25, జనవరి 2020, శనివారం

సమస్య - 3261 (ఆయుర్వృద్ధికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్"
(లేదా...)
"ఆయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

95 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  తోయమ్మున్ భళి కాచకుండగనయో తుండమ్మునన్ గ్రోలగా
  కాయంబందున చేరి కుక్షి కడనున్ క్రమ్మించి బాధించుచున్
  సాయంసంధ్యను కక్కులిచ్చు క్రిములన్ చంపించి పంపించగా
  నాయుర్వృద్ధికి రోగి కివ్వఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్

  హాలాహలము = పురుగుల మందు

  రిప్లయితొలగించండి
 2. అందరికీ నమస్సులు 🙏🙏

  *కం||*

  చేయగ మోసము మనలను
  మోయుచు బాధలు మనసున మొహమాటముతో
  గాయములిక మరువక యే
  *ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్?*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మొగమాటముతో" అనండి.

   తొలగించండి
  2. ధన్యోస్మి ఆర్యా 🙏🙏 సవరణతో

   చేయగ మోసము మనలను
   మోయుచు బాధలు మనసున మొగమాటముతో
   గాయములిక మరువక యే
   *ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్?*

   తొలగించండి
 3. నా మరో పూరణ 🙏🌹🌹🙏

  *కం||*

  మ్రోయుచు మనసున భారము
  చేయగ పాపపు పనులను చేవయు జచ్చెన్
  హాయిగ జచ్చిన, కీర్తను
  *ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్*!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌷🙏🌷🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కీర్తి+అను' అన్నపుడు యడాగమం వస్తుంది.

   తొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అమిత్ షా ఉవాచ:

  మాయామోహమునన్ భ్రమించి చనుచున్ మర్యాదనే వీడుచున్
  ప్రాయంబందున కాంగ్రెసయ్యకిచటన్ పండంగ రోగమ్మహో
  పూయించంగను తామరన్ మురియుచున్ పూజించుచున్ భాజపా
  నాయుర్వృద్ధికి; రోగి కివ్వఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్

  రిప్లయితొలగించండి


 5. అల్తాఫ్ హుసైను యునానీ డాక్టరు ఉవాచ !


  భాయీ! పాయసమున్ గ్రసింప జనులే పాల్కోవ,జాంగ్రీలతో
  మాయారోగము దాపురించు! తృటిలో మాన్పంగ మార్గంబిదే
  ఆయాసమ్మను నామయమ్మును సునాయాసమ్ముగా తీర్చగా
  నాయుర్వృద్ధికి రోగి కివ్వఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

  2. డాక్టరు అల్తాఫు హుసైను ఎక్కడున్నావయ్యా! ప్రశస్తమట నీ సలహా !

   :)


   నెనరుల్స్
   జిలేబి

   తొలగించండి


 6. భాయీ గ్లాసుల కొలదిగ
  పాయసమున్ త్రాగినావు! భళి జబ్బదె రా
  దోయీ? పడుకోవోయ్ ! నీ
  ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పడుకోవోయ్' అనడం వ్యావహారికం. "పడుకొమ్మిక" అనవచ్చు.

   తొలగించండి


 7. ఆకాశవాణి కి పంపినది

  ప్రేయస్సునుగాన భళి
  శ్రేయస్సునుకై నిడదగు శ్రీకర మైనన్
  సాయమ్మొనర్ప రాన్ సరి
  యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. "..గానగ భళి శ్రేయస్సునకై..." అనండి.

   తొలగించండి
 8. పాయసము త్రాగి చేదని
  హాయిగ మధుపాత్ర గాంచి హాహా యనుచున్
  గాయకము జేసి వైద్యుడు
  ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వైద్యుం డాయుర్వృద్ధికి..." అనండి.

   తొలగించండి
 9. కాయము సడలినరోజున
  సాయముగారారు యెవరు సంతైననికన్
  న్యాయముజెప్పిన చేదౌ
  ఆయుర్వృద్ధికినిడదగు హాలాహలమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రారు+ఎవరు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "రా రెవారు" అనండి.

   తొలగించండి
 10. పాయని యోగము ధ్యానము
  లాయుర్ వృద్ధికి నిడదగు : హాలాహలము న్
  జేయును హాని యని దెలిసి
  శ్రేయము తో మెలగ వ లయు చెరగని దృఢత న్ r

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హాలాహలమున్' అని ఉన్నది కనుక "శ్రేయముతో వీడవలయు..." అనండి.

   తొలగించండి
 11. కాయపుకల్పచికిత్సని
  సాయముగావచ్చెశాస్త్రి సమయముకతడే
  మాయని సలహా విసిరెను
  ఆయుర్వృద్ధికినిడదగుహాలాహలమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చికిత్సకు...సమయమునందే" అనండి.

   తొలగించండి
 12. శ్రేయముగోరెడు వెజ్జులు
  సాయముగా సాంత్వనముకు సత్యముబలికెన్
  న్యాయము జెప్పగ నికపై
  ఆయుర్వృద్ధికినిడదగుహాలాహలమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెజ్జులు...బలికిరి' అని ఉండాలి కదా? అక్కడ "సత్యము బలుకన్" అనండి.

   తొలగించండి
 13. ఆయుర్వేదపు వైద్యము
  శ్రేయము గలిగించునంట చేదగు చున్నన్‌‌,
  ఆయుక్షీణము క్రిములకు
  ఆయుర్వృద్దికి నిడఁదగు హాలాహలమున్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్,రంగారెడ్డి


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఆయుర్వృద్ధి క్రిములకా? మనకా?

   తొలగించండి
  2. అన్వయ లోపం ,క్రిములకు ఆయుక్షీణము

   తొలగించండి
  3. హాలాహలం చేదు నిజమైన హాలాహలంకాదు ఆయుర్వేద ఔషధం

   తొలగించండి
 14. ఖాయముగ మందు నిడవలె
  ఆయుర్వృద్ధికి ; నిడఁదగు హాలాహలమున్
  కాయము తనదగు ప్రాణము
  బాయుట కొరకై , విధమిది వైద్యుడు జేయన్

  రిప్లయితొలగించండి
 15. దాయాది చెప్ప వింటిని

  యాయుర్వృద్ధికి నిడవలె హాలా హలమున్

  శ్రేయము కాదనెఱంగుము

  మాయించు గరళమటంచు మరచితి వేమో.

  .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అని+ఎఱుంగుము' అన్నపుడు సంధి లేదు. "కాదని యెఱుఁగుము" అనండి.

   తొలగించండి
 16. కందము:
  కాయమ్ము బిగువు సడలెను
  సాయమ్మిడ వేడితి నిను సారంగధరా!
  నీ యిచ్ఛ! యేమని యడుగ
  నాయుర్వృద్ధికి? నిడదగు హాలాహలమున్

  (జవసత్త్వములుడిగిన భక్తుడు శివయ్యను వేడుకొనుట)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   శివుడు 'సారంగధరు' డెలా అయ్యాడు?

   తొలగించండి
 17. నాయజ్ఞానము కాదు సత్య మనుచున్ నమ్మించ వాడిట్లనెన్
  న్యాయం బియ్యది చూచినారము గదా నాడా సముద్రంబునం
  దాయీశుం డది ద్రావి శాశ్వతునిగా నందెన్ యశం బందుచే
  నాయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్.

  రిప్లయితొలగించండి
 18. మైలవరపు వారి పూరణ

  మందులోడు.. బస్టాండ్ దగ్గర ఇలా ప్రచారం చేసుకొంటున్నాడు.

  శ్రేయోదాయకమైన మందిది., తినన్ ప్రీతిన్ మిమున్ గాచు., చే...
  దై యానందమునీదు, కాలవిషమే యన్నట్టులుండున్! గుణం...
  బా యారోగ్యవివర్ధకమ్ము!
  మది విశ్వాసమ్ము మీకున్నచో
  ఆయుర్వృద్ధికి రోగి కివ్వఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 19. తీయని గానము నిడదగు
  నాయుర్వృద్ధికి ;నిడదగు హాలాహలమున్
  మాయ నమాయికలను , పా
  పాయిల ప్రాణము హరించు పాషాణులకున్ .

  రిప్లయితొలగించండి
 20. కస్తూరి శివశంకర్శనివారం, జనవరి 25, 2020 6:08:00 AM

  అందరికీ నమస్సులు. నా పూరణ

  కం :
  శ్రేయస్కరమది సతతము
  మాయామర్మము తెలియక మౌనము తోడై
  పీయూషపదము పల్కగ
  ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
 21. కం.

  నేయము సేయగ వలదన
  పాయక దిరుగన గడుసరి భ్రష్ఠుని గూడన్
  సాయము నొసగన విడివడ
  ఆయుర్వృద్ధికి నిడదగు హాలా హలమున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 22. ఆయుర్వేదమె  మంచిది 
  "ఆయుర్వృద్ధికి, నిడఁదగు హాలాహలమున్"
  ఖాయముగ చంప దలచన్ 
  న్యాయము కాదని తెలిసియు నయము వదలినన్  

  రిప్లయితొలగించండి
 23. కందం
  శ్రేయముఁ గూర్చదు ప్రజకని
  యాయమ(ఆయమ) శివ మ్రింగు మనఁగ హరుడే మ్రింగెన్
  వ్రాయఁగఁ జెప్పఁగఁ దగ దే
  యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్?

  రిప్లయితొలగించండి
 24. ఏ యోగా వ్యాయామము
  జేయక, మదిరా మధురము జేకొన చివరన్
  కాయము జర, రుజ బాలవ
  ఆయుర్ వృద్ధికి నిడదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పాలు +అవ... 'అవ' అన్న ప్రయోగం సాధువు కాదు.

   తొలగించండి
 25. శ్రేయము తోగూడిబరగ
  నాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్"
  కాయముననున్న క్రిమిసము
  దాయమదెల్లను నశించి తనువున్ బ్రోవన్

  రిప్లయితొలగించండి
 26. ఆయమునకు పొలమున వ్యవ
  సాయమ్మును చేయ వేళ సర్పము కరువన్
  కాయము నశించు చుండగ
  నాయుర్వృద్ధికి నిడదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
 27. ఆకాశవాణిలో ప్రసారం

  కాయము క్రుంగెడువేళ  ను
  పాయముతోచక కళవళపాటుననుండన్
  పాయక నౌషధమగుచో
  ఆయుర్వృద్ధికినిడదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
 28. మాయామర్మము లేవియు
  కాయముబెంచంగలేవు కాలము విలువల్
  ఆయుఃక్షీణమె,యనకుము
  ఆయుర్వృద్ధికి నిడదగు హాలాహలమున్!

  రిప్లయితొలగించండి
 29. పాయని నస్వస్థునకున్
  నాయుర్వేదియె యొసగిన నహిఫేనమునే
  నాయంబుగ తగుమాత్రము
  నాయుర్వుద్ధికి నిడదగు హాలాహలమున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పాయని యస్వస్థతకున్" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 30. Malli siripuram,
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  వాయువు ప్రతిదినమందున్ !
  ఆయుర్వృద్ధికి నిడఁదగు, హాలాహలమున్ !
  మాయా బీజమె మనసా !
  కాయము వెడలిన తదుపరి కాలుని జేరున్ !!

  రిప్లయితొలగించండి
 31. సాయముసేయగ సాగుకు
  బాయక బీడించు క్రిముల ప్రాణముదీయన్
  కాయలుగాచెడి వృక్షపు
  నాయుర్వృద్ధికి నిడదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
 32. వచ్చే వారపు ఆకాశవాణి సమస్య తెలియ జేయగలరు

  రిప్లయితొలగించండి
 33. కాయము తీరని వ్యాధి, న
  పాయము పాలవ, గరళము బడసిన తొలగున్
  ఖాయమని వైద్యులు తెలుప
  ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్

  రిప్లయితొలగించండి
 34. పాయనిరోగమువారల
  యాయుర్వృద్ధికినిడదగుహాలాహలమున్
  నాయువువృద్ధినిగోరెడు
  దాయెవరైనబడయనగుదగుమోతాదున్

  రిప్లయితొలగించండి
 35. ఈయందగు సుధ సుజనుల
  కాయుర్వృద్ధికి; నిడఁదగు హాలాహలమున్
  ఆ యమపురి కంపగ ఖలు
  లన్ యువతుల జెరచెడి యసురత పరిమార్చన్
  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో ప్రాస తప్పింది.

   తొలగించండి
 36. *ఆకాశవాణికి పంపిన నా పూరణ* 🙏🌹🌹🌹🙏

  *కం||*

  వేయుచు నాసివి మందులు
  తీయగ ప్రాణమ్ము లిలను తియ్యగ నెపుడున్
  పోయెడి జీవము కన్నను
  *ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌷🙏🌷🙏

  రిప్లయితొలగించండి
 37. మాయారోగముసోకగాహృదినిదామానంగనప్పట్టునన్
  నాయుర్వృద్ధికిరోగికీయగదగున్ హాలాహలంబున్ వడిన్
  శ్రేయోదాయకమెల్లవేళలసుమాజీరంపుసారమ్మునున్
  బీయూషంబుగద్రాగుచుండినబలోపేతమ్మునౌయాయువున్

  రిప్లయితొలగించండి
 38. ఈ యంబుధిఁ ద్రచ్ఛంగను
  గాయమ్ము లలయఁగఁ బుట్టెఁ గట్టా దీనిన్
  వే యీశ్వరుం దలఁచి, మన
  యాయుర్వృద్ధికి, నిడఁదగు హాలాహలమున్


  కాయప్రాప్తపు రోగ సంతతినిఁ జక్కం జేయ సామర్థ్యమే
  యోయీ యీ విష మందుఁ గాఁగ మఱి సంయోగమ్ము సామ్యంపు దో
  షాయాత్తంబయినన్ శరీరమున నీషణ్మాత్ర మీ మందునే
  యాయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్

  రిప్లయితొలగించండి
 39. కాయంబెల్ల కుసించిపోయినది యాకాయంబు ప్రాప్తించునా ?
  సాయంబెవ్వరురారులోకమున నాస్వాంతంబు బెగ్గిల్లెడిన్
  చేయంగాదగువైద్యమీతనికికన్ ఛిద్రంబుగాకుండగన్
  ఆయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ఆయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్
  హాలాహలంబున్ వడిన్"

  సందర్భము: అశోక వనంలో సీతను రావణుడు బెదరించి "రెండు నెల్ల గడు విస్తున్నా నంతే! నన్ను వరించకపోతే నరికి ఉదయపు ఫలాహారంగా తినేస్తా" నని చెప్పి పోయినాక సీత "ఆశ దూరమై బ్రతుకు భారమై రాముడు లేకుండా నే నుండజాలను." అనుకున్నది.
  "సా జీవితం క్షిప్ర మహం త్యజేయం
  విషేణ శస్త్రేణ శితేన వాపి
  విషస్య దాతా న హి మేఽస్తి కశ్చిత్
  శస్త్ర శ్చ వా వేశ్మని రాక్షసస్య
  (సుం.కాం.28-16)
  అట్టి నేను వెంటనే నా జీవితాన్ని విషంచేతనో శస్త్రంచేతనో విడిచిపెడుతాను. (కాని) రాక్షసుని యింట్లో నాకు విషాన్ని గాని ఆయుధాన్ని గాని యిచ్చే వాడు ఒక్కడూ లేడు. (ఎవ్వడూ ఇవ్వడు గదా!)" అనుకున్నది. రాక్షస స్త్రీల గురించి ఆమె యింకా ఇలా అనుకుంటున్నది...
  "రామ చింతనమే యీమె రోగం. దాంతో ఎప్పుడో ప్రాణం పోనే పోతుంది. కాని ఎప్పుడో తెలియదు. పోయినంతవరకైతే సేవ చేయాలి గదా! ఆ సేవ చేయటం కూడా వృథా.. (ఎట్లాగూ యీమె రావణుని వరించదు కదా!)"
  అని నన్ను కాపలా కాసే రాక్షస స్త్రీలు భావించి (రావణుడు పెట్టిన) రెండు నెల్ల గడువు మాత్ర మెందుకు? (ఆయుర్వృద్ధి ఎందుకు?) ఈ రోగికి (నాకు) ఇప్పుడే యింత హాలాహలం యిస్తే సరి.. అనుకో రెందుకు!అలా అనుకుంటే ఈ బాధలన్నీ తప్పుతాయి కదా!"
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *విషపు కోరిక*

  "కాయం బీమెకు రామ చింతనమునన్
  గాసిల్లుచుంటన్ గదా

  బాయున్ బ్రాణ మ దెప్పుడో!..యిదె యగున్
  వ్యాధి క్రమం.. బీమె సే

  వాయాసంబు వృథా" యటంచు నన రే
  లా యిట్టు!.. "లాశింప రా

  దాయుర్వృద్ధికి.. రోగి కీయఁగఁ దగున్
  హాలాహలంబున్ వడిన్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  25.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 41. శ్రేయమ్మేగద కోరగా వలయు దుర్మింత్రుండకైనన్ సదా
  యాయుర్వేదపు మందులిచ్చు భిషజుండాతండె చెప్పెన్ గదా
  యాయుర్వృద్ధికి రోగికీయగ దగున్ హాలాహలంబున్ వడిన్
  న్యాయంబేనట యాట్టి రోగములకున్నారీతి వైద్యమ్మిలన్.

  రిప్లయితొలగించండి


 42. నేటి ఆకాశవాణి‌ విశేషములు తెలియ చేయగలరు వచ్చే వారపు సమస్య యేమిటి ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంది శంకరయ్య వారు ఈ సహాయం ప్రతివారం చేస్తే సమస్యాపూరణ పృచ్ఛక చక్రవర్తిగా తెలుగు కవుల హృదయాల్లో నిలిచిపోతారు

   తొలగించండి
  2. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య....
   *మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే*
   మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
   padyamairhyd@gmail

   తొలగించండి

 43. కందపద్యము
  ఖాయమె!కలుపగమేలగు
  నాయుర్వేదంబునందు నణుమాత్రమనన్
  తీయనిలేహ్యౌషధములఁ
  ఆయుర్వృద్ధికినిడదగు హాలాహలమున్

  గాదిరాజు మధుసూదనరాజు
  తాడిపత్రి .అనంతపురంజిల్లా

  రిప్లయితొలగించండి
 44. కం.
  శ్రేయస్కరుడగు భాస్కరు !
  డే, యమ నియమాలు వీడి లేపగరాగన్ !
  పోయే ఘడియలు వచ్చిన !
  ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్ !!

  రిప్లయితొలగించండి
 45. బాయకు తాతల వైద్యము
  శ్రేయమునేగోరుహితులు శ్రితజనులనిరే
  ఆయమ రణమును మాన్పుచు
  ఆయుర్వృద్ధికినిడదగుహాలాహలమున్.

  రిప్లయితొలగించండి
 46. తోయజలోచన,వినుమా

  ఆయుర్వృద్దికి నిడదగు హాలా హలమున్

  పాయము ననీమె మొదలిడ

  కాయము సిద్ధమ గుచుండు కలతలు బడకన్

  చంద్ర గుప్తుని చంపటానికి రాక్షసా మాత్యుడు విషకన్యను తయారు చేస్తాడు. ఒక బాలికను తెచ్చి రోజుకు కొద్దిగా విష ఆహారం ఆ బాలికకు ఈయవలసినదిగా అంతరంగ దాసికి చెబుతాడు అప్పుడు ఆమె ప్ర భు విషము ఇస్తే మరణిస్తే అని అనుమానము వ్యక్తము చేస్తుంది అప్పుడు ఆ రాక్షసామత్యుడు ఆ దాసి తో చెప్పు పలుకులు

  రిప్లయితొలగించండి
 47. తీయగ నుండునె మందులు ?
  హాయిని గొలుపక విషమని యనిపించునుగా!
  కాయము గాపాడు కొనగ
  నాయుర్వృద్ధికి నిడదగు హాలాహలమున్
  **)()(**
  (హాలాహలం వంటి ఘాటైన ఔషదమిడ దగునని భావన)

  రిప్లయితొలగించండి
 48. ఆయాసంబన మందు మ్రింగుమనన్ 'హాలాహల' మ్మందువే
  మాయారోగమదేదొ సత్వరముగన్ మానంగ మేలౌనుగా
  శ్రేయంబంచును వైద్యుడెంచియిడగన్ జేదన్న సంసిద్ధమై
  యాయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ 'హాలాహలం'బున్ వడిన్

  రిప్లయితొలగించండి
 49. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య....
  *మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే*
  మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
  padyamairhyd@gmail

  రిప్లయితొలగించండి