
గుణవంతునిగని రవంత గోపము గామో
గణగణ గంటలు మ్రోగగ
గణ తంత్ర దినోత్సవమున గలతలు రేగున్
వై. చంద్రశేఖర్
కం.
రిప్లయితొలగించండిగణనాయక నిను దలవక
తృణమని భావించు జనుల తృష్ణను దీర్చన్ !
పనిగట్టుకు వచ్చినపుడు
గణతంత్రదినోత్సవమున కలతలురేగెన్ !!