16, జనవరి 2020, గురువారం

సమస్య - 3252 (కనుమా...)

కవిమిత్రులారా,
కనుమ పండుగ శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కనుమ నీకనుమానమా కనుమ కనుమ"
(లేదా...)
"కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో"

81 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    ధనమున్ లాభ శుభమ్ములన్ తనరుచున్ ధన్యోస్మినన్ తెల్పుచున్
    తినిపించంగను ప్రీతినిన్ పశులకున్ తీండ్రించి పూజింపగన్
    వనమున్ జేరుచు మూలికల్ తునిమితిన్ వైవిధ్యమౌ రీతినిన్
    కనుమా! నీకనుమానమా కనుమ! నన్గాంచంగ జాగేలనో!

    https://te.m.wikipedia.org/wiki/కనుమ

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    స్వర్గస్తురాలైన నా భార్యకు విన్నపం:

    వినుమా! నీదగు పాతకారు విడుచున్ పింఛన్ను వెచ్చించున్
    ఘనమౌ నేసియు మ్యూసికున్ కలుగుచున్ గాఢంపు స్టీరింగునున్
    కొనుచున్ క్రొత్తది మారుతిన్ నడిపితిన్ కొండాడగా కోడలే
    కనుమా! నీకనుమానమా, కనుమ! నన్గాంచంగ జాగేలనో?

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. సవరించండి.

      తొలగించండి
    2. నాకనుమతి నిడె కనుమ కనుమ నాడు
      పసుల దాకను మరియు శుభ్రముగ గడుగ
      వెనుకను మనవారిది సేయ గనుమ, నేడు
      కనుమ, నీకనుమానమా కనుమ కనుమ

      తొలగించండి


  4. కమనీయము కందమిది! క
    నుమ! నీ కనుమానమా? కనుమ కనుమ మరిం
    త మరింతగాను తీయం
    గ మారు నభ్యాసమున జగతిని జిలేబీ


    కనుమ శుభాకా‌ంక్షలతో
    మాకంద జిలేబి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. పద్మార్పిత విరహ వేదన :)


    తనివారంగను గోముచేయ వలవంతమ్మాయె రావయ్య రా!
    మునిమాపున్ మరి వచ్చి కౌగిలినటన్ ముద్దాడుతా నంటివే
    కనుమా వెన్నెల వేడి తాళ కుదురన్ కాలేదు పద్మార్పితన్
    కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో!

    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముద్దాడుతాను' అనడం వ్యావహారికం. "ముద్దాడగా నెంచితే" అందామా?

      తొలగించండి
  6. (పద్మవ్యూహచ్ఛేదనకై వెళుతున్న అభిమన్యుడు ధర్మరాజుతో )
    చనెదన్ బద్మపువ్యూహముందునుమ;నా
    చండాలు రారాజు నూ
    హను జెండాడెద;వాని యత్నముల నా
    హారింతు ; నో తండ్రి ! నీ
    పనుపున్ సార్థకమున్ బొనర్చెదను ; నా
    పాటెల్ల నీకోసమే ;
    కనుమా ! నీకనుమానమా ? కనుమ ! నన్
    గాంచంగ జాగేలనో ??
    (ఆహారింతు -ఆరగింతు; పనుపు-ఆజ్ఞ; పాటు-శ్రమ )

    రిప్లయితొలగించండి
  7. శ్రీవినాయక
    ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

    (కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో)

    ఇచ్చిన పాదము మత్తేభము నా పూరణము సీసములో

    జైలులో రాందాసు భటులు పెట్టు బాధకు తాళలేక రామదాసు ఆవేదన


    కట్టించితి గుడిని ఘనముగ భద్రాద్రి పైన నీ కొరకు నే పద్మ నాభ,
    సీతమ్మ తల్లికి చేయించితిని గద చింతాకు పతకము, చెంత నున్న
    నీకు చేయించితిని గద కలికి తురాయి పతకంబును, రామ యెచట నుంచి
    వచ్చెను మీకవి? యిచ్చ వచ్చి నటుల మెడలోన దాలిచి మెలపు పొందు
    చుంటిరి శ్రీరామ , సుతుని కొరకు నా దశరధుండు పంపెనా ?జానకమ్మ
    కొరకు నా జనకుండు కొని మీకు పంపెనా? యిడుములు నిచ్చోట పడుచు నుంటి
    దయలేద నీకు? బాధలను నే నోర్వజాలగ లేను, ప్రార్ధన లన్నియు విను
    మ ,కనుమా ?నీకనుమానమా? కనుమ, నన్గాంచంగ జాగేలనో చరణము

    లను వదల జాల కాపాడ మనుచు కోరు
    చుంటి, దిక్కు యెవరులేరు నంటి నీవు
    తప్ప, నాకు యనుచు రామ దాసు వేడు
    కొనెను దెబ్బల బాధల కోర్వ లేక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
      సీసం ఎనిమిదవ పాదం ఉత్తరార్ధంలో ప్రాసయతి తప్పింది. 'దిక్కు+ఎవరు, నాకు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. సవరించండి.

      తొలగించండి
  8. ఎక్కడిదనుచు సందేహ మేలనోయి
    నేను కోరితి నని దీన్ని నిన్న నాన్న
    పంపె నుప్పాడ జరియంచు పట్టుచీర
    కనుమ, నీ కనుమానమా? కనుమ, కనుమ
    నాడు ధరియింతు నోబావ నాకు నచ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దీన్ని' అనడం వ్యావహారికం. 'దీని' అనవచ్చు.

      తొలగించండి
  9. వలదు వలదని చెప్పిన వచ్చితీవు

    వీలు పడదవి పలుమార్లు పలికితేను

    ఏల యీ రీతి వేధింప వలయునన్న

    కనుమ, నీ కనుమానమా, కనుమ కనుమ

    రిప్లయితొలగించండి
  10. అనిశం బిచ్చట నీపదద్వయికెడన్ హర్షంబులందించుమా
    యనుచున్ శంకర!చేరియుంటిని కదా యాపోభిషేకమ్ముతో
    నిను సేవించుచునున్నవాడ నయినన్ నీవేల స్పందించవో
    కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో

    రిప్లయితొలగించండి
  11. తిథిని జూడగ సంకురా త్రి తరువాత
    కనుమ , నీకనుమానమా కనుమ ! కనుమ
    గూర్చి యీపొత్తమున తెలు గుననె వ్రాయ
    బడెను , నీయనుమానము బారిపోవు

    రిప్లయితొలగించండి
  12. పూజ జేయంగ ప్రొద్దుటే పూలు దేగ
    మమ్ము గావంగ కలవంచు మదిని దలవ
    ఆత్మ సాక్షిగ నమ్మవే లాది పురుష
    కనుమ నీ కనుమానమా కనుమ కనుమ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తేగ, తలవ' అన్న ప్రయోగాలు సాధువులు కావు. 'ఏల+ఆదిపురుష=ఏల నాదిపురుష' అవుతుంది.

      తొలగించండి
    2. దోషమునకు క్షమార్హుడను. సరి జేతును.🙏

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    మును మా రాజులు ధర్మబద్దముగ సంపోషించి యందించిరీ
    ఘనసత్యమ్మును వాఙ్మృదుత్వమును నిష్కామోల్లసద్భక్తియున్
    ధనమూర్ధన్యములంచు., నేనును నదే దారిన్ జనన్ నిచ్చలున్
    కనుమా! నీకనుమానమా? కనుమ! నన్గాంచంగ జాగేలనో!?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి
    2. మరో కోణంలో.. పూరణ.

      నందనందనునకు వందనములు🙏🙏

      విను! మా యిండ్లను జొచ్చి పాలు పెరుగుల్ వెన్నన్ హరించున్., మమున్
      కునుకున్ దీయగనివ్వ., డల్లరి గనన్ కోపించి దండింప., చెం...
      తనె యే మూలనొ దాగియుండును! యశోదా ! వాని దండింపుమా!
      కనుమా! నీకనుమానమా! *కనుమనన్* గాంచంగ జాగేలనో !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మరో పూరణ... పై పూరణకు అనుబంధం🙏

      నల్లనయ్య... అమాయకుడు పాపం!

      వినకమ్మా! వ్రజభామినీమణులు విన్పింపంగ నా యల్లరిన్!
      కినుకన్ బూని ప్రతిజ్ఞ జేసిరి
      ననున్ నీ చేత దండింపగా!
      మును నే దింటినొ ! నన్ను నీవెరుగవే ! ముద్దాడవే! నోటిలో
      కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. కనుమ దినమున మనవిని వినవదేల?
    మరుల విరులను విసరియా మౌనమేల?
    మరువనిను మది నిలిపితి మనవివినుమ
    కనుమ నీకనుమానమా కనుమ కనుమ

    రిప్లయితొలగించండి


  15. సమరమ్మునకు తయారు! క
    నుమ నీ కనుమానమా కనుమ కనుమల చే
    రి మునుకడన్ సైన్యమ్ము దు
    నుమాడగన్ మోహరించెను సుమా గనుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      ఈ పద్యాన్ని ఒక మిత్రునికి ఫోనులో వినిపించి ఛందస్సు చెప్పమన్నాను. మరోసారి... మరోసారి... అంటూ నాల్గు సార్లు విన్నాడు. అయినా చెప్పలేకపోయాడు... చివరికి కందపద్యపు రిదంతో వినిపిస్తే చెప్పాడు. దటీజ్ జిలేబి!

      తొలగించండి


    2. ఆహా! పొగడ్తయా ! లేక లెగ్ పుల్లింగా :) ఏదో పొగడ్తే అనుకుంటా :)

      నెనరుల్స్ సహిత జిలేబీయము మీకై :)


      మాయమ్మే! ఇంత జిలే
      బీయమకో! కందమా తవికయా ! తెలియన్
      సాయము కోరగ మిత్రుం
      డాయనకున్ సందియమ్మరరె అమ్మణ్ణీ :)


      జిలేబి

      తొలగించండి
  16. వృషభముల నలంకారము వీక్ష సేయ
    కనులు రెండును జాలవు కాంక్ష దీర
    కనుమ నీ కను మానమా కనుమ కనుమ
    పల్లె లందున పండుగ ప ర గె నేడు

    రిప్లయితొలగించండి
  17. ఒక భక్తుని ఆవేదన

    "మనమా!వద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా"
    ధనమా!చాలిక చాలు చాలు పలు తాదాత్మ్యంబులున్ శోధనల్
    వినుమా!దేవి!మదీయ మానస చలద్భీతార్తి!తాపాగ్ని,వీ
    క,నుమా!నీ కనుమానమా?కనుమ నన్ గాంచంగ జాగేలనో!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ భక్తుడు వేడుకుంటున్నది ఉమతోనే కదా?

      తొలగించండి
  18. పనుల పాటుల శ్రమకంత ఫలములొసగి
    జనుల నానందముల దేల్చు సంబరముల
    వనిత నీకేల నిటువంటి ప్రశ్న నేడు
    కనుమ నీకనుమానమా కనుమ కనుమ

    రిప్లయితొలగించండి
  19. పట్టుచీరనుదెచ్చితిచిట్టి!నీకు
    కనుమ,నీకనుమానమా?కనుమకనుమ
    యెర్రయంచునదళతళ లీనుచుండె
    గట్టుకొనుమమ్మయిప్పుడుకాంతునేను

    రిప్లయితొలగించండి
  20. కోడిమాంసము గారెలు కోరి తినుట
    కనుమ నీకనుమానమా కనుమ కనుమ
    అందరున్ గుడుచుచు నుండ నర్థితోడ
    పెరిగె కోడిమాంసము ధర పెల్లుగాను

    రిప్లయితొలగించండి
  21. అందరికీ నమస్సులు 🙏🙏
    *తే గీ:*

    కనుమ యని నేననినది నిక్కము గనుమది
    కనుమ యని చూపినది కూడ కనుమ సుమ్మి
    ఒక్కటి యది పండుగ మరొక్కటి కటకము
    *కనుమ నీకనుమానమా? కనుమ కనుమ*

    **కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
    🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  22. త్యాగయ్యగారి ఆవేదన
    ఘనమౌ యాశ్రితరక్షకాఖ్యుడవు హేకారుణ్యసింధో!ననున్
    ననయంబున్ నినుగొల్చువాడనుగ నాదాత్మానుసంధానమున్
    ధనమున్ గీర్తియు సంపదల్ వదలి నీదాస్యంబు నేజేసితిన్
    గనులన్ నీదగు రూపమే కదల నీగానాంబుధిన్ మున్గితిన్
    కనుమా!నీకనుమానమా? కనుమ!నన్గాంచ జాగేలనో?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఘనమౌ నాశ్రిత..." అనండి. అలాగే "కారుణ్యవారాశి! న । న్ననయంబున్..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!

      తొలగించండి
  23. తే.గీ.

    వరుస క్రమమున సంక్రాంతి పర్వ దినము
    పశుల పండుగ యనియును పలుకు చుంద్రు
    సంబరమ్మును సేయగ సర్వ హితము
    కనుమ నీ కనుమానమా కనుమ కనుమ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. వనితా!తెచ్చితినీకుగానొకటినవ్యంబౌదుకూలంబునున్
    గనుమా నీకనుమానమాకనుమునన్గాంచంగజాగేలనో
    గనుచోనేత్రముచాలదేయొకటిముక్కంటిన్నుతింజేయుచున్
    దనువన్ ధారణజేయుమాయికనుతాదాత్మ్యంబుచెల్వొందగన్

    రిప్లయితొలగించండి
  25. సమస్యాపూరణం..
    సమస్య
    *కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో !*

    కనగాకన్బొమమధ్య భ్రూకుటినియాజ్ఙాచక్రసందర్శనం
    బునసర్వజ్ఞత!నించుకన్ పెనగనొప్పున్ తత్సహస్రారచే
    ర్పునుదాటన్ మరిచేరపైకికలుగున్ మోక్షంబునేకాగ్రతన్
    *కనుమా! నీకనుమానమా? కనుమ! నన్గాంచంగ జాగేలనో!?*

    *గాదిరాజు మధుసూదనరాజు*

    మోక్షకాంత పిలుపు🙏🌷💐🌹🙏

    రిప్లయితొలగించండి
  26. ప్రిధ్వి భోగి మంటలు మండ విరివి వచ్చు
    నందముగ భోగి సంక్రాంతి ముందు దినము
    కనుము పండుగ సంక్రాంతి చనిన దినమ
    కనుమ నీకనుమానమా కనుమ కనుమ


    విన యాగర్వ మనఃప్రవృత్తినిఁ దగన్వేఁడంగ లక్ష్మీధవా
    ధన ధాన్యాదులు వేఁడ నెన్నడును నీ దాక్షిణ్యమే కావలెం
    గనకున్నారు సమస్త దేవతలు నిష్కామాత్ము నీ వేని నం
    గనుమా నీ కనుమానమా కనుమ నన్గాంచంగ జా గేలనో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'పృథ్వి' టైపాటనుకుంటాను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. సవరించితి నండి.

      తొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    [కురుక్షేత్ర యుద్ధమందు సర్వముం గోల్పోయి, హ్రదమునందుఁ జోచ్చిన దుర్యోధను నుద్దేశించి, భీముఁడు పలికిన పలుకులు]

    "ఘనసైన్యంబు భవత్సహోదరు లనిన్ గన్మూసి, ప్రేతావనిన్
    గని రో రాజ! మహోన్నతంబయిన నీ గర్వంబునున్ వీడి, మ
    ద్ఘనవీర్యంబు నెదుర్కొనన్, హ్రదబహిర్గమ్యత్వముంబొంది, నన్

    గనుమా! నీ కనుమానమా, కను మనన్? గాంచంగ జాగేలనో?"

    రిప్లయితొలగించండి
  28. ఇనవంశోత్తము డైన దాశరథి ప్రత్యేకమ్ముగా పంపగా
    ఘనసంద్రమ్మును దాటివచ్చితిని లంకారాక్షసిన్ జంపితిన్
    వనితా గైకొను మంగుళీయకమిదే పంపించె నో జానకీ
    కనుమా! నీకనుమానమా? కనుమ నన్గాంచంగ జాగేలనో

    రిప్లయితొలగించండి
  29. వరూధిని ప్రవరాఖ్యుల ఘట్టము ననుసరించి..

    మ:

    వనితా వేగమె జేరవా తనువు నాపాదించ నీ పొందికన్
    వినుమా యీ ప్రవరాఖ్యు వేదనల కవ్వింపొందు నీ యందమున్
    కినుకా వీడుము బెట్టుసేయ నిక నొక్కింతైన యీవేళనన్
    కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కనుమ నీకనుమానమా కనుమ కనుమ

    సందర్భము:
    రామ మిందీవర శ్యామం
    కందర్ప సదృశ ప్రభమ్
    బభూవేంద్రోపమం దృష్ట్వా
    రాక్షసీ కామ మోహితా
    (అర.కాం. 17- 9)
    కలువరేకుల్లాంటి నల్లని శరీరం గలవాణ్ణి మన్మథునిలాంటి కాంతి గలవాణ్ణి దేవేంద్రునిలా వెలిగిపోయే వాణ్ణి ఆ రాక్షసి చూసి కామ మోహితురాలయింది.
    స్వేచ్ఛా ప్రణయాన్ని ఇష్టపడేది, కామరూప శక్తి గలది ఐన ఆ శూర్పణఖ అంగాంగ ప్రదర్శనతో చేరి రాముణ్ణి ఇలా బ్రతిమలాడసాగింది.
    "నా అందం లాంటి అందం నీకు లభించదు. చేజేతులా వదలిపెట్టుకోకు. నా మాట విను. పరసతి నని నీ కనుమానం అక్కర్లేదు. ఫరవాలేదు. నీవు నాతో సుఖించవచ్చు. చూడు నా అందాలు చూడు.."
    కట్టుబాట్లు లేకపోతే కత్తిగాట్లు తప్పవు అన్న విధంగా ఎలాంటి పరిణామాలు సంభవించాయో అనంతర కథా గమనంలో చూడవచ్చు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వినుమ! చేఁజేతుల విడిచిపెట్టకోయి!

    నీకు నా యందము లభింప నేరదోయి!

    పరసతినయిన నేమాయె..ఫరవ లే ది

    కనుమ! నీ కనుమానమా! కనుమ! కనుమ!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    16.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  31. కను!మాపుష్పము పారిజాతమును నాకయ్యాల దేవర్షియే
    పనిమాలిన్ గొనిదెచ్చి రేపెనుగ సాపత్నీవిరోధంబునే
    ఘనమౌ నాసురభూజమున్ బెరికి నీకాంతారమున్ నాటెదన్
    నను నీదాసుడ నిగ్రహించి వగ నానందంబు జేకూర్చవే
    కనుమా!నీకనుమానమా?కనుమ!నన్గాంచంగ జాగేలనో?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పనిమాలిన్' అన్న ప్రయోగంపై సందేహం!

      తొలగించండి
  32. మత్తేభవిక్రీడితము
    నినునా కౌగిట బంధిఁ జేసి మధువుల్ నీకందగా జేతు ఫ
    ల్గుణ! యీ ఊర్వశి యందచందములు నిన్గోరంగ కాదందువే?
    మును నీ వందని స్వర్గసౌఖ్యమలరన్ ముద్దార నందింతు నన్
    గనుమా! నీ కనుమానమా? కనుమ నన్గాంచంగ జాగేలనో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మత్తేభవిక్రీడితము
      నినునా కౌగిట బందిఁ జేసి మధువుల్ నీకందగా జేతు న
      ర్జున! యీ ఊర్వశి యందచందములు నీ జోడౌటఁ గాదందువే?
      మును నీ వందని స్వర్గసౌఖ్యమలరన్ ముద్దార నందింతు నన్
      గనుమా! నీ కనుమానమా? కనుమ నన్గాంచంగ జాగేలనో?

      తొలగించండి
  33. తేటగీతి
    శీతశైలంపు టందాలు నాతిమేనఁ
    గనుమ నీకనుమానమా? కనుమఁ గనుమ!!
    సుధలనందు విలాసంపు సోయగమ్ము
    ప్రవర! యివ్వరూధిని పంచఁ బైటజార్చి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వృషభ పూజలు చేసెడి వేద భూమి
      మనది సంక్రాంతి మరునాడు మానుగాను
      నన్ని పశువులన్ పూజింత్రు నాద రమున
      "కనుము నీకనుమానమా కనుము కనుము*

      వినవమ్మాననురామచంద్రుడట నన్ వేగమ్ము గా పంపగాన్
      నినుగాంచన్మదినెంచి వచ్చితిటకున్ నీజాడలన్ గాంచగా
      ఘనమౌ యంబుధి దాటుచున్ మిముగనంగా మాతరో వచ్చితిన్
      *గనుమా నీకనుమానమా కనుమ నన్ గాంచంగ జాగేలనో*.

      తొలగించండి